135. సాంబోపాఖ్యానమున సూర్యప్రతిష్ఠా స్నానవిధి వర్ణనము

నారద ఉవాచ :

అతః పరం ప్రవేక్ష్యామి స్నానకర్మవిధిం తవ స్నాపకస్తు మహాప్రాజ్ఞో బ్రాహ్మణోవేదపారగః

అభిజ్ఞః సౌరశాస్త్రాణా మరుణోయదుసత్తమ! భోజకో భోజకైశ్చాన్యైర్భ్రాహ్మణైశ్చ తధావృతః

దీశాభాగే మండలస్య ఈశానేవైయధాక్రమమ్ హస్తమాత్ర ప్రమాణంతు భద్ర పీఠంతువిన్య సేత్

హస్తినా శకటేనాపి భక్త్యా బ్రహ్మరధేన చ మంగలైర్ర్బహ్మఘోషైశ్చ దేవం ప్రాసాదమానయేత్

బ్రహ్మపీఠం సమాదాయ భద్రం కర్ణేతి మంత్రతః సూత్రధార స్తథాప్రోక్తః శుక్లాంబరధరః శుచిః

స్నాపయేత్కలశం గృహ్య దేవదేవం విభావసుమ్ సాముద్రం తోయ మాహృత్య జాహ్నవం యామునం తథా

సారస్వతం జలం పుణ్యం చాంద్రభాగం ససైంధవమ్ పుష్కరస్య జలం శ్రేష్ఠం గిరి ప్రస్రవణోదకమ్

 అన్యద్వాపి శుచి తోయం నదీనద తడాకజమ్ యథాశక్త్యా ఉపాహృత్య కలశైః కాంచనాదిభిః

భోజకాశ్చాష్టభిః సూర్యం కలశైః స్నాపయంతివై తతస్తు మణి రత్నావి సర్వబీజౌషధీస్తథా

సుగంధీనిచ మాల్యాని స్థల జాన్యంబుజానిచ చందనానిచ ముఖ్యాని గంధాశ్చవివిధాస్తధా బ్రాహ్మీ సువర్చలా ముస్తా విష్ణుక్రాంతాశతావరీ

 దూర్వాచశిబి పుషీచ ప్రియంగూ రజనీ వచా

సంభృత్యైతాంస్తు సంభారాన్ స్నాన కర్మ విభాగవిత్ బలాశ్వత్థ శిరీషాణాం పల్లవైః కుశ సంయుతై:

 కలశోపరి విస్యస్య దద్యా దర్ఘ్యం రవేఃసదా కాంచనై రాజతైస్తామ్రైర్మృన్మయైః కలశైస్తథా

తా. నారదుడిట్లనెను, “ఇక నీకు స్నాన కర్మ విధిని గూర్చి చెప్పెదను. స్నాపకుడు గొప్ప ప్రాజ్ఞుడు, వేదపారగుడు, అయిన బ్రాహ్మణుడు కావలెను. (1) ఓ సాంబా! అతడు సూర్య సంబంధ శాస్త్రములందు అరుణుని వంటి పండితుడైయుండవలెను భోజకుడై యుండి అనేకులగు భోజకులతోను, బ్రాహ్మణులతోను కూడి యుండవలెను (2) మండలమునకు ఈశాన్యభాగమున హస్త మాత్ర ప్రమాణముగల భద్రపీఠమును యధా శాస్త్రముగ నుంచవలెను. (3) ఏనుగును బూన్చిర శకటము పైన, బ్రాహ్మణులు లాగెడు రథము పైనను సూర్యదేవుని మంగళప్రదములైన వేదఘోషలతో సభక్తికముగ దేవ గృహమునకు కొని రావలయును (4) శుచియై యున్నవాడు, తెల్లని వస్త్రములను ధరించియున్నవాడునైన సూత్రధారుడనబడువాడు భద్రపీఠమును గొని దాని పై భద్రం కర్ణేభిః' మంత్రము చేత (5) కలశమును తీసికొని విభావసుడైన దేవదేవునికి స్నానము చేయింపవలెను సముద్ర జలము, గంగాజలము, యమునాతోయము (6) సరస్వతీ నదీజలము పుణ్యప్రదమైన చంద్రభాగా నదీ జలము, సింధునదీ జలముతో, శ్రేష్ఠమైన పుష్కర జలముతో, కొండలనుండి జాలువారిన శుద్దోదకము, (7) ఇతరములైన నదీనద తటాకముల నుండి యధాశక్తిగ కొనిరాబడిన స్వచ్చమైన జలముతో ఎనమండుగురు భోజకబ్రహ్మణులు బంగారు కలశములతో (8) సూర్యదేవు నభి షేకింతురు, అటుపిమ్మట మణిరత్నములు, సర్వవిధములైన బీజములుగల ఓషధులు (9) పరిమళముగల పుష్పములు, నేల మీదను నీటిలోనను పూచెడి పుష్పములు, ప్రసిద్ధములైన చందనములు, వివిధములైన సుగంధద్రవ్యములు, (10) పొన్నగంటి, సువర్చల (నింగిమిరి) నిడుముస్తే, విష్ణుక్రాంత, పిల్లపీ(చర, గరిక, శిబిపుష్పి, పిప్పలి, కోరింద, వస (11) ఇట్టి సంభారములనే కాక ముత్తవ పులగ, రావి, ఓ సేన చిగుళ్లు, దర్భలు (12) కలశము పైన నుంచి సూర్యదేవుని స్నానకర్మవిధి నెఱిగినవాడు బంగారు, వెండి, రాగి మట్టి పాత్రలతో సూర్యునకు అర్ఘ్యమియవలెను.  

