1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
13 - కాల సద్భావవర్ణనము
సూత ఉవాచ:-
సూతుఁడిట్లు పలికెను :
పూర్వము స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మ పుత్రులను సృజించుచుండ, మనుష్యులు, అసురులు, దేవతలు ఆతని శరీరేంద్రీయముల నుండి యుద్భవించిరి. (1) పితరులు కూడ నాతనిని పితగా దలపోసి, యుద్భవించిరి. వారి సృజన విధాన మంతకుఁబూర్వము వర్ణింపం బడినది. అయినను సంక్షిప్తముగా దానిని వినుము. (2) దేవతలను, అసురులను, మనుష్యులను సృజించి బ్రహ్మ వారిని చూచి గర్వించెను. ఇది కాక వేడొక సృజనమును గూడ సాతఁడు తలపోసెను. పితరుల వలె తలంపఁబడు పితృదేవతలు ఆతని పార్వభాగముల నుండి యుదయించిరి. వసంతముతో ఆరంభించు ఆరు ఋతువులు మొదలయినవి ఆ బ్రహ్మయొక్క పార్వ భాగముల నుండి యుదయించినవి. వానిని పితరులనిపిలిచిరి. “ఋతవః పితరో దేవాః” అని వేదసూక్తము. (4) గతించిన మన్వంతరములందు, రానున్న మన్వంతరములందు అన్ని మన్వంతరములందీ విధానమే పునరావృతమైనది. పూర్వము ఇయ్యవి శుభవంతములయిన స్వాయంభువ మన్వంతరముల నుదయించినవి. (5) వారు అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అను నామములతో స్మరింపఁదిడీరి. వారిలో గృహస్థులు కానీవారు, యజ్ఞముల నాచరించనివారు, ఆగ్నీష్వాత్తుల సంఘమునకు సంబంధీంచిన పితరులుగా స్మరింపఁబడిరి. వారు నిత్యము నియమ పూర్వకముగా యథావీధి అగ్నిహోత్రముల నాచరించిన వారుకారు. (6,7) వారిలో (ఆ పితరులలో) యజ్ఞముల నాచరించినవారు సోమపీథులు (యజ్ఞముల యందు సోమరసమును ద్రాగినవారు). ఆ పితృవర్గములలో అగ్నిహోత్రము లాచరించిన వారినీ బర్హిషదులనుగా స్మరించిరి. వేదముల యందు “ఋతువులు, పితరులు, దేవతలు”, అని స్పష్టముగాఁ జెప్పం బడినది. మధుమాధవ మాసములు (చైత్ర, వైశాఖములు) రసములుగా తెలియవలయును. శుచి, శుక్ర మాసములు (జ్యేషా షాఢములు) శుష్మిణులు (శృంగార పరములయినవి). నభ, నభస్యలు (శ్రావణ భాద్రపదములు) రెండును జీవములని యుదాహరింపఁబడినవి. (7,8,9)
ఇష, ఊర్ణ మాసములు (అశ్వయుజము, కార్తీకము) రెండును స్వధావంతములని చెప్పఁబడినవి. సహ, సహస్య మాసములు రెండు (మార్గశీర్పము, పుష్యము) ఘోరములనీ చెప్పఁబడినవి. (10) తపస్, తపస్య మాసములు రెండు (మాఘ ఫాల్గుణములు)ను శీతకాలమునకు సంబంధించినవి. వీనిని మన్యు ముంతములందురు. (11} కాల గణన సూచకములయిన మాసములు ఋతుషట్కమున చెప్పఁబడినవి. వీనిని ఋతువులందురు. ఈ ఋతువులు బ్రహ్మయొక్క పుత్రులు. ఇయ్యవీ చేతనో చేతనములయిన వస్తువులతో తాదాత్యము చెందునట్టివిగా గ్రహింపవలయును. (12) మాసముల, అర్దమాసములు (పక్షములు), స్థానములందు ఋతువులు స్థానములు గలిగినవిగా స్మరింపఁబడినవి. స్థానములను మారినప్పుడు స్టాణాభిమానులను గ్రహింపవలెను. (13) పగలు, రాత్రులు, మాసములు, ఋతువులు, అయనములు, సంవత్సరములు, ఇవి యన్నియును స్థానములు. వానియందభిమానము గల దేవతల నామములు క్రమముగా నీయబడినవి. (14) అ స్థానములతో దాదాత్మ్యము పొందునట్టివారు, అందే అస్థితులయి యున్నవారు, వారే కాలము యొక్క స్థితులు దానిని వారు తమ ఆత్మలనుగా-దలంచుచున్నారు. ఏలయన వారును ఆదినమాసాదులును నిజమునకు ఒక్కటియే యగుట. వారినిట్లే అవగాహనము చేసికొనవలయును. (15) వారి పొరి కాలమాన స్థితులు - తిథులు (పార్వణ్యములు - శుక్లపక్ష తిథులు), సంధ్యలు, పక్షములు, మాసార్ధ తుల్యములు, నిమేషములు, కలలు, కాష్ఠములు, ముహూర్తములు, దివసములు, రాత్రులు; (16) రెండర్ధమాసములు మాసము. రెండు మాసములు ఒక ఋతువు; మూఁడు ఋతువులోక అయనము; రెండు అయనములు (ఉత్తర, దక్షిణ) - అన్నియును కలిపి యొక సంవత్సర మగును. ఇయ్యవీ ఆయా స్థానికులకు స్థానములు; ఋతువులు “నీమి” బిడ్డలు. అట్లే అవి ఆరుగా గ్రహింపవలయును. (17,18)
