1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము

Table of Contents

34 - వ్యాస శిష్యోత్పత్తి

వాయురువాచ:-

 సూత ఉవాచ :-

వాయువు పలికెను :

ఆ వాక్యములను ఋషులు వినిరి. వారు సూతునిట్లడిగిరి. “వేదము లేట్లు మరల వ్యస్తములుగాజేయబడినవి.. వివిధ భాగములుగా విభజింపఁబడినవి. ఓ మహామునీ ! మా కొఱకు దానిని చెప్పుము” అని.

సూతుఁడిట్లనియెను.

స్వాయంభువమనువు తరువాత మరల వచ్చిన ద్వాపరయుగమున మనువుతో బ్రహ్మయిట్లనెను. “ఓ మహామతీ ! వేదమును రక్షించు’ అని, యుగము మారినది. ఓ ప్రియతమ ! ద్వీజన్ములయిన బ్రాహ్మణులు అలవీర్యులయిరి. వారందరు యుగము యొక్క దోషముచే సంవతు లయిరి. యుగవశముననే దానీ మానము (పరిమితి కాలము) అల్పమయినది. కృతయుగమున చెప్పఁబడినదెల్ల దశసహస్ర భాగము మాత్రమే మిగిలియున్నది. [4) శక్తి తేజస్సు బలము సర్వము నశించును. (తగ్గిపోయినది). ప్రతి విషయము నశించును. వేదక్రియలు నిర్వహింపం బడవలసి యున్నది. అయినను వేదమునకు వినాశనము కాకుండుగాక ! వేదము సోశనము నొందిన యజ్ఞములు నాశనము చెందును. యజ్ఞములు నష్టములు కాగా వేదనాశనము కలుగును. సర్వము నశించును. (6) మొదట వేదము 4 పాదములు, అయ్యది శత సహస్ర (లక్ష) (మంత్రములుగా)ముగా నున్నది. మరల కృష్ణ యజుర్వేదము (అప్పుడు) (ఇప్పుడున్న దానికంటె) పదింతలు. యజ్ఞము సర్వకామముల నొసంగునది కదా ! ఇట్లు చెప్పఁబడీ లోకహితము నందాసక్తి గలిగిన మనువు “అట్లగుగాక ! అనెను. అంత ప్రభువు ఏకైకమయిన వేదమును నాలుగు భాగములుగా విభజించెను. (8) బ్రహ్మయొక్కవచనమును బట్టియు, లోకమునకు హితము నాచరించు కోర్కెచే నేను మీకు వర్తమాన మన్వంతరము ననుసరించి, వేదకల్పనము (విభజనమును) గూర్చి వివరించెదను.(9)

