1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

17 - విష్ణుమూర్తి ప్రశంస

సౌతిరువాచ- సాతిమహర్షి ఇట్లు ఆమెను -

ఆ బ్రహ్మ సభలోనికి వచ్చిన బ్రాహ్మణుని చూచి దేవతలందరు. లేచి నిలబడి ఒకరికొకరు గుసగుసలు పోవుచుండిరి. విష్ణుదేవుని మాయవల్ల మోహితులైన దేవతలు విప్రరూపములోనున్న శ్రీహరిని గుర్తుపట్టలేదు. ఐనను ఆ బ్రాహ్మణుడు ప్రాణులకందరకు మేలు చేసే పరమ సత్యమును సమధురమైన వాక్కుతో దేవతల నిట్లు పలుకరించెను.

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను-

ఈమె ఉపబర్హణుడను గంధర్వుని భార్య. చిత్రరథుడను గంధర్వుని కూతురు. భర్త చనిపోవుటచే కలిగిన దుఃఖముచే బాధపడుచు భర్త ప్రాణములను కోరుచున్నది. అందువల్ల ఏమీచేయవలెనో ఏది సమయోచితమో దానిని మీరు తెలుపుడు. మిక్కిలి తేజస్సుగల ఈ పతివ్రత మిమ్ములను శపించ దలచితే నేను మీ క్షేమమును గోరి ఇక్కడకు వచ్చితిని. మీరు కూడ శ్వేత ద్వీపములో శ్రీహరిని స్తోత్రము చేసితిరిగదా! మీకు ఆధిపతియైన విష్ణుమూర్తి ఇక్కడకు రాలేదా? శ్రీహరి మీవెనక రాగలడని ఆకాశవాణి చెప్పిన మాట తలక్రిందులుగా ఎందుకు జరుగును? అను బ్రాహ్మణుని మాటలు విని జగద్గురువైన బ్రహ్మదేవుడు మిక్కిలి క్షేమంకరమైనది, హితము, సత్యము ఐన పలుకులు పలికెను. 

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-

ఓబ్రాహ్మణుడా! నాచే శపింపబడిన నాపుత్రుడగు నారదుడు ఉపబర్హణ గంధర్వుడుగా జన్మించెను. మరల నాశాపము చేతనే యోగమార్గముచే ప్రాణములను వదలి పెట్టెను. ఇతడు లక్షయుగములు భూమిపై నివసించవలసి యున్నది. ఇతడు శూద్రుడుగా పుట్టి మరల నా పుత్రుడైన నారదుడు కాగలడు.

ఇతనికి వేయి సంవత్సరముల ఆయువు మాత్రము మిగిలిపోయినది. భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహమువలన ఇతనికి నేను స్వయముగా ప్రాణములివ్వగలను. కానీ మరల శాపము ఇతనికి తగలకుండ చేయవలసియున్నది.

 ఇక మీరు ఇక్కడకు శ్రీహరీ రాలేదని అన్నారు. కాని హరి అంతట ఉండువాడు. అందరికి ఆత్మ ఆతడే. అతని శరీరము ఇక్కడ లేనంత మాత్రాన హరిలేనట్లా? స్వేచ్చామయుడు, పరబ్రహ్మ, భక్తుల ననుగ్రహించువాడు, సర్వజ్ఞుడు, సనాతనుడగు నా శ్రీహరి అన్నీ విషయములను చూచుచుండును. ఏమీ అనగా వ్యాప్తికి సంబంధించినది. “ను” అనగా సమస్త ప్రదేశము. అంతటా వ్యాపించి యున్నందువలన అతనికి “విష్ణువు” అను పేరు కల్గినది. అని బ్రహ్మదేవుడు పలికెను.

అపవిత్రుడైనా, పవిత్రుడైనా, ఎట్టి పరిస్థితిలోనున్నను, శ్రీమన్నారాయణుని సేవించినవాడు బాహ్యమున, అంతరంగమున పవిత్రుడగుచున్నాడు. పనులు ప్రారంభించినప్పుడు, పనుల మధ్య, పనులు పరిసమాప్తమగుచున్నప్పుడు విష్ణుమూర్తిని తలచినచో అతడు చేయుపని పరిపూర్ణమగును. పైగా అది వైదిక కర్మవలె పవిత్రమైనదగును.

