2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము
36- అగస్త్యుఁడు కృష్ణామృత స్తోత్రమును చెప్పుట
వసిష్ఠ ఉవాచ :-
అవగత్య స వై సర్వం కారణం ప్రీతమానసః ।
ఉవాచ భార్గవం రామమగస్త్యః కుంభసంభవః ॥
అగస్త్య ఉవాచ :-
శృణు రామ మహాభాగ కథయామి హితం తవ ।
మంత్రస్య సిద్ధిం యేన త్వం శీఘ్రమేవ సమాప్నుయాః ॥
భక్తేస్తు లక్షణం జ్ఞాత్వా త్రివిధాయా మహామతే ।
యో యతేత నరస్తస్య సిద్ధిర్భవతి సత్వరమ్ ॥
ఏకదాఽహమునుప్రాప్తో ఽనంతదర్శనకాంక్షయా ।
పాతాళం నాగరాజేంధ్రైః శోభితం పరయా ముదా ॥
తత్ర దృష్టా మహాభాగ మయా సిద్ధాః సమంతతః ।
సనకాద్యా నారదశ్చ గౌతమో జాజలిః క్రతుః ॥
ఋభుర్హంసోఽరుణీశ్చైవ వాల్మీకి: శక్తిరాసురిః ।
ఏతేఽన్యే చ మహాసిద్ధ వాత్స్యాయనముఖా ద్వీజ ॥
ఉపాసత హ్యుపాసీనాః జ్ఞానార్థం ఫణినాయకమ్ ।
తం నమస్కృత్య నాగేంధ్రైః సహ సిద్ధైర్మహాత్మభిః ॥
ఉపవిష్టః కథాస్తత్ర శృణ్వానో వైష్ణవీర్ముదా ।
యేయం భూమిర్మహాభాగ భూతధాత్రీస్వరూపిణీ ॥
నివీష్టా పురతస్తస్య శృణ్వంతీ తాః కథాః సదా ।
యద్యత్పృచ్ఛతి సా భూమిః శేషం సాక్షాన్మహీధరమ్ ॥
శృణ్వంతి ఋషయః సర్వే తత్రస్థాః తదనుగ్రహాత్ ।
మయా తత్ర శ్రుతం వత్స కృష్ణప్రేమామృతం శుభమ్ ॥
స్తోత్రం తత్తే ప్రవక్ష్యామి యస్యార్థం త్వమిహాగతః ।
వారాహాద్యవతారాణాం చరితం పాపనాశనమ్ ॥
సుఖదం మోక్షదం చైవ జ్ఞానవిజ్ఞానకారణమ్ ।
శ్రుత్వా సర్వం ధరా వత్స ప్రహృష్టాతం ధరాధరమ్ ॥
ఉవాచ ప్రణతా భూయో జ్ఞాతుం కృష్ణవిచేష్టితమ్ ।
ధరణ్యువాచ :-
అలంకృతం జన్మ పుంసామపి నందవ్రజౌకసామ్ ॥
తస్య దేవస్య కృష్ణస్య లీలావిగ్రహధారిణః ।
జయోపాధినియుక్తాని సంతి నామాన్యనేకశః ॥
వసిష్ఠుడిట్లు చెప్పెను.
అగస్త్యుఁడు సర్వ విషయము నెఱింగెను. ప్రీతమానసుఁడయ్యెను. భార్గవుఁడయిన రామునితో నిట్లు చెప్పెను.
అగస్త్యుఁడిట్లు చెప్పెను.
