కూర్మ మహా పురాణము
7వ అధ్యాయము
ఈశ్వరుడు పలికెను.
ఓ ఋషులారా పరమాత్మ ప్రభావమును మీరందరూ వీనుడు. దీనినీ తెలిసిన పురుషుడు మరల సంసారమున పడడు. పరములలో కెల్ల పరము బ్రహ్మ శాశ్వతము, నిష్కలము, ధ్రువము నిత్యానందము నిర్వికల్పము అయినదే సాధామము. నేను బ్రహ్మ జ్ఞానులలో బ్రహ్మను చతుర్ముఖుడగు స్వయంభువును, మాయావులలో పురాణుడు అవ్యయుడగు హరినినేను. యోగులలో శంభుడను. స్త్రీలలో పార్వతీదేవిని ఆదిత్యులలో నేను విష్ణువును. వసువులలోపావకుడను. ఎగిరే పక్షులలో గరుడుడను. గజేంద్రులలో ఐరావతమును శస్త్రధారులలో రాముడను.
ఋషులలో వసిష్టుడను దేవతలలో ఇంద్రుడను శిల్పులలో విశ్వకర్మను, దైత్యులలో ప్రహ్లాదుడను. ముసులలో వ్యాసుడను. గణములలో వినాయకుడను. వీరులలో వీరభద్రుడను. సిద్దులలో కపిలమునిని. పర్వతములలో మేరువును. నక్షత్రములలో చంద్రుడను. ఆయుధములలో వజ్రాయుధమును వ్రతములలో సత్యవ్రతమును, భోగులలో నేను అనంతుడను. సేనాపతులలో కుమారస్వామిని ఆశ్రమములలో గృహస్థాశ్రమమును ఈశ్వరులలో మహేశ్వరుడను కల్పములలో నేను మహాకల్పమును యుగములలో కృతయుగమును యక్షులలో కుబేరుడను గణేశ్వరులలో వీరకుడను.
ప్రజాపతులలో దక్షుడను. రాక్షసులలో నిర్ఋతిని. బలవంతులలో వాయువును. ద్వీపములలో పుష్కర ద్వీపమును, మృగరాజులలో సింహమును, యంత్రములలో ధనువును” వేదములలో సామవేదమును, యజుర్మంత్రములలో శతరుద్రీయమును. మంత్రములలో సావిత్రి మంత్రమును. రహస్యములలో ప్రణవమును. సూక్తములో పురుషసూక్తమును సొమములలో జ్యేష్ఠసామమును వేదార్థ విదులలో స్వాయంభువ మనువును. దేశములలో బ్రహ్మావర్తమును, క్షేత్రములలో అవిముక్తకమును. విద్యలలో ఆత్మవిద్యను. జ్ఞానములలో పరమేశ్వర జ్ఞానమును పంచభూతములలో ఆకాశమును సత్త్వములలో మృత్యువును.
పాశములలో మాయాపాశమును, మాయాపాశమును సంహారించు వారలలో కాలమును, ఉత్తమ గతులలో ముక్తినీ ఉత్తములలో పరమేశ్వరుడను ఈ లోకమున అధిక తేజశ్శాలి బలిశాలి అయిన సత్వమంతయు నాతేజో విజృంభితముగా తెలియుము. సంసారములో నుండు ఆత్మలన్నియు పశువులుగా చెప్పబడినవి. పోరికి పతిని కావున నన్ను పండితులు పశుపతి యందురు. ఈ పశువులనన్నిటినీ సాలీలలో మాయాపొశముతో బంధించేదను. వేద విదులు ఈ పశువుల బంధమును విడిపించువాడను నేననీయే చెప్పుచుందురు. మాయా పాశ బద్దులను వీడిపించుటకు భూతాధిపతినీ, పరమాత్మను అయిన నేను తప్ప ఇతరులు లేరు.
చతుర్వింశతి తత్త్వములు మాయ కర్మ గుణములు. ఇవి పశుపతికి పాశములు. జీవులకు కలుగు క్లేశములు. ఇవియే పశుబంధనములు, మనసు బుద్ధి అహంకారము ఆకాశము పోయువు అగ్ని జలము భూమి ఈ అష్ట ప్రకృతులు ఇతర పదార్థ వికారములు. శ్రోత్రము త్వక్ చక్షువు జిహ్వా ఘ్రాణము అనునవి అయిదు జ్ఞానేంద్రియములు, పాయు ఉపస్థ కర పాద వాక్కులు అనునవి అయిదు కర్మేంద్రియములు శబ్ద స్పర్శ, రూప రస గంధములు అయిదు విషయములు. ఇట్లు ఇవీ 23 ప్రకృతి వలన ఏర్పడిన తత్త్వములు. 24వ తత్త్వము అ వ్యక్తము లేదా ప్రధానమందురు. ఈ అవ్యక్తము గుణ సహితము. ఇదియే ఆది మధ్యాంతములు లేనిది. జగత్తునకు పరమ కారణము. సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు గుణములందురు. ఈ మూటి సామ్యావస్థ అవ్యక్తము ప్రకృతీయని అందురు. సత్త్వము జ్ఞానము, తమస్సు అజ్ఞానము, రజస్సు మిశ్రమము అని చెప్పబడినవి. బుద్దీ వైషమ్యము వలన గుణ వైషమ్యము కలుగునని పండితులు చెప్పెదరు.
బంధము పేరుతో ధర్మా ధర్మములనునవి రెండు పాశములు, నా యందు అర్పించబడిన కర్మములు బంధ విముక్తిని ప్రసాదించును. అ విద్య, అస్మిత రాగద్వేష అభినివేశ క్లేశములనునవి చాలా కాలము నిలుచునవి బంధించు పొశములుగా చెప్పబడినవి. ఈ పాశములకు కారణము మాయ. అవ్యక్తము మూల ప్రకృతి యను శక్తి నా యందు ఉండును.
ఈ మూల ప్రకృతి ప్రధానము పురుషుడు, మహత్తత్త్వము, అహంకారము మొదలగు వీకారములన్నియు. దేవదేవుడగు సనాతనుని స్వరూపములే. సనాతన పురుషుడే బంధము. బంధనము చేయువాడు అతడే. పశువులు అతనే పాశము అతడే. అతనికి అన్నీ తెలియును. అతనిని తెలియువారెవ్వరూ లేరు. ఇతడే ఆది పురుషుడు పురాణ పురుషుడుగా చెప్పబడును. ఇది షట్సాహసీయను కూర్మపురాణమున ఉత్తర విభాగమున 7వ అధ్యాయము.
Summary of chapter 60 of the Kūrma Mahā Purana is as follows:
Bhagavān Śiva elaborates on His divine omnipresence, listing His supreme manifestations among all categories of creation, such as Vishṇu among Ādityas, Shankara among Rudras, Meru among mountains, and the Veda among scriptures. He explains the nature of twenty-four Tattvas comprising the material universe, defining all bound Jīvas as Pashus trapped in the strong ropes of Avidyā, Karma, and Māyā. Bhagavān reveals that He alone is the eternal Pashupati who breaks these sturdy cosmic ropes for devotees who surrender to Him with pure hearts, conferring eternal Mukti.