30. చతుర్థీ కల్పమున వినాయక పూజా విధి

 మూ. సుమంతురువాచ :

 నింబమయమంగుష్ఠ పర్వమాత్రం గణపతిం కృత్వానిత్యధూప గంధాదిభిరర్చయిత్వా ప్రచ్ఛన్నం శిరసి బద్ద్వా గచ్ఛేత్॥

 సర్వజన ప్రియోభవతి॥

 శ్వేతార్కమూలాంగుష్ఠ మాత్రం గణపతిం కృత్వా ధూపాదిభిరర్చయిత్వా సర్వాన్వర్ణాన్వశమానయతి॥

 శ్వేత చందన మంగుష్ఠమాత్రం గణపతిం కృత్వా పుష్పగంధాదిభిరర్చ యిత్వా శుక్ల చతుర్యామష్టమ్యాంవా బలింకుర్యాదష్టసహస్రం జుహుయాద్దధ్నా పాయ సేన రాజానం వశమానయతి॥

 రక్తచందనమయం గణపతి మంగుష్ఠమాత్రం కృత్వా భౌతికం బలిందద్యాద్దధిమధు ఘృతా హుతీనాం గణపతిమష్ట సహస్రం జుహుయాదాత్మ ప్రాపీకాం ప్రజాం వశమానయతి॥

 రక్త కరవీర మూలాంగుష్ఠ పర్వమాత్రం గణపతిం కారయేత్॥

 రక్తపుష్ప గంధోప హారైర్బలిందద్యాత్ ॥

 తిల లవణ ఘృతే నాష్ట్ర సహస్రం జుహుయాత్।

 దశగ్రామానకోశ మానయతి!! శ్వేత కరవీరాంగుష్ఠ పర్వమాత్రం గణపతిం కృత్వా తిలపిష్ట దధిఘృత క్షీరహరిద్రామి శ్రేణాష్ట్ర సహస్రం జుహుయాద్వేశ్యాం వశమానయతి॥ అశ్వత్థామూలాంగుష్ఠ పర్వమాత్రం గణపతిం కృత్వా గంధపుష్ప ధూప బలిందత్వా శతం జుహుయాచ్ఛత్రుం వశమానయతి॥

 అర్కమూలాంగుష్ఠపర్వమాత్రం గణపతిం కృత్వాగంధ పుష్పధూప బలీన్ దద్యాత్ ॥ తిందుకాష్టశతం జుహుయాచ్ఛత్రుం వశమానయతి॥

బిల్వమూలమయమంగుష్ఠ పర్వమాత్రం గణపతిం కృత్వా గంధపుష్ప ధూపార్చితం కృత్వా త్రిమధ్వర్తానా మష్టసహస్రం జుహుయాద్రాజా మాత్యాన్వశమానయతి॥

 శిరసి ధూపామ్రృత్వా గచ్ఛేద్రాజద్వారం విగ్ర హే జయోభవతి॥

 హస్తీదంత మృత్తికామయమంగుష్ఠ పర్వమాత్రం గణపతిం కారయేత్॥

 గంధ పుష్ప ధూపార్చితం కృత్వా కృష్ణచతుర్ధ్యాం న్నోభూత్వాభ్యర్చయేత్॥

సప్తవారాష్ట్ర పేన్నిత్యం నారీణాం సుభగో భవతి॥

వృషభశృంగ మృత్తి కాంగుష్ఠ మాత్రం గణపతింకారయేత్॥

గంధ పుష్పార్చితం కృత్వా గుగ్గులు ధూపం దద్యాదోషపతిం వశమానయతి॥

 అధవా వల్మీక మృత్తికాంగుష్ఠ పర్వమాత్రం గణపతిం కారయేత్॥

 కటుక తైలీన ప్రతిమాం లేపయేత్ ॥

 ఉన్మత్తక కా నాగ్నిం ప్రజ్వాల్యాహుతీనా మష్ట సహస్రం జుహుయాత్తిల సర్షపమిశ్రేణ సర్వధూపం దద్యాత్తి కటుకేన లేపయేత్॥

అగరుధూపం దద్యాద్రజానం వశమానయతి పరేషాంచ వల్లభో భవతి: రక్త చందనేనాత్మానం ధూపయేత్సుభగో భవతి॥

 ఓం గణపతయే వక్రతుండాయ గజదంతాయ గులగులేతి నినాదాయ చతుర్భుజాయ త్రినేత్రాయ ముసల పాశ వజ్రహస్తాయ సర్వభూతదమనాయ సర్వలోక వశంకరాయ సర్వదుషోపఘాత జననాయ సర్వశత్రువీమర్దనాయ సర్వరాజ్య సమిహనాయ రాజానమిహ వశమానయ హనహన పచపచ వజ్రాంకుశేన గణేశఫట్ స్వాహా॥

