1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

10 - జాతి సంబంధ నిర్ణయము

 సౌతి రువాచ – శ్రీ సౌతమహర్షి ఇట్లు పలికెను.

ఓ శౌనకమహర్షి భృగువు యొక్క పుత్రులు చ్యవనుడు, శుక్రుడు. క్రతుమహర్షి, అతని భార్యయైన క్రియకు వాలఖిల్యులు పుట్టిరి. అట్లే అంగీరసునికి బృహస్పతి, ఉతథ్యుడు, శంబరుడను ముగ్గురు పుత్రులు కల్గిరి. వసిష్ఠుని పుత్రుడు శక్తి, అతని పుత్రుడు పరాశరుడు. పరాశరుని పుత్రుడు కృష్ణద్వైపాయనుడను వేదవ్యాసుడు. అతని పుత్రుడు శ్రీ శుకుడు, పులస్త్య మహర్షికి విశ్వశ్రవసుడు అతని పుత్రుడు ధనాధీపతియైన కుబేరుడు.

శౌనక ఉవాచ- శౌనక మహర్షి ఇట్లనెను.

పురాణములు బాగుగా తెలిసిన మీమాటలు నాకు అర్థముగాకున్నవి. ఇంతకుముందు కుబేరుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని వలన పుట్టినట్లు చెప్పినారు. కాని ఇప్పుడు చెప్పిన పద్ధతి దానికి పూర్తిగా భిన్నముగా నున్నది. దీనికి కారణమేమిటి? తెల్పగలరు.

సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లనెను.

పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని వలన దిక్పాలకులందరు ఆవిర్భవించిరి. బ్రాహ్మణ శాపము వలన ధనేశుడైన కుబేరుడు తిరిగీ విశ్రవసు పుత్రుడుగా జన్మించెను. ఏవిధముగా అంటే పూర్వము ఉతథ్యుడను బ్రాహ్మణుడు విద్యను పూర్తి చేసి గురువుకు దక్షిణ ఇవ్వవలెనని కుబేరుని దగ్గరకు వెళ్ళి కోటి సువర్ణములు (నాణెములు) యాచన చేసేను. కాని కుబేరుడు ఉతథ్యుని కోరికను సంతోషముతో మన్నించక ఇవ్వక తప్పదన్నట్లుగా వాటిని ఇచ్చుటకు ప్రయత్నించెను. అందువలన ఉతథ్యుడతనిని భస్మమగునట్లు శపించెను. ఆవిధముగా భస్మమైన కుబేరుడు విశ్రవసుని పుత్రుడుగా పునర్జన్మను పొందెను. ఆట్టే విశ్రవసునకు రావణుడు, కుంభకర్ణుడు, ధార్మికుడైన విభీషణుడు అనువారు కూడా పుత్రులుగా జన్మించిరి.

పులహునకు పాత్యుడనువాడు, రుచికి శాండిల్యుడు, గౌతమునకు సావర్ణి, కశ్యపునకు కాశ్యపుడు, బృహస్పతికి భరద్వాజుడు, అను పుత్రులు కలిగిరి. ఈ ఐదుగురి వలన ఆయా గోత్రములు, ప్రవరలు జరిగినవి.

బ్రహ్మదేవుని ముఖమునుండీ ఇతర బ్రాహ్మణ జాతులు ఉద్భవించినవి. వారు ఆయా ప్రదేశములయందు గోత్రములు లేకను ఉన్నారు. చంద్రుడు, సూర్యుడు, మనువుల గోత్రములనుండి క్షత్రియులు పుట్టినారు. బ్రహ్మదేవుని బాహువులనుండి ఇతర క్షత్రియజాతులు పుట్టినవి. అట్లే బ్రహ్మదేవుని తోడలనుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రజాతులు పుట్టినవి.

ఆ నాల్గు జాతుల సంకరమువలన వర్ణ సంకరములు జరిగినవి.

గోవులను కాచువాడు, మంగలి, భిల్లుడు, మోదకుడు, కూబరుడు, తాంబూలమిచ్చువాడు, స్వర్ణకారుడు వీరందరు వైశ్యజాతికి చెందినవారు. వీరిని సచూద్రులందురు. శూద్రస్త్రీయందు వైశ్యునికి పుట్టినవాడు కరణుడు, వైశ్యస్త్రీయందు బ్రాహ్మణునికి పుట్టినవాడు అంబష్ఠుడు.

