కూర్మ మహా పురాణము
2వ అధ్యాయము
ఈశ్వరుడు చెప్పెను :
నాకు సంబంధించిన సనాతనమైన యీ విజ్ఞానము మాటలతో చెప్పుట శక్యము కానిది. ఓ బ్రాహ్మణులారా దానిని దేవతలు కూడ ప్రయత్నించినప్పటికి తెలిసికొసజాలరు.
ఈ జ్ఞానమును సంపాదించి బ్రాహ్మీభూతులైన బ్రాహ్మణోత్తములు, పూర్వులైన బ్రహ్మవాదులు కూడ మరల సంసారమును పొందరు.
రహస్యములకంటె మిక్కిలి రహస్యమైనది, ప్రయత్నపూర్వకముగా దాచదగినది. అగు ఈ తత్త్వమును భక్తియుక్తులు, బ్రహ్మ వాదులు నైన మీకు నేడు చెప్పగలను.
ఈ ఆత్మకేవలము శుద్ధము, నిర్మలము, సూక్ష్మము, సనాతనము కూడ. జ్ఞానమాత్రమై, అంధకారమున కతీతమై, సాక్షాత్తుగా అన్నిటి అంతర్భాగమున వ్యాపించి యున్నది.
ఆ ఆత్మ అంతర్యామి, పురుషరూపి, ప్రాణము, మహేశ్వరుడు, కాలరూపుడు, అవ్యక్తము, వేదనామకము అనీశ్రుతి చెప్పుచున్నది.
ఈయాత్మనుండీ ప్రపంచము జనించును. దీనిలోనే లయమునొందును. మాయామయుడైన ఆపురుషుడు మాయచేతబద్దుడై వివిధ శరీరములను సృజించును.
ఈతడు సంసారములో చిక్కుకోనడు. సంసారమయుడు కూడకాడు. ఇతడు భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము అనువానిలో ఏ ఒక్కటి కూడ కాడు.
ఈ పురుషుడు ప్రాణరూపుడు కాడు. మనస్సు, అవ్యక్తము, శబ్దము, స్పర్శము కూడ కాడు. రూపరసగంధములు కాడు. అట్టి నేను కర్తను కొను, వాక్కును కూడ కాను.
విప్రవర్యులారా పాపాదములు కాను, గుదస్థానము, యోని కానీ కాను. కర్తను కొని భోక్తను కానీ నేను కాను. ప్రకృతీ పురుషరూపుడను కాను.
యథార్థముగా నేను మాయను కాను, ప్రాణములు కాను. ఎట్లైతే వెలుగు చీకట్లకు సంబంధము సమన్వయము కాదో అదే విధముగా ప్రపంచపరమాత్మల సంబంధముఐక్యముకాదు. లోకములో ఎండ,నీడ ఎట్లు పరస్పరవిభిన్నములో,
దానివలెనే ప్రకృతిపురుషులు కూడ హాస్తవముగా భిన్నులు. అట్లే మలినమైన ఆత్మ జీవుడుగా స్వరూపంతో వికారము కలపోడుగు ఉండును.
అట్టివానికి వందలకొలది జన్మలచేత గూడ మోక్షం లభించదు. ముక్తులైన మునులు పరమార్థమైన ఆత్మ సాక్షాత్కారమును పొందుతారు.
ఉత్తర - ద్వితీయాధ్యాయము ఆ ఆత్మ వికారరహితము, ద్వంద్వములు లేనిది, ఆనందరూపము, నాశరహితము అయినది. నేను కర్తను, సుఖదుఃఖములు కలవాడను, బక్క వాడను, లావైన వాడను అని ఏబుద్ధికలదో, అది అహంకారజన్యము, దానీని జనులు ఆత్మయందారోపించుకొని ప్రవర్తింతురు.
వేదపండితులు ఆత్మను ప్రకృతికతీతమైనదిగా, సాక్షిభూతమని, భోక్త, జ్ఞానరూపము, అక్షరాత్మకము, అంతట వ్యాపించినది అని చెప్పుదురు. కావున ప్రాణుల యొక్క సంసార బంధము అజ్ఞానమూలకమే.
ప్రకృతితో సంబంధించి మూలతత్త్వాన్నీ, నిత్యము ఉదయము కలదాన్నీ అజ్ఞానమువలన, వీపరీత జ్ఞానమువలన, అహంకార జన్యమైన అవివేకముతో తెలిసికొనలేక నేను కర్తనని జీవుడు అనుకుంటాడు. పరతత్త్వమైన పురుషుడు అన్నీటిని వ్యాపించిన స్వయంప్రకాశజ్యోతి రూపుడు. ఋషులు, సత్, ఆసద్రూపమైన అవ్యక్తతత్త్వాన్ని ఎల్లప్పుడు దర్శింతురు.
బ్రహ్మవాదులైన వారు ప్రధాన పురుషుణ్ణి కారణముగా తెలిసికొని అట్లు చూడగలరు. కూటస్థము, నిర్వికారము అయినప్పటికీ ఆపరతత్వముతో ఆత్మ సంబంధము పొంది తనను వస్తుతః అక్షరమైన బ్రహ్మముగా తెలిసికొనలేరు. ఆత్మకాని దాని యందాత్మ భావమువలన సుఖదుఃఖాలు కల్గుతున్నవి.
