1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
21 - ఆదిత్య వ్యూహకీర్తనము
సూర్యసిద్ధాంతము (మండలం) ఆకాశ గ్రహ సంచారములు; కాల విభజనము
సూర్యచంద్రులు ఎంతకాలము భ్రమించు చుందురో, వారి ప్రకాశము చేత వారు వారీ మండలముల నుండి సముచితులు. (పైకి యెత్తబడి యుందురు.) (రవి - శబ్దము సాధారణముగా ‘రు’ అనుధాతువు నుండి పుట్టినది. (ఉణాది) కాని ఇచ్చటి ఆ శబ్దము ‘ఆప్’ రక్షణే నుండి పుట్టి దనుచున్నాఁడు (అప్ ధాతువు రక్షణార్థము) కాంతిమంతమయిన సూర్యచంద్రుల ప్రకాశముచే వ్యావృతమయిన స్థలము యొక్క విస్తీర్ణము, ఏడు సముద్రముల యొక్క సప్త ద్వీపముల యొక్క విస్తీర్ణముతో తుల్యము. భూమియొక్క అర్థభాగమున కాంతి ప్రసరించును. మిగిలిన సగభాగము కాంతి రహితముగ నుండును. సూర్యుడు, చంద్రుఁడు వారు వారికి (ఎదురుగా) అభిముఖముగా నున్న భాగమును ప్రకాశవంతము చేయుదురు. ఆకాశము యొక్క విస్తీర్ణము ప్రమాణము భూమి విస్తీర్ణముతో సమానమయినదనీ భావింపఁబడుచున్నది. (3) సూర్యుఁడు అంతటను పరిభ్రమించుచు మూడు లోకములను ప్రకాశింపఁజేయును. రక్షించును). (4) అందుచే, ప్రకాశ రక్షణ వ్యాపారములచే ఆతఁడు ‘రవి’గా స్మరింపఁబడుచున్నాఁడు. ఇక చంద్ర సూర్యుల యొక్క ప్రమాణమును చెప్పుచున్నారు. ఈ వర్షమునకు మహి (భూమి) అను శబ్దము నీపతీంపఁబడినది. దానికి కారణము దాని మహత్తత్వము. సూర్యునియొక్క మండలము భరతవర్షము యొక్క ‘వ్యాస’ తుల్యముగా స్మరింపఁబడుచున్నది. యోజనమనఁగా 12 కిలో మీటర్లు. అని గ్రహింపవలయును. (6) సూర్యమండలము యొక్క విస్తీర్ణము తొమ్మిదివేల యోజనములు దాని పరిధి యందు చంద్రుఁడు సూర్యుని కంటే రెట్టింపు. ఇక ఇప్పుడు యోజనములతో పృథివీ. ప్రమాణమును చెప్పెదను.(8) సప్తద్వీప సముద్రములు గలిగిన భూమి యొక్క విస్తీర్ణము, పరిధి, పురాణములలో నిజ పరిమాణములతో చెప్పబడినది. (9) ప్రస్తుతాభిమానులను పేర్కొనిన పిమ్మట దానిని గూర్చి చెప్పెదను. అభిమానులు - దేవతలు; ఆయా వర్షముల కధ్యక్షులు. లేదా ఆయా ప్రదేశముల కధిపతులు. గతించిన యభిమానులు ప్రస్తుతాభిమానులతో సరియైనవారు. (10)
గతించినవారు (వ్యతీతులు) అయిన దేవతలు రూపములచే నామములచే ప్రస్తుత దేవతలతో సమానులు. అందుచే వసుధాతలము నంతటినీ ప్రస్తుత దేవతల ద్వారా వివరించేదను, (11) దీనము యొక సన్నివేశ సర్వస్వమును గూర్చి ప్రస్తుత దేవతల ద్వారా చెప్పెదను. యావత్తు (మొత్తము) పృథివీ 50 (ఏబది) కోట్ల యోజనముల విస్తారము కలది. (12) పృథ్వి యొక్క ఊర్ద్వ ప్రమాణ సంస్థితి మెరుపు వరకు నున్నది. భూమి యొక్క విస్తీర్ణము నందలి యర్ధభాగము యోజనములో చెప్పబడినది. అన్ని దిక్కులకు వ్యాపించి భూమి యొక్క విస్తీర్ణము, మేరువు మధ్య భాగము నుండి, ఒకకోటి, ఎనుబది తొమ్మిది లక్షల ఏబది వేల యోజనములుగా స్మరింపఁబడినది. అందుచే వలయాకారముగ నున్న భూమి యొక్క విస్తృతి దాదాపు పదకొండు కోట్ల ముప్పుది ఏడు లక్షలు. ఆదియే భూతలము యొక్క విస్తీర్ణముగా గణింపఁబడినది. (16) (ఈభూమి యొక్క విస్తీర్ణ గణనము) పర్యాసః (భ్రమణము) రారా మండలమున నక్షత్ర కూటముల విస్తీర్ల మెంతవరకున్నదో అంతవరకు పర్యాస సన్నివేశము భూమియొక్క మండలము వరకు వ్యాపించియున్నది. పర్యాస గణనము వలన ఆకాశము భూమితో సమానముగా నున్నది. ఇయ్యదియే ఏడు ద్వీపముల సంస్థానముగా ప్రకీర్తితము. (17,18) ప్రపంచ గోళముల సంస్థితి ఒకదానిపై నొకటి (ఉపర్యుపరి) పూర్వగోళ పరిధిలో ఉత్తరగోళ పరిధి క్రమముగా సరిపడుచునున్నవి. (ఛత్రవల్ పరిమండలమ్). (19) యావత్తు సంస్థితియు నీ విధముగా విహితమై యున్నది. అన్ని జంతువులందు నివసించును. ఈ విశ్వాండము యొక్క ప్రమాణము చెప్పఁబడినది. (20) ఈ బ్రహ్మాండము నందే సప్త ద్వీపములతోడి భూమి యున్నది. ఆ లోకములు - భూర్లోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనకము, తపోలోకము మరియు సత్యలోకము. ఈ యేడు లోకములు సృజింపఁబడినవి. అయ్యవి యొక. ఛత్ర రూపమున రచింపఁబడినవీ. (22)