ఓ మహాభాగ ! రామ ! ఆలకింపుము. నీకు హితమయినది చెప్పెదను. తన్మూలమున శీఘ్రముగా మంత్రిసిద్దీని పొందగలవు ఓ మహామతీ ! త్రివిధమయిన భక్తి లక్షణమును దెలిసికొని, ఎవడు ప్రయత్నించునో యతఁడు సత్వరముగా మంత్రసిద్ధిని పొందును. పూర్వ మొకప్పుడు నేను అనంతుని చూడగోరి పాతాళమున కరిగితినీ, ఆ పాతాళమో నాగరాజేంద్రులచే పరమ సంతోషమున శోభితము చేయబడినది. అందు నేను సర్వత్ర సనకాదులు నారదుఁడు, గౌతముఁడు, జాజలి, క్రతువు, ఋభువు, హంసుఁడు, అరుణి, వాల్మీకి, శక్తి, ఆధురి మొదలగు సిద్దులను చూచితిని. వీరినేకాక వాత్స్యాయనుడు మున్నగు ద్వీజముఖ్యులను చూచితీని, ఫణి నాయకుని సమీపమున వారందరు పవిష్టులై యుండిరి. వారు నాగేంద్రులతో మహాత్ములయిన సిద్దులతో ఫణిరాజునకు నమస్కరించి జ్ఞానార్ధము పూజించిరి. భూతధాత్రియైన భూమి, స్వరూపమును దాల్చి, కథలను సదా వినుచు ఆనాగ ప్రభుని మున్ముందు కూర్చుండెను. ఆ భూదేవి ఏ యే కథలను శేషుని నడుగునో ఆ కథలనన్నింటిని అందున్న ఋషులందరు ఫణిరాజానుగ్రహమున విందురు. ఆ ప్రదేశమున ఓ వత్స ! శుభంకరమయిన కృష్ణ ప్రేమామృత స్తోత్రమును నీకు చెప్పిదసు. పాపనాశనమయిన వారాహాద్యవతారముల చరీతమును, సుఖదము మోక్షదము, జ్ఞానవిజ్ఞాన కారణము నయిన దానిని ధరాదేవి వినినది. ధరాధరమైన భూమి ఆనందించినది. అంతియేకాక ఆ భూదేవి తన్ను నమస్కరించు వారు తెలిసికొనుట కోణకు కృష్ణ విచేష్టితమును చెప్పెను.
ధరణి ఇట్లు వివరించెను.
దేవుఁడయిన కృష్ణుని యొక్క జన్మ సర్వ వ్యక్తుల జీవితమును అలంకరించి ధన్యమొనర్చెను. నందుని పల్లెయందున్న వారిని లీలా విగ్రహధారుఁడయిన కృష్ణుఁడు శోభావంత మొనర్చెను. ఆతనికనేక నామములు. అయ్యవి యాతని జయచిహ్నములచే ఆపాదింపఁబడినవి.
తేషు నామాని ముఖ్యాని శ్రోతుకామా చీరాదహమ్ ।
తత్తాని బ్రూహి నామాని వాసుదేవస్య వాసుకే ॥
నాతః పరతరం పుణ్యం త్రిషు లోకేషు విద్యతే ।
శేష ఉవాచ :-
వసుంధరే వరారోహే జనానామస్తి ముక్తిదమ్ ॥
సర్వమంగళమూర్ధన్యమణిమాద్యష్టసిద్ధిదమ్ ।
మహాపాతకకోటిఘ్నం సర్వతీర్థఫలప్రదమ్ ॥
సమస్తజపయజ్ఞానాం ఫలదం పాపనాశనమ్ ।
శృణు దేవి ప్రవక్ష్యామి నామ్నామష్టోత్తరం శతమ్ ॥
సహస్రనామ్నాం పుణ్యానాం త్రిరావృత్యా తు యత్ఫలమ్ ।
ఏకావృత్యా తు కృష్ణస్య నామైకం తత్రయచ్ఛతి ॥
