1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము

Table of Contents

38 - మన్వంతరవర్ణసము - వైవస్వత మన్వంతరము - మారీచసర్గము

సూత ఉవాచ :

సూతుఁడిట్లు చెప్పేను :

వైవస్వత మనువు యొక్క సప్తమ మన్వంతరమున దేవతలు, పరమరులు మరీచి కుమారుఁడయిన కశ్యపుని వలనఁగలిగిరి. ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, భృగువులు, అంగిరసులు. ఈ యెనమండ్రు దేవతలలో అష్టగణములుగా స్మరింపం బడుదురు. ఆదిత్యులు, మరుత్తులు, రుద్రులు వీరు కశ్యపుని పుత్రులుగా వెలుంగవలయును. సాధ్యులు, వస్తువులు, విశ్వేదేవతలు వీరు. కశ్యపుని పుత్రులుగా నెఱుంగవలయును. సాధ్యులు, వస్తువులు, విశ్వేదేవతలు వీరు ధర్మునీ పుత్రులు. భృగువులు భృగు కుమారులు. దేవతలు అంగీరసుని పుత్రులు. ఈ వైవస్వతాంతరమున వీరు ఛందజగణములు (చందము వలనఁబుట్టినవారు) భీరును కాల ఫర్యయమున కాలాంత గమున మరణించెదరు. ఈ విధముగా ఈ అద్భుతము శుభమునయిన సృష్టిని మరీచి కుమారునిదిగా గ్రహింపవలెను. ఇప్పుడు (సాంప్రతం) తేజస్వియయిన ఇంద్రుడు నామమున మహాబలుడు. గడచిన, రానున్న వర్తమానము నందలి మన్వంతరముల ఇంద్రులు తుల్య లక్షణులుగా దెలియనగును. వారందరు భూతభవ్య భవన్నాథులు, కాలత్రయమునను ప్రభువులు) వారందరు సహస్రాక్షులు, పురందరులు, మఘవంతులు, హస్తముల వజ్రముములు గలవారు. అందరు శృంగములు కలవారు. శ్రేష్ఠులు. వారందరు ప్రత్యేకప్రత్యేకముగా నూరు యజ్ఞములను చేసినవారు. ఇంద్రులు మూఁడు లోకముల యందున్న చరాచరాది ప్రాణములను, తేజస్సుచే, తపస్సు, బుద్ధిబలముచే, బలముచే, పాండిత్యముచే, పరాక్రమముచే, ఇతర కారణములచే జయించినట్టివారు. వారందరే కారణమున భూతభవ్య భవన్నాథులో వివరించెదను.

తత్సర్వము వివరించేదను, గ్రహింపుఁడు, భూతభవ్యభవత్ స్థితికములు త్రిలోకములని బ్రాహ్మణులు ఎఱుఁగుదురు. భూర్లోకము (భూమి) భూతముగా స్మృతము. అంతరిక్షము భవత్. దీవము భష్యము. ఆ నియమములెట్లుత్పన్నములయినవో చెప్పెదను. ప్రపంచమున నామములనేవి పెట్టవలయునో అని ఆలోచించునప్పుడు ‘భూ’ అను నామము మొదట బ్రహ్మచే నుచ్చరింపఁబడినది. ‘భూ’ అను పదము మొదట సుచ్చరింపం బడియుండుటచే ఇది భూలోకమయినది. ‘భూ’ ధాతువును సత్తాయాం “ఉనికియందు” అని యొక యర్థము. దానికి లోక దర్శనమందు అర్థము కలిగినది. “భూతత్త్వాత్ దర్శనాత్ చైవ భూగ్లోకోయమభూత్తతతః”. ఈ మొదటి లోకము భూలోకము ఏలయన దాని యర్థము స్థితిని పొందుట” అగుట. ఇది భూతత్త్వము. తరువాత దర్శన మొందుటచే లోకమయినది. ఇట్లు విజ్ఞులు స్మరించిరి. ఇది స్థితిని పొందిన తరువాత భవత్ అను రెండవ పదమును బ్రహ్మ ఉచ్చరించెను. ‘భవత్’ అను పదము ఏదయిన నోకటి ఉత్పద్యమానమగుచుండ నుపయోగీంపఁబడును. ఈ పదముచే భువర్లోకము చెప్పబడినది. దీనికి కారణము ఇది భవనము (ఉత్పత్తి) పొందుచున్నదగుట. తరువాత అంతరిక్షము ఉత్పన్నమయినది. ద్వితీయలోకము భువర్లోకమనఁబడినది. రెండవ (ద్వితీయ) లోకముత్పన్నముకాగా బ్రహ్మ భవ్య అనుపదము నుచ్చురించెను. అందుచే ఆ లోకము భవ్య లోకమయినది. ఇంతకు పూర్వముత్పన్నము కానీ విషయమున భవ్య నామము కలుగును. అందుచే భష్యలోకము త్రిదీవముగా స్మృతము. భూమి ‘భూ’ పదముచే స్మరింపఁబడినది. అంతరిక్షము ‘భువః’గా స్మరింపఁబడినది. స్వర్గము భవ్యము. లోకముల నామములఁగూర్చి యిది నిర్ణయము. మూఁడు లోకముల గూర్చి మూఁడు వ్యాహృతులు కలిగినవి. (వ్యాహృతులు = భూః, భువః, సువః - అనునవి).

