2. సృష్టి వర్ణనము - బ్రహ్మదేవుని ఐదవ ముఖమునుండి పురాణముల ఆవిర్భావము

సుమంతురువాచ :

శ్రుణు ష్వేదం మహాబాహో పురాణం పంచలక్షణం యచ్చ్రుత్వాముచ్యతే రాజన్ పురుషో బ్రహ్మహత్యయా

పర్వాణి చాత్రవై పంచకీర్తితాని స్వయంభువా ప్రథమం కథ్యతే బ్రాహ్మం ద్వితీయం వైష్ణవం స్మృతమ్

 తృతీయం శైవమాఖ్యాతం చతుర్థం త్వాష్ట్రముచ్యతే పంచమం ప్రతిసర్గాఖ్యం సర్వలోకైస్సుపూజితమ్

ఏతాని తాత పర్వాణి లక్షణాని నిబోధమే సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ

వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం చతుర్ధశభిర్విద్యాభి ర్భూషితం కురునందన

అంగాని చతురో వేదా మీమాంసా న్యాయవిస్తర : పురాణం ధర్మ శాస్త్రంచ విద్యాహ్యేతశ్చతుర్దశ

తా ॥ ఓ వీరుడా ! ఈ పురాణం వినుట వల్ల బ్రహ్మహత్యాపాపము కూడా తొలగిపోవును. అటువంటి పురాణము పంచలక్షణాలు కలది. అట్టి పురాణమును నీవు వినవలసింది. ఈ భవిష్య పురాణాన్ని బ్రహ్మ ఐదు పర్వాలుగా పేర్కొన్నాడు. అందు మొదటీని బ్రాహ్మము, రెండవది వైష్ణవము, మూడవది శైవము, నాలుగవది సౌరము (త్వాష్టము), అయిదవది సకలలోకాలు కొనియాడే ప్రతిసర్గము. ఇక పురాణ లక్షణాలను తెలిసికొమ్ము - 1) లోక సృష్టి, 2) ప్రతిసృష్టి, 3) వంశము, 4) మన్వంతరములు 5) వంశానుచరితము - (అనగా సూర్య చంద్ర వంశ రాజుల చరిత్రలు) -ఈ అయిదు పురాణానికుండే అయిదు లక్షణాలు-అంతేకాక పురాణము పదునాలు విద్యలచే అలంకరింపబడినది. పధ్నాలుగు విద్యలేవనగా - ఋగ్యజుస్సామాధర్వణములనే నాలుగు వేదో లు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పము అనే ఆరు వేదాంగాలు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రము అనునవి.

ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చైవ తేత్రయః అర్థశాస్త్రం చతుర్థంతు విద్యాహ్యష్టాదశైవ తాః

ప్రథమం కథ్యతే సర్గో భూతానామిహ సర్వశః యచ్చ్రుత్వా పాపనిర్ముక్తో యాతి శాంతి మనుత్తమామ్

జగదాసీత్పురా తాత తమోభూతమలక్షణం అవిజ్ఞేయమతర్క్యంచ ప్రసుప్తమివ సర్వశః

తతఃస భగవానీశో హ్యవ్యక్తో వ్యంజయన్నిదం మహాభూతాని వృత్తౌజాః ప్రోత్థితస్తమ నాశనః

యోఽసావతీంద్రియోఽగ్రాహ్యః సూక్ష్మోఽవ్యక్తస్సనాతనః సర్వభూతమయోఽచింత్యస్సఏష స్వయముజ్జితః

 యోఽసౌ షడ్వింశకో లోకే తధాయం పురుషోత్తమః భాస్కరశ్చ మహాబాహో పరం బ్రహ్మచ కథ్యతే

సోఽభిధ్యాయ శరీరాత్స్వాత్ సిసృక్షుర్వివిధాః ప్రజాః అప ఏవ ససర్జాదౌ తాసు వీర్యమపాసృజత్ 

తా॥ పైన పేర్కొన్న పద్నాలుగు విద్యలు - ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, అర్థశాస్త్రము అనే నాలుగింటితో కలిసి పద్దెనిమిది విద్యలవుతాయి. మొదటగా మనిషికి పాపవిముక్తి హేతువై, ఉత్తమ శాంతిని ప్రసాదించే ప్రాణి సృష్టి క్రమాన్ని వివరిస్తాను. పూర్వం లోకమంతా చీకటితోనిండీ, లక్షణహీనమై గుర్తించరాని విధంగా నిద్రించినట్లుండ (అచేతనము)గా, తమస్సును తొలగించగల సమర్థుడు, అవ్యక్తుడు అయిన భగవంతుడు పంచభూతాలను వ్యక్తపరుస్తూ తాను వ్యక్తుడైనాడు. ఇంద్రియాతీతుడు, ఎవరికినీ గ్రహింపవీలుకాని మహత్తుగలవాడు, సూక్ష్మరూపుడు, అవ్యక్తుడు, సనాతనుడునూ సకలజీవులలో ఉన్నవాడునూ అయిన ఆ దేవుడు స్వయం ప్రకాశుడు. ఓ వీరుడా! స్వయంభువై వెలిగే ఆ దేవుడే పరబ్రహ్మగా పేరొందినాడు. ఆ పరబ్రహ్మ తననుండి సుసిని సారంబింపగోరి మొటమొదట వీటిని సుసీంచి ఒంగులో తన తేజసుకు

యస్మాదుత్పద్యతే సర్వం సదేవాసురమానుషమ్ బీజం శుక్రం తథారేత ఉగ్రం వీర్యం చ కథ్యతే

వీర్యస్యైతాని నామాని కథతాని స్వయంభువా తదండమభవద్ధైమం జ్వాలమాలాకులం విభో

యస్మిన్ జజ్ఞే స్వయం బ్రహ్మా సర్వలోకపితామహః సురజ్యేష్ఠ శ్చతుర్వక్త్రః పరమేష్ఠి పితామహః

క్షేత్రజ్ఞః పురుషోవేధాః శంభుర్నారాయణస్తథా పర్యాయవాచకైశ్శబ్ధైరేవం బ్రహ్మా ప్రకీర్త్యతే

సదా మనీషిభిస్తాత విరించిః కంజజస్త థా ఆపోనారా ఇతి ప్రోక్తా ఆపోవై నరసూనవః

తా యదస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః అరమిత్యేవ శీఘ్రాయ నియతాః కవిభిః కృతాః

ఆపఏ వార్ణవీభూత్వా సుశీఘ్రాస్తేన తో నరాః యత్తత్కారణ మవ్యక్తం నిత్యం సదసదాత్మకమ్

తా॥ ఆ తేజస్సే దేవ రాక్షస మానవ జాతులతో కూడిన లోక సృష్టికి హేతువగును. ఆ తేజస్సుకే వీర్యము, బీజము, శుక్రము, రేతస్సు అనే పేళ్ళుకలవు. ప్రకాశవంతమైన ఆ వీర్యమే తేజోయుతమైన అండమై అందుండి సర్వజగత్పితామహుడు, పరమేష్ఠి, నాలుగు ముఖాలున్నవాడు, దేవతలలో పెద్దవాడు, క్షేత్రజ్ఞుడయిన బ్రహ్మదేవుడు జన్మించెను. ఆ బ్రహ్మనే శంభుడని, నారాయణుడని, కమలభవుడని పండితులు చెప్పెదరు. నారమనగా నీరు, నీరే అయనంగా (నివాసస్థానంగా) కలవాడు కాబట్టి ఆదేవుని నారాయణుడని అందురు. సదసదాత్మకము అవ్యక్తమైన కారణము కలది యగు సృష్టికి కారకుడైన ఆ భగవంతుడే బ్రహ్మవాచ్యుడయ్యెను .

