102. సప్తమీ కల్పమున నక్షత్ర పూజా విధి వర్ణనము

సుమంతురువాచ :

ఏవం యా దేవ దేవస్య సప్తమీ భాస్కరస్యతు యథా బహూనాం భార్యాణాం భర్తుః కాచిత్ప్రియాభవేత్

సర్వాశ్చ తిథయోహ్యస్య ప్రియాః సూర్యస్య భారత! తస్మాదస్యాం నరేణేహ పూజనీయో దివాకరః

శతానీక ఉవాచ :

తిథీనా మధిపః సూర్యః సర్వాసాం కథితో యది సప్తమ్యా మేవ యాగోఽస్య కిమర్ధం క్రియతే బుదైః

సుమంతురువాచ :

ఇద మర్థం పురాపృష్టః సురజ్యేష్ఠో దివిస్థితః విష్ణునా కురుశార్దూల! తేనోక్తం హరయే యథా తథాతే సర్వమాఖ్యాన్యే శృణు ష్వైక మనో విభో !

 సుఖాసీనం సురజ్యేష్ఠం పురాదేవం పితామహామ్ ప్రణమ్య శిరసా దేవ కృష్ణో వచన మబ్రవీత్

 “యద్యేష భానుమాన్దేవస్తి థీనా మధిపః స్మృతః కిమర్థం పూజ్యతే బ్రహ్మన్సప్తమ్యాం బ్రూహిమే విభో! .

ఏవ ముక్తం సురజ్యేషో విష్ణునా ప్రభవిష్ణునా ప్రహస్య భగవాన్దేవ ఇదం వచన మబ్రవీత్

బ్రహ్మోవాచ :

“దేవేభ్యస్తిథయో దత్తా భాస్కరేణ మహాత్మనా ముక్వైకాం సప్తమీం సర్వాంసమ్యగారాథనేనవై

యస్త్యేవ యద్దినం దత్తం సత స్యైవాధిపః స్మృతః స్వదినే పూజతస్తస్మాత్స్వ మంత్రై ర్వరదోభవేత్

విష్ణు రువాచ :

“అర్కేణ కతరతస్మై దినం దత్తంమహాత్మనా స్వదినే పూజితేఽస్మిన్వై స్వమంత్రిర్జాయతే ధ్రువమ్

తా॥ సుమంతుముని యిట్లనెను. “బహు భార్యలలోనొక భార్యయందు ప్రత్యేకముగననురాగమున్నట్లు, దేవదేవుడైన భాస్కరునకీ సప్తమీతిథి ప్రియతరమైనది. సూర్యదేవునకన్ని తిథులు ప్రియములేయైనను సప్తమీనాడే మనుజుడు. సూర్యపూజ చేయవలెను." శతానీకుడిట్లనెను. “అన్ని తిథులకు సూర్యుడే అధిపతియని చెప్పబడినను సప్తమీనాడే బుధులు సూర్యయాగము చేయుచుందురు. కారణమేమి”?. సుమంతుముని యిట్లు ప్రత్యుత్తరము చెప్పెను”. పూర్వమిట్టి ప్రశ్ననే విష్ణుభగవానుడు సురజేష్టుడైన బ్రహ్మదేవు నడిగెను. బ్రహ్మదేవుడు విష్ణుదేవునకు చెప్పిన విషయమును నేను నీకు చెప్పెదను. ఏకాగ్రచిత్తుడవై వినుము. పూర్వమొకప్పుడు పితామహుడు, సురజ్యేష్ఠుడునైన బ్రహ్మదేవుడు సుఖాసీనుడైయుండగా విష్ణుభగవానుడతనికి శిరము వంచి నమస్కరించి యిట్లు పలికెను. ఓ బ్రహ్మదేవా! అన్ని తిథులకును భాస్కరదేవుడే అధిపతిగా పేర్కొనబడినను సప్తమీ దినముననే అతడు పూజింపబడుటకు కారణమేదియో నాకుఁతెలుపుడు”. విష్ణుదేవుని ప్రశ్నవిని బ్రహ్మదేవుడు నవ్వి యిట్లు సమాధానము చెప్పెను. మహాత్ముడైన సూర్యభగవానుడు సప్తమీని విడిచి తక్కిన తిథులన్నింటిని ఆయాదేవతల యారాధన కొఱకిచ్చివేసేను-8. ఏ దేవతకే, తిథి యీయఁ బడినదో ఆ దేవత ఆతిథికి అధిపతియగును. ఆ కారణమున నాదేవునా తిధియందతనికి సంబంధించిన మంత్రములతోనర్చించిన నతడు వరమిచ్చువాడగును”. బ్రహ్మవాక్యములు విని విష్ణుదేవుడిట్లనెను. మహాత్ముడైన సూర్యుడే దినమును ఏ దేవున కిచ్చెను? స్వదినమున స్వమంత్రములతోనర్చింపనాదేవుడు నిశ్చయముగననుగ్రహించునన్నమాట!.

