మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

119 - అవీక్షిత చరితము.

 

మార్కండేయుడు:

 

మార్కండేయుడు:

ఓ ద్విజోత్తమా! స్వయంవర స్థలమున వీర్యచంద్రుని కుమార్తె శుభవ్రత యగు “వీరా” యను కన్య కరంధమ మహా రాజును వరించెను. ఆ రాజేంద్రుని వలన ఆమె గర్భము నుండి “అవీక్షితు” డను ప్రశస్త లగ్న శుభ నక్షత్రము నందు జన్మించి నాడా! ఈతని లగ్న స్థానము నందు శుభ గ్రహముల దృష్టి యున్నదా? ఈతని పై దుష్ట గ్రహాల దృష్టి పడలేదు గదా?” అట్లడిగిన పిమ్మట దైవజ్ఞులు ఇట్లు ప్రత్యుత్తర మిచ్చిరి “ఓ రాజా! నీ కుమారుడు ప్రశస్త ముహూర్త, ప్రశస్త నక్షత్ర, ప్రశస్త లగ్నము లందు జన్మించి నాడు.

 

 

అందు వలన ఓ రాజా! ఇతడు మహా భాగ్య వంతుడు, అత్యంత వీరుడు, అద్భుత బల శాలియు నగు మహా రాజు అగును. ఇటు జూడుము, ఈ కుమారునికి బృహస్పతి, శుక్రులు సప్తమ మందుండి జన్మ లగ్మమును చూచు చున్నారు. మరియు చతుర్ధమును చంద్రు డవ లోకనము చేయు చున్నాడు. మరియు పదు నొకండవ స్థాన మందు స్థితుడైన బుధుని దృష్టి కూడ ఈతని పై నున్నది. నీ పుత్రుని పై రవి, మంగళ, శనైశ్చరుల దృష్టి పడ లేదు. అందుచే ఓ రాజా! నీ ఈ పుత్రుడు ధన్యుడు, మరియు సర్వ కళ్యాణ సంపత్తి యుక్తు డగును.

 

మార్కండేయుడు:

 

మార్కండేయుడు:

జ్యోతిష్కుల వచనములు వసుధేశ్వరుడు ప్రీతి పూర్ణ మనస్కుడై తన స్థానమున గూర్చుండి ఇట్లు చెప్ప సాగెను.

 

 

‘బృహస్పతి, బుధులు ఈ పుత్రుని అవలోకించు చున్నారు. కాని రవి, మంగళులు చూచుట లేదు’ అని మీరు మాటి మాటికి “అవైక్షత” శబ్దమును పలికితిరి. అందు వలన ఈ పుత్రుడు “అవీక్షితు” డను పేరుతో విఖ్యాతి చెందును గాక.

 

మార్కండేయుడు:

 

మార్కండేయుడు:

వేద వేదాంగ పారంగతుడగు ఆ అవీక్షుతుడు కణ్వ పుత్రుని వలన. సంపూర్ణ అస్త్ర విద్యలు గ్రహించెను. ఆ రాజపుత్రుడు రూపమున దేవ వైధ్యులగు అశ్వినీ కుమారులను, బుద్ది యందు వాచస్పతిని, కాంతి యందు చంద్రుని, తేజస్సు నందు సూర్యుని, దైర్యము నందు సముద్రుని, సహన మందు పృథ్విని మించి యుండెను. మరి ఇతర పురుషులలో ఆ మహాత్మునితో సమాన మగు శూరుడు లేకుండెను.

 

 

హేమధర్ముని కన్య ‘వరా’, సుదేవుని కుమార్తె ‘గౌరీ’, బలి యొక్క పుత్రిక ‘సుభద్ర’, వీరభద్రుని కన్య ‘నిభా’, వీరుని కన్య ‘లీలావతి’ భీమ పుత్రిక ‘మాన్యవతి’ మఱియు దంభ కన్య ‘కుముద్వతి’ వీరు ఆతనిని స్వయంవరము నందు వరించిరి. మరియు ఏ ఏ రాజ కుమార్తెలు స్వయంవర మందు ఆతనిని వరించ లేదో, బలవంతుడు, బలోన్మత్తుడు నగు ఆ రాజ పుత్రుడు తన పరాక్రమముతో ఆయా రాజులను, వారి పితృ కులములను ఓడించి వారిని కూడ బలాత్కారముగా గ్రహించెను. ఓ విప్రర్షీ! ఒక నాడు విశాలాదిపతి విశాల రాజు యొక్క కన్య సుదతి వైశాలిని స్వయంవర మందు అతనిని వరించుటకు ఇష్టపడ లేదు. అప్పుడు అతడు బల గర్వముచే  ఏ విధముగా ఇతర రాజ కన్యలను పరిగ్రహించెనో, అదే విధముగా సమస్త రాజులను పరాజితుల చేసి బలాత్కారముగా ఆమెను కూడ పరిగ్రహించెను.

 

 

ఆ రాజు లందఱు ఆ అవీక్షిత రాజుచే పలుమారులు పరాజితులై మరియు వ్యాకులతతో పరస్పరము ఇట్లు చెప్పుకొన సాగిరి. ఒకే జాతి బలశాలురు ఏకమైన రాజు లందరి ఎదుట ఒకే ఒక వీరుడు ఈ లలనను గ్రహించెను. ఇది చూచియు కూడ మీరు సహించి యుంటిరి. అందు  వలన మీ యొక్క జన్మ తిరస్కార మైనది. దుష్ట మానవులు చంపి నప్పటికి అతనిని ఎవరు రక్షించునో, అతడే క్షత్రియుడు ఇతర పురుషుడు క్షత్రియు డను పేరును వృధాగా ధరించును, ఎవరినో అయినచో మాటలెల? రక్షించు కొనుటకు కూడ ప్రయత్నించ లేదు. క్షత్రియ కుల మందు జన్మించిన మీకు ఇదేమి బుద్ది?

 

 

ఓ వీరులారా! సూత్ర, మాగధ వంది గణాలు చేయు స్తోత్రములు వ్యర్ధములు కాకూడదు. శత్రు వినాశనము చేసి వారి స్తుతులను సత్యము చేయుడు. మీ యొక్క ‘భూపతి’ యను శబ్దము దిగంతరము లందు వ్యర్ధముగా ప్రచారము చేయవద్దు, మీరందరూ శ్రేష్ట కులము నందు జన్మించితిరి. అందు వలన పౌరుషము గల వారు. ఎవడు మృత్యు వనిన భయపడడు? మరియు యుద్దము పరిత్యజించియే ఎవరు అమరు డగును? అని ఈ విధముగా విచారించిన శస్త్రధారులకు పౌరుషము విడుచుట ఉచితము గాదు. ఈ వచనము లన్ని విన్న భూపాల గణాలు అత్యంత కుపితులై పరస్పరము ఉత్సాహముతో సంభాషించుకొను సాగిరి. మరియు తిరిగి శస్త్రాలను గ్రహించి లేచి నిలుచుండిరి కొందఱు రథములపై, కొందఱు గుఱ్ఱములపై నెక్కి పోయిరి, మరియు కొందఱు క్రోధ చిత్తులై నడచియే అవీక్షితుని సమీపమునకు వచ్చిరి.