1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము
15 - భూమిపొడవు-వెడల్పు - జంబూద్వీపము
సూత ఉవాచ :-
సూత ఉవాచ :
సూతుడు అనెను.
ఇట్లు ప్రజల సన్నివేశమును నాలకించి శాంశపాయని పృథివీ యొక్క సముద్రము యొక్క పొడవును విస్తరమును గూర్చి నియతుఁ డయిన సూతుని అడిగెను. “ఎన్ని ద్వీపములున్నవి? సముద్రములెన్ని? ఎన్ని పర్వతములు స్మరింపఁబడినవి? ఎన్ని (వర్షములు) ఉపఖండములు? నదులెన్ని చెప్పబడినవి? మహాభూతముల ప్రమాణములను, చంద్రునియొక్క సూర్యునియొక్క ప్రమాణములను, గతులను, అట్లే లోకములను, యథార్థముగ విస్తరముగ సర్వము మాకు చెప్పుము”. (1,3)
సూతుఁడిట్లు వచించెను.
పృథివి యొక్క పొడవును, విస్తరమును, సముద్రముల యొక్క సంఖ్యను, ద్వీపముల యొక్క విస్తృతిని, బహువిధ ద్వీప సప్త ద్వీపాంతరము లయిన భేదములను మీకు చెప్పెదను. వానిని క్రమముగా చెప్పుటకు సాధ్యము కాదు. ఏలయన ఈ ప్రపంచమంతయు వానిచే పరీవృతమయి యున్నది. చంద్రాదిత్య గ్రహములతో సహితముగా సప్తద్వీపములను వివరించెదను, (4,6) అందు మనుష్యులు వారి ప్రమాణములను ఊహచే (తర్కముచే) చెప్పుదురు. తర్కముచే గూడ ఆవస్తువుల స్థితి నెవ్వడు చెప్పలేఁడు. వానిని గూర్చి ఊహించుట కయినను సాధ్యము కాదు. అవియ చింత్యములు, ప్రకృతి పరములయిన వానిని అచింత్యములందురు. తొమ్మిది ఉపఖండములతో (వర్షములతో కూడియున్న జంబూద్వీపమును ఉన్నదియున్నట్లుగా యథాతథము వక్కాణీంచెదను. వాని పొడవులను విస్తరములను వాని మండలమును (వాని చుట్టుకొలతలను) యోజనముల చేనెఱుంగుఁడు. అయ్యది (ఆ జంబూద్వీపము) అంతయు శతసహస్ర యోజనములు. (9)
అది నానా జనపదాకీర్ణము, వివిధములయిన శుభంకరములయిన పురములతో నున్నది. సిద్దులయొక్క చారణుల యొక్క సంచారములతో, సంకీర్ణము; పర్వతములచే నుపశోభితము, ఆ పర్వతము శిలాజాల సముద్భూతములయిన వివిధములయిన ధాతువులు కలిగియున్నవి. పర్వతముల నుండి ప్రవహించు నదులచే నిండియున్నది. (10,11) జంబూద్వీపము చాలా పెద్దది; సర్వత్ర శ్రీమంతములయిన పృథు.మండలములు కలది; బహు విధములయిన భూత భావనచే (ప్రాణిఉత్పత్తిచే) కూడిన నవభువనములచే పరివృతమై యున్నది. (12) జంబూ ద్వీపము అంతయు. లవణి సముద్రముచే చుట్టబడియున్నది. ఆ లవణ సాగథ విస్తారము జంబూ ద్వీపపు విస్తారమే (13) ఉపవర్షములను విభజించు నట్టిపర్వతము లారున్నవి. వానిని క్రింద నుదాహరించెదను. ఆ పర్వతములకు అనుబంధ పర్వత శ్రేణులు కలవు. అయ్యవి ఇరుప్రక్కల తూర్పు సముద్రమున' పశ్చిమ సముద్రమున మునింగి వ్యాపించి యున్నవి. (14) హిమవత్పర్వత మంతయు ఇంచుమించుగా మంచుచే ఆవృతము. హేమ కూట , పర్యతము బంగారముతో నిండినది. నిషధ పర్వతము చాలా పెద్దది. అయ్యది అన్ని ఋతువుల యందు సమానముగా సుఖ వంతముగా నుండును. (15) మేరు