 మూ!! బ్రహ్మోవాచ :

అగ్నయే ప్రతి పద్దత్తా ద్వితీయా బ్రహ్మణే తథా తృతీయా యక్షరాజాయ గణేశాయ చతుర్థ్యపి

పంచమీ నగరాజాయ కార్తికేయాయ పష్ఠ్యపి సప్తమీ స్థాపితా తార్థం దత్తారుద్రాయ చాష్టమీ  

దుర్గాయై నవమీ దత్తా యమాయ దశమీ స్వయమ్ విశ్వేభ్యశ్చాథ దేవోభ్యో దత్తాచైకాదశీ సదా

 ద్వాదశీ విష్ణవే దత్తా మదనాయ త్రయోదశీ చతుర్దశీ శంకరాయ దత్తాసోమాయ పూర్ణిమా

పితృణాం భానునా దత్తా పుణ్యాపంచదశీ సదా తిథ్యః పంచదశైతాస్తు సోమస్య పరికీర్తితాః

పీయతే కృష్ణ పక్షేతు సురైరేభిర్యభోదితైః శుక్లపక్షే ప్రపూర్యంతే షోడశ్యా కలయా సహ

అక్షయా సా సదైకైకా తత్రసాక్షాత్ స్థితో రవిః క్షయవృద్ధికరో హ్యేవం తేనాసౌ తత్పతిః స్మృతః

దదాతి గతి మక్షీణాం ధ్యానమాత్ర స్థితో రవిః అన్యేపీష్టాన్యధా కామా ప్రయచ్ఛంతి సుఖేనపై

తధా సర్వం ప్రవక్ష్యామి కృష్ణ! సంక్షేపతః శృణు అగ్ని మిష్టాచ హుత్వాచ ప్రతి పద్యమృతం ఘృతమ్ హవిషా సర్వధాన్యానీప్రాప్నుయాదమితం ధనమ్

బ్రహ్మాణంచ ద్వితీయాయాం సంపూజ్య బ్రహ్మ చారిణమ్ భోజయిత్యాచ విద్యానాం సర్వాసాం పారదోభవేత్  

తా॥ బ్రహ్మాదేవుడిట్లనెను. “అగ్నిహోత్రునకు ప్రతిపత్తు (పాడ్యమి), బ్రహ్మకు విదియ, కుబేరునకు తదియ, గణేశ్వరునకు చతుర్థి . నాగరాజుకు పంచమి, కుమారస్వామికి షష్ఠి సూర్యునిచే నీయబడెను. సప్తమీతిథిని సూర్య భగవానుడు తనయాధిపత్యముననేయుంచుకొనెను. అష్టమిని రుద్రునకు. నవమిని దుర్గాదేవికి, దశమినీ యమునకు, ఏకాదశిని విశ్వేదేవులకు. ద్వాదశిని విష్ణు భగవానునకు, త్రయోదశిని మన్మధ దేవునకు, చతుర్దశిని శంకరునకు, పూర్ణిమను చంద్రునకును, అమావాస్య పుణ్య తిథిని పితృ దేవతలకు ఇచ్చి వేసెను. ఈ పదునైదు తిథులును చంద్రునివిగా పేర్కొనబడినవి. కృష్ణ పక్షము నందు క్రమముగా నాయా దేవతలచే చంద్రకళ లొక్కొక్కటిగా పానము చేయబడును. శుక్ల పక్షమున పదునాఱవ కళతో గూడ క్రమముగనవి పూరింపబడును. షోడశీ కళ యొక్కటీయే అక్షయ మైయుందును. దాని యందు సాక్షాత్తుగ సూర్య భగవానుడే యుండును. ఇట్లాతడు వృద్ది క్షయములు చేయుచుండుటచే వాని యధిపతిగా పేర్కొనబడును. ధ్యాన మాత్రముననే యునికి గలిగి సూర్య భగవానుడు మహత్తరమైన గతి నీచ్చును. ఇతర దేవతలు కూడ సుఖముతో గూడ . కామములనెట్లోడ గూర్తురో సంక్షేపముగాఁజెప్పెదను వినుము. పాడ్యమినాడగ్నిదేవుని పూజించి అమృత రూప ఘృతమును హవనము చేసినచో నన్ని విధములైన ధాన్యములు, మిక్కుటమైన ధనము ప్రాప్తించును. ద్వితీయా తిథినాడు బ్రహ్మదేవుని పూజించి బ్రహ్మచారి బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో మానవుడు సర్వ విద్యలలో పారంగతుడగును.