తద్విసృష్టః సపురుషో లోకే బ్రహ్మేతి కీర్త్యతే ఏవం స భగవానండే తత్త్వమేవ నిరూప్యవై

 ధ్యానమాస్థాయ రాజేంద్ర తదండమకరోద్విధా శకలాభ్యాంచ రాజేంద్ర దివం భూమించ నిర్మమే

అంతర్వ్యోమ దిశశ్చాష్టౌ వారుణం స్థానమేవచ ఊర్థ్వం మహాన్గతో రాజన్సమంతాల్లోకభూతయే

మహతశ్చాప్యహంకారస్తస్మాచ్చ త్రిగుణా అపి త్రిగుణా అతి సూక్ష్మాస్తు బుద్ధిగమ్యాహి భారత

ఉత్పత్తి హేతుభూతావై భూతానాం మహతాం నృప తేషామేవ గృహీతాని శనైః పంచేంద్రియాణితు

తా ॥ విశ్వసృష్టి చేయవలెనను ధ్యానముతో, ఆ అండమును రెండు భాగాలు చేసి వానిచే భూమ్యాకాశాలను కల్పించేను. ఆ భగవంతుడే ఊర్వగతుడై అన్ని లోకాల అభివృద్ధికై అంతరాకాశమును. అష్టదిక్కులను, వారుణస్థానమును మహదహంకారమును సృష్టించి దానినుండి సూక్ష్మములు బుద్ధిగమ్యాలైన సత్వరజస్తమో గుణాలను కల్పించెను. ఆ త్రిగుణాలే పంచమహా భూతాల ఉత్పత్తికి హేతువులైనవి. పంచమహాభూతాల నుండియే పంచేంద్రియాలను ఉద్భవింపచేసెను.

తథైవావయవా సూక్ష్మా షణ్ణామప్య మితౌజసాం

సన్నివేశ్యాత్మమాత్రాసు స రాజన్భగవాన్విభుః భూతానీ నిర్మమే తాత సర్వాణి విధిపూర్వకమ్

యన్మూర్త్య వయవా సూక్ష్మాస్తస్యే మాన్యా శ్రయాణిషట్ తస్మాచ్ఛరీరమిత్యాహుస్తస్య మూర్తిం మనీషిణః

మహాంతి తాని భూతాని ఆవిశంతి తతో విభుం కర్మణా సహ రాజేంద్ర సగుణాశ్చాపివై గుణాః

తేషామిదం తు సప్తానాం పురుషాణాం మహౌజసాం సూక్ష్మాభ్యో మూర్తి మాత్రాభ్యసనంభవత్యవ్యయాద్వ్యయమ్

భూతాది మహతస్తాత యేన వ్యాప్తమిదం జగత్ తస్మాదపి మహాబాహో పురుషాః పంచ ఏవహి

కేచిదేవం పరాంతాత సృష్టిమిచ్ఛంతి పండితాః అన్యేఽప్యేవం మహాబాహో ప్రవదంతి మనీషిణః

యోసావాత్మా పరస్తాత కల్పాదౌ సృజతే తనుం ప్రజనశ్చ మహాబాహో సిసృక్షుర్వివిధాః ప్రజాః

తా॥ అటు పిమ్మట మిక్కిలి సూక్ష్మములైన ఇంద్రియ విషయములైన శబ్ద, స్పర్శ, రూప రసగంధములను ఐదు తన్మాత్రలను మనస్సును సృజించెను. ఆ తర్వాత సర్వ ప్రాణులను సృజించెను. శబ్ద స్పర్శ రూప రస గంధాలు మరియు మనస్సు అను నీ ఆరు శరీరమును ఆశ్రయముగా కలిగి ఉంటాయి. అందుచే జీవుని మూర్తిని శరీరంగా వ్యవహరిస్తారు పండితులు. జీవులు వారి వారి పుణ్య కర్మలచేతను పాప కర్మల చేతను విరాడ్రూపుడైన ఆ పరమాత్మచే జీవత్వమును పొందెదరు. పంచ మహాభూతాలు మొదలుగా కలిగిన మహత్తత్వమునుండియే ఈ జగత్తు వ్యాపించినది. ఇటువంటి సర్వ జగద్వ్యాప్తికి మూలమైన ఏ పరమాత్మకలడో ఆయనయే ప్రతి కల్ప ప్రారంభమున తనను తాను సృజించుకొని వివిధ ప్రజా సృష్టిని చేయగోరినాడు .

తేన సృష్టఃపుద్గలస్తు ప్రధానం విశతే నృప ప్రధానం క్షోభితం తేన వికారాన్ సృజితే బహూన్

ఉత్పద్యతే మహాంస్తస్మాత్తతో భూతాదిరేవ హి ఉత్పద్యతే విశాలంచ భూతాదే: కురునందన

విశాలాచ్చ హరిస్తాత హరేశ్చాపి వృకాస్తథా వృకే ర్మష్ణంతీచ బుధాస్తస్మాత్సర్వం భవేనృప

తథైషామేవ రాజేంద్ర ప్రాదుర్భవతి వేగతః మాత్రాణాం కురుశార్దూల విబోధస్తదనంతరం

తస్మాదపి హృషీకాణి వివిధాని నృపోత్తమ తథ్యం సృష్టిరాఖ్యాతాఽరాధ్యతః కురునందన

భూయో నిబోధ రాజేంద్ర భూతానామిహవిస్తరం గుణాధికాని సర్వాణి భూతాని పృథివీపతే

ఆకాశమాదితః కృత్వా ఉత్తరోత్తరమేవహి ఏకం ద్వౌచ తథాత్రీణి చత్వారశ్చాపి పంచ చ

తతస్సభగవాన్ బ్రహ్మా పద్మాసన గతః ప్రభుః సర్వేషాం తు సనామాని కర్మాణిచ పృథక్ పృథక్

తా ॥ సృష్టిని చేయగోరిన పరమాత్మ ముఖ్యంగా పదార్థ సృష్టి చేసి సుఖదుఃఖాది నానా విధ వికారములను కలిగిస్తాడు. మహత్తత్వమునుండియే హరి, హరి నుండి 'వృక మను పేరుగల అగ్ని, దాని నుండి దేవతలు అదే విధంగా సకల సృష్టి సంభవించును. ప్రాణులన్నింటియందు సత్వరజస్తమో గుణాల ఆధిక్యం ఉంటుంది. సత్వరజస్తమో గుణాలే ప్రాణుల సృష్టికి పంచమహాభూతాలకు కూడా కారణాలు. సృష్టిచేయగోరిన ఆ పరమాత్మ ముందు ఆకాశాన్ని కల్పించి దానినుండి వాయువును వాయువు నుండి అగ్నిని, అగ్ని నుండి నీటిని, నీటి నుండి భూమిని, భూమి నుండి ఓషధులను, వాని నుండి అన్నమును, అన్నమునుండి పురుషుని, క్రమంగా సృజించినాడు. సృష్టి చేసిన వివిధ ప్రాణులకు వేరువేరుగా పేర్లను (గుర్తులను) పెట్టి వాని కర్మలను కూడా నిర్దేశించినాడు.

వేద శబ్ధేభ్యఏ వాదౌ పృథక్సం స్థాశ్చ నిర్మమే కర్మోద్భవానాం దేవానాం సోఽ సృజద్దేహినాం ప్రభుః

తుషితానాం  గణం రాజన్ యజ్ఞం చైవ సనాతనం దత్వా వీర సమానేభ్యో గుహ్యం బ్రహ్మ సనాతనమ్

 దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం ఋగ్యజుస్సామ లక్షణం కాలం కాలవిభక్తీశ్చ గ్రహానృతూంస్తథా నృప

సరిత స్సాగరాన్ శైలాన్ సమానీ విషమాణి చ కామం క్రోధం తథా వాచం రతించాపి కురూద్వహ

 సృష్టిం ససర్జ రాజేంద్ర సిసృక్షుర్వి విధాః ప్రజాః ధర్మాధర్మౌ వివేకాయ కర్మణాంచ తథా సృజత్

 సుఖ దుఃఖాది భిర్ద్వంద్వై: ప్రజాశ్చేమాన్యయోజయత్ అణ్వ్యోమాత్రావినాశిన్యో దశార్ధానాంతు యాస్స్మృతాః

