భవిష్య మహా పురాణము
104. సప్తమీ కల్పమున త్రివర్గ సప్తమీ వ్రత నిరూపణము
మూII శృణుష్య సంయతః కామా నుపవాసాంస్తథా పరాన్ తాంస్తానాశ్రిత్య యాన్కామాన్కురు తీప్సిత మానసః
సప్తమ్యాం శుక్ల పక్షేతు ఫాల్గున స్యేహ మానవః జపన్షనీతి దేవస్యనామ భక్త్యా పునః పునః
దేవార్చనే చాష్ట్ర శతం కృత్వైతచ్చ జపేచ్ఛుచిః స్నాతః ప్రస్థాన కాలేతు ఉత్థానే స్థలితే క్షుతే
పాఖండా న్పతితాంశ్చైవ తథైవాన్యాయ శాలినః నాల పేత తథా భాను మర్చయే చ్చ్రద్ధయాన్వితః ఇదం చోదాహరే ద్భానౌ మనః సంధాయ తత్పరః
హంస హంస కృపాలుస్త్వ మగతీనాం గతిర్భవ! సంసారార్ణవ మగ్నానాం త్రాతా భవ దివాకర!
ఏవం ప్రసాదోపవాసం కృత్వా నియత మానసః పూర్వాష్ణ ఏవచ సకృ త్ప్రాశ్యాచాచమనీయకమ్
స్నాత్వార్చయిత్వా హం సేతి పునర్నామ ప్రకీర్తయేత్ వజ్రధారాత్రయం చైవ క్షిపే త్త్రిర్దేవ పాదయోః
చైత్ర వైశాఖయోశ్చైవ తద్వ జ్జ్యేష్ఠేతు పూజయన్ మర్త్యలోకే గతిం. శ్రేష్ఠాం కృష్ణ! ప్రాప్నోతి వై నరః
ఉ త్క్రాంతస్తు వ్రజేత్కృష్ణ! దివ్యం హంసాలయం శుభమ్ వృషధ్వజ ప్రసాదాద్వై సంక్రందన శ్రియావృతః
ఆషాఢ శ్రావణే చైవ మాసి భాద్రపదే తథా తథైవాశ్వయుజే చైవ అనేన విధినా నరః
ఉపోష్య సంపూజ్య తథా మార్తాండేతిచ కీర్తయేత్ గోమూత్ర ప్రాశనాత్పూతో ధనీ ధన పురం వ్రజేత్
తా. బ్రాహ్మదేవుడిట్లనెను. “ఓ విష్ణు దేవా! ఏ యే కామనలతో లేక నిష్కామముగా సూర్య భగవానుని గూర్చిన యుపవాస వ్రతములతో మానవుడు తన మనోవాంఛల. నీడేర్చుకొనునో అట్టి యుపవాస వ్రతములను గూర్చి చెప్పుచున్నాను. వినుము, ఫాలున మాస శుక్ల పక్ష సప్తమీ నాడు మానవుడు భక్తితో సూర్య దేవుని నామమును మఱల మల భక్తితో జపించుచుండవలయును'. స్నాతుడై, శుచిర్భూతుడై దేవతార్చన సందర్భమున నూట యెనిమిది పర్యాయములు సూర్య నామమును జపింపవలెను. ప్రయాణ కాలమున, లేచునప్పుడు, తొట్రుపాటు సమయమున, తుమ్మినప్పుడును సూర్య నామోచ్చారణ చేయవలెను. ప్రతి యగు వాడు పాఖండులతో, పతితులతోను, అన్యాయ శీలురతోను సంభాషింపరాదు. శ్రద్దాయుక్తుడై సూర్య భగవానుని పూజింప 'వలేను. మనస్సును సూర్యభగవానుని యందేకాగ్రముగ నిలిపి పరమ తాత్పర్యముతో నీ మంత్రమునుచ్చరింపవలెను. “పరమాత్మ స్వరూపుడవుగునో సూర్య భగవానుడా! నీవు దయా మయుడవు. గతి లేని