రాగము, ద్వేషము మొదలైన దోషాలన్నీ భ్రాంతిమూలకాలైనవి. పుణ్యపాపరూపములైన కర్మలే జీవునికి పెద్దదోషము.
ఆ కర్మలవలననే జీవులందరికి అన్నిరకాల శరీరాలు కలుగుతున్నవి. కూటస్థుడైన పరమపురుషుడు గుహ్యస్వరూపుడు, ఎల్లప్పుడు అంతటా దోషరహితుడుగా ఉండును.
ఆ పురుషుడు కేవలుడుగా తనశక్తితో స్వభావసిద్ధముగా నిలిచి ఉండును. మాయతో సహజస్థితికాదు. అందువలన మునులు అద్వైత తత్త్వమునే పరమార్థమని చెప్పుతారు.
అవ్యక్తరూపమూలతత్త్వముతో భేదములేదు. మాయజీవుని ఆశ్రయించి ఉంటుంది. పొగతో సంబంధము వలన ఆకాశము మలినము కానట్లు అంతః కరణములో పుట్టిన కామక్రోధాది వికారములచేత ఆత్మ మలినము కాదు. స్పటీకశిల ఏవిధముగా తన కాంతితో ప్రకాశిస్తుందో, (24, 25) అట్లే ఉపాధి శూన్యమైన నిర్మలమైన ఆత్మకూడ ప్రకాశిస్తుంది. వివేకులైనవారు ఈ ప్రపంచాన్ని జ్ఞాన స్వరూపముగానే చెప్పుదురు. సరియైన దృష్టిలేని ఇతరులు దీని సగము స్వరూపాన్ని మాత్రం చూస్తారు. కూటస్థపురుషుడు సహజముగా నిర్గుణుడు, చైతన్యరూపుడు, వ్యాపకుడు అయి ఉన్నాడు. జ్ఞానదృష్టికల పురుషులచేత, స్ఫటికము ఉపాధివశమున జనులకు రక్తవర్ణముగా కనబడినట్లు అర్థరూపముతో దర్శింపబడును.
అదేవిధముగా పరమపురుషుడు జ్ఞానులకుగూడ అర్థ స్వరూపముతో భాసించును. అందువలన ఆత్మ అక్షరము, శుద్ధము, నిత్యము, నాశరహితము, అంతట నిండినదీ. (29)
మోక్షకాములైన వారిచేత పరమాత్మ సేవింపదగును, ఆలోచింపదగును, వినదగియుండును. ఎప్పుడైతే, మనస్సులో చైతన్యము వెలుగు చుండునో, అంతట ఎల్లప్పుడు శ్రవణాదులు చేయవలెను. శ్రద్దకలిగియున్న యోగికి అప్పుడు స్వయముగా సిద్ధి లభిస్తుంది. ఎప్పుడు సమస్త భూతాలను తనయందే దర్శించునో, సమస్త భూతములందు తనను దర్శించునో అప్పుడు బ్రహ్మసాయుజ్యము కలుగుతుంది.
ధ్యానసమాధియందు సర్వభూతాలను దర్శింపనిచో, పరతత్త్వముతో ఏకీభావమునొంది కేవలరూపాన్ని పొందుతాడు. ఇతని మనస్సులో ఉన్న కోరికలన్నీ ఎప్పుడు విడిచిపోవునో, అప్పుడతడు అమృతభావాన్ని పొంది జ్ఞానియైశుభాన్ని పొందుతాడు. ఎప్పుడు ప్రాణులకంటే భేదభావమును, ఏక స్థితమును దర్శించునో
అప్పుడే అతడు విస్తృతమైన బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఎప్పుడైతే ఆత్మ స్వరూపాన్ని కేవలముగో పరమార్థరూపంగా తెలుసుకుంటాడో, అప్పుడు మాయామయమైన సమస్త ప్రపంచము నిర్వృతిని పొందుతుంది. ఎప్పుడు జనన, వార్థక్య, వ్యాధీదుఃఖాలకు ముభ్యౌషధమైన కేవల బ్రహ్మతత్త్వదర్శనము కలుగుతుందో అప్పుడతడు సదాశివుడవుతాడు.
లోకంలో నదీనదాలు ఏవిధంగా సముద్రముతో “ఏకత్వాన్ని పొందునో, అట్లే ఆత్మనిష్కలమైన అక్షరపర బ్రహ్మముతో అభేదాన్ని పొందుతుంది. అందువలన విజ్ఞానమొక్కటే సత్యము. ప్రపంచముకానీ, స్థితీ కానీ లేదు. ప్రపంచంలో విజ్ఞానము అజ్ఞానముచే కప్పబడి మోహాన్ని పొందుతుంది. విజ్ఞానము సహజంగా నిర్మలము, సూక్ష్మము, వికల్ప శూన్యము, నాశరహితమైనది.