తస్మాత్పుణ్యవరం చైతత్స్తోత్రం పాతకనాశనమ్ ।
నామ్నామష్టోత్తరశతస్యాహమేవ ఋషిః ప్రియే ॥
ఛందోఽనుష్టుబ్ధేవతా తు యోగః కృష్ణప్రియావహః ।
“శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః ॥
వసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః ।
శ్రీవత్సకౌస్తుభధరో, యశోదావత్సలో హరిః ॥
చతుర్భుజాత్త చక్రాసిగదాశంఖాద్యుదాయుధః ।
దేవకీనందనః శ్రీశో నందగోపప్రియాత్మజః ॥
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః ।
పూతనాజీవితహరః శకటాసురభంజనః ॥
నందవ్రజజనానందీ సచ్చిదానందవిగ్రహః ।
నవనీతవిలిప్తంగో నవనీతనటోఽనఘః ॥
నవనీతలవాహారీ ముచికుందప్రసాదకృత్ ।
షోడశస్త్రీసహస్రేశస్త్రీభంగీ మధురాకృతిః ॥
శుకవాగమృతాబ్ధీందుర్గోవిందో గోవిధం పతిః ।
వత్సపాలనసంచారీ ధేనుకాసురమర్దనః ॥
తృణీకృతతృణావర్తో యమలార్జునభంజనః ।
ఉత్తాలతాలభేత్తా చ తమాలశ్యామలాకృతిః ॥
గోపగోపీశ్వరో యోగీ సూర్యకోటిసమప్రభః ।
ఇలాపతిః పరంజ్యోతిర్యాదవేంద్రో యదూద్వహః ॥
ఆ సామములయందు ముఖ్యమయినవానిని చిరకాలమునుండి వాసుకి ! వినకోరుచుంటిని. వాసుదేవుఁడయిన యాతని నామములను చెప్పుము. మూఁడు లోకముల యందు సంతకంటే ఉత్కృష్ణ పుణ్యతమమయిన విషయము లేదు.
శేషుఁడిట్లు వచించెను.
సౌందర్యవంతురాలవయిన ఓ వసుంధరా ! అష్టోత్తర శతనామ పూర్ణమయిన స్తోత్రమున్నది. అది జనులకు ముక్తిదము సర్వమంగళములకు మూర్ధన్యము అణిమాద్యష్టసిద్ధిదము, మహాపాతకముల నెన్నింటినైనను నాశనము చేయునది. సర్వతీర్థముల సేవించిన ఫలము నొసంగునది. సమస్తజపయజ్ఞములఫలమొసంగునదీ పాపనాశనమయినది. ఓ భూదేవి ! దానిని చెప్పెదను. వినుము. కృష్ణుని యొక్క ఒకే ఒక నామమును ఒకసారి జపించినందున ఏ పుణ్యము లభించునో, సహస్ర నామమును త్రివారము జపించిన నంతపుణ్యము కలుగును. అందుచే అష్టోత్తర శతనామము పుణ్యతరమయినది. పాపనాశన మయినది. ఈ అష్టోత్తర శత నామములకు ఓ భూదేవీ ! నేనే ఋషిని. ఛందస్సు అనుష్టుప్పు. కృష్ణునకు ప్రియమైన ‘యోగము’ దేవత. స్తోత్రము :- శ్రీకృష్ణః, కమలనాథః, వాసుదేవః, సనాతనః, వసుదేవాత్మజః, పుణ్యః, లీలామానుష విగ్రహః, శ్రీవత్సకౌస్తుభధరః, యశోదావత్సలః, హరీశ్, చతుర్భుజాచక్రా సిగదాశంఖాద్యుదాయుధః, దేవకీనందనః, శ్రీశః, నందగోపప్రియా