1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
18 - జంబూద్వీపవర్ణనము
సూత ఉవాచ :-
సూతుఁడిట్లు చెప్పెను :-
హిమాలయ పృష్ఠ భాగమున మధ్యమున కైలాసమును నొక పర్వతము కలదు. అందు శ్రీమంతుఁడగు కుబేరుడు రాక్షసులతో సహితము నివసించుచుండును? అలకాధిపుడయిన రాజు అప్సరోనుచరుఁడై అందు సుఖించును. కైలాస పాదము నుండి పుట్టినది, పుణ్యము, శీతము, శుభమునయిన జలములతో గూడినది, 'మద' మనెడి పేరితో నొప్పు నోక సరస్సు కలదు. అందు కలువలు విలసిల్లును. అయ్యది సముద్ర సన్నిభము. అందుండి పవిత్రమయిన మందాకినీ నదీ సముత్పన్నమయినది. ఆ నదీ తీరమున దివ్యము నందనవనమను మహద్వనము కలదు. కైలాసమునకు ఈశాన్య భాగముగా, సర్వోషధులతో నిండిన యొక దివ్య పర్వతమునకు ఎదురుగా, విచిత్రము, రత్నథాతుమయము, సబలము సయిన యొక పర్వతము కలదు. దీని సోమము చంద్రప్రభము. అయ్యది సుశుభ్రము, రత్నసన్నిభము. (6) ఆ పర్వత ప్రాదమున స్వచోదమను మహాదివ్య సరము కలదు. ఆ దివ్య సరము నుండి స్వచ్చోదమను నామము గల నదీ ప్రభవించినది. [6) ఆ నదీ తీరమున ఒక మహాదివ్య వనము. అదీ పవిత్రము. దాని నామము చైత్ర రథము. ఆ పర్వతమునందు మణిభద్రుండు అనుజ సహితుడై నివసించుచుండును. [7) ఆతం డు యక్షుల సేనాపతి. పరమక్రూరుఁడు; గుహ్యకులతో పరీవృతుండై యుండును. పవిత్ర నదులయిన మందాకినీ, స్వచ్చోదకము, మహీమండల మధ్యమునుండి ప్రవహించి సముద్రమును ప్రవేశించును. (8) కైలాసమునకు ఆగ్నేయము ఓషధులతో నిండియున్న పర్వతమునకు ముందున, మనళ్ళిలామయమయిన చిత్రాంగమను పర్వతమునకభిముఖముగా సూర్యప్రభమను మహా పర్వతము కలదు. అదీ లోహిత వర్ణము కలది; దానికి బంగారు శిఖరములు కలవు. (10)
ఆ సూర్యప్రభమనెడి పర్వతపాదమున మహర్షివ్యమయిన లోహితమను పేర సరస్సు కలదు. అందుండి పవిత్రమయిన “లోహిత్య” మను నది ప్రభవించినది. (11) ఆ లౌహిత్యనదీతీరమున ఒక మహాషనము. అది దేవారణ్యము; శోకరహితమయినది; పర్వతమునందు యక్షుఁడు, వయునైన మణీధరుఁడు నివసించును. (12) ఆతఁడు గుహ్యకులచే పదివకుండు. ఆ గుహ్యకులు సౌమ్యులు, ధర్మపరులు. కైలాసమునకు దక్షిణదిక్కున, ఓషధులతోను క్రూర సత్వములతోను గూడియున్న యొక పర్వతము కలదు (13) మూందు శిఖరములు గలది, వృత్రాసురుని కాయము నుండి సముత్పన్నమయినదీ, సర్వధాతనయమయినది, గొప్పనైనదియునగు బ్రద్యుతమునం గీటి కజదు. (14) దాని పాదమున సిద్ధ సేవితము, పుణ్యము, నయిన మానసమను సరస్సు కలడు. దాని నుండి పుణ్యము, లోకవినతుతము నవసరయూనది పుట్టుచున్నది. (15) ఆ సరయూ తీరమున దీష్యము, విశ్రుతము నయిన ప్రభాజమను పేర. వోక వనము కలదు. అందు ప్రహేతి తనయుడు, వశి, కుబేరాసుచరుఁడు, అనంత విక్రముడు, బ్రహ్మోపేతుఁడయిన రాక్షసుఁడు కలడు, ఆకాశమున సంచరించునట్టివారు, ఆతీఘారులు, రాక్షసులు నయిన నూరు మందితో పరివృతుండై యతఁడుండును. (17) కైలాసమునకు పశ్చిమముగా, ఓషధులతో పుణ్యసత్వసంతతితో నిండియున్న యొక పర్వతము కలదు. దానిపేరు ‘అరుణ’ పర్వతము. అది పర్వత శ్రేష్ఠము, రత్నధాతుమయము; పవిత్రము. (18) ఈ శ్రీమత్పర్వతము మేఘసన్నిభము. భవునికి చాల ప్రియసంచారయోగ్యమైనది. అయ్యది బంగారుతో నిండిన (శాతకుంభమయములైన) శిలాజాలములతో కూడినట్టిది. అందు నూరు శిఖరములు. అవి సువర్ణ వికారములు; ఆకాశమును తాకునట్టివి. అయ్యది హిమాతృవతమగుట ఆరోహించుటకు లేదా దాటుటకు మిక్కిలి కష్టమైనది.