విశ్వకర్మకు శూద్రస్త్రీయందు శిల్పకారులైన తొమ్మిది మంది పుత్రులుదయించిరి. వారిలో మాలాకారుడు, శంఖకారుడు, కమ్మరి, కువిందకుడు (సాలెవాడు) కుమ్మరి, కంచరి అను ఆరుగురు శిల్పులలో శ్రేష్ఠులు, సూత్రకారుడు (వడ్రంగి) చిత్రకారుడు, స్వర్ణకారుడు బ్రహ్మశాపమువలన పతితులై యాగము చేయుటకు అనర్హులైనారు.

శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను-

సౌతి మహర్షీ ! దేవుడైన విశ్వకర్మ శూద్రస్త్రీయందు పుత్రుల నేవిధముగా కన్నాడు. వారిలో ముగ్గురు ఎందువల్ల పతితులైనారు. వారికి ఎందువల్ల బ్రహ్మశాపము కలిగినది. ఈ విషయములన్ని పురాణములన్నీ తెలిసిన మహర్షీ! నాకు చెప్పుము.

సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లు చెప్పెను.

ఘృతాచియను అప్పర ఆందమైన వేషము ధరించి పుష్కర ప్రాంతమున వెళ్ళుచుండగా విశ్వకర్మ ఆమెనుచూచెను. ఘృతాచి ఇతనిని చూడగానే వికసించిన మనస్సుతో ఆమె వెంటబడి మన్మథావీష్ట హృదయముతో శృంగార కార్యమునకు రమ్మని ఆమెను ప్రార్థించెను.

రత్నాలంకార భూషణములు కలది, కోమలమైన సమస్తావయవములు కలది, పదునారు సంవత్సరముల స్త్రీవలె స్థిరమైన యౌవనముతో నున్నది. పెద్దనైన నితంబ భారముతో బాధపడుతున్నది, మునుల మనస్సులను సహితము మోహింపజేయునది, కామముతో బాగా నిండినది, ఐన ఘృతాచిని, కఠినమైన ఆమె పిరుదులను, గాలివల్ల కొంగు ప్రక్కకు జరుగుటవలన కనిపించిన కఠినము, గుండ్రము, ఎత్తైన ఆమె చన్నులను, చిరునవ్వుతో శరత్కాల చంద్రుని అపహసించు ఆమె ముఖమును, పండిన దొండపండువలె అందమైన ఆమె అధరోష్టమును, సిందూరబిందువులు కస్తూరీ బిందువులు, గొప్పనైన మణికుండలములతో ప్రకాశించు ఆమె చెక్కిళ్ళను చూచి కామశాస్త్ర పండితుడైన విశ్వకర్మ కామాన్ని పెంచునట్లు, వినసొంపైన మాటలు ఈవిధముగా పలికెను.

విశ్వకర్మోవాచ- విశ్వకర్మ ఇట్లు పలికెను.

నాయొక్క ప్రాణముల కన్న మిన్నయైన ఓ ప్రియురాలా! నా ప్రాణాలను అపహరించి ఎటు పోవుచున్నావు. కొద్దిసేపు ఇక్కడ ఆగుము. నిన్ను వెదకుచునే ఈ ప్రపంచమునంతా తిరుగుతున్నాను. నీవు కనిపించనిచో అగ్నిలో పడి నా ప్రాణములను తీసికొనుటకు సిద్ధమగుచున్నాను. నీవు మన్మథ లోకమునకు వెళ్ళినట్లు రంభ చెప్పగా వీనీ ఇప్పుడే ఇక్కడికి వచ్చితిని. పుష్పోద్యానములతో అందమైనది, మందమారుతముచే సువాసనగల సరస్వతీనదీ తీరమున యువకుడు, అందగాడు ఐన నాతో రమించుము. అనుభవము కలవారి మధ్య జరుగు సంగమము చాలా గొప్పది.

నీవు స్థిరమైన యౌవనము కలదానవు, చిరంజీవి, కాముకివి, కోమలాంగివి, సుందరస్త్రీలకు సుందరమైన దానవు, మృత్యుంజయుడైన పరమేశ్వరుని అనుగ్రహమువలన మృత్యువును జయించితిని. కుబేరుని భవనమునకు పోయి అమీతమైన సంపదను పొందితినీ. అట్లే వరుణుని నుండి రత్నమాలను, వాయువునుండి రత్నభూషణమును, అగ్నినుండి పరిశుద్ధమైన వస్త్రములజతను, మన్మథునివలన స్త్రీలను సంతోషపెట్టు కామశాస్త్రమును, చంద్రుని వల్ల దుర్లభమైన శృంగార శిల్పమును పొందితిని.