స్వకీయములయిన సూక్ష్మాచరణములచే నయ్యవి వేరువేరుగా ధరింపఁబడుచున్నవి. ఆరంభముయొక్క ఆధారములు, అన్నియు బాహిరములయిన ఆవరణములు. అయ్యవి తాము ఆవరించునట్టి వానికంటే పదిరెట్లు పెద్దవి. పరస్పర సముత్పన్నములై యవీ ప్రత్యేకమయిన విశిష్ట లక్షణములతో కూడియున్నవి. ఈ విశ్వాండము యొక్క యంతటను ఘనీభవించిన సముద్రము సన్నీవిష్టమయియున్నది. (24).పృథివీ. యొక్క యావన్మండలము ఘనీభూత జలముచే వహింపబడుచున్నది. ఆ ఘనీభూతమయిన యుదధి, ఘనీభూతమయిన తేజస్సుచే భరింపబడుచున్నది. (25) బాహ్యముగా అన్ని దిక్కులయందు ఘనీభూత తేజస్సు పరివృతమై యున్నది. ఊర్ద్వము నందు, పార్శ్వముల యందు నియ్యది, ఘనీభూత వాయుభూతముచే వహింపబడుచున్నదీ ఈ విధముగా ధరింపఁబడి యయ్యదీ కదలకుండ సుప్రతిష్ఠితముగా నున్నదీ, (26) ఘనవాతము (ఘనీభూతమయిన వాయువు) ఆకాశముచే పరివృతమై యున్నది. ఆకాశము భూతాదులచే ఆవృతము. (అహంకారి). భూతాదులు మహత్తుచే ఆవృతములు, (27) మహత్తు అవ్యయమయిన ప్రధానముచే ఆవృతము. (అది అవ్యయము, అమేయము), లోకపాలురయిన వారి నగరముల గూర్చి యథాక్రమము వివరించేదను. (29) జ్యోతిర్గణముల యొక్క ప్రచారమునకు ప్రమాణ పరిసిద్దికి మేరువు యొక్క తూర్పు దోశయందు, మానసము యొక్క శిఖరమున ఉన్న జ్యోతిర్గణముల వర్ణించెదను. మేరువు యొక్క ప్రాగ్జిశ యందు, మానస శిఖరము నందు, మహేంద్రీ పురమున్నది. అందు వసువులు నివసింతురు. అయ్యది సువర్ణముచే నలంకరింపఁబడినది. (వసువులలో ఇంద్రుఁడొకడు). మేరువునకు దక్షిణ దీశను మానసము యొక్క మూర్ధమున (30) యముఁడైన వైవస్వతుఁడు నివసించును. ఆతఁడుండునది సంయమన పురము. (31) మేరువునకు పడమటను, మానసము యొక్క మూర్ధమునను సుఖమను అందమయిన నగరము కలదు. అయ్యది ధీమంతుఁడయిన వరుణుని పట్టణము. యాదసాం (నీటికి) నాథుఁడయిన వరుణుడు ‘సుఖ’ మను పేరుగల నగరమున నివసించును. (32)
మేరువున కుత్తరమున మానసము యొక్క మూర్ఖమునందే సోమమను నగరమున్నది. దానికి విభావరీ యను నామము కలదు. అయ్యది మహేంద్రపుర తుల్యమయినదీ. (33) ధర్మ వ్యవస్థను ప్రలెష్టించుటకు..లోక సంరక్షణము కొఱకు, లోకపాలకులు నాలుగు దిక్కుల యందు మానసపు ఉత్తర పృష్ఠ భాగమున నున్నారు. (34) దక్షిణాయనము నందు సూర్యునీ గతిని గూర్చి తెలిసికొనుము. ఆతని గతీ సర్వలోకపాలుర యొక్క యుపరీతలమున నుండును. (35) దక్షిణాయన ప్రారంభమునందు, వింటి నుండి విడువబడిన బాణము వలె సూర్యుఁడు ముందునకు ” పోవును. ఆతఁడు జ్యోతిశ్చక్రమును తనతో గ్రహించి యెల్లప్పుడును సంచరించును. (36) ఇంద్రునీ నగరమయిన అమరావతీ నగర మధ్యమును సూర్యుఁడు చేరగా, ఆతని యుదయము వైవస్వతుని (యముని) నగరమయిన సంయమనగరమున చూడనగును. (37) సుఖానగరమున అదీ అర్ధరాత్రమగును. సూర్యుఁడు వీభానగరమున నస్తమీంచుచున్నట్లు తోచును. (కనిపించును). (విభా = విభావరి) సూర్యుడాకోశమున వైవస్వత నగరమయిన సంయమనమున మధ్యగుఁడై యుండగా వరుణ నగరమయిన సుఖాపురి యందు సూర్యుడు ఉదయించును. విభానగరమున నది యర్థరాత్రము సూర్యుఁడు మాహేంద్రీ నగరమున నస్తమించుచున్నట్లు కనిపించును. (38) దక్షిణ పూర్వ భాగమున (ఆగ్నేయ దోశను) నున్న ప్రజలకు అపరాష్ట్రమయినపుడు నైరృతి దిశలోనున్న వారికి పూర్వాష్ట్రముగా విధింపఁబడినది. (39) ఉత్తరమున నున్న వారికది అపరరాత్రి. ఈశాన్య దీశయందున్న వారికి పూర్వ రాత్రియదీ. ఈ విధముగా సూర్యుడు ఉత్తరభాగమున నున్న ప్రదేశము లందు ప్రకాశించును. (41) సూర్యుఁడాకాశ మధ్యమున ‘సుఖా’ నగరమున (వారుణనగరమున) సోముని నగరమయిన విభానగరమున నుదయించు చున్నట్లు కనిపించును.
