88. ఆదిత్యవార కల్పమున విజయవార విధి వర్ణనము

బ్రహ్మోవాచ : -

మూII శుక్ల పక్షస్య సప్తమ్యాం ప్రాజాపత్యర సంయుతః స జ్ఞేయో విజయో నామ సర్వపాప భయాపహః

తత్రకోటి గుణం సర్వం ఫలం పుణ్యస్య కర్మణః దదాతి భగవాన్దేవః పూజితశ్చందనాధిపః

స్నానం దానం జపో హోమః పితృదేవాది పూజనమ్ నక్తం చాప్యుప వానస్తు సర్వమత్ర దివాకరః

 కుర్యాత్కోటి గుణం సర్వం పూజితో హ్యత్రగోపతిః తస్మాదత్ర సదాదేవం పూజయేద్భక్తిమాన్నరః

సర్వేశం సప్తద్వీపేశం సప్త సైంధవ వాహనమ్ సప్తమ్యాంతు సమారాథ్య సప్తప్రకృతి సంభవమ్

సప్తలోకాధిపత్యంతు ప్రాప్నుతే సప్తరశ్మిభిః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణ్యాదిత్య వార కల్పే విజయవార విధి వర్ణనం నామాష్టాశీతి తమోఽధ్యాయః

 తా॥  బ్రహ్మదేవుడిట్లు బలికెను. “శుక్లపక్షమున రోహిణి నక్షత్రయుక్త సప్తమీ తిథి సర్వపాపహరమగు విజయాదిత్య వారమనబడును. ఆనాడు చేసిన పుణ్యకర్మకు కోటిరెట్లు ఫలము లభించును. సూర్యభగవానునా దినమున పూజించినచో నట్టి ఫలము నా దేవ దేవుడొసంగును. స్నానము, దానము, జపము, హోమము, పితృ దేవార్చనము, నక్తాపవాసము, అన్నియును, సూర్యపరములై యుండవలెను. ఆ విధముగ నా దేవుని పూజించుచో కోటి రెట్లు ఫలము కలుగును. కావున నట్టి నక్షత్ర తిథివార యోగమున మానవుడు ఏమరక సూర్యపూజ చేయవలెను. సర్వేశ్వరుడు, సప్తద్వీపేశ్వరుడు, సప్తాశ్వ రథారూఢుడు, సప్తప్రకృతి సంభవుడునైన సూర్యదేవుని, సప్తమీనాడు పూజించిన వానికి. ఆ సప్తరశ్మియనుగ్రహముచే సప్తలో కాధిపత్యము సమకూరును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున ఆదిత్యవార కల్పమునందు విజయవార విధి వర్ణనమను ఎనుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.