రత్నమాలను, వస్త్రములజతను, ఇతరాభరణములను అన్నిటినీ నీకు ఇవ్వవలెనని తలచి ఇక్కడకు వచ్చితిని. నిన్ను వెదకు సమయమున వాటినన్నీటిని ఇంటిలో పెట్టి వచ్చితినీ, సుఖసంభోగానంతరము వాటినన్నిటిని నీకు ఇత్తును. ఆను కాముకుడైన విశ్వకర్మ మాటలు విని ఘృతాచి చిరునవ్వుతో నీతి యుక్తము మనోహరమైన ప్రత్యుత్తరమునిట్లిచ్చెను.

ఘృతాచ్యువాచ-  ఘృతాచి ఇట్లనెను.

ఓ విశ్వకర్మా! నీవు చెప్పిన మాటలనన్నీ చక్కగా నేను గ్రహించితిని. కాని సందర్భోచితమైన మాటలు ప్రస్తుతము నీకు చెప్పుచున్నాను. నేనిప్పుడు అలంకరించుకొని కామదేవుని ఇంటికి అతని ప్రీతికై పోవుచున్నోను. మేము ఏ దినమున ఎవరి గురించి వేళ్ళుదుమో ఆ దినమున వారికి సంబంధించినవారము. ఈ దినమున నేను మన్మథుని భార్యను. నీకిప్పుడు గురుపత్నిని. ఎందువలననగా నీవిప్పుడే మన్మథుని దగ్గర చదువుకున్నట్లు చెప్పితివి. చదువు చెప్పిన గురువు, మంత్రము నిచ్చిన గురువు తండ్రికంటె లక్షలరెట్లు అధికుడు. తల్లి కంటె వేయి రెట్లు మిన్న. గురువు కన్న గురుపత్ని వందరెట్లు అధికముగ గౌరవించతగినది. విచక్షణాజ్ఞానము కల తల్లి, తండ్రికంటే వందరెట్లు ఎక్కువగా గౌరవించతగినది. మాతృ సంగమము చేసినచో ఎంత దోషము కల్గునో దానికి లక్షరెట్లు గురుపత్నీ సమాగమమువలన దోషము కల్గును.

తల్లీ! అని ఏ స్త్రీని పురుషుడు పిలుస్తున్నాడో ఆమె నిజముగా తల్లితో సమానమైంది. ఆ స్త్రీతో సంగమించినవాడు నరకమునకు తప్పకపోవును. అక్కడ సూర్య చంద్రులున్నంతవరకు బాధలనుభవించగలడు. మాతృసంగమము పై దానికంటే నాలుగురెట్లు దుష్టమైనది. ఇక గురుపత్నీ సమాగమము పైదానికంటే లక్షరెట్లు నీచమైనది. బ్రహ్మకల్పమువరకు వాడు కుంభీపాకనరకమున పడి బాధపడును. అట్టి పాపికి ప్రాయశ్చిత్తనునది లేనేలేదు. కత్తివలె మీక్కిలి పదునైన చక్రాకారముననున్నది, వస, మూత్రము, పురీషములతో నిండి దాటుటకసహ్యమైనది. శూలములవంటి క్రిములతో కూడుకున్నది, బాగుగా వేడిచేసిన అగ్గితో సమానమైనది, పాపములు చేసినవారికి విహార భూమీ, ఐన నరకమును కుంభీపాకమందురు. గురుపత్నీ సమాగమమున ఏ పాపముచెందునో, గురువును కామించిన స్త్రీతో సంగమించిన ఆంతటి పాపము చెందును. నేను మన్మథుని కామించి తదనుగుణవేషముతో అతని ఇంటికీ పోవుచున్నాను. నేను నీ దగ్గరకు ఇంకొక దీనము రాగలను అనెను.

ఘృతాచీ మాటలు వినీ విశ్వకర్మ మిక్కిలి కోపించి ఆమెను భూమిపై శూద్రుల ఇంటిలో పుట్టుమని శపించెను. విశ్వకర్మ తనను శపించినందువలన ఘృతాచి చాలా కోపపడి విశ్వకర్మా! నీవు కూడా స్వర్గభ్రష్టుడివై భూలోకమున జన్మించుమని శపించినది.

ఈవిధముగా ఘృతాచి విశ్వకర్మను శపించి మన్మథుని గృహమునకు వెళ్ళి ఆతనితో జరిగిన విషయమునంతయు తెలిపెను. మన్మథుని మాటననుసరించి ఘృతాచి భారతదేశమందున్న ప్రయాగ పట్టణములో ఒక పసులకాపరి భార్యకు కూతురుగా జన్మించెను. గోపిక కడుపులో జన్మించినా ఘృతాచి తనగత జన్మస్మృతి కలదై తపస్వినిగా మారీ గంగానదీ తీరములో నూరు దీవ్య సంవత్సరములు తపస్సు చేసినా ఎట్టి వరములను వేడక నిష్కామ తపమునొనరించెను.

