1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము

Table of Contents

4 - లోకకల్పనము

సూత ఉవాచ :-

సూతుఁడిట్లు పలికెను :

అవ్యక్తమయిన వస్తువు తనలో వెల్లుచుండగా ఫలితము (ప్రపంచము) ఉపసంహరింపబడగా, సమాన ధర్ములై నిర్మలులై ప్రధాన పురుషు లొప్పుదురు. (1) ప్రధాన పురుషులిరువురు క్రగముగా తమస్సత్త్వగుణోపేతులు. వారు సమభావమున నుందురు. వారుదైక రహితులు; ఒండొరుల ననుసరించి యుండువారు; అని చెప్పబడిరి. (2) గుణములయందు సామ్యముప్పతీల్ల నది లయమనీ యెలుంగ వలయును. గుణద్వయము నందు సామ్యము పోయి ఒకదానికంటే వేతాక దానికాధిక్యము గల్గినచో దానిని సృష్టియందురు. సత్త్వము వృద్ధియందు స్థితి బ్రహ్మయందు ధ్రువముగా గలుగును. (3) తమో గుణమునందు సత్త్వగుణమునందు రజోగుణమును గతమై యుండినది బీజముల యందలి నీటివలె, రజః ప్రవర్తనకమగును. (4)

గుణములు వైషమ్యము నొంద, అందధిక గుణ సంబంధియగు సృష్టియగును. క్షోభ్యమాణములగు గుణములచే మూడుగుణములు కలుగునని యెఱుంగవలెను. (5) ఆ గుణంబులు సర్వశరీరములందుండీ శాశ్వతములు. పరమములు గుహ్యములునై సర్వాత్మనా ప్రతిష్ఠతములై యుండును. సత్త్వనామక గుణాత్ముడు, విష్ణువుగా, ఆత్మభవుఁడయిన బ్రహ్మ రజోగుణనామకుఁడుగా, రుద్రుఁడు తమోగుణాత్మకుడుగా నుందురు. (6) రజః ప్రకాశకుఁడు విష్ణువు బ్రహ్మ స్రష్టయగును; ఆ మహౌజసుఁడయిన బ్రహ్మ నుండీ చిత్రాతి చిత్రమయిన లోకసృష్టి యగును. (?) తమః . ప్రకాశకుఁడగు విష్ణువు కాల గుణము ననుసరించి వ్యవస్థితుఁడు కాగా, సత్త్వ ప్రకాశకుడయిన విష్ణువు స్థితిత్వ లక్షణ వ్యవస్థితుడగును. (8) వీరలే (విషుబ్రహ్మరుద్రులె) త్రిలోకములు, వీరే గుణత్రయము; వీరే వేదత్రయము; వీరే అగ్నీత్రయము. (9) వీరు మువ్వురు పరస్పరము సమన్వయులు, పరస్పరము ననుసరించి చేయు వ్రతారంభులు, పరస్పరాను వర్తనులు, పరస్పరము వీరే ప్రేరేపించుకు ఎదరు, (10) వీరు విడివడక కలిసియుందురు. పరస్పర మొకరొకరిపై నాధారపడి జీవించువారు, వీరికి నొక్క క్షణకాలమయిన వీయోగము లేదు. ఒండొరులను వీరు వీడిచి యుండరు. (11) సృష్టికాలమున ప్రధానముగా నీ త్రిగుణములు పరస్పర వైషమ్యాలు గలిగినట్టులుండును, మొదట నదృష్టుండగు విరాట్పురుషుని యందు అధిష్ఠితములగుట నీ త్రిగుణరూపులగు త్రిమూర్తులు సదసదాత్మకులయిరి. (12) బ్రహ్మ బుద్దీ తత్త్వమను నీ జంట యేక కాలంబున సుద్భూతము లయ్యెను. అందుచే నీవ్యక్తము తమోమయంబనియు, క్షేత్రజుఁడు బ్రహ్మ సంజ్ఞుండనియు చెప్పబడును. (13) సంసిద్ధ కార్యకరణంబున బ్రహ్మ ప్రధానుడగును. తేజస్సుచే నప్రతిముఁడు ధీమంతుఁడగు వ్యక్తుఁడయ్యెను.

