1 - బ్రహ్మాండ మహా పురాణము - పూర్వార్ధము

Table of Contents

3 - తృతీయాధ్యాయము

సూతుడిట్లు పలికెను.

దివ్యము, సర్వపాప ప్రమోచనకరము, చిత్రము, అనేకార్థ సంయుతము, వేద సమ్మితము నయిన కథను నాచే చెప్పబోవు దానిని వినుము. (1) ఎవ్వడీ కథను నెల్లప్పుడు స్మృతి పథమున నెలయించునో ఎప్పుడును వినునో, తన వంశమును శాశ్వత మొనర్చుకొని స్వర్గ లోకమున నతఁడు చిరకాలము గౌరవమున వెలుంగును. (2) యథావృత్తము, యథాశ్రుతము, కీర్తింపబడునట్టిది, వ్యక్తము చేయబడునట్టిది, పూర్వుల యొక్క కీర్తినీ వృద్దిని పరచునదియునగు దీని నెవఁడు విశ్వసించునో, యయ్యదీయైన యీ చరితము అరివినాశనకరము, ధన్యము, ఆయుర్వృద్ధికారకము, స్వర్గదము, స్థిరకీర్తిమంతులయొక్క పుణ్యకర్ములయొక్క సంకీర్తనము. ఏ మహాత్ముని ఇచ్ఛయే కల్పమనబడునో, పరిశుద్ధ వస్తువై పరగునో అట్టి హిరణ్యగర్భునకు, పురుషునకు, ఈశ్వరునకు, అజునకు, ప్రథమరూపునకు, శ్రేష్ఠునకు, ప్రజాసృష్టికర్తకు, లోకతంత్రజు నకు, పరమాత్ముఁడునయిన బ్రహ్మకు నమస్కరించి, మహత్తు మొదలుకొని విశేషాంతము, వఱకు విరూపయుతము, లక్షణాన్వితము, పంచ ప్రమాణములతో గూడినది షట్గ్రౌంతయుతము నైయేది పురుషాధిష్ఠితమై యున్నదో (7) అట్టి దానిని సమస్తము తుదివఱకు చెప్పెదను. శ్రేష్ఠమయిన భూతసృష్టి, దానికి కారణమయిన అవ్యక్తము, సద్ అసదాత్మకమై యెయ్యది నిత్యమో, తత్త్వచింతకులు. (వేదాంతులు) దేనిని ప్రధానము, ప్రకృతియని వ్యవహరింతురో దానిని గూర్చి చెప్పెదను (8) అయ్యదీ గంధరూప రసములు లేనిది, శబ్దస్పర్శ వివర్జితము. అదియే జగత్తునకు కారణమయిన మహదోని, అదియే పరబ్రహ్మము, అదియే సనాతనము. అదియే సర్వభూతముల స్వరూపమై యవ్యక్తముగా నున్నది. (10). అది ఆదిలేనిది, అంత్యము లేనిది, పుట్టుక లేనిది, సూక్ష్మమయినది, దానినుండియే త్రిగుణములు పుట్టినవి. అది అసాంప్రతికము (ఎల్లకాలములయందుండునది) అజేయము, సద్ అసద్ పరమయిన బ్రహ్మము, (11) దాని యాత్మచేతనే యీ సమస్తము వ్యాప్తమై యున్నది. ఇయ్యది గుణ సామ్యత్వ మునూని సృజింపఁదలపోయ సర్వము తమో మయమగుట నప్రకాశంబై యుండెను. (12) సృష్టికాలమున ప్రధానమైన క్షేత్రజ్ఞాధిష్ఠితమైన బ్రహ్మము సగుణభావము నొంది భాసమానముకాగా (నది) మహత్తత్వమయ్యెను. (13)

అయ్యది అవ్యక్త సమాకృతమయి సూక్ష్మరూపము నొందజాలియుండును, సత్వోద్రేకముచేనదీ సత్త్వ ప్రకాశమయి యుండును. (14) ఆ మహత్తు సత్త్వసంపన్నము. ఏకైక కారణముగా నెఱుంగవలయును. క్షేత్రజ్ఞాధిష్ఠితమయిన యా మహత్తత్త్వము లింగమాత్ర సముత్పన్నమయి యొప్పును. (15) దానికి సంకల్పాధ్యవసాయంబులు అను వృత్తిద్వయము తత్సహకారులని యెఱుంగవలయును. సృజింపవలయునను నిచ్ఛలేకయే ఆ తత్త్వమే మహా సృష్టిని చేయును. (16) ధర్మము మొదలగు భూతములు లోకతత్త్వార్థ హేతువులయి దాని వలన కలిగెను. ఆ మహత్తత్వము వలన మనస్సు, దాని వలన నహంకారాదులు పుట్టెను. (17) ఆ మహత్తత్వము నుండియే ప్రజ్ఞాసంధి మొదలయినవి సర్వస్వము అసంఖ్యాకమగు నాతని యంశలచే జనించేను. తత్ర్పభువు సర్వభూతరక్షకుఁడై యిష్టఫలదుఁడై యుండును. (18) భోక్త, తాత (సంరక్షకుండు) విభక్తాత్మయు, ప్రవర్తకుండు మనస్సే యయి యుండును, తత్వ సంగ్రహరూపమయిన ఆ మహత్తత్వము పరిణామము వలన నమేయమై యుండును. (19) మిగిలిన తత్త్వముల వలన ఆ మహతత్త్వము గొప్ప తనువు గలిగిన వాడుగా స్మరింపబడుచున్నాఁడు, విభాజ్య విభాగంబుల స్వతంత్ర శక్తి గలిగి యుండును. (20) పురుషుఁడు భోగ సంబంధము వలన ఆ తత్త్వము గలిసీ యుండును. బృహత్తత్త్వము వలన, సర్వము విపులమై వ్యాపించి యుండుట వలన అన్నింటికి నాశ్రయమగుట వలన నాతఁడు బ్రహ్మయనంబడును. ఆతఁడే యనుగ్రహముచే నఖీల జంతువుల దేహముల సమగ్ర పూర్ణములుగ చేయును. (22) ఆ పురుషుడు సర్వభావములను వేటువేయగా నెటింగును. ఆతని పూర్వము బ్రహ్మకు సర్వకార్యకరణము సంసిద్ధమయ్యెను. (23) ఆతఁడే బ్రహ్మసమ్మితుఁడయిన క్షేత్రజ్ఞుడు ఆతఁడే ప్రథమతః శరీరి. ఆతఁడే పూర్వము పురుషుఁడుగా వచింపబడెను.(24)