 గోపికగా నుండి తపస్సు చేసికొంటున్న ఆ ఘృతాచి విశ్వకర్మవలన తొమ్మండుగురు కొడుకులను కని శాపవిముక్తి పొంది ఆప్సరసగా మారి తిరిగి స్వర్గలోకమునకు పోయినది.

శౌనక ఉవాచ-  శౌనకుడిట్లు ఆడిగెను -

ఓ మహర్షీ! గోపికగా జన్మించి తపస్సు చేసికొనుచున్న ఘృతాచి తొమ్మండుగురు కొడుకులను ఏవిధముగ, ఎక్కడ, ఎన్ని దినములకు కన్నది? విశ్వకర్మ సంగమము ఎట్లు జరిగినదో వివరించుము.

సౌతీ రువాచ- సౌతీ మహర్షి ఇట్లు పలికెను-

విశ్వకర్మ ఘృతాచియొక్క శాపము విని కోపశోకములతో తండ్రియైన బ్రహ్మదేవుని లోకమునకు పోయేను. అక్కడ అతడు బ్రహ్మదేవునికి నమస్కరించి స్తుతించి తనకు జరిగిన విషయమునంత అతనికి తెలుపుకొనెను. బ్రహ్మదేవుని అనుగ్రహమువలన అతడు భూలోకమున ఒక బ్రాహ్మణ స్త్రీ కడుపులో బ్రాహ్మణుడుగా పుట్టి గొప్ప శిల్పిగా మారెను. అతడు రాజులకు, ధనవంతులకు, ఇతరులకు అందమైనవి, ఆశ్చర్యకరమైనవి, విచిత్రమైనవి ఐన వివిధ శిల్పముల చేసి ఇచ్చెడిపాడు.

ఒక దీనము ప్రయాగలో ఉన్న మహారాజుకు అవసరమైన శిల్పములు చేయుచు స్నానము చేయుటకు గంగానదికి వెళ్లాను. అక్కడ తన గత వృత్తాంతమంతా తెలిసి తపస్సు చేసికొనుచున్న యువతిని చూచి ఆమె ఘృతాచి యను ఆప్సరయనీ తాను విశ్వకర్మననీ గత జన్మస్మతిచే గుర్తించి వెంటనే మన్మథవశుడై తపస్వినియైన ఘృతాచితో ఇట్లు మధురముగా పలికెను.

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడివిధముగా ననెను-

ఓ ఘృతాచి! నీవు ఇక్కడ ఉన్నావా? నన్ను జ్ఞాపకము చేసికొనుచున్నావా? నేను విశ్వకర్మను. నీకొరకు మన్మథుడు నామనస్సున దహించివేయుచున్నాడు. సుందరి! నన్ను సేవించినచో నీ శాపమును తొలగించగలను.

బ్రాహ్మణ కుమారుని ఈ మాటలు విని నూతన రూపములో ఉన్న ఘృతాచి మధురముగా నీతితో కూడుకున్న మాటలను శాంతముగా ఇట్లు పలికెను.

గోపికోవాచ- గోపిక ఇట్లు పలికెను-

ఓ విశ్వకర్మా! నీవు పూర్వము నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మన్మధుని ప్రియురాలను. ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నదానను. ఇది ఫుణ్యములకు నీలయము, కర్మక్షేత్రమైన భారత భూమి. ఈ భారతక్షేత్రములో గంగానదీ తీరములో నీతో సంగమించుట ఎంతవరకు తగినదీ? ఇచ్చట చేయు మంచిపనీ ఇతరత్ర శుభఫలితములిచ్చును. మానవుడు తాను చేసిన తపఃఫలితము ననుసరించి మోక్షము పొందుటకు ఈ జన్మము పొంది విష్ణుమాయచే మోహితుడు. నిబద్ధుడై కర్మచేయుచున్నాడు. నారాయణుని మాయ, ఎవరివలన సంతోషపడునో, అతనికి శ్రీకృష్ణుడు, అతని మంత్రమును, భక్తిని, కోరికలను ఇచ్చును. ఏ వ్యక్తి ఈ భారత ఖండమున జన్మించినను, విషయములపై ఆసక్తితో మూడుడై, భగవంతుడైన శ్రీకృష్ణుని వదలి ప్రవర్తించునో అతడు విష్ణుమాయా మోహితుడగును.