 ఓం గం గీం గూంగెం గః స్వాహానమః హృదయం మూలమంత్రస్య! ఓం కః శిరః, ఓంఖః శిఖా, ఓంగః హృదయమ్, ఓం గుః వక్రమ్, ఓంగైంనేత్రమ్, ఓంఘః కవచమ్, ఓం జం ఆవాహనం హృదయస్య ఆవాహనాంగాని భవంతి. ఓంనమః హృదయం మూలమంత్రస్య, ఓంగాః శిరః, ఓం గైం: నమః శిఖా ఓంగౌః నమః కవచమ్, ఓం గంనమః నేత్రే, ఓం గః ఫట్ అస్త్రమ్॥

 ఓం అంగుషోల్కాయ స్వాహా ఆవాహనం హృదయస్య స్వాహా విసర్జనం హృదయస్య ఓం గంధోల్కాయ స్వాహా గంధమంత్ర:॥

 ఓం ధర్మభూతోల్కాయ స్వాహా॥

పుష్పమంత్రః॥

దుర్జయాయపూర్వేణ!! ఓం ధూర్జటయే దక్షిణేన॥

ఓం లంబోదరాయ పశ్చిమతః॥

 ఓం గణపతయే ఉత్తరతా॥

 ఓం గణాధిపతయే ఐశాన్యాం॥

ఓం మహా గణపతయే ఆగ్నేయ్యాం॥

 ఓం. కూశ్మాండాయ నైరృత్యామ్॥

 ఓం ఏక దంత త్రిపుర ఘాతినే త్రినేత్రాయ వాయువ్యాం॥

ఓం మహగణపతయే విద్మహే వక్రతుండాయధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్॥ గాయత్రీ॥

 పద్మదంష్ట్ర మాలాప్రకర్షణీ పరశ్వంకుంశపాశ పటహముద్రా అష్టాముద్రా దర్శయిత్వా తతః కర్మాణి కారయేత్॥

కృష్ణతిలాహుతీనా మష్టసహస్రం జుహుయాత్॥

రాజానం వశమానయేత్ ఆవాహనా ద్యేకాదశముద్రా నైవేద్యాంతం క్రమాద్దర్శయేత్॥ ఆరాధయేద్యేన విధినా త్రినేత్రం శూలినం హరమ్॥

 తేనైవారాధయేద్దేవం విఘ్నేశం గణపం నృప!

