1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము
18 - మహాపురుష స్తోత్రము
సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లనెను-
విష్ణుమూర్తి యొక్క మాయవలన మాయచే కప్పబడిన దేవతలందరు బ్రాహ్మణునితో పాటు మాలతీదేవి దగ్గరకు పోయిరి.
బ్రహ్మదేవుడు ఉపబర్హణుని శవముపై తన కమండలంలోని నీరు చల్లి అతనికి ఆందమైన శరీరము, మనస్సంచార మేర్పడునట్లు చేసెను. జ్ఞాన స్వరూపుడైన శివుడు జ్ఞానమును ప్రసాదించగా ధర్మదేవత ధర్మ జ్ఞానమును బ్రాహ్మణుడు ప్రాణములనిచ్చాను. ఆగ్నేని చూడగానే జఠరాగ్ని, మన్మథుని చూడగానే సమస్తమైన కోరికలు, ప్రపంచమునకే ప్రాణ స్వరూపుడైన వాయువువలన ప్రాణసంచార రూపమైన ఉచ్చ్వాస నిశ్వాసములేర్పడినవి. సూర్యుని వలనచూపు, సరస్వతి వలన మాటలు, లక్ష్మీదేవివలన ఆ శవమునకు కాంతి కలిగినవి.
ఐనను ఆశవము సోమరీ పడుకొని ఉన్నట్లు ఆత్మతప్ప తక్కిన చైతన్యమునంతయు పొందెను.
బ్రహ్మదేవుని సూచనననుసరించి సాద్వియైన మాలావతి నదిలో స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించినది.
మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను-
సమస్త కారణములకు కారణమైన పరమాత్మను నమస్కరించుచున్నోను. ఆ పరమాత్మ లేనిచో ఈ ప్రపంచమున నున్న ప్రాణులన్నీ శవములవలె ఉండుమ. సమస్త ప్రాణులు చేయు కర్మలకు అతడు సాక్షీభూతుడు. అట్లే అంతటా అతడు ఉన్నప్పటికి ఎవరికీ కనిపించడు. పరమాత్మ సృష్టియైన ప్రకృతి త్రిగుణాత్మకమైనది. ఆ ప్రకృతియే బ్రహ్మాది దేవతలకు కారణముగా నున్నది. ఆ పరమాత్మను సేవించినందువలననే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచమునంతా సృష్టించుచున్నాడు, విష్ణుమూర్తి ఆ సృష్టినంతయు రక్షించుచున్నాడు. అట్లే శంకరుడు సంహరించుచున్నాడు.
దేవతలు, మునులు, మనువులు, యోగులు, సిద్దులు, సత్పురుషులందరు ప్రకృతికి అతీతుడైన ఆ పరమేశ్వరుని సేవించుచున్నారు. ఆ పరమేశ్వరుడు సాకారుడు, నిరాకారుడు కూడా. ఆతడు స్వేచ్చామయుడు, శ్రేష్ఠులలో శ్రేష్టుడు. వరములనిచ్చువాడు, వరముల నిచ్చుటకు తగిన అర్హత కలవాడు, ఆతడే తపఃఫలము, తపస్సుకు కారణము. తపఫలములనిచ్చువాడు. తపస్వరూపుడు, అందరకు ఆధారభూతుడు, ఆన్నీటికి కారణరూపుడు, కర్మస్వరూపుడు ఆందరి కర్మలకు ఫలితము కూడ ఆతడే. కర్మఫలములనిచ్చువాడు కర్మలకు కారణము, వాటి క్షయమునకు అతడే కారణమగుచున్నాడు,
ఆ పరమాత్మయే తేజఃస్వరూపుడు. అతడు భక్తుల ననుగ్రహించుటకు శరీరమును ధరించినవాడు. భక్తులు, ఆతనిని సేవించుటకు ధ్యానించుటకు ఆతనికి శరీరము లేనిచో వారికి కష్టమగును. ఆ పరమాత్మ కోటి సూర్యులతో సమానమైన కాంతికలవాడు. ఆతవి తేజస్సు మండలాకారమున నుండును. అతని రూపము మిక్కిలి అందమైనది. నూతన మేఘమువలె నల్లనిది. ఆతడు శరత్కాలమందలి పద్మములవంటి కన్నులు కలవాడు. శరత్కాలమందలి పున్నమి చంద్రునీవలె గుండ్రని ముఖము కలవాడు. చిరునవ్వుకలవాడు. కోటి మన్మథుల సౌందర్యము కలవాడు, రత్నభూషణాలంకృతుడు ఆతని అవయవములన్నీ చందన చర్చితములై యుండును.
ఆతడు రెండు భుజములు కలవాడు. చేతిలో మురళినీ ధరించును. పచ్చని పట్టుబట్టలు ధరించును. రాధాకాంతుడైన ఆతడు కిశోర వయస్కుడు. శాంతుడు అనంతుడు.
ఒక్కచోట అతడు గోపాంగనలతో పరీవృతుడు. మరియొకచోట నిర్జనమైన వనమున ఉండును. ఒకచోట రాసక్రీడలో విహరించును. మరియొకచోట రాధతో కలసియుండును. ఒకచోట గోషవేషముతో గోపబాలకులతో కలసియుండును. మరియొకసారి శతశృంగపర్వతముపై నున్న బృందావనమున ఉండును. ఒకసారి శిశురూపియై ధేనువులను రక్షించును. మరియొకసారి గోలోకమున విరజానదీ తీరమున నున్న పొరీజాతవనమున గోపికలను సమ్మోహపరుచుచు వేణువును మధురముగా పాడును. ఒకప్పుడు వైకుంఠమున చతుర్భుజుడుగా కనిపించును.
