భవిష్య మహా పురాణము
13. స్త్రీ ధర్మ కథనము
బ్రహ్మోవాచ :
మూ ॥ ప్రథమం ప్రతిబుధ్యేత ప్రవర్తేత స్వకర్మను పశ్చాద్భృత్యజనస్యాపి భుంజీత చ శయీతచ
భర్త్రా విరహితా స్త్రీచ శ్వశురాభ్యాం విశేషతః దేహలీం నాతి వర్తేత ప్రతీకారే మహత్యపి
ఉత్థాయ ప్రథమం భర్తురవిజ్ఞాతా న నిష్క్రమేత్ క్షపాయాం సావశేషాయాం రాత్రౌవా వాసరాదిషు
తద్వాస భవన స్యైవ శనైరాహూయ కార్మికాన్ స్వవ్యాపారేషు తాత్సర్వాంస్తత్రతత్ర నియోజయేత్
విబుధ్దస్యతతో భర్తుర్నిర్వర్త్యావశ్యకం విధిమ్ గృహకార్యాణి సర్వాణి విదధీతాప్రమాదతః
ముక్త్వావాసక నేపథ్యం కర్మయోగ్యం విధాయచ తత్కాలోచిత కర్తవ్యమను తిష్ఠేద్యథాక్రమమ్
మహానసం సుసంమృష్టం చుల్ల్యాది విహితార్చనమ్ సర్వోప కరణోపేత మసంబాధమనా విలమ్
నచాతి గుహ్యం ప్రకటం ప్రవిభక్త క్రియాశ్రయమ్ భర్తురాప్తజనాకీర్ణం గూడం కక్షాది వర్జితమ్
తత్రపాకాది భాండాని బహిరంతశ్చకారయేత్ నిర్ణిక్తమల పంకాని శుక్తివల్కాది చూర్ణకైః
నిశికుర్వీత ధూమార్చిః శోధితాని దివాత పైః దధిపాత్రాణి కుర్వీత
సదైవాంతరితానిచ
తా॥ బ్రహ్మదేవుడిట్టనెన్లు. “స్త్రీ అందజీకంటే ముందే మేల్కొని స్వీయ కార్యములు నిర్వర్తించి ఆపిదప భృత్య జనుల వ్యవహారములను చూచి భోజనము చేసి విశ్రమింపవలెను. భర్త ఇంట లేనప్పుడు, ముఖ్యముగా అత్తమామల కొఱకు, ఎంత గొప్ప ప్రతీకారము చేయదగియున్నను, స్త్రీ ఇంటి గడపదాటి బయటకు వెడల కూడదు. భర్త కంటే తాను ముందు మేలుకొనినను అతనికి తెలియకుండ బయటకు పోకూడదు. రాత్రి మిగిలియుండగాగాని (తెల్లవారకముందు, రాత్రిగాని, పగటి సమయము లందుగాని అట్లు పోకూడదు. పనివారి నందజీని తన నివాస భవనమునకు పిలిపించి వారిని వారివారి పనులయందు నియోగింపవలేను, అప్పుడు భర మేల్కొనిన పిదప అతనికి కావలసినవీ సమకూర్చీ అటుపిమట ఇంటి పనులనియును కడు జాగరూకతతో నిర్వహించుకొనవలెను. ఇంటిలోనున్నప్పటి ప్రస్తభూషణాద్యలంకారములను విడిచి పెట్టి, పనిచేసి కొనుటకు వీలైన వేషము ధరించి ఆయా సమయములయందాయ పనులను క్రమానుసారముగా చేయవలెను. వంట యింటిని శుభ్రముగా ఊడ్చి, పొయ్యి మొదలగు వానిని శుద్ధిచేసి (అలంకరించి) ఉపకరణములన్నింటిని కావలసిన రీతిలో, కాలుష్యము లేకుండ నుంచుకొనవలెను. పాకశాల మిక్కిలి ఏకాంతమైనది కాక, మిక్కిలి బట్టబయలైనదికాక, విడిగా పనులు చేసికొనుటకు వీలుకలిగియుండి, ఎప్పుడును తన భర్తకు ఆప్తులైనవారితో కళకళలాడుచు గడ్డిగాదెములు లేకుండ శుభ్రముగా బయటవారి దృష్టికి దూరముగా నుండవలెను. వంటపాత్రలు మొదలగునవి శుక్తిచూర్ణము, నారమొదలగువానితో లోపల బయట చక్కగా కడిగి గరగరిక చేయవలెను. పగలు ఎండలో నుంచి శోధించిన కఱ్ఱలతో రాత్రిమంట (వంట) చేయవలెను. పెరుగు పోసిన పాత్రలను ఎప్పుడును లోపలి భాగములయందు శుభ్రపఱచు చుండవలెను.
