2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము

Table of Contents

10 - స్కంద జననము పితృవంశము - శ్రాద్ధము నాచరించి పితరులను తృప్తిపరచుట

బృహస్పతి రువాచ :-

సప్తైతే జయతాం శ్రేష్ఠాః స్వర్గే పితృగణాః స్మృతాః ।

చత్వారో మూర్తిమంతశ్చ త్రయస్తేషామమూర్తయః ॥

తేషాం లోకాన్విసర్గం చ కీర్తయిష్యే నిబోధత ।

యా వై దుహితరస్తేషాం దౌహిత్రాశ్చైవ యే స్మృతాః ॥

లోకాః సంతానకా నామ యత్ర తిష్ఠంతి భాస్వరాః ।

అమూర్తయః పితృగణాస్తే వై పుత్రాః ప్రజాపతేః ॥

విరాజస్య ద్వీజశ్రేషా వైరాజా ఇతి విశ్రుతాః ।

ఏతే వై పితరస్తాత । యోగానాం యోగవర్థనాః ॥

అప్యాయయంతి యే నిత్యం యోగాయోగబలేన తు ।

శ్రాద్ధారాప్యాయితాస్తే వై సోమమాప్యాయయంతి చ ॥

ఆప్యాయితాస్తతః సోమో లోకానాప్యాయయత్యుత ।

ఏతేషాం మానసీ కన్యా మేనా సోమ మహాగిరేః ॥

పత్నీ హిమవతః పుత్రో యస్యా మైనాక ఉచ్యతే ।

పర్వతప్రవరః సోలిథ క్రౌంచశ్చాస్య గిరేః సుతః ॥

త్రిస్రః కన్యాసు మేనాయాం జనయామాస శైలరాట్ ।

అపర్ణామేకపర్ణాం చ తృతీయామేకపాటలామ్ ॥

న్యగ్రోధమేకపర్ణా తు పాటలం శ్వేకపాటలా ।

ఆశ్రీతే ద్వే అపర్ణా తు హ్యనికేతా తపోచరత్ ॥

శతం వర్షసహస్రాణాం దుశ్చరం దేవదానవైః ।

ఆహారమేకపర్ణేన హ్యేకపర్ణా సమాచరత్ ॥

పాటలేనైవ చైకేన వ్యదధాదేకపాటలా ।

పూర్ణే వర్షసహస్ర ద్వే చౌహారం పై ప్రచక్రతుః ॥

ఏకా తత్ర నిరాహారా తాం మాతా ప్రత్యభాషత ।

నిషేధయంతీ సోమేతి మాతృస్నేహేన దుఃఖితా ॥

సా తథోల్తా తదాఖపర్ణా దేవీ దుశ్చరచారిణీ ।

ఉమేతి హి మహాభాగా త్రిషు లోకేషు విశ్రుతా ॥

తథైవ సోమ్నా తేనాసౌ నీరుక్తాక్షేన కర్మణా ।

ఏతత్తు త్రికుమారీకం జగతావరజంగమమ్ ॥

ఏతాసాం తపసా సృష్టం యావద్భూమిర్ధరిష్యతి ।

తపఃశరీరాస్తాః సర్వాస్తిస్రో యోగబలాన్వితాః ॥

బృహస్పతి చెప్పెను ;