మూ ॥ తృతీయా యాం చ విత్తేశం విత్తాడ్యో జాయతే ధ్రువమ్ క్రయాది వ్యవహారేషు లాభో బహు గుణో భవేత్

గణేశ పూజనం కుర్యాచ్చతుర్థ్యాం సర్వ కర్మసు అవిఘ్నం విద్విషాం విఘ్నం కుర్యాచ్చాస్యన సంశయః

నాగా నిష్ట్వాచ పంచమ్యాం స విషైరభి భూయతే స్త్రీ యం చ లభతే పుత్రాన్పరాం చ శ్రియ మాప్నుయాత్

 సంపూజ్య కార్తికేయంతు షష్ఠ్యం శ్రేష్ఠః ప్రజా యతే మేథావీ రూప సంపన్నో దీర్ఘాయుః కీర్తి వర్థనః

సప్తమ్యాం పూజ్య రక్షేశం చిత్రభానుం దివాకరమ్ అష్టమ్యాం పూజితో దేవో గోవృషాభరణో హరః

జ్ఞానం దదాతి విపులం కొంతించ విపులాం తథా మృత్యుహా జ్ఞాన దశ్చైవ పాశహాచ ప్రపూజితః

దుర్గాం సంపూజ్య దుర్గాణి నవమ్యాం తరతీచ్ఛయా సంగ్రామే వ్యవహారేచ సదా విజయ మశ్నుతే

 దశమ్యాం యమమాతిష్ఠేత్సర్వ వ్యాధి హరో ధ్రువమ్ నరకాదధ మృత్యోశ్చ సముద్ధరతి మానవమ్

ఏకాదశ్యాం యథో ద్ధిష్టా విశ్వేదేవాః ప్రపూజితాః ప్రజ్ఞాం పశుం ధనం ధాన్యం ప్రయచ్ఛంతి మహీం తధా

 ద్వాదశ్యాం విష్ణు మిష్ట్వేహ సర్వదా విజయీ భవేత్ పూజ్యశ్చ సర్వ లోకానాం యధా గోపతి గోకరః

తా॥ తృతీయా తిథియందు కుబేరుని పూజించినవాడు నిశ్చయముగ ధనాఢ్యుడగును, క్రయ విక్రయాది వ్యవహారములందు ఎన్నో రెట్లధిక లాభము సమకూరును. చతుర్థి నాడే కాక ప్రతికర్మ యందును గణేశ్వరుని పూజించినచో విఘ్నములు తొలగిపోవును. శత్రువులకు విఘ్నములు కలుగును. సంశయము లేదు. పంచమి నాడు నాగ దేవతల నర్సించినచో, ఏష బాధయుండదు. లక్షణమైన భార్య, సత్సంతానము, అమితమైన సంపద కలుగును. షష్ఠి నాడు కార్తికేయుని పూజించువాడు శ్రేష్ఠుడు, మేధావి, రూప సంపన్నుడు, దీర్ఘాయుష్మంతుడు, కీర్తి మంతుడును అగును. సప్తమీ నాడు సూర్యుని, అష్టమి నాడు శివుని పూజించినచో విస్తృతమైన జ్ఞానమును, విపులమైన తేజస్సును సూర్యదేవుడీయగా, శివుడు మృత్యువును నివారించి, బంధమును తొలగించి జ్ఞానమునిచ్చువాడగును. నవమి నాడు దుర్గా పూజ చేసిన వాడు దుర్గమమైన సంసారమును స్వేచ్చగా దాటగలడు. అంతీయ కాక యుద్ధమునందును, వ్యవహారమునందును జయము పొందును. యముడు నిశ్చయముగ నన్నివ్యాధులను హరించివేయును. అతనిని దశమినాడు పూజింపవలెను. ఆ దేవుడు మానవుని నరకము నుండి, మృత్యువు నుండియును ఉద్దరించును. ఏకాదశి నాడు విశ్వ దేవతలను పూజించినచో వారు సంతానమును, పశుసంపదను, ధనమును, ధాన్యమును, భూమిని ప్రసాదింతురు. ద్వాదశినాడు విష్ణుదేవునర్చించిన విజయ మెల్లపుడు వరించుచుండును. విష్ణు భగవానునని పూజించువాడు సహస్ర కిరణుడగు సూర్య దేవుని వలె సర్వలోక పూజ్యుడగును .