తాభి స్సర్వమిదం వీర సంభవత్యనుపూర్వశ: యత్కృతం తు పురాకర్మ సన్నియుక్తేన వై నృప

 సతదేవ స్వయం భేజే సృజ్యమానం పునఃపునః హింసాహింసే మృదుక్రూరే ధర్మాధర్మే ఋతానృతే

యద్యథాస్యాభవత్సర్గే తత్తస్య స్వయమావిశత్ యథాచలింగాన్యృతవః స్వయమేవానుపర్యయే

స్వాని స్వాన్యభిపద్యంతే తథా కర్మాణి దేహినః

తా ॥ సకల ప్రభువగునతడే. కర్మోద్భవులైన జీవులకు, దేవతలకును వైదికశబ్దానుసారంగా వేరు వేరు నివాసస్థానముల నేర్పరిచెను. తోషుడు, ప్రతోషుడు మున్నుగు తుషిత' గణమును, సనాతనమగు యజ్ఞమును రహస్య యజ్ఞ బ్రహ్మను కూడా కల్పించి యజ్ఞము సిద్ధించుటకై ఋగ్యజుస్సామ లక్షణములను ప్రసాదించెను. సృజనేచ్ఛగల ఆ విభుడే కాలమును, కాల విభాగాలను, గ్రహాలను, ఋతువులను, సప్తనదులను, చతుస్సముద్రాలను, సప్త సముద్రాలను, సప్త పర్వతాలను, కామక్రోధాలను, సుఖాన్ని మరియు వాక్కును సృష్టించాడు. ఇంకా కర్మ వివేకముకొఱకై ధర్మాధర్మములను కల్పించాడు. సుఖదుఃఖాలు, శీతోష్ణాలు మున్నగు ద్వంద్వాలచే కూడియుండునట్లుగా స్వల్ప కాల వినాశకులు గాను ప్రజలను యోజించినాడు. పూర్వ జన్మలలో నిర్వహించిన కర్మలనుబట్టి మళ్లీ మళ్లీ జన్మించే జీవుణ్ణి ఆ పురాకర్మ సంచయనం చేరుకుంటుంది. క్రూరాక్రూరములు, మృదు కఠినములు, ధర్మాధర్మములు, సత్యాసత్యములు పూర్వ జన్మలలో జీవునిచే ఏ విధంగా ఆచరింపబడునో ఆ ఆచరణ ఫలితం అట్లే జీవుణ్ణి ఉత్తర జన్మలలో ప్రవర్తింపజేస్తూ ఉంటాయి. వివిధ ప్రకృతులను ఆరు ఋతువులు ఎట్లాగైతే అనుసరిస్తాయో అట్లే దేహధారులైన మానవులను స్వీయములైన పూర్వకర్మలు పొందగలవు .

లోక స్యేహ వివృద్ధ్యర్థం ముఖ బాహూరుపాదతః బ్రహ్మక్షత్రం తథాచోభౌ వైశ్య శూద్రౌ నృపోత్తమ

 ముఖానియాని చత్వారి తేభ్యోవేదా వీనిస్సృతాః

ఋగ్వేద సంహితా తాత వసిష్ఠేన మహాత్మనా పూర్వాన్ముఖాన్మహాబాహో దక్షిణాచ్చాపివైశృణు

 యజుర్వేదో మహారాజ యాజ్ఞవల్క్యేనవైసహ సామాని పశ్చిమత్తాత గౌత మశ్చ మహానృషిః

అథర్వవేదో రాజేంద్ర ముఖచ్చాప్యుత్తరాన్నృప ఋషిశ్చాపి తథా రాజన్ శౌనకో లోకపూజితః

తా ॥ ఓ రాజోత్తమా! ఈ లోకాభ్యుదయమునకై బ్రహ్మ తన ముఖమునుండి బ్రాహ్మణుని, బాహువులనుండి క్షత్రియుని, తొడల నుండి వైశ్యుని, పాదముల నుండి శూద్రుని పుట్టించేను. ఆ బ్రహ్మయొక్క నాలుగు ముఖములనుండి వేదములు బయల్వెడలినవి. అతని మొదటి ముఖము (తూర్పు ముఖము) నుండి వసిష్ఠముని సమేతంగా ఋగ్వేదము, దక్షిణ ముఖము నుండి యాజ్ఞవల్క్యమునితో బాటుగా యజుర్వేదము, పడమటి ముఖము నుండి గౌతమునితో సహా సామవేదము, ఉత్తర ముఖము నుండీ లోక సన్నుతుడగు శౌనకమహామునితో సహా అధర్వవేదము ఆవిర్భవించెను.

యత్తన్ముఖం మహాబాహో పంచమం లోకపూజితమ్ అష్టాదశ పురాణాని సేతిహాసాని భారత

 నిర్గతాని తతస్తస్మాన్ముఖాత్కురుకులో ద్వహ తథాస్యాస్కృతయశ్చాపి యమాద్యాలోకపూజితాః

తతస్సభగవాన్దేవో ద్విథా దేహమకారయత్ ద్విథాకృత్వాత్మనో దేహమధేన పురుషోఽభవత్

అర్ధేన నారీతస్యాంచ విరాజమసృజత్ర్పభుః తపస్త్వప్త్వాసృజద్యంతు సస్వయం పురుషో విరాట్

స చకార తపో రాజ న్సిసృక్షు ర్వివిధ ప్రజాః పతీనజానామసృజ న్మహర్షినాదితో దశ

నారదంచ భృగుం తాత కం ప్రచేత సమేవహి పులహం క్రతుం పులస్త్యంచ అత్రిమంగిరసం తథా

మరీచించాపి రాజేంద్ర యోసావాఽ ద్యః ప్రజాపతిః ఏతాంశ్చాన్యాంశ్చ రాజేంద్ర అసృజద్భూరితేజసః

తా ॥ ఓ వీరుడా! అతని అయిదవ ముఖమునుండి ఇతిహాసములతో బాటుగా పద్దెనిమిది పురాణములును, అదేవిధంగా ధర్మశాస్త్రాలు (స్మృతులు) లోక సన్నుతులగు యమాది దేవతలును ఆవిర్భవించిరి. అంత నా భగవంతుడు తన దేహమును రెండు సమభాగాలుగా చేసి మొదటి అర్థ శరీరమును పురుషుడుగాను, రెండవ అర్థశరీరము స్త్రీగాను పరిణమింపజేసి, తన తపోనిష్టతో ఆ స్త్రీయందు విరాట్పురుషుని సృష్టిజేసెను. ఓ రాజా, అట్టి విరాట్పురుషుడు స్వయంగా వివిధ ప్రజాసృష్టి జేయగోరీ తపమాచరించినాడు. అతడు మొదటగా మహాతేజోవంతులు, మహర్షులు అయిన నారదుడు, భృగువు, బ్రహ్మ ప్రచేతసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, అత్రి, అంగిరసుడు, ఆద్యప్రజాపతియైన మరీచిని గొప్పతేజోవంతులైన ఇతరులను సృష్టిజేసెను.

అథ దేవానృషీన్దైత్యాన్ సోఽ సృజత్కురునందన యక్ష రక్షః పిశాచాంశ్చ గంధర్వాప్సరసోఽసురాన్

మనుష్యాణాం పితృణాంచ సర్పాణాంచైవ భారత నాగానాoచ మహాబాహో ససర్జవివిధాన్గణాన్

 క్షణ రుచోఽశని గణాన్ రోహితేంద్ర ధనూంషి చ ధూమకేతుం స్తథా చోల్కా నిర్వాతాన్జ్యోతిషాంగణాన్

మనుష్యాన్కిన్నరాన్మత్స్యాన్వరాహాంశ్చ విహంగమాన్ గజానశ్వానథ పశూన్మృగాన్వ్యాళాంశ్చ భారత

కృమికీట పతంగాంశ్చ యూకాలిక్షక మత్కుణాన్ సర్వంచ దంశమశకం స్థావరం చ పృథగ్విధమ్

ఏవం సభాస్కరో దేవస్ససర్జ భువనత్రయమ్ యేషాం తు యాదృశం కర్మ భూతానామిహకీర్తితమ్

కథయిష్యామి తత్సర్వం క్రమయోగంచ జన్మని గజావ్యాలామృగాస్తాత పశవశ్చ పృథగ్విథాః

తా ॥ ఓ భారతవంశీయా! పిమ్మట నా విరాట్పురుషుడగు దేవుడు దేవదానవులను, మునులను, యక్ష, రాక్షస, పిశాచ, అసుర, గంధర్వ, అప్సరసలను, మనుష్య, నాగజాతులను, పితృగణమును, మరియు క్షణకాంతి గలిగిన మెరుపుల సమూహములను, ఎరుపురంగు ఇంద్రధనుస్సులను, తోకచుక్కలను, ఉల్కలను, నక్షత్ర సమూహములను, మనుష్య, కిన్నెర జాతులను, చేపలను, వరాహ, గజ, అశ్వ, పశు మృగ సర్ప జాతులను, పక్షి కీటకములను, పేండ్లను, పేను గ్రుడ్లను, నల్లులను సృజించెను. ఇదే విధంగా లోక ప్రకాశకారి యగు ఆ భగవానుడు స్థావరాత్మకమగు ముల్లోకములను సృష్టిజేసెను. సర్వ ప్రాణులచే పొగడబడిన ఆ భగవంతుని ఏ విధమగు సృష్టి కార్యము కలదో దానిని ఇంకా వివరించెదను. భిన్న భిన్న విధములగు గజ, సర్ప, మృగ పశుజాతులు.