త్మజః, యమునావేగసంహారీ, బలభద్రప్రియానుజః, పూతనజీవితహర, శకటాసురభంజనః, నందవ్రజజనానందీ, సచ్చిదానంద విగ్రహః, నవనీతవిలిప్తాంగః (వెన్నచే పూయఁబడిన యవయవములు గలవాఁడు), నవనీతనటః (వెన్నకొఱకు నాట్యము చేయువాఁడు) అనఘః, నవనీతలవహారీ, (కొంచెపు వెన్నను దొంగిలించువాఁడు), ముచికుందప్రసాదకృత్, (ముచికుంద ఋషిని అనుగ్రహించినవాఁడు) షోడశస్తీ (సహస్రశః) 16 వేల స్త్రీలకు పతి} త్రిభంగీ, మధురాకృతిః, శుకవాగమృతాఖీందుః (శుకుని వాక్యములను సముద్రము నుండి పుట్టిన చంద్రుం డు; గోవిందః, గోవిదాంపతిః (గో వాక్కు గోః గోవు వాగ్విదులకు పతి) వత్సపాలన సంచారీ, (ఆవు దూడలను పరిపాలించుచు, మేపుచు సంచరించువాఁడు. ధేనుకాసుర మర్దనః, తృణీకృత తృణావర్తః (గడ్డిపరకవలే నాశనము చేసిన తృణావర్తుఁడను రాక్షసుడు కలవాఁడు)
వనమాలీ పీతవాసాః పారిజాతాపహారకః ।
గోవర్ధనాచలోద్ధర్తా గోపాలః సర్వపాలకః ॥
అజో నిరంజనః కామజనకః కంజలోచనః ।
మధుహా మథురానాథో ద్వారకానాథకో బలీ ॥
బృందావనాంతసంచారీ తులసీదామభూషణః ।
సమంతకమణేర్హర్తా నరనారాయణాత్మకః ॥
కుబ్జాకృష్ణాంబరధరో మాయీ పరమపూరుషః ।
ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదః ॥
సంసారవైరీ కంసారీ, మురారీర్నరకాంతకః ।
అనాది బ్రహ్మచారీ చ కృష్ణావ్యసనకర్షకః ॥
శిశుపాలశిరశ్ఛేత్తా దుర్యోధనకులాంతకృత్ ।
విదురాక్రూరవరదో విశ్వరూపప్రదర్శకః ॥
సత్యవాక్సత్యసంకల్పః సత్యభామారతో జయీ ।
సుభద్రాపూర్వజో విష్ణుర్భీష్మముక్తిప్రదాయకః ॥
జగద్గురుర్జగన్నాథో వేణువాద్యవిశారదః ।
వృషభాసురవిధ్వంసీ బకారిర్భాణబాహుకృత్ ॥
యుధిష్ఠిరప్రతిష్ఠాతా బర్హిబర్హావతంసకం ।
పార్థసారథిరవ్యక్తో గీతామృతమహోదధిః ॥
కాలీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజః ।
దామోదరో యజ్ఞభోక్తా దానవేంద్రవినాశనః ॥
నారాయణః పరం బ్రహ్మ పన్నగాశనవాహనః ।
జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకః ॥
పుణ్యశ్లోకస్తీర్థపాదో వేదవేద్యో దయానిధిః ।
సర్వతీర్థాత్మకః సర్వగ్రహరూపీ పరాత్పరః ॥
ఇత్యేవం కృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ ।
కృష్ణేన కృష్ణభక్తేన శ్రుత్వా గీతామృతం పురా ॥
స్తోత్రం కృష్ణప్రియకరం కృతం తస్మాన్మయా శ్రుతమ్ ।
కృష్ణప్రేమామృతం నామ పరమానందదాయకమ్ ॥
అత్యుపద్రవదుఃఖఘ్నం పరమాయుష్యవర్ధనమ్ ।