ఓ దేవ స్వరూపుడా! నాకు నా ప్రాక్తనజన్మజ్ఞానమున్నది. పూర్వము నేను ఘృతాచి అనే అప్సరసను. ఇపుడు గోపకన్యనై పుణ్యప్రదమైన గంగానదీ తీరములో మోక్షముకొరకు తపము చేయుచున్నాను. ఈ ప్రాంతము రతిక్రీడకు ఆనువైన స్థలము కాదు. అందువలన నీవు నీ మనుస్సును స్థిరముగా ఉంచుకొనగలవు.

ఇతరత్ర చేసిన పాపము గంగయందు నశించిపోవును. కానీ గంగాతీరమున చేసిన పాపము వెంటనే లక్షరెట్లు అధికము కాగలదు. యథేచ్చగా చేసిన చెడుపని మరల నివృత్తి చెందవచ్చును. ఆది నారాయణ క్షేత్రమైన ఈ ప్రదేశమున చేసిన తపస్సువలన సంపూర్ణముగా నష్టమగును. (అందువలన నీ కోరిక శిష్టసమ్మతము కాదు).

ఘృతాచియొక్క పై మాటలు విని విశ్వకర్మ గాలివలె మారి ఆమెను చందన వృక్షములకు నీలయమైన మలయపర్వత ప్రాంతమునకు తీసుకొనిపోయెను. అందమైన మలయ పర్వత శ్రేణిలో పువ్వులు, చందనములయొక్క గాలిచే పరిమళించి యున్న పుప్పతల్పములో ఆమెతో సుఖసంభోగమును చేసెను. ఈవిధముగా పన్నెండు సంవత్సరములు రాత్రింబగళ్ళు గడువగా ఆమెకు పరిపూర్ణ గర్భము కలిగి అక్కడనే కొడుకులను కనెను.

వారే మాలాకారులు - (మాలలు అల్లువారు) కర్మకారులు (కమ్మరులు) శంఖకారులు, కువిందకులు (నేతవారు) కుంభకారులు (కుమ్మరులు) సూత్రకారులు (వడ్రంగులు). స్వర్ణకారులు (ఔసలివారు).

ఘృతాచీ విశ్వకర్మలు తమ కుమారులకు వరములలిచ్చి, వారినందరిని భూమిపై నుంచి, శాపములవలన తమకు కలిగిన మానవశరీరములను వదిలి తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి.

స్వర్ణకారుడు స్వర్ణమును దొంగిలించుటవలన బ్రహ్మశాపమునకు గురియై భ్రష్టుడయ్యెను. వడ్రంగి యజ్ఞసంబంధమైన కట్టెలు శీఘ్రముగ ఇవ్వనందున బ్రాహ్మణుల శాపమునకు గురియై పతితుడాయెను, చిత్రకారుడు చిత్రమును తారుమారు చేయుచున్నందువలన, బ్రహ్మశాపమునకు బ్రాహ్మణశాపమునకు గురియై పతితుడాయెను. చివరకు ఒక వర్తకుడు స్వర్ణకారుని స్నేహమువలన స్వర్ణచౌర్యము మొదలగు దోషములు చేసి బ్రహ్మశాపమువలన వతీతుడయ్యెను.

చిత్రకారునకు శూద్రస్త్రీకి కల్గినవాడు ఆట్టాలికాకారుడు (భవనములు కట్టవాడు) భవనములు కట్టు మేస్త్రీకి కుమ్మరి స్త్రీకి కల్గినవాడు కోటకుడను ఇళ్ళు కట్టువాడు. కుమ్మరివానికి కోటకస్త్రీకి పుట్టినవాడు తైలకారుడు. క్షత్రియునకు రాజపుత్రస్త్రీకి జారదోషమున పుట్టినవాడు తీవరుడు, తీవరునకు తైలకారస్త్రీకి పుట్టినవాడు దస్యుడు లేటుడని కూడా అతనినందురు.

