31. చతుర్థీ కల్పమునందలి సుఖావహాంగారక చతుర్థీ వ్రత నిరూపణము

 మూ. సుమంతురువాచ :

శివాశాంతా సుఖారాజంశ్చతుర్ధ త్రివిధాస్మృతా మాసి భాద్రపదే శుక్లా శివా లోకేషు పూజితా

 తస్యాం స్నానం తథాదానముపవాసో జపస్తధా క్రియమాణం శతగుణం ప్రసాదాద్దంతినో నృప!

 గుడ లవణ ఘృతానాంతు దానం శుభకరం స్మృతమ్ గుడాపూ పైస్తథా వీర! పుణ్యం బ్రాహ్మణ భోజనమ్

 యస్తస్యాం నర శార్దూల! పూజయంతి సదాశ్రియః గుడలవణ పూ పైశ్చ శ్వశ్రూం శ్వశురమేవచ

తాః సర్వాః సుభగాఃస్యుర్వై విఘ్నేశస్యానుమోదనాత్ కన్యకాతు విశేషేణ విధానానేన పూజయేత్

 (ఇతి శివాకల్పః)

సుమంతురువాచ :

మాఘేమాసి తథాశుక్లా యాచతుర్థీ మహీపతే! పాశాంతా శాంతీదా నిత్యం శాంతింకుర్యాత్సదైవహి

 స్నాన దానాదికం కర్మ సర్వమస్యాం కృతం విభో భవేత్సహస్ర గుణితం ప్రసాదాత్తస్యదంతినః

కృతోపవాసోయస్తస్యాం పూజయేద్విఘ్ననాయకమ్ తస్యహోమాదికం కర్మ భవేత్సాహస్రికం నృప!

 లవణంచగుడం శాకం గుడపూపాంశ్చ భారత! దత్వా భక్త్యాతు విప్రేభ్యః ఫలం సాహస్రకం భజేత్

 విశేషత స్త్రియో రాజన్పూజయన్త్యో గురుంనృప! గుడలవణ ఘృతైర్వీర! సదాస్యుర్భాగ్య సంయుతాః (ఇతి శాంతాకల్పః)

తా॥ సుమంతుముని యిట్లనెను. రాజా! శివా, శాంతా, సుఖా అని చతుర్ధి తిథి మూడు విధములుగ నున్నది. భాద్రపద శుక్ల చతుర్థి “శివ యను పేరుతో లోక పూజితమైనది-1. ఆ దినమున స్నానము, దానము, ఉపవాసము, జపము చేయువానిని విఘ్నేశ్వరుని అనుగ్రహము నూఱురెట్లు తోడై సహకరించును-2. బెల్లము, ఉప్పు, నేయి దానము చేయుట శుభకరము. బెల్లపు భక్ష్యములతో బ్రాహ్మణులకు అన్నదానము చేయుట పుణ్యప్రదము-3. ఆ దినమున బెల్లము, ఉప్పు, "భక్ష్యములతో గణపతిని పూజించుస్త్రీలు అత్తమామల ప్రేమను చూరగొందురు-4. ఆతని దయవలన వారందఱు సౌభాగ్యవతులగుదురు. ముఖ్యముగా కన్యలు ఆ దేవుని ఈ విధముగ పూజింపవలెను-5. ఇట్లు శివా కల్పమున గలదు) సుమంతుముని మఱల నీట్లనెను. మాఘమూసమునందలి శుక్ల చతుర్థి 'శాంత' యనబడును. ఎల్లప్పుడు శాంతి నిచ్చునదైయుండును-6. ఆ దినమున స్నానాదానాది కర్మలాచరించువారికి వినాయకుని ప్రసాదము చేత వేయి రెట్లు ఫలము లభించును-7. ఉపవసించి విఘ్ననాయకుని యథావిధిగ పూజించి హోమాదికము నిర్వర్తించుచో వేయింతలు ఫలము లభించును-8. ఉప్పు, బెల్లము, శాకము, బెల్లపు భక్ష్యములు బ్రాహ్మణులకు దానము చేసినచో వేయింతలు ఫలము కలుగును-9. ముఖ్యముగా స్త్రీలు గుడలవణ ఘృతములతో గురువును పూజించినచో వారు సౌభాగ్య వతులగుదురు-10. ఇట్లు శాంతా కల్పమునగలదు.

