కూర్మ మహా పురాణము
24వ అధ్యాయము
వ్యాస మహర్షి చెప్పెను
బ్రాహ్మణులు ఎల్లకాలము ప్రతిదినము ప్రాతః సాయంకాలములలో అగ్నిహోత్రము నాచరించవలయును, పక్షాంతమున అమావాస్య పౌర్ణములలో దర్శేష్టి పొర్ణమా సేష్టులను చేయవలయును. పైరు కోసినపుడు నవ సస్యేష్టి, ఋతువు చివరిలో చేయవలసిన యజ్ఞమును చేయ వలయును. అయనము చివరిలో పశువుతో, సంవత్సరము చివరలో సౌమిక యాగము చేయవలయును. చాలా కాలము జీవించ కోరిక గలవారు నవ సస్యేష్టినికాని పశు ఇష్టినికాని చేయని అగ్నిహోత్రి కొత్త అన్నమును కాని మాంసమును కానీ భుజించరాదు. నవాన్నములో నవ పశుహవ్యములో, యజ్ఞము చేయక నవాన్నమును మాంసమును భుజించువారు తమ ప్రాణములనే తాము తినదలచుచున్నారని తెలియవలయును. పర్వములలో సావిత్రములను శాంతి హోమమును ఎపుడూ ఆచరించవలయును. అష్టకములలో పితరులను పూజించుచు అన్వష్టకములలోనూ అర్చించు చుండవలయును.
ఇట్లాచరించుట పరమధర్మము చేయకుండుట అపధర్మము. గృహస్థాశ్రమములో నుండు త్రైనర్జీకులకు నాస్తిక్య బుద్ధితో కానీ బద్దకము (సోమరితనముతో) తోకని అగ్న్యాధానము చేయనిచో యజ్ఞము నాచరించనిచో బహు నరకముల పాలగును. తొమిస్రము అంథమీసము, మహా గౌరవ గౌరవములు, కుంభీపాకము, వైతరణి అసిపత్ర వనము ఇంకా ఇతర నరకములను చాలా వాటిని పొందెదరు. అంత్యజులుగా శూద్రులుగా జన్మింతురు. కావున విశ్లేషించి బ్రాహ్మణులు సర్వప్రయత్నముతో అగ్న్యాధానము గావించి పరమాత్మను ఆరాధించవలయును. ద్విజులకు అగ్ని హోత్రమును మించిన ధర్మము లేదు. కావున నిత్యము పరమాత్మను అగ్ని హోత్రముతో ఆరాధించవలయును. అగ్న్యా ధనము చేసి సోమరి తనముతో దేవు నారాధించనిపోరు పరమమూడులు. అట్టి వారితో సంభాషించరాదు. అతడు నాస్తికుడే యగును.
కుటుంబమును సేవకులను మూడు సంవత్సరములు పోషించగల భోజన సామాగ్రి కలపోడు సోమయాగమును చేయతగును. అన్ని యజ్ఞములలో సోమయాగము అత్యంత శ్రేష్ఠము, సోమ లోకముననున్న మహేశ్వరుని సోమయాగముతో ఆరాధించవలయును. మహేశ్వరుని అరాధించుటలో సోమయాగమును మించినది కాని సమానమగునది అని లేదు. కావున సోమయాగముతో ఆరాధించవలయును. బ్రహ్మ మొదట బ్రాహ్మణులకు ఇట్లు చెప్పెను. మోక్షము కొరకు ఆచరించు ధర్మము శ్రాతమని స్మార్తమని రెండు విధములు. ఆహవనీయ దక్షిణాగ్ని గార పత్యరూప అగ్ని, త్రయములో శ్రాత ధర్మముండును. స్మార్తధర్మమును ఇది వరకే చెప్పితిని. రెంటిలో అత్యంత శ్రేయము నిచ్చునదీ త్రైత ధర్మము. కావున శ్రోత ధర్మమునే ఆచరించవలయును. రెండు ధర్మములు వేదము నుండీయే వచ్చినవి. శ్రాత స్మార్త ధర్మములు. తెలియనపుడు మూడవ ధర్మము శిష్టాచారము. రామాయణ మహాభారత పురాణాదీ గ్రంథ సహిత వేదములలో చెప్పబడిన ధర్మము తెలిసిన వారు అహింస సత్యము దయాది ఆత్మ గుణములు కలవారు శిష్టులనబడుదురు. వారు అంతఃకరణ పూర్వకముగా చెప్పినది వారికి సమ్మతమైనది మాత్రమే ధర్మము. ఇతరుల అభిమతము ధర్మము కాజాలదు. ఇది నిశ్చయము.
పురాణములు ధర్మశాస్త్రములు వేదమును వ్యాఖ్యానించినవి. పురాణముల వలస బ్రహ్మజ్ఞానము ధర్మ శాస్త్రముల వలన ధర్మజ్ఞానము బోధించబడుచున్నది. ధర్మములను తెలియదలచిన వారికి ధర్మశాస్త్రము పరమప్రమాణము. బ్రహ్మ జ్ఞానమున పురాణము పరమ ప్రమాణము. వేదమున కంటే ఇతరములో ధర్మ బ్రహ్మ విద్యల జ్ఞానము కలుగజాలదు. కావున ద్విజులు పురాణ ధర్మ శాస్త్రములందు చక్కని శ్రద్ధ కలిగి యుండ వలయును.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 24వ అధ్యాయము
Summary of chapter 77 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa details the specific methods for purifying various physical materials that become subtly polluted. He prescribes water, ash, earth, fire, and sunshine for cleansing metals, wooden vessels, stone implements, textiles, grains, and living spaces. Vyāsa highlights that physical cleanliness combined with Vedic Mantras restores full ceremonial purity to all household articles.