కూర్మ మహా పురాణము
6వ అధ్యాయము
ఈశ్వరుడు పలికెను-
ఓ ఋషులార. వేదవిదులు మాత్రమే తెలీయు పరమేశ్వరుని యధార్థమగు ప్రభావమును చెప్పెదను వినుడు.
నేనొక్కడిని అన్ని లోకములను సృజించువాడను. నేనొక్కడినే అన్ని లోకములను రక్షించుపొడను. నేనొక్కడినే సకల లోకములను సంహరించువాడను. నేను సర్వరూపుడను సనాతనుడను. నేను అన్ని వస్తువులకు అంతర్యామిని, జనకుడను. నాలోనే సకల వస్తువుల ఆదిమధ్యాం తములుండును. నాకు ఇతరమేదీ ఆధారముకాదు.
ఇపుడు మీరందరు చూచిన అద్భుతమగు నా విశ్వరూపము ఇది కేవలము. నాకు ప్రతీకగా నామాయతో చూపితిని. అన్ని వస్తువులకు అంతర్యామిగా నేనుందును. సో క్రియాశక్తియే సకల జగత్తును ప్రేరేపించును. ఈ సకల ప్రపంచమును నడిపించు, అనుసరింప చేయు కాలమును నేనే. నా అంశరూపమగు సకల జగత్తును నేనే ప్రేరేపించెదను.
ఈ సకల జగత్తును ఏకాంశతో సృజించెదను. అట్లే ఒకే అంశతో సంహరించేదను. ఇట్లు సృష్టి సంహారావస్థలు రెండూ నావే. నేను ఆదీ మధ్యాంతములు లేనివాడను. మాయాతత్త్వమును ప్రవర్తింపచేయు నేను. సృష్టి ప్రారంభమున ప్రకృతి పురుషులను క్షోభింప చేయుదును. (ప్రేరేపించెదను) ఇట్లు పరస్పరము ప్రకృతి పురుషుల సంయోగము వలన ప్రపంచము పుట్టును. ప్రకృతి సుండీ మహత్తత్వము, మహత్తత్త్వము నుండి అహంకారము ఇట్లు ఈ క్రమముననుసరించి సో తేజస్సే జగద్రూపముగా విస్తరించును. సర్వజగత్తునకు సాక్షిభూతుడు కాలచక్ర ప్రవర్తకుడు హిరణ్య గరుడగు మార్తాండుడు (సూర్యుడు) కూడా నా దేహమునుండి పుట్టినవాడే.
కల్పాదియందు ఆసూర్యభగవానునకు నాదివ్యమగునది సనాతనమగు జ్ఞానయోగమును నానుండి వెలువడిన నాలుగు వేదములను కూడా ఇచ్చితిని. ఇట్లు ఆహిరణ్య గర్భుడు ఎపుడు నాదేవ్యైశ్వరమును ధరించి యుండును. సౌభావముతో ప్రేరేపింపబడి చతుర్ముఖుడై సకల లోకములను సృజించును. సకలలోకములను సృజించి సమంపచేయువాడు అనస్తుడగు నారాయణుడు కూడా సో పరమమూర్తియే సకల లోకములను పాలించుచుండును.
సకల ప్రాణులను అంతము చేయు కాలస్వరూపుడగు రుద్రుడు నా ఆజ్ఞతోనే లోకములను సంహరింప చేయును, అగ్నిహోత్రుడు కూడా నా ఆజ్ఞతోనే హవ్యమును దేవతలకు, కవ్యమును పితృదేవతలకు అందచేయును. అన్నింటిని పక్వము చేయును. రాత్రింబవళ్ళు ప్రాణులు భుజించు ఆహారమును వైశ్వానర నామముతో జీర్ణము చేయును. సకల జలములకు మూలకారణమగు వరుణుడు కూడా ఈశ్వరుని ఆజ్ఞవలననే సకల జగత్తును జీవింపచేయుచున్నోడు. అఖిల ప్రాణులకు లోపల వెలుపల ఉండి శరీరములను నా ఆజ్ఞతోనే వాయువు నిలుపును. మానవులను బ్రతికించు వాడు దేవతలకు అమృతము నిచ్చుపోడగు చంద్రుడు నా ఆజ్ఞతో ప్రేరేపించబడిగే ప్రవర్తించుచున్నాడు.