 మూ. సుమంతురువాచ :

సుఖావహాచ సుసుఖా సౌభాగ్యకరణీపరమ్ చతుర్ధి కురుశార్దూల! రూప సౌభాగ్యదా శుభా

సుఖావ్రతం మహాపుణ్యం రూపదం భాగ్యదం తధా సు సూక్ష్మం సుకరం ధన్యమిహ పుణ్యసుఖావహమ్

 పరత్ర ఫలదం వీర! దివ్యరూప ప్రదాయకమ్ హసితం లలితం చోక్తం చేష్టితంచ సుఖావహమ్

 సవిలాస భజ క్షేప శ్చంక్రమశ్చేష్టితం శుభమ్ సుఖావ్రతేన సర్వేషాం సుఖం కురుకులో ద్వహ!

కృత్యేన పూజితే చేశే విఘ్నేశే శివయోః సుతే యదా శుక్ల చతుర్ధ్యాంతు వారో భౌమస్య వై భవేత్

 తదా సా సుఖదా జ్ఞేయా చతుర్ధివై సుఖేతి చ పురామైధున మాశ్రిత్య స్థితాభ్యాంతు హిమాచలే

 భీమోమాభ్యాం మహాబాహో! రక్త బిందు శ్చ్యుతః క్షితౌ మేదిన్యాం స ప్రయత్నేన సుఖేన విధృతోఽ నయా

 జాతోఽస్యాః సకుజో వీర! రక్తో రక్త సముద్భవః మమాంగతో యధోత్పన్నస్తస్మాదంగారకో హ్యయమ్

 అంగదోంగోప కారశ్చ అంగానాంతు ప్రదో నృణామ్ సౌభాగ్యాదికరో యస్మాత్త స్మాదంగారకో మతః

భక్త్యా చతుర్ధ్యాం నక్తేన యో సమన్వితః ఉపవత్స్యతి నా రాజన్నారీ వానాన్యమనసా పూజయేచ్చ కుజం భక్త్యా రక్తపుష్ప విలే పనైః

తా॥ మూడవ విధమైన చతుర్థి సుఖావహమైనది. మంచి సుఖములనిచ్చునది. సౌభాగ్యములు సమకూర్చునది-11. ఈ సుఖదాయకమైన చతుర్థి, రూప సౌభాగ్యముల నిచ్చునది. శుభములు గూర్చునది. సుఖాచతుర్థి వ్రతము మహాపుణ్యఫలము నిచ్చునది. అందమైన స్వరూపమును సంపదలను కలుగ జేయునదియునై యున్నది కురుశార్దూలా! చతుర్జీతిథి రూపసౌభాగ్యములనిచ్చునది. శుభంకరము-12. పుణ్యమును సుఖమును, ధన్యతను కలిగించు నీవ్రతము సుకరముగా చేయుటకు వీలైనది. సూక్ష్మమైనది. పరలోక ఫలమునిచ్చునది, ప్రకాశవంతమైన ఆకృతినిచ్చునది-13. మనోజ్ఞమైన నవ్వు, సుఖావహమైన ప్రవృత్తి, విలాసవంతమైన బాహువుల త్రుళ్లింత, నడక, హావభావములు సమకూర్చునది-14. సుఖా వ్రతము ననుష్ఠించు వారందఱికిని సుఖము కలుగును. శివ పార్వతుల కుమారుడైన విఘ్నేశ్వర దేవుని పూజా కార్యమువలన నీ ఫలము కలుగును-15. ఏమాసము నందైనను శుక్ల పక్షచతుర్ధి మంగళవారముతో కలిసి వచ్చినప్పుడు అట్టిదినము “సుఖదా' లేక 'సుఖా' అని తెలియవలెను-16. పూర్వకాలమున హిమాచలమున రతి కేళిలోనున్న ఉమామహేశ్వరుల నుండి రక్తబిందువొకటి నేల పై జారిపడెను-17. ఆబిందువును సుఖప్రయత్నముతో భూమి ధరించెను. ఆమెకు ఆరక్తము నుండి ఎఱ్ఱని వర్ణము గల కుజుడు జన్మించెను-18. నా అంగము నుండి యితడు జన్మించినందున అంగారకుడగును. అంగములనిచ్చువాడు, అంగములకు ఉపకారము చేయువాడు. మానవులకు అంగవైకల్యము కలుగకుండ కాపాడువాడు-19. సౌభాగ్యాదికములు కలిగించువాడు కావున అంగారకుడని చెప్పబడును. చతుర్దినాడు శ్రద్ధాభక్తులతో రాత్రి ఉపవసించి-20. అనన్య మనస్కుడైన పురుషుడైనను స్త్రీయైనను (ఉపవసింపక) ఎఱ్ఱని పుష్పములతో ఎఱ్ఱని విలేపనములతో కుజుని పూజింప వలెను.