దానం వ్రతం తపస్తీర్ధం యత్కృతం త్విహజన్మని ॥
పఠతాం శృణ్వతాం చైవ కోటికోటిగుణం భవేత్ ।
పుత్రప్రదమపుత్త్రాణామగతీనాం గతిప్రదమ్ ॥
వనమాలీ; పీతవాసాః, (పచ్చని వస్త్రము దాల్చువాఁడు) పారిజాతాపహారకః, గోవర్ధనాచలోద్ధర్తా (గోవర్ధన పర్వతము నెత్తినవాఁడు); గోపాలః, సర్వపాలకః; అజః (పుట్టనివాఁడు), నిరంజనః; కామజనకః (మన్మథుని తండ్రి) కంజలోచనః (పద్మములవంటి నేత్రములు కలవాఁ డు; మధుహా (మధు అను రాక్షసుని చంపినవాఁడు); మథురానాథః; ద్వారకానాథకః; దిలీ (బలవంతుఁడు); బృందావనాంతసంచారీ (బృందావనములో సంచరించువాఁడు), తులసీదామభూషణ (తులసీ దండ అలంకారముగా దాల్చువాఁడు) సమంతకమణీర్ణహర్తా (శమంతకమణిని హరించినవాఁడు), నరనరాయణాత్మకః; కుబ్జకృష్ణాంబరధరః; (కుబ్జచే ఆకర్షింపఁబడిన (అంబరము) వస్త్రము ధరించిన వాఁడు) మాయీ (మాయా స్వభావుఁడు}; పరమ పూరుషః (ఉత్తమ పురుషుఁడు), ముష్టికాసురచాణూరమల్లయుద్ద విశారదః (ముష్టికాసుర రాక్షసుఁడు; చాణూరు: డు అను మల్లులతో యుద్ధముచేసిన నేర్పరి}; సంసారవైరీ (సంసారమునకు విరోధి), కంసారీ (కంసుని శత్రువు}; మురారి (మురుడను రాక్షసునికి శత్రువు}; నరకాంతకః (నరకాసురుని చంపినవాఁడు), అనాది బ్రహ్మచారీ; (సనాతన బ్రహ్మచారి కృష్ణా వ్యసన కరకః కృష్ణ= ద్రౌపది (ద్రౌపది యొక్క కష్టము తొలగించినవాఁడు), శిశుపాలశిరశ్చేత్తా (శిశుపాలుని శిరస్సును ఛేదించినవాఁడు}; దుర్యోధన (కులాంతకృత్) దుర్యోధనుని వంశమును అంతము చేసినవాఁడు), విదురాక్రూరవరదః; (విదురునకు అక్రూరునకు వర మొసంగినవాఁడు) విశ్వరూపప్రదర్శకః (విశ్వరూపమును ప్రదర్శించినవాఁడు) సత్యవాక్; సత్యసంకల్పః, సత్యభామారతః (సత్యభామా ప్రియుఁడు), జయీ (జయ స్వభావము కలవాఁ డు) సుభద్రాపూర్వజః (సుభద్రకు అన్నగారు) విష్ణుః, భీష్మముక్తి ప్రదాయకః, జగద్గురుః (లోకమునకు గురువు}; జగన్నాథః (ప్రపంచమున కధీపతి), వేణువాద్య విశారదః (పిల్లంగోవి వాయిద్యమున నైపుణ్యము కలవాఁడు) వృషభాసుర విధ్వంసీ (వృషభాసురుని చంపినవాఁడు). బకారిః (బకాసురుని శత్రువు}; బాణ బాహుకృత్ (బాణునీ బాహువుల ఖండించినవాఁడు). యుధిష్ఠిర ప్రతిష్టాతా. (ధర్మరాజును రాజ్యమున ప్రతిష్టించినవాఁడు) బక్షీ బరావతం సకః (నెమలి యొక్క ఫించము నలంకరించుకోనినవాఁడు), పార్థసారధిః (అర్జునునకు రథసారథి; }; అవ్యక్తః (వ్యక్తము కానివాఁడు; గీతామృత మహోదధిః (గీత యను నమృతమునకు సముద్రము వంటివాఁడు) కాళీయఫణిమాణిక్యరంజిత
