భవిష్య మహా పురాణము
86. ఆదిత్య వార కల్పమున జయవార తిథి వర్ణనము
బ్రహ్మోవాచ :
మూII పంచతారం భవేద్యత్ర నక్షత్రం తే వృషధ్వజ! వారేతు దేవదేవస్య స వారః పుత్రదః స్మృతః
ఉపవాసో భవేత్తత్ర శ్రాద్ధం కార్యం తథా భవేత్ ప్రాశనం చాపి పిండస్య మధ్యమస్య ప్రకీర్తితమ్
సోపవాసస్తు యో భక్త్యా పూజయేదత్ర గోపతిమ్ ధూపమాల్యోప హారైస్తు దివ్యగంధ సమన్వితైః
ఏవం పూజ్య వివస్వంతం తస్యైవ పురతో నిశి భూమౌ స్వపితి వైవీర! జపన్ శ్వేతాం మహామతే
ప్రాతరుత్థాయ చ స్నానం కృత్వా దత్వార్ఘ్య ముత్తమమ్ రక్త చందన సంమిశ్రైః కరవీరైర్గణాధిప!
దీపం చ పూజయిత్వాతు తతః శ్రాద్ధం ప్రకల్పయేత్
పంచభిర్భ్రాహ్మణోర్దేవ! దివ్యైర్భౌమైశ్చ సువ్రత! మఘ సంజ్ఞౌ తత్ర దివ్యౌ బ్రాహ్మణా పరికల్పియేత్
త్రీనత్ర బ్రాహ్మణాన్భీమాన్ప్ర కల్ప్యాంధక సూదన! కుర్యాదేవం తతఃశ్రాద్ధం పార్వణం భాస్కర ప్రియమ్
శ్రాద్ధేశ్వథ సమాప్తే తు దద్యాత్పిండంతు మధ్యమమ్ పురతో దేవదేవస్య స్థిత్వా మంత్రేణ సువ్రత!
“స ఏష పిండో దేవేశ! యోఽభీష్ట స్తవ సర్వదా అశ్నామి పశ్యతే తుభ్యం తేన మే సంతతిర్భవేత్”
ప్రసాదాత్తవ దేవేశ! ఇతిమే భావితం మనః ఇత్థం సంపూజితో హ్యత్ర భాస్కరః పుత్రదో భవేత్
అతోఽయం పుత్రదో వారో దేవస్య పరికీర్తితః ఏవమత్ర సదాయస్తు భాస్కరం పూజయేన్నరః
ఉపవాస పరః శ్రాద్దే సపుత్రం లభతే ధ్రువమ్ ధనం ధాన్యం హిరణ్యంచ ఆరోగ్యం సుఖదం తథా సూర్యలోకం చ సంప్రాప్య తతో రాజా భవేన్నృషు
ప్రభయా ద్విజ సంకాశః కాంత్యా చాంబుజ సన్నిభః వీర్యేణ గోపతేస్తుల్యో గాంభీర్యసాగరోపమః "
(ఇతి పుత్రద విధి వర్ణనమ్)
తా॥ బ్రహ్మదేవుడిట్లునుడివెను. “ఆదిత్యవారమునాడు ఐదు తారలు గల నక్షత్రము (రోహిణి, పునర్వసు, మఘ, హస్త, విశాఖ) మూలసంభవించెనేని అది 'పుత్రద' వారమనబడును. ఆ దినమున ఉపవాసము చేసి శ్రాద్ధము పెట్టవలెను. మధ్యమ పిండమును భుజింపవలెను. భక్తి శ్రద్దలతో, ఉపవాసముచేసి, ధూపమాల్యోపహారములు, దివ్యమైన సుగంధములతో సూర్యుని పూజించువాడు. పూజించి, రాత్రి సమయమున నా దేవుని ముందు, మహాశ్వేతను జపించుచు భూమి పైపరుండి. ఉదయముననే మేల్కొని, స్నానమాచరించి, రక్తచందనము, గన్నేరు పూలతో కలిపిన జలముతో అర్ఘ్యప్రదానము చేసి. గ్రహేశ్వరుడైన సూర్యదేవుని పూజించి, అటుపిమ్మట శ్రాద్ధకర్మనాచరించువాడు సంతానమును పొందును. ఈ శ్రాద్ధమున నైదురుగు బ్రాహ్మణులు భోక్తలుగ నుండువలేను. 