పర్వతము రమ్యతమ మయినది. అయ్యది సౌవర్ణము. నాలుగు రంగులు కలది. అయ్యది శిఖరము నందు ముప్పది రెండు వేల యోజనముల విస్తీర్ణము కలది. (16) అయ్యది ఆకారమున వృత్తము. అది చతురస్రము. సమున్నతము. అయ్యది ప్రజాపతిగుణకలితము. దాని పార్వముల యందు నానా వర్ణములు కలవు (17) అయ్యది అవ్యక్త ప్రభవుండయిన బ్రహ్మ యొక్క నాభినుండి పుట్టినది. తూర్పు భాగమున నది శ్వేత వర్ణము కలది. అందుచే నది బ్రాహ్మణులతో తుల్యమయినది. (18) ఉత్తర భాగమున నది స్వభావ యుతముగ రక్తవర్ణము కలది. అది యందుచే క్షాత్ర ధర్మయుతము. ఇట్లనుట కెన్నీయో కారణములు కలవు. (19)
ఆ మేరువు దక్షిణమున పీతవర్ణము కలిగియున్నది. అందుచే ధాని వైశ్యత్వము సువ్యక్తము. పశ్చిమమున నది శృంగపత్ర తుల్యవర్ణము కలది. అందుచే నది శూద్ర భావము సందినది. ఇట్లు వర్ణములతో తుల్యముగా నాలుగు రంగులు చెప్పఁబడినవి, స్వభావ సిద్ధమయిన దాని వృత్తత్వము, పరిమాణము, వర్ణత్వము చెప్పబడినవి. (21) 'నీల' పర్వతము వైడూర్యమణిమయము. శ్వేతద్వీపము శ్వేతవర్ణము. పరిపూర్ణముగా సువర్ణమయము. శృంగ పర్వతము నెమలి పింఛపు వర్ణము కలది. అదియు స్వర్ణమయము. ఈ పర్వత రాజములన్నియు సిద్ధచారణ సేవితములు. ఆ పర్వతముల ఆంతర వ్యాసము తొమ్మిది వేల యోజనములు (23) మహా మేరుపర్వతము యొక్క మధ్యభాగమున ఇలా వృత నామక పర్వతము కలదు. ఆ పర్వతము యొక్క విస్తీర్ణము నవ సహస యోజనములు (24) ఈ మేరు పర్వతము దానీ మధ్య భాగమున ధూమ రహిత అగ్ని వలె నుండును. వేదియొక్క పూర్వార్థము దక్షిణపు ఉత్తరార్ధము ఉత్తరమేరుపు. (25) షట్ వర్షములకు (ఉప ఖండములకు) సంబంధించిన వర్ష పర్వతములు విస్తీర్ణమునను ఔన్నత్యమునను ద్విసహస్ర యోజనములు (26) జంబూ ద్వీప విస్తీర్ణము ననుసరించీ చెడూ విస్తీర్ణము చెప్పు బడినది. నీల నిషధ పర్వత ద్వయము ద్వీ సహన ద్వీశతయోజనముల పొడవు గలిగినది. (27) మిగిలిన నాలుగు పర్వతములు నీల నిషధ పర్వతముల విస్తీర్ణము కంటే తక్కువ విస్తీర్ణము కలది శ్వేత హేమ కూట పర్వతములు ఒక్కొక్కటి తొమ్మిది సహస్ర యోజనములు మాత్రమే. హిమ పర్వతము, శృంగవత్పర్వతము ఒకొక్కటి ఎనుబది సహస్రముల యోజనములు మాత్రమే (28, 29)
వాని మధ్య జనపదములు వర్షములు (ఉపఖండములు) కలవు. (29) ఉపఖండములు ఏడు. ఈ వర్షములు పర్వతావృతములు. ఆ పర్వతములు జలపాతములచే విషయములు, అందుచే అవి అగమ్యములు, వివిధములయిన నదులచే నవి యడ్డదిడ్డముగా నున్నవి. అందుచే ఒక వర్షము నుండి వేదోక వర్షమునకు ప్రయాణించుట కష్టము. (అవి పరస్పరము దుర్గమములు) (30) వాని యందెల్లడను నానా జాతి జంతువులు నివసించుచున్నవి. ఈ హైమవతము 'భరతవర్ష నామముచే బహు విశ్రుతము. (31) దీనికి పరముగా (పైనీ) హేమ కూటము ఉన్నది. అయ్యది 'కిం 'పురుష' మను పేరుచే