మూ. గణేశం ప్రథమం భక్త్యా యోర్చయేచ్చ్రద్ధయాన్వితః యస్యతుష్టః ప్రయచ్ఛేత్స సౌభాగ్యం రూపసంపదమ్

 పూర్వంచ కృత సంకల్పః స్నానం కృత్వాయథావిధి గృహీత్వా మృత్తికాం వందేన్మంత్రేణానేన భారత!

ఇహత్వం వందితా పూర్వం కృష్ణేనోద్ధరతా కిల తస్మాన్మే దహ పాప్మానం యన్మయా పూర్వసంచితమ్

 ఇమం మంత్రం పఠన్వీర! ఆదిత్యాయ ప్రదర్శయేత్ ఆదిత్య రశ్మి సంపూతాం గంగాజల కణోక్షితామ్

 దత్వా మృదం శిరసి తాం సర్వాంగేషు చయోజయేత్ తతః స్నానం ప్రకుర్వీత మంత్రయేత జలం పునః

త్వమాపోయోనిః సర్వేషాం దైత్య దానవ ద్యౌకసామ్ స్వేదాండజోద్భిజాం చైవ రసానాంపతయే నమః

 స్నాతోహం సర్వతీర్ధేషు సర్వప్రసవణేషుచ తడాకేషుచ సర్వేషు మానసాది సరఃసుచ

నదీషు దేవ ఖాతేషు సుతీర్ధేషు హ్రదేషువై” ధ్యాయనరన్నిమం మంత్రం తతః స్నానం సమాచరేత్

 తతః స్నాత్వాశుచిర్భూత్వా గృహ మాగ త్యవైస్పృశేత్ దూర్వాశ్వత్థౌశమీం స్పృష్ట్యా గాంతు మంత్రేణ మంత్రవిత్

తా॥ శ్రద్దాన్వితుడై మొదట గణేశ్వరుని భక్తితో పూజించినచో అతడుసంతుష్టుడై సౌభాగ్యమును, రూపసంపదను ఇచ్చును-22. యధావిధిగ స్నానముచేసి, మొదట సంకల్పము చేసి కొంత మట్టిని తీసికొని ఈ మంత్రముతో దానికి నమస్కారము చేయవలెను-23. పూర్వము నీవు విష్ణుదేవునిచేత ఉద్దరింపబడి గౌరవము పొందితివట. నా పూర్వ సంచితమైన పాపము దహించి వేయుము”-24. ఈ మంత్రమును చదివి ఆమృత్తికను సూర్యునకు చూపవలెను. సూర్యరశ్మిచేత పవిత్రమైన ఆ మృత్తికపై గంగా జలమును చల్లి-25. దానిని తల పైనను అవయవములన్నింటి పైనను రాచుకొనవలెను. ఆపిదప మంత్ర పూతమైన జలముతో స్నానము చేయవలెను-26. ఓ ఉదకములారా! మీరు దేవదైత్య దానవాదులకు, స్వేదజ, అండజ, ఉద్భిజుముల కును, సర్వజీవకోటికిని జన్మకారణములు. రసాధిపతులైన మీకు నమస్కారము"-27. నేను అన్ని పుణ్యతీర్ధములలోను, సెలయేళ్ళలోను, చెఱువులలోను, మానసాది సరోవరములలోను-28. నదులలోను, దేవతల పుష్కరుణులలోను, స్వచ్ఛమైన జలముగల మడుగులలోను స్నానము చేసిన వాడనగుచున్నాను.” ఇట్లుధ్యానించుచు పై మంత్రమును పఠించుచు స్నానముచేయవలెను-29. స్నానమాడి శుచియై, గృహమునకేతెంచి దూర్వాదులను స్పృశింపవలెను. గజిక, రావిచెట్టు, జమ్మిచెట్టు, ఆవు వీనిని సమంత్రకముగా ముట్టుకొన వలెను.