గడచిన మన్వంతరములతోడి (యుగ) ప్రకల్పమును జెప్పెదను. ఓ జ్ఞానులారా! ప్రత్యక్షముగనో పరోక్షముగనో దానిని వినుడు. (10) ఈ యుగమున పరాశర సుతుఁడు, పరంతపుఁడు, ద్వైపాయనుఁడనీ సుప్రతిష్ఠితుఁడు నయిన వ్యాసుఁడు సనాతనుఁడు. విష్ణుని యొక్క యంశము.(11) బ్రాహ్మణులచే ప్రచోదీతుఁడయి యతఁడు ఈ యుగమున వేదమును వచించుటకు మొదలిడెను. అంత వేదముల (సంరక్షించుటకు)వ్యాసుఁడు నలుగురు శిష్యులను గ్రహించెను. వారు జైమినీ, సుమంతుఁడు, వైశంపాయనుఁడు, ఫైలుఁడు నాలుగవవాఁడు. ఐదవ శిష్యుఁడు లోమహరుణుఁడు. (13) ఆచారము ననుసరించి (విధివత్) ఋగ్వేదమును (వినుటకు) అధ్యయనము చేయుటకు శిష్యునిగా పైలునీ వ్యాసుఁడు గ్రహించెను. యజుర్వేద ప్రవక్తనుగా వైశంపాయనుని గ్రహించెను. సామవేదమునకు శిష్యునిగా (సామవేద మంత్రార్థములకు) వ్యాసుఁడు జైమినిని గ్రహించెను. ఋషిసత్తముఁడయిన సుమంతుని అధర్వ వేదాధ్యయనమునకు శిష్యునిగా గ్రహించెను. భగవంతుఁడు ఈశ్వరుం డు నయిన వ్యాస ప్రభువు ఇతిహాసములు, పురాణములు, కల్ప వాక్యములకు (సూతుఁడనైన నన్ను గ్రహించెను. (16) ఒకటే యొకటి యజుర్వేదము. దాని నాతఁడు నాలుగుగా చేసెను. అందు చాతురోత్రములు (నాలుగు విధములయిన యజ్ఞవిధులు) కలవు. ఆ విధుల ననుసరించి వ్యాసుడు యజ్ఞమును కల్పించెను. (17) ఆ ఋత్విక్కులు నల్లురు (హోత, ఆధ్వర్యువుడు, ఉదాత, బ్రహ్మ) (ఆధ్వర్యవము (ఆధ్వర్యోః ఇదమ్) యజుర్వేద సంబంధమైనవి). ఆధ్వర్యవమును యజుర్వేద మంత్రములచేతను, హోత్రమును ఋగ్వేదమంత్రముల చేతను, ఔద్దాత్రమును సామముల చేతను, ఇఁక బ్రహ్మత్వమును (ఋత్విగధ్యక్షుఁడు) ఆధర్వ వేద మంత్రములచేతను యజ్ఞకార్యమును నిర్వహింప వ్యాసుడు నియమించెను. (18) తరువాత ఋగ్వేద మంత్రములు గ్రహించి (ఉద్దృత్య) వ్యాసుఁడు ఋగ్వేదమును రచించెను. (సమకూర్చెను) హోతృక మంత్రముల గ్రహించి వ్యాసుఁడు యజుర్వేదమును సంకలన మొనర్చెను. (19)

సామ మంత్రముల గ్రహించి సామవేదమును సమకూర్చెను. తన్మూలమున ఔద్గాత్రమును కల్పించెను. అధర్వవేదము మూలమున రాజు యొక్క విధులను ఘటించెను. (20) ఆఖ్యానముల చేతను, ఉపాఖ్యానముల చేతను, గాథల చేతను కల్పముల యందలి ఉక్తుల చేతను, పురాణార్థ విశారదుఁడైన వ్యాసుఁడు పురాణ సంహితను రచించెను. (21) పురాణ సంహితలలో చెప్పగా మిగిలిన దెల్లను యజుర్వేదమున సమకూర్చి వ్యాసుడు యజ్ఞమును యోజనము చేసెను. యజనముల వలన యజుర్వేదమని. శాస్త్ర నిర్ణయము. (22) యజుర్వేద మంత్రముల యందలి పాదములు, మిక్కిలి పొడవైన వగుట (ఉద్ధతత్త్వాత్) యజుర్వేద మంత్రములు విషమములు (క్లిష్టములు). ఈ వేదము అత్యంత వీర్యవంతమయిన దగుట, ఈ వేదమును పరీక్షుణ్ణముగా నేర్చిన నూర్గురు ఋత్విక్కులచే (23) అశ్వమేధ యాగము కూడ ప్రయోగింపఁబడినది దానిచే పరీవృద్ధి చెందింపబడినది. ఋగ్వేద మంత్రమును గ్రహించి, పైలుఁడు దానిని మరల రెండు వర్గములుగా విభజించెను. (24) రెండు, సంహితలను రచించిన పిమ్మట, విశిష్ఠుఁడైన ఆ ఆచార్యుఁడు తన యిరువురు శిష్యులకు నప్పగించెను. ఒకదానిని ఇంద్రప్రమతికి, రెండవ దానీనీ బాష్కలునకు. (25) ద్విజసత్తముఁడయిన బాష్కలుడు నాలుగు సంహితలను రచించెను. తన్ను శుశ్రూష చేయుటకాత్రముగా నున్నవారు, తన క్షేమమును కోరినట్టివారును నయిన తన శిష్యులకు అధ్యాపనము చేసెను. (26)