లేటుడు తీవర కన్యయందు మాల్లుడు, మంత్రుడు, మాతరుడు, భండుడు, కోలుడు, కలందరుడు అను ఆరుగురు కొడుకులను కనెను. బ్రాహ్మణస్త్రీకి, శూద్రునకు పుట్టినవాడు చండాలుడు, తీవరునకు, చండాల స్త్రీకి కల్గినవాడు చర్మకారుడు, చండాలునకు చర్మకారస్త్రీకి కలిగిన సంతానము మాంసచ్చేదకుడు, తీపరునకు మాంసచ్చేదస్త్రీకి కోంచుడు, కైవర్తకునకు కోంచస్త్రీకి పుట్టినవాడు కర్త్రుడు, లేటునకు చండాల స్త్రీకి హడ్డి, డములను ఇద్దరు పుత్రులు కల్గిరి. చండాలునకు హడ్డి స్త్రీయందు వనచరులను ఐదుగురు పుత్రులు పుట్టిరి. లేటునకు తీవర కన్యకు గంగాతీరమున జన్మించినవాడు గంగాపుత్రుడు. వేషధారీకి, గంగాపుత్ర స్త్రీకి కలిగిన సంతానము యుంగి ఆను వేషధారి. వైశ్యునకు తీవరస్త్రీకి శుండి అనువాడు, వైశ్యునకు శుండి స్త్రీయందు పౌండ్రకు డనువాడు, క్షత్రియునకు కరణకాంతకు రాజపుత్రుడు, కరణునకు రాజపుత్రసీకి అగరి ఆనువాడు, క్షత్రియునకు వైశ్యస్త్రీకి కైవర్తుడను చేపలు పట్టువాడు కలిగిరి. క్రైవర్తుడు తీవరస్త్రీ సంపర్కమువలన ధీవరుడైనాడు. ధీవరునకు తీవర స్త్రీకి పుట్టినవాడు రజకుడు. తీవరునకు రజకస్త్రీయందు పుట్టినవాడు “కోయాలి” నాపితునకు గోపస్త్రీకి పుట్టినవాడు సర్వసి. క్షత్రియునకు సర్వస్వ స్త్రీకి పుట్టినవాడు మృగములను వేటాడే వ్యాధుడు. తీవరునకు శుండి స్త్రీకి కల్గిన ఏడుగురు పుత్రులు హర్షిస్తీ సంసర్గమువలన దస్యులైరి.

ఒక ఋషివలన బ్రాహ్మణస్త్రీకి ఋతు కాలముయొక్క మొదటి దినమున జరిగిన సంసర్గమువలన కుత్పితోదరమున జన్మించినవాడు “కూదరుడు. ఋతు దోషమున జన్మించినను కూదరుని జన్మాశౌచము విప్రుల జన్మాశౌచముతో సమానమైనది. కాని ఆ కూదరుడు కోటకస్త్రీ సంసర్గమువలన ఆధముడగుచున్నాడు. అట్లే క్షత్రియుడు వైశ్యపీని ఋతుకాలముయొక్క ప్రథమ దివసమున కలిసినప్పుడు పుట్టినవాడు బలవంతుడు, ధనుర్ధరుడైన మహాదస్యువు. క్షత్రియుడు అతనిని వారించినప్పటికి వాక్కుకు ఆతీతముగా పుట్టిన శిశువు “వాగతీత” జాతివాడు. అదే విధముగా క్షత్రియునకు శూద్రస్త్రీకి ఋతుకాల దోషమున పుట్టినవారు మేచ్చజాతులకు చెందినవారు. వారు తక్కిన వారివలె చెవులు కుట్టించుకొనరు. క్రూరులు భయములేనివారు, శౌచాచారములు లేనివారు. ధర్మమును వదిలి పెట్టినవారు.

మైచ్చునకు కుందస్త్రీకి పుట్టినవాడు బోలుడు. ఆ జోలువకు కుందస్త్రీకి పుట్టినవాడు శరాలకుడు. ఈ విధముగా వర్ల సంకర దోషమువలన ఇంతకు ముందెన్నడు వినని జాతులెన్నో కలిగినవి. వాటిసంఖ్య వాటి పేర్లు చెప్పనలవి కాదు.

అశ్వినీ కుమారునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించినవాడు వైద్యుడు. ఆ వైద్యుదక్షు శూద్రస్త్రీకి చాలామంది పుట్టిరి. వారు పల్లెటూరీవారీ గుణములు తెలిసినవారు, మంత్రములు, ఔషధులనాధారముగా చేసికొని బ్రతుకువారు. వారికి శూద్ర  స్త్రీలయందు 'పాములు పట్టువారు' కల్గిరి.

శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను-

ఒసౌతి మహర్షీ! సూర్యుని పుత్రుడైన అశ్వినీకుమారుడు బ్రాహ్మణుని స్త్రీయందు వివేకము కోల్పోయి ఏవిధముగా, కొడుకును కనెనో వివరించి చెప్పగలవు.