తనకాంతితో అన్నివైపులా ప్రకాశింప చేయుచు వర్షమును అందించు సూర్య భగవానుడుకూడా నా ఆజ్ఞతోనే ప్రవర్తించుచున్నాడు. మూడు లోకములను పాలించు సకల దేవతాధీపతియగు ఇంద్రుడు నా ఆజ్ఞతోనే యజ్ఞము చేయువారికి ఫలమునిచ్చుచున్నాడు. “పాపులను శాసించుయముడు కూడా నా ఆజ్ఞనే పాలించుచున్నాడు”. సర్వధనాధ్య క్షుడగు కుబేరుడు ఈశ్వరుని ఆజ్ఞతోనే అందరికి ధనము నొసంగుచున్నాడు, సకల రాక్షసాధిపతి, తమోగుణులకు ఫలప్రదుడగు నిర్ ఋతీకూడా నా ఆజ్ఞనే పాలించుచున్నాడు.
భూత భేతాలులకు అధిపతి భక్తులకు భోగరూపమగు ఫలములను ప్రదానము చేయు ఈశానదేవుడు కూడా నా ఆజ్ఞతో ప్రవర్తించును, అంగీరసుని శిష్యుడు రుద్రుని గణములలో అగ్రగణ్యుడగు యోగిరక్షకుడగు వామదేవుడు కూడా నా ఆజ్ఞతోనే వ్యవహరించును, విఘ్నకారకుడు సర్వ జగత్పూజ్యుడగు వినాయకుడు కూడా నా ఆజ్ఞతో ధర్మమును కాపాడుచున్నాడు. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు దేవ సేనాపతియగు కుమారస్వామి కూడా విధిచేత ప్రేరేపించబడిగే ప్రవర్తించుచున్నాడు. ప్రజాపతులగు మరీచ్యాది మహర్సులు కూడా పరమాత్మ ఆజ్ఞతోనే పలులోకములను సృజించుచున్నారు.
శ్రీ మన్నారాయణుని పతియగు శ్రీదేవి అన్ని ప్రాణులకు పుష్కలమగు సంపదనిచ్చునది నా అనుగ్రహముతోనే ప్రవర్తించుచున్నది. సకల జీవులకు విస్తృతముగా చెక్కును ప్రసాదించు సరస్వతీ కూడా ఈశ్వరాజ్ఞచే ప్రేరేపించబడీయే ప్రవర్తించుచున్నది. సకల జీవులను హోరనరకము నుండి తరింపచేయు సావిత్రీదేవి కూడా దేవుని ఆజ్ఞను పాలించునదే. పరమదేవి బ్రహ్మవిద్యా ప్రదాయిని యగు పార్వతీదేవి అఖిల జనులచే ధ్యానించబడునదీ నావచనమునను సరించునదే.
అఖిల మహిమలు కలవాడు సకల దేవతలకు అధిపతి ఆదిశేషుడు కూడా దేవుని ఆజ్ఞచే అఖిల లోకములను శిరసుతో ధరించుచున్నాడు.