సాధుకారిత దుగ్ధేషు శోధితేషుదివాత పే ఈషధ్గృహ్యోక్త పాత్రేషు స్వచ్ఛం యేన భవేద్దధి.
స్నేహ గోరస పాకాది కృత్వా సుప్రత్యవేక్షితమ్ కుర్యాత్స్వయ మధిష్టాయ భర్తుఃపాక విధిక్రియామ్
కింప్రియంచ కిమాగ్రేయం షడ్రసాభ్యంతరేషుచ కిం పథ్యం కిమపథ్యంచ స్వాస్థ్యం వాస్యకథంభవేత్
ఇతి యత్నాద్ద్విజానీ యాదను ష్ఠేయంచ తత్తథా
నిత్యానురాగం సత్కార మాహారం సుపరీక్షితమ్ మహానసాదౌ కుర్వీత జనమాప్తం క్రమాగతమ్
శత్రుం దాయాద సంబంధం క్రుద్ధభీతావమానితమ్ అవాచ్యోప గృహీతంవా నైవమాదీని యోజయేత్
పునఃపునః ప్రతిష్టాప్య గుప్తం స్వయమధిష్ఠితమ్ భర్తురాహార పానాది విదధ్యాదప్రమాదతః
పాకం నిర్వర్త్య మాత్రాణాం కృత్వా స్వేదప్రమార్జనమ్ గంధతాంబూల మాల్యాది కిందదాయమత్రయా
యధౌచిత్యాది తత్కాలే భర్తుర్వినయ సంభ్రమైః తత్కాలాను గతాత్యర్థ మాహార ముపపాదయేత్
స్వభావామయ కాలానాం వైపరీత్యేన సర్వదా సర్వమాహార పానాది ప్రయోజ్యం తద్విదోజగు:
హీన తుల్యాధికత్వేన భర్తాపశ్యతి యం యథా తంతథైవాధికం పశ్యేన్న్యాయతః ప్రతిపత్తిషు
తా ॥ పగటి వెలుగులో చక్కగా మధింపబడిన నిర్ణీతమైన పాత్రలలో స్వచ్ఛముగా నుంచబడిన పాలలో చేమిరి పెట్టి మంచి పెరుగును సిద్దము చేయవలెను. నూనెలు, మజ్జిగ వానితో చేయు వంటకములు జాగ్రత్తగా చేసి భర్తకొఱకైన పాక క్రియను స్వయముగా చేయవలెను. షడ్రసములలో భర్తకు ప్రియమైనది, ముఖ్యమైనదేదో గమనించి, హితమైనది, కానిది తెలిసికొని, ఎట్టి పదార్థములలో అతనికి ఆరోగ్యమో యేఁగి ఆప్రకారముగ పాకములు సిద్ధము చేయవలెను. క్రమముగా వచ్చెడి ఆపులకును పరీక్షితమైన ఆహారమును గౌరవముగను ప్రేమతోడను పాకస్థలాదులయందు వడ్డించుచు భోజనము పెట్టవలేను. శత్రువులను, జ్ఞాతుల సంబంధులను, భర్తచే కోపగింపబడిన వారిని, భయ పెట్టబడిన వారిని, అవమానింపబడిన వారిని, తిట్లుతిన్నవారిని ఇంకను ఇట్టివారిని పాకాది కార్యములందు నియోగింపరాదు. పాకశాలకు మఱల మలబోయి, అచటనే ఉండుచు, స్వయముగనే ఆధిపత్యము వహించి భర్తకు సంబంధించిన ఆహార పానీయములను ప్రమాద పడక సిద్దము చేయవలెను. వంట పని పూర్తిచేసి, చెమట తుడుచుకొని, ఆభరణములు, గంధము, తాంబులము, పుష్పములు మున్నగువానితో తగు మాత్రముగా అలంకరించుకొని. తత్కాలోచితములగు వినయ సంభ్రమములతో కొసరి కొసరి వడ్డించుచు భోజనము పెట్టవలెను. సాధారణమైన జబ్బులు కలిగిన సమయములందు ఆహార పానీయాదులను నిత్యపద్దతి కంటే వ్యత్యస్తముగా ప్రయోగింపవలెనని తెలిసినవారు చెప్పుదురు. తన భర్త ఎవరెవరిని, తనకంటే హీనులుగ, తనతో సమానులుగా, లేక తనకన్న అధికులుగ ఎట్లు చూచునో భార్య, తాను కూడా వారువారు తటస్థించినపుడు అట్లే-అంతకన్న అధికముగను-న్యాయముగా చూడవలెను.