సాక్షతైః సహిరణ్యైశ్చ సర్వోషధిసమన్వితైః గాయత్ర్యా పరిపూతైస్తు షోడశైః స్నాపయేద్రవిమ్

కుశోత్తరాం తతః కృత్వా వేదిం పక్వేష్టకామయీమ్ తస్యాం వేద్యం సమారోష్య పరిధాప్యచ వాససీ

ప్రతిమామభిషించేచ్చ సోపవాసః ప్రయత్నతః మూర్థ్ని సర్వౌషధీః కృత్వా తథైవామలకానిచ

మంత్రేణ మృత్తి కాంచాపి మంత్రతశ్చ జలంతథా త్వం దేవీ వందితా దేవైః సకలైర్దై త్యదానవైః

తేన సంస్థాపితా మూర్థ్ని మయాదేవస్య శుద్ధయే ఆదిస్త్వం సర్వభూతానాం దేవతానాంచ సర్వధా

 రసానాం పతయే తుభ్య మాహ్వానం చ కృతంమయా ఇత్థం పౌరాణికైర్మంత్రై ర్వైదికైశ్చ విశేషతః

కార్యంహి వారుణం స్నానం దేవస్య యదునందన! ఇత్థముచ్చారయద్వాచం కుర్యాత్ స్నానం విచక్షణః

తా॥ అక్షతలతో, బంగారునాణెములతో, సర్వవిధములైన ఓషధులతోను - కూడి, గాయత్రీ మంత్రముచే పరిపూతములైన పదునాలు కలశములలోని జలములతో సూర్యదేవునికి అభిషేకము చేయవలెను, (14) అప్పుడు వేదికను పక్వమైన ఇటుకలతో నిర్మించిన దానిని పైభాగమున దర్భలు పరచి-దానిపై సూర్యమూర్తిని నిలిపి వస్త్రములను ధరింపజేసి (15) యిట్లు ఉపోషితుడైన యజమాని సూర్యమూర్తికి అభిషేక కార్యక్రమమును నిర్వహింపవలెను, స్నానము చేయించు సందర్భమున విగ్రహముయొక్క శిరోభాగమున ఓషధులను, అట్లే ఉసిరికాయలను (16) మృత్తికను ఆపై జలములను పడునట్లుగా మంత్రములతో నభిషేకింపవలెను. ఓమృత్తికా! నీవు సకల దేవతలచేత, రాక్షసులచేత స్తోత్రము చేయబడిన దేవివి (17) అందుచే సూర్యమూర్తి యొక్క శుద్ధి కొఱకునిన్ను విగ్రహ శిరస్సు భాగమున నుంచి అభిషేకించుచున్నాను. నీవు అన్ని విధములుగను సర్వభూతములకంటెను దేవతలకంటెను మొదటి దానవు. “(18) రసములన్నింటికీ పతివైన నిన్ను నేనాహ్వానించుట జరిగినది.” ఈ విధముగ వివిధములగు వైదిక పౌరాణిక మంత్రములచేత (19) సూర్యదేవునికి శుద్దోదక స్నానము చేయింపవలేను ఇట్లు ముఖ్యముగ వేదమంత్రములతో బాటు పౌరాణిక వాక్యములను కూడ ఉచ్చరించుచు విచక్షణుడైన వాడు సూర్యాభిషేకమును చేయవలెను.

