కూర్మ మహా పురాణము
16వ అధ్యాయము
వ్యాస మహర్షి పలికెను
ఏ ప్రాణిని హింసించరాదు. ఎపుడును, ఎచ్చటను అబద్ధముచెప్పరాదు. అహితము అప్రియము కలిగించు మాటలు మాట్లాడరాదు. దోంగ కారాదు. ఇతరుని వస్తువు తృణముగాని, శాకముగాని, మట్టిగాని, నీరుగాని అపహరించినచో నరకమును పొందును. రాజు నుండి శూద్రుని నుండి, పతితుని నుండి, దానము స్వీకరించరాదు. శక్తి లేకున్నను ఇతరునీ యాచించరాదు. జ్ఞాని అయినవాడు నిందితములను పరిత్యజించవలయును.
ప్రతి నిత్యము యాచించరాదు. ఒకే వ్యక్తిని రెండవ మారు యాచించరాదు. ఇట్లు యాచించువాడు దాత ప్రాణములనే హరించినవాడగును. దేవ ద్రవ్యములను హరించరాదు. విశేషించి బ్రాహ్మణుడు హరించరాదు. ఎంతటి ఆపద వచ్చినను బ్రాహ్మణ ధనమును హరించరాదు.
విషము విషము కాదు. బ్రహ్మస్వమే (బ్రాహ్మణుని సొమ్ము) విషము. విశేష ప్రయత్నముతో దేవతా ద్రవ్యమును, అపహరించరాదు. పుష్పము, శాకము, ఉదకము, కాష్ఠము, మూలము, ఫలము, తృణము ఎదుటివాడు ఈయకుండగా తీసికొన్నను స్తేయము. కాదని మనుపు చేప్పేను.
బ్రాహ్మణుడు దేవతార్చన విధికీ ఇతరుల పుష్పములను తీసికొనవచ్చును. కాని ప్రతిదినము ఒకే చోటు నుండి అనుమతి లేకుండగ తీసుకొనరాదు. విప్రులు ధర్మకార్యము కొరకు తృణకాష్ట పుష్ప ఫలములను ఇతరులవి స్వీకరించవచ్చును. అదియును ప్రకాశ రూపముగానే (తెలియునట్లు). స్వామికి తెలియకుండ స్వీకరించిన పతితుడగును. దారిలోనున్నపోడు క్షుదారుడైనచో తిలలు, ముద్గలు, యవలు ఒక పిడికెడు తీసుకోనవచ్చు. క్షుదారుడు కానిచో అట్లు స్వీకరించరాదు.
పాపముచేసి, ధర్మ మనుపేరుతో వ్రతము సాచరించరాదు. వ్రతముతో పాపము కప్పి పుచ్చి స్త్రీలను శూద్రులను మోసగించినవాడు ఇహమున, పరమున బ్రహ్మజ్ఞులతో నిందించబడును. కపటముతో చేయు వ్రతము రాక్షసులకు చేరును.
యజ్ఞోపవీతాచి బ్రాహ్మణ చిహ్నములను అధికారీ కానివాడు జీవిక కొరకు ఆ చిహ్నములను ధరించినచో నిజముగా ఆ చిహ్నములకు యోగ్యులైన వారి పాపమును తానుమోయును. తరువాత పశుజాతిలోపుట్టును. లోకమున పరవంచనకొరకు ధర్మవ్రతునిగా నటించుపోరు బిడాల ప్రతులు అనబడుదురు. వీరు పాపులు; ధర్మ వినాశకులు. వీరు వెంటనే నరకములో పడుదురు. వేద దూషకులను, అధర్మము నాచరించువారిని, వామాచార పరాయణులను, పాంచరాత్రులను, పాశుపతులను, వాఙ్మాత్రముతోనైన పూజించరాదు.