 తా॥ సుమంతుముని ఇట్లనెను. " బొట్టన వ్రేలి కణుపు పరిమాణముగా వేప కఱ్ఱతో గణపతిని చేసి నిత్యమును ధూపగంధాదులతో పూజించి కనబడకుండ దానిని తలమీద కట్టుకొనిపోవలేను. సర్వజనులకు ప్రియమైనవాడగును. తెల్లజిల్లేడు వేరుతో బొట్టన వేలంత గణపతిని చేసి ధూపాదులతో పూజించినచో అన్ని వర్ణములవారు వశమగుదురు. తెల్లచందనముతో బొట్టనవేలంత గణపతిని చేసి పుష్పగంధాదులతో పూజించి శుక్ల చతుర్థినాడు లేక అష్టమినాడు బలిచేయవలెను. ఎనిమిదివేలు పర్యాయములు పెరుగు పాయసముతో హవనము చేయవలెను. రాజును వశీకరించును. ఎఱ్ఱచందనముతో బొట్టన వేలంత గణపతిని చేసి భూత బలియిచ్చి పెరుగు తేనే నేయి ఆహుతులతో ఎనిమిది వేలు గణపతికి హవనము చేయవలెను. కోరినవారిని వశముచేయును. ఎట్టి గన్నేరు వేరుతో బొట్టనవ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేయింపవలెను. ఎఱ్ఱని పువ్వులు గంధము నైవేద్యములతో పూజింపవలెను. నువ్వులు, ఉప్పు, నేయితో ఎనిమిదివేల ఆహుతులీయవలెను. పది యూళ్లను వశము చేయును. తెల్లగన్నేరుతో బొట్టన వ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేసి, నువ్వుల పిండి, పెరుగు, నేయి, పాలు, పసుపు ఒక్కచోటకలిపి దానిని ఎనిమిదివేల ఆహుతులీయవలెను. వేశ్యను వశీకరింపగలుగును. రావి వేరుతో బొట్టనవ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేసి గంధపుష్ప ధూపబలిని సమర్పించి నూలుమార్లాహుతి చేయగా శత్రువు వశుడగును. జిల్లేడు వేరుతో నంతే పరిమాణమున గణపతిని చేసి గంధపుష్ప ధూప బలి ఇచ్చి నూలు తుమ్మిసమిధలతో ఆహుతి చేయవలెను. శత్రువు వశీభూతుడగును. మారేడు వేరుతో అంగుష్ఠపర్వమాత్రముగా గణపతిని చేసి గంధపుష్పధూపములతో నర్చించి త్రిమధువులతో కూడిన ఆహుతులు ఎనిమిదివేలిచ్చినచో రాజులను మంత్రులను వశముచేయును. తల పై ధూపములను ధరించి రాజద్వారము కడకుపోవలెను. యుద్దమున జయము కలుగును. ఏనుగు దంతముతో బొట్టన వ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేయింపవలెను. గంధపుష్ప ధూపార్చన చేసి బహుళచతుర్ధినాడు నగ్నముగా పూజింపవలెను. నిత్యము ఏడుమారులు జపము చేయవలెను. స్త్రీలకు సుందరుడగును. ఎద్దుకొమ్ముతో బొట్టన వేలంత గణపతిని చేయింపవలెను. గంధపుష్పార్చన చేసి గుగ్గులు ధూపము వేయవలెను. గొల్ల (పల్లె) పెద్దను వశమునకు దిచ్చును. ఇక పుట్టమన్నుతో బొట్టనవ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేయించి సొంటిపిప్పలి మిరియముల నూనెను ప్రతిమకు రాయవలెను. ఉమ్మెత్త కఱ్ఱలతో అగ్నిని రగిల్చి నువ్వులు ఆవాల మిశ్రమముతో ఎనిమిదివేల పర్యాయములు వ్రేల్చవలెను. అన్నివిధముల ధూపమువేసి సొంటి పిప్పలి మిరియాలు లేపనము చేయవలెను. అగరు ధూపము వేయవలెను. ఇట్లు చేసిన రాజువశమగును. ఇతరులకు ప్రేమ పాత్రుడగును. ఎఱ్ఱచందనముతో తాను పొగవేసికొనవలెను. సౌభాగ్యవంతుడగును. “ఓం గణపతయే వక్రతుండాయ గజదంతాయ గులగులేతి నినాదాయ చతుర్భుజాయ త్రినేత్రాయ ముశలపాశ వజ్రహస్తాయ సర్వభూతదమనాయ సర్వలోకవశంకరాయ సర్వ దుష్ణోపఘాత జననాయ సర్వశత్రు విమర్ధనాయ సర్వరాజ్య సమిహనాయ రాజానమీప వశమానయ హనహన పచ పచ వజ్రాంకుశేన గణేశఫట్ స్వాహా” “ఓం గం గీం గూం గైం గౌం గః స్వాహానమ:” ఇది మూలమంత్ర హృదయము. ఓం కః శిరః, ఓంఖః శిఖా, ఓం గః హృదయమ్, ఓం గుః వక్రమ్, ఓంగైంనేత్రం, ఓం ఘః కవచమ్ ఓం జం ఆవాహనం ఇవి హృదయం యొక్క ఆవాహనాంగములు. “ఓం నమః మూలమంత్ర హృదయము. “ఓం గాః శిరః, ఓంగైః నమః శిఖా ఓం గౌః నమః కవచమ్, ఓం గం నమఃనేత్రే ఓం గః ఫట్ అస్త్రమ్॥ ‘ఓం అంగుషోల్కాయ స్వాహా' హృదయము యొక్క ఆవాహనము, 'స్వాహా' హృదయము యొక్క విసర్జనము, "ఓం గంధోల్కాయ స్వాహా' ఇది గంధమునకు మంత్రము. 'ఓం ధర్మభూతోల్కాయ స్వాహా'. ఇది పుష్పమంత్రము. దుర్జయాయపూర్వేణ (తూర్పు) ఓం ధూర్జటయే దక్షిణేన (దక్షిణము) ఓం లంబోదరాయ పశ్చిమతః (పడమర) ఓంగణపతయే ఉత్తరత: (ఉత్తరదిశ) ఓం గణాధిపతయే ఐశాన్యాం (ఈశాన్యము) ఓం మహాగణపతయే ఆగ్నేయ్యామ్ (ఆగ్నేయమున) ఓం కూశ్మాండాయనైరృత్యామ్ (నైరృతియందు) ఓం ఏకదంత త్రిపుర ఘాతినే త్రినేత్రాయ వాయవ్యామ్ (వాయవ్యమున) ఓం మహాగణపతయే విద్మహే! వక్రతుండాయ ధీమహి! తన్నోదంతిః ప్రచోదయాత్॥ ఇది గణపతి గాయత్రీ మంత్రము. 1. పద్మ, 2. దంష్ట్రా 3. మాలా 4. ప్రకర్షణీ 5. పరశు 6. అంకుశ 7. పాశ 8. పటహ నామములు గల ఎనిమిది ముద్రలు చూపి అప్పుడు కర్మలు చేయింపవలెను. నల్లని నవ్వులతో ఎనిమిదివేల ఆహుతులీయవలెను. రాజును వశముగావించును. ఆవాహనమొదలుకొని నైవేద్యాంతము క్రమముగా పదకొండు ముద్రలు ప్రదర్శింపవలెను. ఏ విధిచేత త్రినేత్రుడు, శూలియునైన హరుని పూజింపవలెనో అదే విధిచేత విఘ్నేశ్వరుడైన గణపతిని పూజింపవలెను.