 మూ. కామ దేవం త్రయోదశ్యాం సురూపో జాయతే ధ్రువమ్ ఇషాం రూపవతీం భార్యాం లభేత్కామాంశ్చ పుష్కలాన్  

దృష్వైశ్వరం చతుర్దశ్యాం సర్వేశ్వర్య సమన్వితః బహు పుత్రో బహు ధన స్తథాస్యాన్నాత్ర సంశయః

పౌర్ణమాస్యాం తుయః సోమం పూజయేద్భక్తి మాన్నరః స్వాధిపత్యం భవేత్తస్య సంపూర్ణం స చ హీయతే

పితరః స్వదినే దిండే! హృష్టి కుర్వంతి సర్వదా ప్రజా వృద్ధిం ధనం రక్షాం చాయుష్యం బలమేవచ

ఉపవాసం వినాప్యేతే భవంత్యుక్త ఫల ప్రదాః పూజయా జప హోమైశ్చ తోషితా భక్తితః సదా

మూల మంతైశ్చ సంజ్ఞాభిరంశ మంత్రైశ్చ కీర్తితాః పూర్వవత్పద్మమధ్యస్థాః కర్తవ్యాశ్చతిథేశ్వరాః

గంధపుష్పోప హారైశ్చ యథా శక్త్యా విధీయతే పూజా బాహ్యేన విధినా కృతాపిచ ఫల ప్రదా

ఆజ్యధారా సమిద్భిశ్చ దధిక్షీరాన్న మాక్షికైః యధోక్త ఫలదో హోమో జపః శాంతేన చేతసా

మూల మంత్రాశ్చ సంజ్ఞాభి రంగ మంత్రాశ్చ కీర్తితాః కృత్వా యజ్ఞాన్దశ ద్వౌచ ఫలాన్యేతాని భక్తితః

యధోక్తాని తధోక్తాని లభేతేహా ధికాన్యపి ఇహ యస్మాద్యధాన్యస్మిన్యో వసేద్యః సుఖీసదా

తేషాం లోకేషు మంత్రజ్ఞో యావత్తేషాం తిథిః స్థితా దహే తస్మాత్తధారిష్టం తద్రూపో జాయతే నరః

సురూపో ధర్మ సంపన్నో క్షపితారిర్మహీపతిః స్త్రీవా నపుంసకోవాపి జాయతే పురుషోత్తమః

తా॥ త్రయోదశి నాడు మన్మధుని పూజించినవాడు నిశ్చయముగా సుందర రూపుడగుటయే గాక ఇష్టమైన సౌందర్యవతిని భార్యగా పొంది యనేకములగు నీప్సితములఁబడయును . చతుర్దశి నాడు మహాదేవుని దర్శిం(పూజించినవాడు సర్వేశ్వర్య సమన్వితుగ ,బహుపుత్రవంతుడు, మిక్కుటమగు ధనము గలవాడగును. సంశయములేదు. పూర్ణిమనాడు భక్తియుక్తుడై చంద్రుని పూజించువాడు సర్వమును స్వాధీన పఱచుకొనగలుగును. అట్టి యాధిపత్యమెప్పటికిని సమసిపోక నిలిచి యుండును. తమ తిథియైన అమావాస్య నాడు పితృ దేవతలు పూజింపబడిన యెడల పోరు సంతాన వృద్దిని, ధనమును, రక్షణను, ఆయువును, బలమును ప్రసాదింతురు. ఈ తిథి దేవతలందఱును సభక్తిక జపహోమాదులతో మాత్రము తుష్టిఁజెంది ఉపవాసములతో నక్కరలేకయే ఆయా ఫలముల నిచ్చుచుందురు . ఈ దేవతలను పద్మ మధ్యమున ప్రతిష్ఠించి మూల మత్రములతోను, అంశ మంత్రములతోను, నామములతోను పూజింపవలెను. గంధ పుష్ప నైవేద్యములు యధాశక్తిగ సమర్పించి బాహ్య పూజా పద్దతిగా పూజించినను వీరు ఆయా ఫలములనిచ్చెదరు. ఆజ్యధారలు, సమిధలు, పెరుగు, పాలు, అన్నము, తేనె మున్నగువానితో యధోక్త ఫలదముగా హవనము, ఏకాగ్ర చిత్తముతో జపము చేయవలెను. మూల మంత్రములు, అంగ మంత్రములు, నామముతోను భక్తి పూర్వకముగ స్తుతించుచునిట్లు పన్నెండు యజ్ఞములు చేసినచో. చెప్పబడిన ఫలములు యధాతధముగా లభించుటయే గాక, అదనపు ఫలములు కూడ లభించును. ఇహమునందేట్లో పరమునందును అటులే నిత్యమును సుఖియై యుండును. మంత్రజ్ఞుడైన యజ్ఞకర్త, ఆయా దేవతల తిథి దేవమానమున నేంత వఱకుఉండునో అంత వఱకు వారి వారి లోకములలో నానందించును. అతని యరిష్టములన్నియు భస్మీపటలములై పోగా నతడా దేవతా స్వరూపమునందును. సౌందర్యవంతుడును, ధర్మ సంపన్నుడును, అణచివేయబడిన శత్రువులు గలవాడును, రాజును అగును. స్త్రీయైనను, నపుంసకుడైనను పురుషోత్తముడగును.