పిశాచమానుషాస్తాత రక్షాంసిచ జరాయుజాః ద్విజాస్తు అండజాస్సర్పాన క్రౌమత్స్యాస్సకచ్ఛపాః

ఏవం విధాని యానీహ స్థలజాన్యౌదకాని చ స్వేదజం వంశమశకం యూకాలిక్షక మత్కుణాః

ఊష్మణాచోపజాయంతే యాచ్ఛాన్యత్కించిదీదృశమ్ ఉద్భిజ్జాస్థావరాః సర్వే బీజకాండ ప్రరోహిణః

ఓషధ్య:ఫలపాకాంతా నానావిధ ఫలోపగాః అపుష్పాః ఫలవంతో యేతే వనస్పతయస్స్మృతాః

పుష్పిణః ఫలినశ్చైవ వృక్షాస్తూభయతస్స్మృతాః గుచ్ఛగుల్మంతు వివిధం తథైవ తృణజాతయః

బీజకాండ రుహాణ్యేవ ప్రతానావల్ల్య ఏవచ తమసా బహురూ పేణ వేష్టితాః కర్మహేతునా

అంతస్సంజ్ఞాభవంత్యేతే సుఖదుఃఖ సమన్వితాః ఏతావత్యస్తు గతయః ప్రోద్భూతాః కురునందన

తా ॥ అట్లే మావివల్ల పుట్టిన క్రిములు, పిశాచ, రాక్షస, మానవజాతులు, పక్షులు, సర్పాలు, ఇంకా చేపలు, తాబేళ్ళు మరియు మొసళ్ళు, భూమియందును, నీళ్ళ నుండి పుట్టినట్టి ప్రాణులు అడవి ఈగలు, దోమలు చెమటవల్ల పుట్టునవికాన స్వేదజములుగా పిలువబడగా, పేను, పేనుగ్రుడ్లు, నల్లులు వేడి కారణంగా జన్మిస్తాయి. విత్తనముల మూలమున మొలకెత్తినట్టి స్థావరములగు చెట్లు ఉద్భిజ్జములుగా (భూమిని చీల్చుకొని పైకి వచ్చునవి) చెప్పబడినాయి. నానావిధ ఫలములను పొందు ఫలకాంతములే ఓషధులు కాగా పుష్పాలు లేనిపై ఫలములు కలిగి యున్నవి వనస్పతులని పిలువబడును. పుష్ప ఫలములతో కూడియుండు చెట్లు. ఓషధులనియు వనస్పతులనియు ఉభయనామములతో పిలువబడును. అట్లే నానా గుచ్ఛగుల్మములు, తృణ జాతులు అవిచ్ఛిన్నంగా ప్రాకే తీగెలు నానా కర్మలయొక్క హేతువుచే తమోబద్ధములైనవి. ఈ ఓషధులు పైకి సంజ్ఞలు చేయలేకున్నను మిగతా జీవులవలె సుఖదుఃఖాలు కలిగి ఆంతర చైతన్యముతో కూడియున్నవి.

తస్మాద్దేవాద్దీప్తిమంతో భాస్కరాచ్చ మహాత్మనః ధీరోఽ స్మింస్తాత సంసారే నిత్యం సతతహాయిని

ఏవం సర్వం ససృష్ట్వేదం రాజాంల్లోకగురుం పరం తిరోభూతస్సభూతాత్మాకాలం కాలేన పీడయన్

యదా సదేవో జాగర్తి తదేదం చేష్టతే జగత్ యదా స్వపితి శాంతాత్మా తదా సర్వంనిమీలతి

తస్మిన్స్వపితి రాజేంద్ర జంతవః కర్మబంధనాః స్వకర్మభ్యో నివర్తంతే మనశ్చగ్లాని మృచ్ఛతి ,

యుగపత్తు ప్రలీయంతే తదా తస్మిన్మహాత్మని తదాయం సర్వభూతాత్మా సుఖం స్వపితి భారత

తమోయదా సమాశ్రిత్య చిరం తిష్ఠతి సేంద్రియః న నవం కురుతే కర్మ తదోర్క్రమతి మూర్తితః

తా ॥ ప్రకాశకారకుడు, మహాత్ముడు అయిన ఆ దేవునివల్లనే ఈ ప్రాణులన్నియు వెలుగులోకి వచ్చాయి. నిరంతర గమన శీలం కలిగిన ఈ ప్రపంచమునందు ఇట్లు సర్వ ప్రాణులను రాజులను సృష్టించి, భూతాత్ముడు, ధీరుడు అగు ఆ భగవానుడు కాలమును కాలముచేతనే అణచివేయుచు వెనుదిరుగును . ఆ భగవానుడు జాగరూకుడై ఉన్నప్పుడు ఈ జగత్తు తన పనులను చేయగలుగును. ఎప్పుడైతే అతడు నిద్రిస్తాడో అప్పుడు సర్వజగము చైతన్యమును కోల్పోవును. సృష్ట్యనంతరం సృష్టికర్త విశ్రమించి నిద్రాగతుడై యుండగా కర్మ బద్ధులైన ప్రాణులన్నియు స్వస్వకర్మనివృత్తిని చెంది, మనస్సు దుఃఖగతముగా ఆపరమాత్మయందు ఒకేసారి విలీనమౌతాయి. ఇంద్రియయుక్తుడైన జీవుడు తమోగుణాశ్రయం వల్ల నిశ్చేష్టుడైనట్లే ఆ పరమాత్మ విశ్రాంతుడైన వేళ ఈ జగచ్చరీరము నుండి కర్మ చేష్టలు వైదొలగును. కాన జగత్తు చేతనారహితమగును. ఎప్పుడైతే అంగుష్ఠమాత్రుడై జీవుడు బీజమును స్థాపించి చలన శీలుడగునో అప్పుడు తమోవృత్తిని విడుచును .

యదాహం మాత్రికో భూత్వా బీజం స్థాస్ను చరిష్ణు చ సమావిశతి సంసృష్టస్తదా మూర్తిం విముంచతి

 ఏవం స జాగ్రత్స్వప్నాభ్యాం ఇదం సర్వం జగత్ర్పభుః సంజీవయతి చాజస్రం ప్రమాపయతి చావ్యయః

 కల్పాదౌ సృజతే తాత అంతే కల్పస్య సంహరేత్ దినం తస్యేహ యత్తాత కల్పాంతమితి కథ్యతే

 కాలసంఖ్యాం తతస్తస్య కల్పస్య శ్రుణు భారత నిమేషా దశ చాష్టౌచ అక్షః కాష్ఠా నిగద్యతే

త్రింశత్కాష్ఠాః కలామాహుః క్షణస్త్రింశత్కలాస్స్మృతాః ముహూర్తమథ మౌహూర్తా వదంతి ద్వాదశ క్షణమ్

 త్రింశన్ముహూర్తముద్దిష్ట మహోరాత్రం మనీషిభిః మాసస్త్రింశదహోరాతం ద్వౌద్వౌ మాసావృతుస్సృతః

తా ॥ ఈ విధముగా జాగ్రత్ స్వప్నావస్థల మూలంగా అవ్యయుడగు ఆ పరమాత్మ జగత్తును ఎల్లప్పుడు సృజించి నశింపజేయుచుండును. కల్పారంభంలో జగత్తును సృష్టించి కల్పాంతంలో లయము చేయుచుందును. అట్టి పరమాత్మకు ఒక కల్పకాలము దీనంగా చెప్పబడును. ఓ భారతా! ఇక కాల సంఖ్యను కల్ప సంఖ్యను గూర్చి వినుము. పద్దెనిమిది కనురెప్పపాట్ల కాలమును 'కాష్ఠమ'ని పిలుస్తారు. ముప్పది కాష్ఠముల కాలమునకు ఒక 'కలా' అని పేరు. అటువంటి ముప్పది 'కల'ల కాలమును ఒక 'క్షణ'మంటారు. పన్నెండు క్షణముల కాలమునకు ఒక ముహూర్తమని జ్యోతిష్కులు పిలుస్తారు. ముప్పది ముహూర్తముల కాలం ఒక రోజుగా ఉద్దేశింపబడింది. అట్టి ముప్పది దినము కాలం ఒక నెలగా, రెండు నెలల కాలం ఒక ఋతువుగానూ చెప్పబడును . "

ఋతుత్రయమప్యయనం అయనే ద్వేతు వత్సరః అహోరాత్రే విభజతే సూర్యోమానుష దైవికే

రాత్రి స్వప్నాయ భూతానాం చేష్టాయై కర్మణామహః పిత్ర్యే రాత్ర్యహనీ మాసః ప్రవిభాగస్తు పక్షయోః