మూ. సాపత్నకాన్యపత్యాని పశ్యేత్స్వేభ్యో విశేషతః భగినీ వత్స పత్నీశ్చ తద్వధూన్నిజ బంధువత్
గ్రాసాచ్ఛాద శిరోభ్యంగ స్నాన మండనకాదికమ్ సపత్నీనామ కృత్వాతు ఆత్మనోఽపి న కారయేత్
వ్యాధితానాం చికిత్సార్థ మౌషధాదిక మాదరాత్ విదధ్యాదాత్మనస్తాసాం సర్వాశ్రిత జనస్యచ
తచ్ఛోకే శుచమాదద్యాత్తత్తుష్టౌ ముదమావ పేత్ భృత్య బంధు సపత్నీనాం తుల్య దుఃఖ సుఖాభవేత్
లబ్ధావ కాశా స్వప్యాచ్చ నిశిసుప్తోత్థితా క్రమాత్ అన్యత్ర వ్యయ కర్తారం పతింరహసి బోధయేత్
యదవద్యం సపత్నీనాం స్వయమ స్మైనతద్వదేత్ దౌ:శీల్యాది తు సాయం గూఢమ స్మై నివేదయేత్
దుర్భగామనపత్యాం వా భర్త్రాచాతి తిరస్కృతామ్ అదృష్టాం సమ్యగాశ్వాస్య తేనైతామనుకూలయేత్
తధా వాగ్దండ పారు ష్యైర్జనం భర్త్రా విపీడితమ్ కుర్యాద్విధేయ మా శ్వాస్య న చేద్ధోషాయ తద్భవేత్
మత్వాత్మనోన పత్యత్వం కాలం చాపి గతం బహుమ్ సంతానాదిక ముద్దిశ్య కార్యమాత్మ నివేదనమ్
యచ్చాన్యదపి జానీయాత్కించిదస్యచికీర్షితమ్ తతిలాజానతీ వాస్య సిద్ధమేవ ప్రదర్శయేత్
తా॥ సవతుల సంతానములను తన సంతానముకంటే నధికముగా చూడవలెను. సవతిని సోదరివలెను, ఆమె వధువులను తన బంధువుల వలెను చూడవలేను. భోజనము, బట్టలు, అభ్యంగన స్నానాదులు, అలంకరణలు సవతి బిడ్డలకు కానిదే తన బిడ్డలకు చేయకూడదు. వ్యాధిగ్రస్తులైన వారికి చికిత్స కొఱకు ఔషధములు మొదలగునవి తనబిడ్డలకు వలెనే సవతి బిడ్డలకును, ఆశ్రితుల వారికెల్లరకును మిక్కిలి ప్రేమతో ఈయవలెను. వారి దుఃఖమున దుఃఖింపవలెను. వారి సంతుష్టిలో సంతోషింపవలెను. భృత్యుల, బంధువుల, సవతుల సుఖ దుఃఖములలో సానుభూతి కలిగియుండవలెను. పనులన్నియు పూర్తి చేసికొనిన పిమ్మట అవకాశము కలుగగా అప్పుడు విశ్రమింపవలెను. రాత్రి సమయమున నిద్రనుండి మేల్కొని, ధనమునుగానీ సమయమును గాని అన్యధా వ్యయము చేయుచుండిన భర్తను, ఏకాంతమందు బోధచేయుచు జాగరూకుని చేయవలెను. సవతులకు సంబంధించిన అల్ప విషయములను తానుగా తన భర్తకు చెప్పకూడదు. కాని ప్రమాదకరములైన వ్యభిచారాదులను గుజించి మాత్రము