అమరావతి యందు అర్ధరాత్రియైన యమనగరమున అస్తమించునట్లగుపించును. సోముని నగరమయిన ‘విభ’ యందు సూర్యుడాకాశ మధ్యమున నుండ నదీ మధ్యాహ్నము. అప్పుడు మహేంద్ర నగరమయిన అమరావతియందు సూర్యుండుదయించు చున్నట్లు కనిపించును. అయ్యది సంయమన నగరమున అర్ధరాత్రము. సూర్యుఁడు వరుణుని నగరముననస్తమించును. (44) సూర్యుడు శీఘ్రముగా “ఆలోత’ చక్రము వలె పరిభ్రమించును. భ్రమించుచునే సూర్యుఁడు సంచరించు (పరిభ్రమించు) నక్షత్రమండలముల చరించును. (45) ఈ విధముగా సూర్యుం డు నాల్లుదిశలలో దక్షిణమునకు పరిసర్పించును. పునః పునః సూర్యుఁడుదయించును అస్తమించును. (46) రెండు దేవాలయములను (దేవతా లోకములను) ఇంద్రాదుల లోకాలను పూర్వాహ్లామున, మిగిలిన రెంటిని అపరాష్ట్రమున స్వకిరణములచే వేడిగా చేయును. (తపతి), (47) ఉదయించిన తరువాత వృద్ధి పొందుచు మధ్యాహ్నము వఱకు స్వకిరణములచే వేడిని కలిగించును. తరువాత క్షీణించు కిరణములచే సూర్యుడు అస్తమించును. (వేడిమి తగ్గును). (48) సూర్యోదయాస్తమానములచే పూర్వాపర దోశలు (తూర్పు పడమరలు) స్మరింపఁబడును. సూర్యుడు ఎట్టఎదుట (తూర్పున ప్రకాశించుచుండునప్పుడు వెనుక భాగమున పార్శ్వభాగమున కూడ వేడమి కలుగును. (49) సూర్యుండుదయింపగా చూచు జనులకదీ ఉదయము. ఎచ్చట ప్రకాశము నాశము పొందునో అది అస్తమానము. (50) మేరువెల్లరకు ఉత్తరమున నున్నది. లోకా లోకములు దక్షిణమున నున్నవి. సూర్యుడు విదూర భాగమున నుండుటచేతను, భూరేఖచే (హరిజన్) ఆవతుఁడై యుండుటచేతను సూర్య కిరణములు విలీనమగును (అదృశ్యమగును) (కంటికి గనిపించవు). అందుచే రాత్రి యందు సూర్యుడు కానరాడు. గ్రహముల యొక్క నక్షత్రముల యొక్క చంద్రుని యొక్క సూర్యుని యొక్క అస్తమయము, ఉదయము, సూర్యునియొక్క ఔన్నత్యమును బట్టి విస్తృతిని బట్టి తెలిసికోనవలెను.
అగ్ని నీరును తెల్లని కాంతిగలవి. భూమి నలుపు రంగు గలది. సూర్యుఁడు విదూరమున నున్నందున ఉదయించినను అతనికి ఉష్ణకిరణములుండవు. రశ్ములు లేనందున నయ్యది రక్తత్వభావమొందును. ఆ రక్తత్వము వలననే అనుష్టత్వమును కలుగును. (54) సూర్యుఁడు భూమ్యాశ సంయోగ స్థానమును (హారిజన్) పొందియుండ సూర్యుఁడెచ్చటెచ్చట కాననగునో నయ్యది ఊర్థ్వమున నూరుయోజనములకు పైగా కాననగును. (55) భాస్కరుండు తన కిరణములతో అస్తమించినప్పుడు అతని కాంతి (ప్రభ) రాత్రి వేళల అగ్నిని ప్రవేశించును. అందుచే నతం డు (సూర్యుఁడు) దూరము నుండి ప్రకాశించును. (56) సూర్యుఁడుదయించినప్పుడు అగ్ని యొక్క ఉష్ణము సూర్యుని యందు మరల ప్రవేశించును. సూర్యుఁడు అగ్నీతో సంయుక్తుఁడయి పగలు ప్రకాశించును. (57) ప్రకాశము ఉష్ణము - ఈ రెండును సూర్యుని యొక్క అగ్ని యొక్కయు తేజః ప్రకాశోషములు. అయ్యవి పరస్పరాను ప్రవేశము వలన దీవానిశలు ప్రకాశించును. (58) భూమియొక్క ఉత్తర దక్షిణపు అర్ధ భాగముల యందు సూర్యుండుదయింప రాత్రీ నీటియందు ప్రవేశీంచును. (59) అందుచే రాత్రి దీవాభాగమున నీటిలో ప్రవేశించుట వలన ఆ సమయమున (రాత్రులందు) నీరు శీతలముగా నుండును. (60) సూర్యుడస్తమించునప్పుడు పగలు నీటియందు ప్రవేశించును. (60) తత్కారణమున రాత్రులయందు నీరు ఉష్ణముగా నుండును. పగలు అగ్ని నీటిలో ప్రవేశించుట వలన భూమియొక్క ఉత్తరార్ధ దక్షిణార్ధములయందు సూర్యుం డస్తమించునప్పుడు ఉదయించునప్పుడు పగలు రాత్రియు ఈ క్రమములో నీటియందు ప్రవేశించును. సూర్యకాంతియున్న సమయము పగలు, రాత్రిని తామసియని పిలిచెదరు. దీని మూలముననే రాత్రి చక్కగా నిర్వచింపఁబడినది. సూర్యునిపై ఆధారపడియున్నందున దివా సమయములు పగలు అందురు.
