భవిష్య మహా పురాణము
11. గృహధర్మ వర్ణనము
బ్రహ్మోవాచ :
శ్లో ॥ యాపతిం దైవతం పశ్యేన్మనో వాక్కాయ కర్మభిః తచ్ఛరీరార్థజాతేవ సర్వదాహితమాచరేత్
తత్ప్రియాం ప్రియ వత్పశ్యేతద్ద్వేషాం ద్వేష్యవత్సదా అధర్మానర్థ యుత్తేభ్యోఽయుక్తా చాస్యనివర్తతే
ప్రియం కిమస్య కింపథ్యం సామ్యంచాస్యకథం భవేత్ జ్ఞాత్వైవం సర్వభృత్యేషు న ప్రమాద్యేత వైద్విజా:
దేవతా పితృకర్మేషు భర్తుః స్నానాశనాదిషు సత్కారేఽభ్యాగతానాంచ యథాచిత్యం నహాపయేత్
వేశ్మాత్మాచ శరీరంహి గృహిణీనాం ద్విథాకృతమ్ సంస్కర్తవ్యం ప్రయత్నేన ప్రథమం పశ్చిమాదపి
కృత్వా వేశ్మసు సంమృష్టం త్రికాల విహితార్చనమ్ వృత్త కర్మోపభోగానాం సంస్కర్తవ్యం యధోచితమ్
ప్రాతర్మధ్యాపరాహ్ణేషు బహిర్మధ్యాంతరేషుచ గృహ సంమార్జనం కృత్వా నిష్కారాన్ననిశిక్షిపేత్
గో మహిష్యాది శాతానాం తత్పురీషాదిమాత్రకమ్ వ్యపనేయంతుయత్నేన సంమార్జన్యాప్రసాధనమ్
దాస కర్మకరాదీనాం బాహ్యాభ్యంతర చారిణమ్ పోషణాది విధిం విద్యాదనుష్టానంచ కర్మసు
శాకమూల ఫలాదీనాం వల్లీనామౌషధస్యచ సంగ్రహః సర్వబీజానాం యథాకాలం యథాబలమ్
తా ॥ బ్రహ్మదేవుడిట్లనెను. మనోవాక్కాయ కర్మలచేత తన భర్తను దైవముగా చూచెడి స్త్రీ, అతని శరీరములోని అర్థభాగము వలె నగుచు ఎల్లప్పుడును మేలు చేయుచుండును. ఎప్పడును తన భర్త కిష్టమైన దానిని తనకుకూడ ఇష్టమైనదానిగను, అతనిచే ద్వేషింపబడుదానిని తనకు కూడ ద్వేషింపతగినదిగను చూడవలెను. దీని వలన అతని, అధర్మముతోడను అనర్థకములతోడను కూడిన పనుల నుండి ఏర్పడు అయుక్తమైన చర్య నివారింపబడును. అతనికి ప్రియమైనది, హితమైనది, ఏదియో తెలిసికొని, అతనికీ సరియైనదేదియో గుర్తించి, సేవకులందజీయెడను ప్రమాదపడక ప్రవర్తింపవలేను. దేవ పితృకర్మలయందును, భర్తయొక్క స్నానభోజనాదులయందును, అభ్యాగతులకు చేసెడు సత్కారమునందును ఉచితమైన రీతిని ప్రవర్తింపకుండనుండరాదు. ఇల్లాండ్ర శరీరము, ఇల్లు, తాను అని రెండు భాగములు చేయబడినది. అందు మొదటిదైన యింటినీ, తరువాతిదియైన తన శరీరము కంటే ముందు సంస్కరింపవలెను. ఇంటిని చక్కగా శుభ్రపఱచి, దినమున మూడు పర్యాయములు అందముగ నలంకరించి, ఆ పిదప కుటుంబ జీవనమునకు సంబంధించిన పనులను వస్తువులను ఉచితమైన రీతిగా చక్కబెట్టవలెను. ఉదయమున, మధ్యాహ్నమును, అపరాష్ట్రకాలమునకు ఇంటి వెలుపల, మధ్యభాగములను, లోపలి భాగమునను చక్కగా నూడ్చి, రాత్రిపూటమాత్రము చిమ్మకుండనుండవలెను. గోశాల పశుశాలలను పేడ మొదలగునవి తీసివేసి చీపురుతో శుభ్రపఱచవలేను. ఇంటిలోపలను, బయటను, పనిచేయు దాస దాసీ జనమును పోషించు విధానమును, వారిని ఆయా పనులలో నీయోగించు పద్దతిని తెలిసీ ప్రవర్తింపవలెను. శాకములు, కందమూలములు, ఫలములు, ఓషధీలతలు, విత్తనములు మొదలగువానిని ఆయా కాలములలో యధావకాశముగ ప్రోగుచేయుచుండవలెను.
