1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
33 - ఋషి లక్షణము
సూత ఉవాచ :-
సూతుఁడిట్లనియెను.
ఋషికుల యొక్క సుతులను కూడ ఋషులనుగా తెలిసికొనవలయును. వారు బ్రాహ్మణముల ప్రవక్తలు. (బ్రాహ్మణములు వేదములలోని ఒక విభాగము), వానిని నామముల వలన తెలిసికొనుఁడు. శ్రుతర్పులు (వేద విజ్ఞానమున ప్రసిద్ధులయిన వారు శ్రుతర్షులు). వీరితో మిక్కిలి ప్రధానులయిన వారు, సంక్షేపముగా చెప్పబడుచున్నారు. వారు బహ్వృచుఁడు, భార్గవుఁడు, పైలుఁడు, సాంకృత్యుఁడు, జాజలి, సంధ్యాస్త్రీ, మాఠరుఁడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుఁడు, ఉపమన్యుఁడు, ఇంద్ర ప్రమతీ, మాండూకి, శాకలి, భాస్కలి, శోకపాడి, నైలుఁడు, పైలుఁడు, అలకుఁడు, పన్నగుఁడు, పక్షగంతుఁడు, (ఇతరులు) ఈ శ్రుతరులు సంఖ్యకు ఎనుబది ఆరుగురు 86. (4) (వ్యాసుఁడు వైశంపాయనునకు యజుర్వేదము చెప్పెను. యజుర్వేదమునకు 86 భేదములు (శాఖలు) కలవు. ఆ 86ను శ్రుతర్షులు. వీరే కాక మరికొందరు ముఖ్య ఋషులు కూడ యజుర్వేదములో చెప్పఁబడినారు. వేద విజ్ఞానమున ప్రసిద్ధులయిన బహచులలో ఈ బ్రాహ్మణములు మిక్కిలి ముఖ్యమయినవి. వైశంపాయ నుఁడు, లౌహిత్యుఁడు, కంఠకోలుఁడు, అవశావధుః (?) శ్యామాపతీ, పలాండు, ఆలంబీ, కమలాపతీ, వారి శిష్యులు, ఆ శిష్యుల శిష్యులు మొత్తము 86 శ్రుతరులు. ఓ బ్రాహ్మణులారా ! ఈ ద్విజరులు (బ్రాహ్మణర్షులు) కృష్ణ యజుర్వేదమందలి చరక భాగమున అధ్వర్యులు అని చెప్పం బడిన వాని కంటే భిన్నములు). జైమిని, భరద్వాజుఁడు, కావ్యుఁడు, పౌష్యంజి, హిరణ్యనాభుఁడు, కౌశిల్యుఁడు, లౌగాక్షి, కుసుమీ, లాంగలి, శాలిహోత్రుఁడు, శక్తిరాజు, భార్గవుఁడు సామమును గానము చేయువారీ కాచార్యుఁడు ఐలపుత్రుఁడయిన పురూరవరాజు నలుబది ఆరుగురు ఇతర ఋషులు వారి శిష్యులతో సహ శ్రుతర్ధులు (9) కౌశీతి, కంకముద్దుఁడు, కుండకుండు, పరాశరుఁడు, లోభాలోభుఁడు, ధర్మాత్ముఁడైన బ్రహ్మబలుఁడు
క్రంథలుఁడు, మదగలుఁడు ధర్మవిదుడయిన మార్కండేయుఁడు ఈ తొమ్మండుగురు హోత్రవద్భ్రహ్మచారులుగా తెలిసికొనవలయును. (వీరు వేద విద్యార్థులు. హోమముల నాచరింతురు) (11) మంత్ర బ్రాహ్మణ వ్యాఖ్యాన కర్తల తరువాత కృష్ణ యజుర్వేదీయ చరకశాఖ ఆధ్వర్యవులు గ్రహింపఁబడవలయును. చలూభి, సుమతి దేవవరుఁడు, అనుకృష్ణుఁడు, ఆయువు, అనుభూమీ, ప్రీతుఁడు, కృశాశ్వుఁడు, సుమూలి, భాష్కలి వీరు చరకాధ్వర్యవులలో ప్రముఖులైన అధ్వర్యులు. వారు నమస్కరింప నరులయిన బ్రహ్మచారులు. వ్యాసుని కుమారుఁడు విద్వాంసుఁడునైన