 మూ॥ ఇత్యేతాః కథితాః కృష్ణ! తిథయో యా మయా తవ నక్షత్ర దేవతాః సర్వా నక్షత్రేషు వ్యవస్థితాః

ఇష్టాన్కామాన్ప్రయచ్ఛంతి యాస్తా వక్ష్యే మహాధర! చంద్రమా యత్ర నక్షత్రే మహా వృద్ధ్యా స్థితః సదా

ఉక్తస్తు దేవతా యజ్ఞ స్తదా సా ఫలదా భవేత్ దేవతాశ్చ ప్రవక్ష్యామి నక్షత్రాణాం యథాక్రమమ్

నక్షత్రాణి చ సర్వాణి యజ్ఞాశ్చైవ పృధ క్పృథక్ అశ్విన్యామశ్వినా విష్ణో దీర్ఘాయుర్జయతే నరః

వ్యాధిభిర్ముచ్యతే క్షిప్ర మత్యర్థం వ్యాధి పీడితః భరణ్యాం యమ ఉద్దిష్టః కుసుమైరసితైః శుభైః

తధా గంధాదిభిః శుభ్రైరపమృత్యోర్విమోచయేత్

అనలః కృత్తికా యాంతు ఇహ సంపూజితః పరః రక్త మాల్యాదిభిర్దద్యాత్ఫలం హోమేన చ ధ్రువమ్

పూజ్యః ప్రజాపతిః ప్రీత ఇష్టో దద్యాత్పశూం స్తధా రోహిణ్యాం దేవశార్దూల! పూజనా దీహ గోపతే  మృగశేర్షే సదాసోమో జ్ఞాన మారోగ్యమేవచ

  ఆర్ద్రాయాంతు శివం పూజ్య పశ్చాద్విజయమాప్నుయాత్ పద్మాదిభిః స దివ్యైశ్చ పూజితః శం ప్రయచ్ఛతి

తథా పునర్వస్వదీతీః సదా సంపూజ్యతే దివి గురుణా తర్పణా చైవ మాతేవ పరిరక్షతి

తా॥ “విష్ణు భగవానుడా! తిథుల గుఱించిన వివరములన్నియు నీకుఁదెలిపితినీ. ఇక నక్షత్రదేవతలు ఆయా నక్షత్రములందు వ్యవస్థితులైయుందురు. వారు పూజలందుకొని యభీప్సితముల నెట్లను గ్రహింతురో చెప్పుచున్నాను. చంద్రుడే నక్షత్రమున నుదయించి చరించుచుండునో అప్పుడు. చెప్పబడిన దేవతా పూజవలన నా దేవత ఫలమిచ్చునదియగును. ఇప్పుడు నక్షత్రముల దేవతలను గుఱించి క్రమముగా చెప్పుచున్నాను వినుము. ఆయా నక్షత్రములను, వానియందు పూజింపదగిన దేవతలను వేజ్వేజుగ పేర్కొందును. అశ్వినీ నక్షత్రమునందశ్వినీ దేవతలను పూజించినవాడు దీర్ఘాయుష్మంతుడగును. మిక్కుటమగు వ్యాధితో పీడింపఁబడువాడు శీఘ్రముగ రోగ ముక్తుడై ఆరోగ్యవంతుడగును. భరణీ నక్షత్రమునాడు శుభ ప్రదములైన నల్లని పూవులతో - యముని పూజించవలెను. గంధము మొదలగు శుద్దమగు పూజా ద్రవ్యములతో నా దేవుని పూజింపనాతడు అప మృత్యువు నుండి విమోచనము కలిగించును. కృత్తికా నక్షత్రమున నగ్నిదేవుని ఎఱ్ఱని పుష్పములు మొదలగు వానితో పూజించి, హవనము చేయ నా దేవుడు నిశ్చయముగ ఫలమిచ్చును. రోహిణి నక్షత్రమందు ప్రజాపతిని పూజింపనాతడు ప్రీతుడై పశు సంపదనిచ్చును. మృగశిర యందు చంద్రుని పూజించి ఆరోగ్యము, జ్ఞానము పొందనగును , ఆర్ఘ యందు శివారాధన చేసినచో అంతిమ విజయము కలుగును. దివ్యమైన పద్మములతో నర్చింప నా మహాదేవుడు సుఖము నిచ్చును. పునర్వసు నక్షత్రము నాడు స్వర్గమున బృహస్పతి చేత అదితి పూజింపబడును. ఆ దినమున నా దేవతను పూజించి తృప్తి పఱచినచో నామె తల్లి వలె కాపాడును.