రహస్యముగా నివేదింపవలెను. దౌర్బాగ్యురాలు, సంతానములేనిది, భర్తచేత అత్యంతముగా తిరస్కరింపబడినది, సరిగా చూడబడనిది, అయిన సవతిని ఓదార్చి భర్తకు ఆమె పై ప్రేమ కలుగునట్లు అనుకూలపరచవలెను. అటులే భర్తచేత, పురుష వాక్యములతోను, కఠిన శిక్షలతోను పీడింపబడిన వానిని తగు విధమున నోదార్చి వానిని తిరిగి భర్తకు విధేయనిగా మార్చవలెను. లేనిచో వాడు మఱల దోషములను చేయుచు ప్రమాదకారియగును. చాలా కాలము గడిచినను తనకు సంతానము కలుగకుండిన యెడల నియతి విధానమును గుర్తించి ఓదార్పు పొందవలెను. భర్త చేయనిచ్చగించు (అన్య వివాహాది) ఏపనిని గూర్చియైనను ఇంచుక గమనించి, దాని విషయమేజింగిన దానివలె ఆయత్తతను ప్రదర్శింపవలెను.
మూ॥ వైవాహికం విధింభర్తుః సర్వం కృత్యా స సంభ్రమమ్ పరిణీతాంచతాం పశ్యేన్నిత్యం భగినికా మీవ
పూజాం సంబంధివర్గస్య మంగలం మండలానిచ కుర్యాదభినవోడాయాః సుప్రహృష్టేన చేతసా
మాతృవచ్ఛిష్యయేదేనాం గృహ కృత్యేష్వమత్సరా ప్రదేశిక విధిం వాస్యా విదధ్యాద్యత్నతఃస్వయమ్
ఏవం భర్తురభిప్రాయ సర్వమిత్యాదికారయేత్ సుఖార్థం వాపి సంత్యజ్య స్త్రీణాం భర్తాధిదేవతా
భర్తాధి దేవతా నార్యావర్ణా బ్రాహ్మణ దేవతాః బ్రహ్మణా హ్యగ్నిదేవాస్తు ప్రజారాజన్యదేవతా:
తాసాం త్రివర్గ సంసిద్ధౌ ప్రదిష్టం కారణద్వయమ్ భర్తుర్యదనుకూలత్వం యచ్చశీలమవిప్లుతమ్
న తథా యౌవనంలోకే నాపిరూపంన భూషణం యథా ప్రియానుకూలత్వం సిద్ధం శశ్వదనౌషధమ్
వయోరూపాది హారిణ్యోదృశ్యంతదుర్భగాః స్త్రియః వల్లభా మందరూపాశ్చ బహ్వ్యాగలితమౌవనాః
తస్మాత్ర్పయత్వం లోకానాం నిదానం యోగ్యతాపరమ్ తాం వినాన్యే గుణా వంధ్యాః సర్వేఽనర్థకృతోపివా
తస్మాత్సర్వప్రయత్నేన విదధ్యాదాత్మయోగ్యతామ్ పరచిత్తజ్ఞతా చాస్యామూలం సర్వక్రియాస్విహ
