62. దిండ్యాదిత్య సంవాద వర్ణనము

సుమంతురువాచ:

మూ॥ అధాన్యం సరహస్యంతు సంవాదం వచ్మితేఖిలమ్ సూర్యస్యదిండినా సార్థం సర్వపాపప్రణాశనమ్

బ్రహ్మ హత్యాభి భూతస్తు పురాదిండిర్మహా తపాః ఆరాధనాయ దేవస్య స్తోత్రం చక్రే మహాత్మనః

శ్రుత్వాతస్యార్థతః స్తోత్రం తుతోష భగవాన్రవి: ఉవాచ దేవదేవస్తం దిండినం గణనాయకమ్

ఆదిత్య ఉవాచ :

హంత! దిండే! ప్రసన్నోఽస్మి భక్త్యా స్తోత్రేణ తేఽనఘ! వరం వృణీష్వ ధర్మజ్ఞ యత్తే మనసి వర్తతే

దిండీరువాచ :

ఏష ఏవ వరః శ్లాఘ్యాయత్ర్పాప్తోసి మమాంతికమ్ త్వద్దర్శన మపుణ్యానాం స్వప్నేష్వపీచ దుర్లభమ్

యథైషా బ్రహ్మహత్యా మే ఆగతా లోక గర్హితా భవాన్ జానాతి సర్వేశో హృదిస్థః సర్వదేహినామ్

త్వత్ప్రసాదాన్మహేశాన! నాశమాశు ప్రయాతువై తథాచ దురితం సర్వం యచ్చాన్యల్లోక గర్హితమ్

 యద్యదిచ్ఛామ్యహం తత్తత్సర్వమస్తు దివస్పతే ఏతేనైవాను మానేన ప్రసన్నో భగవన్నితి

జ్ఞాతం మయా హి మార్తాండే నాప్రసన్నే విభూతయః ఏవం సర్వ సుఖాహ్లాద మధ్యస్థోపి హిభానుమాన్

 త్వంమామగాధే సంసారే మగ్నముద్ధర్తు మర్హసి సుఖాని తాని చైవాంతే యేషాం దుఃఖం న తత్సుఖమ్

తా॥ సుముంతుముని యిట్లనెను. “ఇఁక నిప్పుడు సర్వపాపములను నశింపజేయగల ‘దిండి-సూర్యుల మధ్య జరిగిన ఒక రహస్యమైన సంవాదమును గూర్చి చెప్పెదను-1. మహాతపస్వియైన దిండి పూర్వమొకప్పుడు బ్రహ్మహత్యాపాతకము తగుల్కొనినవాడయ్యెను. ఆ పాపము నుండి విముక్తుడగుటకాతడు. సూర్యభగవానుని సూర్యభగవానుడా స్తోత్రమును సార్ధముగ విని మిక్కిలి సంతోషించెను. ఋషిగణనాయకుడైన దిండికి భగవానుడు ప్రత్యక్షమై యిట్లనెను. (3) ఆదిత్యుడిట్లు పలికెను. “ఓ దిండి మహరీ! భక్తితో నీవు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడనైతిని. ధర్మజ్ఞా! నీ మనస్సుననున్న వరమును కోరుకొనుము-4. దీండి యిట్లనెను దేవా! తాము నా సమీపమునకు వచ్చి దర్శనమిచ్చుటయే నాకు గొప్ప వరము. పాపాత్ములకు మీ దర్శనము స్వప్నమునందైనను లభింపదు గదా?-5. లోక గర్షితమైన బ్రహ్మహత్యాపాపమునకు సంభవించినది. అందజీ హృదయములందలి భావములను మీరు గ్రహింపగలుగుదురు-6. మీ యనుగ్రహము వలన నా యీ రచురితము నశించిపోవలెను. ఇంకను లోక నింద్యములగు పాపములేవి యున్నను అవియును నాశము పొందవలెను-7. ఓ భగవాన్! నేను కోరినవి సఫలములగునట్లను గ్రహింపుడు. ఈ ఊహతోడనే మిమ్ముస్తోత్రము చేసి ప్రార్థించితిని-8. ఎంతటి సుఖసంతోషములతో జీవించువాడైనను, ఎంతటి ఔన్నత్యముతో వెలిగిపోవువాడైనను సూర్యభగవానుడు ప్రసన్నుడు కానిచో నాతని మైశ్వర్యము లన్నియు వ్యర్థములగునని నాకు తెలియును-9. అగాథమైన సంసారమునందు మునిగిపోయిన నన్నుద్దరింపుడు. ఈ సంసార సుఖములు అంతమున దుఃఖమునే కలిగించును. అందుచేనవి నిజమునకు సుఖములుకావు.