పంచవిధ ప్రజలు ఋతు పుత్రులుగా చెప్పబడుచున్నారు. వారు మానవులు, చతుష్పాత్తులు, పక్షులు, సరీసృపములు, వృక్షములు. వారందరు ఆర్తవ లక్షణములు కలవారు, ఋతు సంబంధమైన మార్పులు గలిగి యుందురు. స్థాణువులు, జంగములు నయినవి ఋతువుల వలన పుట్టిరి. ఋతు ధర్మములు, స్త్రీల రజః ప్రవృత్తి ధర్మములు మొదలయినవి, ఆర్తవులు తండ్రులు ఋతువులు పితామహులు. వారు సమేతులయినప్పుడు కలిసినప్పుడు) ప్రజాపతి యొక్క ప్రజలుదయింతురు. (19,20) అందుచేతనే వత్సరము ప్రజల పితామహుడుగా స్మరింపఁబడినది. వారు స్థానముల యందు స్థానితులు. వారు స్థానాత్ములుగా కీర్తింపఁబడిరి. (21) అందుచేతనే వారి వారి నామములు కలిగినవారుగా, వారి సత్త్వము కలిగిన వారుగా, తదాత్ములుగా స్మరింపఁబడిరి. తత్కారణమున ప్రజాపతిగా సంవత్సరము వ్యవహరింపం బడినది. (22) పండితులు సంవత్సర సుతుఁడైన అగ్నిని ఋతుండందురు. వారు ఋతువుల పుట్టుట వలన ఋతువులుగా పిలువబడిరి. (23) సంవత్సరములు ఆరు ఋతువులు కలవి. ద్విపాదులు, చతుష్పాదులు, పక్షులు, సరీసృపములు, స్థాణులు - ఇవి పంచార్తవములు. వీనికి ఋతు ధర్మములయిన మార్పులు కలవు. పుష్పము కొలార్తవము. ఋతుత్వము ఆర్తత్త్వము పితృత్వముగా కీర్తింపఁబడినవి. (25) ఇట్లు ఋతువులు, ఆర్తవములు పితరులుగా తెలియవలయును. ఏలయన (ఋతువులు పితృదేవతలుగా వర్ణింపఁబడినవి. ఈ పితరుల యొక్క కుమార్తెల నామముల విషయమున పురాణములలో భేదమున్నది.) ఋతుకాలమును బట్టి సర్వభూతములు వానికి ఉద్భవించినవి. (ఋతువు - గర్భోత్పత్తికి అనుకూలమయిన కాలము). అందుచే ఆర్తవములు పితరులుగా మేము వింటిమి. ఇయ్యవి మన్వంతరముల యందు కాలాభిమానీనులుగా నుండిరి. (27) వారు కార్యకారణత్వ ప్రాప్తులు. వారు వారి యాధిక్యమున సర్వమును వ్యాపించి యుండిరి. నిజముగా వీరు స్థానాభిమానినులతో తాదాత్మ్యము వహింతురు. వారితోడి ప్రత్యేక సంబంధము వలన వారుండిరి. (28)
పితృదేవతలు విభిన్నులు. అగ్నీష్వాత్తులు, బరీషదులు. స్వధా పితరులకు లోక విశ్రుతలయిన ఇరువురు కన్యలు కలిగిరి. (29) వారు మేనయు ధారణియు. వారిరువురి వలన యావజ్జగత్ ధరింపఁబడినది. వారిరువురు బ్రహ్మవాదినులు, అంతీయే కాక వారిరువురు యోగినులు కూడ. (30) పవిత్రురాండ్రయిన ఇరువురు కన్యలను ధర్మార్థము పితరులొసంగిరి. ఇంతకుఁ బూర్వము చెప్పఁబడిన వారా అగ్నీష్వాత్తులు, వారికి మేన మానసీపుత్రిక. (31) ధార బరీ షదుల మానసీ పుత్రిగా చెప్పుదురు. బర్హిషదుఁడు ధారణిని మేరువునకు భార్యగా నొసంగేను. పితరులయి బార్హిషదులు సోమపాయులు. అగ్నిష్వాత్తులు మేనసు హిమవంతునకు పత్నిగా నొసంగీరీ. (33) వారు పహూతులుగా చెప్పఁబడిరి. వారీ కూతుంద్ర కుమారుల నెఱుంగుఁడు. హిమవంతుని పత్నియైన మేన మైనాకుని ప్రసవించెను. (34) ఆ హిమవంతునకే సరీద్వరమైన గంగ కలిగినది. ఆమెను అతఁడు లవణోదధికి భార్యగా నొసంగెను. క్రౌంచము యొక్క కుమారుడు మైనాకుఁడు. ఆ క్రౌంచము నుండియే క్రౌంచ ద్వీపమును నామము కలిగినది. (35) మేరువు పతియయిన ధారణి దివ్యౌషధులతో కూడిన మందర మను పుత్రుని లోకవీశ్రుతులయిన మువ్వురు కుమార్తెలను కనెను. (36) ఆ ముగ్గురు పుత్రికలు, వేల, నియతి, అయతి - అనువారు. ఆయతి ధాతయొక్క భార్య, నీయత విధాతృనీభార్య. (37)
సూత ఉవాచ :
ఈ యిరువురి సంతానము పూర్వము స్వాయంభువ మన్వంతర కథనమున చెప్పఁబడినది. సాగరుని వలన వేల (సముద్ర తీరము) అనిందితురాలయిన కుమార్తెను కనెను. (38) నముద్రుని కూతురయిన సువర్ణ ప్రాచీన బర్హి యొక్క భార్య మాయెను. ప్రాచీన బరికి సవర్ణ వలన పదిమంది సుతులు పుట్టిరి. (39) వారందరు ప్రచేతసులని పిలువంబడిరి. వారందరు ధనుర్వేదపారగులు. వారికి స్వాయం భువుఁడయిన (తనకు తా పుట్టినవాఁడు) దక్షుఁడు పుత్రుఁడయ్యెను. (40) ఇయ్యదీ చాక్షుష మన్వంతరమున త్ర్యంబకుని శాపమువలన కలిగెను. దీనిని విని శాంశపొయని సూతునడిగెను. “చాక్షుష మన్వంతరమున పూర్వము దక్షుఁడేట్లు భవుని శాపముననుత్పన్నుఁడయ్యెను? అడుగుచుంటిమి. మాకు చెప్పుము.”(42) ఇట్లు అడుగబడి దక్షునికి సంబంధించిన కథను సూతుఁడు శాంశపాయనని సంబోధించి త్ర్యంబక శాపకారణమును చెప్పెను.