దేవాస్త్వామభిషించంతు బ్రహ్మవిష్ణు శివాదయః వ్యోమ గంగాచ పూర్ణేన ద్వితీయ కలశేనతు

సారస్వతస్యపూర్ణేన కలశేన సురోత్తమ! శక్రాదయోఽభిషించంతు లోకపాలాః సురోత్తమాః

సాగరోదక పూర్ణేన చతుర్థకలశేనతు వారిణా పరిపూర్ణేన పద్మపత్రసుగంధినా

పంచమేనాభిషించంతు నాగాశ్చకలశేనతు హిమవద్దేమ కూటాద్యాశాభిషించంతువారిణా

నైరృతో దక పూర్ణేన షష్టేన కలశేనతు సర్వతీర్థాంబు పూర్ణేన పద్మరేణు సువాసినా

సప్తమే నాభిషించంతు ఋషయః సప్త యేవరాః వసవశాభిషించంతు కలశేనాష్టమేనవై

అష్టమంగల యుక్తేన దేవదేవ నమోస్తుతే తతోవై కలశైర్దివ్యైః స్నానకర్మ సమారభేత్

సముద్రం గచ్ఛ యఃప్రోక్తో మంత్రమేతముదీరయేత్ హిరణ్య గర్భేతిచ యో మంత్రస్తం సముదీరయేత్

సముద్ర జ్యేష్ఠేతి మంత్రేణ క్షాలయేన్ముత్తికాన్వితమ్ సినీవాలీతి మంత్రేణ దద్యాద్వల్మీక మృత్తికామ్

 శమ్యుదుంబర మశ్వత్థం న్యగ్రోధంచ పలాశకమ్ యజ్ఞం యజ్ఞేతి మంత్రేణ దద్యాత్పంచ కషా యికమ్

తా॥ “బ్రహ్మ విష్ణు శివాదులైన దేవతలు ఆకాశగంగా జలముతో నిండిన రెండవ కలశముతో నిన్ను అభిషేకింతురు గాక. (21) ఇంద్రాది లోకపాలురు సరస్వతీనదీ జలముతో నిండియున్న మూడవ కలశముతో నిన్ను అభిషేకింతురుగాక (22) సముద్రజలములతో నిండియున్న నాలుగవ కలశముతో-పద్మపత్రముల పరిమళములతో నున్న నీటితో ఇతర దేవతలు నిన్ను అభిషేకింతురుగాక (23) బంగరు కొండ కొమ్ముల నుండి జాలారిన నీటితో నింపబడియున్న ఐదవ కలశముతో నాగులు నిన్నభిషేకింతురుగాక (24) నైరృతి దిశలో ప్రవహించెడు నదుల నుండి జలాశయములనుండి తేబడినవియు, శుద్ధమైనవియు తామర పుప్పొడి రేణువులతో సుగంధిలము చేయబడినవి యునైన జలములతో నింపబడిన ఆవ కలశముతోను (25) ఏడవ కలశముతోను సపరివరులు నిన్ను అభిషేకింతురుగాక. అష్ట మంగళములతో కూడిన ఎనిమిదవ కలశముతో వసువులు అభిషేకించెదరు గాక. (26) దేవదేవా! నీకు నమస్కారమగు గాక.” అని యిట్లు ప్రార్థించి దివ్యమైన కలశములతో స్నానకర్మను ప్రారంభింపవలెను. (27)"సముద్రం గచ్చ” యనెడు మంత్రమును, 'హిరణ్యగర్భ' యనెడు మంత్రమును పఠింపవలెను. (28) “సముద్ర జ్యేష్ణా'యను మంత్రముతో-మృత్తికతో కడుగవలెను. 'సినీవాల' మంత్రముతో పుట్టమట్టిని ప్రయోగింపవలయును, (29) జమ్మి, మేడి, రావి, మజ్లి, మోదుగు అను ఐదు ఓషధుల రసాయనమును 'యజ్ఞం యజ్ఞ' మంత్రముతో నుపయోగింపవలెను.