కర్మచేష్టాస్వహః కృష్ణః శుక్ల స్వ్యప్నాయ శర్వరీ దైవే రాత్ర్యహనీ వర్షం ప్రవిభాగస్తయోః పునః

అహస్తత్రోదగయనం రాత్రి స్యాద్దక్షిణాయనం బ్రాహ్మస్యతు క్షపాహస్య యత్ప్రమాణం మహీపతే

ఏకైక శోయుగానాంతు క్రమ శస్తన్నిబోధమే చత్వార్యాహు స్సహస్రాణి వర్షాణాం తత్కృతం యుగమ్

 తస్య తావచ్ఛతీ సంధ్యా సంధ్యాంశశ్చ తథావిధః త్రేతా త్రీణి సహస్రాణి వర్షాణీచ విదుర్బుధాః

 శతాని షట్చరాజేంద్ర సంధ్యాసంధ్యాం శయోః పృథక్ వర్షాణాం ద్వే సహస్రేతు ద్వాపరే పరికీర్త్యతే

 చత్వారిచ శత్యాన్యాహుః సంధ్యాసంధ్యాంశయోర్బుధః సహస్రం కథితం తుష్యే శతద్వయ సమన్వితమ్

 తా ॥ మూడు ఋతువులు ఒక అయనంగా, రెండు అయనాలు ఒక సంవత్సరంగా చెప్పబడును. సూర్యునివల్ల దివసము రాత్రింబవళ్ళుగా విభజింపబడును. అట్టి దివసము మానవ మానమని దైవిక మానమని రెండు విధాలు. ప్రాణులు నిద్రించుటకై రాత్రి, కర్మలనాచరించుటకై పగలు నిర్దేశింపబడినది. మానవ మానము ప్రకారం రెండు పక్షములు ఒక మాసమగును. అట్టి మాసము పితృదేవతలకు ఒక దినగా పరిగణింపబడును. మానవ మానం ప్రకారం కృష్ణ పక్షము శుక్షపక్షము - అని రెండు పక్షములు. నెలలోని 15 రోజుల కృష్ణ పక్షకాలము పితృదేవతలకు రాత్రిగా లెక్కింపబడును. అయనమనగా ఆరు నెలల కాలము. రెండు ఆయనములతో కూడిన ఒక మానవ సంవత్సరము దేవతలకు ఒక దీవసమగును. అందు ఉత్తరాయణం దేవతలకు పగలుగా, దక్షిణాయనం రాత్రిగా భావింపబడును. ఇక యుగ ప్రమాణమెట్లనగా - 4,600ల దైవ సంవత్సరాలు కృతయుగమగును. 3000ల దైవ సంవత్సరాలు త్రేతాయుగమగును. 2,400లదేవ సంవత్సరాల కాలము ద్వాపర యుగమగును. 1,200ల దైవ సంవత్సరాల కాలము కలియుగమగును.

ఏషా చతుర్యుగస్యాపి సంఖ్యా ప్రోక్తా నృపోత్తమ యదేతత్పరి సంఖ్యాత మాదావేవ చతుర్యుగమ్

ఏతద్ద్వాదశ సాహస్రం దేవానాం యుగముచ్యతే దైవికానాం యుగానాంతు సహస్ర పరిసంఖ్యయా

బ్రాహ్మమేక మహర్జ్యేయం తావతీ రాత్రిరుచ్యతే ఏతద్యుగ సహస్రాంతం బ్రాహ్మం పుణ్యమహర్విదు:

 రాత్రిం చతావతీమేవ తేఽహోరాత్ర విదో జనాః తతో సౌయుగపర్యంతే ప్రసుప్త: ప్రతిబుధ్యతే

 ప్రతిబుద్ధస్తు సృజతి మనస్సదసదాత్మకం మనస్సృష్టిం వికురుతే చోద్యమానం సిసృక్షయా

విపులం జాయతే తస్మాత్తస్య శబ్దం గుణం విదుః విపులాత్తు వికుర్వాణాత్సర్య గంధవహశ్శుచిః

 బలవాన్జాయతే వాయుః సవై స్పర్శగుణో మతః వాయోరపి వికుర్వాణా ద్విరోచిష్ణు తమోనుదమ్

తా ॥ ఓ రాజోత్తమా! నాలుగు యుగముల కాల పరిమితిని చెప్పియున్నాను. ఈ నాలుగు యుగాలు పన్నెండు వేల మార్లు ఆవర్తనం అయితే దేవతలకు ఒక యుగమవుతుంది. ఇటువంటి వేయి దేవయుగాలు బ్రహ్మకు ఒక పగలు. అట్టి వేయి దేవయుగాలే బ్రహ్మకు ఒక రాత్రి - అంటే రెండు వేల దేవయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక దినము అవుతుంది. యుగాంతంలో బ్రహ్మ నిద్రించి మరల మేల్కొంటాడు. అట్లు మేల్కొని లోకమును సృజించుకోరికతో సదసదాత్మకమైన మనస్సును సృష్టి చేస్తాడు. ఆ మనస్సు నుండి ఆకాశం పుడుతుంది. ఆకాశానికి శబ్దమే గుణంగా చెబుతారు. ఆకాశం నుండి అన్ని గంధములను వహించేవాడు, పవిత్రుడు, బలవంతుడు అయిన 'వాయువు 'పుట్టును. అట్టి వాయువు స్పర్శగుణం కలది. అట్టి వాయువు నుండి తేజశ్ళీలుడు, తమస్సును అణచేవాడును, విచిత్ర కిరణాలు కలవాడును అగు అగ్ని జన్మిస్తాడు.

ఉత్పద్యతే విచిత్రాంశుస్తస్య రూపం గుణం విదుః తస్మాదపి కుర్వాణాదాపో జాతాస్స్మృతా బుధైః 

 తాసాం గుణారసోజ్ఞేయ స్సర్వలోకస్య భావనః అద్వ్యో గంథగుణో భూమిరిత్యే షా సృష్టిరాదితః

యత్ర్పాగ్ద్వాదశ సాహస్రముక్తం సౌమనసం యుగం తదేక సప్తతిగుణం మన్వంతరమిహోచ్యతే

 మన్వంతరాణసంఖ్యాని సర్గ స్సంహార ఏవచ తథాప్య హే సదా బ్రాహ్మీ మనవస్తు చతుర్దశ

కథ్యంతే కురుశార్డుల సంఖ్యలో పండితైస్సదా మనో స్స్వాయంభువ సేహ షడ్వంశ్యామనవోఽపరే

 సృష్టవంతః ప్రజాస్స్వాస్స్వాః మహాత్మానో మహౌజసః సావర్ణేయస్తథా పంచ భౌత్యో రౌచ్యస్తథాపరః

 ఏతే భవిష్యా మనవః సప్త ప్రోక్తా నృపోత్తమ స్వేస్వేంతరే సర్వ మిదం పాలయంతి చరాచరమ్

ఏవం విధం దినం తస్య విరించేస్తు మహాత్మనః తస్యాంతే కురుతే సర్గం యథేదం కధితం తవ

అతని రూపమే గుణము అని తెలియుదురు. ఆ అగ్ని నుండి నీరు పుట్టునని పండితులు చెప్పుదురు. ఆ నీటి గుణం రసము. నీటి నుండి గంధ గుణం కల భూమి ఉద్భవిస్తుంది. ఇది మొదటి నుండియు సృష్టి క్రమము.

తా ॥ ఇంతకుముందు చెప్పినట్లు ఏ పన్నెండు వేల చతుర్యుగాల కాలం ఒక దేవయుగమౌనో, అట్టి డెబ్బది దేవయుగాల కాలం ఒక మన్వంతరంగా చెప్పబడును. మన్వంతరాలు చాలా ఉన్నాయి. బ్రహ్మ దిన కాలంలో 14 మంది మనువులు పాలిస్తారు. స్వాయంభువ మనువు వంశానికి చెందిన వారే మిగతా ఆరుగురు ఉన్నారు. వీరందరు వారి వారి మన్వంతర కాలాలలో మహాత్ములైన తేజోబలయుతులైన ప్రజలను సృష్టిచేస్తారు. అట్లాగే సావర్ణుడు మరియు రౌచ్య దౌత్య నామములతోను ఏడుగురు మనువులు భవిష్యత్తులో కాబోయే మనువులుగా చెప్పబడ్డారు. ఈ పద్నాలుగురు మనువులు వారివారి మన్వంతర కాలాలలో ఈ చరాచర సృష్టిని పాలిస్తారు. ఓ రాజోత్తమా! ఈపద్నాలుగు మన్వంతరాల కాలమే బ్రహ్మకు ఒక దినము బ్రహ్మ దినము ముగియగానే మళ్లీ అతడు సృష్టిని ఆరంభిస్తాడు.

