కూర్మ మహా పురాణము
29వ అధ్యాయము
వ్యాస మహర్షి చెప్పెను.
ఇట్లు సన్యాసాశ్రమములో నుండు పోరికీ భిక్షాటనముతోకాని ఫలమూలాదులతో కాని జీవనము విధించబడినది. ఒకేసారి భిక్షాటన గావించ వలయును. భిక్ష యందే ఆసక్తిని చూపరాదు. విస్తారము కూడా చేయరాదు. భిక్షయందు ఆసక్తి కలిగినచో విషయాసక్తి కూడా కలుగును. ఏడు ఇండ్లకే భిక్షకు వెళ్ళవలయును. ఆ ఇండ్లలో లభించనపుడు మరల వెళ్ళవలయును. పాత్రను నీటిలో కడిగి భుజించవలయును. లేదా ప్రతిదినము వేరొక పాత్రతో భిక్షాటన గావించి భుజించవలయును. బ్రతుకుటకు కావలసినంత మాత్రము తినుచు లోభమును విడిచి ఆ పాత్రను విసర్జించవలయును.
గృహస్థుల ఇండ్లలో పొగ రాకుండా ఉన్నపుడు, రోకలిచప్పుడు ఆగిన తరువాత, వంట నిప్పును చల్లార్చిన తరువాత, ఇంటివారు భుజించిన తరువాత, విస్తళ్ళు బయట పడిన తరువాత యతి భిక్షకు వెళ్ళ వలయును. ఇంటి ముందు ఆవుపాలు పితుకునంతసేపు మాత్రమే భిక్ష అని మాత్రము పలికి నిలువవలయును. పవిత్రుడై మౌనముగా భుజించవలయును. కాళ్ళు చేతులను కడుగుకోనీ ఆచమనము గావించి అన్నమును సూర్యునికి చూపి భుజించవలయును. తూర్పుముఖముగా భుజించవలయును. పంచప్రాణా హుతులను గావించు కొని ఎనిమిది ముద్దలను తినవలయును. ఆచమనము చేసి పరమేశ్వరుని ధ్యానించవలయును. అలాబుపాత్ర దాగుపాత్ర మృణ్మయము వేణుపాత్ర. ఈ సోలుగే యతికి పనికి వచ్చు పాత్రలు, సాయంకాలమున తెల్లవారు ఝామున మధ్యరాత్రి రెండు సంధ్యలలో విశేషించి పరమాత్మను ధ్యానించ వలయును.
తమస్సునకు ఆవలనున్న వానిని, సర్వ భూతాంతర్యామిని, సకలజగత్కారణ భూతుని, సకల ప్రపంచ స్వరూపుని, పరమాత్మను సర్వ జగత్తునకాధార భూతుని, సకలాధారములకు ఆనందము నిచ్చువానిని, అవ్యయ జ్యోతీ స్వరూపుని, ప్రకృతి జీవులకు అతీతుని, అగ్నిరూపుని మంగళకరుని, అన్ని భావములలో నుండు వానీని, అందరినీ శాసించు వానిని, బ్రహ్మ స్వరూపునీ, ఆద్యంత రహితుని, రెండవది లేనివానిని, ఆనందాది గుణ నిలయుని హృత్పద్మమున నిలిపీ ధ్యానించవలయును. అన్నిటికంటే గొప్పపోడు, సర్వోత్కృష్ణుడు, బ్రహ్మరూపుడు పరమ పురుషుడు సోశరహితుడు కృష్ణ అరుణ వర్ణాకారుడు మహేశుడు విశ్వరూపీ ఓంకారోపాసన తరువాత ఆత్మను పరమాత్మలో నిలిపి ఆకాశ మధ్యలో నుండు వానిని, ఆకాశమున ఈశ్వరుని క్రీడాలోలుని ధ్యానించవలయును. సకల భావములకు కారణభూతుడు ఆనందమునకు మాత్రమే ఆధారభూతుడు పురాణ పురుషుడగు శంభుని ధ్యానించి సంసార బంధము నుండి విడివడును.