వారికి నీవే గతివగుము. ఓ దివాకరా! సంసార సముద్రమున మునిగియున్న వారిని రక్షింపుము-5. ఇటులా దేవదేవుని ప్రసన్నుని గావించుకొని నియత మానసుడై యువవాస వ్రతమాచరించి, పూర్వాహ్లకాలముననే యొకసారి యాచమించి. స్నానమాడి సూర్య దేవునర్చించి 'హంస హంస కృపాలుస్త్వ' మ్మను మంత్రమును మఱల జపింపవలెను. సూర్య దేవుని పాదములందు మూడు పర్యాయములు జలధారలర్పింపవలెను. చైత్ర వైశాఖ మాసములందు, అట్లే జ్యేష్ఠ మాసమున సూర్యార్చన చేయు మానవుడు మర్త్యలోకమునందు శ్రేష్ఠమైన గతిని పొందును. ఓ విష్ణు దేవా! మరణించిన పిమ్మట కూడ నతడు దీవ్యము శుభకరమునైన సూర్య లోకమును పొందును. శివ ప్రసాదమున నింద్ర వైభవముల ననుభవించును. ఆషాడ శ్రావణ భాద్రపదేశ్వయుజ మాసములలోను ఇదే విధానమున. ఉపవాస వ్రతమాచరించి సూర్య దేవుని మార్తాండ నామముతో కీర్తింపుచు పూజింపవలెను. గో మూత్రప్రాశనముతో పరిశుదుడై ధనికుడై కుబేరలోకమును పొందును.
మూII ఆరాధితస్య జగతా మిశ్వరస్యావ్యయాత్మనః ఉత్క్రాంతి కాలే స్మరణం భాస్కరస్య తథాప్నుయాత్
క్షీరస్య ప్రాశనం కృష్ణ! విధించైవ యధోదితమ్ కార్తికాది యథాన్యాయం కుర్యాన్మాస చతుష్టయమ్
తేనైవ విధినా కృష్ణ! భాస్కరేతిచ కీర్తయేత్ స యాతి భాను సాలోక్యం భాస్కరం స్మరతిక్షయే
ప్రతి మాసం ద్విజాతిభ్యో దద్యాద్దానం యధేప్సితమ్ చాతుర్మాస్యేతు సంపూర్ణే కృత్వాపుస్తక వాచనమ్
కథాంతు భాస్కరస్యేహ సంగీతక మథాపివా ధర్మ శ్రవణ మభీష్టం సదా ధర్మ ధ్వజస్య తు
వాచకం పూజయిత్వాతు తస్మాత్కార్యం విపశ్చితా శ్రాద్ధమన్నేన పక్వేన వాచకేన ద్విజేనతు దివ్యేనచ యథాయుక్త మభీష్టం భాస్కరస్య హి
ఏవమేవ గతిం శ్రేష్ఠాం దేవానా మను కీర్తనాత్ ప్రాప్నుయాత్రి విధం కృష్ణ! త్రిలోకాఖ్యా నరః సదా
కథితం పారణం యత్తే ప్రథమం గోధరా ధనమ్ ఆధిపత్యం తథా భోగాం స్తతః ప్రాప్నోతి మానుషః
ద్వితీయేన తథా భోగా న్గోపతేః ప్రాప్నుయాన్నరః సూర్యలోకం తృతీయేన పారణేన తథాప్నుయాత్
ఏవమేతత్సమాఖ్యాతం గతి ప్రాపక ముత్తమమ్ విధానం దేవ శార్దూల! యదుక్తం సప్తమీ ప్రతే .
యః శ్వేతాం సప్తమిం కుర్యాత్సుగతిం శ్రద్ధయానరః తథా భక్త్యాచ వైనారీ ప్రాప్నోతి త్రివిధాం గతిమ్
ఏషా ధన్యా పాపహరా తిథిర్నిత్య ముపాసితో ఆరాధనాయ యస్తేషాం యథా భానోర్ధరా ధర!
