కూర్మ మహా పురాణము
53 - అధ్యాయము
ద్వాపరయుగములో వేదవ్యాసుని అవతారములు చెప్పబడినవి మంచి నియమముకల విప్రులారా కలియుగమునందలి మహాదేవుని అవతారములను గూర్చి విసుడు.
మొదటి కలియుగమునందు, దేవదేవుడు, గొప్పకాంతి కలపోడు నగు మహాదేవుడు వైవస్వతమన్వంతరములో శ్వేతుడను పేరుతో బ్రాహ్మణుల పోతము కొరకవతరించెను.
మనోహరమైన హిమాలయ శిఖరమునందు, సమస్తమైన ఆ పర్వతశ్రేష్ఠమునందు, అమితమైన తేజస్సుకల ఆవ్యాసుని శిష్యులు ప్రశిష్యులు కూడ నీపసించియుండిరి.
శ్వేతుడు, శ్వేతశిఖుడు, శ్వేతాస్యుడు, శ్వేతలోహితుడు అను నలుగురు మహాత్ములగు బ్రాహ్మణులు వారిలో వేదమును పూర్తిగా అధ్యయనము చేసిరి
సుతారుడు, మదనుడు, సుహెరాత్రుడు, కణకణుడు, లోకాక్షి, యోగీంద్రుడు, జైగీషవ్యుడు అను ఏడుగురు; క్రమముగా మొదటి నుండి ఏడుయుగములలో నుండిరి.
ఎనిమిదవ యుగములో దధివాహుడు, తొమ్మిదవ దానిలో ఋషభుడు, భృగువు దశమ యుగములో, తరువాత ఉగ్రుడు, పండ్రెండవ యుగమున అతి సమాఖ్యాతుడు, పదుమూడవ కలియుగములో బాలీ, పదునాలుగవ యుగములో గౌతముడు, తరువాతి యుగములో వేదదర్శి అను అవతారములు కలిగెను.
తరువాత గోకర్ణుడు, అనంతరము శీఖండమును ధరించిన గుహావాసుడు, పిమ్మట యజమాలి, అట్టహాసుడు, దొరుకుడు, లాంగలి, మహాయాముడు, ముని, శూలి, డిండముండీశ్వరుడు, సహిష్ణువు, సోమశర్మ, మరియు నకులీశ్వరుడును క్రమముగా మహాదేవుని కలియుగావతారములుగా తెలియవలెను.
వారిలో నలుగురు మిక్కిలి తపోధనులు దేవాధిదేవునకు శిష్యులుగా ఏర్పడిరి. మునిశ్రేష్ఠులారా ఇతరులకు గూడ ప్రత్యేకముగా శిష్యులు కలరు. వారిని గూర్చి తెలుపుదును.
నిర్మలమైన మనస్సుకలపోరు, ఇంద్రియనిగ్రహము కలవారు, ఈశ్వర విషయకభక్తి నాశ్రయించినవారు. వరుసగా యోగులు, యోగము తెలిసిన వారిలో శ్రేష్ఠులైన వారిని గూర్చి తెలుపగలను.
దుందుభి, శతరూపుడు, ఋచీకుడు, కేతుమంతుడు, విశోకుడు, వికేశుడు, విశాఖుడు మరియు శాపనాశనుడు, సుముఖుడు, దుర్ముఖుడు, దుర్గముడు, దురతిక్రముడు, సనకుడు, సనాతనుడు, సనందనుడు, దాలభ్యుడు అను గొప్పయోగి, వీరందరు గొప్ప శక్తికల మహాత్ములు. సుధాముడు, విరజసుడు, శంఖవాజీ, అజుడు, సారస్వతుడు, అమోఘుడు, ధనవాహుడు, సువాహనుడు, కపిలుడు, ఆసురీ, వెూడువు, పంచశీఖుడనుముని, పశరుడు, గర్గుడు, భార్గవుడు మరియు అంగీరసుడు, చలబంధువు, నిరామిత్రుడు, కేతు శ్భంగుడనువాడు, మునులారా వీరందరు శిష్యవర్గములోనివారు.
