101. సప్తమీ కల్పమున భద్రా కల్ప వర్ణనము

 బ్రహ్మోవాచ :

మూII శుక్లపక్షేతు సప్తమ్యాం నక్షత్రం సవితుర్భవేత్ యధా ప్రథమతా చైవ తదావై భద్రతాం వ్రజేత్  

స్నపనం తత్ర దేవస్య ఘృతేన కథితం బుధైః క్షీరేణ చ తథా వీర! పునరిక్షుర సేవచ

స్నాపయిత్వాతు దేవేశం చందనేన విలేపయేత్ దగ్ధ్వాతు గుగ్గులం తస్య దద్యాద్భద్రం తథాగ్రతః

గోధూమ చూర్ణం నివపన్విమలం శశిసన్నిభమ్ సవజ్రం సగుడంచైవ రక్తపుష్పోప శోభితమ్

యదస్య శృంగ మీశానం తత్రవై మౌక్తికం న్య సేత్ యదాగ్నేయం తత్రమాణిక్యం న్యసేద్వాలోహితం మణిమ్

నైరృత్యే మకరం దద్యాదాయవ్యే పద్మరాగిణమ్ గాంగేయ మంతతస్తస్య స్వశక్త్యా విన్యసేద్బుధః

చతుర్థ్యామేక భక్తంతు పంచమ్యాం నక్తమాదిశేత్ షష్ఠ్యామయాచితం ప్రోక్త ఉపవాసోహ్యతః పరః

పాషండినో వికర్మస్థాన్భైడాల ప్రతికాంత్యజాన్ సప్తమ్యాం పాలయేత్ర్పాజ్ఞో దివాస్వాపం వివర్జయేత్

 అనేన విధినా యస్తు కుర్యాద్వైభద్ర సప్తమీ తస్మైభద్రాణి సర్వాణి యచ్ఛంతి ఋభవః సదా

భద్రం దదాతి యస్త్వస్యాం భద్రస్తస్య సుతో భవేత్ భద్రమాసాద్య భూతేశ! సదా భద్రేణ తిష్ఠతి

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “శుక్లపక్ష సప్తమీ దినమున హస్తా నక్షత్రమైన దానికెప్పుడు ప్రాథమ్యము కలుగునో అప్పుడది భద్రనామమును కూడా పొందును. ఆనాడు సూర్యదేవునకు మొదట నేతితోను, అటుపైన పాలతోను, తదుపరి చెట్టుకు రసముతోను. స్నానము చేయింపవలెనని విద్వాంసుల చేత చెప్పబడినది. స్నపనము తరువాత దేవునకు చందనము పూయవలెను. గుగ్గులు ధూపమువేసి, అటు పైన సర్వతో భద్రను సమర్పింపవలెను. చంద్రుని వలె ప్రకాశించు పరిశుద్దమైన గోధుమ పిండిని, వజ్రము, బెల్లము, ఎఱ్ఱని పుష్పములతోసహాచల్లి. దాని ఈశాన్యమూలయందు ముత్యమును, ఆగ్నేయమున మాణిక్యమును లేక కెంపును ఉంచవలెను. అదే విధముగ నైరృతియందు మరకతము, వాయువ్యమున పద్మరాగము, చివరన బంగారమును, తన శక్తిననుసరించి యుంచవలెను. చతుర్థినాడు' ఒక పూట భోజనము, పంచమినాడు నక్తవ్రతము, షష్ఠినాడు అయాచిత భోజనము, తరువాతి దినమగు సప్తమీనాడు ఉపవాసము చేయవలెను. ఈ సప్తవ్రతానుష్టానము చేయువాడు, వేదబాహ్యులను, కర్మభ్రష్టులను, బిడాల ప్రతికులను, పంచములను చూడరాదు. పగటి సమయమున నిద్రింపరాదు. ఈ విధానముగ భద్రసప్తమీ నాచరించువాడు దేవతలయనుగ్రహము పొందును. వారు అతనికి సర్వవిధములైన శుభముల నిత్తురు. ఈ తిథియందు సూర్యభగవానునకు సర్వతో భద్రను సమర్పించువాని కుమారుడు శుభమును పొందును. అంతీయకాక తాను స్వయముగ శుభమునంది మంగళకరమైన జీవితమును గడుపును.

 మూII దిండిరువాచ

కోఽయం భద్ర ఇతిప్రోక్తః కథం కుర్యాం ప్రభూషణమ్ దత్వాచ కింఫలమ్ విద్యాద్విధినా కేన దీయతే

 బ్రహ్మోవాచ :

వ్యోమ భద్రమితి ప్రోక్తం దేవ చిహ్నమనుత్తమమ్ యద్ధృత్వేహ నరః సూర్యం ముచ్యతే సర్వకిల్బిషైః

శాలిపిండమయంకర్యం చతుష్కోణ మనూపమమ్ గవ్యేన సర్ఫిషా యుక్తం ఖండశర్కర యాన్వితమ్

చాతుర్జాతక పూర్ణంతు ద్రాక్షాభిశ్చ విశేషతః నాలికేర ఫలైశ్చైవ సుగంధంచ గణాధిప!