ఈ ప్రపంచములను సృష్టించునేను, సంహరించు శంకరుడు, కర్మసాక్షియైన ధర్మదేవత, లోకములను సంహరించుకాలుడు, పాపాత్ములను శిక్షించు యముడు, మృత్యుకన్య, సమస్తమునకు ఆదిభూతమైనది, అన్నిటికి కారణమైన ప్రకృతి, ఇవన్నియు ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞను సదా పరిపాలించుచున్నవి.

మహేశ్వర ఉవాచ- మహేశ్వరుడిట్లనెను –

ఓ బ్రాహ్మణకుమారా! బ్రహ్మదేవుని కుమారులలో ఎవరి వంశమువకు సంబంధించినవాడవు. వేదాలను చదివి వీపు గ్రహించిన పారమేది? వీపు ఏమునీంద్రుని శిష్యుడవు? నీ పేరేమి? ఏ ప్రకాశము సూర్యుని వలెనున్నది. కాని వయస్సులో చాలా చిన్నగా కన్పించుచున్నావు?

వీపు మాకందరకు ప్రభువైన విష్ణుమూర్తిని అనుకరించుచున్నావు. అందరి హృదయములలో మండిన ఆ పరమాత్మ తత్వము మీకు తెలియకున్నది. పరమాత్మ ప్రాణుల శరీరములనుండి వెళ్ళినచో వారి ప్రాణాలే వెళ్ళిపోవును. ఆ పరమాత్మ వెంట అందరు దేవతలనమసరించు మానవులవలె పోదురు. జీవుడు ఆ పరమాత్మకు ప్రతిబింబము.

మనస్సు, జ్ఞానము చేతన, ప్రాణములు, ఇంద్రియములు, బుద్ధి, మేధ, ధృతి, స్మృతి, విద్రా, దయ, సోమరితనము, ఆకలి, దప్పి, పుష్టి శ్రద్ధ, సంతుష్టి కోరిక, సిగ్గు శక్తి మొదలైనవన్నియు ఆ భగవంతుని ఆ పరిపాలించునవి. ఆ పరమేశ్వరుడు బయలుదేరునప్పుడు శక్తి అతని ముందు నడచుచుండును. ఈ విధముగా దేవతలు, అన్యులు అతని ఆజ్ఞను సర్వదా పరిపాలించుచుందురు.

పరమేశ్వరుడు ప్రాణుల దేహములో ఉన్నచో ఆ ప్రాణి సమస్తకర్మలు చేయగలుగుమ. ఆ పరమేశ్వరుడే శరీరమును వదలిపెట్టినచో ఆ శరీరము ఆస్పశ్యమై శవమై పారవేయవలసివచ్చును.

ప్రపంచములనన్నిటినీ సృష్టించు బ్రహ్మదేవుడు ఆశ్రీమన్నారాయణుని పాదపద్మములను ఎల్లప్పుడు ధ్యానము చేయుచుండును. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని గురించి లక్షయుగములు తపస్సు చేసి ప్రపంచములను సృష్టించు సామర్థ్యమున జ్ఞానమును పొందెను.

నేను చాలాకాలము అధికమైన తపస్సు చేసినను నా మనస్సుకు తృప్తికలుగలేదు. ఇప్పటికీ నేను నా ఐదు ముఖములతో ఆ సర్వేశ్వరుని సామగుణములను కీర్తించుచు సమస్త కర్మలపై నిస్సహుడనై అంతటా తిరుగుతూ ఉంటాను. ఆ శ్రీమన్నారాయణుని గుణ కీర్తనము చేయుచున్నందువలన మృత్యువు వాముండి దూరముగా పోయినది. ఆ పరమేశ్వరుని నామజపము చేయువానిని చూచి మృత్యు దేవత పరుగెత్తుకొవీ పోవును. ఆ పరమేశ్వరుని నామగుణములను కీర్తన చేయుటవలననే నేమ మృత్యుంజయుడనైతివి. నేను కాలములో విలీనమై మరల ఆ కాలమునుండి ఆవిర్భవించెదను. ఐతమ కాలము కావీ మృత్యువుకానీ ఆ దేవదేవుని అనుగ్రహమువలన నన్ను సంహరించలేవు.