 మూ॥ యదా తు దుఃఖమాగామి కిం వాక స్యైవ భక్షణాత్ తత్ప్రసాదంకురువిభో! జగతాం త్వం జగత్పతే!

జ్ఞాన దానేన యేనైవ ముత్తరేయం భవార్ణవమ్ ఇత్యుక్తస్తేన మార్తాండః కథయామాస యోగవిత్

 యోగం నిర్బీజమత్యంతం దుఃఖసంయోగ భేషజమ్ శ్రుత్వాయోగంతు తం దిండిర్నిర్బీజం నిష్కలంబభౌ

 ప్రణిపత్య మహాతేజా ఇదం వచన మబ్రవీత్ ‘దేవదేవ! త్వయాయోగో యః ప్రోక్తోధ్వాంతనాశన! నైషప్రాప్యోమయా నాన్యైర్మానవైరజితేంద్రియైః

 విషయా దుర్జయా పుంభి రింద్రియాకర్షిణః సదా ఇంద్రియాణాం జయో యుక్తః కః శక్తానాంకరిష్యతి

 అహం మమేతి విఖ్యాతి ర్దుర్జయం చంచలం మనః రాగాదయస్తథాత్యక్తుం శక్యా జన్మాంతరైర్యది

సోఽహమిచ్ఛామి దేవేశ! త్వత్ప్రసాదాదనిర్జితైః రాగాదిభి రమర్త్యత్వం ప్రాపుః ప్రక్షీణ కల్మషాః

ఆదిత్య ఉవాచ :

యదేవం ముక్తి కామస్త్వం గణనాథ! శృణుష్వ తమ్ క్రియాయోగం సమస్తానాం క్లేశానాం హాని కారకమ్

 మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామై వేష్యసి యుక్వైవ మాత్మానం మత్పరాయణః

 మద్భావనా మద్యజనా మద్భక్తా మత్పరాయణాః మమపూజాకరాశ్చైవ మయి యాంతి లయం నరాః

తా॥ ముందు కాలమున ఎప్పుడెట్టి దుఃఖము కలుగునో, అది యెవడనుభవించుట వలన శమించునో తెలియదు. ఓ జగత్పతీ! అందువలన నన్ననుగ్రహింపుడు-11. భవార్ణవమును దాటింపగల జ్ఞానమునుపదేశింపుడు. “ఇట్లు దిండియడిగిన మీదట యోగవిత్తముడైన సూర్యభగవానుడు-12. అతనికి భవదుఃఖమున కౌషధమగు నిర్బీజయోగమునుపదేశించెను. నిష్కలమగు నా నిర్బీజ యోగమును విని యాతడు పరవశుడై ప్రకాశించెను -13. మహాతేజస్వీయగుదిండి సూర్యదేవునకు ప్రణమిల్లి యిట్లు బలికెను. “తమో విధ్వంసకా! దేవదేవా! మీరునుడివిన యీ యోగమును సాధించుటకు నాకుగాని, జితేంద్రియులుకాని వారగునితర మానవులకు గాని శక్యము కాదు-14. ఎల్లప్పుడును ఇంద్రియముల నాకర్షించేడు ‘విషయములు' జయింపరానివి. బలీయములైన యింద్రియములను జయించువాడెవడు?-15. అహంకార మమకార విఖ్యాతి గల మనస్సు చంచలమైనది. దానిని జయించుట దుస్సాధ్యము, అటులే వందల జన్మములెత్తినను రాగద్వేషాదులు వదలి పెట్టుటకు సాధ్యముకాదు.-16. దేవా! అటుల రాగాదులను విడిచి పెట్టలేనివారు, ఇంద్రియములను జయింపజాలనివారు, తమయనుగ్రహమున క్షీణపాపులై ఎట్లు మోక్షము నందగలరో తెలియగోరుచున్నాను”-17. దిండి వాక్యములను విని సూర్యదేవుడిట్లనెను. “గణనాథా నీవు మోక్షప్రాప్తిని కోరుచున్నయెడల సమస్త క్లేశములను నశింపజేయగల క్రియా యోగమును వినుము-18. నాకు భక్తుడవై నాయందే మనస్సు నిలుపుము. నన్నే పూజింపుము. నాకే నమస్కరింపుము. నిన్ను నీవు నాకు సమర్పించుకొనుటచే నన్నే పొందగలవు-19. నా భావనగలవారై, నన్నే యజించువారై నాకు భక్తులై, నన్నే పూజించు మానవులు నా యందే లయమును పొందుచున్నారు.