సూతుడిట్లు చెప్పెను.
ఇంతకుం బూర్వము చెప్పితిని కదా! దక్షునకు ఎనమండ్రు కుమార్తెలు కలరు. వారందఱని పోరి వారి భర్త గృహముల నుండి తీసికొని వచ్చి స్వగృహమున పొరల నందఱును దక్షుఁడు గౌరవించెను. (44) ఇట్లు ఆదరముతో గౌరవింపఁబడి వారందరు పితృగృహమున వసించిరి. వారిలో పెద్దది సతి. ఆమె త్ర్యంబకుని పత్ని. (45) రుద్రుని యందు ద్వేషముచే దక్షుండామెను పిలువలేదు. మహేశ్వరుఁడెన్నఁడు దక్షునకు వంగి నమస్కరింపలేదు. (46)
అల్లుఁడయిన దక్షుఁడు, ఆత్మతేజస్థితుఁడయి (తన గొప్పతన మెంచుకోని గర్వించిన స్వభావము వలన) మామ యయిన శివునకు వంగి నమస్కరింపలేదు. తన చెల్లిండ్రందరు తన తండ్రి గృహమున కరిగీరని తెలిసికొని సతీదేవి, తాను తండ్రిచే పిలువఁబడకయే పితృగృహమునకు వెళ్లాను. దక్షుండామెకు ఇతర కుమార్తెల కంటే తక్కువయైన గౌరవము చేసెను. తదల్పపూజాదికమామెకు అసమ్మతమయ్యేను. (47,48) అంత సతీదేవి క్రోధమున మండిపడి తండ్రి “ఓ ప్రభూ! (ఓతండ్రీ!) నా కంటే చిన్నవారయిన చెల్లెండ్ర కంటే అల్పము అధమమునయిన పూజను నా కొనరించి, నన్ననాదరించి నీవు గరితమయిన కృత్యమాచరించతివి. నేనో వీరందరికంటెను పెద్దను. శ్రేష్ఠురాలను. నీవు నాకధికముగ సత్కార మొనర్పఁదగినవాడవు. (49, 50).” ఆమె యిట్లు పలుకఁగా దక్షుండు సంరక్తలోచనుఁడయి “ఈనో కుమార్తెలు నీకంటే శ్రేష్ఠురాండ్రు. నీకంటే ఉత్తమురాండ్రు. నీకంటే పూజ్యలు. (50) ఓ సతీ! పోరి భర్తలు కూడ సోకు నధికముగా గౌరవింపఁదగినవారు. వారు బ్రహ్మిస్తులు, వేదముల యందు నిపుణులు. తపస్వులు - అధిక తపస్సాచరించినవారు. మహాయోగులు; సుధార్మికులు; గుణమున నధికులు; వారందరు త్ర్యయంబకునికంటే శ్లాఘింపఁదగినవారు. వశిష్ఠుఁడు, అత్రి, పులస్త్యుఁడు, అంగీరసుఁడు, పులహుడు, క్రతువు, భృగుఁడు, మరీచి - అందరు శ్రేష్ఠులు. సా జామాతలు. శర్వుఁడు నన్ను తిరస్కరించెను. నన్ను సదా అవమానించును. ఆతఁడు సాకు ప్రతికూలుఁడు అందుచే నిన్ను గౌరవించను.” అని సంప్రమూఢ మయిన బుద్ధిచే పలికెను. తత్ఫలిత మాతనికి, ఆతనిచే నుదహరింపఁబడిన మహరులకు శాపకారణమయ్యెను”, తండ్రి యిట్లు పలుకంగా క్రోధోద్రిక్తురాలయిన సతీదేవి తండ్రితో నిట్లు పలికెను. (51-56)
రుద్ర ఉవాచ :-
వాజ్మనః కర్మలచే దోష రహితనయిన నన్ను నీవవమానించితివి. అందుచే నీ శరీరము నుండి పుట్టిన యీనా దేహమును త్యజించు చున్నాను.” అంత అవమానము చేతను, దుఃఖము చేతను, అగౌరవము చేతను బాధపడిన సతీదేవి స్వయంభువునకు నమస్కరించి ఈ పలుకులు పలికెను. “ఎచ్చట నేను తిరిగి ప్రకాశవంతమయిన దేహమున, అయోనిజగా పుట్టినను లేదా ధార్మికుఁడు పవిత్రుఁడునయిన వానికి పుట్టినను, నేను ధీమంతుఁడయిన త్ర్యంబకునకు (59) పత్నీత్వమునే పొందెదను'. అని అచ్చటనే సమాసీనురాలయి, యోగము నొందెను. ఆమె తనయాత్మను పరమాత్మతో సమైక్య మొనర్చెను. తన మనస్సుతో 'ఆగ్నేయిధరణ' మామే వహించెను. అంత ఆమె నుండి పుట్టిన అగ్ని సర్వాంగముల నుండి ప్రజ్వలించెను. వాయువుచే దహింపఁబడి ఆమె శరీరము భస్మసోత్కృతమయ్యెను. (62) శూలధారియైన యీశ్వరుఁడు సతీదేవి మరణమును గూర్చి వినెను. ఆమె సంవాదమును యథాతథమున శంకరుఁడేటింగెను. భగవానుఁడు దక్షుని యందు 'ఋషీశ్వరుల యందు క్రోధోద్రిక్తుం డయ్యెను. (62)
రుద్రుఁడిట్లనెను :
అన్నిలోకములలో భూర్లోకము మొట్టమొదటిదని చెప్పబడుచున్నది. ఆ భూర్లోకమును పరమేష్టి యొక్క విదేశమున ఎల్లప్పుడు ధరించెదను. భాస్వరములయిన మిగిలిన లోకములన్నియు భూర్లోకమును ధరింప ధరింపఁబడినవగును. ఆ పరమేశ్వరుని యాజ్ఞచే దానినిందునే ధరించెదను.
