కూర్మ మహా పురాణము
25వ అధ్యాయము
వ్యాస మహర్షి చెప్పెను.
గృహస్థాశ్రమ వాసి యగుద్విజుని పరమ ధర్మములను వివరించితిని. ఇపుడు పారి వృత్తులను తెలిపేదను వినుడు.
గృహస్థాశ్రమ వాసి సాధకుడని అసాధకుడని రెండు విధములు. అందులో సాధకునికి అధ్యాపనము యజ్ఞము చేయించుట దానము తీసుకొనుట ఇవి జీవితవృత్తులు. తాను చేయక ఇతరుల ద్వారా కృషి వాణిజ్యములను చేయించవచ్చును. కృషి లేనపుడు పొణిజ్యము పాణిజ్యము లేనపుడు కుసీదముతో (వడ్డీవ్యాపారము) జీవించ వచ్చును. ఇవి ఆపత్కాలమున చెప్పబడినవి మాత్రమే. ముఖ్యమైనవి అధ్యాపన యాజనాదులు మాత్రమే. ఆపత్కాలములో స్వయముగా కూడా కృషి వాణిజ్యము కుసీదము (వడ్డీ వ్యాపారము) చేయవచ్చును. కాని కుసీదవృత్తి అత్యంత కష్ట కరము. పాప వృత్తి కావున దానిని పరిత్యజించవలయును. బ్రాహ్మణునికి కృషి కంటే క్షత్రియవృత్తి ఉత్తమముగా చెప్పబడినది. బ్రాహ్మణులకు స్వయముగా వ్యవసాయము చేయరాదు. కావున బ్రాహ్మణులు ఆపదలో క్షాత్ర వృత్తిలో జీవించవలయుసు. కాని వ్యవసాయము చేయరాదు. శస్త్ర వృత్తిలో కూడా జీవించజాలనపుడు కృషీ రూపమగు వైశ్య వృత్తిని స్వీకరించవలయును. అయిననూ ఎట్టి పరిస్థితులలోను బ్రాహ్మణుడు భూమిని దున్నరాదు. ఇతర వృత్తిలో, లాభమును పొందినపుడు పితరులను దేవతలను బ్రాహ్మణులను పూజించవలయును. దానితో తృప్తి పొందినవారు. అతని దోషమును తొలగించగలరు. దేవతలకు పితరులకు 20వ భాగమును బ్రాహ్మణులకు రెండు రెట్ల భాగమును ఇచ్చినచో కృషి దోషము నశించును. వాణిజ్యము చేయువారు వ్యవసాయము శాతము కంటే రెండురెట్లు, వడ్డీ వ్యాపారము పోరు మూడు రెట్లు సమర్పించినచో ఆ దోషము లంటవు.
సాధకుడగు గృహస్థుడు శిలోంఛమును కాని ఇతరములగు విద్యాశిల్పములను కానీ వృత్తి కొరకు స్వీకరించవచ్చును. పశుపక్షులకు కూడా అధికారములేని ఒక్కొక్క ధాన్యకణమును ప్రతిదినము చేతివేళ్ళతో ఏరు కొని ఒక చోట చేర్చి వాటితో జీవించుట ఉంఛవృత్తి అందురు. ధాన్య సమూహము గుత్తులను కూడా ఒక చోట చేర్చి జీవించినచో శిల వృత్తి అందురు. వాటిలో మొదటిది ఉత్తమము.
గృహస్థాశ్రమములో నున్న అసాధకునికి వృత్తి కొరకు శిల ఉంఛ అను రెండు వృత్తులు చెప్పబడినవి. అమృతముతో కాని మృతముతో కాని జీవించవలయును. అయాచితమును అమృతమని యాచనమును మృతమని అందురు. బ్రాహ్మణుడు మూడు సంవత్సరముల వరకు సరిపడ సంపాదించి ఉంచుకోనీనపోడు లేదా ఒక సంవత్సరము వరకు కావలసిన దానిని సంపాదించినవాడుగా కాని, మూడు రోజులకు సరీ పడు దానిని దాచుకోనీన వాడుగా కానీ, రేపటికి కూడా లేనివానీలో కాని ఉండవచ్చును. ఈ నాలుగింటిలో మొదటి దానీకన్నా తరువాతది తరువాతది శ్రేష్టమని చెప్పబడినది. తనవద్ద ఎక్కువ భృత్య వర్గము కలవాడు షట్కర్మలతో, ఋత, అయాచిత, భైక్ష, కృషి, వాణిజ్య కుసీద అనువాటితో జీవించవచ్చును. తక్కువ భృత్యజనముకలవారు యాజన అధ్యాపన పరిగ్రహణములతో జీవించవచ్చును. ఇంకొందరు అనగా మరీ తక్కువ భృత్య జనము కలవారు యాజన అధ్యాపనములతో, ఇంకొందరు కేవలము అధ్యాపకముతో మాత్రమే జీవించవచ్చును.
శిలోంఛలతో జీవించుచు అగ్నిహోత్ర పరాయణుడై దర్శపూర్ణమాఫీయ ఇష్టులను జరుపుచుండవలయును. బ్రాహ్మణుడు జీవిక కొరకు లోక వృత్తిని (హాస పరిహాసాదులతో) ప్రవర్తించరాదు. కపటము దంభము లేని పరిశుద్ధ జీవనమును నడుపవలయును.
సత్పురుషులను అన్నమును యాచించి ఐననూ దేవతలను పితృ దేవతలను సంతోషింప చేయవలయును. పవిత్రుని ఇంద్రియ నిగ్రహశీలుని యాచించవచ్చును కాని ధానిని తాను అనుభవించరాదు. ద్రవ్యార్జనము చేసిన గృహస్థుడు దేవతలను పితృదేవతలను యధావిధిగా సంతోషింప చేయనిచో కుక్కగా పుట్టును. ధర్మ అర్థ కామ మోక్షములను పురుషార్ధములు నాలుగు. బ్రాహ్మణులకు ధర్మమునకు విరుద్ధము కానీ కామమే యుండవలయును. ఇతర కామము ఉండరాదు. ధర్మము కొరకు ఉపయోగించబడే అర్థమే అర్థమగును. తన కొరకుపయోగించబడుచో అది అర్థము కాదు. అనర్థమగును. కావున అర్థమును సంపాదించి దానము చేయవలయును యజ్ఞము చేయవలయును. పూజించవలయును.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 25వ అధ్యాయము.
Summary of chapter 78 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa expounds the sacred duties of women (Pativratā Dharma), highlighting devotion, chastity, and loving service toward the husband as the ultimate spiritual path for a woman. He describes how a virtuous wife who honors her husband, serves her in-laws, manages household rites righteously, and maintains modesty shares half of her husband's merit and ascends with him to celestial realms.