వేదముల నిందించువారిని, దైవ నిందాపరులను, ద్విజ నిందోపరులను, మనసులోనైనా తలచరాదు. ఇట్టివారితో యజ్ఞము చేయించుట, వైవాహిక సంబంధము కుదుర్చుకొనుట, కలిసి నివసించుట, మాటలాడుట చేయుపోరు పతితులగుదురు. కావున యత్న పూర్వకముగా వీటిని విడువవలెను. దైవ ద్రోహము కంటే గురుద్రోహము కోటిరెట్లు అధిక పాపము నిచ్చును. గురుద్రోహముకంటే వేదనిండ నాస్తిక్యము కోటిరెట్లు పాపము నిచ్చును. గోవులతో, దేవతలతో, బ్రాహ్మణులతో, కృషీవలులతో, రాజసేవతో, జీవించువారి కులములు దోషపూర్ణములగును. ధర్మ శాస్త్రమున వీరిని హీనులుగా పరిగణించిరి. దుష్ట వివాహముతో, క్రియాలోపముతో, వేదాధ్యయనము చేయకపోవుటతో, బ్రాహ్మణులను అవమానించుటతో, కులములు హీనకులములగును.
అసత్యము వలన, పరదారా గమనము వలన, అభక్ష్య భక్షణము వలన, వేద విరుద్ద ధర్మాచరణము వలన, కులము వేంటనే నశించును. శ్రోత్రియులు కాని వారికి, శూద్రులకు వేద విహీత ఆచార హీనులకు, దానము చేసిన కులము నశించును.
అధార్మికులతో కూడియున్న గ్రామమున, వ్యాధులు ఎక్కువగా ఉన్న గ్రామమున, శూద్ర భోజ్యమున, వేద బాహ్యులు నివసించు గ్రామమున నివసించరాదు. హిమాలయ వింధ్య పర్వతముల మధ్య, పూర్వ పశ్చిమ సముద్రాంతరములో తప్ప, మరియొకచోట నివసింపరాదు. కృష్ణ సార మృగము సహజముగా సంచరించుచోట, పుణ్యనదులు ప్రవహించుచోట ద్వీజుడు నివసించవలెను.
నదీతీరము నుండి ఒక మైలు వదలిపెట్టి, బ్రాహ్మణుడు ఇతర ప్రదేశమున నివసించరాదు. అంత్యజుల గ్రామ సమీపమున నివసించరాదు. పతితులతో, చండాలురతో, పుల్కసులతో, మూర్ఖులతో, దురభిమానులతో, అంత్యులతో, అంత్యుల స్నేహము చేయువారితో కలిసి నివసించరాదు, ఒకే ఆసనమున, ఒకే శయ్యపైన, ఒకే పంక్తి భోజనమును, ఒకే పాత్రలో వండిన అన్నమును, భుజించుట చేయరాదు. అట్టివారితో యజ్ఞము చేయించరాదు. అధ్యాపనము చేయరాదు. వివాహ సంబంధము, సహ భోజనమును కూడనివి. కలిసి చదువుట, కలిసి యజ్ఞము. చేయుట, యీ పదునొకండు సాంకర్య దోషములనబడును. ఈ దోషములు చేయువారి సమీపమున నున్నను పాపము సంక్రమించును. కావున సర్వ ప్రయత్నముతో సాంకర్యమును వర్జించవలయును.
“ఒకే పంక్తిలో కూర్చున్నను, ఒకరి నొకరు తాకనిచో, మధ్యలో భస్మరేఖతో హద్దు ఏర్పరచినపుడు వారికి సాంకర్య దోషముండదు. అగ్నితో, భస్మముతో, నీటితో, ద్వారముతో, స్తంభముతో, మార్గములో మధ్యన వ్యవధానమున్న పంక్తి భేదమగును. శుష్క వైరమును ఏర్పరచు కొనరాదు. అకారణముగా వాదము పెంచుకొనరాదు. లోభిత్వము, చూపరాదు. ఇతరుల క్షేత్రములో మేయుచున్న ఆవును గూర్చి, ఇతరులకు చెప్పరాదు. సూతకమున్నవారితో మాట్లాడరాదు. ఎదుటివాని రహస్యమును బయలు పరచి అతని మనసుకు పరితాపము కలిగించరాదు.