సూత ఉవాచ :
దేవతల యొక్క చాతుర్వర్ణ్య విభజనమున్నది. అయినను వారందజొకచో భుజింతురు, వారీతో సహ నేను భోజనము స్వీకరింపను అందుచే వారు నాకు వేలుగా భోజనము సమర్పింతురు. ఓ దక్షా! నా కారణమున దోష రహితురాలయిన సతీదేవి నీ వలన నవమానింపం బడిన కారణమునను, ఇతరులయిన నీ కూతుండ్రందరు వారివారి భర్తలతో ప్రశంసింపఁబడిన కారణమునను, వైవస్వత మన్వంతరము ప్రారంభము కాగా, అయోనిసంభవులయిన యీ ఋషీశ్వరులు నేను చేయు ద్వితీయ యజ్ఞమున, నుద్భవించెదరు. [67) అని వారందడితో చెప్పిన పిమ్మట “చాక్షుష మన్వంతరమున శుక్ర హోమము బ్రహ్మచే నిర్వహింపఁబడినప్పుడు నీవు చాక్షుష వంశమున మనుష్య సంబంధమయిన రాజువగుదువు. నీవు ప్రాచీన బర్షియొక్క పౌత్రునిగాను, ప్రచేతసుని యొక్క పుత్రునిగాను జన్మింతువు. నీవు దక్షుఁడవను నామముననే శాఖినుల కుమార్తెగా పుట్టెదవు. (70) వైవస్వత మన్వంతరము రాగా, అందుకూడ, ఓ దురాత్మా! ఓ దుర్మతీ! ధర్మయుక్తమయిన యొక కార్యము నందు, అయ్యదేంత దురాసదము (చేరరానిదీ అయినను, నేను వీఘ్నమాచరించెదను.”
సూతుఁడిట్లు పలికెను :
దక్షుడీ పలుకులు వినెను. రుద్రునాతఁడు మరల శపించెను. “నీవు నా కారణమున ఋషీశ్వరులకనిష్టము నాచరించితివి. కాన ద్విజులు యజ్ఞములందు, దేవతలతో సహా, నిన్ను పూజింపరు. ఓ క్రూరుఁడా! వారు యజ్ఞక్రియల యందు నీకు ఆహుతుల సమర్పీంచిన తరువాత పవిత్రులగుటకు పవిత్ర జలముల స్పృశించెదరు, యుగాంతమున వారు స్వర్గమును వీడి యందేవసించెదరు. (73) అనెను.
అప్పటి నుండి దేవతలతో సార్ధము రుద్రుఁడు పూజింపబడలేదు. ఆతఁడు ప్రత్యేకముగా పూజింపఁబడుచుండెను. అంత, అమిత తేజస్విమయిన రుద్రునిచే నిట్లు చెప్పఁబడి, దక్షుఁడు స్వాయంభువమయిన తన శరీరమును పరిత్యజించి మానవులలో నతఁడు జన్మించెను. (74,75) యజ్ఞముల కధిపతి, ప్రభువునైన ఈశ్వరు నేటింగి, దక్షుఁడు (గృహపతి) సమస్త యజ్ఞములతో దేవతలతో సహితముగా ఈశ్వరుని పూజించెను. వైవస్వత మన్వంతరము సంప్రాప్తమైనది. పర్వతరాజయిన హిమవంతుఁడు మేనకయందు దేవియయిన ఉమను పుత్రిగా కనెను. ఆమేయే ఆ పూజ్య సతీదేవి. పూర్వమందుదయించినది. (78) ఆమె భవుని యొక్క నిత్యపత్ని ఈశ్వరుఁడెన్నడును ఆమేచే విడువబడీ యుండలేదు. (78) పత్యనువ్రత పవిత్రమైన అదితి మరీచి సుతుఁడయిన కశ్యపుని ఎన్నడును విడిచి యుండనియట్లు ఉమ యెన్నడును భవుని విడిచి యుండదు. ఇందిరాదేవి సారాయణుననుసరించి యుండునట్లు, శచీదేవి పర్జన్య ప్రభువైన యింద్రుని ననుసరించి యుండునట్లు, ఉమభవుననుసరించి యుండును. (79,80) లక్ష్మి విష్ణుని విడువదు; ఉషాదేవి సూర్యుని వీడిచి యుండదు. అరుంధతీ వశిష్ఠుని విడిచి యుండదు. ఈ పవిత్ర స్త్రీలు పవిత్రలు, వారెన్నడును భర్తలను విడిచి యుండరు. కల్పములు పరీవర్తనము చెందును. ఆ కల్పములలో ఆయా జీవులు దయించుచుందురు. వారితో మరల మరల, వీరును నుదయించుదురు. (80) దక్షుఁడు ప్రాచేతసుని కుమారునిగా పుట్టెను. అది చాక్షుష మన్వంతరము. (81) శాపము వలన దక్షుడు మారిష యందు దశ ప్రచేతసులకు రెండవ పర్యాయము రాజుగా పుట్టియుండెనని మేము వినియుంటిమి. (82) వైవస్వత మన్వంతరమున త్రేతాయుగమున భృగ్వాదులయిన సప్తర్షులు ఇతరులు మొదట జన్మించిరి. మహాత్ముఁడైన మహాదేవుని యజ్ఞము నందు పోరుణ సంబంధమయిన శీరమును వారు పొందిరి.