స్మరింపఁబడుచున్నది. నైషధమను నుపవర్షము హేమకూటమును దాటియున్నది. దానికి 'హరివర్ష మనిపేరు. (32) 'హరివర్షము' నకు పైని ఇలా వృతమున్నది. (ఈ ఇలా వర్షము మేరు పర్వతము నందు మధ్య నున్నది) 'నీల' పర్వతము ఇలా వృతమునకు పరమందున్నది. ఈ నీల పర్వతము రమ్యక' మను నామమున ప్రఖ్యాతము. (33) “శ్వేతము రమ్యక పర్వతమునకు పైన నున్నది 'హిరణ్మయ” మని ఇది ప్రఖ్యాతము. హిరణ్మయమునకు పైని (పరముగా) శృంగవత్పర్వతమున్నది. దీనికి 'కురు' అని పేరు. (34) దక్షిణోత్తర దిశల నున్న ఈ రెండు పర్వతములు ధనురాకారమున నున్నవి. మిగిలినవి నాలుఁగు చతురస్రపు టాకారమున దీర్ఘముగ నున్నవి. వానీకి మధ్యమమున ఇలా వృతమున్నది. (35) 'వేద్యర్థము' నైషధమునకు క్రిందుగా నున్నదీ అయ్యది దక్షిణ వేద్యర్ధమని ప్రఖ్యాతము. నీలవంతమును, దాటియున్నట్టిది ఉత్తర 'వేద్యర్ధము' (36) వేద్యర్ధము యొక్క దక్షిణ పార్శ్వమున వేద్యర్ధమునకు మూఁడు వర్షములు కలవు. వేద్యర్ధమునను త్తరభాగమున మూడు వర్షములు గలవు. మేరువు వాని మధ్యనున్నదనియు, ఇలా వృతము మేరువు మధ్యనున్నదనియు నెఱుంగవలయును. (37)
'నీల'మునకు దక్షిణముగా, నిషధ కుత్తరముగా వ్యాపించి యొక మహా శైలము కలదు. దానికి మాల్యవంతమని పేరు. (38) అయ్యది నిషధ పర్వతపు వైపుగా నీలపర్వతము నుండి వేయి యోజనములు వ్యాపించి యున్నది. ఆ మాల్యవంతము ఇరువది నాలుగు వేల యోజనములు విస్తీర్ణము వ్యాపించినదిగా కీర్తింపఁబడినదీ. (39) దానికి పశ్చిమముగా గంధమాదన పర్వతముండుట నెఱుంగ వలయును.. దాని పొడవులో, వ్యాప్తిలో గంధమాదనము మాల్యవంతముతో తుల్యమయినదని ప్రశస్తి నొందినది. (40) కనక పర్వతమయిన మేరు పర్వతము, రెండు పరీమండలముల (వలయముల) మధ్య నున్నది. ఆ మేరు పర్వతము నాలుగు వర్ణములతో నొప్పుచున్నది. అది ఇరు ప్రక్కల సమ వ్యాప్తి నొంది మిక్కిలి యున్నతమయినది. (41) రాజువలె సమధిష్టితమై సుమేరువు కాంతితో ప్రకాశించును. అయ్యద్ తరుణాదిత్య తుల్యమై విధూమమయిన అగ్నివలె నున్నది. (42) దాని ఔన్నత్యము 64 యోజనముల యెత్తు. భూమిలోనికి 16000 యోజనములున్నది. దానిచుట్టు కొలత కూడ 16000 యోజనములు. (43) శరావము నందుండుట వలన మూర్ధ భాగమున 32 యోజనములు, దాని చుట్టుకొలత అంతయు వెడల్పునకు మూఁడు రెట్లున్నది. మండలాకార ప్రమాణమున నుండుటచే దాని మానమును త్ర్య సమానములో (అనగా త్రిభుజమానములో) చెప్పుదురు. దాని పరిధి (చుట్టు కొలత) 48 సహస్ర యోజనములు. (45) త్ర్యస మానములో గణించిన 6 యోజనము లధికము. చతురస్రమానములో పరిగణించినది 64000 యోజనములు (46) అది మహా దివ్య పర్వతము. దాని యందు దివ్యౌషధులు కలవు. (47)