సూర్య పరివేషమును, ఇంద్ర ధనువును, చీతీని, చంద్ర బింబమును గూర్చి ఇతరులకు చెప్పరాదు. చాలా మందితో, బంధువులతో, విరోధము చేయరాదు. తనకు ప్రతికూలమైన వాటిని ఇతరులకు ఆచరించరాదు.
పక్షతిధిని చేప్పరాదు. నక్షత్రములను చూపరాదు. రజస్వలా స్త్రీతో మాట్లాడరాదు. అపవిత్రునితో కూడా మాట్లాడరాదు. దేవ గురు విప్రులకు చేయుదానమును నివారించరాదు. ఆత్మ ప్రశంసను పరనిందను చేయరాదు. వేద నిందను, దేవ నిందను విశేష ప్రయత్నముతో విడువ వలెను.
దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, వేదములను, నిందించువారికి శాస్త్రములలో నిష్కృతి విధించబడలేదు. గురువును, దైవమును, వేదములను, ఇతిహాస పురాణములను నిందించువాడు నూరుకోట్ల కల్పముల కాలము గౌరవ నరకమును అనుభవించును. వేదాది నింద జరుగుచున్నపుడు తగిన సమాధానము చెప్పజాలనిచో, మౌనము వహించవలెను. ఎట్టి ప్రత్యుత్తరము పలుకరాదు. చెవులు మూసికొని వెళ్లవలయును. అట్టివారినీ (నిందించువారినీ) చూడరాదు.
జ్ఞాని అయినవాడు ఇతరుల రహస్యములను, తెలియుటకు ప్రయత్నించరాదు. ఒకవేళ తెలిసినను, దాచవలయును. ఎపుడు తన వారితో వివాదము పెట్టుకొనరాదు. పాపులు చేసిన పాపమును చెప్పరాదు. పాపి కాని పొనికి పాపమును ఆరోపించరాదు, ఎదుటి వారి పాపము చెప్పిన వానికీ, వానితో సమాన దోషము సంక్రమించును. లేని పాపము ఆరోపించిన రెండు రెట్లు దోషమంటును. అసత్య పాపొరోపణ చేయుటవలన ఆరోపించబడిన వ్యక్తి రోదించినచో, కన్నీటిబొట్లు నేల పైబడిన, ఆరోపించినవారికి పుత్రులు, పశువులు, ధనము నశించును. బ్రహ్మహత్య సురాపానము, స్తేయము, గుర్వంగనాగమనము మొదలగు మహాపాతకములకు ప్రాయశ్చిత్తము కలదుగానీ, మిధ్యాదోషారోపణ చేసినవానికి ప్రాయశ్చిత్తములేదు.
ఏ ప్రయోజనము లేకుండగా ఉదయించు సూర్యునిగానీ, చంద్రునిగాని, అస్తమించేడి సూర్యునిగాని, చంద్రునిగానీ, జలమున ప్రతీ బింబమునుగాని, గ్రహణ యుక్తునిగాని, ఆకాశ మధ్యమునున్నగాని, వస్త్రముతో కప్పిగాని, అద్దమున ప్రతిబింబించు వానిని గాని, చూడరాదు.