లేదా జగత్సంమోహనాలయమగు ప్రకృతిలో సర్వభూతములకు ఏక కారణ భూతుడగు పరమాకాశరూపుని చింతించవలయును. సకల లోకములకు ప్రాణ భూతుని, సకల లోకములను తనలో లయము చేసుకొనువానీ, ఆనందరూపుని బ్రహ్మయొక్క సూక్ష్మరూపుని ముముక్షువులు మాత్రమే దర్శించగల వానిని, హృదయ మధ్యమున ఉన్నవానిని కేవల జ్ఞాన స్వరూపుని అంతరహితుని సత్యరూపునీ సకల జగదీశుని చింతించుచు నియమముతో కూర్చొనవలయును. సర్వ రహస్యములకు రహస్యముగా ఈ జ్ఞానము చెప్పబడినది. మహేశుడు చెప్పిన దీనిని అనుష్ఠించువాడు ఈశ్వరయోగమును అనుభవించగలడు.
కావున నిత్యము ఆత్మ విద్యాపరాయణుడై ధ్యాననిరతుడై జ్ఞాన స్వరూపుడగు బ్రహ్మోపాసన గావించవలయును. దానితో సంసార బంధము తొలగును. అన్నిటికంటే ఆత్మరూపుడగు తనను భిన్నునిగా తలచి ఆనందరూపుడు అజరుడు పరుడగు జ్ఞావరూపుని ధ్యానించవలయును. సకల ప్రపంచము సృజించు వానిని తన వద్దకు చేరిన వానీనీ మరల సంసారమునకు పంపని వానిని, ధ్యానించవలెను. అందువలన అందరికీ ఈశ్వరుడు దేవుడు పరము కంటే పరుడు, ఉన్నత స్థానమును అధిష్టించినవాడు శాశ్వతమగు శివము అవ్యయమగు గగనమును తనలో నిలుపుకోనీనవాడు ఈ సకల జగత్తును నియమించువారు ఎవరి అంశలుగా నున్నారో అతనే మహేశ్వరుడు. యతులకు విధించబడిన వ్రతములు ఉపవ్రతములలోను అతిక్రమించిన ప్రతిదానికి ప్రాయశ్చిత్తము వీధించబడినది. యతిగా ఉన్నవాడు స్త్రీ సంభోగము గావించినచో సావధానియై ప్రాణాయామము నాచరించి సొంతపన వ్రతము సాచరించవలయును. తరువాత ఏకాగ్ర మనస్కుడై కృచ్చ వ్రతము నాచరించవలయును. తరువాత ఆశ్రమమునకు వచ్చి తన సన్యాస వ్రతమును ఏమరుపాటు లేక ఆచరించవలయును.
ధర్మయుక్తమగు అనృతముతో పాపము రాదని విద్వాంసులు చెప్పేదరు అయిననూ అసత్యమునందు ఆసక్తిని కనబరచరాదు. అసత్య భాషణము పరమదారుణము. యతి అసత్యము పలికినచో ఒకరాత్రి ఉపవాసముండి నూరు ప్రాణాయామముల నాచరించవలయును. ఎంతటి ఆపదలో నున్ననూ ఇతర ప్రయోజనము నాశించి దొంగతనము చేయరాదు. దొంగతనమును మించిన అధర్మము లేదనీ స్మృతి చెప్పుచున్నది. ఇదియే అన్నిటికంటే గొప్ప హింసగా చెప్పబడినది. ఈ దొంగతనము ఆత్మజ్ఞానము నశింప చేయును.