పఠతాం శృణ్వతాం చాపి సర్వపాప భయాపహా తథా ధన్యాచ పుణ్యాన త్రివర్గా బీష్టదా సదా
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మే పర్వణి సప్తమీ కల్పే త్రివర్గ సప్తమీ వ్రత నిరూపణం నోము చతురధిక శతతమోఽధ్యాయః
తా॥ లోక పూజితుడు, జగదీశ్వరుడు, అవ్యయాత్ముడునైన భాస్కర దేవునినుత్రాంతి కాలమున స్మరించుట సూర్యలోక ప్రాప్తి కలిగించును , కార్తికము మొదలు నాలుగు మాసములు శాస్త్ర వీధి యందు చెప్పబడినట్లు క్షీర ప్రాశనము చేయవలెను. పూర్వోక్త విధానముననే ఈ నాలుగు మాసములును సూర్య దేవుని భాస్కర నామముతో కీర్తింపవలెను. అంత్యకాలమున భాస్కరుని స్మరించువాడు భాస్కర లోకమును పొందును. ప్రతిమాసమున బ్రాహ్మణులకు వారు కోరిన దానములీయవలెను, నాలుగు మాసములిట్లు వ్రతమాచరించి పూర్తియైన పిమ్మట పురాణ ప్రవచనము నేర్పాటు చేయించి. భాస్కర సంబంధ కథా గానములను జరిపింపవలెను. సూర్య భగవానునకు ధర్మ కథా శ్రవణము చేయించుట యిష్టము. వాచకుని పూజించి, విద్వాంసుడైన ప్రతి, వాచకద్విజుని సహాయముతో, దివ్యమైన పక్వాన్నముతో యధే యుక్తముగా శ్రాద్దము నాచరింపవలెను. మానవుడిట్లు దేవతా సంకీర్తనము చేత ధర్మార్థ కామములతో కూడినది త్రైలోక్యమను పేరు గలదియునైన శ్రేష్ఠమైన గతిని పొందును. నీకుఁ దెలిపిన మొదటి పారణమున మానవుడు గోవులు, భూ సంపద, ధనము, ఆధిపత్యము, భోగములు పొందును. రెండవ పారణముచేత సూర్య లోక ప్రాప్తిని బడయును. ఇట్లుత్తమ గతి ప్రాపకమైన సప్తమీ వ్రత విధానము నీకు చెప్పఁబడినది. శుక్ల సప్తమీ వ్రతమును శ్రద్దతో నాచరించు పురుషుడు పొందు తైవిధ్య సుగతినే స్త్రీయును భక్తితో నాచరించినచో పొందును. ఈ సప్తమీ తిథి నెల్లకాలముపాసించినచో పాపములను హరించును. కృతార్థతనొదవించును. సప్తమీ తిథులను సూర్య పూజకొఱకై వినియోగించువారలకు. చదివిన వారికీ, వినిన వారికినీ సర్వపాపములును, భయములును తొలగిపోవును. ఈ విధముగ నీతిథి ధన్యమైనది. పుణ్య ప్రదమైనది. ఎల్లపుడు త్రివర్గాద్యభీష్ట ఫలముల నిచ్చునది.
శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున, సప్తమీ కల్పమునందు త్రివర్గ సప్తమీ వ్రత నిరూపణమను నూట నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 104 of the Bhavishya Mahā Purana is as follows:
The Trivarga-saptamī uniquely fulfils all three of the lower puruṣārthas — dharma, artha, and kāma — simultaneously, rather than being oriented toward one specific desire. The procedure is accordingly comprehensive: worship procedures associated with each of the three goals are performed in sequence, and the devotee articulates an intention for each of the three dimensions of a fully flourishing human life. The theological teaching embedded in this vrata is that Sūrya, as the solar light that sustains all life in all its dimensions, is uniquely capable of granting the full spectrum of human flourishing — not just one dimension at the expense of others, but the complete, harmonious fulfilment of the human being's legitimate desires within the framework of dharma.