 మూ ॥ పుష్యే బృహస్పతి ర్బుద్ధిం దదాతి విపులాం శుభమ్ గీతైర్గంధాదిభిర్నాగా ఆశ్లేషాయాం ప్రపూజితాః

 తర్పితాశ్చ యధాన్యాయం భక్ష్యా ద్యైర్మధురైః సితైః రక్షా మీషా దిభిన్హా: స్తేః ప్రీతింకుర్వంతి మానద !

 మఘాసు పితరః సర్వే హవ్యైః కవ్యెశ్చ పూజితాః ప్రయచ్ఛంతి ధనం ధాన్యం భృత్యానుత్రాన్పశూంస్తథా

 ఫాల్గున్యామథైవే పూషా ఇష్టః పుష్పాదిభిః శుభైః పూర్వాయాం విజయం దద్యా దుత్త రాయాం భగంతథా

 భర్తారమీప్సితం దద్యాత్క న్యాయై పురుషాయ తామ్ ఇహ జన్మని యుజ్యేత రూప ద్రవిణ సంపద

 పూజితః సవితా హస్తే విశ్వతేజోనిధిః సదా గంధ పుష్పాదిభిః సర్వం దదాతి విపులం ధనమ్

రాజ్యంతు త్వష్టాచిత్రాయాం నిఃసపత్నం ప్రయచ్ఛతి ఇష్టం సంతర్పితః ప్రీతిః స్వాత్యాం వాయుర్బలం పరమ్

 ఇంద్రాగ్నీచ విశాఖాయం జాతర క్తైః ప్రపూజ్యచ ధన ధాన్యాని ల బ్ధ్వేహ తేజస్వీ నివ సేత్సదా

తా॥  పుష్యమి నక్షత్రము నాడు బృహస్పతిని పూజించిన నాతడు మంగళకరము, విపులమునైన బుద్ధినిచ్చును. ఆశ్లేషా నక్షత్రమున గంధాదులతోను, గీతములతోను నాగ దేవతలను పూజింపవలేను . విధ్యుక్తముగ భక్ష్యాది పదార్థములతోను, తీపి వస్తువులతోను, పాలతోను, ఎఱ్ఱని భోగ్య పదార్థములతోను ఆ నాగ దేవతలకు తృప్తి కలిగించినచో వారు ప్రీతిని కలిగింతురు. మఘా నక్షత్రమున హవ్య కవ్వములతో పితృదేవతలనారాధించిన యెడ వారు ధనమును, ధాన్యమును, భృత్యులను, పుత్రులను, పశు సంపదనిత్తురు. పూర్వ ఫల్గుని యందు పూషుని, ఉత్తర ఫల్గుని యందు భగుని పుష్పాదులతో పూజించిన వారు విజయమునిత్తురు. కన్యకు కోరిన భర్తను, యువకునకు కోరిన భార్యను సమకూర్తురు. ఇహ జన్మమున చక్కని రూపమును, వలసిన ధనమును గూర్చెదరు. హస్త నక్షత్రమున విశ్వ తేజో నిధియైన సవితృదేవుని, గంధ పుష్పాదులతో పూజించిన నా దేవదేవుడు విస్తృతమైన ధనమునే కాక సర్వమునిచ్చును. చిత్తానక్షత్రము నందు త్వష్టను పూజించిన నిష్కంటకమైన రాజ్యమునిచ్చును. స్వాతి నక్షత్రమున వాయుదేవుని పూజించి యాతని సంతృప్తి పచిన ప్రీతుడై శ్రేష్ఠమగు బలమునిచ్చును, విశాఖా నక్షత్రమున నేఱ్ఱని పుష్పములతో నింద్రాగ్నులను పూజించువాడు ధన ధాన్యములు పొంది సదా తేజస్విగనుండును.

