భవిష్య మహా పురాణము
34. పంచమి కల్పమున దంశ దష్టక దూత లక్షణము
మూ. కశ్యప ఉవాచ : -
అతఃపరం ప్రవక్ష్యామి కాలదష్టస్యలక్షణమ్ శృణు గౌతమ! తత్వేన యాదృశో భవతే నరః
జిహ్వాభంగోధ హృచ్ఛూలం చక్షుర్భ్యాంచనపశ్యతి దంశంచ దగ్ధ సంకాశం పక్వజంబూ ఫలోపమమ్
వైవర్ణ్యం చైవ దంతానాం శ్యావో భవతి వర్ణతః సర్వేష్వంగేషు శైథిల్యం పురీషస్యచ భోదనమ్
భగ్న స్కంధ కటిగ్రీవ ఊర్ధ్వ దృష్టి రథోముఖః దహ్యతే వేపతే చైవ స్వపతేచ ముహుర్ముహుః
శస్త్రేణచ్ఛిద్య మానస్య రుధిరం నప్రవర్తతే 'దండేన తాడ్యమానస్య దండరాజీ న జాయతే
దంశో కాకపదం సునీల మసకృజ్జం బూఫలాభంఘన ముచ్చూనం రుధిరార్ద్రసేక బహులం కృచ్ఛాన్నిరోధోతభవేత్
హిక్కా శ్వాస గల గ్రహశ్చ సుమహాన్పాండుస్త్వచా దృశ్యతే శుష్కాంగం ప్రవదంతి శాస్త్రనిపుణస్తత్కాలదష్టం విదుః
దంజోయస్యాథ శోధః ప్రచలితవలితం మండలం వా సునీలమ్ ప్రస్వేదోగాత్రబేధః స్రవతిరుధిరం
సానునాసంచజలేత్ ‘దంతోష్ఠాభ్యాం వియోగో భ్రమతిచ హృదయం సన్నిరోధశ్చ తీవ్రో దివ్యానామేషదంశః స్థల విపులమయో విధి తంకాలదష్టమ్
దంతైర్దంతాన్ స్పృశతి బహుశా దృష్టిరాయాసఖిన్నా రుధిరం కేకరం చక్షురేకమ్ స్థూలోదంశః స్రవతి
ప్రత్యాదిష్టః శ్వసితి సతతం సానునాసం చ భాషే పాపం బ్రూతే సకల గదితం కాలదష్టం తమాహుః
వేపతే వేదనా తీవ్ర రక్తనేత్రశ్చ జాయతే గ్రీవాభంగశ్చలా నాభిః కాలదష్టం వినిర్దిశేత్
దర్పణే సలిలే వాపి ఆత్మచ్ఛాయాం నపశ్యతి మందరశ్మిం తథాతీవ్రం తేజోహీనం దివాకరమ్
తా॥ కశ్యప ప్రజాపతి యిట్లనెను. “ఇకమీద కాలసర్పదష్టుని లక్షణము చెప్పెదను గౌతమా! కాలనాగముచే కాటువేయబడిన మనుష్యుడెట్లగునో వివరింతును. అట్టివానికి నాలుక మొద్దువారును. హృదయమున శూలముగ్రుచ్చినట్లుండును. కన్నులు కనబడకుండపోవును. కాటువేసిన తావున పండిన నేరేడు పండువలే కాలినట్లుండును. దంతములు రంగుమారి పోవును. ఒడలంతయు కోఁతివన్నె లోనికి మారును. అవయవములన్నియును శిథిలములగును. మలవిసర్జన జరుగుచుండును. భుజములు, నడుము, మేడ వాలిపోవుచుండును. ముఖము క్రిందై, పైకి చూచుచుండును. శరీరము దహించుకొని పోవుచున్నట్లు మాటమాటికి వణుకుచు నిద్రించుచు(మూర్చిలుచు) ఉండును. శరీరము పై శస్త్రముతో గాటు వేసినను రక్తము రాకుండును. కఱ్ఱతో గొట్టినను, ఒంటిపై కట్టకు సంబంధించిన ముద్ర పడకుండును. కాటు వేయబడిన శరీర భాగమున కాకిపాదము వంటి నల్లని ముద్ర, నేరేడు పండువలే ఉబ్బిపోయి యేర్పడియుండును. దట్టముగా రక్తముతో తడిసిపోయి యుండును. నాళములు