తా ॥ భర్త వివాహ విధినంతయును అదరముతో నిర్వర్తించి, అతడు వివాహమాడిన వధువును ఎప్పుడును తన చెల్లెలి వలె చూడవలెను. క్రొత్త పెండ్లికూతురుకు సంబంధించిన బంధువులకు, వారి సమూహములకు సంతోషముతో కూడిన మనస్సుతో వారికి శుభమును కోరుచు పూజ చేయవలెను. పెండ్లి కూతురుకు తాను స్వయముగ ఈర్యాక్రోధాది భావములు లేకుండ, తల్లివలె, గృహ కృత్యములయందు, అక్కడి అచార వ్యవహారములందు శిక్షణనీయవలెను. ఈ విధముగ భర్త అభిప్రాయములన్నింటిని నెరవేర్పవలెను. తన సుఖమును త్యాగము చేసి యైనను భర్తకు ఆనుకూల్యమును చేయవలెను. స్త్రీలకు భర్తయే దైవము. స్త్రీలకు వారి భర్తలు, సర్వవర్ణముల వారికి బ్రాహ్మణులు, బ్రాహ్మణులకు అగ్నిహోత్రము, ప్రజలకు రాజు దైవతములు. స్త్రీల ధర్మార్థకామ పురుషార్థముల సాధనకు రెండు కారణములు నిర్దేశింపబడినవి. ఒకటి భర్తకు అనుకూలముగా నుండుట. రెండవది ఎప్పుడును జారని శీలము. ఆ విధముగ లోకమునందు స్త్రీలకు రూప యౌవన భూషణాదులు కాక ప్రియునికి (భర్తకు) అనుకూలముగ నుండుటయే ఎల్లప్పుడు ఆరోగ్యకరము. వయో రూపాదులు లేని దౌర్భాగ్యురాండ్రు, యౌవనము జారిపోయిన సామాన్యరూపవతులును భర్తకు అనుకూలముగనుండుటచేత అతని ప్రేమకు పాత్రులైన వారున్నారు. అందువలన ప్రియత్వమనునది జనములకు యోగ్యతాపరమైన మొదటి కారణము. ఆ ప్రియత్వము లేనిచో తక్కిన గుణములెన్నియున్నను నిష్పలములు. అన్నియును ప్రయోజన రహితములు కూడ. కాబట్టి సర్వ ప్రయత్నములతో తన యోగ్యతను పోషించుకొనవలెను. అన్ని పనులయందును ఇతరుల మనోభావములను తెలసి ప్రవర్తించుచుండుటయే దీనికి మూలము.
మూ. బహిరాగచ్ఛతో జ్ఞాత్వా కాలం సంమృజ్య భూమికామ్ సజ్జీకృతాసనా తిష్ఠత్తస్యాజ్ఞాం ప్రతి తత్పరా
స్వయం ప్రక్షాలయేత్పాదావుత్థాప్య పరిచారికామ్ తాలవృంతాదికైః కుర్యాచ్చ్రమ స్వేదాపనోదనమ్
ఆహార స్నానపానాదౌ సస్పృహం యత్రలక్షయేత్ తదింగితజ్ఞా తత్త్వేన సిద్ధమ స్మైనివేదయేత్
సపత్నీపతి బంధూనాం భర్తృచిత్తానుకూల్యతః ప్రతిపత్తిం ప్రయుంజీత స్వబంధూనాం నవైతథా
తేషు చాత్మని చ జ్ఞాత్వా భర్తృచిత్తం ప్రసాదయేత్ ప్రతిపత్తిం తథా ప్యేషాం నాద్రీయేత స్వబంధుషు
అపి భర్తురభిప్రేతం నారీ తత్కుల వాసినీ సత్కారైర్నిజ బంధూనాం తేన నో పైతి వాచ్యతామ్
పూజ్య ఏవహి సంబంధః సర్వావస్థాసుయోషితామ్ కస్తతోత్యుపకారాంశం లిప్సేత కులజః పుమాన్
