మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము
127 - మరుత్త చరితము
మార్కండేయుడు:
మార్కండేయుడు:
తాపసుని వచనములు వినిన రాజు లజ్జితు డయ్యెను. “చారాంధుడను (త్రోవ తెలియని) నేను తిరస్కరింప వలసిన వాడను.” అని పలికి దీర్ఘమగు శ్వాసను వదలెను. ధనస్సును చేత బట్టెను. అతి శీఘ్రమున ఔర్యాశ్రమమునకు వెళ్ళెను. శిరస్సు వంచి పితా మహురాలగు వీరా దేవికి వందనము చేసెను. మఱియు తాపస గణాలకు యథా విధిగా నమస్కరించెను. వారు కూడ ఆతనిని బాగుగా ఆశీర్వచనములతో స్తుతించిరి. పిమ్మట రాజు సర్ప దుష్టులై భూమిపై బడి మృతులైన ఏడుగురు తాపసులను జూచెను. మునుల ఎదుట మాటి మాటికి అనను తాను నిందించు కొనుచూ ఇట్లనెను. “ఈ దుష్ట భుజంగములు నా బలమును తిరస్కరించి, బ్రాహ్మణులను ద్వేషించు చున్నవి. నేను ఇప్పుడు వానికి ఏ గతిని పట్టించెదనో, (ఎట్టి అవస్థను కలిగించెదనో) దానిని దేవ, దైత్య, నరలోక హితముగా సంపూర్ణ జగత్తు చూచును గాక.”
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఆ రాజు ఈ విధముగా పలికి పాతాళ వాసులగు సమస్త నాగ కుల వినాశనార్ధము క్రోధముచే ‘సంవర్తక’ మను అస్త్రమును గ్రహించెను. ఓ విప్రా! ఆ సమయమున సంపూర్ణ నాగ లోకములు ఆ మహాస్త్రము యొక్క తేజస్సుచే వెంటనే జాజ్వల్య మానమై నివారించుటకు శక్యము గాని విధముగా దగ్ధమగు చుండెను. ఈ అస్త్ర ప్రయోగము వలన భయముచే ఉద్విగ్నములైన పన్నగ గణాలు హా తల్లీ! హా తండ్రీ! హా వత్సా! అని ఆర్త నాదములు చేయ సాగెను. కొన్నింటికి తోకలు, కొన్నింటికి పడగలు కాలి పోయెను. మఱియు కొన్ని నాగులు వస్త్ర ఆభారణాదులను పరిత్యజించి స్త్రీ, పుత్రా సమేతముగా, పాతాలమును వదలి మరుత్తుని తల్లి యగు ‘భామిని’ని ఆశ్రయించిరి. ఎందుకనగా పూర్వము ఆమె వారికి అభయ ప్రధానము చేసి యుండెను.
భయాతురులై సమస్త సర్ప గణాలు ఆమె సన్నిధికి చేరి ప్రణామ పూర్వకముగా గాద్గాదిక వచనములతో ఇట్లు పలికిరి. “పూర్వము రసాతలమున ప్రణామ, అర్చనాదులచే మేము నిన్ను ఏమని ప్రార్ధించితిమో దానిని స్మరించెదవు గాక. ఓ వీర మాతా! అది ఇప్పుడు ఉపస్థిత మైనది. దీని నుండి మమ్ములను రక్షింపుము. ఓ రాజ్ఞీ! నీ పుత్రుని నివారించి, మాకు ప్రాణ దానము చేయుము నాగ లోకము లన్నియు వాని అస్త్రాగ్నిచే దగ్ధ మగు చున్నవి. ఓ యశస్వినీ! నీ పుత్రుడు మమ్ములను ఈ విధముగా దగ్ధము చేయు చున్నాడు. అందు వలన నీవు దక్క అన్యు లేవరునూ శరణ మిచ్చు వారు లేరు. మాపై కృప జూపుము.”
మార్కండేయుడు:
మార్కండేయుడు:
సాధ్వి యగు భామిని ఆ సర్పములు వచనములు విని పూర్వము ఇచ్చిన తన అభయ వాక్యములను స్మరించుకొని భర్తతో సంభ్రమముగా ఇట్లు పలికెను.
భామిని:
భామిని:
“పాతాళము నందు భుజంగ గణాలు నా పుత్రుని విషయమున ఏమని ప్రార్ధించినవో, దానిని మీకు ముందుగా చెప్పి యుంటిని. ఆ భుజంగములే ఇప్పుడు కుమారుని తేజస్సుచే దగ్ధమై పోవు చున్నవి. అందు వలన అవి భీతి చెంది నన్ను శరణమును బొందినవి. నేను కూడ పూర్వము వీటికి అభయము నిచ్చితిని. నాకు శరణా గతులైన వారు తప్పక మీకు కూడ శరణా గతులే. నేను గూడ అపృదగ్ధర్మాచరణ గల దాననై మిమ్ము శరణమును పొందితిని. అందు వలన మీరు పుత్రుడగు మరుత్తుని నివారింపుడు. మీ పలుకుల వలన మఱియు నా కోరిక పైన తప్పక శాంతించును.
రాజు:
రాజు:
ఈ నాగ దేవతలు అపరాధము చేసిన కారణముచే మరుత్తునికి క్రోధము కలిగినది. నీ పుత్రుని కోపము నివారించుట అసాధ్యమని తలచెదను.
నాగ దేవతలు:
నాగ దేవతలు:
ఓ రాజా! మేము మిమ్ములను శరణు కోరితిమి. మా యందు అనుగ్రహము జూపుడు క్షత్రియ గణాలు ఆర్తులగు మనుష్యులను రక్షించుట కొరకే అస్త్ర ధారణ చేయుదురు.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
మహా యశస్సు గల అవీక్షితుడు శరనార్దులగు నాగుల వచనములు విని మఱియు భార్యచే పార్ధింప బడిన వాడై ఇట్లు పలికెను. “ఓ భద్రా! నేను ఇప్పుడే నీ పుత్రుని సమీపమునకు వెళ్లి నాగులను రక్షించ మని, ఆతనితో చెప్పెదను. శరణా గతులను వదిలి పెట్టుట ఉచితము గాదు.” ఒక వేళ నీ పుత్రుడు మరుత్తుడు నా పలుకులు విని అస్త్రోప సంహారము చేయనిచో, నేను నా అస్త్రములచే ఆతని అస్త్రములను నివారించెదను.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
పిమ్మట క్షత్రియ శ్రేష్ఠుడగు అవీక్షితుడు ధనుస్సు బాణములను గ్రహించి భార్యా సహితుడై వెంటనే భార్గవాశ్రమమునకు వెళ్ళెను.