ఇట్లు ప్రజాపతి యయిన దక్షునకు, ధీమంతుఁడు, స్వయంభువుఁడు త్ర్యంబకుఁడునయిన ఈశ్వరునకు, గతజన్మము నుండి తీవ్రమయిన వైరమును విడువక పూనియుండుట కార్యము కాదు. (85) శుభాశుభముల నుసరించి మానవులు తమ మనస్సులలో తీవ్రముగా దలపోసిన విషయముల గూర్చిన పరిజ్ఞానమును, అయ్యది పూర్వజన్మ కనుబంధించిన దయినను విడువరు. అందుచే పండితుఁడయిన వాడట్టి విరోధమును పురస్కరించుకోనీ ప్రవర్తించుట కార్యము కాదు. (86) పాప విమోచనకరము, దక్షునికి సంబంధించిన కథ యిట్లు ఆరంభమైనది. ఈ కథనే మీరింతకుంబూర్వము చెప్పవలసినదని ప్రార్థించితిరి. పితృవంశ కథన ప్రసంగమున నీకథ చెప్పబడినది. ఇంక అట్లే పితృవంశ కథనమును కీర్తించినట్లే, దేవల చరిత్రను చెప్పెదను. (88) పూర్వము త్రేతాయుగము యొక్క ఆరంభమున, స్వయంభువ మన్వంతరములో, “యాములు” అనే పేరుతో దేవతలు కలరు. వారందరు 'యజ్ఞ' పుత్రులు. (ఇది దేవవంశ కథనమునకు ఆరంభము). (89) వారు ప్రథితుఁడయిన బ్రహ్మకు పుత్రులు. వారు అజులు (పుట్టనివారగుట. అజులగుట వారు అజితులు. జయింపఁబడనివారు. (90) వారు స్వయంభువుని మానస పుత్రులు, వారీ నామము శక్తులు. అందుచే వారు దేవతలలో త్రివర్ణులుగా స్మరింపఁబడుదురు. (యాములు, అజితులు, శక్తులు). స్వాయంభువుని సృష్టియందు ఛందజులు ముప్పది ముగ్గురు. (91) యాములు పండ్రెండుగురు. వారు క్రమముగా - యదువు, యయాతి, వీవధుఁడు, " స్రాసతుఁడు, మతి, విభాసుఁడు, క్రతువు, ప్రయాతి, విశ్రుతుఁడు ద్యుతి, వాయవ్యుఁడు, సంయముఁడు. (93} యదువు, యయాతులు ఇద్దరు దేవతలు అజితులు పండ్రెండుగురు - వారు - అసముడు, ఉగ్రదృష్టి, సునయుఁడు, శుచిశ్రవుండు, కేవలుఁడు, విశ్వరూపుఁడు, సుదక్షుఁడు, మధుపుఁడు, తురీయుఁడు, ఇంద్రయుక్, యుక్తుఁడు ఉగ్రుఁడు. (గామ్రాజితుఁడు) (94)
శక్తులు పండ్రెండుగురు. వారు క్రమముగా - జనిమంతుఁడు, విశ్వదేవుడు, జనిష్టుడు, మితవంతుఁడు, జరుఁడు, విభుఁడు, విభావుఁ. డు, బుచీకుఁడు, దురీహఁడు, శ్రుతి, గృణానుఁడు, బృహత్తు. వీరందరు స్వాయంభువ మన్వంతరమున సోమపాయులు. (96) ఈ గణము లందరు మొదట దీప్తిమంతులు, వీర్యవంతులు, మహాబలురు : ప్రభువైన విశ్వభుక్కు వారి అధిపతి. ఆతఁడే యింద్రుఁడు. (97) అచ్చటనే వసించిన అసురులు వారి సోదరులు, దాయాదులు, సుపర్ణులు, యక్షులు, గంధర్వులు, పిశాచులు, ఉరగులు, రాక్షసులు - వీరందరు పితరులతో దేవతలతో కూడుకొని, పండ్రెండు దేవయోని విశేషులు. వారందరు స్వయంభువ మన్వంతరములో గడచిపోయిరి. వారికి సహస్ర సంఖ్యలలో ప్రజలు (సంతానము) కలరు. వారందరు విశేషముగా ప్రభావముతో, సౌందర్యముతో, ఆయుష్చుతో, బలముతో కూడియున్నవారు. వారిని " గూర్చి - ఇచ్చట ప్రసక్తము లేనందున విస్తరముగా చెప్పబడలేదు. (100) స్వాయంభువ మనువు సృష్టినీ వర్తమాన మనుసృస్టిని బట్టి గ్రహింపవలెను. (స్వాయంభువ మనువు, వర్తమాన మనువయిన వైశ్వానరమనువు ముఖ్యులు. వీరి కాలములలోని సంగతులను బట్టి వీరి ప్రాధాన్యము ఈపురాణ కవిచే నుద్ఘాటీంపఁబడియుండవచ్చును.) గత సృష్టి వర్తమాన సృష్టిని బట్టి గ్రహింపవలెను. ఈ ప్రస్తుత సృష్టి ప్రజలు, దేవతలు, ఋషులు, పితరులు - మున్నగు వారిని బట్టి వైవస్వత మను సృష్టి. సప్తరులు పూర్వముండి యుండిరనియే తెలిసికొనవలెను. (101,102) భృగువు, అంగీరసుఁడు, మరీచి, పులస్త్యుఁడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుఁడు - ఈ ఏడుగురు మహర్షులు స్వాయంభువ మన్వంతరమున నుండిరి. (103) అగ్నీధ్రుఁడు, అగ్ని బాహువు, మేథ, మేథాతిథి, వసువు, జ్యోతీష్మంతుఁడు, ద్యుతిమంతుఁడు, హవ్యుఁడు, సవనుఁడు, సత్రుం డు వీరందరు పదిమంది. వీరు స్వాయంభువ మనువు పుత్రులు. (104)