ఆ నారాయణుడు గోలోకమున, వైకుంఠమువ, శ్వేతద్వీపమున ఉన్నాడు. గోలోకమున నున్న శ్రీకృష్ణువకు వైకుంఠమున, శ్వేతద్వీపమున నున్న నారాయణుడు ఆంశావతారమైనను విప్పునకు, మిణుగురుకు భేదము లేనట్లే ఆంశికి, ఆంశములకు మధ్య భేదములేదు.

ఇరువదియొక్క దివ్యయుగములైన ఆది మన్వంతరము. ఇరువది ఎనిమిదవ దేవేంద్రుడు గతించినచో ఆదీ బ్రహ్మదేవునకు ఒక్కదినమగును. అట్లే నూట ఇరువది ఎనీమిది సంవత్సరములు బ్రహ్మదేవునకు గతించినచో భగవంతుడైన శ్రీమహావిష్ణువుకు ఆదీ ఒక క్షణము.

అందువలన నేనెంత గొప్పవాడనైనను శ్రీకృష్ణ పరమాత్మ మహిమను తెలుసుకొనజాలను. అని చెప్పి శంకరుడు ఊరకుండెను. ఆతరువాత ధర్మదేవత ఇట్లు చెప్పసాగెను.

ధర్మ ఉవాచ- ధర్మదేవత ఇట్లనెను –

శ్రీ మహావిష్ణువు పాణిపాదములు సర్వత్ర ఉండును. ఆతని నేత్రములు సమస్తమును దర్శించుమ. అతడు అందరిలో అంతరాత్మగౌనుండి ప్రత్యక్షమగుచున్నాడు. కాని అతడు చెడ్డవారికి అప్రత్యక్షముగానుండును. అట్లే విష్ణుమూర్తి గురించి చెప్పుచు ఆతడింతవరకు సభకు రాలేదనీ నీవంటివి కదా. సర్వత్ర వ్యాపించియున్నవాడు ఇచ్చట లేడని అనుకొనుట మతిభ్రమించి చెప్పిన మాటలు కాగలవు. మునులు ఈమాటలన్నను వారికి మతిభ్రమించినదని చెప్పవచ్చును.

పెద్దలను నిందించుచున్నప్పుడు మంచివాడు ఆ మాటలను పట్టించుకొనడు. విననట్లుండును. ఎందువలననగా పెద్దలనిందించువాడు ఆ నీందవాక్యముల విన్నవాడు ఇద్దరు కుంభీపాక నరకమునకు పోదురు. పొరపాటున పెద్దల నిందను విన్నచో విష్ణుమూర్తి స్మరణ చేసికొని ఆ పాపమునుండి తప్పించుకొనవలెను. ఇష్టముగొనో అనిష్టముగానో విష్ణునిందను ఎవరు చేయుదురో, దాని నెవరు విందురో, వెక్కిరింతురో వారు బ్రహ్మదేవుడు బ్రతికి ఉన్నంతవరకు కుంభీపాకనరకమున బాధలు పడుదురు. విష్ణునంద మూడు విధములని బ్రహ్మదేవుడు తెలిపెను. 1. చాటున చేసిన నింద 2 అతనిని ఒప్పుకొనకపోవుట 3. అన్యదేవతలతో సమానముగా భావించుట.

గురునిందను పితృనిందను చేసిన నరాధముడు సూర్య చంద్రులున్నంతవరకు నరకలోకమున ఉండును, విష్ణుమూర్తి గురుతుల్యుడు, జనకునితో సమానుడు. అతడే పోషకుడు, రక్షకుడు, భయము తొలగించువాడు, కోరిన కోరికలను ఇచ్చువాడు. కావున ఆతనిని ఏ పరిస్థితిలోను నిందించుట తగనిది.

బ్రహ్మదేవుడు, శంకరుడు, ధర్మదేవత పలికిన మాటలు విని బ్రాహ్మణుడు నర్పి వారితో మధురముగా ఇట్లు పలికెను.

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను-

ఓ ధర్మ స్వరూపులైన దేవతలారా! నేనెచ్చట విష్ణునందను చేసితిని, శ్రీహరీ ఇచ్చటకు రానందువలన ఆకాశవాణి పలుకులు వ్యర్థమైనవి అంటిని. పూజ్యులైన మీరు ఇందలి ధర్మార్థమును తెలుపుడు. సభలో పక్షపాతవైఖరితో నున్నవారు వారీ పూర్వులను నూరుతరములవరకు నరకమునకు పంపుదురు.