లంబోదరుడు, లంబుడు, విక్రోశుడు, లంబకుడు, శుకుడు, సర్వజ్ఞుడు, సమబుద్ధి, సాధ్యాసాధ్యుడు, సుధాముడు, కాశ్యపుడు, వసిష్ఠుడు, విరజుడు, అత్రి, ఉగ్రుడు మరియు శ్రవణుడు, సువైద్యకుడు, కుడి, కుణిబాహువు, కుశరీరుడు, కునేత్రకుడు, కశ్యపుడు, ఉశనసుడు, చ్యవనుడు మరియు బృహస్పతి, ఉచ్చాస్యుడు, వామదేవుడు, మహాకాలుడు, మహానిలి, పొజస్రవసుడు, సుకేశుడు, శ్యావాశ్వుడు, సుపథీశ్వరుడు, హిరణ్యనాభుడు, కౌశిల్యుడు, అకాక్షువు, కుథుభిధుడు, పండితుడైన సుమంతవర్చసుడు, కబంధుడు, కుషికంధరుడు,
ప్లక్షుడు, దర్వాయణి, కేతుమంతుడు, గౌతముడు, భల్లాచి, మధుపింగుడు, తపోధనుడైన శ్వేతకేతువు, ఉషిధుడు, బృహద్రక్షుడు, దేవలుడు, కవియును, సౌలహోత్రుడు, అగ్నివేశ్యుడు, యువనాశ్వుడు, శరద్వసువు, ఛగలుడు, కుండకర్ణుడు, కుంతుడు, ప్రవాహకుడు, ఉలూకుడు, విద్యుతుడు, శాద్రకుడు, అశ్వలాయనుడు, అక్షపాదుడు, కుమారుడు, ఉలూకుడు, వసువాహనుడు, కుడికుడు, గుడు, మిత్రకుడు, గురువు, అనువీరందరు యుగముల అన్నీ ఆవర్తముల యందు ఆయోగులకు మహాత్ములగు. శిష్యులు. వీరు నిర్మలులు, బ్రహ్మజ్ఞానము ఎక్కువగా కలవారు, జ్ఞాన యోగము నందు శ్రద్ధకలవారుగా నుండిరి.
బ్రాహ్మణులయొక్క మేలుకొరకు, వేదములను స్థాపించుట కొరకు యోగేశ్వరుల యొక్క ఆదేశమువలన అవతారములను కూడ ధరింతురు.
ఏ బ్రాహ్మణులు ఎల్లప్పుడు స్మరింతురో, నమస్కర్తింతురో, తృప్తిని పొందింతురో, వీరిని పూజింతురో వారు బ్రహ్మజ్ఞానమును పొందుదురు.
ఈ వైవస్వత మన్వంతరమును గూర్చి విస్తరముగా చెప్పబడినది. ఇకముందు సౌవర్ణము, దక్షసావర్ణము అసు మన్వంతరములు జరుగ గలవు.
బ్రహ్మసావర్ణము పదియవది. ధర్మసావర్ణము ఏకాదశమన్వంతరము. పండ్రెండవది రుద్రసావర్ణము, పదమూడవది రోచ్యనామక మన్వంతరము కాగలదు.
పదునాల్గవది భౌత్యమన్వంతరము. క్రమముగా వీరందరు కాబోవు మనువులు. పూర్వము నారాయణునిచేత చెప్పబడిన యీ విషయము నాచే మీకు తెలుపబడినది. .
నాచే తెలుపబడిన యీ ఆఖ్యానము భూతవర్తమాన భవిష్యత్కాలములకు సంబంధించిన కథలతో విస్తరించబడినది. దీనిని ఎవడు చదువునో, వినునో, బ్రాహ్మణులకు వినిపించునో, అట్టివాడు అన్ని పాపములనుండి విడువబడి బ్రహ్మలోకములో పూజింపబడును. స్నానము చేసి దేవాలయమునందు, లేదా నదీ తీరములయందుగాని చదువవలెను.
పురుషోత్తముడైన నారాయణునకు భక్తిభావముతో నమస్కరించి చదువదగును. దేవాధిదేవుడు, దేవతలకు పరమాత్మయగువాడు, పురాణపురుషుడు, సర్వసమర్థుడును అయిన విష్ణువునకు వందనము.
శ్రీ కూర్మపురాణములో ఏబదిమూడవ అధ్యాయము ముగిసినది.
పూర్వార్థము సమాప్తము.
Summary of chapter 53 of the Kūrma Mahā Purana is as follows:
Sūta concludes the Pūrvārdha of Kūrma Purāṇa by describing the twenty-eight divine Avatāras of Bhagavān Mahādeva Śiva that manifest in every Kaliyuga alongside Vedavyāsa. Appearing as great ascetic masters such as Śveta, Sutāra, Damana, Suhotra, Kaṅka, Logākshi, Jaigīshavya, Dadhīchi, Upamanyu, and Lakulīsha, Mahādeva establishes the sacred Pāshupata Yoga, instructs seekers in holy ash-smearing, and bestows supreme liberation upon sincere spiritual aspirants.