శాంశపాయన ఉవాచ :-

ఆ నాలుగు సంహితలలో మొదటిశాఖ బోధము, రెండవ శాఖ అగ్నిమాతరము, మూడవశాఖ పారాశరి, ఇంక నాలుగవది యాజ్ఞవల్క్యశాఖ. ఋషి సత్తముఁడయిన ఇంద్రప్రమతి ఒక శాఖను అధ్యాపనము చేసెను. ఆతఁడు మహాభాగుడు యశస్వంతుడునగు మాండూకేయునకు అధ్యాపనము చేసెను. (28) మహా యశస్వియయిన ఋషి తన జ్యేష్ణ కుమారుఁడైన సత్యస్రవసునికి గల పెను. ప్రసిద్ధుఁడయిన సత్యప్రవసుఁడు సత్యపోతుఁడను తన కుమారున కధ్యాపనము చేసెను. సత్యహితుఁడు తన కుమారుఁడయిన సత్యశ్రీకి గల పెను. ఆ సత్యశ్రీ మహాత్ముఁడు, సత్యధర్మ పరాయణుఁడు. సత్యశ్రీకి ముగ్గురు శిష్యులు. వారు మహా మేధావులు. విద్వాంసులు, శాస్త్రార్ధసారమును గ్రహింపవలయునను ఆత్రము గలవారు. (30) వారిలో ప్రథముడు శాకల్యుఁడు. ఇంకోకఁడు రథోతరుఁడు. ఇక మూఁడవవాఁడు భరద్వాజుఁడు. భారద్వాజుఁడు బాష్కలుని కుమారుఁడు. ఈ మువ్వురు వేద సంహితలను ప్రవర్తింపఁజేసిరి. శాకల్యుఁడు దేవమిత్రుఁడుగా ప్రఖ్యాతుఁడు. శాకల్యుఁడు జ్ఞానాహంకార గర్వితుఁడు. ఓ బ్రాహ్మణులారా ! ఆతఁడు శాకల్యుఁడు. జనకుని యజ్ఞ సమయమున వినాశనమొందెను. (మరణించెను). శాంశపాయనుఁడు ఇట్లు పలికెను. “జ్ఞాన గర్వితుఁడయిన యా ముని యెట్లు జనకుని క్రతువున వినాశనము నొందెను? వాదమెట్లు జరిగెను? అయ్యది యెందులకు జరుగవలసి వచ్చెను? ఎవనితో వాదము జరిగినది? వీనినన్నింటిని నీవెఱుంగుదువు గాన, యథావృత్తము జరిగినది జరిగినట్లుగా సర్వము చెప్పుము.” (35)

సూత ఉవాచ :-

సూతుఁడు చెప్పెను.

జనకుని అశ్వమేధమున విద్వాంసుల సమాగమము గొప్పది జరిగెను. వేలాది ఋషీశ్వరులు వచ్చియుండిరి. (36) పోరందరు రాజర్షియైన జనకునీ యజ్ఞమును చూడగోరిరి. వచ్చిన బ్రాహ్మణులను చూచి జనకునకు జిజ్ఞాస కలిగెను. వీరందరీలో బ్రాహ్మణ శ్రేష్ఠుఁడెవ్వఁడు? నేనెట్లో నిశ్చయమును చేయగలుగుదును? అని యెంచు జనాధిపునకొక యూహ తోచెను. (38) అంత (బహుమతులుగా) ఆ రోజు ఒక సహస్రము ఆవులును, అంతకుమించు సువర్ణమును, గ్రామములను, రత్నములను, దాసీ జనములను తెచ్చెను. అంత రాజు మునులకు ఇట్లు ప్రకటించెను. “ఓ ఉత్తమ బ్రాహ్మణులారా ! మీకందరకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాను. తీసికొనీ రాబడిన ఈ నా విత్తమంతయు మీలో శ్రేష్ఠతమునకని యేతరంగుఁడు.” (41) ఆ వేదవిదులయిన ఋషీశ్వరులు జనకుని పోక్యములు వినిరి. మిక్కిలి విలువయైన ధనమును చూచిరి. వేద విదులయిన బ్రాహ్మణులు ధనము గ్రహీంపఁదలంచిరి. ఆశాపరులయిరి. వారందరు వేదవిజ్ఞాన మదోన్మత్తులయి యొండొరులను వాదములకు పిలిచిరి. వారందరు మనసా గత విత్తులు ‘ఆధనము సోది ఆ విత్తము నీదికాదు అనీ ఒండొరులకు స్వోత్కర్షతో చెప్పుకొనిరి. ఇంకొకఁడు ‘ఎందులకీట్లు గొప్పలాడెదవు?’ అనీ యీ విధముగా అనేకులు అనేక విధములుగా ధన దోషమున వాదములాడుకొనిరి. (43) కానీ యక్కడ వేలోక విద్వాంసుం డు, బ్రహ్మ కుమారుఁడు, ద్రష్ట యున్నాడు. ఆతఁడు యాజ్ఞవల్క్యుఁడు మహాతేజస్వి. బ్రహ్మవిత్తముఁడు, బ్రహ్మయొక్క యంశము నుండి సముత్పన్నుఁడు. ఆతఁడు సుస్వరమున ఒక వాక్యము పలికెను. (45)