సర్వభూతములకు బ్రహ్మ ఆదికర్త. సత్పురుషులలో సాతఁడు ప్రథముఁడు. అగ్రయాయి. (25) అతడు హిరణ్యగర్భుఁడయి, యా యండము నందు చతుర్ముఖుఁడై యుద్భవించెను. (26) సర్గము నందు ప్రతిసర్గము నందు నాతఁడే బ్రహ్మ సమీతుడై యుండు క్షేత్రజుఁడు, (27) ఇంద్రీయ యుతుఁడై యాతడేల్ల విషయముల నెఱుంగును. విషయ నివృత్తి వలన వాని సోతఁడు త్యజించును. కాని ఆ దేహాదులను పునః సమాహార సంధుల పూని యిష్టరీతి వర్తించును. ఆతనీ మహత్త్వము వలన హిరణ్మయంబగు మేరుపు పంచత్వము నొందగలదు. సాగరాంబువులు గుంట లలోని నీటివలె నశింపను గలవు. (28) అందుచే నాతడంతటి యసమాన ప్రజ్ఞానిధియని లుంగవలెను. ఆ హిరణ్మయాండము నందు, ఈ సప్తలోకములు, పృథివీ, సప్తద్వీపములతోడి సప్తసముద్రములు, (29) మహా పర్వతములు, సహస్రాధికములయిన నదులు అంతస్థములయిన యీ లోకములు, ఈ యంతర్విశ్వమయిన జగత్తు (30) నక్షత్రములతో, గ్రహములతో, వాయువులతో చంద్రాదిత్యులు, ఏ లోకాలోకములున్నవో. యవి యన్నియు యీ యండము నందు ప్రతిష్ఠితములై యున్నవి, (31) జలంబులు పదింతలు గుణాధికమయిన తేజస్సు చేతను, బాహ్యమున దశగుణాధీకమయిన వాయువుచే తేజస్సు, ఆ వాయువు దానికంటే దశ గుణాధికమయిన ఆకాశము చేతను, ఆయాకాశము సర్వము మరల సర్వభూతాదీకముల చేతను బాహ్యమున ఆవృతమై యున్నవి. (33) భూతాదులు గొప్పదియైన ప్రధానముచే ఆవృతమయినది. ఈ ఏడు ప్రాకృతములయిన ఆవరణముల చేతను హిరణ్మయమయిన యండము, ఆవృతమైయున్నది. (34) ఇవి మరల ఇచ్చచే నావృతములై యొప్పి పరస్పరము గ్రహించి గ్రసించి యుండును.

ఈ విధముగా పరస్పరము నొకదాని నోకటి యొడిసిపట్టుకోని ఆధారాధేయభావము నొంది పరగుచు, సర్గమున వికారమొంది నిసర్గమున అవికారమొంది యేకత్వమొంది యుండును. (36) అవ్యక్తమును క్షేత్రమందురు. బ్రహ్మ క్షేత్రజ్ఞుఁడు. ఇట్లు ప్రాకృతమగు ఘన సర్గము అంతయు క్షేత్ర విదుని (బ్రహ్మ) యొక్క కార్యము. (37) అబుద్ధి పూర్వకముగా మొట్టమొదట మేలుపుతీగవలె నీది ప్రాదుర్భవించెను. ఇదీ హిరణ్యగరునియొక్క జన్మవృత్తాంతము యథాతథాముగా చెప్పబడినది. దీని నెఱిగినయతండు నిస్సంశయముగా ఆయుష్మంతుఁడు కీర్తి మంతుఁడు, ప్రజ్ఞావంతుఁడు నగును.

ఇదీ వాయుప్రోక్త బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున, ప్రథమ ప్రక్రియా పాదమున హిరణ్యగర్భోత్పత్తి వర్ణనమను తృతీయాధ్యాయము.