నగ్నముగా నున్న స్త్రీనిగాని, పురుషునిగాని చూడరాదు. మలమూత్ర విసర్జనము చేయుచున్న వానిని, మిధున ధర్మాసక్తుని చూడరాదు. బుద్ధిమంతుడగువాడు అపవిత్రుడైనపుడు సూర్య, చంద్ర గ్రహములను చూడరాదు, పతితులను, అంగహీనులను, చండాలురను, ఉచ్ఛిష్టులను చూడరోడు. ఉచ్చిష్టుడైనవాడు ముఖమును వస్తాదులతో కప్పుకొని కూడ ఇతరులతో మాట్లాడరాదు. శవమును స్పృశించినవానిని, కోపించియున్న గురువు ముఖమును, తైలమున, జలమున ప్రతిబింబించు ఛాయను, భోజనము చేయుచున్న భార్యను, బయలు పరచుకొను అవయవములు గల స్త్రీని, ఉన్మత్తుని మత్తుని చూడరాదు. తుమ్ముచున్నప్పుడు, ఆవలించినపుడు, సుఖాసనముపై యున్నపుడు భార్యను చూడరాదు. జలమున తన రూపము చూడరాదు, నదీతీరమును, లోతైన గర్తమును చూడరాదు. మూత్రమును దాటరాదు. మూత్రముపై కూర్చొనరాదు.
శూద్రునికీ, లౌకిక విషయమున కూడా ఉపదేశము నీయరాదు. నువ్వుల అన్నమును, పాయసమును, పెరుగును, ఉచ్చిష్టమును, తేనెను, నేతిని, కృష్ణాజినమును, హవిస్సును వీటిని శూద్రున జీయరాదు. శూద్రునికి ప్రతము నీయరాదు. ధర్మమును చెప్పరాదు. ఆతని విషయమున కోపించరాదు. ద్వేషమును, స్నేహమును పరిత్యజించవలయును. లోభ, దంభ, అసూయ, ఙ్ఞాననింద, ఈర్ష్య, మద, శోక మోహములను విడువ వలయును. ఎవరిని పీడించరాదు. పుత్రుని శిష్యుని కోట్టరాదు. హీనులను, తీక్ష బుద్దులను సేవించరాదు. తనను తాను అవమానించుకొనరాదు. ప్రయత్నముతో దైన్యమును పరిహరించవలెను. విశిష్ట వ్యక్తులను అగౌరవ పరచరాదు. తనను తాను నిందించు కోనరాదు.
గోళ్లతో భూమిపై వ్రాయరాదు. గోవును గోళ్లతో నిద్రపుచ్చరాదు. ఒకనది దగ్గర మరోకనదని, ఒక పర్వతము దగ్గర మరొక పర్వతమును గూర్చి మాట్లాడరాదు. నివాసమున, భోజనమున, తనతో కలిసివచ్చు వానీనీ విడువరాదు. నగ్నముగా నీటిలో మునుగరాదు. అగ్నిని దాటరాదు. శిరమున రాచగా మిగిలిన నూనెను ఇతర శరీరముపై రాచరాదు. సర్పములతో, శస్త్రములతో ఆడరాదు. తన అవయవములను నిష్కారణముగా స్పృశించరాదు. గుప్త అవయవములను, రోమములను స్పృశించరాదు. అశిష్టులతో కలిసి వెళ్లరాదు. పొణి, పాద, వాక్, నేత్ర విషయమున చాపల్యమును, ఆశ్రయించరాదు. శిశ్న ఉదర చాపల్యమును కర్ణచాపల్యమును ప్రదర్శించరాదు, అవయవములతో నఖములతో ధ్వనిచేయరాదు. దోసిలితో నీరు త్రాగరాదు. పాదములతో, హస్తములతో నీటిని కొట్టరాదు.
ఇటుకలతో పండ్లను రాల్చరాదు. పళ్లతో కూడ పండ్లను రాల్చరాదు. మేచ్ఛభాషను నేర్వరాదు. పాదముతో ఆసనము లాగరాదు. నఖములతో త్రుంచుట, కోయుట, చీల్చుట, వ్రాయుట, మర్దించుట చేయరాదు. నిష్ప్రయోజనముగా స్వ అవయవ మర్దనము చేయరాదు. ఒడిలో పెట్టుకొని భుజించరాదు. వ్యర్థ చేష్టలు చేయరాదు. నాట్యము, గానము పోద్యము ఎప్పుడు కాలనియమము లేక చేయరాదు. తలను రెండు చేతులతో గోకినరాదు, లోక స్తోత్రములతో దేవతలను స్తుతించరాదు. బాహ్యస్తోత్రములతో కూడా స్తుతించరాదు. పాచికలతో ఆడరాదు. నిష్కారణముగా పరుగెత్తరాదు. జలమున మలమూత్రములు విడువరాదు. ఉచ్చిష్ట ముఖముతో ఉండరాదు. నగ్నముగా స్నానమాచరింపరాదు.