ఆ పర్వతమంతయు శుభములు సువర్ణమయములయిన భువనములచే నావృతమై యున్నది. ఆ పవిత్ర శైల రాజము నందు సర్వ దేవతాగణములు, గంధర్వులు, ఉరగులు, రాక్షసులు, కనంబడుదురు. వారితో కూడ పవిత్రులయిన అచ్చరల సమూహములు కాననగును. ఆ మేరు పర్వతము సర్వ భూతములకు క్షేమమును కల్గించు భువనములచే పరీవృతమయి యున్నదీ. (48,49) దానీ నాలుగు దిక్కుల యందు (భాగములయందు) నాలుగు భువనములు (దేశములు) అధిష్టితములై యున్నవి. ఆ నాలుగు, తూర్పున భద్రాశ్వములు, దక్షిణమున భరతములు, పశ్చిమమున కేతుమాలములు, ఉత్తరమున కురులు. వీరందరు కృత పుణ్య పరీశ్రయులు. (50,51) గంధ మాదన పర్వత పార్శ్వము నందు వేడొక గొప్ప గండిక కలదు (ఇది యొక లోయమార్గముగా వచ్చును.) అయ్యదీ అన్ని ఋతువుల యందును రమణీయమయినది. ఆనంద ప్రదమయినది. ఆకర్షణీయమయినది. పవిత్రమైనదియు అది తూర్పునుండి పశ్చిమమునకు ముప్పది రెండు వేల యోజనములు వ్యాపించి యున్నది. దాని ఆయామము (పొడవు) ముప్పది నాలుగు వేల యోజనములు. శుభకర్ములయిన కేతుమాలావాసులందు ప్రతిష్టితులై యున్నారు. అచ్చట మనుష్యులెల్లరు నల్లనీవారు, మహాసత్తులు, మహాబలులు; అచ్చట స్త్రీలు నల్లకలువల రేకుల వంటి వర్ణముతో సమాన వర్ణము కలవారు. వారందరు ప్రియదర్శినులు. అచ్చటోకదీవ్యమయిన పనస వృక్షము కలదు. దాని యందారు రుచులు కలవు. అదీ ఈశ్వరుఁడు (మహిమాన్వితము, సర్వశక్తి మంతము). అది బ్రహ్మ పుత్రుడుఁడు. కామచారీ; మనోజవము కలది. (55) వారు దాని ఫలరసమును త్రాగీ పదివేల సంవత్సరములు కలిసి జీవింతురు. మాల్యవంతము యొక్క పార్వమున, తూర్పుదిశను ఒక అపూర్వమైన గండిక కలదు. పశ్చిమ గండికవలె పొడవు విస్తీర్ణము కలది. అచ్చట నుండు భద్రాశ్వులు నిత్య సంతోషులని యెఱుంగవలయును. అందొక భద్రశాల వనము కలదు. (భద్రశాల - పట్టుకాయల ప్రత్తిచెట్టు) మహాద్రుమము అట 'మహాకాలామతరువు' (నల్లమామిడిగాబోలు) అందలి పురుషులు శ్వేతవర్ణులు. మహోత్సాహ బలసమన్వితులు. (58)
స్త్రీలు కుముదవర్ణాభలు. సౌందర్యవతులు ప్రియదర్శనులు. వారందరు చంద్రప్రభలు, చంద్రవర్ణలు. పూర్ణచంద్రతుల్యాననలు. వారి శరీరములు స్పర్శకు చంద్రశీతలములు. వారందరు నల్ల కల్వల పరీమళశోభితలు. వారీ ఆయుర్దాయములు దశ సహస్ర వర్షములు. వారందరు రోగరహితలు. (60) కాలామము యొక్క రసమును త్రాగి వారందరు స్థిరమౌవనలు. శ్వేత పర్వతమునకు దక్షిణ దిశను, నీలమున కుత్తరమునను రమణకమను వర్షము కలదు. అందలి మానవులు రతిప్రధానులు (భోగ పరులు), వీమలులు, వార్ధక్యము దుర్గంధము లేనివారు. (62) పోరు శుక్లవర్థులు. ప్రియదర్శనులు, వారి యభిజనము (పుట్టుక) సంపన్నమయినది. (ఉదారము) అచ్చట కూడ నొక గొప్ప న్యగ్రోధ (మట్టి) వృక్షము కలదు. పోనీ వర్ణము ఆరుణము. దానియొక్క ఫలరసమును సేవించుచు, ఆ మహాభాగులు సదో సంహృష్ణులయి, నరోత్తములై, పదుకొండువేల యైదు వందల సంవత్సరములు జీవింతురు. శృంగవత్పర్వతమునకు