 మూ॥ ర క్తైర్మిత్రమనూరాధా స్వేవం సంపూజ్య భక్తితః శ్రీయోభజంతి సర్వేషాం చిరంజీవంతి సర్వదా

జ్యేష్టాయాం పూర్వవచ్ఛక్ర మిష్ట్వా పుష్టిమవాప్నుయాత్ గుణైర్జ్యేష్ఠశ్చ సర్వేషాం కర్మణాచ ధనేనచ

 మూలే దేవ పితృ స్త్వర్వాన్భక్త్యా సంపూజ్య పూర్వవత్ పూర్వ వత్ఫల మాప్నోతి స్వర్గస్థానే ధ్రువోభవేత్  

పూర్వాషాఢే హ్యపః పూజ్య హుత్వా తతైవ పూర్వవత్ సంతాపాన్ముచ్యతే క్షిప్రం శరీరాన్మాన సాత్తథా

ఆషాఢాసు తధా విశ్వానుత్తరాషాఢ యోగతః విశ్వేశం పూజ్య పుష్పాద్యైః సర్వ మాప్నోతి మానవః

శ్రవణేతు సితైర్విష్ణుం పీతై ర్నీలైశ్చభక్తితః సంపూజ్య శ్రీయ మాప్నోతి పరం విజయమేవచ

ధనిష్ఠాసు వసూనిష్ట్యా నభయం భజతే క్వచిత్ మహతోపి భయా త్వైతైర్గంధ పుష్పాదిభిః శుభైః

ఇంద్రం శత భాషాయాంచ వ్యాధిభిర్ముచ్యతే ధ్రువమ్ ఆతురః పుష్టిమాప్నోతి స్వాస్థ్య మైశ్వర్యమేవచ

 అజం భాద్ర పదాయాంతు శుద్ధ స్ఫటిక సన్నిభమ్ సంపూజ్య భక్తి మాప్నోతి పరం విజయమేవచ

ఉత్తరాయా మహిర్బుద్న్యం పరాం శాంతి మవాప్నుయాత్ రేవత్యాం పూజితః పూషా దదాతి సతతంశుభమ్ సితైః పుష్పైః స్థితించైవ ధృతిం విజమేవ చ  

తా॥  అనూరాధా నక్షత్రమున నిటైజ్ఞాని పూలతో మిత్రుని భక్తితో పూజించువారందకి సంపదలు కలుగుటయేగాక వారు చిరకాలము జీవింతురు. జ్యేష్ఠానక్షత్రమున శక్రుని (ఇంద్రుని పూజించి పుష్టిని పొందనగును. గుణములచేత, కర్మచేత, ధనము చేతను అందజిలోనను ఉత్తముడు కానగును మూలా నక్షత్రదినమున పితరులనందఱును భక్తితో నర్చించిన పూర్వోక్త ఫలము కలుగును. స్వర్గస్థాన నివాసము నిశ్చయమై యుండును . పూర్వము చెప్పినట్లే పూర్వాషాఢ దీనమున జలములను పూజించి, పూర్వోక్తవీధిగా హవనము చేసినవాడు శారీరక మానసిక సంతాపముల నుండి ముక్తుడగును. ఉత్తరాషాడయందు విశ్వేదేవులను, విశ్వేశ్వరుని పుష్పాదులతో నర్చించిన మానవుడు సర్వమును పొందును. శ్రవణ నక్షత్రమున తెలుపు, పసుపు, నీల వర్ణములు గల పుష్పములతో విష్ణు దేవుని సభక్తికముగ పూజింప సంపద, విజయము ప్రాప్తించును. ధనిష్టా నక్షత్రము నందు శుభ ప్రదములైన గంధ పుష్పాదులతో వస్తువులను పూజించినచో మహద్బయములు దూరమై నిర్భయముగ, నిశ్చింతగ జీవనము గడచును. శతభిషానక్షత్రమున నింద్రుని పూజింప వ్యాధుల నుండి నిశ్చయముగ ముక్తుడగును. రోగి ఆరోగ్యమును బలమును ఐశ్వర్యమును పొందును. పూర్వా భాద్రయందు శుద్ధస్ఫటిక సంకాశుడగు నజుని పూజించుచో భక్తి, విజయము కలుగును. ఉత్తరాభాద్ర యందహిర్భుధ్యుని పూజించిన పరమశాంతి కలుగును. రేవతీ నక్షత్రము నందు తెల్లని పువ్వులతో పూషుని పూజింపనాతడు ఎల్లవేళల శుభమును, చక్కని జీవితమును, ధైర్యమును, విజయమును ప్రసాదించును.