ఆ పర్వతమునందు గిరీశుఁడు ధూమ్రలోచనుడు నివసించును. ఆతని పాదములనుండి శైలోదమనెడు సరస్సు ప్రభవించినది. దాని నుండి ‘శిలోధ’ మనెడు నధీయుదయించినది. ఇది పుణ్యమైనది. ఆయ్యది సీత, చక్షువులనేడు నదుల మధ్య నుండి లవడోదధినీ ప్రవేశించెను. (22) ఆ నదీ తీరమందు ‘సురభి’ అనెడు విశ్రుతము దీవ్యము నయిన వనము కలదు. కైలాస పర్వతమునకు కుడిప్రక్కన, ఉత్తరమునందు ఓషధులతోను, జంతువులతోను నిండిన యొక పవిత్రమయిన పర్వతము కలదు. (23) గీధిశ్రేష్టమయిన ‘గౌర’ మను పర్వతమునకు ముందు హరితాలమయమయిన ‘హిరణ్మయి’ పర్వతము కలదు. తచ్చంగములు హిరణ్మయములు. అయ్యది దీవ్యమణిమయము. (24) ఆ పర్వత పౌద ప్రదేశమున శుభంకరమైనదీ, బంగారు ఇసుకతో కూడినదియునగు ‘బిందుసర’ మును రమ్యమయిన సదస్సు. అచ్చటనే భగీరథ మహారాజు తపమాచరించెను. (25) గంగా నిమిత్తమా మహాతాజుచ్చట పెక్కు సంవత్సరములుండెను. గంగా తోయములచే పరిస్థుతులయి (తడిసి) మా పితరులు స్వర్గము నొందుదురు అని యతఁడు కుటిలాలేను. ఇట్లు నిశ్చయించి శివునియందు సమాహిత మనస్కుడై అచ్చట తపస్సు చేసెను. అచ్చటనే త్రిపథరైన గంగాదేవిని మొట్టమొదటసాత్యడు ప్రతిష్ఠ చేసెను. సోమ పాదము నుండి పుట్టి యానది ఏడు పాయలుగా ప్రవహించెను. అచ్చట మణిస్థగితములయిన హిరణ్మయయూపములు ఘడియుండెను. అందు శక్రుఁడు ఇంద్రుఁడు సర్వదేవతలతో సహా యజ్ఞ మాచరించి సిద్ధిని పొందెను. (28) ఆకాశమున ఛాయాపథము సప్తరిమండలము పాలపుంతగా త్రిషథయయిన గంగానది రాత్రులందు భాస్వరముగా కనంబడును. (29) అంతరిక్షమును దీవమును పవిత్రీకరించుచు, సురాపగమైన గంగానది, భవుని శ్రీరమున పడెను. యోగమాయచే నది సంరుద్ధమయ్యెను. ముందు వెనుకలకు ప్రయాణింషలేకపోయెను. (30)
సంక్రుద్ధురాలయినవ్యోమగండముండి భూమికి జారిపడిన బిందువులు ఒక సరస్సు ఆయెను అదియే బిందు సరముగా ప్రసిద్ధము. (31) చిరునవ్వుల వెలయించు భవునిచే నావ్యోమగంగ నిరుద్ధమైనది. శంకరుని విసరి పారవేయవలయునని యది ఆలోచించెను. (32) ప్రవాహ వేగముతో శంకరుని గ్రహించుకొనిపోయి, పాతాళమును ఛేదించుకొని ప్రవేశించెదను అనుకొనెను. క్రూరమయిన ఆ గంగాదేవి యొక్క అభిప్రాయమును తెలిసికొని, ఆ నదిని తన యంగముల యందు అంతర్పితే మొనరింపవలెనను బుద్ది ఈశ్వరునికి పౌడమేను. ఆమె గర్వము నెఱింగి ఈశ్వరుఁడు క్రుద్ధుఁడయ్యెను. (34) అత్యంత వేగమతో భూమిపై పడనున్న ఆ నదినోతప శిరస్సున బంధించేను