దానికి భిన్నమైన దంతా అజ్ఞానమే. ఈ సాంఖ్య తత్త్వము, శ్రేష్టమైనది. ప్రాచీనులచేత చెప్పబడినది, మీకు నాచేత వివరింపబడింది.
ఆ విషయములో ఏకాగ్రత సర్వవేదాంతసారమైన యోగము. యోగమువలన జ్ఞానము కలుగును. జ్ఞానమువలన యోగము ప్రవర్తించును యోగజ్ఞానములతో కూడియున్నవానికి సౌందరానిది ఏదియు ఎక్కడ కూడ ఉండదు. యోగులు దేనిని పొందుదురో, అది సాంఖ్యులచే పొందబడును.
సాంఖ్యము, యోగము రెంటిని ఒకటిగా ఎవడు చూచునో వాడు తత్త్వము నెరిగినవాడు. ఇతర యోగులు ఐశ్వర్యము నందాసక్తి కలవారుగా తెలియవలెను.
ఇతరులైన అల్పబుద్ధికలవారు అచ్చటచ్చటనే మునుగుచుందురు. ఏది అమలము, దీవ్యము, గొప్పది అగు ఐశ్వర్యము కలదో, అది సర్వసమ్మతమైనది.
దానిని జ్ఞానయోగనిష్టుడు శరీరాంతకాలములో పొందగలడు. ఆత్మస్వరూపుడనైన యీ నేను అవ్యక్తుడను, మాయావియైన పరమేశ్వరుడను.
అన్నీవేదములయందు కీర్తింప బడినవాడు, సర్వాత్మకుడు, అంతట ముఖములు కలవాడు, సర్వరూపుడు, సర్వరసుడు, సమస్త గంధములు కలవాడు, జరామరణములు లేనివాడు.
అన్నివైపుల హస్తపాదములు కలనేను, అంతర్యామినీ, సనాతనుడను, పాణిపాదములు లేనివాడను, వేగముగా వెళ్లువాడను, గ్రహించువాడను, హృదయమందుండువాడను.
నేత్రములు లేకున్నను చూచు చున్నాను, చెవులులేకున్నను వినువాడను, సమస్తమును నేను తెలిసికొందును, నన్నెవడును తెలియజాలడు,
తత్త్వమును గ్రహించినవారు నన్ను ఒక్కని మహాపురుషుడని చెప్పుదురు. సూక్ష్మదర్శినియైన ఆత్మకు కారణభూతునిగా నన్ను ఋషులు చూచుచున్నారు.
గుణరహితమైన నిర్మలరూపముకల పరమపురుషుని యొక్క సర్వశ్రేష్టమైన ఏ ఐశ్వర్యము కలదో, దేనినైతే దేవతలు కూడ నానుయచేత మోహితులై తెలియలేరో,
ఓ బ్రహ్మవాదులగు మునులారా దానినిగూర్చి మీకు చెప్పుదును మీరు సావధానులై వినుడు. సహజముగా మాయకు అతీతుడనైననేను ప్రశస్తుడనై ప్రేరేపించుటలేదు. అయినప్పటికి పండితులైన వారు కారణముగా గుర్తింతురు. తత్త్వవేత్తలయినవారు మిక్కిలి రహస్యమైన, సర్వగతమైన శరీరమును దేనివలన ప్రవేశించిన యోగులు నాసాయుజ్యమును పొందుదురో, విశ్వరూపిణియైన సౌమాయను ఎవరు అతిక్రమింతురో, వారుశుద్ధమైన శ్రేష్ఠమైన మోక్షపదవిని చేరి నాతో కలియుదురు. మరల వారికీ కోటికల్పముల వరకైనా పునరావృత్తిలేదు.
యోగీశ్వరులారా నా అనుగ్రహము వలన ఈ వేదమార్గోపదేశమును బ్రహ్మవాదులచే పుత్రులకు, శిష్యులకు, యోగులకు ఈయదగును. ఇది నాచేత చెప్పబడిన యోగసంబంధిసాంఖ్య విజ్ఞానము.
కూర్మపురాణము ఉత్తరార్ధము ద్వితీయాధ్యాయము సమాప్తము.
Summary of chapter 55 of the Kūrma Mahā Purana is as follows:
Bhagavān Mahādeva reveals the eternal, unblemished nature of Ātman as pure consciousness, untouched by the modifications of Prakṛti, yet appearing bound due to the illusions of Ahankāra and Avidyā. The Supreme Ishvara explains that Jīva experiences worldly pleasure and pain through identification with the physical body and past karmic impressions, whereas enlightened Yogins perceive Ātman as the non-dual, self-effulgent witness of all existence. Through Sāṁkhya wisdom and single-minded devotion, spiritual seekers transcend the influence of Tāmasa and Rājasa Ahankāra, recognizing that all names and forms are projected by unmanifest Māyā. When the mind becomes completely serene and free from desires, the seeker realizes eternal unity with Parabrahma, attaining Jīvanmukti and absolute freedom from the endless cycle of rebirth.