సాతీ రువాచ- సాతీ మహర్షి ఇట్లనెను-

తీర్థయాత్రకు పోవుచున్న ఒక బ్రాహ్మణ స్త్రీని జనులెవ్వరు లేని పుష్పోద్యానమున రవినందువడైన ఆల్వినీకుమారుడు చూచి కామించి ఆ బ్రాహ్మణస్త్రీ ఎంత నివారించినా వినక బలవంతముగా కలిసెను. అందువలన ఏర్పడిన గర్భమునామే ఆ పుష్పోద్యానములోనే వదిలివేసినది. ఐనను ఆ గర్భము బంగారు వన్నెవంటి పుత్రుడుగా మారెను. అప్పుడామె తన పుత్రుడి తీసికొని సిగ్గుతో ఇంటికి పోయి. భర్తకు జరిగిన విషయమునంత తెలిపెను. కాని ఆమె భర్త కోపముతో భార్యను, ఆమెకు కల్గిన పుత్రుని వదలి పెట్టగానా స్త్రీ యోగధ్యానములో నదీగా మారెను. ఆనదియే గోదావరీ. అశ్వినీకుమారుడు తన పుత్రునికి స్వయముగా వైద్యశాస్త్రమును, వివిధములైన శిల్పశాస్త్రములను, మంత్రములను నేర్పించేమ.

బ్రాహ్మణుడు వేతనము తీసికొనుచు నక్షత్రములను గణించుచు వేద ధర్మములను వదిలిపి- జ్యోతిర్గణకుడయ్యెను. ఇంకను ఆతిలోభమువలన శూద్రుల దగ్గర, గ్రహణసమయములలో, మృతులకు సంబంధించిన దానములను స్వీకరించుచుండెడివాడు.

బ్రహ్మయజ్ఞమునందలి యద్దెకుండమున పుట్టిన పురుషుడొకడు ధర్మములను, పురాణకథలను చెప్పువాడు. అతడే సూతుడు. నాకు పూర్వపురుషుడు.

అట్లే వైశ్య స్త్రీకి సూతునకు పుట్టినవాడు ప్రతిపాఠకుడైన భట్టు. అతడు మంచివక్త.

ఓ శౌనకమహర్షీ! భూమిపై మన్న కొన్ని జాతుల గురించి నీకు వివరించితిని. ఆయా వర్ణముల సంకరమువల్ల ఏర్పడిన జాతులు. చాలా చాలా కలవు.

సమస్త జాతులవారికి ఆయా వ్యక్తుల మధ్యగల సంబంధము వేదమందు చెప్పబడినది. పూర్వముబ్రహ్మదేవుడు నాకు తెలిపిన ఈ సంబంధమునకు చెందిన పదములను  శౌనకమహర్షీ నీకు చెప్పుదును.

జన్మనిచ్చినవాడు జనకుడు, పిత, తాత, ఆనీ పిలువబడును. జన్మనిచ్చిన స్త్రీని జనవి, ఆంబ, మాత, ప్రసూ అని అందురు. తండ్రియొక్క తండ్రిని పితామహుడనీ, అతనీ తండ్రిని ప్రపితామహుడని అతని తండ్రి, కొత, మొదలగు జాతులను సగోత్రులని పిలుతురు.

తల్లి తండ్రి మాతామహుడు, అతని తండ్రి ప్రమాతామహుడు. అతని తండ్రి వృద్ధ ప్రమాబాదుహుడు. తండ్రియొక్క తల్లి పితామహ, ఆమె ఆత్త ప్రపితామహీ, ఆమె తల్లి వృద్ద ప్రపితామహి.

తల్లి తల్లి మాతామహి ప్రమాతామహుని భార్య మాటామహీ, వృద్ధమాతామహుని భార్య (ప్రమాతామహి అత) వృద్ధప్రమాతామహి.

తండ్రియొక్క అన్నదమ్ములు పితృవ్యులు. తల్లియొక్క అన్న దమ్ములు మాతులులు. తండ్రియొక్క అక్కా చెల్లెండ్లను పితృష్వసలని, తల్లి యొక్క అక్కా చెల్లెండ్లను మాతృవ్వసలనీ పిలుతురు.

తనయుడు, పుత్రుడు, సూనువు, దాయదుడు, ఆత్మజుడు, ధనభాక్కు, వీర్యజుడు అని కొడుకు పేర్లు. జన్య. దుహిత, ఆత్మజ, కన్య, అనీ కూతురు పేర్లు. పుత్రుని భార్యను వధువనీ, కూతురు భర్తను జామాత అనీ అందురు. స్వామి, కాంతుడు, ప్రియుడు, పతి ఆనీ భర్తను పిలుతురు. భర్తయొక్క తమ్మునీ దీపరుడని, భర్త చెల్లెలిని నందా ఆని, భర్తయొక్క తండ్రినీ శ్వశురుడని, తల్లిని శుభ్రూ అని పిలుతురు.