సూర్యుఁడు ఆకాశము యొక్క మధ్యభాగమున సంచరించునప్పుడు అయ్యది భూభాగములను ఒక ముహూర్తములో దాటిపోవును. (ఒక ముహూర్తములో ప్రయాణించి పోవుననిన యోజన సముదాయమును గ్రహించవలయును). (64) అయ్యది ఒక వంద యెనుబది యొక్క వేల యోజనములు. ముహూర్తము నందు ఇదీ సూర్యుని వేగము. ఈ వేగముతో సూర్యుఁడు దక్షిణ భాగమునకు సాగిపోగా, అయ్యదీ ఆ భాగము యొక్క మధ్య భాగమును, అంత్య భాగమును దాటిపోవును. తరువాత దక్షిణాయనమున ఆకాశ మధ్యమున నయ్యది సుళ్లు తిరుగును, (67) కొన్నీ యేబది యోజనములు కొన్ని సహస్రములు, అంతకంటే నధికములు అదీ ఒక ముహూర్తమునకు సూర్యుని వేగముగా వీధింపఁబడినది. అయ్యది (సూర్యుఁడు) మానసోత్తర శైలమున దక్షిణ భాగమున సంచరించును, విషువత్తుదాని మధ్యన గలదు. (68) సూర్యుని పరిధి తొమ్మిది కోట్ల నలుబదియైదు వందల సహస్రముల యోజనములుగా పరిగణింపఁబడుచున్నది. (69) ఒక అహోరాత్ర కాల పరిమాణములో సూర్యుని చలన మీంతటిదని విధింపఁబడినది. సూర్యుఁడు దక్షిణ భాగము నుండి తిరిగి వచ్చును. విషువ సంధిలో ఆతఁడుండును. తరువాత క్షీర సముద్రము యొక్క ఉత్తర ప్రాంతముల ప్రయాణించును. దాని యొక్క పరిధిలో ఆతఁడుండును. తరువాత క్షీర సముద్రము యొక్క ఉత్తర ప్రాంతముల ప్రయాణించును. దాని యొక్క పరిధిని యోజనములలో గ్రహింపవలెను. విషువత్తులో నుండగా నది మూడుకోట్ల ఎనుబది యొక్క వందల పరిధిని యూహింపఁబడినది. (30008100). (72)
సూర్యుడు శ్రవణ నక్షత్రమున ఉత్తరాషాఢ యందు ఉండగా ఆరవ ద్వీపమయిన ‘శాక’ ద్వీపపు తూర్పుదిశా భాగముల సంచరించును. (73) ఓ బ్రాహ్మణులారా ! ఉత్తరదిక్కు యొక్క ప్రమాణము, మండలము యొక్క ప్రమాణము (సూర్యమండలము యొక్క ఒక కోటి యెనుబది లక్షల యేబది యెనిమిది యోజనములుగా పరిగణింపఁబడినది. (74) గ్రహమండలముల విభజన మీట్లుండును. నాగవీధి - ఉత్తరము నందున్నట్టిది. అజవీధి - దక్షిణమున నున్నదీ.
ఈ విభాగములొక్కక్కటి మూడు నక్షత్ర కూటములను గలిగియుండును. మూలా నక్షత్ర మండలము, పూర్వాషాఢ నక్షత్ర మండలము, ఉత్తరాషాఢ నక్షత్ర మండలము అజవీధిలో నుదయించు స్థానములు, ఇంక అశ్వనీ నక్షత్రమండలము, భరణి మండలము, కృత్తికా నక్షత్ర మండలము మూఁడును నాగవీథిలో నుదయించు మూఁడు స్థానములు. ఉత్తర దక్షిణ దిశల మధ్య విస్తీర్ణము నూరువేల నూటయెనిమిది (100108) తక్కినవి మూడు నూటముప్పది మూడు (183) ఎక్కువగలవీ (78) ఇధీ. దేశభమధ్యాంతరము, యోజనాగ్రమునుండి చెప్పబడివమి. దిక్కులయొక్కయు లేఖలయొక్కయు అంతరము దక్షిణోత్తరములే (79) వానీని (ఆదక్షిణోత్తరములను) యోజనములతో లెక్కించి చెప్పెద వినుడు, వాని యొక్క యంతరము డెబ్బదియొక (71) టి (నీ)యుతములు (80) తక్కినవి వేయి (యోజనములు). వేరోకటి డెబ్బది యైదు (75) యోజనములు, ఇది బాహ్యపర్యంతరములైన తేఖలకుదిశలకును సంబంధించినదనీ (స్మరింపబడుమ) తెలుపబడినది. ఉత్తరాయణమున సూర్యుడు (అభ్యంతరముననున్న) లోపలనున్న (అంతర్గతములయిన) మండలముల గుండా పోవును. దక్షిణాయనమున బాహ్యముననున్న మండలముల నుండి క్రమముగ పోవును. (82)
ఉత్తరమున ఒక వంద ఎనుబదీ మూఁడు (183) మండలములు గలవు. దక్షిణమునఁగూడ సూర్యుడంతీయే ప్రయాణించును. (83) తరువాత మండలముల ప్రమాణమును యోజనములలో గ్రహించుము. అయ్యది పదీయేడు వేల రెండు వందల యిరువది యొక్క యోజనములు. (84,85) మండలము యొక్క ఏతత్రమాణము యోజనములలో చెప్పబడినది. దానియొక్క విష్కంభము (వ్యాసము). అడ్డముగా (తిర్యకుగా) విధింపఁ బడినది. (86) ప్రతిదినము సూర్యుఁడామండలములను క్రమముగా సంచరించును. కుమ్మరివాని చక్రము యొక్క పైయంచు తొందరగా తిరుగునట్లు, సూర్యుడు కూడ తన యొక్క దక్షిణాయనమున తొందరగా తిరిగి