శుకుఁడు, లౌకి, భూరిశ్రవుఁడు, సోమావి, అతునాంతక్యుఁడు (?) ధౌమ్యుఁడు, కాశ్యపుఁడు, ఆరణ్యకులైన ఇలకుఁడు, ఉపమన్యుఁడు, విదుఁడు, భార్గవుఁడు, మధుకుఁడు, పింగలుఁడు, శ్వేతకేతువు, ప్రజాదర్పుఁడు, కహోడుఁడు యాజ్ఞవల్క్యుడు, శౌనకుఁడు, అనంగుఁడు, నిరతాలుం డు వీరందరు మధ్యమాధ్వర్యవులు. అదితి (దేవతల తల్లి) జలాప, మానవి, ఉత్తమాప్సరసలైన ఊర్వశీ, విశ్వయోషలు, ముద్గల, అనుజీవ, యశస్విని యైన తార (18) ప్రాతిమేధి, మహాతపస్వురాలయిన సుజాత ధర్మజ్ఞురాలయిన లోపాముద్ర, కోశీతిక వీరు వేదమునుజెప్పు బ్రహ్మతత్వమును జెప్పు స్త్రీలు బ్రహ్మవాదినులు. అప్సరసలతో సమానమైన విశిష్టమైన రూపము గలవారు. వీరందరు ఋషి పుత్త్రకులు, ముఖ్యులు, నాచే చెప్ప బడినారు.
వారు వేదశాఖల నిర్మించినవారు (వేదశాభా ప్రణయనులు) అందుచే వారీశ్వరులుగా పరిగణింపఁబడిరి. వారు మంత్రవక్తలు. (ఈశ్వరులు) (అధిపులు) మంత్రముల కనుగొనినవారు. ఋషులు, ఋషికులు (21) ఋషి పుత్రకులు వారి యొక్క కుమారులతో బ్రాహ్మణములను కల్పములను ప్రవచించిరి. (22) వారియొక్క మంత్రద్రష్టత్వమును వలెనే వారి వాక్యముల నేలలుంగవలయును. మంత్రము ఆజ్ఞాయుక్తమైనది. అద్వైతము, ఆయద్వైతము గంభీర శబ్దము. అది దీప్తము. (23) దాని చిహ్నము, పేరు మిక్కిలి ప్రత్యక్షమైనవి. దాని భూతభవిష్యత్తులు, వస్తువుల మార్పులు అట్లే (24) నీరుక్తము నందుఁజెప్పఁబడిన యర్థము గలది వాక్యము, ‘స్వాయంభువ’ మని (తనకు తాబుట్టినదని) వారు ఎఱుంగుదురు. నిగమములతోను, వివిధ. శబ్దములతోను, నిపాతములతోను నిండిన మహావాక్యము ఋషీకుల వచనము (మాట) అనవడును. (25) ఏదేని మంత్రముతో గూడియుండుట నామవిభక్తులతో ప్రత్యక్షముగా జెప్పబడినది ఋషుల వచనముగా సంమతము. స్పష్టపదయుతము కానిది, బహు సంశయాత్మకార్థము గలది ఋషి పుత్తకుల వచనము. అందరును పరిదేవతలు హేతు దృష్టాంతముల నుండి అపార్ధకము. (28) చిత్రశబ్దము అర్థ వివరణమున నశక్తమయిన కథనము మానుషము ‘మిశ్రులు’ అనబడు వ్యక్తులు తమ ప్రభావము వలన ఋషిత్వమును పొందిరి. (29) సముత్కర్ష కొఱకు, వారు వివిధ కులములలో జన్మించిరి. వారికి భూత భవ్య భవజ్ జ్ఞానము (త్రికాల జ్ఞానము) కలదు. వారు జన్మ దుఃఖమును నివారింతురు. (30)