పంచగద్యం పవిత్రంచ ఆహరేత్తామ్రభాజనే గాయత్ర్యాచైవ గోమూత్రం గంధద్వారేతి గోమయమ్

ఆప్యాయ స్వేతి చ క్షీరం దధిక్రావ్ణేతి వైదధి తేజోసీతి ఘృతం తద్వ ద్దేవస్యత్వాకుశోదకమ్

ఏవమాది విధియుతం పంచగవ్యం ప్రకీర్తితమ్ యా ఓషధీతి మంత్రేణ స్నానమోషదిభిః క్రమాత్

ద్రుపదాభిః పునస్తస్య కుర్యాచ్చో ద్వర్తనం బుధః శిరః స్నానం తతో దద్యా న్మానస్తోకాభి మంత్రితమ్

 విష్ణోరరాట మంత్రేణ దద్యార్గంధోదకం శుభమ్ తతో నద్యుద్భ వేనైవ క్షాలయేచ్ఛుద్ధ వారిణా

జాత వేదసముచ్చార్య వస్త్ర పూతేన వారిణా తత ఆవాహయేద్దేవం రక్తమాల్యాంబరం శుభమ్

ఏ హ్యే భగవన్భానో లోకానుగ్రహ కారక! యజ్ఞభాగం గృహాణార్ఘ్య మర్కదేవ నమోఽస్తుతే

హిరణ్యేనతు పాత్రేణ దేవాయార్ఘ్యం ప్రదాపయేత్ ఇదం విష్ణుర్విచక్రమే మంత్రేణార్ఘ్యం సమర్పయేత్

 పార్ధివైః ప్రధమం కలశైః స్నాపయ్భోస్కరం బుధః తతస్త్వౌదుంబర్వైర! రాజతై స్తదనంతరమ్

తతస్తు కాంచనై ర్దేవం స్నాపయేద్యదు నందన! సర్వతీర్థ జలైర్యుక్తం సర్వౌషధి సమన్వితమ్

తా॥ రాగిపాత్రతో పవిత్రమైన పంచగవ్యమును ప్రాశసము చేయవలెను. గాయత్రీ మంత్రముతో గోమూత్రమును, 'గంధద్వారాం’ మంత్రముతో గోమయమును, (31) ‘ఆప్యాయస్వ' మంత్రముతో ఆవుపాలను, 'దధిక్రావణో' మంత్రముతో ఆవు పెరుగును, "తేజోసి' మంత్రముతో ఆవునేయిని, అదేవిధముగ దేవస్యత్వా' మంత్రముతో కుశోదకమును స్వీకరింపవలెను (32) ఈ విధానముతో పంచగవ్యప్రాశన చెప్పబడినది. 'యాఓషధీ' మంత్రముతో క్రమముగా ఓషధీస్నాపము చేయింపవలెను, (33) ద్రుపదాదులచే నలుఁగు పెట్టవలెను మానస్తోకాభి మంత్రితముగ శిరఃస్నానము నిర్వర్తింపవలెను, (34) 'విష్ణోరరాట'మంత్రముచే శుభప్రదమైన గంధోదకమును సమర్పింపవలెను. అటు పిమ్మట శుద్ధమైన నదీ జలముతో శుభ్రముగ కడిగివేయవలెను. (35) ‘జాతవేదసే' మంత్రము నుచ్చరింపుచు వడబోసిన నీటితో స్నానము చేయింపవలెను. అప్పుడు ఎఱ్ఱని పుష్పములు, సుగంధద్రవ్యములతో సూర్యదేవుని ఆవాహనము చేయవలెను. (36) హే భగవన్! భానుదేవా! లోకములనను గ్రహించుచుండెడు నో దేవదేవా! రమ్ము! ఇటకేతెంచుము! యజ్ఞ భాగమైన ఈ అర్ఘ్యమును స్వీకరింపుము సూర్యదేవా! నీకు నమస్కారమగుగాక” (37) అని ప్రార్ధించుచు సువర్ణకలశముతో ఆదేవున కర్ఘ్యమియవలెను. "ఇదం విష్ణుర్విచక్ర' యను మంత్రముతో అర్ఘ్యప్రదానము చేయవలెను. (38) మొదట మట్టి పాత్రలతోను, తదుపరి రాగి కలశములతోను, అనంతరము వెండి బిందెలతోను సూర్యదేవునభిషేకింపవలెను. (39) ఓ యదునందనా! అటు తరువాత బంగారు కలశములతో-సర్వపుణ్యతీర్థముల జలములతో, అన్నివిధముల ఓ. ఎల యుక్తముగా అభిషేకింపవలయును .