వచ్చును. అందుచే సూర్యుఁడు భూమీయొక్క అత్యధిక భాగమును అల్పకాలములో తిరిగి వచ్చును. (88) దక్షిణాయనమున తనయొక్క శీఘ్రయానముచే సూర్యుండు పదమూడున్నర నక్షత్ర మండలములను పగటి యందు 12 ముహూర్తముల కాలములో తిరిగి వచ్చును. సూర్యుడు తత్సంఖ్యా పరిమితములయిన 13 మండలములనే రాత్రి సమయమున 18 ముహూర్తములలో చుట్టి వచ్చును. (89,91) కులాలుని చక్రము యొక్క మధ్యభాగము తక్కువ వేగముతో (నెమ్మదిగా) తిరుగునట్లు, దక్షిణాయనమున సూర్యుఁడు తక్కువ వేగముతో తిరుగును. అందుచే ఉత్తరాయణమున సూర్యుడు తక్కువ రయముతో తీరుగును. అందుచే నతఁడు భూమి యొక్క తక్కువ భాగమును ఎక్కువ కాల ప్రయాణములో తిరుగును. ఉత్తరాయణ పర్యటనములో పగటిపూట 18 ముహూర్తముల కాలము పట్టును. తక్కువ రయముతో సూర్యుడు 132 మండలములను పగటిపూట తిరుగును. తత్సమానమయిన మండలములనే రాత్రిపూట పండ్రెండు ముహూర్తముల కాలములోనే తిరుగును. (92,93)
కుమ్మరి వాని చక్రము నాభియందు మిక్కిలి మందముగా తిరుగును. తద్వీధముగా మధ్యనుంచిన మట్టిముద్దవలె ధ్రువ నక్షత్రము భ్రమించును. (94) పగలు రాత్రి కలిసి ముప్పదీ ముహూర్తములందురు. ఆ రెండు కాష్ఠముల మధ్యను తీరుగుచు, ధ్రువము (నక్షత్రము) మండల వలయములలో భ్రమించును. (95) (కాష్ఠములు - భాగములు), కుమ్మరి చక్రము యొక్క నాభి భాగము అక్కడే వర్తిల్లినట్లు ధ్రువ (నక్షత్రము) తన స్థానము నుండి మారకయే యందే తిరుగును, (95,96) ధ్రువ నక్షత్రమీ రెండు కాష్ఠభాగముల మధ్యను భ్రమించు చుండును. సూర్యుని యొక్క గతి పగటిపూట మందము రాత్రిపూట శీఘ్రము. ఉత్తర ప్రక్రమము నందు పగటిపూట సూర్యునియొక్క గతీ మందముగా నుండును. రాత్రిపూట మిక్కిలి చురుకుగా నుండును. దక్షిణాయనమున (ప్రక్రమమున) సూర్యుని యొక్క గతి పగటిపూట శీఘ్రము, ఇంక రాత్రి ప్రొద్దు మందము. (98,59) ఈ విధముగా సమవిషమ గతి విశేషములచే తన వలయమున గమనము సల్పుచు, సూర్యుఁడు పగళ్ళను రాత్రులను విభజించును, (100) నాలుగు చీక్కుల యొక్క పాలకులు (రక్షకులు) ‘లోకాలోక’ పర్వతమున సంస్థితులై నలుదెసలకు లోకపాల కులుందురు. అగస్త్యుఁడు (నక్షత్రము) వారిపై భాగము నుండి అధిక వేగముతో పోవును. (101) నాగవీధీ యొక్క దక్షిణము నందు, లోకాలోక పర్వతముయొక్క ఉత్తరమునందు, రాత్రింబగళ్లు సూర్యుఁడీ విశేష గతులను (పొందును) అనుభవించును. (102) వైశ్వానర పథమునకు భాహ్యమున ఆతఁడు లోక సంతానకుఁడు (అనఁగా లోకములను పొడుగించువాఁడు). పృష్ఠ భాగమున సూర్య ప్రకాశము వెలుగొందుచుండునంత వరకు లోకాలోక పర్వతము యొక్క పురోభాగమున పార్వ భాగమున ప్రకాశముండును. ఆ పర్వతము 10వేల యోజనముల ఎత్తు. అదీ అంతట పరిమండలమై కొంతవరకు వెలుగొందును. కొంతవరకు ప్రకాశమొందదు.
గ్రహములతో తారాగణములతో నక్షత్రములు చంద్రుఁడు, సూర్యుఁడు గూడి, లోకాలోక పర్వతము యొక్క అభ్యంతరమున ప్రకాశించును (102, 106) ఇంతవరకే లోకపర్వతము. దీని తరువాతిది నిరాలోకము (చీకటి). ఈలోకాలోకపర్వతము లోకముతో జనముతో ఆలోకవంతము (వెలుగుగలది). లోకము (జనము) లేనందున నిరాలోక (అలోక)మైనది. లోకాలోకము సూర్యపరిగ్రహమును సంధానించును (కలుపును) (107) కావున దానిని సంధ్యయందురు. అదీయే ఉషా వ్యుష్ణుల (రాత్రిపగలుల) సంధికాలము, విప్రులు (బ్రాహ్మణులు) ఉషనురాత్రి యందురు, వ్యుష్టిని పగలందురు. (108) సంధ్యాకాలమున రాక్షసులు సూర్యుని అగ్నిని గ్రహింప వలెనని యుందురు. ప్రజాపతి నియోగమున ఈ దురాత్ములకొక శోషము కలిగినది. (109) ఆ రాక్షసుల దేహమునకు మరణము లేని యక్షయత్వము కలదు. వీరు మూఁడు కోట్ల రాక్షసులు. వారు మందేహులుగా ప్రఖ్యాతులు. (110) ప్రతీదీనము వారు ఉదయించు సూర్యుని