మూ. దూర్వాం నమస్య మంత్రేణ శుచౌభూమౌ సముతామ్ త్వం దూర్వేఽమృత నామాసి సర్వదేవైస్తు వందితా

 వందితా దహ సర్వస్వం దురితం యన్మయాకృతమ్

 శమీమంత్రం ప్రవక్ష్యామి తన్నిబోధ మహీ పతే

 పవిత్రాణాం పవిత్రాత్వం కాశ్యపీ ప్రధితా శ్రుతౌ శమీ శమయమే పాపం నూనం వేత్సిధరాధరాన్

 అశ్వత్థాలంబనే వీర! మంత్ర మేతం నిబోధమే నేత్ర స్పందాదిజం దుఃఖం దుః స్వప్నం దుర్విచింతనమ్ శక్తానాంచ సముద్యోగ మశ్వత్థ! త్వం క్షమస్వమే

 ఇమం మంత్రం పఠన్ వీర! కుర్యాద్వై స్పర్శనం బుధః తతో దేవ్యైతు గాందద్యాద్వీర! కృత్వా ప్రదక్షిణమ్ సమాలభ్యతు హస్తేన తతో మంత్ర ముదీరయేత్

 సర్వదేవ మయీదేవి! మునిభిస్తు సుపూజితా తస్మాత్స్వృశామి వందే త్వాం వందితా పాపహాభవ.

 ఇమం మంత్రం పఠన్వీర! భక్త్యా శ్రద్ధా సమన్వితః ప్రదక్షిణంతు యః కుర్యాదర్జునం కురునందన! ప్రదక్షిణీ కృతా తేన పృధివీ స్యాన్నసంశయః

 ఏవం మౌనేన చాగత్య తతో వహ్నిగృహం వ్రజేత్ ప్రక్షాల్యచ మృదా పాదావాచాంతోఽ గ్నిగృహం విశేత్ హోమం తత్ర ప్రకుర్వీత ఏభిర్మంత్ర పదైర్వరైః

