10. స్త్రీ దర్వృత్త వర్ణనము

బ్రహ్మోవాచ :

శ్లో ॥ ఆరాధ్యానాం హి సర్వేషామయమారాధనే విధిః చిత్త జ్ఞానాను వృత్తిశ్చ హితైషిత్వంచ సర్వదా

కన్యాపునర్భూర్వేశ్యాచ త్రివిధాఏవ యోషితః ప్రియా మధ్యప్రియాచైవ యోగ్యమధ్యేతరాతథా

సమాశ్రేష్ఠాచ నీచాచ భూయోపి త్రివిధాపునఃపూర్వవత్సరయోర్వృత్తి రిష్టానుక్త్యాప్రియాప్రియే

అధమా ప్రియయోరత్ర పతి పత్యాదికామతా నిషిద్ధానాంతు-భక్ష్యాది తద్ధి యత్నాద్విధీయతే

ఏక ద్విత్వబహుత్వాద్యాయే భేదాః సముదాహృతాః జ్యేష్ఠాది వృత్తే వక్ష్యామస్తాన శేషాన్ ద్విజోత్తమాః

వృత్తంచ ద్వివిధం స్త్రీణాం బాహ్యమాభ్యంతరం తథా భర్తురన్యజనే బాహ్యం తస్యాః శారీరమాంతరమ్

జ్ఞాతీతర విభాగేన తద్బాహ్యం ద్వివిధం పునః పూజ్యం తుల్యం కనిష్ఠించ తత్ప్రేత్యకం పునస్త్రిధా

రహోరతం ప్రకాశంచ శారీరమపి తత్రిధా భర్తుశ్చిత్తాను కూల్యేన ప్రయోక్తవ్యం

యథోచితమ్

మాతాపితా స్వసాభ్రాతా పితృవ్యాచార్యమాతులాః సభార్యాభగినీ భర్తా భర్తృమాతృపితృష్వసా

ధాత్రీ వృద్ధాంగనా దిశ్చ యస్తత్రాప్తసమోజనః ప్రథమోఢా సపత్నీచ స్త్రీణాం మాన్యతమోగణః

ఏషామేవ త్వపత్యాధి భగినీ భ్రాతరస్తథా కనిష్టా భర్తురిత్యాది భార్యాశాప్తసమోమతః

తా॥ బ్రహ్మదేవుడిట్టనెను. మనస్సునెఱింగి తదనుగుణముగ నడచుకొనుట, హితముకోరేడి స్వభావము కలిగియుండుట అనునదియే పూజింపదగిన పోరందజీ - విషయమునను పూజావిధియగును. స్త్రీలు, కన్య, (స్త్రీకి సోముడు, గంథర్వుడు, అగ్ని మొదటి ముగ్గురు పతులు.) మారుమనువాడినది . వేశ్య అని మూడు విధములుగనుందురు, వీరిలో మఱల ప్రియ, మధ్య, అప్రియ అనియు, యోగ్య, మధ్య, ఆయోగ్య అనియు. శ్రేష్ఠ, సమ, నీచ అనియు మూడేసి విధములు. ఇందు ప్రియా ప్రియములు చెప్పుటచేగాకున్నను పూర్వలవలె తరువాతి వారు నడచుకొనుట తగినది. అధమురాలు, ప్రియురాలు అనువారిలో మగనాండ్రుమొదలగువారే ఉద్దేశింపబడినారు. వారికి సంబంధించిన అభక్ష్యాది నిషేధములే - ఇచట విధింపబడుచున్నవి. ఒకటి, రెండు, అనేకములుగాను చెప్పబడిన స్త్రీబేధములలో శ్రేష్ఠవృత్తి క్రమమున సాకల్యముగ ఇప్పుడు చెప్పుచున్నాము. బాహ్యము, అభ్యంతరము అన్ని స్త్రీల నడవడి రెండు విధములు. భర్త కంటె నితరులైనవారి యెడ ప్రవర్తించు విధానము బాహ్యము. ఆమె స్వీయ శరీర సంబంధముగ ప్రవర్తించు విధానమాంతరము. బంధువుల యెడల, బంధువులు కాని వారి యెడల నని మఱల బాహ్యవర్తనము రెండు విధములు. అది ఒక్కొక్కటి. తిరిగి పూజ్య, తుల్య, కనిష్ట భేదముచే మూడేసి విధములు. అంతర వర్తనము కూడ ఏకాంతము, ఆసక్తి, ప్రకాశము అని మూడు విధములు. స్త్రీ, తన భర్త మనోభావముననుసరించి నడచుకొనవలెను. అతని తల్లి, తండ్రి, తోడబుట్టినది, తోడబుట్టినవాడు, తండ్రితోడబుట్టినవాడు, ఆచార్యుడు, మేనమాన, తనసవతి, భర్తతో బుట్టువు భర్త, అతని తల్లిదండ్రుల తోబుట్టువులు. దాది, వృద్ధాంగన మొదలగు వారు ఆప్తసములు. మొదటి భార్య, సవతి-వీరు: స్త్రీలలో మిక్కిలి గొడవిఁపదగిన వర్ణములకు చెందినవారు. వీరి సంతానము, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, భర్త చిన్నభార్య మొదలగు వారు ఆప్తులతో సమానులు.