ఆతఁడే ప్రథమతః శరీరము కలవాఁడు - ధారణత్వ వ్యవస్థితుఁడగుట వలన; ఆతఁడప్రతీమానమైన జ్ఞానము చేతను, వైరాగ్యము చేతను సత్ర్పభువు. (15) త్రిగుణములు స్వవశీకృతములై యుండుటవలన, అవి యన్యోన్య సాపేక్షము లగుట వలన, అవ్యక్తిత్వ కలితుఁడయిన యీతఁడు భావమందేమేమి మనసా యభిలషించునో వానీ నేల్ల చేయును. (16) అతఁడే. బ్రహ్మత్వమున చతుర్ముఖాఖ్యుండు, కొలత్వమున (కాలవశముచే) విలయ కరుఁడగు రుద్రుఁడు, మరియు సహస్ర శీర్పుఁడయిన పురుషుఁడుగా జైలంగును. ఇయ్యవి స్వయంభువునకు కలిగిన యవస్థాత్రయము. (17) బ్రహ్మాత్వమున రజోగుణమున, రుద్రత్వమున రజస్తమో గుణముల, విష్ణుత్వమున సత్త్వగుణమున, స్వయంభువుఁడు గుణవృత్త కలితుఁడగును, (18) బ్రహ్మత్వమున నితఁడు లోకమును సృజించును; రుద్రత్వమున లోకములను సంక్షయము చేయును; పురుషత్వమునఁ విష్ణుత్వమున) ఉదాసీనుఁడై యుండును. ఈ మూఁడు స్వయంభువుని యొక్క అవస్థాత్రయము. (19) బ్రహ్మ కమలపత్రభవుఁ డు, కాలుఁడు కాలాంజన సమాన కాంతి నోప్పు పురుషుఁడు; పుండరీకాక్షుఁడు రూపమున పరమాత్మ స్వరూపుడు. (20) వీరలతో నాతఁడేక రూపుడగును; ద్వీవిధ రూపుడై యొప్పును; త్రివిధరూపుడుసునగు; యోగీశ్వరుడయిన పురుషుఁడు వివిధ వికారములు గలిగిన శరీరములను చేయును. (21) ఆతఁడు స్వలీలచే సానో కృతిక్రియా రూపముల నాశ్రయించును, అతఁడు మువ్విధములుగా లోకమున ప్రవర్తించుటచే త్రిగుణుఁడని చెప్పబడును. (22) అతఁడు నాల్లు విధముల విభక్తుఁడై యుండినందున చతుర్వ్యూహుఁడని కీర్తింపబడెను. (వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ద, సంకర్షణములను నవి చతుర్వ్యూహములు). అతఁడు నిద్రించుచు, అదృశ్యుండగును; విషయంబుల భుజించు వారందరు తనయందుండు కారణములచే నాతడాత్మ మనంబడును. ఋషియనియు, సర్వగతుండనియు, ప్రభుఁడనియు నాతఁడే చెప్పబడును. (24)

ఎల్లయెడల ప్రభువగుటచే స్వామి; సర్వమందు ప్రవేశించి యుండుటచే విష్ణువు; షాఢుణ్యయుతుడగుట భగవానుఁడు; అచలుడగుట నాగుడు; నాగాశ్రయుఁడగుట నాగుడు; (25) సంప్రహృష్ణుఁడై యుండుట వలన పరముఁడు; దేవతలకాద్యుఁడగుట ఓం; సర్వము నెంగి యుండుటచే సర్వజ్ఞుడు, సర్వమును వ్యాపించి యుండుటచే సర్వుఁడు. (26) నరములు నీరములు, నీరములయందు శయనించుటచే ఆ పరమాత్మ నారాయణుఁడు; తన్ను త్రిధా విభజించి సకలమందు ప్రవర్తించును. (27) ఆ త్రీమూర్తిత్వమున సర్వమును సృజించును, లయింప జేయును, స్వయముగా పాలించును; అట్టిడు మొట్టమొదట హిరణ్యగర్భుడుగా స్వయముగా నా పరుఁడయిన ప్రభువు ఆవిర్భవించెను. (28) స్వవశుఁడై యున్నందున నాద్యుఁడగుట ఆద్యుఁడు; పుట్టని వాడగుట అజుడని యందురు. అందుచేతనే హిరణ్యగర్భుడని పురాణములు చెప్పు చున్నవి. (29) సృష్టి విముఖుఁడగు పరబ్రహ్మము మరల సృష్ట్యున్ముఖుడగును. తన్మధ్యకాల మింతయని చెప్పనలవికాదు. మను వర్షశతంబులయినను చాలవు. (30) కల్ప సంఖ్యానివృత్తిపర్యంతమగు కాలము పరార్ధమని చెప్పబడును. అట్టి పరార్ధంబులు రెండు చతుర్ముఖుని ఆయుష్కాలమున గతించును. (31) కోటి వర్ష సహస్రములు, గృహ భూతాదులు కల్పములు గతించునవి. చతుర్ముఖునియందు (ఒక పరార్థము గడిచి) ద్వితీయ పరార్దము వర్తమానమైయుండె. (32) అతఁడు స్వయముగా నుండు కల్పమునకు వారాహ సంజ్ఞకమని యెఱుంగునది. (33) యుగ సహస్రములు పూర్ణము కాగా భూమి నరేశ్వరపరిపాల్యంబై యుండును.

ఇది వాయుప్రోక్త బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ప్రథమ ప్రక్రియా పదమున లోకకల్పనమను చతుర్థాధ్యాయము సమాప్తము.