సంపూజ్య స్వసుతాం తస్మై విధివత్ప్రతిపాద్యతే తతోస్యా లిప్సతే నామ కిమకార్యమతః పరమ్
కన్యాం ప్రదాయ యెర్వృత్తిరాత్మనః పరికల్ప్యతే దాస భండ నటాదీనాం మార్గోయం నమహాత్మనామ్
తస్మాత్ స్త్రీ బాంధవా నిత్యం ప్రీతి మాత్రైక సాధినీమ్ ప్రతిపత్తిం సమాదద్యుః సంబంధిభ్యః ప్రసంగినీమ్
తా॥ భర్త బయటకు వచ్చుచున్న సమయమును గమనించి తన వేషమును శుభ్రపరచుకొని భర్త కూర్చుండుట కొఱకు ఆసనమును సిద్దపఱచి, అతని ఆజ్ఞకొఱకు తత్పరురాలై నిలబడియుండవలెను. పరిచారికను నివారించి అతని పాదములను తానే స్వయముగా కడుగవలెను. అతని అలసటను (శ్రమ స్వేదమును) పోగొట్టుటకై విసన కఱ్ఱవీపనలు మొదలగు ఉపచారములు చేయవలెను. ఆహారము, స్నానము, పానము మొదలగువాని విషయమును అతడు సొలోచనుడై ఎక్కడ దృష్టి యుంచునో, ఇంగిత మెఱుఁగు విధానమున, దానిని అతనికి సమకూర్చి పెట్టవలెను. సవతుల యొక్కయు భర్తయొక్కయు బంధువులును భర్త మసన్సునకనుకూలముగా గౌరవింపవలెను. తన వారిని అట్లు గౌరవింపబనిలేదు. వారి బంధువులను తన బంధువులును గమనించి భర్త చిత్తమును ప్రసన్నము చేయవలెను. అనగా వారి బంధువులనాదరింపవలెను. తన బంధువులనట్లదరింపకుండవలెను. ఆ కులముననే జీవితము గడుపవలసిన స్త్రీ, తనవారిని సత్కరించుట భర్త అభిప్రాయమైనను అట్లు చేయరాదు. తన బంధువులను సత్కరించుటచేత స్త్రీకి గణనీయత రాదు. స్త్రీలకు అన్ని దశల యందును పతి కుల సంబంధమే పూజ్యమైనది. ఏ సత్కులజాతుడైన పురుషుడును స్వకన్యాపక్షము నుండీ ఉపకారాంశమును వాంఛింపడు. తన కూతురును సాలంకృతముగా పూజించి, శాస్త్రోక్తముగ అతనికి ఇచ్చి వివాహము చేయును. అట్టి తరి ఆమె నుండి తాను సత్కారములు కోరుటకంటే అకార్యమేమి కలదు! కన్యనిచ్చి, తద్ద్వారమున తమ వృత్తులు కల్పించుకొనుట యనునది సేవకులు, ఆతతాయులు, నటులు మొదలగు వారు అనుసరింపదగిన "మార్గమే కాని ఉత్తము అనుసరింపదగినది కాదు. అందువలన కన్యాపక్షము వారెప్పుడును వర పక్షము వారి నుండి కేవలము ప్రేమను మాత్రము సాధించు ప్రసంగముగల ఆదరమును పొందవలెను.