'మఘ' సంజ్ఞులిరువురు దివ్యులు: భీమ సంజ్ఞలు మువ్వురు భౌములుగా నిర్ణయింపవలెను. ఇట్లు సూర్యదేవునకు ప్రియమైన యీ శ్రాద్దమును పార్వణ విధానముగ జరుపవలెను. శ్రాద్దము సమాప్తమైన పిమ్మట మధ్యమ పిండము సూర్యుని యెదుటనునిలిచి, తాను కూడ నా దేవుని యెదుట నిలిచి ఈ క్రింది మంత్రముతో నా పిండమునభిమంత్రింపవలెను. “ఓ సూర్య భగవానుడా! నీ కెల్లప్పుడు నిష్టమగు నీ పిండమును, నీ సమక్షమున నేను తినుచున్నాను. ఫలితముగ నాకు సంతానము కలుగును. నీ అనుగ్రహమున ఈ వాంఛిత ఫలము కలుగునని నా మనస్సు భావించినది”. ఇట్లు సూర్యుని పూజించి నడిమి పిండమును భుజించిన యెడల నా గ్రహరాజు పుత్రునిచ్చును. అందువలన నిది సూర్యదేవుని 'పుత్రద వారము'గ నెన్నబడును. ఇట్లు భాస్కర పూజనమాచరించి. ఉపవాసపరుడై పార్వణ శ్రాద్ధము పూర్తిచేసి, మధ్యమ పిండప్రాశనము చేయువాడు పుత్రుని పొందును. ధనము, బంగారము, ఆరోగ్యము, సుఖప్రదమైన జీవితము పొంది, సూర్యలోకమునకుఁబోయి, ఆ పిదప భూలోకమున చక్రవర్తియగును. తేజస్సుచేత సూర్యునితో సమానుడై, కాంతిచేత చంద్ర సన్నిభుడై, పరాక్రమమున భాస్కరతుల్యుడై (లేక విష్ణుతుల్యుడై) గాంభీర్యమున సముద్రుని వంటివాడై వెలుగొందును.
(ఇది పుత్రద విధి వర్ణనము)
బ్రహ్మోవాచ :-
మూl! దక్షిణే త్వయనేయః స్యాత్సజయః పరికీర్తితః
అత్రోపవాసోనక్తంచ స్నానం దానం జపస్తథా భవేచ్ఛత గుణం దేవ! భాస్కర ప్రీతయే కృతమ్
తస్మాన్నక్తాది కర్తవ్యం యత్స్యాచ్ఛతగుణం విభోః
ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే బ్రా హ్మేపర్వణి ఆదిత్య దొరకల్పే జయహారతిథి వర్ణనం నామ షడశీతి తమోఽధ్యాయః
తా॥ దక్షిణాయనము నందగు నాదిత్యవారము జయవారమని చెప్పబడును, సూర్యదేవుని ప్రీతికొఱకానాడు చేసెడి ఉపవాస నక్తవ్రతములు, స్నానదానజపములు నూఱురెట్లు ఫలప్రదములగును నూడు రెట్లుధిక ఫలదమగుటచే నక్తాదిగచేయవలెను.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున, ఆదిత్యవార కల్పమునందు జయవార తిథి వర్ణనమను ఎనుబది యాఱవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 86 of the Bhavishya Mahā Purana is as follows:
Certain combinations of Sunday with specific tithis create what the śāstra calls Jaya-vāra — a "victory-day" of exceptional power. This chapter identifies all such combinations in the lunar calendar and provides the specific worship procedures appropriate to each. The emphasis throughout is on using the heightened solar energy of these victory-days to purify the mind of the devotee and align her or his intention with dharma — because Sūrya's victory-energy, when invoked with impure intention, does not produce victory but rather reveals and amplifies the devotee's inner contradictions. The chapter thus contains an implicit ethical teaching: before invoking victory from Sūrya, examine the righteousness of what you seek victory for.