1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

15 – మాలతి కాల పురుషుల సంవాదము

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను-

ఓ సాద్వి మాలావతీ! నీ భర్త ఏరోగము వల్ల చనిపోయెనో తెలుపుము. నేను వైద్యుడను. అన్ని రోగములకు చికిత్స చేయుదును. చనిపోయినట్లున్నా రోగమువలన చనిపోయినా నాకు గల వైద్యజ్ఞానముతో వారము దినములలో అతనిని బ్రతికించును, మృత్యువును, యమున, కాలుని, వ్యాధిని బోయవాడు పశువును కట్టివేసి తెచ్చినట్లు కట్టివేసి నీ ముందుకు తీసికొని రాగలను. దుష్టము అమంగళమైన వ్యాధికారణము వ్యాపించకుండా చేయు ఉపాయములను శాస్త్రజ్ఞానము ననుసరించి తెలుసుకొన్నాను. ఎవరైన బాధలు భరించలేక యోగమార్గమున దేహత్యాగము చేసినచో ఆతనిని కూడ యోగ పద్ధతిలోనే తిరిగి బతికించగలను. అందువలన నీ భర్త మరణకారణము నాకు తెలుపుము.

బ్రాహ్మణుని పై మాటలు విని మాలావతి సంతోషముతో ప్రశాంతమైన మనస్సుతో ఇట్లనెను.

మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను-

మాలతి (మాలావతి) మొదలు నల్లనిరంగు, భయంకర రూపము, ఎఱ్ఱని వస్త్రములు కలది. ఆరుభుజములతో దయకలిగి చిరునవ్వుతోనున్న మృత్యుకన్యను చూచెను. ఆమె ఆరువది నలుగురు పుత్రులతో తన భర్తయగు కాలుని వామపార్వమువనుండెను.

తరువాత మాలావతీ నారాయణాంశ కలవాడు, మిక్కిలి భయంకరమైన రూపము, ఆరు ముఖములు, పదునారు భుజములు, ఇరువదివాలుగు కండ్లు, ఆరుపాదములు, ఎఱ్ఱని వస్త్రములు ధరించిన కాలపురుషుని చూచెను. అతడు గ్రీష్మకాలపు సూర్యునివంటి కాంతికలవాడు, సర్వసంహార స్వరూపి. దేవదేవుడు, కాలమునకు ఆధిదేవత, చిరునవ్వు కల ముఖము, అక్షమాలగల కరముకలవాడు. పరబ్రహ్మ పరమాత్మ, ఈశ్వరుడు ఐన శ్రీకృష్ణుని మంత్రమును ఆతడు ఎల్లప్పుడు జపము చేయుచుండెను.

ఆ తరువాత మాలావతి ఆతిమహావృద్ధులు, తల్లియైన మృత్యుకవ్య సమీపములో చంటిపిల్లల వలె ప్రవర్తించు వ్యాధి సమూహములను చూచెను.

అటు పిమ్మట స్థూలపాదుడు కృష్ణవర్ణుడు, ధర్మస్వభావము కలవాడు, పరబ్రహ్మ సనాతనుడగు శ్రీకృష్ణుని మంత్రమునెల్లప్పుడు జపించువాడు, ధర్మస్వరూపి, సూర్యనందమడు ఐన యమధర్మరాజును చూచెను. ఆతడు పాపములు చేయుచున్నవారిని శిక్షించును.

మహాసాధ్వియైన మాలావతి సంతోషముతో వారిని చూచి మొదలు నిర్భయముగా యమధర్మరాజును ఇట్లడిగెను.

మాలావత్యువాచ - మాలావతి ఇట్లనెను –

హే   ధర్మరాజ ధర్మిష్ట ధర్మశాస్త్ర విశారద |

కాలవ్యతిక్రమే కాంతం కథం హరసి మే విభో ॥  

ధర్మశాస్త్రములన్నీ ఎరిగిన ఓ ధర్మరాజా కాలమును అతిక్రమించి నా భర్తను ఏవిధముగా తీసుకొని వెళ్ళితివి?

యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను-

మరణకాలము దాపురించని నాడేవడు ఈ భూమిపై చనిపోవుట లేదు. ఈశ్వరాజ్ఞలేక నేను చావని వావినెవవిని తీసికొని పోను. నేను, కాలుడు, మృత్యుకన్య. ఈ వ్యాధులు ప్రాప్తకాలు మాత్రమే భగవంతుని ఆజ్ఞతో తీసికొని పోవుచున్నాము.

ఈ మృత్యుకన్య అన్ని తెలిసిన వ్యక్తి. ఆమె ఎవరిని ఆశ్రయించునో అతనిని నేను కబళింతును.

మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను-

ఓ మృత్యుకన్యా! నీవుకూడ స్త్రీవి. నీకూ స్వామివేదన ఎట్లుండునో తెలియును, నేను బ్రతికి ఉండగా వా భర్తనెందుకు తీసికొని పోయితివి?

మృత్యుకన్యోవాచ- మృత్యుకన్య ఇట్లనెను-

మాలావతీ! నన్ను విశ్వమునకంత ప్రష్టమైన బ్రహ్మదేవుడు ఈ మారణకర్మమున నియోగించివాడు, ఆధికమైన తపస్పుచేసి కూడ దీనిని వదిలించుకొనలేక పోవుచున్నాము. గొప్ప తేజస్సుకల మహాపతివ్రత నమ్న, భస్మముచేసినచో అందరకు ఆశాంతి కలుగును. నా పుత్రులకు, నాభర్తకు నేను భస్మమైనందువలన ఏమైనా జరుగవిమ్ము. నేను దానికి బాధచెందను. నా భర్తయగు కాలునీ ప్రేరణనే నేను, నా పుత్రులైన వ్యాధులు ఈ పరీచేయుచున్నాము. ఇందు నా పుత్రుల తప్పు లేశమాత్రమైనా లేదు.

అందువలన వీపు ఈ విషయమును ఈ ధర్మసదస్సులో ధర్మజుడైన కాలుని ఆడుగుము. అతడు చెప్పినది విని వీకు ఏది ఉచితమని అనిపించునో దానిని చేయుము. మాలావత్యువాచ- మాలావతీ ఇట్లనెను-

ఓ కాలపురుషుడా! నీవు ఆందరుచేయు కర్మలకు సాక్షీభూతుడవు, కర్మస్వరూపివి, సనాతమడవు. నారాయణాంశ కల వీకు నమస్కారము. ఓ దయానిధీ ! వీపు సర్వజ్ఞడవు. అందరి దుఃఖములగురించి తెలియును. అట్టి నీవు నేను బ్రతికియుండగానే నా భర్తను ఎందుకు తీసికొని పోయినావు.

కాలపురుష ఉవాచ- కాలపురుషుడిట్లనెను-

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే బ్రహ్మఖండే మాలావతీ కాలపురుష సంవాదే పంచదశోధ్యాయః |

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములోని బ్రహ్మఖండమున మాలావతీ కాలపురుష సంవాదమను పదునైదవ అధ్యాయము నమాప్తము.