మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

80 - దేవీ మాహాత్మ్యము నందలి మహిషాసుర వధ

 

ఋషి:

ఋషి:

సమస్త సేనలు హతులగుట చూచి సేనాపతి యగు చక్షురుడు యుద్దము చేయుటకు కోపముతో అంబిక సమీపమునకు వచ్చెను. మేఘం ఏ ప్రకారముగా సుమేరు పర్వత శృంగ మందు జలమును వర్షించునో, ఆ రాక్షసుడు కూడా ఆ ప్రకారము దేవి మీద బాణములను వర్షింప సాగెను. కాని దేవి లీలా మాత్రమున వాని బాణముల నన్నింటిని ఛేదించి వేచెను. రథము మొక్క సారథిని ఆశ్వములను చంపి వేసెను మఱియు నా దేవి ఆ సమయమున వాడి ధనస్సును, ఎత్తైన ధ్వజమును విరుగ గొట్టి వాడి శరీర మంతయు బాణములచే తూట్లు పొడిచెను. గుర్రములు సారథి ఏమియు లేని వాడై ననూ కత్తి ఢాలు చేపట్టి దేవి పైకి ఉరికెను.

 

 

అత్యంత వేగముతో తన పదునైన కత్తిచే సింహము యొక్క శిరస్సుపై మోది దేవి యొక్క వామ భుజముపై గొట్టెను. ఓ రాజ కుమారా! ఆ రాక్షసుని యొక్క ఆ ఖడ్గము దేవి యొక్క హస్త స్పర్శ కలుగుటతోనే తునక లయ్యెను. అప్పుడు కోపముతో ఎర్రనైన నేత్రములు గల ఆ రాక్షసుడు శూలము గ్రహించి, పిమ్మట వాడు భద్రకాళి పై విసరెను. వెంటనే దేవి ఆ త్రిశూలమును తేజస్సుచే ప్రకాశించు చున్నట్టిది, ఆకాశము నుండి పడుచున్న రెండవ సూర్య బింబముతో, సమానముగా నుండుట చూచి తన శూలమును విసరెను. మహిషాసురుని సేనాపతి యగు మహా వీరుడైన చక్షురు డను ఆ రాక్షసుడు ఎప్పుడయితే మరణించెనో, అప్పుడు దేవతల శత్రువగు చామరు డను రాక్షసుడు ఏనుగు నెక్కి యుద్దము చేయుటకై దేవి సమ్ముఖమునకు వెళ్ళెను.

 

 

దేవి:

 

దేవి:

 

ఋషి:

ఋషి:

“దేవి ఈ ప్రకారము పలికి ఎగిరి ఆ మహా రాక్షసుని పైకి దూకెను. వానిని తన పాదములతో నొక్కి పట్టి వాడి కంఠమును త్రిశూలముచే ఛేదింప సాగెను. పిమ్మట నా రాక్షసుడును దేవి పాదములచే నొక్కుట వలన ఆ దేవి యొక్క పరాక్రమ మున వాడు తేజోహీను డయ్యెను. మఱియు ఆతని ముఖ కాంతి క్షీణించెను. తదనంతరము క్షీణ కాంతి యుక్తుడై యుద్దము చేయుచున్న ఆ మహాసురుని దేవి గొప్పదగు ఖడ్గముచే శిరస్సు ఖండించెను.”

 

 

ఈ విధముగా ఆ మహిషా సురుడు తన సైన్యము మరియు సుహృద్గణాల సహితముగా త్రైలోక్యములను మోహించి చివరకు దేవి యొక్క చేతిలో మరణించుటచే త్రైలోక్య దేవతలు మనుష్యులు మరియు పాతాళ వాసులగు బలి మొదలగు రాక్షసులు దేవికి జయ జయ ద్వానములు చేసిరి. అనంతరము హాహా కారాములు చేయుచున్న దైత్యుల యొక్క సమస్త సైన్యమును నాశనము చేసెను. అప్పుడు దేవత లందరు అత్యంత హర్షమును పొందిరి. దేవతలు, మహర్షులు దేవిని స్తుతింప సాగిరి. గంధర్వ పతులు గానము చేయ సాగిరి. అప్సరసలు నాట్యము చేయ సాగిరి.