మిశ్రుల యొక్క యావాక్యము గురువుల విలప్రవర్తకము. ధర్మశాస్త్ర ప్రణేతలు, స్వమహిమచే నెల్లచోటుల కరుగు సర్వగులు, అత్యంతమయిన తపః ప్రకర్ష కలిగినవారు. (31) ఋషులుగా సంస్కృతులు, వారు బృహస్పతి, శుక్రుడు, వ్యాసుఁడు, సారస్వతుఁడు మున్నగువారు. (32) ఆధ్యాత్మిక గ్రంథములయిన శాస్త్రరచయితలు వ్యాసులు. వారినే వేదవ్యాసులనుగా స్మరింతురు. వారు తరువాత జన్మించిన వారయినను, వారి పూర్వజులకంటే వారు మేధాశక్తిలో నధికులు. వారు అధికముగా ఐశ్వర్యముచే సంపన్నులగుట (ఇట ఐశ్వర్యము వట్టి ధనము కాదు ఈశ్వరాంశ) ఋషులుగా వారు సంస్మృతులు. ఋషిభావమున కాలముకాని వయస్సుకాని ప్రమాణము కాదు. వయస్సున చిన్నవాఁడయ్యు నొక వ్యక్తి బుద్ది విశేషమున జ్యేష్ఠతముఁడుగా నుండును. బుద్ధి విశేషమున బాలుఁడు ఘనతరుడయినచో, వయోధీకునీకన్న విద్వాంసుఁడయిన ఆతఁడు శ్రుతిమంతుఁడయిన ఋషి. వేదవిద్మననీషి. (35) మంత్రము పాదాక్షరముల చేత మితమయినది కాక శరణములచే నొప్పి, తుదినీ అధికముగా అక్షరముతో నుండునో అదీ యుజుర్మంత్రము. (కరణము - లయతోడియతి). ఇది యజుర్మంత్రము. (కరణము - లయతోడియతీ). (ఇది యజుర్మంత్రముల యందలి గద్యమునకే అన్వయించును కానీ గణబద్ద ఛందములకు కాదు). హ్రీంకారము ప్రణవము, గీతము, ప్రస్తావము, ప్రతీహోత్రము, ఉపద్రవము, నిధనము అను ఈ ఏడును సామమునకు సప్తవింధ్యము అని యెఱుంగునది.
పై వానిలో హ్రీంకారము, ప్రణవము లేకుండ నిది పంచవింధ్య మనంబడును. “బ్రహ్మణే ధర్మః” ధర్మము బ్రహ్మము కొఱకు అని చెప్పుటలో అంతర్నిహితము, సూచితము అగు అర్థము అని గ్రహింపవలెను. అప్పుడది ‘ఆశాస్తి’ (ఆశీస్సు) పరివేదనము విలాపము. (40) క్రోధము వలనఁగాని, ద్వేషము వలనఁగాని జరుగు ప్రశ్నాఖ్యానము అన్ని విద్యల యందలి మంత్రము యొక్క లక్షణముగా విహితమయినది. (41) ఋక్ యజుస్సు సామములుగా చెప్పబడిన మంత్రములకు నవవిధ లక్షణములు కలవు. 1. మూర్తి (రూపము) 2. నింద (నింద) 3. ప్రశంస (పొగడ) 4. అనుజ్ఞ (అంగీకారము) 5.ఆక్రోశము (అధిక్షేపించుట - తిట్టుట) 6. తోషము (తృప్తి) 7.ప్రశ్నము {ప్రశ్నమడుగుట) 8.ఆఖ్యానము (కథనము) 9.ఆశాస్త్రి (ఆశీర్వాదము) మంత్రభేదములు చెప్పెదను. అవి 24 విధములు. (43) 1.ప్రశంస 2. స్తుతి 3. ఆక్రోశము 4. నింద 5. పరిదేవన 6.అభిశాపము 7.వీశాషము 8.ప్రశ్నము .ప్రతివచనము 10.ఆశీస్సు 11.యజ్ఞము 12.ఆక్షేపము 18. అర్థాఖ్యానము 14. సంకథ 15. వియోగము 16. అభియోగము (యుద్దము) 17.కథ 18సంస్థా (స్థితి) 19.వరము (అనుగ్రహము) 20,ప్రతిషేధము (తిరస్కారము) 21. ఉపదేశము 22. నమస్కారము 23.