మీరు విష్ణుమూర్తి ఎల్లప్పుడు సమస్తప్రదేశములందుండును అని అంటిరి ఐనచో విష్ణువు దగ్గరకు వరమును కోరి శ్వేత ద్వీపమున కేలపోతిరి? అట్లే అంశమునకు ఆంశికి భేదములేనిచో మహాత్ములు ఆంశమును వదలి పరిపూర్ణుడైన భగవంతుని ఎందుకు సేవించుచున్నారు?

మానవులకు ఆశ మిక్కిలి బలీయమైనది. ఆది కోటి జన్మలెత్తినా ఆరాధించుటకు కష్టమైన వాడును, ఆసాధువులకైతే అసాధ్యుడు ఐన శ్రీకృష్ణుని సేవింపజేయును. క్షుద్రులైనా మహాత్ములైనా అందరు పరమపదమును పొందవలెనని కోరుకుందురు. పొట్టివాడైనా చంద్రుని తన బాహువులలో నుంచుకోనవలెనని కోరుకున్నట్లుగా వీరూ పరమపదమును కోరుకొందురు.

శ్వేత ద్వీపములో నివాసముంటున్న విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శంకరుడు దిక్పాలకులు, ఇతర దేవతలు, చరాచర సృష్టి ప్రతీ విశ్వమున కనిపింతురు. ఈ ప్రపంచముల సంఖ్యను, దేవతల సంఖ్యను లెక్కించుట ఎవరికిని సాధ్యము కాదు.

ఆందరకు ప్రభువు భక్తుల ననుగ్రహించు శ్రీకృష్ణుడే. సమస్త బ్రహ్మాండములకు పైన వైకుంఠలోకము కలదు. దాని పైన ఏబదికోట్ల యోజనముల విస్తీర్ణమైన గోలోకమున్నది.

వైకుంఠమున లక్ష్మీపతియైన నారాయణుడు చతుర్భుజములతో, సునంద, నంద, కుముదాదిపార్షదులతో నుండును.

గోలోకమున నున్న శ్రీకృష్ణుడు ద్వీభుజుడు, రాధా రమణుడు, గోపకాంతలతో, ద్విభుజూలైన ఉపపార్షదులతో కలసియుండును. అతడు పరిపూర్ణుడు. సమస్త ప్రాణులకు ఆతడే ఆంతరాత్మ, స్వేచ్ఛామయుడైన ఆ పురుషుడు బృందావనములో రాసవిహారము చేయును. కోటి సూర్య సమప్రభము, మండలాకారములోనున్న ఆ జ్యోతి స్వరూపమును యోగులు సేవింతురు.

నూత్న మేఘమువలె నల్లనివాడు, ద్విభుజూడు, పచ్చని వస్త్రములు ధరించువాడు, కోటీ మన్మథుల యొక్క అందము కలవాడు, శాంతుడు, చిరునవ్వు కలవాడు, చంటిపిల్లవాని కళ్ళవలె నిర్మలమైన కళ్ళుగల శ్రీకృష్ణుని వైష్ణవులు సేవింతురు.

మీరందరు వైష్ణవులే కదా, నేను ఏవంశములో పుట్టితినని నాగురువు ఎవరని మీరు అడిగితిరి? దీనిని మీరే చెప్పవలసి యున్నది.

ఓబ్రహ్మదేవుడా! త్వరగా ఈగంధర్వుని (ఉపబరుణుని) బ్రతికింపుము. భావము చాల స్పష్టముగా ఉండగా వాగ్యుద్దమునకు పోపు మూర్ఖుడెవడుండును. దానివలన ప్రయోజనమేమి?

 ఈవిధముగా విప్రుని వేషమున నున్న జనార్దనుడు పలికి ఆ సభలో నవ్వుతూ కూర్చుండెను.

శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణములో విష్ణువు, దేవతల సంవాదముకల బ్రహ్మఖండమున విష్ణుమూర్తి ప్రశంసకల పదునేడవ అధ్యాయము సమాప్తము.