శంఖమాదాయ దేవస్యతతో మూర్ధని శంకర! దత్వాపుష్పాణి దేవస్యమూర్ద్ని యత్నాద్విచక్షణః

 తోయ ముతిప్య యత్నేన తతః స్నపనమాచరేత్ ప్రథమం స్నాపయేద్దేవం వారిణా యదునందన!

 తతస్తు పయసా రాజన్పాయ సేన తతస్తువై ఘృతేన మధునా వాపి తథా ఇక్షురసేన చ

అగ్నిష్టోమస్య యజ్ఞస్య గోమేధస్యచ సువ్రత! జ్యోతి ష్టోమస్య రాజేంద్ర వాజపేయస్య వైవిభో!

రాజ సూయా శ్వమేధాభ్యాం ఘృతాద్యైర్లభతే ఫలమ్ యస్తు కారయతే స్నానం యస్తు భక్త్యా ప్రపశ్యతి క్రియమాణంతు దేవస్య స్నానం యదుకులోద్వహ!

య ఏతే కథితా యజ్ఞా ఏతేషాం క్రమశః ఫలమ్ అర్చాం చ కురుశార్దూల! దృష్ట్యా వై లభతేఫలమ్

 స్నానంతు యత్నతః కార్యం దేవదేవస్యసువ్రత! యధాన లంఘయేత్కశ్చిద్దేవస్య స్నపనం విభోః

న ప్రాశ్నంతి యథా కాకాస్తీర్థం లోక విగర్హితాః స్నానోదకం తు దేవస్య అథవా పయ ఏవహి

 భూమౌగతం యధాచైవ ప్రాశ్నాతి యదునందన రోగం ప్రాప్నోతి కరక్తావై దుఃఖం కారయితా తథా

తస్మాద్యత్నేన కర్తవ్యం దేవస్య స్నపనం విభోః

తా॥ ఓ సాంబా! పిదప ఒక శంఖమును గొని అందలిజలములతో సూర్యమూర్తి యొక్క శిరస్సు పైన అభిషేకము చేయవలెను. దానికి ముందు సూర్యమూర్తి శిరస్సు పై పుష్పములుంచవలెను. (41)ఆపై నీటిని ఎగజిమ్ముచు స్నానమాచరింపజేయవలెను. మొదట నీటితోను (42) ఆపై పాలతోను, పిమ్మట పాయసముతోడను, తదుపరి నేతితోను, తరువాత తేనెతోను, అటు పైన చెఱకు రసము తోను అభి షేకింపవలెను. (43) అగ్నిష్టోమ, గోమేధ, జ్యోతిష్ణోమ, వాజపేయ (44) రాజసూయ, అశ్వమేధయాగముల ఫలము ఈ ఘృతాదుల అభి షేకముల వలన లభించును. స్నానము చేయించువాడు, భక్తితో దీనిని చూచువాడు, చేయువాడును (45) క్రమముగా ఈ చెప్పబడిన యజ్ఞముల ఫలములను పొందెదరు. ఓ కురుశార్దూలా! అభిషేకింపబడు సూర్యమూర్తిని దర్శించిన మాత్రమునను ఆయాఫలములు లభించును. (46) అందుచే ఓ సుప్రతా! సూర్యదేవుని స్నాన కార్యక్రమము పూనికతో చేయవలయును. ఆదేవదేవుని స్నానజలమును ఎవరును దాటి పోవలదు (47) ఆ స్నాన తీర్థమునుగాని, పాలనుగాని లోకవిగర్హితములైన కాకులు త్రాగ కుండునట్లు చూడవలేను. (48) ఓ యదునందనా! నేల పైనొలికిన నీరుద్రావిన 'కర్త', తాను రోగ గ్రస్తుడగుటయేకాక తన వారికిని దుఃఖమును కలగించువాడగును. (49) అందుచేత సూర్యదేవుని స్నపనమును మిక్కిలి జాగ్రత్తగా నిర్వహింపవలయును.