 మూ॥ సర్వభూతేషు మాంపశ్యన్సమవస్థిత మిశ్వరమ్ కర్తాసి కేన చైవ త్వమేవం దోషాన్ప్రహాస్యసి

జంగమాజంగమే జ్ఞాతే మయ్యాసక్తే సమంతతః రాగలో భాది నాశేన భవిత్రీ కృత కృత్యతా

భక్త్యాతి ప్రణయస్యాపి చంచలత్వాన్మనోయది మయ్యావేశం దధద్భూయః కురుమద్రూపిణీంతనుమ్

 సువర్ణ రజతాద్యైస్త్వం శైల మృద్దారు లేఖనమ్ పూజోపహారైర్వివిధైః సంపూజయ త్రిలోచనమ్

 తస్యాశ్రితం సమావిశ్వ సర్వభావేన సర్వదా పూజితా సైవ తే భక్త్యా ధ్యాతా చైవోపకారిణీ  

గచ్ఛంస్తిష్ఠన్స్వ పన్భుంజంస్తామేవాగ్రే చ పృష్ఠతః ఉపర్యథస్తథా పార్శ్వే చింతయంస్తన్మయశ్చవై

 స్నానైస్తీర్దోదకైర్హృద్యైః పుష్పైర్గంధానులేపనైః వాసోభిర్భూషణైర్భక్షైర్గీత వాద్యైర్మనోరమైః

యచ్చ యచ్చ తవేష్టం వై కించిద్భోజ్యాదికం తవ భక్తినమ్రో గణశ్రేష్ఠ! ప్రీణయస్వ కృతిం మమ

 రాగేణా కృష్యతే తాత! గంధర్వాభిముఖం యది మయి బుద్ధిం సమావేశ్య గాయేథా యాః కథా మమ

 కథయా రమతే చేతో యది తద్భవతోమమ శ్రోతవ్యాః ప్రీతి యోగేన మత్స్వ రూపోదయాః కథాః

తా॥ ఎవని చేత నీవు 'కర్త వై యుంటివో అట్టి ఈశ్వరుడనైన నన్ను సర్వభూతముల యందు దర్శించుచు పాపముల నుండి ముక్తుడవు కాగలవు-21. చరాచరములయందు అంతట నేనేయున్నానని తెలిసి, రాగద్వేషములు నశించుట చేత కృతకృత్యత సిద్ధించును-22. మనస్సు ఒకచోట నిలువనేరక చంచలమై యుండినచో మిక్కిలి భక్తిప్రేమలతో నాయందు నిలిపి నా మూర్తినీ సిద్దము చేసికొనుము-23. బంగారముతో, వెండితోగాని, శిలతోగాని, మట్టితోగాని, కఱ్ఱతోగాని లేక చిత్తరువు ద్వారా గాని నా స్వరూపమును సిద్ధపఱచి వివిధములైన పూజా నైవేద్య సమర్పణలతో ముక్కంటినైన నన్ను పూజింపుము-24. ఎల్లప్పుడు ఆమూర్తియందే మనస్సునుంచి, దానినే ఆశ్రయించుకొని సర్వాత్మనా భక్తితో పూజించుచు, ధ్యానించుచుండినచోనుపకారకము కాగలదు-25., పోవుచు, నిలుచుచు, పరుండుచు, తినుచు, ముందట, వెనుక, పైన, క్రింద, ప్రక్కన తన్మయుడవై అతనినే (నన్నే) భావించుచు-26. తీర్ధోదక స్నానములచేత, అందమైన పూలచేత, గంధపుంబూతలచేత, వస్త్రములచేత, భూషణములచేత, భక్ష్యభోజ్యాదులచేత, ఆహ్లాదకరములైన గీతములచేత, వాద్యముల చేత-27. భోజ్యాది పదార్థములతో నీకిష్టమైన రెల్ల, ఏ కొంచెమైనను భక్తి వినయములు గలవాడవై నాకు (నా యాకృతికి) సమర్పించుచు నన్ను సంతోషింపజేయుము-28. ఒక వేళ రాగముచే గాన మాకర్షించినచో నా యందే బుద్దిని నిలిపి నా కథను గానము సేయుము-29. నీ మనస్సు కథతోనానందించు నేడ నా స్వరూపములను గుఱించిన ఆయా కథలను ప్రీతితో గూడి వినుము.