 శర్వాయ శర్వపుత్రాయ క్షోణ్యుత్సంగ భవాయచ కుజాయ లలితాంగాయ లోహితాంగాయవైతధా

ఓంకార పూర్వకైర్మoత్రైః స్వాహాకార సమన్వితైః అష్టోత్తరం శతం వీర! అర్ధార్ధ మర్ధమేవచ 

తా॥  పరిశుద్ధమైన ప్రదేశమున మొలచిన గజికకు నమస్కరింపవలెను “ఓ దూర్వా! నీవు అమృతస్వరూపిణివి. అందజిదేవతల నమస్కారము లందుకొనుదానవు-31. నేను నీకు నమస్కరించున్నాను. నాచేత చేయబడిన పాపమును దహించివేయుము”-32. రాజా! ఇక శమీ మంత్రమును చెప్పుచున్నాను వినుము. ఓ శమీ వృక్షమా!) నీవు పవిత్రులలో పవిత్రమైన దానవు. శ్రుతి యందు కాశ్యపియని ప్రఖ్యాతి నందిన దానవు. నా పాపమును శమింప జేయుము. కొండలన్నియు నీకుతెలియును."-33. ఇక రావి చెట్టును స్పృశించు మంత్రమును చెప్పుచున్నాను తెలిసికొనుము. నా కన్నులదరుటచే కలుగ బోవు దుఃఖమును చెడుకలను, చెడు ఆలోచనను, నాయెడ శక్తుల దుష్ర్పయోగములను నీవు సహించుకొనుము"-34. ఈ మంత్రమును పఠింపుచు రావి చెట్టును స్పృశింపవలెను. అప్పుడు గోమాతకు ప్రదక్షిణముచేసి స్పర్శచేయవలెను. చేతితో స్పృశించి ఈ మంత్రమును ఉచ్చరింపవలెను-35. “ఓదేవీ! నీవు సర్వదేవతా స్వరూపిణివి. మునులచే కూడ పూజింపబడినదానవు. అందువలన నేను కూడ నిన్ను సృశించుచున్నాను. నీకు నమస్కరించుచున్న నా పాపములను నాశమొనరించుదానవు కమ్ము"-36. ఈ మంత్రమును పఠించుచు శ్రద్దాభక్తులతో ఆవుకు ప్రదక్షిణము చేసిన వానికి భూప్రదక్షిణ చేసిన ఫలము కలుగును. సందేహము లేదు-37. ఈ విధముగ గోప్రదక్షిణాంతరము అగ్న్యాగారమునకు పోవలెను. పాదప్రక్షాళనము చేసికొని ఆచమనము చేసియే అగ్నిగృహమున ప్రవేశింపవలెను. అచట ఈ మంత్రపదములతో హోమము చేయవలెను-38. శర్వాయ, శర్వపుత్రాయ, క్షోణ్యుత్సంగభవాయ, కుజాయ, లలితాంగాయ, లోహితాంగాయ”-39. ఈ మంత్రములను ఓంకారపూర్వకముగ, స్వాహాకారయుక్తముగ నూటయెనిమిది పర్యాయములుగాని, అందుసగము గానీ, ఆసగములో సగముకానీ, పఠింపుచు ఆహుతులీయవలేను.

 మూ. ఏతైర్మంత్ర పదైర్భక్త్యా శక్త్యావా కామతో నృప! ఖాదిరైః సుసమిద్భిస్తు చాజ్యదుగ్ధైర్యవైస్తిలైః

భక్షైర్నానా విధైశ్చాన్యైః శక్త్యా భక్త్యా సమన్వితః హుత్వాహుతీస్తతో వీర! దేవం సంస్థాపయేత్క్షితౌ

 సౌవర్ణం రాజతంవాపి శక్త్యాదారుమయంనృప! దేవదారు మయం వాపి శ్రీఖండ చందనైరపి

 తామ్రేపాత్రే రౌప్యమయే చాజ్య కుంకుమ కేసరైః అన్యైర్వా లోహితైర్వాపి పుష్పైః పత్రైః ఫలైరపి రక్తైశ్చ వివిధైర్వీర! అథవా శక్తితో ఖర్చయేత్

 యావద్విసృజతే విత్తం విత్తవాన్వీర భక్తితః తావద్వివర్ధతే పుణ్యం దాతుః శతసహస్రకమ్

అన్యేతామ్రమయే పాత్రే వంశజే మృణ్మయేపివా పూజయంతి నరాః శక్త్యా కృత్వాకుంకుమ కేశరైః పురుషాకృతి కృతం పాత్ర ఇమం మంత్రైః సమర్చయేత్

అగ్నిర్మూర్ధేతి మంత్రేణ గంధపుష్పాదిభిస్తథా ధూ పైరభ్యర్చ విధివద్భ్రాహ్మణాయ ప్రదీయతే

గుడౌదనం ఘృతండ్రీరం గోధూమాన్శాలి తండులాన్ అవేక్ష్యశక్తిం దద్యాద్వై దరిద్రోవిత్తవాంస్తథా

 విత్తశాఠ్యం నకర్తవ్యం విద్యమానేధనే నృప విత్తశాఠ్యం హి కుర్వాణ నాముత్ర ఫలభాగ్భవేత్

శతానీక ఉవాచ :

అంగారకేణ సంయుక్తా చతుర్థిం నక్తభోజనైః ఉపోష్యా కతి మాత్రాతు ఉతాహో సకృదేవతు

 సుమంతురువాచ :