మూ॥ తస్యా భర్తరి రక్షేత ప్రీతిం లోకేచ వాచ్యతామ్ ఆత్మనోఽసత్ప్రవాదంచ చేష్టేరన్సాధు వృత్తయః
ఏవం విజ్ఞాయ సద్వృత్తం స్త్రీ వర్తేత తథా సదా యేన తత్పరివర్గస్య భవేద్భర్తృశ్చ సంవతా
ప్రియాపి సాధువృత్తాపీ విఖ్యాతాభిజనాపిచ జనాపవాదాత్సం ప్రాప సీతానర్థం సుదారుణమ్
సర్వస్యామిష భూతత్వాద్గుణదోషానభిజ్ఞతః ప్రాయేణావినయౌచిత్యాత్ స్త్రీణాం వృత్తంహిదుష్కరమ్
అగృహ్యత్వాన్మనోవృత్తేః ప్రాయః కపటదర్శనాత్ నిరంకుశత్వాల్లో కస్య నిర్వాచ్యావిరలాః స్త్రియః
దైవ యోగాదయోగత్వాద్వ్యవవహారా నభిజ్ఞతః వాచ్యతా పత్తయో దృష్టాః స్త్రీణాం శుద్ధోపి చేతసి
తాసాం దైవ ప్రతీకారో నోపభోగాదృతే భవేత్ చరిత్రం లోకవృత్తంచ ఏతయోర్విదురౌషధమ్
హిందోలకాది క్రీడాయాం ప్రసక్తాం తరుణీం నిశి రమమాణం విటైః సార్ధం విధవాం స్వైరచారిణీమ్
వృద్ధాది భార్యాం సజ్జాయాం యానగేయాది సంగినీమ్ కః శ్రద్దధ్యాత్సతీత్యేవం సాధ్వీమపి యోషితమ్
యౌ సామింగితాకారౌ సందిగ్ధార్థ ప్రసాధకౌ తయోస్తత్త్వ పరిజ్ఞానం విషయోయోగినాంయది
తా ॥ ఆమె భర్త పైన ప్రేమను కొనసాగింపవలెను. లోకమునందు తమ గౌరవమును కాపాడుకొనవలెను. తమ్మతాము నిందలపాలు కాకుండ రక్షించుకొనవలెను. సాధు వృత్తుల నవలంబింపవలెను. ఇట్లు విషయమును తెలిసికొని స్త్రీ తన పుట్టింటి వారికినీ, తన భర్తకును ఆమోదకరమైన రీతిగా సత్రవర్తన కలిగియుండవలెను. భర్త ప్రేమను పొందినదైనను, సచ్చీలము కలిగియుండినదైనను పుట్టిన కులము సత్కీర్తి కలదైనను, లోకాపవాదము వలన సీత, భయంకరమైన అనర్థములను పొందెను. భోగ్యస్థితి కలిగియుండుటచేత, గుణదోష జ్ఞానము లేకపోవుటచేత, సాధారణముగనే వినయము, ఔచిత్యము పాటింపకుండుట చేత స్త్రీల శీలమును తెలిసికొనుట కష్టసాధ్యము. స్వభావము గ్రహింపవీలుకానిది యగుటవలనను, ప్రాయికముగ కాపట్యము కనబడుచుండుట వలనను, నిరంకుశత్వము వలనను, పేర్కొనదగిన స్త్రీలు లోకమునకు అరుదుగా కన్పట్టుదురు. స్త్రీలకు తమ గౌరవ మర్యాదల విషయమున మనస్సునందు ఏ కల్మషము లేకుండినను, దైవయోగము వలననో, దుర్యోగము వలననో, ఎట్లు వ్యవహరింపవలెనో వారికి తెలియకపోవుటవలననో భ్రష్టురాండ్రుగా కన్నట్టువారు కలరు. ఇట్టి దౌర్భాగ్యస్థితికి అనుభవించుటయే తప్ప దీనికి ప్రతీకారములేదు. ఒక వేళ ఉండినచో అది ఉత్తమ చరిత్ర సృష్టించుకొనుట, లోకరీతిననుసరించి ప్రవర్తించుట అగును. అదియే, అకారణముగ నేర్పడిన దుశ్చారిత్రమును చక్కజేయు నౌషధము. ఊలాటలు మొదలగు వానియందు రాత్రి వేళల ప్రసక్తి గల స్త్రీని, విటులతో వినోదించుదానిని, భర్తలేని స్వైరిణిని, -58. చక్కగా అలంకరించుకొనిన, వృదుని యొక్క, అంగవికలుని యొక్క భార్యను, ప్రయాణములయందు, పాటలయందు తగుల్కొనియుండుదానిని, సతియనిగాని సాధ్వియని గాని ఎవడు విశ్వసించును?. ఇట్టి వారిలో అభిప్రాయ గర్భితములైన ఆకారములు గలవారు, శంకాస్పదమైన, ఇంద్రియ ప్రయోజనము నాశించిన అలంకరణ గలవారునైన ఏ ఇరువురి స్త్రీ పురుషుల, సంభాషణమునకైనను తత్వ పరిజ్ఞానమే విషయమైన యెడల నిక యోగులకు మధ్య విషయమేమైయుండగలదు? లేక యోగ్యుల మధ్య గలు సంభాషణయే తత్వజ్ఞాన విషయకమగునంటిమేని యిట్టివారి మధ్య గలునది క్షుద్రమైనది కాక మఱియొకటి కాజాలదు కదా !