నిరోధింపబడును. ఎక్కిళ్లు వచ్చుచుండును. గొంతుపట్టి నట్లుండి శ్వాసించుట కష్టమగును. చర్మం తెలుపు మించిన పసుపువన్నెలోనికి మారును. అంగములెండిపోవును. కాలసర్పముచే కాటువేయబడినవాడీ లక్షణముణలకు లోనగునని శాస్త్ర నిపుణులైన పండితులు చెప్పుచున్నారు. కాటుపడిన చోట మిక్కిలిగా వాచిపోయి దాని చుట్టును వలయాకారముగ గాఢమైన నీల వర్ణపుడాగు ఏర్పడినను, ఒడలంతయు బాగుగా చెమటపట్టినను, గాయమునుండి రక్తము స్రవించుచున్నను, దష్టుడు ముక్కుతో మాట్లాడుచున్నను, దంతములు, పెదవులు విడిపోయి (నోరుతెరచుకొనియున్నను, గుండె వేగముగా కొట్టుకొనుచున్నను, శ్వాసకు తీవ్రమైన ఆటంకమేర్పడినను, అది కాలసర్పము యొక్క తీక్షమైన కాటుగా తెలిసికొనవలెను. దంతములతో దంతములను స్పృశించు చుండుట, మిక్కిలిగా నాయాసపడుచున్నట్లు భిన్నమైన చూపు కలిగియుండుట, కాటు పెద్దదైన యెడ రక్తము స్రవించుచుండుట, ఒక కన్ను చూపు ప్రక్కకు తొలగుట, వైద్యులు మున్నగు వారిచే నిరాకరింపబడుట, (చొంగకార్చుట), అతిగా శ్వాసింపుచుండుట, ముక్కు ధ్వనితో మాట్లాడుట, తనపై తాను జాలిపడుట, అందఱిచేతను 'పాప'మనిపించుకొనుట-ఈ లక్షణములు గలవానిని కాలసర్పముచే కటువబడినవాడని చెప్పుదురు. బాగుగా వణకుచుండును. తీవ్రముగా భాదపడుచుండును. కన్నులెఱ్ఱబారును. మెడ ఒరగిపోవును, నాభిచలించును. అట్టివాడు కాలసర్పదష్టుడని నిర్దేశింపవలేను. అద్దమునందుగాని, నీటియందుగాని తన ప్రతిబింబమును చూడజాలకుండును. సాధారణమైన ఎండను కూడ తీర్ఘమైనదిగా భావించును. సూర్యుని తేజోహీనునిగా చూచును.
మూ. వేపతే వేదనా త్రస్తో రక్తనేత్రస్తు జాయతే స యాతి నిధనం జంతుః కాలదష్టం వినిర్దిశేత్
అష్టమ్యాంచ నవమ్యాంచ కృష్ణపక్షే చతుర్దశీమ్ నాగ పంచమీ దష్టానాం జీవితస్యచ సంశయః
ఆర్ద్రాశ్లేషా మఘాభరణీ కృత్తాకాసు విశేషతః విశాఖాం త్రిషపూర్వాసు మూలస్వాతి శతాత్మకే సర్పదష్టాన జీవంతి విషం పీతంచయైస్తథా
శూన్యాగారే శ్మశానేచ శుష్కవృక్షే తథైవచ న జీవంతి నరాదష్టా నక్షత్రేతిథిసంయుతే
అష్టోత్తరం మర్మశతం ప్రాణినాంసముదాహృతమ్ తేషాం మధ్యేతు మర్మాణి దశద్వేచాపి కీర్తితే
శంఖేనేత్రే భ్రువోర్మధ్యే బస్తిభ్యాం వృషణోత్తరే కక్షస్కంధే హృదిమధ్యే తాలుకే చిబుకే గుదే
ఏషుద్వాదశ మర్మేషు దంశైః శస్త్రేణ వా హతః న జీవతి నరోలోకే కాలదష్టం వినిర్దిశేత్
అకచటతప యశాంవదంతి ప్రోక్తా జీవంతి నతత్రహి గతం బ్రూ యాద్యది స్ఖలతి శిరస్తస్య సంప్రాప్తకాలః