 మూII ఏవం సమర్పితమనా శ్చేతసో యేఽథ ఆశ్రయాః హేయాంస్తాన్నిఖిలాన్దిండీ! పరిత్యజ్యసుఖీభవ

అక్షీణ రాగ ద్వేషోఽపి మత్ర్పయః పరమ: పరమ్ పదమాప్నోషి మా భైషీర్మయ్యర్పిత మనాభవ

 మయి సంన్యస్య సర్వం త్వమాత్మానం యత్న వాన్భవ మదర్థం కురు కర్మాణి మాచ ధర్మ వ్యతిక్రమమ్

 ఏవం వ్యపోహ్య హత్యాస్త్వం బ్రహ్మణా మోక్ష్య సే భవాత్ ఏతేనైవోపదేశేన వ్యాఖ్యాత మఖిలంతవ

 క్రియా యోగం సమస్థాయ మదర్పిత మనాభవ

దీండిరువాచ :

 మద్ధితాయ జగన్నాథ! క్రియాయోగామృతంమమ విస్తరేణ సమాఖ్యా ప్రసన్నస్త్వం హి దు:ఖహా

త్వామృతే నహి తద్వక్తుం సమర్థో ఽన్యో జగద్గురో! గుహ్యమేతత్పవిత్రంచ తదాచక్ష్వ ప్రసీదమే

ఆదిత్య ఉవాచ :

ఆఖ్యాస్యతే తదఖిలం నిర్వికల్పం గణాధిప! ఇత్యుక్త్వాంతర్దధే దేవః సర్వలోక ప్రదీపకః

 స చ దిండిర్మహో తేజా జగామాశు నభోగతిమ్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్య సంహితాయాం బ్రాహ్మేపర్వణి

దిండ్యాదిత్య సంవాద వర్ణనం నామ ద్విషష్టితమోఽధ్యాయః

 తాII ఇట్లు మనోబుద్ధులను నాకర్పించి, హేయములైన పాపములను విడిచి సుఖముగా నుండుము-31, రాగద్వేషములు నశింపని వాడవైనను, నా ప్రేమకు పాత్రుడవై పరమపదమునుపొందుదువు. భయపడకుము. మనస్సు నాయందు లగ్నము చేయుము-32. అన్నియును నాయందు వదలి ప్రయత్నశీలుడవు కమ్ము, నా కొఱకే కర్మలను చేయుము. ధర్మవిరుద్ధముగ ప్రవర్తింపకుము-33. ఈ విధముగనే బ్రహ్మహత్యాది పాపములనన్నింటిని నశింపజేసికొని ముక్తినందెదవు. ఇటులనీ కంతయిఁ జెప్పితిని-34. మనస్సు నాయందే నిలిపి క్రియా యోగ పరుడవు కమ్ము"-34. సూర్యభగవానుని ఈ ఉపదేశము విని దిండి యిట్లనెను. “జగన్నాథా! నా హితమును కోరి క్రియా యోగామృతము నింకను విస్తరించి చెప్పుడు. నాయెడ ప్రసన్నులుకండు. హే జగద్గురూ! మీరు తప్ప దీనిని గూర్చి చెప్పగల సమర్థులింకేవరు గలరు? రహస్యము, పవిత్రమునైన ఈ యోగమును ఇంకను వివరించి నన్ననుగ్రహింపుడు"-37, సూర్యభగవానుడిట్లనెను. “ నిర్వికల్పమునైన నదియంతయు నీకు వివరింపబడగలదు. “ఇట్లు చెప్పి సర్వలోక ప్రదీపకుడగు సూర్యుడంతర్షిడయ్యెను-38. మహాతేజుడైన దిండియు వెంటనే ఆకాశమార్గమున పయనించెను-39.

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున దండ్యాదిత్య సంవాద వర్ణనమను అటువది రెండవ అధ్యాయము సమాప్తము.