1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

7 - బ్రహ్మదేవుడొనర్చిన సృష్తిక్రమము

సౌతిరువాచ- సౌతమహర్షి ఇట్లు పలికెను -

బ్రహ్మదేవుడు తపస్సు చేసి తాను కోరుకున్న సిద్ధిని పొంది తొలుత మధుకైటభులనే రాక్షసుల మేధస్సుతో వృటివివి సృష్టించేమ. తరువాత ప్రధానమైన పర్వతాలనెనిమిదిటిని, అసంఖ్యాకమైన ఇతర పర్వతాలను కూడ సృష్టిచేపెను. ప్రధానమైన పర్వతాలపేర్లు ఇవి. 1. సుమేరు. 2, కైలాసము, 3. మలయ పర్వతము, 4. హిమాలయపర్వతము, 5, ఉదయగిరి, 6. అస్తాచలము, 7. సువేలాచలము, 8. గంధమాదన పర్వతము. అదేవిధముగా సప్త సముద్రములను, తూర్పుమండి పడమరవైపు ప్రవహించు నదములను, పశ్చిమమునుండి తూర్పునకు ప్రవహించు నదులను అసంఖ్యాకములుగా సృష్టించెను, సప్తసముద్రముల పేర్లివి. 1. లవణసముద్రము, 2. ఇక్షుసముద్రము, 3. సురాసముద్రము, 4. సర్పిస్సముద్రము, 5: దధి సముద్రము, 6. క్షీర సముద్రము, 1. జలసముద్రము అనునవి. ఇవికాక అనేక విధములైన వృక్షములను, పల్లెలను. నగరములను సృష్టి చేసెను. కమలాకారముగా ఉన్న ఈ భూమిపై ఏడు ద్వీపములమ సప్తకుల పర్వతములను సృష్టించేమ. బ్రహ్మదేవుడు సృష్టించిన ఏడు ద్వీపముల పేర్లివి. 1. జంబూద్వీపము. 2. శాకద్వీపము, 3. కుశద్వీపము, 4. ప్లక్షద్వీపము, 5. క్రౌంచద్వీపము, 6. వ్యగ్రోధ ద్వీపము, 7. పౌష్కరద్వీపము ఆమనవి.

మేరు పర్వతముయొక్క ఎనిమిది శిఖరములయందు అష్టదిక్పాలకుల విహారార్థము అందమైన ఎనిమిది పట్టణములమ బ్రహ్మదేవుడు సృష్టించెను. మేరు పర్వత మూలమున ఆదిశేషువీ పట్టణమైన పాతాళమున విర్మించెను. మేరు పర్వతముయొక్క పై భాగమున ఏడు స్వర్గముల సృష్టించెను. ఇవి 1. భూర్లోకము, 2 భువర్లోకము, 3. సువకము, 4 జనోలోకము, 5. తపోలోకము, 6. సత్యలోకము, 7. అన్ని శిఖరముల పైభాగముపమన్న బ్రహ్మలోకము, ఈ ఏడు లోకముల పైన ధ్రువలోకమున్నది.

ఆట్లే మేరు పర్వతముయొక్క క్రిందిభాగమువ ఏడు పాతాళములున్నవి. అవి 1. ఆతలము, 2. వితలము, 3. సుతలము, 4 తలాతలము. 5. మహాతలము, 6. పాతాళము, 7. అన్నింటికంటే క్రిందమన్న రసాతలము.

ఏడు ద్వీపములు, ఏడు స్వర్గములు, ఏడు పాతాళములు. ఈ లోకాలన్నీ బ్రహ్మదేవుని ఆధిపత్యముననున్న బ్రహ్మాండములోనివి.

ఈవిధముగా నున్న అసంఖ్యాకమైన బ్రహ్మాండములు సమస్తము కృత్రిమమైనవి. ఇవి అన్ని శ్రీ మహావిష్ణువు యొక్క రోమకూపములలో ఉన్నవి. ప్రతి విశ్వమునకు ప్రత్యేకముగ బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు, దేవతలు, మానవులు మొదలగువారున్నారు. బ్రహ్మాండముల యొక్క సంఖ్యను లెక్కించుటకు జగత్పతియైన బ్రహ్మదేవునికి, శంకరునికి ధర్మదేవతకు, విష్ణుమూర్తికి సాధ్యంకాదు. మరి దేవతలకు సాధ్యమవుతుందా? కొంతవరకు ఈశ్వరుడు వీటిని లెక్క పెట్టగలడు. ఐనను విశ్వము, ఆకాశము దిక్కులతోనున్న ఈ బ్రహ్మాండములను లెక్కించుటకు ఆతనికి కూడ సాధ్యంకాదు. ఈ విశ్వములందున్న దేవతలు ఆందరూ సృష్టించబడినవారు. వీరంతా కలవలె నశింతురు. వైకుంఠము, శివలోకము, ఈ రెండు లోకాల పైభాగాన నున్న గోలోకము ఈ ప్రపంచానికి వెలుపలనున్న ఆత్మ, ఆకాశము, దిక్కులవలె నిత్యమైనవి.

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి, శౌనక, సంవాద రూపమైన బ్రహ్మఖండమున సృష్టి నిరూపణమనే ఏడవ అధ్యాయము సమాప్తము.