అంత యాజ్ఞవల్క్యుఁడు, బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడు, శిష్యుఁడు నయిన వానితో “ఈ ధనమును తీసికొనుము. మన యింటికి తీసికొని వెళ్లుము. ఓ శిష్యా ! అయ్యది నాది. అందు సందేహము లేదు. అన్నీ వాదముల యందు నేనే వక్తను. నాతో సముఁడైనవాఁడెవ్వడింకొకఁడు లేడు. దీని నెవ్వఁడంగీకరింపఁడో ఆ విద్వాంసుఁడు వెంటనే నన్ను వాదమునకు పిలువవచ్చును” అనెను. (47) ఆ సమయమున ప్రళయ కాలమున సముద్రమువలె ఆ విద్వద్వరేణ్యార్ణవము సంక్షోభము నొందెను. అంత స్వస్థుఁడయి, యాజ్ఞవల్క్యుడు వారిని నవ్వుచున్న వానివలె యిట్లనెను. ఓ పూజ్య విద్వాంసులారా! కోపమొందకుఁడు. మీరందరు సత్యవాదులు. మనము ఒండొరుల నవగాహనము చేసికొనీ యథాశక్తి వాదము సల్పుదము. ఉత్తమ గుణయుక్తులను రాజు పరీక్షకులనుగా నియమించెను. అంత వాదములు చెలరేగెను. అనేక విధముల శబ్దములతో వేలకొలదీ శుభార్ధ ప్రతిపాదనలతో, పరిశీలనా శక్తి సంపన్నమయిన సూక్ష్మ దర్శనముతో, లోకము నుండి, వేదము నుండి అధ్యాత్మ విద్యా స్థానముల నుండి అలంకృతమయిన విధములతో వేదములు జరిగెను. ఇయ్యది ధన హేతుకముగా జరిగెను. ఋషులందరొక పక్షమున, యాజ్ఞవల్క్యులు ఒక్కొరోక పక్షమున (52) ఆ మునులందరు, ధీమంతుఁడైన యాజ్ఞవల్క్యునిచే ఒక్కొక్కరు ప్రత్యేకముగా పృచ్ఛింపబడిరి. కాని యెవ్వరును సమాధాన మొసంగలేదు. బ్రహ్మవిద్యారాశి, మహాయతీయు నైన యాజ్ఞవల్క్యుడు, ఋషీశ్వరుల నెల్లరను వాదమున జయించి, వాదకర్తయైన శాకల్యునీతో వెంటనే ఇట్లనెను. ఓ శాకల్య ! వక్తవ్యమును వచింపుము. ఎందులకీ వేదో ధ్యానించుచు నుండి పోయెదవు. (ఎవరి కోఱకు యజ్ఞము జరుగుచున్నదో ఆ రాజు) యజమాన్యుడు ఒక పందెము (పణము) నిడెను. ఆ పణము నేను గ్రహించితిని. (55)