స్పృహా (కోరిక) 24. విలాపము. ఇవి 24 విధములయిన మంత్రములు. యజ్ఞ తత్త్వజ్ఞులైన ఋషులచే విహితములయిన బ్రాహ్మణ నిర్మాణములీ విధముగానున్నవి. హేతువు కారణము) నిర్వచనము (ప్రత్యేక వివరణము) నింద, ప్రశస్తి, సంశయము, నిధి, పురాకృత (పూర్వకాలమున చేసిన క్రియ) పురాకల్పము (గీతకల్పము) వ్యవధారణ కల్పన (విధి విధానము) ఉపమ ఇవి బ్రాహ్మణముల నిర్మాణము యొక్క దశ విధములు. (48) సర్వ శాఖా బ్రాహ్మణములకీలక్షణమే విహితము, హేతు శబ్దము ‘హంతి’ నుండి ఉత్పన్నము. అయ్యది ఇతరులచే చెప్పబడిన దానిని చంపును లేదా ఆపదము హినోతి (పోవుట) నుండి వ్యుత్పన్నము చేయవచ్చును. (అర్థ పరిప్రాప్తే) అర్థము తెలిసిన తరువాత నిర్వచనమన చెప్పిన వాక్యము యొక్క అర్థ నిశ్చయము. (50)
దోషగణనమున నిందా సూచక పదములుండుట నిందయని ఆచార్యులందురు. ‘ప్రశంస’ అనుపదము ‘శంస్’ ధాతువు నుండి కలిగినది. ఉపసర్గ ప్ర. ‘ప్ర’ తో ప్రశంసతి అగును. ప్రశంస ఉత్తమ లక్షణ కథనము. ‘ఇదం తు ఇదమ్’ ఇదీ యిది, ఇదంతు న ఇదం. ఇది ఇది కాదు. ఈ విధముగా నెచ్చట అనిశ్చితత్త్వముండునో అది సంశయము. “ఇదమేవం విధాతవ్యం” ఇది ఈ విధముగా చేయవలయును. అనునది వీధి. (52) ‘ఇది యితరుని యొక్క ఉత్తీ’ అనునది పండితులచే ‘పురాకృతి’ గా నుదాహరింపఁబడినది. మిక్కిలి పరోక్షార్థమయిన ఉక్తి పురాకల్పము. (ప్రాంత కథనము). (53) ‘పురా’ పదము జరిగిపోయిన దానిని సూచించును. పూర్వమెప్పుడో యది జరిగియుండుటచే, తత్రాచీనకథ. పురాకల్పము మంత్రములచే, బ్రాహ్మణములచే, కల్పములచే, శుద్ద వేదములచే నిగమములచే) నిశ్చయింపక చేసినది వ్యవధారణ కల్పన అనంబడును. ‘యధావి ఇదం తథా తత్ వై’ ఇది యెట్లున్నదో, అదియట్లున్నది. (ఇది దానివలె నున్నది). అనునది ఉపమ యనంబడును, (55) ఇదీ బ్రాహ్మణము యొక్క పదియవ స్వభావ లక్షణము. ఈ విధముగా, ప్రారంభమున, బ్రాహ్మణము యొక్క లక్షణ విధానము పండితులచే విహితము. (50) బ్రాహ్మణ విదులయిన పండితులచే ప్రతిపదము వ్యాఖ్యానింపబడి మంత్రార్థముద్దిష్టమయినది. విధిదృష్టములయిన కర్మలయందు మంత్ర ప్రయోగము కల్పింపఁబడినది. (57) ‘మంత్ర’మను పదము ‘మంత్రయతీ’ యను ధాతువు నుండి యుత్పన్నమయినది. బ్రాహ్మణము బ్రాహ్మణ (పదము) నుండి పుట్టినది. (?) సూత్ర విదులు సూత్రము నిట్లు నిర్వచించిరి. అల్ఫాక్షరము. అసందిగ్ధము (అర్ధ విషయమున నెట్టి సందేశము లేనిది). సారభూతమయినది. (విశ్వతో ముఖము) సర్వ విషయ సంపన్నత కలిగినది. అందు అనవసరమయిన అధికమయిన యక్షర ముండరాదు. అయ్యది అనవద్యముగా దోషరహితముగా నుండవలయును. ఇట్టిదీ సూత్రముగా చెప్పబడినది.
ఇది మహాపురాణము వాయు ప్రోక్తమునయిన బ్రహ్మాండ పురాణము నందలి పూర్వభాగమందలి ద్వితీయానుషంగపాదము నందలి ఋషిలక్షణమను ముప్పది మూఁడవ అధ్యాయము.