శ్లో ॥ హీఽనోన్యః శాసనీయస్తు తత్రతాపన్న. విద్యతే యోగ్యతా, సుత సౌభాగ్యైర్న యావత్స్యాత్ప్రతిష్ఠితా

యత్రాపి గురు భర్తౄణామానుకూల్యేన సర్వదా వృత్తి: ప్రశస్యతే స్త్రీణాం పూజాచారా విరోధినీ

దేవరైః పతి మిత్రైశ్చ పరిహాస క్రియోచితై : వివిక్త దేశావస్థానం వర్జయేదిత నర్మద

ప్రాయశో హికులస్త్రీణాం శీలవిధ్వంస హేతవః దృష్ట యోగో రహోనిత్యం స్వాతంత్ర్యమతి నర్మతా

దుష్టసంగే త్వరా స్త్రీణాం యువభిర్నర్మనోచితమ్ నిర్భేషతా స్వతంత్రాణాం సాఫల్యం రహసి ప్రజేత్

పుంసో దుష్టేంగితాకారాన్ దుష్ట భావ ప్రయోజితాన్ భ్రాతృవత్పితృ వచ్చైతాన్ పశ్యతీ పరివర్జయేత్

పుంసోఽన్యాగ్రహమాలాప స్మిత విప్రేక్షితానిచ కరాంతరేణ ద్రవ్యాణాం నిబంధం. గ్రహణార్పణమ్

ద్వార ప్రదేశావస్థానం రాజమార్గావలోకనమ్ ప్రేక్షోద్యానాదిశీలత్వం నిరుధ్యోద్దేశ మాలయమ్

బహూనాం దర్శనే స్థానం దృష్టి వాక్కాయ చాపలమ్ ఫీవనత్వం స సీత్కారముచ్చైర్హాసిత జల్పితమ్

సాంగత్యం లింగి దుష్టస్త్రీ భిక్షుకీక్షణికాదిభిః మంత్రమండల దీక్షాయాం సక్తిః సంవసనేషుచ

ఇత్యేవమాది దుర్వృత్తం ప్రాయో దుష్టజనోచితమ్ వర్జయే త్పరి రక్షంతీ కులత్రితయ వాచ్యతామ్

ఇతి శ్రీ భవి ష్యేమహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మే పర్వణి  స్త్రీ దుర్వృత్త వర్ణనం నామ దశమోఽధ్యాయః

తా ॥ సంతాన సౌభాగ్యములచేత గౌరవ ప్రతిష్ఠలు రానంతవఱకు స్త్రీలకు తమ కంటే చిన్నవారైన ఇతరులను శాసించు నర్హత కలుగదు. ఎక్కడైనను ఎప్పుడైనను స్త్రీలు తమ భర్తలకు గురు జనులకును పూజాచారములకు విరుద్దము కాకుండ ప్రవర్తించుట ప్రశస్తమగును. మఱఁదులతోను భర్త స్నేహితులతోను, పరిహాసక్రియలు చేయుట, ఏకాంతస్థానమందుండుట, నవ్వులాడుట (పరియాచకములాడుట) మొదలగునవి విడిచి పెట్టవలెను. దుష్టులతో గూడి వీప్పుడును ఏకాంతమునందుండుట, స్వతంత్రముగా వర్తించుట, అతిమాత్రముగ పరిహాసములాడుట అనునవి ప్రాయికముగా కుల స్త్రీల శీలము చేఱచుటకు కారణములగుచున్నవి. దుర్మార్గులతో కూడియుండుటయందా సక్తి, యువకులతో పరిహాసప్రసంగములు చేయుట స్త్రీలకు ఉచితములైనవి కావు. స్వతంత్రుల ఏకాంతమునందు నిర్భయత్వము పండును. చెడు అభిప్రాయములు, చెడు రూపములు, దుష్ట భావములతో స్వప్రయోజనముపొందునుద్దేశము గల పురుషులను, సోదరుని వలె, తండ్రిలే నటించువారిని చూచుటతోడనే తప్పుకొనవలేను. పురుషుల మృషానుగ్రహమును, సంభాషణములను, చిరునవ్వులను, మోసపు చూపులను తిరస్కరించవలెను. వస్తువులను ఇచ్చిపుచ్చుకొనుట బారేడు దూరమునుండి చేయవలెను. ద్వారముననుండుట, రాజమార్గము వైపు చూచుచుండుట, తోటలు, ప్రదేశములు, ఇండ్లు (దేవాలయములు) చూచుచు తిరుగుట నిరోధింపవలేను. అనేక స్థలములు చూడవలెనని దృష్టిచాపల్యము, అందటితో మాట్లాడవలెననెడి వాక్చాపల్యము, శరీర చాపల్యము, గాండ్రించి ఉమియుట, బిగ్గరగా (పగలబడి) నవ్వుట, ఉచ్చైస్వరమున మాట్లాడుట. జీవనార్థము సన్యాసి వేషము వేసినవానితో, దుష్టస్త్రీలతో, భిక్షురాండ్రతో, సన్యాసినులు మొదలగు వారితో స్నేహము చేయుట, మంత్ర దీక్షలయందు, వానికి సంబంధించిన వస్త్ర ధారణలందును ఆసక్తి కలిగియుండుట. మొదలగు నీదుర్వర్తనము సాధారణముగ దుష్టజనులకు మాత్రమే ఉచితమైనది. కాబట్టి తాను పుట్టిన వంశము, భర్త వంశము, స్త్రీజాతి అను మూడుకులముల మర్యాదను రక్షించుచు దుర్వర్తనమును వదలి పెట్టవలెను.

ఇది శతార్థ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణాంతర్గత బ్రహ పర్వమున స్త్రీ దుర్వృత్తవర్ణనమను పదియవ అధ్యాయము.