ప్రార్థింతురు. ప్రకాశించు (తపించునట్టి) సూర్యుని ఈ రాక్షసులు (దురాత్ములు) భక్షింపకోరెదరు. (111) అప్పుడు సూర్యునకు ఈ రాక్షసులకు మధ్య సుదారుణమయిన యుద్ధము జరిగెను. అంత దేవతలు, బ్రాహ్మణ సత్తములు బ్రహ్మయు సంధ్యను సముపాసించిరి. గాయత్రీ మంత్రాభిమంత్రితము ఓంకార బ్రహ్మ సంయుక్తము వైన జలమును ప్రక్షేపించిరి. (113) అప్పుడు స్పూన్షజ్యోతితో చండాంశుం డయిన భాస్కరుండు ప్రకాశించును, ఆతఁడు మహాతేజుఁడు మహాబల పరాక్రముఁడు నయ్యెను, బ్రాహ్మణులచేనభిరక్షితుఁడైన సూర్యుఁడు శత సహస్ర యోజనముల దూరము ఊర్థ్వమునకు పోవును. (లేచును). ఆ బ్రాహ్మణులు వాలఖిల్యమునులు. వారి తేజః కిరణములచే సూర్యుడు తనవెలుగుల నింపుకొనెను. (115)
15నిమేషము లోక కాష్ఠము. ముప్పది కాష్ఠలు ఒక కళ. ముప్పది కళ లోక ముహూర్తము. అట్టి ముప్పది ముహూర్తములు దీవానిశలతో గూడిన యొక్క పూర్ణదీనము. పగటి భాగములతో దీనముల యొక్క హొస వృద్ధులు యథాక్రమముగా (116) జరుగును. సంధ్య మాత్రమొక ముహూర్త కాలముండును. అయ్యదియే దీనము యొక్క ప్రోసమునకు, వృద్ధికి పరిమితిగా గ్రహింపబడుచున్నది. భూమ్యాకాశములు కలియు వలయము నుండి సూర్యుఁడు మూఁడు ముహూర్తముల కాలము ప్రయాణింప నయ్యది ప్రాతఃకాలము అనబడినది, ఇయ్యది దీవసమున నైదవ భాగము. ప్రాతఃకాలము . తరువాత వచ్చు మూఁడు ముహూర్తముల కాలము ‘సంగవ’ మనీ పేరు. (119) (‘సంగవ’ము నుండి మూఁడు ముహూర్తముల కాలమునకు మధ్యాహ్నము అని పేరు. మధ్యాహ్నము నుండి మూడు ముహూర్తముల కాలమునకు అహరాద్దామని పేరు. మూఁడు ముహూర్తముల కాలమున ఒక కాలప్రమాణముగా బుధులు పరిగణింతురు. అపరాద్దాము తరువాత సాయాహ్నమందురు. (121) గడచిన 15 ముహూర్తముల కాలపరిమితి గల ఒక దినములో పూర్వాప్త అపరాష్ట్ర సాయాహ్నములు మూడింటినే పవిత్రములుగా దలంతురు. విషువద్దనమునకు (ఇక్వినోటికల్ డే) 15 ముహూర్తములు. (122) దక్షిణాయనమున రాత్రులు వృద్ధిచెందును. ఉత్తరాయణమున పగళ్లు వృద్ధినొందును. (123) పగలు రాత్రిని, రాత్రి పగలిని గ్రహించును. శరద్వసంతర్తువులమధ్య భాగము విషువత్తు అని భావింపఁబడును. చంద్రుఁ డు అహోరాత్రముల యందు సమానమయిన కళలను గలిగియుండును. పదియైదు దినములొక పక్షము అని చెప్పబడుచున్నది. రెండు పక్షములొక మాసము. రెండు సౌర మాసములొక ఋతువు. (125)
మూఁడు ఋతువులొక అయనము. రెండు అయసము లోక సౌర సంవత్సరతము. నీమేషములు విద్యుత్తులు. 15 విద్యుత్తులోక కాష్ఠ 30 కాష్ఠలోక కళ. (126) అది 161) మాత్రలు కలిగియుండును. రెంటిచేతను, ఏడింటిచేతను వృద్ధి పొందిన ముప్పది మాత్రలు ఉత్తర మాత్రల ముప్పది ఆరింటిలో నుండును. (X ?) అరువది రెండు, డెబ్బది మూఁడు మాత్రలతో ఓక ‘కల’ యగును. అది 40 వేల 800ల విద్యుతులు (ముప్పదకళలు ఒకకాష్ఠ అది మాత్రాశీతిద్వయాల్మీకము (80+80=160 మాత్రలు గలది). ద్వ్యధికమైన సమైకము (7+2=9 మాత్రము గలది), షడ్రింశదుత్తరమైన త్రింశన్మాత్రకము (3036 మాత్రము గలది). ద్విషష్టితో వృద్ధిచేసిన త్రింశన్మాత్రమైనది (62x23=1426 మాత్రలు కలది), కళయగును. చత్వారింశత్సహసములు అష్టశతములను సప్తలీయును అందును నీశ్చయముగా తొంబదీయు నైన విద్యుతులు గలదీ (4870 లేక 4890 మాత్రలు గలది) కళయగును. (127,128) ద్వీసంయుతములైన చత్వారిశతములైన విద్యుతులు గలది (402 మాత్రలు గలది కళయగును. (129)] (128) అని సప్తతి (70) (?) నిశ్చయముగా నవి తొంబదియని యెఱుంగుము. 