చతుర్థీ సా చతుర్థీతు యదాంగారక సంయుతా ఉపోష్యాతత్ర తత్రైవ ప్రదేయో విధివద్ధుడః

తా॥  ఈ మంత్రములతో, శక్తిననుసరించి, కోరికననుసరించి, చంద్రసమిధలు నేయి, పాలు, యవలు, తిలలతో-41. వివిధములైన భక్ష్యములు, ఇంకను ఇతరములైన ఖాద్యములతో ఆహుతులనిచ్చి దేవునిని భూమిపై స్థాపింపవలెను-42. బంగారముతోగాని వెండితోగాని లేక శక్తి కొలది దేవదారు కం తో గాని లేక ఇతరమైన కణతోగాని చందనపు కమల తోని కుజుని విగ్రహము చేయింపవలేను-43. దానిని రాగి పాత్రలోగాని వెండి పాత్రలోగాని ఉంచి, నేయి, కుంకుమపువ్వు అకరువులు ఇతరమైన ఎఱ్ఱని వస్తువవులు, పుష్పములు, పత్రములు, ఎఱ్ఱని పండ్లు, మొదలైన వస్తువులతో శక్త్యనుసారము పూజింపవలెను-44. ధనవంతుడు ఎంత ధనమును వ్యవము చేయునో అంతపుణ్యము వృద్ధియగును. దాతయొక్క దాతృత్వమునకు వందవేల రెట్లు పుణ్యము లభించును-45. కొందఱు రాగిపాత్రయందు, వెదురు పాత్రయందు మట్టిపాత్రయందు శక్తికొలదిగ కుంకుమకేసరములతో పురుషాకృతిని చేసి పూజించుచున్నారు. కుజుని ఈ మంత్రములతో పూజింపవలెను. “అగ్నిర్మూర్థా..” అను మంత్రముచేత గంధపుష్పాదులు ధూపదీపాదులు సమర్పించి, పూజించి, విధిపూర్వకముగా విగ్రహమును బ్రాహ్మణునకు నీయవలెను-46. దరిద్రుడైనను ధనవంతుడైనను తమ శక్తిని చూచి గుడాన్నము నేయి, పాలు, గోధుమలు, శాలిబియ్యము, దానమీయవలెను-47. ధనము వలసినంత కలిగియున్నప్పుడు లుబ్దత్వము కూడదు. విత్తశాఠ్యముచేయువానికి పరలోక ఫలములుండజాలవు”-48. శతానీకుడిట్లనెను. మంగళవారముతో కూడిన చతుర్థి దినమున రాత్రిభోజనములతో ఉపవసింపవలెను కదా! ఇడ్లాన్ని పర్యాయములు ఏక భుక్తముతో నుండలేను”-49. సుమంతుముని ఇట్లనెను. ఇచట చతుర్దాయనగా మంగళవారముతో కూడినదేయని గ్రహింపవలెను. ఆయా చతుర్దులయందు ఉపవాసము చేసి విధిననుసరించి బెల్లము దానమీయవలెను.

 మూ. ఉపోష్యనక్తేన విభో! చతస్రః కుజ సంయుతాః చతుర్థ్యాంచ చతుర్ధ్యాంచ విధానమ్ శృణుయాదృశమ్

సౌవర్ణంతు కుజం కృత్వా సవినాయకమాదరాత్ దశసౌవర్ణికం ముఖ్యం దశార్థమర్థమేవచ

సౌవర్ణ పాత్రే రౌ ప్యేవా భక్త్యా తామ్రమయేఽపివా వింశత్పలాని పాత్రాణి వింశత్యర్థపలానివా

వింశత్కర్షాణీవావీర! వింశదర్ధార్ధమేవవా రౌప్యసంఖ్యం పలం కార్యం పలార్థమర్థమేవ చ

శక్త్యా విత్తైశ్చ భక్త్యాచ పాత్రే తామ్ర మయేఽపితు ప్రతిష్టాప్య గ్రహేశంవై వస్త్రైః సంపరి వేష్టయేత్ వివిధైః సాధకై రక్తైః పుష్పై రకైః సమన్వితమ్

బ్రాహ్మణాయ సదా దద్యాద్దక్షిణా సహితంనృప వాచకాయ మహాబాహో! గుణినే శ్రేయసే నృప!