ఈ విధముగా ఎదుర్కొని ధర్షింపబడగా శాకల్యునీ ముఖము నేత్రములు కోపముచే తామ్రవర్ణము నందెను. తన శిష్యులతో ననుసరింపం బడి శాకల్యుఁడు మునుల సన్నిధి యాజ్ఞవల్క్యునితో నిట్లనెను. “మమ్మందరను, ఉత్తమ బ్రహ్మవిదులను గడ్డి పలకలవలె తృణీకరించి, నీవు స్వయముగా మహాసారవంతమయిన విద్యాధనమును, స్వయంగ్రహముగా గ్రహింపగోరుచుంటివి. ఇట్లు శాకల్యునిచే పలుకబడి యాజ్ఞవల్క్యుం డిట్లనెను. “బ్రహ్మి ష్టులబలము విద్యాతత్త్వార్ధదర్శనమని యెఱుంగుము. బ్రహ్మ యందు నిమగ్నమయిన ధ్యానము గలవారు బ్రహ్మీష్ణులు. కోరిక ధన సంబంధమయినది. అందుచే ధనము మేము కోరుదుము, విప్రులు కామప్రశ్నధనులు. (వారికేది కావలసిన దాని నడుగువారు). అందుచే కోరినట్లుగా కామ ప్రశ్ననడగుదుము. (59) రాజర్షియైన జనకుడిడిన పణమిది. అందుచేతనే ఆ ధనము నాచే గ్రహింపఁబడినది. ఈ యాజ్ఞ వల్క్యుని పలుకులు విని శాకల్యుఁడు క్రోధోదగ్రుఁడయ్యెను. (60) తనకు తోచినట్లుగా నడుగుటకు శాకల్యుఁడు యాజ్ఞవల్క్యునిట్లడిగెను.  “ఇపుడు నాచే నుద్దిష్టములయిన కామప్రశ్నలకు యథార్థతః ప్రత్యుత్తరమిమ్ము”. మహాబ్రహ్మ విదులయిన వారిరువురి మధ్య అప్పుడు వాదము చెలరేగెను. సహస్రాధికప్రశ్నలను శాకల్యుఁడు వేసెను. ఋషులందరు వినుచుండిరి. యాజ్ఞవల్క్యుడు వానికి సమాధానమిడెను. ఇంక శాకల్యునకు వేలుప్రశ్నలుగానీ వాదముగాని లేదయ్యెను. అప్పుడు యాజ్ఞవల్క్యుడతనితో “ఓ శాకల్య ! నేనడుగు ప్రశ్నకొక్కదానికైన సమాధాన మిమ్ము” ఈ వివాదములో సమాధాన మీయకున్నచో మృత్యువు పణము” అనెను. (64)

సూక్ష్మ జ్ఞాన సంయుక్తమయినది సాంఖ్యమా? యోగమా? ఏది మిక్కిలి ముఖ్యతరమయినది? ఆధ్యాత్మికజ్ఞానపథమా? లేక ధ్యాన మార్గమా? అనెను. (65) ధీమంతుఁడయిన యాజ్ఞవల్క్యుని చేత సంచోదితమయిన ప్రశ్నమునకు శాకల్యుఁడు ప్రత్యుత్తరము తెలియకుండెను. అప్పుఁడాతఁడు మృత్యువొందెను. (66) ఈ విధముగా శాకల్యుఁడు ప్రశ్న వ్యాఖ్యానపీడితుఁడు. ధనార్డులలో నీ విధముగా పెద్ద వివాదము జరిగెను. ఋషులలో, ఋషులతో కూడికొని యాజ్ఞవల్క్యునకు వాదము జరిగెను. యాజ్ఞవల్క్యుడు ధనమును తన యశస్సును స్థాపించుకొని గ్రహించెను. తన శిష్యులలోఁగూడికొని అనంత నిగ్రహముతో యాజ్ఞవల్క్యుడు ఇంటి కరిగెను.

ఇది వాయుప్రోక్తము, మహాపురాణము నయిన బ్రహ్మాండ పురాణమందలి పూర్వభాగమందలి ద్వితీయానుషంగపాదమున వ్యాస శిష్యోత్పత్తి వర్ణనమను ముప్పది నాలుగవ అధ్యాయము సమాప్తము.