ఋషయ ఊచుః-
సూత ఉవాచ :
వారు మిక్కిలి బలవంతులు. వారికి వాయువేగము కలదు. ప్రథమ మన్వంతరములో వారు మహాసత్త్వ వంతులయిన రాజులు. (105) అసురులతో, యోగ్య గంధర్వులతో యక్షో గణ రాక్షసులతో, పిశాచ మనుష్య గణములతో, సుపర్ణులతో, అప్సరోగణములతో గూడియున్న యా వంశమును (జాతిని) ఒక క్రమములో వర్ణించుటకు శత సంవత్సరములయినను చాలవు. వారి సామధేయములసంఖ్యాకములు. అందుచే హారి జాతీకి పరిమితి యెందున్నది. (107) ఆ ప్రజలు స్వాయంభువ మన్వంతర యుగమున నుండిరి. యుగములు, సంవత్సరములు, కొలక్రమమున సెన్నియో గతించిపోయినవీ. (108)
ఋషులిట్ను అడీగిరి :
మీరు 'కాలు'డను చున్నారే భగవత్స్వరూపుఁడయిన ఆ కాలుండేవఁడు? సర్వభూతాప హారకుఁడయిన యితఁడెదఁడు? ఆతని జన్న స్థానమెయ్యిది? ఆతనికాదీయెద్ది? ఆతని తత్వమెట్టిది? ఆతని యాత్మయెట్టిది? (109) ఆతని చక్షువేది? ఆతని స్వరూపమెట్టిది? అతని యవయివము లెట్టివిగా స్మరింపఁబడుచున్నవి? ఆతని నామధేయమొద్ది? ఆతని ఆత్మయెట్టిది? తత్త్వత వీనిని చెప్పుగోరెదము.
సూతుడిట్లు పలికెను :
'కాలము” యొక్క సద్భావము నాలకింపుఁడు. విని తరువాత మనస్సున జ్ఞాపక ముంచుకొనుఁడు. సూర్యుఁడాతని జన్మస్థానము. యోని. కనురెప్పపాటు కాల వ్యవధి ఆతఁడు పుట్టినది. ఆతనిని “సంఖ్యాచక్షువందురు. (ఆతని కెన్నియో కన్నులున్న వనచ్చును. ) (111) దీవానిశలాతని శరీరమూర్తి. నిమేషములాతని యవయవములు. సంవత్సరమాతని సారము (తత్త్వము}; ఆతని నామము “కళాత్మకుఁడు' (ఆతని యాత్మయే సంఖ్యా స్థానము) (112) అతడు ప్రజాపతి. ఆతని ప్రజలు, భూత, వర్తమాన, భవిష్యత్కాలములు. ఈకాలావస్థ యైదు విధములుగా విభజింపం బడినది.
దీవసము, అర్దమాసము (పక్షము), మాసము, ఋతువు, అయసము - మొదటిది సంవత్సరము; రెండవది పరివత్సరమ. (114) మూఁడవదీ ఇడ్వత్సరము; నాల్గవది అనువత్సరము. దానిలో ఐదవది వత్సరము. ఆ కాలము {యుగము కాలపు రెండును ఒకటయే. కాల, యుగములు పర్యాయపదములు. ఆ కాలము ఐదేసియేండ్లతో కూడినది. అయ్యవి క్రమముగా, సంవత్సరము, (2) పరివత్సరము (3) ఇవత్సరము {4) అనువత్సరము; 5 వత్సరము. ఈ క్రింది శ్లోకములు - క్రతు - అగ్ని, {2) సూర్యదేవ, (3) సోమ లేక చంద్ర దేష (పితృవర్గముతో) (4) వాయుదేవ 5. రుద్ర యుగముగా పిలువబడినది. (కాలమునకే యుగమని పేరు వారి తత్త్వమును చేపెలమ. కీర్తింపబడగా గ్రహించామని, ఏది క్రతువు, అగ్నిగా చెప్పబడినదో ఆయ్యది సంవత్సరముగా పరిగణించబడినది. (116) ఆదితేయుఁడు (ఇదిశీకుమారుఁడు) అయిన ఈ సూర్యుడు, కాలాగ్నీ కలిసి పరివత్సరము. ఈ చంద్రుఁడు శుక్లకృష్ణ పక్షముల ద్వివిధ గతంలు కలిగినను, ఆతఁడు ఆసాంసారః (నీటి యొక్క సారము) (117) ఇది ఇడోవత్సరమని పురాణముల నిశ్చయింపఁబడినది. ఇతఁడు (చంద్రుఁడు) సప్తసప్తభిః తనుభిః 49 తనువులతో లోకములను పవిత్రీకరించును. ఇంక లోకమునను అనుకూలముగా వీచు వాయువు - అనువత్సర సంజ్ఞకము. (118) ఆతఁడు బ్రహ్మయొక్క అహంకారము వలన 'ఉదగ్రుద్ర'గా పుట్టెను. నీలలోహితుఁడయిన రుద్రుఁడు “వత్సర"ముగా తెలిసికొనదగినవాఁడు. ఆతనియొక్క తత్త్వమును యథార్థ శక్తిని వర్ణించెదను. కీర్తింపఁబడగా ,దానీ నెలలుంగుఁడు. (120) అంగప్రత్యంగ సంయోగమున కాలాత్ముఁడు ప్రపితామహుఁడు, ఆతఁడు ప్రభువు ఋక్సొమయజుర్వేదములకు జన్మస్థానము. ఆతఁడే దీవసము, అర్థమాసాది పంచవిభాగములకు ప్రభువు. (121) అతడు, అగ్ని,యమ, కాల, సంభూతి, ప్రజాపతి. ఆతఁడే సూర్యయోని. దానినే బుద్ధిమంతులు సంవత్సరమందురు.