ప్రలయాగ్ని బడబాగ్ని రూపములో నున్న అగ్నికూడా ఈశ్వరాజ్ఞచేతనే సకల సముద్రజలమును త్రాగుచుండును. ఈ లోకమున సుప్రసిద్ధ తేజశ్శాలుగు పదునాలుగు మంది మనువులు కూడ ఈశ్వరాజ్ఞచేతనే ప్రజలందరినీ పాలించుచున్నారు. ద్వాదశాదిత్యులు అష్టవసువులు ఏకాదశరుద్రులు సప్తమరుత్తులు అశ్వినీ దేవతలు ఇతర దేవతలందరూ సో ఆజ్ఞతోనే ప్రవర్తించుచున్నారు. గరుడ గంధర్వ ఋక్ష సిద్ధసాధ్య చారణ యక్షరాక్షస పిశాచములు కూడా స్వయంభూ శాసనమున నిలచువారే. కళాకాష్ట్ర ముహూర్త నిమేష దిన రాత్రీ ఋతు పక్షమాసములన్నీ ప్రజాపతీ శాసనముననే ప్రవర్తించుచున్నవి.
యుగములు మన్వంతరములు నాఆజ్ఞలోనే నిలుచుచున్నవి. పరపరార్థములు అట్లే ఇతరకాలభేదములు జరాయుజ అండజ స్వేదజ ఉద్బీజ్జములను నాలుగు విధములగు ప్రాణులు స్థావర జంగమములు పరమాత్మ యాజ్ఞతోనే ప్రవర్తించుచున్నవి. పొలాది సకలలోకములు అఖిల బ్రహ్మాండములు స్వయంభూ శాసనములోనే నిలుచుచున్నవి. అఖిల పదార్థములతో కూడియున్న అతీత బ్రహ్మాండములు కూడా సా ఆజ్ఞతోనే ప్రవర్తించుచున్నవి. సృజించబోవు బ్రహ్మాండములు కూడా తనలోనుండు సకల వస్తువులతో పరమాత్మ ఆజ్ఞను శిరసా వహించుచున్నవి.
భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనసు బుద్ధి తామసాహంకారము ఆది ప్రకృతి ఇవన్నియూ నా ఆజ్ఞలోనే ప్రవర్తించుచున్నవి. సకల జగత్కారణము, సర్వ ప్రాణులను మోహింపచేయు మాయకూడో ఎల్లప్పుడూ ఈశ్వరాజ్ఞతో ప్రవర్తించును. దేహధారులకు ఆత్మ స్వరూపుడు పరాత్పరుడు పురుషుడు దేవునిగా వ్యవహరించబడువాడు కూడా నిత్యము ఈశ్వరాజ్ఞతోనే కార్యములను నిర్వహించుచుండును. సకల మోహమును తొలగించే పరమపదమును చూపు విద్యకూడో పరమేశ్వరుని ఆజ్ఞానువర్తినిగానే యుండును. ఇంతలో చెప్పనేల. ఈ జగత్తంతయూ నా శక్తి స్వరూపమే. నా చేతనే ప్రేరేపించబడును. సోలోనే లీనమగును.
నేను భగవంతుడను. ఈశ్వరుడను స్వయంప్రకాశరూపుడను. సనాతనుడను. పరమాత్మను, పరబ్రహ్మను నాకంటే భిన్నము మరియొకటి లేదు. ఇట్లు ఈ పరమజ్ఞానమును మీకు తెలిపితిని. దీనిని తెలిసినవాడు జన్మసంసార బంధమునుండి విముక్తి పొందును.
ఇది షట్సాహప్రియగు కూర్మ పురాణమున ఉత్తరవిభాగమున (ఈశ్వరగీతలో) 6వ అధ్యాయము.
Summary of chapter 59 of the Kūrma Mahā Purana is as follows:
Bhagavān Mahādeva describes His divine sovereignty over all cosmic managers, revealing that every deity and elemental force functions strictly under His supreme ordinance. The Sun God Vivasvān shines, the Moon God Soma bestows nectar, Vāyu blows, Varuṇa regulates waters, Indra governs the heavens, and Yama administers justice solely by the cosmic command of Parameshvara. Furthermore, great progenitors such as Brahmā, Preserver Nārāyaṇa, the Rudras, the Saptarshis, and the fourteen Manus fulfill their respective cosmic roles in obedience to His divine will, demonstrating that the entire cosmos is an expression of His supreme Shakti.