దక్షిణమున, శ్వేత పర్వతమునకు ఉత్తరమునను “హైరణ్వత” మను వరము కలదు. అందు హైర్వతీనది కలదు. అందు మహాబలులు, సుతేజస్కులు పుట్టుచున్నారు. వారందరు మహా సత్త్వులు మహావీరులు ధనవంతులు ప్రియదర్శనులు నయిన యక్షులు. వారందరు మహా తేజస్కులు. వారు పదకొండువేల మైదువందల సంవత్సరములు ఆయుః ప్రమాణము. కలవారు. ఆ వరమునందు ఒక గొప్ప 'లకుచ' (గజనిమ్మ) వృక్షము కలదు. అది షడసాశ్రయమయినది. దాని ఫలరసమును త్రావి వారు నీరామయులై (రోగరహితులై) జీవించెదరు. ఆ శృంగపంతము నందున్నతములైన మూఁడు శృంగములు కలవు. ఒక శృంగము మణిమయము; ఒకటి హిరణ్మయము : వేడొకటి సర్వరత్నమయము. అయ్యది సుందర భవనములచే నుపశోభితము. (70) శృంగవంతమునకుత్తరముగను, సముద్రమునకు దక్షిణమునను కురువులు కలరు. ఆ యుప వర్షము పవిత్రమయినది; సిద్దులు తరచుగా నచ్చట సేవింతురు. (71)
అచ్చటి వృక్షములన్నియును మధుఫలములు గలవి. తేనె, సుర ఫలించునవి. అవి నిత్యము ఫల పుష్ప పల్లవములతో నుండునవి. అయ్యవి వాని ఫలములయందు వస్త్రములను, ఆభరణములను కలిగించును. వాని ఫలములు వస్త్రముల ఆభరణముల నొసంగును. అచ్చటి కొన్ని వృక్షములు మిక్కిలి మనోజ్ఞములు, సర్వకామముల నొసంగును. అయ్యవి మంచి వర్ణము కలిగి, సువాసన గలిగి, రసవంతములైనట్టి మధువును పాలుగా కార్చును. (73) మరికొన్ని వృక్షములందున్నవి. వానిని క్షీరిణములందురు. (పాలు గలవి) అవి మిక్కిలి మనోహరములు, అయ్యవి అమృతోపమము షడ్రసయుతము నయిన క్షీరమును సదా స్రవించును. (74) అచ్చటి భూమి సర్వమణిమయము. సూక్ష్మమయిన బంగారు రేణువులయిన ఇసుకతో గూడినది. అయ్యది అన్ని ఋతువుల యందలి సర్వ సుఖములతోసంపన్నము. అవి నిష్పంకము (మట్టిలేనివి) దుమ్ము లేనివి. అది శుభవంతము, (75) దేవలోకము నుండి చ్యుతులయిన శుభవంతులయిన మానవులందు జన్మింతురు. వారందరు శుక్లవర్ల సంపన్నులు. (పుట్టుక చేతనే తెల్లని తనువులు కలవారు) వారందరు స్థిర యౌవనులు. (76) ఆచ్చరలతో తుల్యలయిన స్త్రీలకు మీథునములు (కలవలు) పుట్టుదురు. వారు అమృతోపమమయిన క్షీర వృక్షముల పాలు త్రావుదురు. (77) మిథునములు వెంటనే పుట్టుదురు. సమముగా వారు వృద్ధి పొందుదురు. వారందరు సమశీల రూప ప్రియత్వములు కలవారు. (18) వారన్యోన్యమనురక్తులు. చక్రవాక మిథునములతోడి సమానమయిన ధర్మములు కలవారు, ఒండొరుల వీడియుండరు. వారు రోగ రహితులు, శోకరహితులు. ఎల్లప్పుడు సౌఖ్యమునే సేవింతురు. (79) వారు నిత్యభోగులు. వారు మహావీర్యవంతులు; వారు పదునాలుగు వేల సంవత్సరముల యైదువందల యేండ్లు నివసింతురు. వారెన్నడు అన్య స్త్రీలను కామేచ్ఛతో సేవింపరు. (80).
ఇది వాయు ప్రోకమయిన బ్రహ్మాండ మహాపురాణమున పూర్వ భాగమున ద్వీతీయమైన అనుషంగ పాదమున పృథివ్యాయామ విస్తరమను పేర పంచదశాధ్యాయము.