క్రీడన్నివైతత్కురుతే పరమేష్ఠి నరాధిప చతుష్పాత్సకలో ధర్మః సత్మం చైవ కృతే యుగే

నాధర్మేణాగమః కశ్చిన్మనుష్యాణాం ప్రవర్తతే ఇతరేష్వాగమాస్తాత ధర్మశ్చ కురునందన

యాదృశాః పరిషీయంతే యథాహ భగవాన్మనుః చౌర్యాచ్చాప్యనృతాద్రాజన్ మాయాభిరమితద్యుతే

పాదేన హీయతే ధర్మస్త్రే తాదిషు యుగేషువై అరోగాస్సర్వ సిద్దార్థాశ్చతుర్వర్ష శతాయుషః

 కృతత్రేతాదిషు త్వేషాం వయో హ్రసతి పాదశః వేదోక్తమాయురాశీశ్చ మర్త్యానాం కురునందన

 కర్మణాంతు ఫలం తాత ఫలత్యనుయుగం సదా ప్రభావశ్చ తదాలోకే ఫలత్యేవ శరీరిణామ్

అన్యే కృతయుగే ధర్మాస్త్రేతాయాం ద్వాపరెపరే అన్యే కలియుగే నృణాం యుగధర్మాను రూపతః

తపఃపరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే ద్వాపర యజ్ఞమిత్యాహుః దానమేకం కలౌయుగే

తా ॥ ఓ రాజాధిపా! ఈప్రపంచ సృష్టిని బ్రహ్మ ఒక ఆటలాగా కొనసాగిస్తాడు. ధర్మంసమస్తం నాలుగు పాదములు కలదై ప్రవర్తిస్తుంది. అందు కృతయుగంలో సత్యమే సంపూర్ణంగా ఉంటుంది. ఏ శాస్త్రము కూడా అధర్మంగా ప్రవర్తింపుమని నిర్దేశింపదు. మనువు చెప్పినట్లుగా త్రేతాదియుగాలలో చౌర్య, అసత్యాల వలనను మాయ వల్లనూ ఒక్కొక్క పాదము చొప్పున ధర్మము నశిస్తుంది. కృతయుగంతో జనులు రోగములు లేని వారై సకల సిద్దులతో సంవత్సరాల సంపూర్ణాయుష్యం కలిగివుంటారు. ఇక త్రేతాది యుగాలలో ప్రజల ఆయుష్యం ఒక్కొక్క పాదం చొప్పున క్షీణిస్తుంది. ఓ కురునందనా! వేదాలలో చెప్పబడినట్లుగా మనుష్యుల ఆయురాశీస్సులు, కర్మ ఫలాలు ఆయా యుగానుసారంగా ఫలిస్తూ ఉంటాయి.

 యుగధర్మమును బట్టి కృతయుగ ధర్మాలు వేరు, త్రేతాయుగ ధర్మాలు వేరు. అట్లే ద్వాపర కలియుగ ధర్మాలును భిన్న భిన్న ములు. కృతయుగంలో తపస్సే శ్రేష్ఠంగా, త్రేతాయుగంలో జ్ఞానమే విశిష్టంగా, ద్వాపరంలో యజ్ఞం శ్రేష్ఠ కర్మగాను, కలియుగంలో దానం విశిష్ట కర్మగాను చేప్పెదరు.

సర్వస్య రాజన్ సర్గస్య గుప్త్యర్థంచ మహాద్యుతే ముఖబాహూరుపాదానాం పృథక్కర్మాణ్య కల్పయత్

అధ్యాపనమధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణానామ కల్పయత్  

ప్రజానాం పాలనం రాజన్ దాన మధ్యయనం తథా విషయేషు ప్రసక్తించ తథేజ్యాం క్షత్రియస్యతు

పశూనాం రక్షణం దానం ఇజ్వాధ్యయన మేవచ వణిక్పథం కుసీదంచ వైశ్యస్య కృషి రేవహి

ఏకమేవతు శూద్రస్య కర్మలోకే ప్రకీర్తితమ్ ఏతేషామేవ వర్ణానాం శుశ్రూషామను పూర్వశః

పురుషస్య సదాశ్రేష్ఠం నాభేరూర్ధ్వం నృపోత్తమ తస్మాదపి శుచితరం ముఖం తాత స్వయం భువః

తస్మాన్ముఖాద్ద్విజో జాత ఇతీయం వైదికశ్రుతిః సర్వస్యైవాస్య ధర్మస్య ధర్మతో బ్రాహ్మణః ప్రభుః

సంసృష్టో బ్రాహ్మణః పూర్వం తపస్తప్త్వా కురూద్వహ హవ్యానామివ కవ్యానాం సర్వస్యాపిచ గుప్తయే 

తా ॥ ఓ తేజశ్శాలీ? ఈసర్వసృష్టి రక్షణ కొరకై ఆ బ్రహ్మ తన ముఖ, బాహు, ఊరు, పాదాల నుండి జన్మించిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్గాల వారికి వేరువేరు కర్మలను ఏర్పరిచాడు. అధ్యాపనం, అధ్యయనం, యజ్ఞం చేయుట, యజ్ఞాన్ని చేయించుట, దానాన్ని గ్రహించుట అనే కర్మలు బ్రాహ్మణులకు విహితములు. ఓ రాజా! ప్రజాపాలనం, దానం, అధ్యయనం, ఇంద్రియ సౌఖ్యానుభనం, యజ్ఞాసక్తి మొదలైనవి క్షత్రియకర్మలు. పశురక్షణం దానం, యజ్ఞ నిర్వహణ, అధ్యయనం, వాణిజ్యం, అప్పివ్వడం, కృషి మొదలగునవి వైశ్య కర్మలు. పై మూడు వర్ణాల వారిని సేవించడమే శూద్రునకు కర్మగా లోకమున విశ్రుతమైయున్నది. ఓ రాజోత్తమా! ఆ విరాట్పురుషుని యొక్క నాభి పై భాగం (శరీర పూర్వార్థం) సదా శ్రేష్ఠం. దాని కంటేను అతని ముఖం మిక్కిలి శ్రేష్ఠం అని వేదమున వినబడుచున్నది. అట్టి సర్వ ధర్మమునకు బ్రాహ్మణుడే అధికారి. సర్వ హవ్యకవ్యముల రక్షణకై బ్రాహ్మణుడు మొట్టమొదట సృజింపబడినాడు.

అశ్నంతిచ ముఖేనాస్య హవ్యాని త్రిదివౌకసః కవ్యానిచైవ పితరః కిం భూతమధికం తతః  

భూతానాం ప్రాణినశ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినః బుద్ధిమత్సు నరా శ్రేష్ఠానరేషు బ్రాహ్మణాస్మృతాః

బ్రాహ్మణేషు చవిద్వాంసో విద్వత్సు కృతబుద్ధయః కృతబుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహ్మవేదినః

జన్మవిప్రస్య రాజేంద్ర ధర్మార్థమిహ కథ్యతే ఉత్పన్నః సర్వసిద్ధ్యర్థం యాతిబ్రహ్మసదోనృప

సచాపి జాయమానస్తు పృథివ్యామిహ జాయతే భూతానాం ప్రభవాయైవ ధర్మకోశస్య గుప్తయే

 సర్వం హిబ్రాహ్మణ స్యేదం త్కించిత్ పృథివీగతమ్ జన్మనాచోత్తమేనేదం సర్వం వై బ్రాహ్మణోర్హతి