స్నాపయిత్వా క్రమేణేత్థం స్నాన కర్మవిధాన విత్ తతో వర్ధనికాం గృహ్యవారధారాం సముత్సృజేత్

త్రివారాన్పురతోర్కస్య ఆచమస్వేతి చబ్రువన్ నేదోసీతి చ మంత్రేణ ఉపవీతం ప్రదాపయేత్ 

బృహస్పతేతి మంత్రేణ వస్త్రయుగ్మం ప్రదాపయేత్ యత్నక్రమం ప్రకుర్యాణః పుష్పమాలాంప్రదాపయేత్

ధూరసీతిచ మంత్రేణ ధూపం దద్యాత్సగుగ్గులమ్ సమిద్ధోంజన మంత్రేణ అంజనంతు ప్రదాపయేత్

 యుంజానీతిచ మంత్రేణ రోచనాం తస్య దాపయేత్ ఆరార్తికంచ వై కుర్యాద్దీర్ఘాయుష్ట్వాయవర్చసే

స్నాన కర్మత్విదం ప్రోక్తం భాస్కరస్య మహాత్మనః భోజకా బ్రాహ్మణాశ్చైవ క్రియాం కుర్వుః ప్రయత్నతః

బహ్వృచోఽధర్వణశ్చైవ ఛందో గోధ్వర్యురేవచ స్నాపకస్యచ చిహ్నాని యేచమూర్తిధరాస్తధా

తేషాం ప్రవక్ష్యామి విభో! శృణుచైకమనాః కిల సంపూర్ణ గాత్రోమతిమాన్ శాస్త్రజ్ఞః ప్రియదర్శనః

కులీసః శ్రద్దధాసశ్చ ఆర్యదేశ సముద్భవః న స్థూలో సకృశో దీర్ఘః సౌరశాస్త్ర విశారదః యశ్చయుక్తో జితాత్మాచ గురుభక్తో జితేంద్రియః పంచ వింశతి తత్వజ్ఞః స్థాపకః సముదాహృతః

తా॥ స్నానకర్మ విధానమును తెలిసిన భక్తుడీ క్రమమున సూర్యదేవునకు స్నానము చేయించి, ఆపై వర్జనిక (నీటిని ధారగా పోయుటకు అనువైన పాత్రవిశేషము)ను గొని సూర్యమూర్తి పై నీటినిధారగా వదలవలెను. (51) సూర్యుని ముందుభాగమున ముమ్మారు 'ఆచమస్వ'యని పలుకుచు ఆచమనీయమును సమర్పించి, 'వేదోసి' మంత్రముతో యజ్ఞోపవీతమును సమర్పింప వలెను (52) 'బృహప్పతే' మంత్రముతో వస్త్రద్వయమును ఈయవలెను ఇట్లు ప్రయత్న పూర్వకమైన క్రమముతో స్నానాది పూజా కార్యములు నిర్వహించుచు వస్త్ర యుగ్మము తరువాత పూలమాలను సమర్పింపవలెను (53) ‘ధూరసి' మంత్రముతో గుగ్గిములతో కూడినధూపము వేయవలెను. “సమిదోంజన' మంత్రముతో కాటుక పెట్టవలెను (54) యుంజాని' మంత్రముతో సూర్యదేవునకు కంపిల్లము (కాంపిల్యము అనుఓషధి) నీయవలెను దీర్ఘాయుష్ట్యాయ వర్చసే మంత్రముతో నీరాజన మీయవలెను. (55) భాస్కరదేవుని స్నానకర్మవిధి యీ విధముగ చెప్పబడినది. ఈ కార్యక్రమ మంతయు భోజక బ్రాహ్మణులు నిర్వర్తింప వలెను. (56) వీరు ఋగధర్వణ యజుర్వేదులైయుండవలెను. (56) సూర్యమూర్తి ధరులయొక్కయు సూర్య స్నాపకుల యొక్కయు (57) లక్షణములను చెప్పుచున్నాను. ఏకాగ్రమనస్కుడవై వినుము, సంపూర్ణ శరీరముగలవాడు (వికలాంగుడు కాని వాడు) బుద్ధిమంతుడు, శాస్త్రజ్ఞుడు, ప్రియముగ కనబడువాడు (58) మంచి కులమున బుట్టినవాడు, శ్రద్దగల వాడు, ఆర్యులదేశమున బుట్టినవాడు, అస్థూల శరీరుడు, కృశింపనివాడు, పొడుగు పొట్టియుకానివాడు సూర్యశాస్త్రములు తెలిసినవాడు (59) యోగి, నిగ్రహముగలవాడు, గురుభక్తి గలవాడు, జితేంద్రియుడు పంచవింశతి తత్వములను గూర్చి తెలిసినవాడు, స్థాపకుడని చెప్పబడెను .