నగ్నావస్థలో నడువరాదు చదువరాదు. తన శిరమును తాను స్పృశించరాదు. దంతములతో నఖములను, రోమములను ఛేదించరాదు. నిదురించిన వానిని లేపరాదు. లేయండను సేవించరాదు. శవ ధూమమును పరిత్యజించవలయును. శూన్య గృహమున.ఒక్కడే నీదురించరాదు. తన పాదరక్షలను తానే పట్టుకొని పోరాదు. అకారణముగా నిషీవనము (ఉమ్మి) వేయరాదు. బాహువులతో నదినీ దాటరాదు, పాదములతో పాదములను కడుగరాదు. అగ్నితో పాదములను కాచరాదు. కాంస్య పాత్రలో పాదములను కడుగరాదు. దేవతలవంక, బ్రాహ్మణులవంక, గోవుల వంక పాదములు చాపరాదు. వాయు, అగ్ని, గురు, విప్ర, సూర్య, చంద్రులవంక పాదములు చాపరాదు. అపవిత్రావస్థలో పడుకొనరాదు. ప్రయాణము చేయరాదు, స్వాధ్యాయమును చేయరాదు. స్నానము, వాహసము, బయటికి వెళ్లుట చేయరాదు.
ఉభయ సంధ్యలలో, మధ్యాహ్న కాలమున నిదురించుట, అధ్యయనము, స్నానము, ఉద్వర్తనము, భోజనము, గమనములు చేయరాదు. అపవిత్రుడు చేతితో గోబ్రాహ్మణ అగ్నులను స్పృశించరాదు. ఆసనమును పొదముతో తాకరాదు. దేవప్రతీమను ఉచ్ఛిష్టుడై యున్నపుడు తాకరాదు. అపవిత్రునిగా నుండి అగ్నీని ఉపాసించరాదు. దేవతలను, ఋషులను కీర్తించరాదు. లోతు తెలియని నీటిలో మునుగరాదు, అకారణముగా మల మూత్రములను నిరోధించరాదు. ఎడమ చేతిలో నీరు తీసుకొని గాని, పొత్ర ద్వారాకాని, నోటితోనే కోని జలమును త్రాగరాదు. ఆచమనము చేయకుండా సమాధానము చెప్పరాదు. జలమున రేతస్సును విడువరాదు. అపవిత్ర వస్తు సంబంధముగల వస్తువును గాని, రక్తమునుగాని, విషమునుగాని దాటరాదు. వేగముగా ప్రవహించు నదిని దాటరాదు. జలమున సంభోగము చేయరాదు. అశ్వత్థ వృక్షమును ఖండించరాదు. జలమున నిఫ్టీపనము చేయరాదు.
అస్టులపైన, కపాలములపైన, భస్మముపైన, కేశములపైన, కంటకములపైన తుష (ఊక)పైన, అంగారము (బొగ్గుల)పైన, పీడుకల పైన కూర్చొనరాదు. అగ్నిని దాటరాదు. తనకన్న క్రిందుగా శయ్య, ఆసనము మొదలగువాని క్రింద అగ్నిని ఉంచరాదు. పాదముల వద్దకూడ ఉంచ రాదు. నోటితో ఊదరాదు. బావిలోనికి దిగరాదు. అపవిత్రునిగా బావిని చూడరాదు. అగ్నిని అగ్నిలో పడవేయరాదు. అగ్నిని నీటితో చల్లార్చ గాదు, మిత్రుని మరణమును, దుఃఖమును, తనకు తానుగా ఇతరులకు వినిపించరాదు . అమ్ముతగని వస్తువును, కపటముతో లభించిన వస్తువును ఆన్మురాదు.