స్వకీయం బ్రాహ్మణో భుంక్తే విదధాతిచ సువ్రత కరుణాం కుర్వతస్తస్య భుంజంతీ హేమరేజనాః

త్రయాణామిహ వర్ణానాం భావాభావాయపై ద్వీజః భవేద్రాజన్న సందేహస్తుష్టా భావాయవై ద్విజః

 తా ॥ బ్రాహ్మణుని ముఖం ద్వారా దేవతలు హవ్యాన్ని భుజిస్తారు. అతని ముఖం ద్వారానే పితృదేవతలు కవ్యాన్ని భుజిస్తారు. కావున బ్రాహ్మణుని కంటే మించిన ప్రాణి మరొకటి లేదు. సకల భూతములలో ప్రాణులు శ్రేష్టములు. అట్టి ప్రాణులలో బుద్ధియుత జీవులు శ్రేష్ఠములు. బుద్ధి కలిగిన జీవులలో మానవులు శ్రేషులు. అట్టి మానవులలో బ్రాహ్మణుడు చాలా శ్రేష్టుడు. బ్రాహ్మణులలో విద్వాంసుడైన వాడు శ్రేష్ఠుడు. విద్వాంసులైన బ్రాహ్మణులలో కర్తలు శ్రేష్ఠులు కర్తలలో బ్రహ్మజ్ఞానులైనవారు శ్రేష్ఠులు. కనుక ఓ రాజేంద్రా! ధర్మార్థముల కొరకే ఈ లోకాన విప్రుడు జన్మించాడు. సకల సిద్ధుల కొరకై జన్మనొందిన విప్రుడు బ్రహ్మపదాన్ని పొందగలడు!. సకల ప్రాణుల అభ్యుదయమునకు, ధర్మార్థముల రక్షణకు ఈ భూమి పై బ్రాహ్మణుడు జన్మించాడు. ఏ కొంచం ధర్మమైనా భూమిగతమై యున్న దన్నచో అది బ్రాహ్మణుని మూలంగానే కాన బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనది. ఈ పృథివియందున్న దంతయు బ్రాహ్మణునిదే అతడు సర్వమునకు అరుడు. బ్రాహ్మణుడు కర్మశీలిగా సత్కర్మాచరణంతో స్వకీయ ఫలాన్ని అనుభవిస్తాడు. అతని అనుగ్రహం వల్ల ఇతర వర్ణాల జనులు సత్ఫలసౌఖ్యాలను అనుభవిస్తారు పదాన ప్రకటన యెడల ద్విజుడు సంతసిపాడు. అట్టి పద్భ్యానం లోపించినచో.

అభావాయ భవేత్క్రుద్దస్త స్మాత్పూజ్యతమోహిసః బ్రాహ్మణే సతి నాన్యస్య ప్రభుత్వం విద్యతే నృప

కామాత్కరోత్యసౌ కర్మ కామగశ్చ నృపోత్తమ తస్మాత్ బృందారకపురీ తస్మాదపి మహఃపునః

మహర్లోకాజ్జనోలోకం బ్రహ్మలోకంచ గచ్ఛతి బ్రహ్మత్వం చ మహాబాహో యాతి విప్రోన సంశయః

శతానీక ఉవాచ :

బ్రహ్మత్వం నామ దుష్ప్రాపం బ్రహ్మలోకేషు సువ్రత బ్రహ్మత్వం కీదృశం విప్రో బ్రహ్మలోకంచ గచ్ఛతి

నామమాత్రోఽథ కిం విప్రో బ్రహ్మత్వం బ్రహ్మణస్సదా యాతి బ్రహ్మగుణాః కేస్యుః బ్రహ్మప్రాప్తౌమమోచ్యతామ్

 సుమంతురువాచ :

సాధుసాధుమహాబాహో శ్రుణుమే పరమం వచః యే ప్రోక్తా వేద శాస్త్రేషు సంస్కారా బ్రాహ్మణస్యలు

గర్భాధానాదయో యేచ సంస్కారాయస్య పార్థివ చత్వారింశత్త థాష్టౌచ నిర్వృత్తాశ్శాస్త్రతో నృప

సయాతి బ్రహ్మణస్స్థానం బ్రాహ్మణత్వం చ మానదం సంస్కారాస్సర్వథా హేతుః బ్రహ్మత్వే నాత్ర సంశయః 

తా ॥ ఓ రాజా! లోక కళ్యాణం కొరకై విప్రుడు సత్కర్మ చేస్తాడు కనుక అతడు స్వర్గమును పొంది అక్కడి నుండి మహార్లోకమును మహర్లోకం నుండి జనోలోకమును అక్కడి నుండి బ్రహ్మ లోకమును చేరగలడు. ఇట్లు బ్రాహ్మణుడు బ్రహ్మత్వమును పొందుటలో ఎట్టి సంశయమూ లేదు. అప్పుడు శతానీకుడిట్లు పలికెను. ఓ సువ్రతా! బ్రహ్మత్వం అనేది పొందశక్యం కానిది కదా! అలాంటి బ్రహ్మత్వాన్ని బ్రహ్మలోకాన్ని ఎలాంటి విప్రుడు పొందగలడు. విప్రుడు నామమాత్రంగా బ్రాహ్మణుడా? అతనికి బ్రహ్మకు సంబంధించిన బ్రహ్మత్వమేమిటి? బ్రహ్మప్రాప్తి విషయంలో అతనిని ఏ బ్రహ్మగుణాలు పొందుతాయో చెప్పుము. అప్పుడు సుమంతుడిట్లు పలికెను. ఓవీరుడా! చాలా బాగా అడిగితివి. విశిష్టమైన నా వచనమును వినుము. బ్రాహ్మణునకు వేద శాస్త్రములు విధించిన గర్భాదానాది నలుబది ఎనిమిది సంస్కారాలు శాస్త్ర ప్రకారంగా అతనికి నిర్వహింపబడినచో అతడు గౌరవప్రదమైన బ్రహ్మ స్థానమైన బ్రహ్మత్వమును పొందగలడు. బ్రహ్మత్వ ప్రాప్తి విషయంలో సంస్కారాలే హేతువులనడంలో ఎట్టి సందేహం లేదు .

శతానీక ఉవాచ :

సంస్కారః కేమతా బ్రహ్మన్ బ్రహ్మత్వే బ్రాహ్మణస్యతు శంసమే ద్విజశార్దూల కాతుకం హి మహన్మమ

 సుమంతురువాచ :

సాధుసాధు మహాబాహోశ్రుణుమే పరమం వచ: యే ప్రోక్తా వేద శాస్త్రేషు సంస్కారా బ్రాహ్మణస్యతు

మనీషిభిర్మహాబాహో శ్రుణు సర్వానశేషత:

 గర్భాధానం పుంసదనం సీమంతోన్నయనం తథా జాతకర్మాన్నాశనంచ చూడోపనయనం నృప

బ్రహ్మవ్రతాని చత్వారి స్నానం చ తదనంతరం సధర్మచారిణే యోగో యజ్ఞానాం కర్మ మానద

పంచానాం కార్యమిత్యాహు రాత్మన శ్శ్రేయసే నృప దేవపితృ మనుష్యాణాం భూతానాం బ్రహ్మణస్తథా

ఏతేషాం చాష్టకా కర్మ పార్వణం శ్రాద్ధమేవహి శ్రావణీ చాగ్రహాయణి చైత్రీ చాశ్వయుజీ తథా

పాకయజ్ఞాస్తథాసప్త అగ్న్యాధానంచ సత్క్రియాః అగ్నిహోత్రం తథారాజన్ దర్శంచ విధు సంక్షయే

పౌర్ణమాసంచ రాజేంద్ర చాతుర్మాస్యాని చాపిహి నిరూపణం పశువధం తధాసౌత్రామణీతి చ  

హవిర్యజ్ఞాస్తథా సప్త తేషాంచాపిహి సత్రియాః అగ్నిష్టోమోఽత్యగ్నిష్టోమస్తథోక్ష్య షోడశీం విదుః:

తా ॥ ఓ విప్రోత్తమా ! బ్రాహ్మణునకు బ్రహ్మత్వ కారకములైన సంస్కారాలేవియో వివరింపుమని శతానీకుడడుగగా సుమంతుడిట్లు చెప్పుచున్నాడు. వేద శాస్త్రములలో చెప్పబడిన బ్రాహ్మణ సంస్కారాలేవనగా - గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ అన్నప్రాశనము, చౌలము, ఉపనయనము, ప్రాజాపత్య సౌమ్యాగ్నేయ, వైశ్యదేవములను నాలుగు బ్రహ్మవ్రతాలు మరియు స్నాతకము గార్హస్థ్యము, అట్లే గృహస్థుడు తన శ్రేయమునకై చేయదగిన బ్రహ్మదేవ పితృ మనుష్య భూత యజ్ఞములను పంచయజ్ఞాలు, అట్లే, ఔపాసన వైశ్యదేవ పార్వణ అష్ట మాసశ్రాద్ధ సర్వబలి ఈశానబలులు అనుసప్త పాక యజ్ఞాలు, ఇంకనూ అగ్న్యాధాన అగ్నిహోత్ర దర్శపౌర్ణమస్య చాతుర్మాస్య నిరూఢపశుబంధన సౌత్రామణి, అను సప్తహవిర్యజ్ఞాలు, ఇక అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, ఉర్థ్య, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామములను సప్తసోమయజ్ఞములును చెప్పబడియున్నాయి.