 మూ. తదేవ మండలంచాస్య అంగన్యాసస్తథైవచ ఋతే మంత్రపదానీహ సమానం సర్వమేవహి

 పూజయేద్యస్తు విఘ్నేశమేక దంతముమాసుతమ్ నశ్యంతి తస్య విఘ్నాని నచారిష్టం కదాచన

 యశ్చోపవాసం కృత్వాతు చతుర్థ్యాం పూజయేన్నరః సర్వే తస్య సమారంభాః సిధ్యేయుర్నాత్ర సంశయః

యస్యానుకూలో విఘ్నేశః శివయోః కులనందన! తస్యాను కూలం సర్వం స్యాజ్జగద్వై సర్వకర్మసు

 తస్మాదారాధయే దేనం భక్తిశ్రద్ధా సమన్వితః కుంకుమాగురు ధూ పేన తధైవోండీరక ప్రజా పలలోల్లాపికాభిశ్చ జాతికోన్మత్త క్రైస్తథా

 శుక్లపక్షే చతుర్ధ్యాంతు విధానానేన పూజయేత్ తగ్య సిధ్యతి నిర్విఘ్నం సర్వ కర్మన సంశయః

ఏక దంతే జగన్నాధే గణేశే తుష్టిమాగతే పితృదేవ మనుష్యాద్యః సర్వే తుష్యంతి భారత!

తస్మాదారా ధయే దేశం సదా భక్తి పురస్సరమ్ కర్ణలే పైస్తుండి కాభిరోదకైశ్చమహీపతే పూజయేత్సతతం దేవం విఘ్ననాశం చ దంతినమ్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మే పర్వణి చతుర్ధి కల్పే వినాయక పూజా విధి నిరూపణం సౌమత్రింశోఽధ్యాయః

తా॥ మండల మదియే, అంగన్యాసమదియే, పూజయందలి మంత్రములివియే. అంతయు సమానమే-2. ఏకదంతుడు, పార్వతీపుత్రుడైన విఘ్నేశ్వరుని పూజించువానికి వీఘ్నములు నశించును. ఏ సమయమునను అశుభము కలుగదు-3. చతుర్థినాడు ఉపవాసముచేసి గణపతిని పూజించువాని పనులన్నియును సిద్ధించును. సందేహము లేదు-4. శివకుమారా! విఘ్నేశ్వరునకు అనుగ్రహపాత్రుడైన వానికి అన్ని పనులయందును జగత్తు అంతయును అనుకూలముగనుండును-5. అందువలన భక్తి శ్రద్దా సమన్వితుడే కుంకుమ అరుగుదూషము ఉండాళహారము, నూనులసిండి (మాంసాహారములు జాబి (ఉసిరికాయలు. జాబి ఉమ్మెత్త పువ్వులు మొదలగువానిచే గణపతిని పూజింపవలెను-6. శుక్లపక్ష చతుర్ధినాడు ఈ విధిచేత పూజింపవలెను. అట్లు పూజించువానికి నిర్విఘ్నముగ సర్వకార్యములు సిద్ధించును. సందేహములేదు-7. ఏకదంతుడు, జగన్నాథుడు, అయిన గణేశుడు తృప్తిపడినచో పితృదేవతలు, దేవతలు, మనుష్యాది సర్వభూతములు తృప్తిపడగలవు-8. అందుచేనితనిని భక్తి పురస్సరముగ కర్ణలేపములు, తునకలు, లడ్డువములు మొదలైన వానిచేత ఎప్పుడును పూజింపుచుండవలెను.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున చతుర్ధికల్పమునందు వినాయక పూజావిధి నిరూపణమను ముప్పదియవ అధ్యాయము సమాప్తం.