మూ ॥ తస్మాద్యధోక్త మాచారమనుతిష్ఠేత సంయతా మిధ్యాలగోప్యసద్వాదః కంపయత్యేవ తత్కులమ్
త్రికుల్యా వాచ్యతా రక్షా ప్రతిష్టాప్యత సంతతి: భర్తుస్త్రీవర్గ సిద్ధిశ్చ సాధ్వం తత్కులయోషితామ్
పాతయంత్యేవ దౌ: శీల్యాదాత్మానం సకులత్రయమ్ ఉద్ధరంతి తదైవతాః స్త్రియశ్చారిత్ర భూషణాః
భర్తృచిత్తానుకూలత్వం యాసాం శీలమవిచ్యుతమ్ తాసాం రత్నసువర్ణాది భార ఏవ నమండనమ్
లోక జ్ఞానే పరాకోటిః పత్యాభక్తిశ్చ శాశ్వతీ శుద్ధాన్వయానాం నారీణాం విద్యాదేతత్కులవ్రతమ్
తస్మాల్లోకశ్చ భర్తాచ సమ్యగారాధితో యయా ధర్మ మర్థంచ కామంచ సైవాప్నోతి నిరత్యయా
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థసాహస్ర్యం సంహితాయాం బ్రహ్మేపర్వణి
స్త్రీధర్మ కథనం నామ త్రయోదశోఽధ్యాయః
తా ॥ కాబట్టి, ఆచారమెట్లు విహితమైయున్నదో అటులే, దానికి కట్టుబడియే, స్త్రీ నడుచుకొనవలెను. అనుచిత స్నేహములు, అవాచ్యభాషణములు ఆ కులమును కంపింపజేయును. పుట్టినిల్లు, మెట్టినిల్లు, స్త్రీజాతి గౌరవములను కాపాడవలెను. సంతాన గౌరవమును నిలుకడగా నుంచవలెను. అటుల నడచుకొనుటచేతనే కులస్త్రీలకు భర్తయొక్క తనయొక్క ధర్మార్థకామపురుషార్థములు సిద్ది సాధ్యమగును. దుశ్శీలతవలన తనతోబాటుగా తల్లికులము, తండ్రికులము, భర్తకులము పతనమగును. ఉత్తమ చరిత్రయే భూషణముగా గల స్త్రీలు వీనినుద్దరింపగలుగుదురు. భర్త చిత్తమునకనుకూలముగ నుండుట, సచ్చీలము అను నీ రెండు కలిగియున్న స్త్రీలకు, బంగారములు, రత్నములు మొదలగునవి బరువులు మాత్రమే యగును కాని అలంకారములు కానేరవు. సద్వంశములందు బుట్టిన స్త్రీలకు లోకము, జ్ఞానము, భర్త మీద అచంచలమైన భక్తి కంటే అతిశయించిన శ్రేష్టధర్మములు లేవు. ఇవియే కులవ్రతముగా తెలియవలెను. కాబట్టి ఏ స్త్రీ లోకమును, భర్తను యధోచితముగ నారాధించునో ఆమెయే ధర్మార్థకామములను అవినాశముగ పొందును.
ఇది శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున స్త్రీ ధర్మకథన మను పదమూడవ అధ్యాయము.
Summary of chapter 13 of the Bhavishya Mahā Purana is as follows:
A detailed narrative of a woman's ideal daily conduct is given: the sequence of rising, purification, worship, cooking, and service to husband, children, and guests. The manner of cooking — which wood to use, how to handle fire, how to prepare specific dishes for specific occasions — is treated not as mere domestic instruction but as dharmic teaching. The chapter also addresses the duty of serving the children of co-wives with the same care as one's own, and the conduct appropriate when the husband is engaged in religious observance. It culminates in the affirmation that a woman who lives this complete dharma is herself a deity in the home, her daily work a continuous act of sacred service.