సూర్యుఁడు పరివత్సరముగా గ్రహింపవలయును. ఆతఁడే కాల విభాగములయిన మాసములకు, ఋతువులకు, ఉత్తరాయణ దక్షిణాయన ద్వయమునకు, గ్రహములకు, నక్షత్రములకు, శీతోష్ణములకు, వర్షమునకు, ఆయుః కర్మలయిన పవిత్ర కలాపములకు జన్మస్థానము. (యోని}; భాస్కరుఁడు ప్రవిభాగములకు, దివసములకు జనుః స్థానము, ఆతఁడు వైకారికుఁడు : ప్రసన్నాత్ముఁడు; బ్రహ్మ పుత్రుఁడు, ప్రజాపతి. (124) (ప్రజారక్షకుఁడు}; ఆతఁడు ఒక్కడు (ఏకః); నిజమునను ఒకవిధముగా చెప్పిన ఒక్కడే కాఁడు; ఆతఁడు - దీవసము, మాసము, ఋతువు అంతియేకాదు ఆతఁడు పితామహుఁడు. ఆతఁడు ఆదిత్యుఁడు, సవిత, భానువు, జీవనుఁడు (ప్రాణకారుఁడు) బ్రహ్మచే సత్కృతుఁడు; ఆతఁడే ప్రభువుఁడు (జన్మమునకు (భవమునకు) కారకుఁడు; అవ్యయుఁడు (అవ్యయుఁడు - ప్రళయాంతమున నాతనీ యందు నన్నియును లయమొందువాఁడు). అందుచే భాస్కరుఁడు తారాభీమాని; ఆతనినే ద్వితీయ పరివత్సరునీగా నెఱుంగవలయును. (126) సోముఁడు (చంద్రుం డు) సర్వోషధిపతి; అందుచే నాతండు పితామహుఁడు; ఆతఁడే సర్వభూతముల జీవితమునకు ఆధారుఁడు (ఆజీవుండు}; ఆతఁడీశ్వరుఁడు. అందుచే అప్రాప్త విషయమును ప్రాప్తించుట యను యోగమును, ప్రాప్తమయిన దానిని రక్షించుట యను క్షేమమును సమకూర్చునట్టివాఁడు. (127) ఆతఁడెల్లప్పుడీ విశ్వమును పర్యవేక్షించుచు స్వకీరణములచే రక్షించి భరించును; ఆతఁడు తిథులకు, పర్వములకు, పర్వసంధులకు, పూర్ణిమలకు, అమావాస్యలకు కారణుడు; ఆతఁడు రాత్రిని కలిగించును; అందుచే నతఁడు నిశాకరుండు; అమృతాత్ముఁడు, ప్రజాపతి. ఈ కారణములచే సోముఁడు పితృమంతుఁడు (పితృదేవతాత్మకుఁడు; అందుచే నతనిని ఇడ్వత్సరునీగా స్కరీంతురు. (129) ఇంక వాయువు అనువత్సరుఁడు : ఏలయన - ఆతఁడు ప్రపంచ మందలి సర్వప్రాణులకు, ప్రాణాపాన సమానవ్యానోదానాదులచే జరుగు కర్మలచే సర్వశేషా ప్రవర్తకుఁడు. అతఁడు పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, స్మృతి.