శ్రీపదాంబుజః; (కాళీయుఁడను పాము యొక్క తలమీఁది మాణిక్యముచే రక్తవర్ణమయిన మంగళకర పాదాబ్జములు కలవాఁడు); దామోదరః (త్రాడుచే కట్టబడిన ఉదరభాగము కలవాడు లేదా దండపొట్టపై వ్రేలాడువాఁడు), యజ్ఞభోక్త. (యజ్ఞముల అగ్నికి సమర్పింపబడు హవిస్సుల భుజించువాఁడు), దానవేంద్ర వినాశనః (రాక్షస రాజును నాశనము చేసినవాఁడు) నారాయణః (జ్ఞానమునకు స్థానమైన వాఁడు) పరంబ్రహ్మ : పరబ్రహ్మ పన్నగాశనవాహనః (పాములను తిను గరుత్మంతుడు వాహనముగా గలవాఁడు). జలక్రీడా సమాసక్తః (జలక్రీడ యందధికముగ నాసక్తి కలవాఁడు. గోపీవస్త్రాపహారకః పుణ్యశ్లోకః (పుణ్యవంతులచే కీర్తింపఁబడువాఁడు) తీర్ధపాదః తన పదమే తీర్థతుల్య పుణ్యస్థలమయినవాడు వేదవేద్యః వేదము చేతనే ఎఱుంగఁదగినవాఁడు దయానిధీ దయకు స్థానమయినవాఁడు, సర్వతీర్ణాత్మకః సర్వ తీర్థములకు ఆత్మయైనవాఁడు (సర్వతీర్థ సదృశుఁడు), సర్వగ్రహరూపి సర్వగ్రహ రూపమయినవాఁడు, పరాత్పరుఁడు అందరికంటే నధికుఁడైనవాఁడు. ఈ విధముగా కృష్ణదేవుని అష్టోత్తర శత (108) నామస్తోత్రము. కృష్ణునకు ప్రియమయిన ఈ స్తోత్రము కృష్ణ భక్తుఁడయిన వేదవ్యాసునిచే, కృష్ణుని వలన గీతామృతము విన్న పిమ్మట, రచింపఁబడినది. ఆ వ్యాసుని వలన నేను వింటిని, దీనీ నామము కృష్ణ నామా మృతము, అత్యంతానంద మొసంగునది, అత్యుపద్రవములను దుఃఖమును నాశనము చేయునది. ఆయుర్వర్ధనము. దానము, తపము, వ్రతము తీర్థయాత్ర మున్నగునవి యేవి యేవి యీ జన్మలో నాచరింపఁబడినవో యవి యన్నియు కోటికోటి గుణవంతములయి చదివిన వారికి, వినిన వారికి ఫలవంతములగును. ఇయ్యదీ అ పుత్తకులకు పుణ్యప్రదము, పుత్రదము, ఉత్తమగతి లేనివారికి గతి (మోక్షము)నీ ఒసంగునది.
ధనావహం దరిద్రాణాం జయేచ్చూసాం జయావహమ్ ।
శిశూసాం గోకులాసాం చ పుష్టిదం పుణ్యవర్ధనమ్ ॥
బాలరోగ గ్రహాదీనాం శమనం శాంతికారకమ్ ।
అంతే కృష్ణస్మరణదం భవతాపత్రయాపహమ్ ॥
అసిద్ధసాధకం భధ్రే జపాదికరమాత్మనామ్ ।
కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే ॥
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే ।
ఇమం మంత్రం మహాదేవి జపన్నేవ దివానీశమ్ ॥