ఒకచోట లక్ష్మీకాంతుడై చతుర్భుజులైన పార్షదులతో కలసియుండును. మరియొకచోట అతని అంశ రూపమైన విష్ణురూపముతో స్వేత ద్వీపములో లక్ష్మీదేవితో కలసి యుండును.
మరియొక చోట ఆ పరమాత్మయొక్క అంశాంశమైన బ్రహ్మదేవుని రూపముతోమండుమ. అట్లే ఆతని అంశమైన శివరూపముతో మంగళప్రదుడై కనిపించును. ఆతని పదునారవ అంశమే సమస్తమునకు ఆధారమైన పరాత్పరుడు. మహత్స్వరూపుడు. విరాడ్రూపుడు. అతని ఒక్కొక్క రోమమున ఒక్కొక్క విశ్వమున్నది.
ప్రపంచముల రక్షించుటకు ఆతడు ఆంతాంశములతో అనేకావతారములను ధరించును. ఒకప్పుడతడు యోగుల యొక్క సత్పురుషులయొక్క హృదయములలోనుండును. ప్రాణులకు, ప్రాణరూపి, పరమాత్మ, ఈశ్వరుడునైన ఆ శ్రీకృష్ణుని స్తుతించుటకు నేను శక్తురాలిని కాను.
నిరీహుడు, నిర్లక్ష్యుడు వాక్కులకు మనస్సునకు అందనివాడు ఐన ఆ పరమాత్మను ఆదిశేషుడు తన సహస్ర వదనములలో నుతించలేడు. అట్లే పంచవక్రుడైన పరమశివుడు. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు హస్తిముఖుడైన వినాయకుడు, ఆరుముఖములు కల కుమారస్వామికూడ అతనిని స్తుతించలేరు. ఆదేవిధముగ లక్ష్మీదేవిగాని, సరస్వతి గాని వేదములుగాని, ఆతనిని స్తుతించలేవు. అట్టి సమయమున విద్వాంసుడు అతనిని స్తుతించగలడా?
మరి శోక సంతప్తయైన స్త్రీ నిన్ను ఏమని స్తుతించును? అని పలికి గంధర్వరాజపుత్రికయైన మాలావతీ ఏడ్చెను.
మాలావతి దయానిధియైన పరమాత్మను భయముతో మాటిమాటికి నమస్కరించెను. ఆమె చేసిన స్తుతికి సంతోషించిన కృష్ణుడు సమస్త శక్తులతో ఉబర్హణునిలో నిలిచిపోయెను. అప్పుడా ఉషబర్జుణుడు లేచి, స్నానముచేసి, శుద్ధ వస్త్రములు ధరించి వీణను పట్టుకొని ఎదుటనున్న దేవతాగణములను, బ్రాహ్మణుని స్తుతించేను. ఆ సమయమున దేవతలు దుందుభులను మోగించిరి. పుష్పవర్షమును కురిపించిరి. అట్లే ఆ దంపతులనాశీర్వదించిరి.
ఉబర్హణుడు దేవతల వరముచే జీవము పొంది క్షణకాలము దేవతల ముందు వృత్యము చేయుచుపాటపాడెను. ఆ తర్వాత అతడు తన తలిదండ్రులతో భార్యతో కలసి గంధర్వనగరమునకు వెళ్ళిపోయెను.
మాలావతి బ్రాహ్మణులకు రత్నములన వివిధములైన ధనములనిచ్చి వారికందరకు మృష్టాన్షమునీడెను. వేదములు చదీవించి ఉత్సవమున చేసినది.
శ్రీమన్నారాయణుని నామగానమే చాలాగొప్ప ఉత్సవము. దానిని చూచి దేవతలందరు తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి.
ఓ శౌనక మహర్షి స్తోత్రములలో శ్రేష్ఠమైన దీనిని నీకు చెప్పితిని, ఈ స్తోత్రము చాలా మంగళప్రదమైనది.
ఈస్తోత్రమును పూజా సమయమున చదువువారికి నైపులైనచో హరిభక్తి, హరి యొక్క దాస్యము లభించును. ఆస్తికులై పరమశ్రద్దతో ఈ స్తోత్రమును చదివినచో ధర్మార్థ కామ మోక్షముల ఫలితము లభించును. విద్యను కోరిన విద్య, ధనము కోరిన ధనము, వివాహము కోరుకొనినచో వివాహము, పుత్రులను కోరుకున్న పుత్రులు, ధర్మమును కోరుకొవిన ధర్మము, కీర్తిని కోరుకొన్న కీర్తిని పొందగలడు. అట్లే రాజ్యభ్రష్టుడు రాజ్యమును, సంతానమును పొగొట్టుకొనినవాడు సంతానమును, రోగార్తుడు ఆరోగ్యమును పొందును. ఇంకను కారాగారబద్దుడు విముక్తిని, భయపడినవాడు నిర్భీతిని, గొప్ప ఆడవిలో క్రూరజంతువులతో కలసి ఆటవికులకు పట్టుబడినను, దవాగ్నిదగడైనను, సముద్రములో మునిగిపోయినను ఈస్తోత్రమహిమవలన తప్పించుకొనును.
శ్రీబ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి శౌనక సంవాదముగల బ్రహ్మ ఖండమున గంధర్వునకు జీపదానము చేయు సందర్భమున చెప్పబడిన మహాపురుష స్తోత్రముగల పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.