అంతలో శివుడు తన పురోభాగమున క్షీణించిన రక్త ధమనులతో, క్షుద్బోధచే వ్యాకులీకృతేంద్రియుడయిరోజున భగీరథమిచూచెను. ఈతనితో నేను సంతోషింపఁబడితిని; ఇతఁడు పూర్వమందేనది కొక్కు నన్ను పూజించినాఁడ్కుఆతనికి బ్రహ్మ యొసంగిన వర్ణదానమును జ్ఞప్తికిరాగా, తన కోపమును నియమించుకోనెను, “స్వర్ణదీయైన గంగను ధరించుము”. అను బ్రహ్మవచుస్సులు వినెను. తరువాత భగీరథుని ఉగ్రతపస్సునకు సంతుష్టుడై, శివుడు స్వతేజస్సుచే సంరుద్దయయిన గంగను భగీరథునికాకు వదలేను. (37,38) విసర్జింపఁబడిన యీ నది సప్త స్రోతస్సులుగా ప్రవహించేను. మూఁడు ప్రవాహములు తూర్పునకు, మరి మూడు పశ్చిమమునకు ప్రవహించెను. ఇటు గంగానది సప్తస్రోతస్సులుగా ప్రవహించేను. నళినీ హోదినీ, పావనీ అనునట్టివి తూర్పుగా ప్రవహించెను.
సీత, చక్షువు, సింధువు - అను మూఁడు ప్రోతస్సులు పడమటి దిక్కుగా ప్రవహించేను. ఇంక ఏడవదియైన గంగా ప్రవాహము భగీరథుని ననుసరించి దక్షిణముగా ప్రవహించెను. అందుచే నది భాగీరథి. అదీ (41) సముద్రమును ప్రవేశించెను. (కలిసెను). ఈ సప్తంగా ప్రోతస్సులు పొమ మను వర్షమును (దేశమును) పవిత్రీకరించుచున్నవి. (42) శుభవంతములయిన, యీ సప్తనదులు, బిందు సరోవర సముద్భూతములై మ్లేచ్చప్రాయములైన నానాదేశములను పవిత్రముజేయుచునంతటను బ్రవహించెను. అందుండి ఆ నదులు పాసవుడు వర్షించు, శిలీంధ్ర, కుంతల, బర్బర, చీన, యవన, అంధక, పుష్కర, కులింగ, అంచోల, ద్వీచర మున్నగు దేశములు చేరెను. తరువాత సింహావద్దేశమును మూఁడు భాగములు చేసి, సీత అను ప్రోతస్సు పశ్చిమ సముద్రమును చేరెను. తరువాత చక్షువు నది, చీనమరువులు, తోలములు (45) చమ మూలికలు, భద్రము, తుషారము, లాచ్యూక్రములు, పరాటములు; ఇశలు: అనుచేశములలో ప్రవహించెను. (46) ఆ జనపదములలో ప్రవహించి చక్షువునది సముద్రమును చేరెను. సింధుషది థరధదేశము, కాశ్మీరములగుండా గాంధరము, దౌరసము, కుహము, శివములు, ఇంద్రపదములు, వసతి, విసర్జవంతము సైంధవము, రంధ్రకరకము, శ్రమఠము, ఆభీరము, రోహకము, శునాముఖము, అర్ధముఖము మున్నగు దేశములలో ప్రవహించెను. (49) గంగ ఈ క్రింది ప్రశస్తములయిన దేశములలో ప్రవహించి వానిని పవిత్రీకరించు చున్నది. ఆ దేశములు గంధర్వదేశము, కిన్నరదేశము, యక్షరాక్షస, విద్యాధర, ఉరగ, దేశములు కాలపగ్రామవాసులను, పారదులను, తద్దడమలను, ఖశులను కిరాతులను, పులిందులను, కురువులను, భరతులను.
