కూర్మ మహా పురాణము
11 - దేవ్యవతారము
కూర్మస్వామి చెప్పెను:
దేవదేవుడైన బ్రహ్మ ఈ విధముగా మరీచి మొదలగు వారిని సృష్టించి, తన మానస పుత్రులతో కూడ కలిసి గొప్ప తపస్సు నాచరించెను.
తపము చేయుచున్న ఆ బ్రహ్మముఖము నుండి, ప్రళయకాలపు అగ్నికి కారణభూతుడు, చేతియందు త్రిశూలము కలవాడు, మూడు కన్నులు కల ఈశానుడైన రుద్రుడు పుట్టెను (2) ।అతడు సగము పురుషుడు, సగము స్త్రీ రూపము కలవాడై చూచుటకు శక్యము కొని భయంకర రూపుడై ఉండెను. నీ స్వరూపము ను విభజించుము” అని పలికి బ్రహ్మ కూడా భయము వలన అంతర్థానము చెందెను.
ఆ విధముగా చెప్పబడిన రుద్రుడు తన రూపమును స్త్రీపురుష రూపాలతో విభజించెను. మరల పురుష రూపమును పదకొండు భేదములు కల దానినిగా చేసెను.
ఈ పదకొండు మంది రుద్రులని చెప్పబడుదురు. ఓ బ్రాహ్మణులారా! కపాలి, ఈశుడు మొదలైన ఆ రుద్రులు ముల్లోకములకు ప్రభువులుగా ఆయా దేవకార్యములందు నియమింపబడిరి ప్రభువైన ఆ శివుడు తన రూపములోని స్త్రీ భాగమును కూడా సాధు, అసాధు, శాంతము, అశాంతము అనే లక్షణాలతో, నల్లని, తెల్లని స్వరూపాలతో అనేక విధముల భిన్నముగా చేసెను.
బ్రాహ్మణులారా! ఆ స్త్రీ రూపొలు శక్తి రూపాలైన విభూతులుగా లోకములో ప్రసిద్ధములు. అవి లక్ష్మి మొదలగు శక్తి రూపములు. - శంకరుని స్త్రీతత్త్వము ఏ శరీరముతో ప్రవంచమును వ్యాపించి యున్నదో అది విభూతి రూపమైనది.
విప్రులారా! ఆ ఈశ్వరి మరల తనను విభజించుకోని భాగములు చేసెను. మహాదేవుని ఆ దేశముతో బ్రహ్మదేవుని వద్దకు వచ్చెను. (8) భగవంతుడగు బ్రహ్మ, నీవు దక్షుని పుత్రికవు కమ్మని ఆమెతో అనెను. ఆమె కూడ బ్రహ్మ సూచన ప్రకారము దక్ష పుత్రికగా జన్మించెను.
ఇతిశ్రీకూర్మపురాణే దేవ్యవతారే ఏకాదశోధ్యాయః - ॥
ఆ దక్షుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారము తన పుత్రిక అగు సతీదేవిని రుద్రునికి భార్యగా ఇచ్చేను. శూలధారియైన రుద్రుడు దక్షపుత్రిని తన దానినిగా స్వీకరించెను.
బ్రహ్మ యొక్క ఆజ్ఞ వలన కొంతకాలము తరువాత పరమశివుని భార్య తనను శంకరుని నుండి మరల విభజించుకొని
హిమమంతుని వలన అతని భార్య యగు మేన యందు పార్వతిగా జన్మించినది. ఆ పర్వతరాజు. తన కూతురైన పార్వతిని రుద్రునికి ఇచ్చి వివాహము జరిపెను.
భూసురులారా! సమస్త దేవతల యొక్క ముల్లోకముల యొక్క తనయొక్క మేలు కొరకు హిమమంతుడట్లు చేసినాడు. అటువంటి మహేశ్వరుని భార్య, శంకరుని సగము శరీరము ధరించినది అయినదేవి యీమే.
మంగళరూప, సాధ్వి, హిమవంతుని పుత్రి, దేవదానవుల చే నమస్కరింపబడునది మే. సాటి లేని ఆమె గొప్పతనమును ఇంద్రునితో గూడ దేవతలందరు;
మునులు కూడా ప్రశంసింతురు – “ఆ ప్రభావమును శంకరుడే స్వయముగా తెలియును. లేదా నారాయణుడెరుగును” అని - బ్రహ్మ పద్మభవుడగుట, శివుడు బ్రహ్మ కుమారుడగుట అను విషయము మీకు తెలుపబడినది.
శ్రీ కూర్మపురాణములో ఏకాదశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 11 of the Kūrma Mahā Purana is as follows:
Brahmā performed rigorous Tapas, causing the manifestation of Nīlalohita Ishāna Rudra from his mouth, possessing a form half-male and half-female. At Brahmā's request, Rudra divided His body into male and female aspects, expanding the male half into the eleven Ekādaśa Rudras to govern cosmic functions. The female half expanded into various glorious Shaktis including Lakshmī and other divine powers that permeate the cosmos. Under Brahmā's instructions, this divine Supreme Goddess incarnated as Satī, the daughter of Daksha Prajāpati, and wedded Mahādeva. Following the events of Daksha's sacrifice, Satī relinquished Her body and re-incarnated as Parvatī, the daughter of King Himavān and Queen Menā. Himavān joyfully gave his daughter Parvatī in marriage to Parameshvara Śiva for the welfare of the three worlds, fulfilling the eternal cosmic divine union of Shakti and Śiva.