122. సప్తమీ కల్పమున ఆదిత్యస్తవము

మూ॥ శతోనీక ఉవాచ :

తస్మిన్కాలే సమారూఢో లిఖ్యమానో దివస్పతిః బ్రహ్మాదిభిఃస్తుతో దేవైర్యథా వై తద్వదస్వమే.

సుమంతురువాచ :

శృణు ష్వైకమనా రాజన్యథా దేవో దివస్పతిః బ్రహ్మాదిభిఃస్తుతో దేవైః ఋషిభిశ్చ పురానఘ!

 ప్రయత్నతః ప్రణతహితానుకంపీనే స్వరూపతో లోకవిభావినే నమః

 దివస్పతే కమల కులావ బోధినే నమస్తమఃపటల పటావ పాటినే

పావనాతిశయ పుణ్యకర్మణే నైకకామ విభవ ప్రదాయినే భాసురామల మయూఖమాలినే సర్వలోక హితకారిణేనమః

 అజాయ లోకత్రయ భావనాయ భూతాత్మనే గోపతయే ప్రియాయ నమోమహాకారుణి కోత్తమాయ సూర్యాయ లోకత్రయ భావనాయ

వివస్పతే జ్ఞాన కృతాంతరాత్మనే జగత్ప్రతిష్టాయ జగద్ధితైషిణే

 స్వయం భువే లోకసమస్త చక్షుషే సురోత్తమాయామిత తేజసే నమః

 నిజోదయాయ సురగణ మౌలి మణే జగతాత్వం మహితస్త్వ మురుమయూఖ సహస్ర తపాః

జగతి విభో వతమసతుద వసతి మీరాసవ పావన మదోద్భవతి విలోహిత

విగ్రహతా తిమిర వినాశినముగ్రం సుతరాం త్రిభువన భాప్రకరైః

రధమారుహ్య సమామయం భ్రమసి సదా జగతో హితద

 ఇత్యేవం సంస్తుతో దేవో భాస్కరో వేధసా పురా దేవతైశ్చ మహాబాహో! శివవిష్ణ్వాదిభిరృప!

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే

ఆదిత్యస్తవోనామ ద్వావింశోత్తర శతతమోధ్యాయః

            తా॥ శతానీకుడిట్లనెను. “ఆకాలమున ప్రసిద్ధముగ లిఖ్యమానుడైన సూర్యభగవానుడు !.బహ్మాది దేవతలచేనెట్లు స్తుతింపబడెనో నాకుఁజెప్పుడు”. సుమంతుముని యిట్లుచెప్పెను. “రాజా! ఆదేవుడు బ్రహ్మాదుల చేతను, ఋషులచేతను పూర్వమెట్లు స్తోత్రము చేయబడెనో చెప్పుచున్నాను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. “నమస్కరించువారికి హితమును గూర్చుదయగలిగియుండుటయే ఉద్యోగముగాగలవాడు. స్వరూపముచే లోకప్రసిద్ధుడు, తామర జాతులను మేలుకొల్పువాడు, చీకటి సమూహములనెడి పటమును ఛేదించువాడునైన దివస్పతికి నమస్కారము. అతిశయించిన పవిత్ర పుణ్యకర్మలుగలవాడు, అనేకములగు కోర్కెలను సఫలము చేయుట ద్వారా వైభవము నొసంగువాడు, శుద్దములు, ప్రకాశవంతములునైన కిరణ సమూహములు గలపోడు, సర్వలోకములకు హితమును గూర్చువాడైన సూర్యభగవానునకు నమస్కారము. పుట్టుక లేనివాడు, ముల్లోకములచే భావింపబడువాడు, సర్వభూతాత్ముడు, నీటి తేడగు వరుణునకు ప్రియమైనవాడు, మహాకారుణికోత్తముడు, ముల్లోకముల తలఁపు గలవాడునైన సూర్యదేవునకు నమస్కారము. తేజస్సుల కధిపతి, జ్ఞానమయమగునంతరాత్మగలవాడు, జగత్తులను నిలిపినవాడు, జగత్తులకు హితమును కోరువాడు, స్వయంభువు, లోకచక్షువు, దేవతాశ్రేష్ఠుడు, అమితమైన తేజస్సు గలవాడునైన సూర్యదేవునకు నమస్కారము. ప్రభూ! సకల దేవతా శిరోమణీ! చరిష్టుడవైన నీవు. గొప్పవాడవు. విపులములైన కిరణ సహస్రములచే తపించువాడవు. జగత్తుననుదయించుటకొఱకహో! నీ ప్రభల బరుపులను గ్రహించు నడవి చీకటుల రసాయనమును ద్రావిన మత్తుచే నెట్టని రూపమును ధరించితివి! అతిశయయుగ భువనత్రయమును ప్రసరించు వెలుగుల సమూహములచే చీకట్లను నశింపఁజేయు నీ యుగ్ర మూర్తిని సేవించుచున్నాము. రథము నధిరోహించి, జగద్గీతకార కుడవై యెల్లప్పుడును సమస్త విశ్వమున పరిభ్రమించుచుందువు”. ఈవిధముగ సూర్యభగవానుడు పూర్వము బ్రహ్మవిష్ణురుద్రాది దేవతలచే స్తుతింపబడెను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు ఆదిత్యస్తవమను నూట యిరువది రెండవ అధ్యాయము సమాప్తము.