402 విద్యుత్తులున్నవని చెప్పుదురు. (129) దీనిని వరాంశమని (ఉత్తమ భాగమని) తెలిసికొనవలెను. దానికి నాడీకా ఘటి కారణము (24 నిమేషములు), సంవత్సరముతో నారంభమైన యైదును, చతుర్విధమానముల బట్టి వివిధరీతుల కల్పితమయినవి. (?) (130) సర్వకాలమునకు సునిశ్చితమైన కాలపరిమితిని ‘యుగ’ మందురు. మొదటిది సంవత్సరము సంవత్సరము; రెండవది పరీవత్సరము; మూడవది ఇదావత్సరము; నాలుగవది అనువత్సరము; ఐదవదివత్సరము. కానీ కాల పరిమితికీ ‘యుగ’ మని పేరు. (132) సౌరయుగమున, మూఁడువేల ‘పర్వణములు’ (ముప్పుదివందలు) (పర్వణము సంధి). అందు 1830 సూర్యునీ యుదయములుండును. (133) అందు 30 ఋతువులు, 10 అయసములు, మరియు నందు 365 రోజులు, (ఒక సౌరవత్సరము నందుX134) ముప్పది రాత్రులు, పగళ్ళు ఒక సౌర మాసమునందుండును. అట్టి 61 రోజులొక ఋతువగును. (135) ఒక సౌర అయనము 183 దినములు. అని తెలీయవలెను. (136)
క్రింద వివరింపఁబడునవి కాలగణనమునకు మానములు. సౌరము (సూర్య సరండీ) సౌమ్యము (చంద్ర సంబంధీ) సోక్షత్ర (నక్షత్ర సంబంధి); ఇంక సవన (సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వఱకు గణింపఁబడిన సవన గణకమానములు), ఈ మానములన్నియు పురాణములు నిశ్చయముగా చెప్పబడినవి. (187) శ్వేతమునకు ఉత్తరమున శృంగవంతమును పర్వతము కలదు. దానికి మూడు శిఖరిములు; అవి ఆకాశమును స్పృశించుచున్నట్లగుపించును, (18) ఆ శిఖరముల వలననే ఆ పర్వతము శృంగవంశీమనీ చెప్పబడుచున్నది. దానియొక్క పరిధి, విష్కంభము (వ్యాసము) విస్తారములనీ కీర్తింపబడినవి. (139) దాని పూర్వదిషీత శృంగము, మధ్యమ శృంగచన హీరణ్మయములు, దక్షిణ శిఖరము స్పటిక ప్రభతో నొప్పునది రజత శృంగము. (140) ఉత్తరము నందున్న ఉత్తమమైన శృంగము సర్వరత్నమయము. ఇట్లు, ఈ మూఁడు శృంగముల వలన శృంగవంతమనీ ఈ పర్వతము పేరొందినీదీ. (141) శరద్వసంతముల మధ్య సూర్యుఁడు మధ్యమ గతితో తూర్పు శృంగమునకు పోయిచేరును. (142) అందుచే తిమిరాపహరుఁడు (సూర్యుఁడు) రాత్రీని పగంటినీ సమానముగ చేయును. ఆతనీ మహారథమునకు పచ్చని గుజములు పూన్చబడును, ఆ రథహయములు పద్మముల యొక్క రక్తవర్ణ కిరణములచే పూయబడినవా యన్నట్లు ప్రకాశించును. మేష తులారాశుల యంతమందు, సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు కాల ప్రమాణము 15 ముహూర్తములు. సూర్యుడు కృత్తికా నక్షత్ర ప్రథమాంశమున కాలిడగనే, చంద్రుఁడు వీశాఖా నక్షత్రముయొక్క చతుర్థాంశమున కాలిడునని గ్రహింపవలేను. (145) వీశాఖా నక్షత్రమున నెన్నడు సూర్యుఁడు తృతీయపాదమున చరించునో అప్పుడు చంద్రుఁడు కృత్తికా నక్షత్ర శీర్షము నొందినట్లు తెలియ వలయును. (146)
దానిని మహర్పులు ‘విషువ’ (ఇక్వినక్స్) అని తెలిసికొనవలయునని చెప్పుదురు. (147) సూర్యస్థానమును బట్టి విషువను తెలిసికొనవలెను. చంద్రుని స్థానమును బట్టి కాలమును గమనించవలయును. దివారాత్రుల కాల పరిమాణము సమానమయిన నదీ ‘విషువ’. మగును. (148) ఆ విషువ కాలమున పితృదేవతలకు దానములను చేయవలెను. బ్రాహ్మణులకు ప్రత్యేకముగా విశేష దానములు చేయవలయును. ఏలయన ఆ ‘విషువ’ కాలము దేవతలకు ముఖమగుట. (149) ఈ క్రింది విషయములను కాలమాన గణమునకు తెలిసికొనవలెను. ఊనమాసము (తక్కువ కాల పరిమాణము గల మాసము). అధిమాసము, కల, కాష్ఠ, ముహూర్తకము, పూర్ణమాసి (పూర్ణిమ) అమావాస్య, సినీవాలీ, కుహు (చంద్రరేఖ కనబడని యమావాస్య) అనుమతి (పున్నమిలలో భేదములు) చతుర్దశీ తిథితో కూడిన చంద్రరేఖ కనబడిన అమావాస్య సినీవాలి. పక్షమందలి మొదటి తిధితో సినీవాలీ కలియును. అది ‘కుహు’, అందు ధ్యానించుట సంపత్కరము, పుత్ర ప్రాప్తికరము. (అని అధర్వము). నిరుక్తము ననుసరించి చతుర్దశితో కలిసివచ్చిన పూర్ణిమ ‘అనుమవీ’ వచ్చు పక్షపు మొదటి తిథితో కలిసిన ‘రాకా’. పూర్ణచంద్రుడున్న దీనము రాక వేదకాలములో నైశ్వర్యము కొఱకు ఉత్తమ పుత్రోదయము కొఱకు వీనిని ఆరాధించెడివారు.
