కూర్మ మహా పురాణము
9వ అధ్యాయము
ఋషులు పలికిరి.
తాము పరమేశ్వరులు, నిష్కలులు, నిర్మలులు, నీత్యులు, నిషీయులు అయినపుడు తాము విశ్వరూపులెట్లగుదురు? ఈ విషయమును మాకు వివరించుడు.
ఈశ్వరుడు పలికెను.
బ్రాహ్మణోత్తములారా నేను విశ్వమును కాను. నేను లేక విశ్వము కూడా లేదు. ఇదంతయూ మాయా నిమిత్తముతో జరుగుచున్నది. ఆ మాయ కూడా ఆత్మను ఆశ్రయించి యుండును. ఆద్యంతము లేని మాయ శక్తి రూపము. అవ్యక్తమును ఆశ్రయించి యుండును. మాయా నీమిత్తముగా అవ్యక్తము నుండి ప్రపంచము పుట్టినది. అ వ్యక్తము కారణముగా చెప్పబడుచున్నది. నేను ఆనంద స్వరూపుడను, జ్యోతి స్వరూపుడను, అక్షరుడను. (నాశనము లేనివాడను) నేనే పరబ్రహ్మను. నా కంటే భిన్నమైనది. మరియొకటి లేదు. కావున నేను విశ్వరూపుడనని బ్రహ్మ వాదులు నీశ్చయించిరి. ఒకటి అనేక రూపుడనుటకు ఇదియే నిదర్శనము. అనగా పరివర్తన చెందిన ప్రపంచమును చూచిన పరమాత్మ అనేకరూపుడు. వాస్తవముగా ఏకరూపుడు. అని అభిప్రాయము నేను ఆ పరబ్రహ్మను. పరమాత్మను సనాతనుడను. నాకు ఏ కారణము లేదు కావున నాలో ఎలాంటి దోషమూ లేదు. అనగా ఈ జగత్తులో వైషమ్యము క్రూరత మొదలగు దోషములకు కారణము జీవులా చరించు కర్మలే కానీ ఈశ్వరుడు కాడు. ఈశ్వరుడు సాధారణ కారణము కావున దోష రహితుడు. అని అభిప్రాయము.
అవ్యక్తము నందు మాయాద్య నస్త శక్తులు ధ్రువములున్నవి. ఆ అవ్యక్తము మాత్రము ఒంటీగా శబ్ద తన్మాత్రము నందు నిలిచి యుండును. ఈ అవ్యక్తమే మాయలలో బహురూపములుగా భిన్నముగా కనపడును. కానీ స్వభావముగా ఇది అభిన్నమే. దానికి మూలమగు ఒకే పరమ శక్తితో ఆద్యస్తములు లేని ధ్రువమగు నా సాయుజ్యమును పొందును. మరొక శక్తితో ఐశ్వర్యము కలుగును. మరొక శక్తితో ఆ ఐశ్వర్యము లోపించును. ఆది మధ్యములు లేని పురుషుడు అవిద్యతో కూడి యుండును. ప్రభా మండలముతో కూడి పరమ వ్యక్తము, అక్షరము, పరంజ్యోతి స్వరూపమగునది శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదము. అచటనే ఈ సకల జగత్తు కూర్చబడియున్నది. అదియే సకల జగత్తు. ఆ పరమ. పదమును తెలిసినచో ముక్తి లభించును.
దానినీ పొందలేక వాక్కులు మనసుతో కూడా మరలివచ్చును. అట్టి ఆనంద స్వరూపుడను పరబ్రహ్మను తెలిసినవాడు ఎక్కడ ఎటువంటి భయమును పొందడు. తమోగుణమునకు అతీతుడు సూర్య సమాన వర్ణుడగు మహా పురుషుని నేను తెలియుదును. ఆ పురుషుని తెలిసి సంసార బంధము నుండి విడివడును. బ్రహ్మమయుడై నిత్యానంద స్వరూపుడగును.
ఇతనికంటే విడిగా పరాపరములు లేక ద్యులోకమున నుండు సకల జ్యోతులకు ఇది యొక్కటియే ప్రకాశకము. దానినే ఆత్మగా తలచు జ్ఞానీ నిత్యానంద స్వరూపుడు బ్రహ్మమయుడగును. బ్రహ్మ విష్ణులగు బ్రాహ్మణులు దానిని ఆవ్యయమని, సూక్ష్మరూపమని, రహస్య స్వరూపము కలదని, బ్రహ్మానంద భూతమని, అమృత స్వరూపమని సకల ప్రపంచమునకు నివాస భూతమని అందురు. ఇచటికి చేరినపోరు మరల ఈ సంసారమునకు రారు.
హిరణ్మయమగు పరమాకాశతత్త్వమున తేజస్సువలె భాసించు తేజమును ధీరజనులు (ఆత్మజ్ఞులు) విజ్ఞానమున ప్రకాశించు పరిశుద్ధమగు పరమ వ్యోమమును పరమధామమునుగా చూచెదరు. తరువాత ధీరులు ఆత్మలో ఆత్మాను భవమును సాగించుచు పరమతత్త్వమును దర్శించుకోన గలుగుదురు. ఆత్మతత్త్వము స్వయం ప్రకాశము, పరమేష్ఠి, చాలా గొప్పదన బ్రహ్మానంద స్వరూపము, భగపోనుడు, ఈశ్వరుడు ఈ రూపమున నుండు నని తెలియును.
అన్ని ప్రాణులలో అంతరాత్మ సర్వవ్యాపి ఒకే దేవుడు దాగి యుండును. అట్టి అద్వితీయ పరమాత్మ తత్త్వమును సాక్షాత్కరించుకోనగలవారు మాత్రమే శాశ్వత శాంతిని పొందగలరు. ఇతరులు పొందజాలరు. ఆ పురుషుడు అన్నివైపుల శిరములు ముఖములు కంఠములు కలవాడు అన్ని ప్రాణులలో అంతర్యామిగా నుండుపాడు అంతటా వ్యాపించియుండువాడు. భగవంతుడు. అతనికంటే ఇతరము ఏదీ లేదు. ఓ ముని పుంగవులారో మీకు పరమేశ్వర జ్ఞానమును బోధించితిని. ఈ జ్ఞానము యోగులకు కూడా సులభముగా లభించదు, కావున భద్రముగా దాచుకోన వలయును.
ఇది షట్సాహస్ర సంహితయగు కూర్మపురాణమున ఉత్తర విభాగమున ఈశ్వర గీతలో 9వ అధ్యాయము.
Summary of chapter 62 of the Kūrma Mahā Purana is as follows:
Bhagavān Śiva clarifies the mystery of how He remains absolute, changeless, and non-dual while appearing as the manifold universe through the lens of Māyā. He describes the supreme abode of Purushottama Vishṇu as a realm of pure self-effulgent light beyond the reach of darkness, where the entire universe is woven like threads in a tapestry. Those who realize this unmanifest, blissful Parabrahma through steady contemplation transcend all fears, dissolve their individual egoism, and achieve eternal union with the Supreme.