‘నాథ్’ అను ధాతువున్నది. దాని యర్థమును ధాతుజులు 'పాలనే' పరిపాలించుట యని చెప్పుదురు. వారందరు మూఁడు లోకముల ‘నాథులు’ రక్షకులగుట (భూత భవ్య భవల్లోకత్రయము) వారిని బ్రాహ్మణులు ఇంద్రులనిస్తారు. దేవేంద్రులు ప్రధాన భూతులు. అట్లే అప్రధానులు. మన్వంతరములందు ఏ దేవతలు యజ్ఞభోక్తలో (యజ్ఞహరీర్బుక్కులో) వారిని బ్రాహ్మణులు త్రిలోకములకు నాథులనిరి. యక్షులు, గంధర్వులు, రాక్షసులు, పింశాచములు నాగులు, మనుష్యులు వీరందరని దేవేంద్రుల యొక్క మహిమగలవారుగా (తేజోమూర్తులనుగా) స్మరించిరి. దేవేంద్రులు పెద్దలు (గురువులు). రక్షకులు, రాజులు, పితృదేవతలు. ఈ సురోత్తములు ప్రజలను ధర్మముతో రక్షింతురు. ఈ విధముగా దేవేంద్రుల యొక్క లక్షణములు సంక్షిప్తముగా వివరింపఁబడినవి. ఆకాశము నాశ్రయించుకొని యున్న సప్తర్షులంగూర్చి చెప్పెదను. వారు 1. మహాతపశ్శాలి విశ్వామిత్రుఁడు. ఇతఁడు గాధికుమారుఁడు. ఇతఁడు కుశీకగోత్ర సంభవుఁడు. 2.జమదగ్ని. ఈతడు ఔర్వుని ప్రతాప వంతుఁడయిన కుమారుం డు. భార్గవవంశ సంభవుండు. 3. మహాయశస్వి భరద్వాజుఁడు. ఇతఁడు బృహస్పతి కుమారుఁడు. 4. శరద్వంతుండు. ఇతఁడు విద్వాంసుఁడు, ధార్మికుఁడు, ఔతథ్యుని కుమారుడు. గౌతమవంశ సంభవుండు. 5. స్వాయంభువుఁడు భగవానుండైన అత్రి కుమారుడు. (ఐదవవాఁడు) ఇతనికి “బ్రహ్మకోశుఁడనీ” నామాంతరము. 6.వసుమంతుఁడు. ఇతఁడు వసిష్ణునీ పుత్రుఁడు. ఇతఁడు లోక విశ్రుతుఁడు, 7.వత్సరుఁడు, కాశ్యప వంశ సముత్పన్నుఁడు. ఈ ఏడుగురు సాధువులచే గౌరవింపఁబడిరి. ఈ ప్రస్తుతాంతరమున నీ ఏడుగురు ఋషులు కలరు. ఇక్ష్వాకుడు, నృగుఁడు ధృష్టుడైన శర్యాతి.

నరీష్యంతుఁడు, విఖ్యాతుఁడైన నాభాగుడు, దిష్ణుఁడు, కురూషుఁడు, పృషధ్రుఁడు, పాంశువు ఈ తొమ్మండు వైవస్వత మనువు యొక్క కుమారులు. సుధార్మికులుగా, వారు కీర్తింపఁబడిరి. ఈ మన్వంతరము ఏడవది. ఓ ద్వీజులారా  ఈ ద్వితీయ పాదము నాచే విస్తరేణ ఆను పూర్వముగ చెప్పబడినది. ఇంక ఏమి నేను చెప్పుదును.

ఇది వాయుప్రోక్తము, మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమున ద్వితీయానుషంగపాదమున మన్వంతర వర్ణనమను ముప్పది యెనిమిదవ అధ్యాయము బ్రహ్మాండపురాణ పూర్వభాగము సమాప్తము.