 మూ. తవైవైతే సమాఖ్యాతా యజ్ఞాః సంక్షేపతోమయా నక్షత్ర దేవతానాంచ సాధకానాం హితాయ వై భక్త్యా విత్తాను సారేణ భవంతి ఫలదాః సదా

 గంతు మిచ్ఛేదనంత్యం వా క్రియాం ప్రారబ్ధమేవచ నక్షత్ర దేవతా యజ్ఞం కృత్వా తత్సర్వమాచరేత్

ఏవం కృతే హి తత్సర్వం యాత్రాఫలమవాప్నుయాత్ క్రియా ఫలంచ సంపూర్ణ మిత్యుక్తం భానునా స్వయమ్

 యజ్ఞాత్స విజయం కుర్యాత్ర్కియాం కుర్యాద్యధేప్సితామ్ కాల చక్రేఽధ వా సూర్యం రాశి చక్రే కలాత్మనా

విశ్వతేజో నిధిం ధ్యాత్వా సర్వం కుర్యాద్యధేప్సితమ్ విభూతి రేషా చోద్దిష్టా క్రియాభిః సాధ్యతే ధ్రువమ్

 ఉద్దిష్టాభిః ప్రయత్నేన ముక్తియోగేన సాధ్యతే భానో రారాధనా ద్వాపి ప్రాప్యతే ముక్తిరేవ తస్మాదారాధయరవిం భక్త్యాత్వం మధుసూదన !

 ఇజ్యాపూజా నమస్కార శుశ్రూషాభిరహర్నిశమ్ ప్రతోపవా సైర్వివిధైర్భ్రాహ్మణానాంచ తర్పణైః

 యః కారయతి దేవార్చాం హృదయాలంబనం రవేః సనరో భాను సాలోక్యము పైతి గత కల్మషః

ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే బ్రాహ్మే పర్వణి సప్తమీ కల్పే నకుత పూజా విధీ వరనం నోము దధిక శతతమోత ధ్యాయః ॥.

 తా. సంక్షేపముగ నీకే ఈ నక్షత్ర దేవతల పూజా విధానములను సాధకుల మేలు గోరి చెప్పితిని భక్తిననుసరించి, వ్యయము - చేయు ధనముననుసరించి యివి ఫలముల నొసంగును ప్రయాణము చేయుటకు గాని, ఏదేని కార్యమును ప్రారంభించుటకు గాని యిచ్చగించినచో ముందు నక్షత్ర దేవతా పూజ పూర్తి గావించిన పిమ్మట నాయా పనులను చేయవలెను. ఇట్లు నక్షత్రదేవతా పూజ చేసిననే యాత్రాదుల ఫలము సమకూరును. ఇతర క్రియల ఫలితములు కూడ అనుకూలముగా నుండునని సూర్య దేవుడే స్వయముగా నుడివెను. పూజవలననే కోరినట్లుగ క్రియా సాఫల్యమును విజయమును ఆ దేవుడు సమకూర్చును. రాశి చక్రమునందు కలాత్మకముగ, కాలచక్రమునందు సమగ్రముగను. విశ్వ తేజోనిధియైన సూర్య భగవానుని ధ్యానించి, కోరిన ఏ క్రీయనైనను యధేచ్చగ చేయనగును. అప్పుడే ఆయా క్రియలచే సుద్దిష్టమైన ఫలము సంపన్నమై చేకూరును. ఇది నిశ్చయము. ఆయా ఫలముల నుద్దేశించి చేయు కర్మలచే మోక్ష ఫలము - ఇతర ఫలయోగ ప్రయత్నముచే మాత్రమే సాధింపబడును. కాని సూర్యారాధన - వలన నేరుగా మోక్షమే లభించును. అందువలననో మధు సూదనా! ఆ సూర్య దేవునే భక్తితో నారాధింపుము. రాత్రింబవలు యజ్ఞము, పూజ, నమస్కారము, సేవ, వ్రతము, ఉపవాసము, బ్రాహ్మణ తర్పణము మొదలగు వివిధ విధానములతో నా దేవదేవునారాధింపుము. సూర్య ప్రీత్యర్థముగనెవడు దేవతా పూజ జరిపించునో వాడు పాపరహితుడై సూర్యలోక ప్రాప్తినందును.

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు నక్షత్ర పూజా విధి వర్ణనమను నూట రెండవ అధ్యాయము సమాప్తము.