మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

95 - రుచి వివాహము - రౌచ్య మను జననము

 

మార్కండేయుడు:

మార్కండేయుడు:

ఆ తరువాత ఆ నది నుండి “ప్రమ్లోచా” యను పేరుగల మనోహర, ఉత్తమ అప్సరా రమణి వెలుపలకు వచ్చి రుచి యోక్క సమీపమునకు వెళ్ళెను. తిరిగి అప్సరా శ్రేష్ఠ యగు ప్రమ్లోచ అను సుందరి వినయముతో, నమ్రతతో మహాత్ముడగు రుచి యొక్క సమీపమున మధుర వచనములతో ఇట్లు పలికెను. ఓ తాపస శ్రేష్టా! వారున పుత్రుడైన పుష్కరుడను మహాత్ముని ద్వారా నాకు ఉత్పన్న మైనదియు అత్యంత రూపవతి యగు ఒక కన్య ఉన్నది. నేను ఆ వరవర్దినిని ఇచ్చు చున్నాను. తమరు ఆమెను భార్యగా గ్రహింపుడు. ఆమె గర్భము నుండి మీకు మన్వంతరాధిపతి యగు పుత్రుడు జన్మించును.

 

మార్కండేయుడు:

 మార్కండేయుడు:

ఎప్పుడు రుచి “అట్లే యగు గాక” అని చెప్పెనో, అప్పుడు ఆ ప్రమ్లోచ జలము నుండి “మాలిని”అను కన్యను తీసుకొని వచ్చెను.

 

మునివరుడగు రుచి ఆ నది ఒడ్డున మహా మునులను రప్పించి విధి విదానముగా పాణి గ్రహణము చేసెను. ఆమె గర్భము నుండి మహాత్ముడగు రుచికి మహా వీర్యవంతుడు, మహామతి యగు ఒక పుత్రుడు జన్మించెను. ఆ పుత్రుడు తండ్రి పేరు ననుసరించి రౌత్యుడను పేరుచే వసుధాతల మందు విఖ్యాతి చెందెను. అతని మన్వంతరము నందలి దేవతలు, సప్తర్షులు, మరియు అతని యొక్క సమస్త రాజ పుత్రుల విషయములను నీకు పూర్వము చెప్పితిని. ఈ మన్వంతర కథను వినుటచే మనుష్యులకు ధర్మవృద్ధి ,ఆరోగ్యము, ధన ధాన్యములు, మరియు పుత్రోత్పత్తి కలుగును. ఓ మహామునీ! పితరులను స్తుతించుట వలన మరియు నీ పితృ గణాలను శ్రవణము చేయుట వలనను వారి ప్రసాదముచే సంపూర్ణమగు కోరికలు సిద్ధించును.