మాస నామములకు పూర్వకాలమున వేఱైన పేర్లు కలవు
ప్రాత నామము
తపః
తపస్య
మధు
మాధవ
శుక్ర
శుచీ
నభః
సభస్య
ఇష
ఊర్జః
కొత్త నామము
మాఘము
ఫాల్గుణము
చైత్రము
వైశాఖము
జ్యేష్టము
ఆషాఢము ఈ యారుమాసములుత్తరాయణము
శ్రావణము
భాద్రపదము
అశ్వయుజ
కార్తీకము
మాఘము, ఫాల్గుణము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఇవి ఉత్తరాయణము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము - ఇవి దక్షిణాయనము. (151) ఆర్తవములు ఐదు సంవత్సరములు ఇవీ బ్రహ్మ యొక్క పుత్రులు అని అనబడినవి. (152) అందుచే ఋతువులను తెలిసికొనవలయును. ఋతువుల వలననే అర్తవములు. (ఋతు సంబంధమైనవి ఆర్తవములు కలుగును). అందుచే ఋతు సంబంధిపర్వమునకు అమావాస్య ఋతుముఖాయని తెలియవలయును.(153) అందుచే ‘విషువ’ పర్వము పితృదేవహితము. ఇది తెలిసి అందుచే ఎల్లప్పుడు పితృకార్యమునను, దేవకార్యమునను మోహము (పొరపాటు) చెందరాదు. (154) “విషువత్తు) సర్వగము, అంతటను వ్యాపించియున్నది ప్రజలు జ్ఞాపకముంచుకొనవలెను. కావున ఆలోకము వలన లోకము స్మరింపబడును. అది లోకాలోకమనబడును (155) లోకాలోక పర్వతము యొక్క మధ్యయందు లోకరక్షకులయిన లోకపాలురున్నారు. వారు నలువురు మహాత్ములు, సర్వభూత ప్రళయాంతము వారందుండుదురు. (156)
వారు సుధామ, వైరాజు కర్దముడు శంఖపుడు, హిరణ్యరోముఁడు పర్జన్యుడు కేతుమంతుఁడు, రాజసుఁడు. (157) వారు సాటిలేని వారు (నిర్ద్వంద్వులు), నిరభిమానులు. వారు నిరవధులు; పరిగ్రహ దూరులు. (ఇతరుల వలన కానుకల గ్రహించువారు కారు). అవివాహితులు వీరునాలుగు దిక్కులయందు లోకపాలురు (దిక్కులను రక్షించువారు). లోకాలోక పర్వతస్థితులు. (158) (యదపస్తస్య - తప్పుకానోపు అగస్త్యయని యుండనోపు) అగస్త్య నక్షత్రమునకు ఉత్తరమున, అజవీధికి దక్షిణమున, పితృయానమను నొక పథము కలదు. ఇదీ వైశ్వానర పథమునకు బాహ్యమున కలదు. అందు ప్రజావంతులు అగ్నిహోత్రులు నయిన మునులు వసింతురు. పితృయాన పథ స్థితులైనవారు లోక సంతానకరులు. (ప్రపంచ జనసంతానమును కొనసాగించువారు). (160) దక్షిణ భాగము ఋత్విక్కులది. భూసారంభృతకర్ములు (జనసృష్టి కారకులు). వారు . లోకకాములు. సంతానోత్పత్తి సారంభంతురు. ప్రతి యుగము నందు నడచిన (చలితమయిన) ధర్మమును మరల స్థాపింతురు. వారు తపసా సంతప్తులు. మర్యాదకంటి పెట్టుకొందురు. శ్రుతిని విద్యాభినివేశమును కొనసాగింతురు. (162) పూర్వులు తరువాతివారి గృహములలో బుట్టుచున్న విధముగానే తరువాతివారు గూడ వారి మరణము తరువాత గూడ పూర్వుల గృహములలో బుట్టుచుందురు. (163) ఈ విధముగా పునః పునః పుట్టి చచ్చుచు ఆవర్తమానులై వారు సర్వ భూతముల సంక్షయము (ప్రళయము) వరకు నుందురు. గృహమేధులయిన యీ ఋషీశ్వరుల సంఖ్య 88000 (ఎనుబది యెనిమిది సహస్రములు) (164) వారు చంద్రుఁడు నక్షత్రములున్నంత కాలము సూర్యుని యొక్క దక్షిణాయన మార్గము నాశ్రయించి యుందురు. (88000) ఇయ్యది పవిత్ర క్రియల ఆచరించుచు శ్మశానమును చెందిన వారి సంఖ్య. (165) ప్రపంచమున వారి నిత్యకర్మ కలాపములు, భూతముల సృజించుటచే, ఇచ్ఛాద్వేష ప్రవృత్తులచే, మైథునమునకు బూనుటచే, కామకృతములచే భోగ విషయ ప్రవృత్తులచే నడచుచుండును. ఇట్టి కారణములచే వారు శ్మశాన స్థలములను చెందిన సిద్దులు, సంతానాపేక్ష కోరు ఋషులు ద్వాపరయుగములందు బోలె మరల జన్మించెదరు. (168)
నాగవీథ్యుత్తరముననున్న పథము, సప్తర్షి గణములకు దక్షిణమున నున్నది. సూర్యుని యొక్క ఉత్తరయానము (పథము). దీనిని దేవయానమందురు. అందుండునట్టి వారు సిద్దులు. వారు విమల బ్రహ్మచారులు. (169) వారు సంతతీయసహించుకోందురు. అందుచే వారిచే మరణము జయింపఁబడినది. ఊర్థ్వ రేతస్కులయిన యీ ఋషీశ్వరుల సంఖ్య 88000. వీరందరు సర్వభూత సంప్లవ పర్యంతము (వినాశనము. వరకు) ఉత్తరపథ యానమునే ఆశ్రయించుకొనియుందురు. లోక సంబంధము వలన, మైథునక్రియా పరిత్యాగము వలన (171) కామ సంయోగము నుండి విముఖత్వము వలన, ద్వేషరాహిత్యము వలన, భూతారంభ వివర్జనము వలన, విషయవాంఛా విముఖత్వము వలన, శబ్దాదివిషయముల దోషముజూచుట వలన (172) వారు సిద్దులైనారు. అమృతత్వము నొందినారు. ఎవరు సర్వభూత సంప్లవత్వము వజంకునుందురో వారికి అమృతత్వముండును. (173) త్రిలోక సంస్థితీ కోటకు వారు (ఆ ఋషులు / సిద్దులు) మరల వారి భార్యల గలిగియుందురు. ఇతరులు - భ్రూణహత్వాశ్వమేధముల వలన పాపపుణ్యములు చేయువారు ఊర్ధ్వ రేతస్కులు సంప్లవాంతమున క్షయము నొందుదురు. ఋషుల కంటే పైననుత్తరమున ధ్రువుడున్నచోటు (175) అది దివ్యమయిన విష్ణుపదము. ఆకాశమున ప్రకాశవంతమయిన మూఁడవది, దానిని చేరిన నెవ్వరికిని విచార దుఃఖములుండవు. అది విష్ణువు యొక్క ఉత్కృష్ట పదము. అందు లోకసాధకులయిన ధర్మము ధ్రువుడు మొదలగువారు ఉందురు. (176)
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ పురాణమునందు పూర్వభాగమున ద్వీతీయానుషంగపాదమున ఆదిత్య వ్యూహకీర్తన మనెడి ఇరువది యొక్కటవ అధ్యాయము.