భవతి చ యది దూతో హ్యుత్తమస్యాధమోవా యదిభవతి చ దూత ఉత్తమోవాధమస్య అదౌ దష్టస్య నామయది వదతి క్వచి
ద్వక్తి తస్యాధ పశ్చాత్తం వర్ణభేదో యది భవతి సమః ప్రాప్తకాలస్యదూతః
దూతోవా దండహస్తో భవతినయుగలం పాశహస్తస్తధావా రక్తం వస్త్రం చ కృష్ణం ముఖశిరసి గతమేక వస్త్రశ్చదూతః
తైలాభ్యక్తశ్చ, తద్వద్యది త్వరితగతి ర్ముక్తకేశశ్చయాతి యఃకుర్యాద్ఘోర శబ్దం కరచరణయుగైః ప్రాప్తకాలస్యదూత:
తా॥ నొప్పికి తాళజాలక, భయపడుచు వణకుచుండును, కన్నులెత్థవారును. అట్టివాడు కాలసర్పదష్టుడని, మరణించుననియు చెప్పవలెను. అష్టమి, నవమి, కృష్ణపక్ష చతుర్దశి, నాగపంచమి నాడు పాము కఱచినవారు జీవించుట సంశయాస్పదమే. ఆర్ర, ఆశ్లేష మఘు, భరణి, కృత్తిక, విశాఖ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, పూర్వఫల్గుని, మూల, స్వాతి, శతభిష నక్షత్రములందు పాముకాటుకు గుణియైన వారుగానీ, విషము త్రాగిన వారుగాని జీవింపజాలరు. పాడుబడిన యిండ్లలోగానీ, శ్మశానమునందుగాని, ఎండిపోయిన చెట్టు మీదగాని, దుష్టమైన నక్షత్ర-తిథి యోగమునగాని పాము కాటువేసిన వారు జీవింపరు. ప్రాణుల శరీరమున నూటయెనిమిది మర్మస్థానములు (ఆయువుపట్లు) చెప్పబడినవి. వానీలో పన్నెండు స్థానములు ముఖ్యమైనవి. నొసటీ యెముక, కన్ను, కనుబొమల నడిమి భాగము, పొత్తికడుపు (ఇరువైపులు) వృషణముల పై భాగము, చంకలు, భుజములు, హృదయమధ్య భాగము, దవడలు, గడ్డము (గదువ), గుదస్థానము. -వీని యందు సర్పము కాటు వేసినను, ఆయుధముతో కొట్టినను మనుష్యుడు మరణించును. సర్పదష్టుని గుజించిన వార్త చెప్పెడివారలు, 'అకచటతపయశ' వర్ణములుచ్చరించును, తలను జార్చుచుపాముకాటు వివరములు చెప్పుచుండినను దష్టుడు జీవింపనేరడనియు, అతనికి మరణకాలమాసన్నమైనదనియు నెంచవలెను. వార్త చెప్పేడు దూత ఉత్తమునికి సంబంధించిన అధముడైనను, అధమునికి సంబంధించిన ఉత్తముడైనను, మొట్టమొదటనే దష్టుని పేరు ఉచ్చరించుచు తక్కిన వివరములు తరువాత చెప్పినను, చెప్పెడి విషయమంతయు తడబాటుగా చెప్పినను అట్టివాడు ప్రాప్తకాలుని దూతయని భావింపనగును. దూత, చేతకట్టగలవాడైనను, దూతలిద్దమైనను, చేత త్రాడు పట్టుకొనియున్నను, ఎఱుపు లేక నలుపు బట్టలు ధరించియున్నను, ముఖము పైభాగమున లేక ముఖమునకు శిరస్సుకును కలిపి ఒకే వస్త్రము చుట్టుకొని యున్నను, నూనె రాచుకొని యుండినను, వెంట్రుకలు విరియబోసినను మిక్కిలి వేగముగ బోవువాడైయున్నను, కాళ్ళు చేతులతో భయంకరమైన శబ్దము చేయువాడైనను-అట్టివాడు, మరణకాలము సమీపించినవాని దూత యని తెలిసికొనవలెను.