సర్వగ్రహానుగ్రహభాక్సర్వప్రియతమో భవేత్ ।
పుత్రపౌత్రైః పరివృతః సర్వసిద్ధిసమృద్ధిమాన్ ॥
నిషేవ్యభోగానంతేఽపి కృష్ణసాయుజ్యమాప్నుయాత్ ।
అగస్త్య ఉవాచ :-
ఏతావదుక్తో భగవాననంతో మూర్తిస్తు సంకర్షణసంజ్ఞతా విభో ।
ధరాధరోఽలం జగతాం ధరాయై నిర్దిశ్య భూయో వీరరామ మానదః ॥
తతస్తు సర్వే సనకాదయో యే సమాస్థితాస్తత్పరీతః కథాదృతాః ।
ఆనందపూర్ణాంబునిధౌ నిమగ్నాః సభాజయామాసురమీశ్వరం తం ॥
ఋషయః ఊచుః:-
నమో నమస్తేఽఖిలవిశ్వభావన ప్రపన్నభక్తార్తిహరావ్యయాత్మన్।
ధరాధరాయాహి కృపార్ణవాయ శేషాయ విశ్వప్రభవే నమస్తే ॥
కృష్ణామృతం నః పరిపాయితం విభో విధూతపాపా భవతా కృతా వయమ్ ।
భవాదృశా దీనదయాళవో విభో సముద్ధరంత్యేవ నిజాన్హి సంనతాన్ ॥
ఏవం నమస్కృత్య ఫణీశపాదయోర్మనో విధాయాఖిలకామపూరయోః ।
ప్రదక్షికృత్య ధరాధరాధరం సర్వే వయం స్వావసథానుపాగతాః ॥
దరిద్రులను ధనవంతుఁలజేయును. జయము కోరువారికి జయమును గలిగించును. శిశువులకు, గోవ్రజమునకు పుష్టి నొసంగునది. అంతీయేకాక పుణ్యవర్దకము. బాలరోగ గ్రహములు మొదలయిన వానికి శమము కలిగించును. శాంతి కలిగించును. భవతాప త్రయమును తొలగించి కృష్ణ స్మరణము తుదిని కల్గించును. ఇంతకు పూర్వము సిద్ధి పొందని వానికి సిద్ధిని కలిగించును. ఇయ్యది ఆత్మకు జపాదికముల గల్గించును.
కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే ।
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే॥
“కృష్ణునకు, యాదవేంద్రునకు, జ్ఞానముద్రునకు యోగికి, లోకనాథునకు, రుక్మిణీ భర్తకు, వేదాంతవేదియైన వానికి నమస్కారము.” ఓ భూ దేవి ! దీవానీశలు ఈ మంత్రమును జపించుచునే సర్వ గ్రహముల అనుగ్రహమునకు అరుఁడు, సర్వ ప్రియతముఁడు నగును. ఆతఁడు పుత్ర పౌత్రులచే పరివృత్తుఁడగును. సర్వ సిద్ధి సమృద్ధిమంతుఁడను. భోగములనన్నిటిని సేవించి, తుదిని ఆతఁడు కృష్ణునితోడి సాయుజ్యమును పొందును.
అగస్త్యుఁడిట్లనేను :
ఇంతవరకు సంకరణ సంజ్లితుఁడు భగవంతుఁడు, సర్వ ప్రపంచమునకు భూమికి ఆధారుఁడు, సర్వులకు గౌరవము నోసంగువాఁడు నగు ఆదిశేషుడు అనంతమూర్తి అని చెప్పి, ఈ కృష్ణామృతస్తవమును మరల నిర్దేశించి కథాసక్తపరులయిన సనకసనందనాదులు ఆనంద పూర్ణాంబుధి యందు నిమగ్నులయిరి. ఆ సర్పరాజయిన అనంతుని, వారందరు గౌరవించిరి.