బాయ, ప్రియా, కాంతా, స్త్రీ పత్ని, ఆని భార్యను అందురు. భార్యయొక్క ఆన్నదమ్ములను శ్యాలకుడని, భార్యయొక్క అక్కాచెల్లెండ్లను శ్యాలికా అని, భార్య తల్లిని క్వడ్రూ అని పిలుతురు.

జూయ, ప్రియ, కాంత, స్త్రీ పత్ని అని భార్యనందురు. భార్య యొక్క అన్నదమ్ములను శ్యాలకులని, భార్య యొక్క అక్కా చెల్లెండ్లను శ్యాలికయనీ, భార్య తల్లిని శ్వశ్రు అని, తండ్రిని శ్వశురుడని అందురు.

సోదరుని భ్రాతను సగర్భుడని, సోదరిని భగినీ, సగర్భా అనీ అంటారు.

చెల్లెలి కొడుకు భాగినేయుడు, అన్నదమ్ముల కొడుకు భ్రాతృపుత్రకుడు, అక్కా చెల్లెండ్ల భర్తలను ఆవుతులనీ, భగినీపతి అనీ, మరదలి భర్తను భ్రాత " ఆని పిలుతురు. కారణము . ఇద్దరి మామ ఒక్కడే.

భార్య తండ్రి జన్మనిచ్చిన తండ్రితో సమానము, అన్నము పెట్టినవాడు, భయపడకుండ రక్షించినవాడు, భార్యయొక్క తండ్రి, చదువు చెప్పినవాడు, జన్మనిచ్చినవాడు ఈ ఐదుగురు మానవులకు తండ్రులు.

అన్నము పెట్టినవాని భార్య, చెల్లెలు, గురువుయొక్క భార్య, తల్లి, ఆమె సవతి, కోడలు, కూతురు, తల్లి తల్లి, తండ్రి తల్లి, అత్త, తండ్రి చెల్లెలు. మామ చెల్లెలు, పినతండ్రి భార్య, మేనమామ భార్య అను ఈపదునాలుగు మాతృ సమానులు.

కొడుకు యొక్క కొడుకు పౌత్రుడు, అతని పుత్రుడు ప్రపౌత్రుడు. అతని కొడుకు మొదలైనవారు వంశ్యులు లేక కులజులు.

కూతురుయొక్క కొడుకు దౌహిత్రుడు. అతని పుత్రుడు మొదలైనవారు బంధువులు, గురుపుత్రులు, భ్రాత, పోష్యవర్గములోనివాడు పరమ బాంధవులు.

తమ్ముని మనుమడు మొదలగువారు జ్ఞాతులు. మేనల్లుడు మొదలగువారు బంధువులు. గురువు యొక్క కూతురు, భగిని, పోష్యవర్గములో చేరినదీ తల్లితో సమానురాలు.

పుత్రుని గురువు, అతని సోదరుడు. పోష్యవర్గపువాడు దగ్గరి బంధువు. పుత్రునిమామ, ఆతని సోదరుడు వైవాహిక బంధువర్గములోని వాడు. కూతురుమామ, ఆతని సంబంధీకులు కూడ వైవాహిక బంధువులే, కూతురు యొక్క గురువు, ఆతని సోదరుడు చాలా దగ్గరి బంధువులు. మామ, అతని సోదరుల గురువు గురుతుల్యుడు.

బంధుత్వము దేనివలన ప్రయోజనకరమగునో ఆదియే స్నేహము. అది సుఖప్రదమైనది. శత్రుత్వము దు:ఖమును కలిగించును. పూర్తిగా సంబంధములేని బంధుత్వము దుఃఖమును కలిగించవచ్చు.

విద్యవల్ల ఏర్పడిన సంబంధము, చుట్టరికమువల్ల ఏర్పడిన సంబంధము, ప్రీతివల్ల ఏర్పడిన సంబంధము ఆని సంబంధము మూడు విధములు. ప్రీతిజ సంబంధము స్నేహము. ఆది చాలా గొప్పది. నాల్గవ సంబంధము నామ సంబంధము.

మిత్రుని తల్లి మిత్రుని భార్య తల్లితో సమానులు. అతని సోదరుడు, తండ్రి, తన సోదరుడు, తండ్రివంటివారు.

జారుడు భర్తతో సమానమైనవాడు. ఆట్లే నవణ్ణ (ఉంచుకొన్నది) భార్యతో సమానముగా పరిగణించతగినది.

 శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణములో సౌతి శౌనక సంవాదరూపమైన బ్రహ్మండమున జాతి సంబంధ నిర్ణయమను పదవ అధ్యాయము సమస్తము.