“పాంచాలులను, కాశీలను, మత్యులను, మగడులను, ఆంగదేశీరికలను, న్ముత్తులను కింగదేశీయతను, తోమరితను గంగ పవిత్రీకరించుచు పారెను. తరువాత గంగ వింధ్య, షడ్వికతులచే నడ్డబడి లక్షణ సముద్రమునుబేరైనుగడ తరువాత పుణ్యప్రదమైన్య హోదినీ, నది ప్రాచీముఖముగా ప్రవహించి, నైషధ దేశమును, త్రిగర్త దేశమును, ధీవర దేశమును ఋషిక దేశమును, వీల్లముఖ దేశమును, కేకర దేశమును, ఇష్టకర్ణ దేశమును, కిరాత దేశమును, కాలోదర దేశములను, వివర్ణ దేశమును కుమార దేశమును స్వర్ణ భూమక దేశమును, నీటితో ముంచేత్తి ప్రవహించి సముద్రమండలమువలకు నది ప్రవహించేరు. తరువాత వచనీ నదీ-తూర్పు దిశగా ప్రవహించేను: అయ్యది సుపథ దేశమును, వరదలతో నింపెను. ఇంద్రద్యుమ్న సరోవరమును నింపేనూ ఖరళతదేశము వేత్రశంకుమత దేశములను చైనీటితో ముంచెత్తాను “జానకి! మధ్యనుండి కుథప్రావరణదేశమును క్రిందుత్రా నీటితోషింపుడు ఫ్రెషష్ఠించెనను:అయ్యది. ఇంద్రదీప. శమీపమున భజేదధిలో కలిపెను. ప్రతినదీ పార్టీ దిశనంటి మిక్కిలి జవముతో(57) ప్రవహించెను. అయ్యది తోమరదేశమును, హంసమార్గ దేశమును హైహయ దేశముమ, పచిత్రీకరించుచు ప్రవహ్లించెను. బహుపర్వతముల ఇహువిధములఛేదించుచు నది పూర్వదేశములల్లో ప్రవహించెను. కర్ణ ప్రావరణ ప్రరతములతో మాడిన మరుభూమిలో ప్రవహించుచు విద్యాధర దేశముల కేగెను (60)
నగ ముండల మధ్యము నుండి లవణోదధిని ప్రవేశించెను. దానియొక్క నదులు,ఉపనదులు, వందలకొలది యున్నవి ఆచి యన్నియును వాసవుఁడయిన ఇంద్రుడు వర్శీంచు ప్రదేశములందు ప్రవఫ్టించును. వృష్వాకసా స్లదీ తీరమున పరీమళ విశ్రుతమయిన ఒక వనము కలదు. (62) విద్వాంసుఁడు, వశియునైన కౌఖేరకుఁడు (కుబేరపుత్రుఁడు) హిరణ్యశృంగమున నివసించును. ఆతఁడు యజ్ఞముల నాచరించును. మహాత్ముఁడు, అమితాజసుఁడు, సువిక్రముండు. ఆతఁడందే నివసించు పండితులయిన బ్రహ్మ రాక్షసులచే పరివృతుఁడు. కబేరానుయాయులు నలుగురు వీరు నలుగురును సమాన శక్తి సామర్థ్యాదులుకొలచారనీ ప్రతిళ్ళ ఆచ్చటి పళ్వ పస్తులునత సట్టివారే. సమారుల యొకంగవలయును ధర్మముచే అర్ధముచే, ఊదుముచే పరికరోకరికి రెట్టింపు బలవంతులుగ ఊచకూట పర్వతపృష్ణ భోగమునపర్చోవరతమను సరస్సు కలదు: ఓమనస్వినీ జ్యోతీష్మతీ నండువకులు పర్వతమున కర్బవించి శ్రీపర్వతపు టికు పార్వముల నుండి ప్రవహించి తూర్పు పడమరల యేండలి సముద్రములో జేరును(86) పర్వతోత్తమమయన నిషధ పర్వతమున వీర్ణుపదమును పేర సరము కలదు. శుభోది గాంధర్వ సాతుబీచిఅనుంగంబునటులు: పోనిసుండి సమరతన్నపుటడుసరుకై చంద్రప్రభ దినుపేర మేరు పర్వత పార్వభాగమున నొక సరము కలదు. దాని నుండి పుణిక, జిబ్రానదీప్రవహిస్టును జాంబవదము (బంగారము) అందుండియే ప్రాప్తము. ప్రయోదమను సరస్సు నీల పర్వతముపై కలదు. అయ్యది పుండరీకము వలే సుశుభ్రము. పుండరీక పయోదయను రెండు నదులు అందుండి ప్రభవించును. అందు పద్మములు కలవు. శ్వేత పర్వతము నుండి పుణ్యప్రద నదియైన సరయూ ప్రవహించును.