 ఇతి తే కథితా పుణ్యా తిథీనా ముత్తమా తిథి: యాముపోష్య నరోరూపం దీవ్యమాప్నోతి భారత

 కాంత్యాత్రేయ సమం వీరం తేజసారవి సంనిభమ్ ప్రభయా రవి కల్పంచ సమీర బల సంశ్రితమ్

 ఈదృగ్రూపం సమాప్యేహ యాతి భౌమ సదోనృప! ప్రసాదాద్విఘ్ననాశస్య తథాగుణ పతేర్నృప!

 పఠతాం శృణ్వతాం రాజన్కుర్వతాంశ విశేషతః బ్రహ్మహత్యాది పాపాని క్షీయంతే నాత్ర సంశయః బుద్ధిం వృద్ధిం తథా లక్ష్మీం లభతే నాత్ర సంశయః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయం బ్రాహ్మేపర్వణి చతుర్థి కల్పే సుఖావహాంగారక చతుర్థి వ్రత నిరూపణం మైక త్రింశోఽధ్యాయః

 (సమాప్తశ్చాయం చతుర్ధి కల్పః)

తా॥ మంగళవారముతో కూడిన నాలుగు చతుర్థి తిథులయందు రాత్రి వినా ఉపవసించి, అట్టి ప్రతి చతుర్థియందును ఆచరింపవలసిన విధానమును వినుము-51. బంగారముతో అంగారక, వినాయక మూర్తులను చేయవలెను, ముఖ్యముగా పది, లేక అందులో సగము, లేక ఆ సగములో సగము కొలదుల బంగారముతో అట్టి విగ్రహములను చేయవలెను-52. బంగారు పాత్రలోగాని, వెండిపాత్రలో గాని, రాగి పాత్రలోగాని ఆ విగ్రహములను ప్రతిష్టింపవలెను. ఆ పాత్ర ఇరువది పలముల, లేక పది పలముల తూకము కలిగియుండవలెను-53. లేక ఇరువది కరములు, లేక అందు సగము, కాకున్న ఆసగమున సగము తూకము కలిగియుండలేను. (పలము అనగా నాలుగు కరముల యెత్తు, కరమనగా పదునాఱు మాషముల యెత్తు, పలమునందు మూడవ భాగము తులము) వెండియైనచో పలములలో చేయింపవలెను. కాన పలముగానీ, అందుసగము గాని, అందుసగముగానీ తూకము కలిగియుండవలెను-54. శక్త్యనుసారముగ, భక్తిననుసరించి రాగిపాత్రయందైనను కుజుని ప్రతిష్ఠించి నూతన వస్త్రములతో ఆగ్రహేశుని అలంకరింపవలెను. వివిధములైన ఎఱ్ఱని వస్తువులుతోను, పుష్పములతోను పూజింపవలెను-55. ఆ పిదప గుణవంతుడు, పండితుడునైన బ్రాహ్మణునకు దక్షిణతో సహా ఆ విగ్రహములను, పాత్రను (గుడమును) దానమీయవలెను. ఇది యజమాని శ్రేయస్సుకొఱకు చేయవలెను-56. ఇట్లు తిథులలో నుత్తమ తిథియగు చతుర్థి గుఱించి నీకు చెప్పితిని. ఈ తిథియందుపవాసాదులు చేసిన వారికి దివ్యమైన రూపము కలుగును-57. కాంతి విషయమున చంద్రునితోను, తేజస్సు విషయమున సూర్యునితోడను సమానమైన వాడగును. ఇట్లు రవి ప్రభుడు, వాయుబలుడును అగును-58. రాజా! ఇట్టి రూపమునంది, పిదప కుజలోకమునకుఁ బోవును. గణనాయకుని ప్రసాదము వలన రూపసౌభాగ్యము, కుజలోక ప్రాప్తియును ఘటించును-59. ఇది చదివిన వారికి, వినిన వారికి, ముఖ్యముగా చేసిన వారికి బ్రహ్మహత్యాది పాపములు నశించుననుటలో సందేహములేదు. అంతీయకాక సర్వసంపత్సమృద్ధియు, ఐశ్వర్యమును కలుగును.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్ధికల్పమునందలి సుఖావహాంగారక చతుర్థి వ్రత నిరూపణమను ముప్పదియెకటవ అధ్యాయము సమాప్తము. (చతుర్ధికల్పము కూడనిట సమాప్తమైనది)