బలము, మున్నగు సమాన కాలక్రియలను సంపాదించును. (భౌతిక శరీర సంబంధ కార్య కలాపములతని వలననే కలుగును). (151) అతఁడు సర్వాత్ముఁడు. “ఆహవ ప్రవహాదులచే నతఁడు సర్వలోకేశుఁడు; లోకోపకారములయిన సప్తసప్త (అనఁగా నలుబది తొమ్మిది) మరుత్తుల ద్వారా ప్రవర్తించును. (132) ఆ వాయువు సర్వభూతములకు విధాత, ఆతఁడే సర్వభూత క్షేమము సమకూర్చువాఁడు; నిత్యుఁడు; ఆతఁడే ప్రభంజనుఁడు (విజృంభించిన వాయువు}; ఆతఁడే అగ్నియొక్క నీటి యొక్క భూమియొక్క సూర్యునియొక్క చంద్రునియొక్క ప్రభవస్థానము. (133) ఆ పాయువే ప్రజాపతి; లోకాత్ముడు; ఆతఁడే ప్రపితామహుఁడు; ఆతఁడే రాత్రింబవళ్లను కలిగించును; అందుచే ఆ వాయువు దేవత అనువత్సరుఁడు. (134) ఈ నాలుగు, అనఁగా కాలము, సూర్యుఁడు, చంద్రుఁడు, వాయుదేవత) ప్రజాధిపతులు, వారందరు ఉపపక్షజులు. (బ్రహ్మ పార్వము నుండి పుట్టినవారు. వారే సర్వలోకములకు పితరులు. అందుచే వారు లోకాత్ములుగా కీర్తింపఁబడిరి. (155) ధ్యాన మగ్నుం డయిన బ్రహ్మ ముఖము నుండి ఏడ్చుచుబుట్టినవాడు, ఆ భవుఁడు, వేదములయందు, ఋషి, విప్రుఁడు, భూతాత్ముఁడు, పీతామహుఁడు, మహాదేవుఁడు, సర్వభూతములకు ఈశ్వరుండు, ప్రణవము (ఓం) చెప్పబడినాఁడు. ఆపరమేశ్వరుని ఆత్మావేశము వలననే (భూతములలో ప్రవేశించుటకతమున) భూతములకు అంగప్రత్యంగములు కలిగినాయి. (157) ఉన్మాదకుఁడు, అనుగ్రహకారకుఁడు అయిన రుద్రుఁడు వత్సరమని చెప్పబడుచున్నాడు. సూర్యుడు, చంద్రుఁడు, అగ్నీ, వాయువు, రుద్రుఁడు - అందరు యుగముతో అద్వైత భావమును పొందినవారు; కాలాత్ముం డయిన రుద్రుఁడు, నిత్యము లయకారణుఁడు. భగవానుఁడయిన రుద్రుఁడు స్వతేజస్సుచే జగత్తునందు ప్రవేశించెను. (139) శరీరముతో, నామధేయములతోడి సంబంధము గలిగిన ఆత్మయొక్క ఆశ్రయబలముచే ఆ ఈశ్వరుఁడీ జగత్తునంతను ప్రవేశించును. (140)
స్వీయ తేజస్సుచే నతనికి దేవతల యొక్క పితరుల యొక్క కాలము యొక్క యున్నత స్థితి కలదు. ఈ టౌన్నత్య స్థానమున నతఁడు జగత్తును ఆశీర్వదించును. అయ్యది యున్నతమయినది. అందుచే రుద్రుఁడు రుద్రునెటింగీత విద్వాంసులచే నెల్లపుడును పూజింపబడును. (141) తత్ర్పభువు ప్రజేశులకు ప్రభువగుటచే, ప్రజాపతి యగుటచే, నతఁడు సర్వభూతములకు సర్వాత్ముఁడు; ఏలయన నీలలోహితుఁడు సర్వాత్మకుఁడు కాన. రుద్రుఁడు క్షీణములై కాంతి హీనములయిన ఓషధులను పునః పునః పునరుజ్జీవింపఁజేయును, ఓషధులు క్షీణించునపుడు, ప్రజాపతి పురస్సరులై దేవతలు ఆతని పూజింతురు. తమకు కావలసిన ఇష్టములయిన ఫలములను వారు కోరుదురు. పురోడాశమును కపాల త్రయములోనుంచి యాతఁడు పూజింపఁబడును. దానినే త్ర్యంబకములందురు. తత్ర్పభువు. త్ర్యంబకుఁడని చెప్పఁబడుచున్నాఁడు, (144) వేదమంత్ర ప్రాయమయిన గాయత్రి, త్రిష్టుప్జగతీ ఛందస్సులు త్ర్యంబక నామము వలన స్మరింపఁబడును. ప్రేమచే నయ్యవి వనస్పతి రాజ్యమునకు ఆధార స్థానములు. ప్రభవ స్థానములు. (145) త్రివిధములయిన వేదచ్ఛందములచే పునశ్చరణముచే పురోడాశము ఒక్కటిగా సంయోజితము చేయబడుటచే నది త్రికపాలమయినది. ఏలయన - దానికి విధానత్రయము కలదు; వాని వీర్యముచే నవి త్రివిధములుగా ప్రతిష్ఠితము. (146) అందుచే పురోడాశము త్ర్యంబకము. అందుచేతనే రుద్రుఁడు త్ర్యంబకుఁడుగా వక్కాణింపఁబడినాడు. ఈ విధముగా ఐదు సంవత్సరములతో కూడిన దానికి యుగమని పండితులు వ్యవహరించినారు. (147)
ఏయది పంచవిధములుగా పండితులచే చెప్పబడినదో అదీ సంవత్సరము. ఈ పంచ విధములుగా చెప్పఁబడినదానిని వసంతాది షడృతువులుగా గ్రహింపవలెను. (148) ఐదు ఆర్తవములు ఋతువుల బిడ్డలు ఈ విధముగా కాల సృష్టి సంక్షిప్తముగా వ్యాఖ్యానింపఁబడినది. ఈ వీధముగా వేడొక దానితో సంసక్తము కాని కాలము అనంత మానములతో (కొలతలతో) నొప్పి, ప్రాణులయొక్క జీవితములను, అపహరించుచు, సంహరించుచు, తొందరగా సాగక ప్రవహించిపోవు నదీ జలముల వోలె పరువెత్తును. (149) వీనియొక్క సంతానము సప్రమాణముగా వివరించుటకు తత్పుత్ర పౌత్రకముల సంఖ్య అనంతము. ప్రజాప్రభవులు, మహాపుణ్యకర్ములు పుణ్యకీర్తిమంతులునయిన వీరి వంశము యొక్క కీర్తనము వలన, జనులు గొప్ప సిద్ధిని పొందుదురు గాక,
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున పూర్వభాగమందు ద్వితీయానుషంగ పాదమున కాలసద్భావ వర్ణనమను త్రయోదశాధ్యాయము సమాప్తము.