వర్జనీయాంశ్చవక్ష్యామి యైస్తు కర్మనకారయేత్ హీనాంగశ్చాధి కాంగశ్చ వామనో వికటస్తథా

నాతిగౌరో నకృష్ణశ్చ స్నాపకాయ ప్రయోజయేత్ చార్వాకో యాజకశ్చైవ నిత్యం గోముఖదంభకః

 అశుచివ్రత సంయుక్తః శ్యామదంతోఽథమత్సరీ కోపనో దుష్ట శీలశ్చ యువా వా వృద్ధ ఏవచ

 శ్విత్రీ, కుఠ్ఠీ చ రోగీచ కాణో దుర్మతిరేవచ సంకీర్ణో జాతి హీనశ్చ తథా చ వృషలీ పతిః

కుబ్జశ్చాంధస్తథా వ్యంగః ఖల్వాటో వికలేంద్రియః అవినీతో దురాత్మాచ వికలః పంగురేవచ

తిథి నక్షత్ర యోగానాం వారాణాంచ తథా విభో! సూచకో జీవికార్థం హి యశ్చమూల్యేన పాఠయేత్

ఈ దృశాన్స్నా పకాన్సర్వా న్వర్జయేత ప్రయత్నతః తస్మాత్సర్వ ప్రయత్నేన పరీక్ష్యాః స్నాపకా బుదైః

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే సాంబోపాఖ్యానే సూర్య ప్రతిష్ణా స్నాన విధి వర్ణసం నామ పంచత్రింశదుత్తర శతతమోఽధ్యాయః

తా॥ సూర్య సంబంధమగు కర్మ విషయమున ని ఫేధింపదగిన వారిని గుఱించి చెప్పుచున్నాను. వినుము, అంగవికలురు, అధికంగులు, పొట్టివారు, వికారమైనరూపముగలవారు (61) మిక్కిలి తెల్లని వారు, మిక్కిలి నల్లని వారు, నాస్తికులు, యజ్ఞాదులు చేయించుచు జీవించువారు, అమాయకులుగా కనబడు పంచకులు, డాంబికులు (62) అపరిశుద్ధమైన అలవాట్లు గల వారు, నల్లని పలువరుసలుగలవారు, గర్వము గలవారు, కోప స్వభావులు, దుష్టమైన గుణశీలములు గలవారు, నవయువకులు, అతివృద్దులు, (63) బొల్లి మచ్చల వ్యాధి గలవారు. కుష్టురోగ పీడితులు, ఒంటి కంటీవారు, దుర్మతులు, సంకరజాతివారు, జాతి చేత హీనులు, శూద్రులు (పాపాత్ములు) (64) కుబ్జరూపులు, గ్రుడ్డివారు, కొనటులు, బట్టతలవారు వికలేంద్రీయులు, నీతి లేని వారు, దురాత్ములు, వికలురు, కుంటివారు (65) తిధి నక్షత్రవార, యోగ, కరణాదులను చెప్పుచు పొట్టపోసికొనువారు, ధన మును గొని పాఠములను బోధించువారు (66) మొదలగు నిట్టి వారిని సూర్య స్నాపన విధుల విషయమున వర్జింప వలెను. అందువలన పండితులు సూర్యస్నాపకులను అన్ని విధములుగ పరీక్షింపవలెను.  

భవిష్యమహాపురాణాంతర్గత బ్రహ్మపర్వమునందలి సప్తమీ కల్పమున, సాంబో పొఖ్యానమునందలి సూర్య ప్రతిష్టాస్నాన విధి వర్ణనమను నూటముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.