శ్లో ॥ తామ్ర కాంస్యాయసొదీనాం కాష్ఠవేణుమయస్యచ మృన్మయానాంచ భాండానాం వివిధానాంచ సంగ్రహమ్
కుండలాది జలద్రోణ్యా కలశోదంచతాలుకాః శాక పాత్రాణ్యనేకాని స్నేహానాం గోరసస్యచ
ముసలం కండనీయంతు యంత్రకం చూర్ణచాలనీ దోహన్యో నేత్రకం మంథా మండన్యః శృంఖలానిచ
సందంశః కుండికాశూలాః పట్ట పిప్పలకో దృషత్ డావికా హస్తకో దర్వీ భ్రష్ట స్ఫుటలకానిచ
తులాప్రస్థాది మానానీ మార్జన్యః పిటకానిచ సర్వమేతత్ర్పకుర్వీత ప్రయత్నేన చ సర్వదా
హింగ్వాదీక మథో జాజీ పిప్పల్యో మరిచానీచ రాజికా ధాన్యకం శుంఠీ త్రిచతుర్జాతకానిచ
లవణం క్షార వర్గాశ్చ సౌవీరక పరూషకౌ ద్వీదలా మలకం చించా సర్వాశ్చ స్నేహజాతయః
శుష్కకాష్ఠాని వల్లూర మరిష్టా పిష్టమాషయోః వికారాఃపయసశ్చాపి వివిధాః కందజాతయః
నిత్యనైమిత్తికానాంహి కార్యాణాముపయోగతః సర్వమిత్యాది సంగ్రాహ్యం యథావద్విభవో చితమ్
యత్కార్యాణాం సముత్పత్తావుపాహర్తుం న దృశ్యతే తత్ర్పాగేవ యథాయోగం సంగృహీయాత్ర్పయత్నతః
తా II రాగి, కంచు, ఇనుము మొదలగు -లోహములతోను, కజ్జ, వెదురు, మట్టిమొదలైన వానితోను చేయబడిన వివిధములైన కుండలు మొదలగు పాత్ర సామగ్రి సమకూర్చుకొనవలెను. నీరు పోయుటయు గోకర్ణము వంటి ద్రోణులుగల నీటి పాత్రలు, నీరు నింపియుంచుకొనుపాత్రలు, అంచులుగల పాత్రలు, శాకములు వండుటకు వివిధములైన గిన్నెలు మొదలగునవి, మజ్జిగ, వెన్న, నేయి మొదలగునవి. రోఁకలి, టోలు, తిరుగలి, పొడిచేయు సాధనము, పాలు పితుకు సాధనము, కవ్వము, కవ్వపుత్రాడు, అలంకరించెడి పరికరములు; గొలుసులు, (సంకేలలు) పట్టుకాటు, గిండ్లు, మేకులు; నూజెడుయి, కుట్టునూలు కలువపుగుండు, డాకలి, సమ్మెట,. గరిటె, వేపుడు చట్టి, ప్రక్కలించు పరికరములు (అడకత్తెర). త్రాసు, తూనికరాళ్లు, మొదలగునవి , చీపురులు, చిన్నగంపలు. ఇవి యన్నియును ప్రయత్నపూర్వకముగ సమకూర్చుకొనవలెను, ఇంగువ మొదలగు వస్తువులు, జాజికాయ, పిప్పళ్ళు, మిరియములు, నల్లని ఆవాలు, ధనియాలు, శొంఠి, కంపిల్లము (రోచనియను ఔషధము). ఉప్పుకారము మొదలగు రుచికలిగించు వస్తువులు, రేగు, ఖర్జూర, ఉసిరిక, చింత, అన్ని విధములైన నూనెలు: ఎండు కఱ్ఱలు, ఎండిన మాంసము (చేపలు) వెల్లుల్లి, నూఁబొడి: మినుములతో చేయబడిన మజ్జిగ, పాలవికారములగు: పెరుగు, వెన్న, నేయి మొదలగునవి, వివిధములైన గడ్డదినుసులు. ఇంకను నిత్యనైమిత్తికాది కర్మలకుపయోగపడు సర్వపదార్ధములను తమ స్తోమతకు తగినట్లుగా సంగ్రహము చేయవలెను. కార్యములు సంభవించినప్పుడు సంపాదించుటకు సాధ్యము కాని యట్లు కనబడువస్తువులన్నింటిని ప్రయత్నపూర్వకముగ; యథాసంభవముగ ముందే సేకరించి పెట్టుకొనవలెను.
శ్లో ॥ ధాన్యానాం ఘృష్టపిష్టానాం క్షుణ్ణోపహతయోరపి భృశం శుష్కార్ద్ర సిద్ధానాం క్షయ వృధీ నిరూపయేత్
ఇతి శ్రీ భవిష్యేమహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మే పర్వణి గృహధర్మ వర్ణనం నామైకాదశోఽధ్యాయః
తా॥ వివిధ ధాన్యముల యొక్క, నూరబడిన, విసరబడిన, పొడిగా నలగగొట్టబడిన, ఉపయుక్తతకోల్పోయిన, మిక్కిలి ఎండించుటచేత లేక మిక్కిలి తడుపుట చేత సిద్ధపడిన వివిధ ఆహార పదార్థముల వృద్ధిక్షయములను ఎప్పటి కప్పుడు నిర్ధరించుకొనుచుండవలయును.
ఇది శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున గృహధర్మవర్ణనమను పదునొకండవ అధ్యాయము.
Summary of chapter 11 of the Bhavishya Mahā Purana is as follows:
The daily dharma of maintaining the home is detailed with a specificity that reveals the sacred character of domestic work. Cleaning schedules — what must be swept and purified at what time of day and on which days of the fortnight — are given. Rules for food storage, the proper management of the kitchen space, the handling of clay and brass vessels, and the preparation of the hearth are laid out. The chapter teaches that the physical order of the home is a direct reflection of and contributor to its spiritual order: a clean hearth is a propitious one, and the woman who maintains her household with diligence performs a continuous act of worship to the household deities.