ధనమనగా బహిశ్చరములగు ప్రాణములు. కావున ఎవని ధనమును హరించేనన్న అతని ప్రాణములు హరించుటే యగును. ఇట్లు దుస్స్వ భావుడగు యతి దొంగతనము గావించి ఆచారముల నుండి వ్రతము నుండి భ్రష్టుడగుచో ప్రతభంగమునకు పశ్చాత్తాపమును చెందినచో శాస్త్ర విధానోనుసారముగా ఒక సంవత్సరము చాంద్రాయణ వ్రతము నోచరించవలయును. తరువాత మరల తన వ్రతమును సావధానుడై కొనసాగిం చవలయును. ఒకవేళ ప్రతి అనగా సంన్యాసీ హింస జరిపినచో కృచ్చవ్రతము లేదా అతికృచ్చవ్రతమును లేనిచో చాంద్రాయణ వ్రతమును కాని ఆచరించవలయును. దుర్బల మనస్కుడగు యతికీ రూపవతియగు స్త్రీని చూచీ రేతస్లవము జరిగినచో మూడు రాత్రులు ఉపవాసముండ వలయును. నూరు ప్రాణాయామముల నాచరించవలయును. ఒకరి అన్నమునే తినిననూ మధు మాంసములను గోలిననూ, నవశ్రాద్ధ భోజనము చేసిననూ, ప్రత్యక్ష లవణమును భుజించిననూ ప్రాజాపత్య వ్రతము నాచరించవలయును. ఎప్పుడూ ధ్యానములో నుండు వానికి అన్ని పోపములు నశించును. కావున పరమాత్మను తెలిసి అతని ధ్యానములో నుండవలయును. పరబ్రహ్మ, పరంజ్యోతి, ప్రతిష్ట, అక్షరము, అద్వయము, అంతరాత్మ అతనే మహేశ్వరుడనీ తెలియవలయును. ఇతడే దేవుడు. మహాదేవుడు కేవలుడు పరమశివుడు. అక్షరరూపుడై అద్వైతము సూర్యునిలో నుండు పరమాత్మ జ్ఞానమును పేరు గల స్వప్రకాశముతో విరాజిల్లు చుండును. తన మహా ప్రకాశములో విరాజిల్లు చుండును కావున మహాదేవు డనబడును.
మహాదేవుని కంటే భిన్నుడగు మహాదేవుని తెలియనివాడు, మహాదేవునే తన ఆత్మగా తెలియువాడు పరమ పదమును పొందును. తన ఆత్మ పరమేశ్వరునికంటే భిన్నముగా తలచినవాడు మహాదేవుని చూడజాలడు. వారి పరిశ్రమ అంతయూ వ్యర్థమగును. పరబ్రహ్మ ఒక్కటే. అతనే అవ్యయ తత్త్వము ఆ తత్వమే మహాదేవుడు. ఇది తెలిసిన వానికి సంసార బంధముండదు. కావున యతి నిత్యము ఈ విషయమును తెలియుటకు ప్రయత్నించవలయును. జ్ఞానయోగాత్ముడు కావలయును. మహాదేవ పరాయణుడు కావలయును. ఓ బ్రాహ్మణోత్తములారా? ఇట్లు మీకు యత్యా శ్రమ ధర్మములను వివరించితిని పూర్వము ఈ ధర్మములను బ్రహ్మ మునులకు తెలిపెను. శుభకరము యతిధర్మాశ్రయమగు ఈ జ్ఞానమును శిష్యుడు కాని వానికి, పుత్రుడు కాని వానికి, యోగి కానీ వానికీ చెప్పరాదు. ఇట్లు చెప్పబడిన ఈ యతిధర్మ విధానము మహా దేవుని సంతోషమునకు ముఖ్య హేతువు. సావధానమున నియమమున వ్రతముల నాచరించువారు మరల పుట్టరు.
ఇది శ్రీ కూర్మ పురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 29వ అధ్యాయము.
Summary of chapter 82 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa initiates the section on expiation (Prāyashchitta), defining the gravity of various unrighteous actions and their karmic consequences. He categorizes major sins (Mahāpātakas), such as killing a Brāhmaṇa (Brahma-hatyā), drinking intoxicants (Surāpāna), theft of gold (Steya), and violating the Guru's bed (Gurutalpa-gamana), alongside association with such sinners, warning of their dire worldly and otherworldly results.