వాజపేయోఽతిరాత్రశ్చ ఆప్తోర్యామేతివై స్మృత : సంస్కారేఘస్థితా స్సప్త సోమాఃకురుకులో ద్వహ

ఇత్యేతే ద్విజసంస్కారా : చత్వారింశన్నృపోత్తమ అష్టౌచాత్మగుణాస్తాత శ్రేణు తానపి భారత

అనసూయా దయా క్షాంతి రసాయాసం చమంగలం అకార్పణ్యం తథా శౌచమస్పృహా చ కురూద్వహ

య ఏతేష్టగుణాస్తాత కీర్త్యంతేవై మనీషిభిః ఏతేషాం లక్షణం వీర శ్రుణుసర్వమశేషత:

 న గుణాన్గుణినో హంతి నస్తౌత్యాత్మగుణా నది ప్రహృష్యతే నాన్యదోషై రనసూయా ప్రకీర్తితా

అపరే బంధువర్గేవా మిత్రే ద్వేష్టరివా సదా ఆత్మవద్వర్తనం యత్ స్వాత్సాదయా పరికీర్తితా

వాచా మనసి కాయేచ దఃఖేనోత్పాది తేన చ న కుప్యపి న చాప్రీతి సా క్షమా పరికీర్తితా

అభక్ష్య పరిహారశ్చ సంసర్గశ్చాపనిందితై : ఆచారే చ వ్యవస్థానం శౌచమేతత్ప్రకీర్తితమ్

తా ॥ ఓ భారత ! ఈ పై చెప్పినవి నలుబది బ్రాహ్మణ సంస్కారాలు. ఇక ఎనిమిది ఆత్మగుణాలున్నాయి. వానిని చెప్పెదను వినుము. అనసూయ, దయ, క్షమ, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, శౌచము, అస్పృహ అను ఎనిమిదింటిని ఆత్మగుణాలుగా విద్వాంసులు చెప్పెదరు. ఇక ఈ గుణాల లక్షణాలన్నింటిని వినుము. గుణవంతుని గుణాలను చెడుగా చెప్పకుండుట, తన గుణాలను పొగడుకొనకుండుట, ఇతరుల దోషాల యెడల హర్షింపకుండుట అనేది 'అనసూయ' అనే గుణంగా చెప్పబడును. తనవారియందు, పరవారియందు. మిత్రునియందు, శత్రువునందు తనయందువలే సద్భావం కలిగియుండుటయే దయ' అని అంటారు వాచికంగా, మానసికంగా, శారీరకంగా కష్టము సంభవించినపుడు కోపగింపకుండుట, దుఃఖింపకుండుటయే 'క్షమ' అని పిలువబడును. తినకూడని పదార్థాలను విసర్జించుట, సజ్జన సాంగత్యము, సదాచారమును పాటించుటను 'శాచ' మని అంటారు ,

శరీరం పీడ్యతేయేన శుభేనాపిచ కర్మణా అత్యంతం తత్ర కుర్వంతి అనాయాసస్స ఉచ్యతే

ప్రశస్తాచరణం నిత్యమ ప్రశస్త విసర్జనం ఏ తద్ధి మంగలం ప్రోక్తం మునిభిర్ర్బహ్మవాదిభిః

స్తోకాదపి ప్రదాతవ్య మదీనేనాంతరాత్మనా అహన్యహని యత్కించిదకార్పణ్యం తదుచ్యతే

 యథోత్పన్నేన సంతుష్ట స్స్వల్పే నాప్యధ వస్తునా అహింసయా పర స్వేషు సాస్పృహా పరికీర్తితా

వపుర్యస్యతు ఇత్యేతైస్సంస్కారైస్సంస్కృతం ద్విజై: బ్రహ్మత్వమిహ సంప్రాప్య బ్రహ్మలోకంచ గచ్ఛతి

వైదికైః కర్మభిః పుణ్యైర్నిషేకాద్యైర్ద్విజన్మనాం కార్యశ్శరీర సంస్కారః పావనః ప్రేత్యచేహచ

గర్భశుద్దిం తతఃప్రాప్య ధర్మంచాశ్రమ లక్షణం యాతిముక్తిం న సందేహః పురాణేఽ స్మిన్నృపోత్తమ

ఉశంతి కురుశార్దూల బ్రాహ్మణానాత్ర సంశయః (ఆశ్రితానాం విశేషిణ మే నిత్యం స్వస్తివాదిన :

నికట స్థాన్ద్విజాన్ హిత్వా యోఽన్యాన్ పూజయతి ద్విజాన్ సిద్ధం పాపం తదపమానాత్తద్వక్తుం నైవ శక్యతే

తా ॥ శుభకర్మచే శరీరము తపించుచున్ననూ భంగము లేకుండా శుభకర్మను కొనసాగించుటయే “అనాయాసమ”ని చెప్పబడును . ప్రశస్త కర్మను చేయడం, అప్రశస్త కర్మను విడచి పెట్టడాన్ని 'మంగళం'అని బ్రహ్మవాదులైన మునులు చెబుతారు . తనకున్న కొంచెము సంపదనుండియైనను ఎలాంటి దైన్య హృదయం లేకుండా నిరంతరం దానం చేయుటయే అకార్పణ్యము.పరులను బాధింపకుండా తనకు కలిగిన స్వల్పవస్తువుతోనైననూ సంతుష్టి చెందుటయే 'అస్పృహ'గా చెప్పబడును. ఇట్లు నలుబదిఎనిమిది సంస్కారాలచే బ్రాహ్మణ దేహం సంస్కరింపబడి బ్రహ్మత్వము నొంది బ్రహ్మలోకం చేరుకుంటుంది . ఇట్లు వైదికములైన పుణ్యకర్మలచేత, ప్రోక్షణాదులచేతనూ విప్రశరీరము ఇహలోకముననూ మరణానంతరం కూడా సంస్కరింపదగినది. పిదప గర్భశుద్దిని ఆశ్రమలక్షణ ధర్మములను పొంది ఈ పురాణమునందిచ్చగల బ్రాహ్మణులు ముక్తిని పొందుననుటలో సందేహం లేదు. ఓ కురుశ్రేష్టా! ఆశ్రయించిన వారికి స్వస్తి పలికే సమీపస్థులైన బ్రాహ్మణులను వదిలి పెట్టి ఇతరులను ఎవడైతే పూజిస్తాడో, అట్టి బ్రాహ్మణ అగౌరవం వల్ల వచ్చే పాపం చెప్పనలవి కానిది.

తస్మాత్సదా సమీపస్థస్సంపూజ్యో విధివన్నృప పూజయేదతిథీంస్తద్వ దన్నపానాది దానతః

 బ్రాహ్మణ స్సర్వవర్ణానాం జ్యేష్ఠశ్రేష్ఠ స్తథోత్తమః ఏవమస్మిన్ పురాణేతు సంస్కారాన్ బ్రాహ్మణస్యతు

శ్రుణోతి యశ్చ జానాతి యశ్చాపి పఠతే సదా బుద్ధిం వృద్ధిం తథా కీర్తిం ప్రా పేహ శ్రియము త్తమాం

ధనం ధాన్యం యశశ్చాపి పుత్రాన్ బంధూన్ సురూపతాం సావిత్రం లోకమాసాద్య బ్రహ్మలోకమవాప్నుయాత్

ఇతి శ్రీ భవిష్యపురాణే బ్రాహ్మేపర్వణి ద్వితీయోధ్యాయః.

తా ॥ అందువల్ల సమీపముననున్న బ్రాహ్మణుని అతిథిలను పూజించినట్లుగా అన్నపానాది దానములతో శాస్త్రప్రకారం పూజించాలి. బ్రాహ్మణుడు సర్వవర్ణాలలోకెల్లా అగ్రగణ్యుడు, శ్రేష్టుడు, ఉత్తముడు, ఇట్లు పురాణమున చెప్పబడిన విప్రసంస్కారములను ఎవడైతే వినునో, తెలిసికొనునో మరియు చదువునో, అతడు సమృద్ధిని, అభ్యుదయమును, కీర్తిని, ఉత్తమ సంపదను, ధన ధాన్యాలను, పుత్రమిత్రులను, మంచి రూపాన్ని సూర్యలోకాన్ని పొంది పిదప బ్రహ్మలోకాన్ని పొందుతాడు.

ఇది శ్రీ భవిష్య పురాణములోని బ్రాహ్మీపర్వమందలి ద్వితీయాధ్యాయము.