ఋషులిట్లనిరి :
సర్వ విశ్వపావనునకు (సర్వ ప్రపంచమును (విశ్వమును) పునీతము చేయువానికి) అవ్యయాత్మునకు, ఆశ్రయము పొందిన భక్తుల యొక్క ఆర్తిహరునకు, విశ్వప్రభవమునకు కారణమయిన ఆదిశేషునకు కృపాసింధునకు నమస్కారము. ఓ విభూ ! కృష్ణామృతమును మాచే ననుభవింపజేసితివి. మేమందరము నీచే తొలఁగ గొట్టంబడిన పాపములు కలవారమయితిమీ. దీనుల యెడ దయాలురయిన నీవంటివారు. వంగి నమస్కరించిన వారిని సముద్దరింతురు. ఈ విధముగా సర్పరాజ పాదములకు నమస్కరించి, మా కోరికలను దీర్చునట్టి వానీకి మనస్సుల సమర్పిరించి, మేమందరము
ఇతి తేఽభిహితం రామ స్తోత్రం ప్రేమామృతాభిధమ్ ।
కృష్ణస్య పరిపూర్ణస్య రాధాకాంతస్య సిద్ధిదమ్ ॥
ఇదం రామ మహాభాగ స్తోత్రం పరమదుర్లభమ్ ।
శ్రుతం సాక్షాద్భగవతః శేషాత్కథయతః కథాః ॥
యావంతి మంత్రజాలాని స్తోత్రాణీ కవచాని చ ।
త్రిలోక్యే తానీ సర్వాణి సిద్ధ్యంత్యేవాస్య శీలనాత్ ॥
వసిష్ఠ ఉవాచ :-
ఏవముక్త్వా మహారాజ కృష్ణ ప్రేమామృతం స్తవమ్ ।
యావద్వ్యరంసీత్స మునిస్తావత్ స్వర్యానమాగతమ్ ॥
చతుర్భిరద్బుతైః సిద్ధైః కామరూపై: మనోజవైః ।
అనుయాతముథోత్ప్లుత్య స్త్రీ పుంసౌ హరిణౌ తదా ॥
అగస్త్య చరణౌ నత్వా సమారురుహతుర్ముదా ।
దీవ్యదేహధరౌ భూత్వా శంఖచక్రాదీచిహ్నితౌ ॥
గతౌ చ వైష్ణవం లోకం సర్వదేవనమస్కృతమ్ ।
పశ్యతాం సర్వభూతానాం భార్గవాగస్త్యయోస్తథా ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తీ మధ్యభాగే, తృతీయ ఉపోద్ఘాతపాదే
భార్గవచరితే షట్రింశత్తమోఽధ్యాయః॥
భూమిని ధరించు అనంతునకు ప్రదక్షిణ నమస్కృతులాచరించి, మేము మామా నిజ నివాసముల కరిగితిమి. ఓ రామ ! ఈవిధముగా ప్రేమామృతమను పేరుగల ఈ స్తోత్రమును నీ కొకు చెప్పితిని. పరిపూర్ణుఁడు రాధాకాంతుఁడునయిన కృష్ణుని ఈ ప్రేమామృతము పరమదుర్లభమయినది. సాక్షాత్ భగవానుడయిన ఆదిశేషుఁడు చెప్పునట్టి కథలు, మంత్రజాలములు, స్తోత్రములు కవచములు త్రిలోకము నందేవియున్నవో యవి సర్వము శీలవంతులగు త్రైతులకు సిద్ధించును. వసిష్టుడు పలికెను.
ఓ మహారాజ ! ఈ విధముగా కృష్ణ ప్రేమామృతస్తవమును చెప్పి ముని విరమించినంతనే యచ్చటికోక విమానమేతెంచెను. ఆ విమానమును కామ రూపులయిన నల్గురు అద్భుత వ్యక్తులు మనోవేగముతోనననుసరించిరి. మృగము మృగీయు అగస్త్యుని పాదపద్మములకు వంగి నమస్కరించి సంతోషముగా ఆ విమానము నధిరోహించిరి. దేహధారులందరు అగస్త్యులు, భార్గవుఁడు చూచుచుండగనే, ఆ మృగద్వయము శంఖచక్రాది చిహ్నితులయి సర్వదేవ నమస్కృతమయిన వైష్ణవలోకమున కరిగిరి. ప్రత్యక్షముగా భార్గవాగస్త్యులు వారీ గతిని చూచునే యుండిరి.
ఇది మహాపురాణము వాయుప్రోక్తమునయిన శ్రీ బ్రహ్మాండపురాణమున, మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరీతమున ముప్పది ఆరవ అధ్యాయము.