మధ్యేంద్రనీలం భద్రస్య న్య సేత్రాజ్ఞఃస్వశక్తితః పుష్పరాగం మరకతం పద్మరాగం తథైవ చ

అనౌపమ్యంచ మాణిక్యం క్రమాత్కోణేషు విన్యసేత్ వాచకాయా ధవా దద్యాదథవా భోజకే స్వయమ్

అనేన విధినా యస్తు కృత్వాభద్రం ప్రయచ్ఛతి సహిభద్రాణి సంప్రాప్య గచ్ఛే దోపతిమందిరమ్

బ్రహ్మలోకం తతో గచ్ఛేద్యానారూఢ నసంశయః తేజసా గోజ సంకాశః కాంత్యాగేజసమస్తథా

ప్రభయా గోపతేస్తుల్య ఊర్జసా గోపరస్యచ తస్మాదేత్య పునర్భూమౌ గోపతిః స్యాన్నసంశయః ప్రసాదాద్గోపతేర్వీర! సర్వజ్ఞాధిప పూజితః

ఇత్యేషా కధితా భీమ! భద్రానామేతి సప్తమీ యా ముపోష్యనరో భీమ! బ్రహ్మలోకమవాప్నుయాత్

తా॥ దిండి యిట్లనెను. “భద్రయని దేనినందురు? దాని నెట్లలంకరింపవలెను? అది సమర్పించుట వలన నేమి ఫలము కలుగునని యెఱుంగ వలయును? ఏ విధానమున సమర్పింపవలేను”?. బ్రహ్మదేవుడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది వ్యోమభద్రమని చెప్పబడును. సర్వశ్రేష్ఠమైన దేవ చిహ్నము. సూర్యదేవ సంబంధమగు దీనిని ధరించువాడు సర్వపాపములనుండి విముక్తుడగును. ఆవు నేయి, ఖండశర్కర కలపిన శాల్యన్నపు ముద్దను చతురస్రాకారాముగ తీర్చవలెను. నాలుగు విధములైన పండ్లతో, ముఖ్యముగా ద్రాక్షలతోను, నారికేళములతోను పరిమళ ద్రవ్యములతోను దానిని సంపన్నము చేయవలెను. భద్ర మధ్యభాగమున నింద్ర నీలము; పుష్పరాగమును, మరకతమును, పద్మరాగమును. మేటి మాణిక్యమును కోణములందు క్రమముగ, శక్తి కొలదిగ, నుంచవలెను, దానిని పౌరాణికునకుగాని లేక భోజకునకుగాని సమర్పింపవలేను. ఈ పద్దతి ననుసరించి భద్రను సిద్దపఅచీ దానము చేయువాడు శుభములను పొంది సూర్యలోకమును చేరును. అటనుండి, తేజస్సు చేత, కాంతి చేత సూర్య సన్నిభుడై, దివ్యయానమున పయనించి బ్రహ్మలోకమునుజేరును, సందేహము లేదు. ఇట్లు ప్రభ చేతను, బలము చేతను సూర్యసముడై, బ్రహ్మలోకమునుండి మఱల భూలోకమన కేతెంచి నిస్సంశయముగ రాజగును. సూర్యదేవుని యనుగ్రహముచే నింద్రదేవుని వలె అందజి పూజలందుకొనును. ఏ తిథి యందుపవసించుటచేత మానవుడు బ్రహ్మలోక ప్రాప్తినందునో అట్టి భద్రసప్తమీ గుంచి నీ కిట్లు చెప్పితిని.

  మూ!! శృణ్వంతీ యే పఠంతీహ కుర్వంతి చ గణాధిప! తే సర్వే భద్రమాసాద్య యాంతి తద్ర్బహ్మ శాశ్వతమ్

సుమంతురువాచ :

 ఇత్యుక్త వాన్పురా బ్రహ్మా దిండినే సప్తమీ వ్రతమ్

మయాప్యుక్తం తవవిభో యథా జ్ఞాతం యథా శ్రుతమ్

గృహీత్వా సప్తమీ కల్పం మాసవో యస్తు భూతలే త్యజేత్కామాద్భయాద్వాపి సజ్ఞే యః పతితో బుధః

తస్మాద్ధారయ తద్వీర నత్యాజ్యం సప్తమీవ్రతమ్ త్యజమానో భవేద్వర! ఆరూఢ పతితో నరః

శ్రావ యేద్యస్తు భక్త్యాచ సప్తమీ కల్పమాదితః సోఽశ్వమేధ ఫలం ప్రాప్య తతో యాతి పరంపదమ్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్నే భద్ కల్పవర్ధనం నోమెకాధిక శత తమోఽధ్యాయః ॥.

తా॥  ఈ సప్తమీ వ్రతమును వినినవారు, చదువువారు, చేయువారును శుభమునంది శాశ్వతమైన బ్రహ్మపదమును చేరుదురు. “సుమంతుముని యిట్లనెను. “ సప్తమీ వ్రతమును గూర్చి పూర్వము బ్రహ్మదేవుడు దిండికి చెప్పియుండెను. దానినే నేను వినినట్లు, నాకు తెలిసినట్లు నీకు చెప్పితిని. భూతలమునందు మానవుడెవడైనను సప్తమీ వ్రతమును స్వీకరించియు, కామము వలననో, భయము వలననో పూర్తిచేయక వదలినచో నట్టివాడు పతితుడును, అజ్ఞానియునునగును. అందుచేత దీనిని విడువకుండ పూర్తియగు వఱకును నిర్వహింపుము. మధ్యలో వదలి పెట్టినవాడు కొంత పైకిఁబోయి క్రిందపడిన వాడగును. ఈ సప్తమీ కల్పమును ప్రారంభమునుండియు భక్తులకు శ్రద్ధగా వినిపించువాడశ్వమేథ ఫలమును పొంది పరమపదముఁజేరును.

శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు భద్రాకల్ప వర్ణనమను నూటయెకటవ అధ్యాయము సమాప్తము.