మానస సరోవరము నుండి జ్యోత్స్న మృగకామా అనెడు రెండు నదులు ప్రభవించినవి. కురుదేశములందు రుద్రకాంతమను విఖ్యాత మయిన సరస్సు కలదు. అందు పద్మములు, మత్సములు, నీటి పక్షులు విశేషముగా కలవు. అది భవునిచేత వినిర్మితము. (72) సముద్ర సన్నిభములై మీక్కిలీ లోతైన మరీ పండ్రెండు సరములు కలవు. అయ్యవీ ‘జయ’ అను నామముతో ప్రఖ్యాతములు. అయ్యవి కూడ పద్మ మీన ద్వీజాకులములు. వాని నుండి శాంత, మాధ్వీ అనేడు రెండు నదులు పుట్టినవి. (78) కింపురుష మొదలగు వర్షములందు (దేశముల యందు) భగవంతుఁడు వర్షింపఁడు. కాని నేలను చీల్చుకొని యిచ్చట సరిద్వరములు ప్రవహించును. (74) మూఁడు మహా పర్వతములు కలవు. వాని శాఖలు పూర్వ దిశగా నీటిలో వ్యాప్తములై యున్నవి. అవి మిక్కిలి క్లేశయుత శాఖలు కలవి, అయ్యవీ లవడోదకము లందున్నవి. అవి ఋషభము, దుందుభి మహాపర్వతమయిన ధూమ్రమును. (75) సుమహోన్నత శిఖరములు కలిగిన చంద్రము, కాకము, ద్రోణము అను పర్వతములు ఉత్తర దిశగా వ్యాపించినవి. ఉత్తర దిశ శాంతమున మహానదిలో కలిసిపోయినవి. (76) సోమకము, వరాహము, నారదము, అనుపర్వతములు ప్రతీచీ దీశగా వ్యాపించినవి, లవణోదధిలో కలిసినవీ. (77) మహాపర్వతములయిన చక్రము, వలాహకము, మేనొకము - అనునవి దక్షిణ సముద్రము వరకు వ్యాపించినవి. (78) చక్రమైనాక పర్వతముల మధ్య ఆగ్నేయ భాగమున సంవర్తకమను అగ్నికలదు. అయ్యది నీటిని త్రాగును. ఈ సముద్రాగ్ని ఔర్వమను పేరీతో ప్రఖ్యాతము. దీనికి బాడబము (ఆడగుఱ్ఱము) యొక్క ముఖము కలదు. ఈ ద్వాదశ పర్వతములు మహేంద్రుని వలన పక్షచ్ఛేదభీతీచే సముద్రములో ప్రవేశించినవి. అయ్యదియే చంద్రుని యందు తెల్లని కుందేలు రూపములో గోచరించును. (81)
భారతవర్షము యొక్క భేదములు వర్ణింపఁబడినవి. అయ్యవి తొమ్మిది ఇచ్చట వర్ణింపబడినవి. అన్యత్ర కూడచూడనగును. (82) ఈ తొమ్మిది భారతవర్షములు ఆరోగ్య విషయమున, ఆయుః ప్రమాణ విషయమున, ధర్మ విషయమున, కామార్థ విషయమున, పుణ్యవిషయమున, ఒకదానితో నొకటి పోటీపడుచుండును. అందుండు వ్యక్తులు (భూతములు) పుణ్య సంపద్విశిష్టులు. వివిధములయిన ఉపవర్షముల యందు ఏవిధులయిన జాతులు నివసించుచుందురు. అందుచే నియ్యది యావద్విశ్వము యొక్క స్థితిని వహించి యున్నది.
ఇదీ వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమున పూర్వభాగమున, ద్వీతీయానుషంగ పాదమున జంబూద్వీప వర్ణనమను పదునెన్మిదవ యధ్యాయము.