నోటితో ఊది అగ్నిలో జ్వాలను చేయరాదు. అపవిత్ర స్థితిలో ఉండి, పవిత్ర తీర్థములలోనికి వెళ్లరాదు; సీమాంత ప్రదేశమున దున్నరాదు.
మొదట చేసిన ప్రతిజ్ఞను విడువరాదు. పశువులను, పక్షులను, సర్పములను పరస్పర యుద్దములకు పురిగొల్పరాదు. జలపోత ఆతపము లతో ఇతరులను బాధించరాదు. తమ పనులు చేయించుకొని, పనిచేసిన వారిని వంచించరాదు, సాయంకాలము, ప్రాతఃకాలము, భిక్షకోరకు గృహద్వారములను తట్టరాదు. ఇతరులుపయోగించిన మాల్యము, గంధము, భార్యతో కూడి భోజనమును, పనిగట్టుకొని వైరము కల్పించి కలహము, దుష్టద్వార ప్రవేశమును పరిత్యజించవలయును.
బ్రాహ్మణుడు భుజించుచు లేవరాదు. నవ్వుతూ మాట్లాడరాదు. తమ అగ్నిని తమ చేతితో తాకరాదు. నీటిలో ఎక్కువ సేపు నిలువరాదు. అగ్నిని విసనకర్రతో, చేటతోగాని, విసరరాదు. నోటితో ఊదరాదు. ఎందుకనగా అగ్ని ముఖము నుండియే పుట్టినది.
పరస్త్రీతో మాట్లాడరాదు. బ్రాహ్మణుడు యజ్జార్హత లేనివానితో యజ్ఞము చేయించరాదు. ఒంటిగా సభలో ప్రవేశించరాదు. సమూహమును విడువ వలయును. అప్రదక్షిణముగా దేవాలయమున ప్రవేశింపరాదు. వస్త్రముతో వీచరాదు. దేవాలయమున నిదురించరాదు, ఒంటిగా దారిలో నడువరాదు, అధార్మికులతో కలిసి నడువరాదు. వ్యాధిగ్రస్తులతో, శూద్రులతో, పతీతులతో కలిసి నడువరాదు. పాదరక్షలు లేకుండ, జలము లేకుండగా నడువరాదు. రాత్రులందు నడువరాదు. శత్రువుతో కలిసి వెళ్లరాదు. కమండలము లేకుండా వెళ్ళరాదు. అగ్ని, గో, బ్రాహ్మణుల మధ్య నుండీ వెళ్లరాదు.
బ్రాహ్మణుడు దూడకు పాలిచ్చుచున్న ఆవును, గోవును కట్టివేయు త్రాటినీ, గోపుచ్చమును దాటరాదు. యోగులను, సిద్ధులను, ప్రతులను, యతులను నిందించరాదు. దేహాలయపు నీడను, దేవతల నీడను, యజ్ఞ దీక్షితుల నీడను, గో బ్రాహ్మణుల నీడను దాటరాదు. తన నీడను (ప్రతి బింబమును) పతితుల చేత, రోగుల చేత దాటనీయరాదు. అంగార, భస్మ, కేశముల యందు కూర్చొనరాదు. సమ్మార్జనీ రజమును, స్నానము చేసిన వస్త్రమును, స్నానము చేయగా మిగిలిన జలమును విడువవలయును. అభక్ష్యములను భక్షించరాదు. అపేయము పానము చేయరాదు.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్ సాహస్రి సంహితలో ఉపరి విభాగమున పదునారవ అధ్యాయము
Summary of chapter 69 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa outlines strict ethical rules and daily prohibitions to maintain spiritual purity within society. He forbids non-violence, theft, accepting gifts from unrighteous rulers, and association with non-Vedic or degraded sects. Vyāsa emphasizes that a seeker of liberation must avoid gossip, self-praise, slander of Devas and Vedas, and harmful speech, aligning every daily action with the eternal principles of Sanātana Dharma.