మూ. నాగోదయం ప్రవక్ష్యామి ఈశానేనతు భాషితమ్ బ్రహ్మణాతు పురాసృష్టా గ్రహానాగాస్తనే కశః
అనంతం భాస్కరం విద్యాత్సోమం విద్యాత్తువాసుకీమ్ తక్షకం భూమి పుత్రంతు కర్కోటంచ బుధం విదుః
పద్మం బృహస్పతిం విద్యాన్మహా పద్మంచ భార్గవమ్ కులికః శంఖ పాలశ్చ ద్వావేతౌ తు శనైశ్చరః
పూర్వపాధః శంఖపాలో ద్వితీయః కులికస్తథా నిత్యం భాగే యథోద్దిష్టే దీన రాత్రీ తథైవ చ
శుక్ర సోమౌచ మధ్యాహ్నే ఉదయేతు క్షమాసుతః శనిః ప్రాగష్టమే భాగే దివా రాత్రైత్విహోచ్యతే
గ్రహాశ్చ భుంజతే చైవ శేషం భాగస్యలక్షణమ్ రవివారే సదాజ్ఞేయో పాదౌదశ చతుర్దశ
అష్టద్వాదశపై చంద్రే దశషష్ఠే కుజే తథా బుధస్య నవమే పాదే రాహౌచ దివసస్యచ
గురోర్ద్వితీయః షష్ఠశ్చ షోడశస్యతు వర్జయేత్ భాస్కరస్య దినేప్రోక్తే చదుర్ధే దశమేష్టమే
శనైశ్చర దినే పాదం త్యజేచ్చైవ సుదారుణమ్ ద్వితీయం ద్వాదశంచైవ షోడశస్యతు వర్జయేత్
ముహూర్త ఘటికా దూర్థ్వం ఘటికా చతుర్థం భాగం వింశతిశ్చ కుహూసుతం బుద్బుదం నిమేషమే తత్కాలస్య లక్షణమ్.
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్యాం సంహితాయాం బ్రాహ్మేపర్వణి పంచమి కల్పే దంశ దష్టక దూత లక్షణంనామ చతుస్రాంశోఽధ్యాయః
తా॥ ఇక శివుడు చెప్పిన విధముగా సర్పముల పుట్టుకను గురించి వివరింతును. పూర్వము బ్రహ్మదేవుడు గ్రహములను, నాగులను అనేకములుగ సృష్టించెను. అనంతుని సూర్యగ్రహముగ, చంద్రుని వాసుకిగను, తక్షకుని కుజునిగను, బుధుని కర్కోటకునిగను. పద్ముని బృహస్పతిగను, శుక్రుని మహాపద్మునిగను, కులిక శంఖపాలురనిరువురిని శనైశ్చరుడు గను తెలియవలెను. నిత్యము పగలు, రాత్రియను భాగములుండునట్లు మొదటి పాదము శంఖపాలుడనియు, రెండవపాదము కులీకుడనియు నెఱుంగవలేను. దివారాత్రములు గ్రహముల ఆధిపత్యముననుండును. మధ్యాహ్నమున శుక్రచంద్రులు, ఉదయమున సంగారకుడు ఎనిమిదవ భాగమునందలిముందు భాగము శని. ఇతర భాగములందిత కలిగియుందురు. ఆదివారమునాడు పదియవ, పదునాల్గవ పాదములు. సోమవారము ఎనిమిదవ, పన్నెండవ పాదములు, మంగళవారము ఆఱవ,పదవ భాగములును, బుధవారము తొమ్మిదవపాదము, (పగటి తొమ్మిదవ భాగము రాహువునందు). వ, పదునాఱవ పాదములు వదలి పెట్టవలేను. శనివారము మొదటిపాదము దారుణమైనది. దానిని వదలవలెను. అటులే రెండవ, పన్నెండవ, పదునాఱవ భాగములను కూడ వదలి పెట్టవలెను. రెండు గడియలకు పైన, నాలుగు గడియలలోపున నుండు కాలమును భాగమందురు. అట్టి ఇరువది భాగములను అరువది గడియల కాలమునకు సరి పెట్టినచో నొక 'అహోరాత్ర'మగును. కుహూసుత, బుద్బుద, నిమేషములు వ్యావహారిక కాలము యొక్క కనిష్ఠ ప్రమాణములు.
శతార్ధసాహస్ర సంహితయగు శ్రీభవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున పంచమీ కల్పమునందు దంశదష్టకదూత లక్షణ వర్ణన మనెడు ముప్పది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 34 of the Bhavishya Mahā Purana is as follows:
The clinical presentation of different types of snakebite is described: the immediate local effects, the progression of systemic symptoms, and the specific presentations that indicate which species was responsible for the bite. The concept of the messenger — the type of person or animal who first brings news of the snakebite to a physician — is introduced as a diagnostic tool: the characteristics of the messenger (direction from which they arrived, their clothing, their words) are held to indicate whether the victim will survive and what treatment will be most effective. This chapter represents a fascinating confluence of Āyurvedic clinical observation and the divinatory framework within which Purāṇic medicine operated.