ఈ సప్తపితృగణములు, స్వర్గము నందు విజయవంతులలో మిక్కిలి శ్రేష్ఠులు. వారిలో నలుగురు మూర్తిమంతులు (రూపములు కలవారు). మిగిలిన మువ్వురు అమూర్తిమంతులు. శ్రద్ధగా వినుఁడు : వారి యొక్క సృష్టిని గూర్చి వారి లోకముల గూర్చియు వివరించేదను. వారి దుహితలుగాను, దౌహిత్రులుగాను నెవ్వరు స్మరింపఁబడుచున్నారో వారిని గూర్చి చెప్పెదను. (2) సంతానకములను పేరు. గల లోకము లందు అమూర్తిమంతులయ్యు భాస్వరులయిన పితరులు వసింతురు. ఆ పితరులు ప్రజాపతి కుమారులు (3) ఓ బ్రాహ్మణులారా ! వారు ప్రజాపతియైన విరజుని కుమారులు. అందుచే వారు వైరాజులని విశ్రుతులు. వారు ఉత్తమ బ్రాహ్మణులు, వారు యోగుల యొక్క యోగ బలమును వృద్ధి చేయుట వలన పితరులు. (4) వారు నిత్యము తమ యోగబలముచే ఇతరుల యోగ బలములను శాశ్వతముగా వృద్ధి పొందింతురు. శ్రాద్ధముల వలన వారు బలవంతులు, వృద్ధిమంతులు. వారు సోముని (చంద్రుని) వృద్ధి పరతురు. ఈ విధముగా బలవంతుఁడు వృద్ధిమంతుఁడు అయిన సోముఁడు లోకములను వృద్ధిపరచును, బలపరచును. వీరి మానసీకన్య మేనక ఈమె మహా పర్వతమయిన హిమవంతుని పత్ని. ఆమె యందుదయించిన పుత్రుఁడు మైనాకుఁడనం బడును. ఈ పర్వతము యొక్క కుమారుఁడు క్రౌంచము. క్రౌంచము పర్వతశ్రేష్ఠము. మేనక)వలన పర్వత రోజునకు ముగ్గురు కన్యలు కలిగిరి. వారు- అపర్ణ, ఏకపర్ణ, మూఁడవది ఏకపాటల, వారిలో ఇరువురు ఆశ్రయములందిరీ; ఏకపర్ణ న్యగ్రోధ (మట్టి) వృక్షము కిందను, ఏకపాటల -పాటల వృక్షము క్రిందను ఆశ్రయములను పొందిరి. అపర్ణ అనికేతనయై తపస్సాచరించెను. (9) ఏకపాటల యొకేయొక పాటల పుష్పమును ఆహారముగా గ్రహించెను. వారీ ఆహారమునయినను శత సహస్ర వర్షములలో ఒకే యొక మారు గ్రహించిరి. (10) వారీలో నోకతే ఆహారమును గ్రహింపకయే తపమాచరించెను. మాతృ స్నేహమున దుఃఖితురాలయిన ఆమె తల్లి తపమాచరించవలదని (దానినే కాళిదాసు ఉమేత మాత్రా తపసో నిషిద్దా) 'ఉ' మా (తల్లీ ! వలదనీ) నిషేధించేను. దుష్కరమయిన తపస్సాచరించు అపర్ణ తల్లిచే నా విధముగా చెప్పఁబడి మూఁడు లోకముల యందు “ఉమ' అను పేరుతో విశ్రుతమయ్యెను.(13) అట్టి యర్ధమిచ్చు పదముతో ఆమె ప్రసిద్ధురాలయ్యెను. స్థావర జంగమాత్మక మయిన యీ ప్రపంచము ఇట్టి కుమారీత్రయమును గలిగియున్నది.(14) ఈ మువ్వురీ తపస్సుచే " సృష్టింపఁబడినట్టిదీ ఈ భూతియున్నంత కాలముండును. ఆ మువ్వురు యోగశక్తి కలితలు. తపస్సు వారీ భౌతిక శరీరములను భరించినది.

సర్వాస్తాః సుమహాభాగాః సర్వాశ్చ స్థిరయౌవనాః ।

సర్వాశ్చ బ్రహ్మవాదిన్యః సర్వాశ్చైవోర్ధ్వరేతసః ॥

ఉమా తాసాం వరిషా చ శ్రేష్టా చ వరవర్జినీ ।

మహాయోగ బలోపేతా మహాదేవముపస్థితా ॥

దత్తకశ్చోశనస్తస్యాః పుత్రో వైభృగునందనః ।

అసీతస్యైకపర్ణా తు పత్నీ సాధ్వీ పతివ్రతా ॥

దత్తా హిమవతా తస్మై యోగాచార్యాయ ధీమతే ।

దేవలం సుపువే సాతు బ్రహ్మిష్ఠం జ్ఞాన సంయుతా ॥

యా వై నాసాం కుమారీణాం తృతీయా చైకపాటలా ।

పుత్రం శతశలాకస్య జైగీషవ్యముపస్థితా ॥

తస్యాపి శంఖలిఖితా స్మృతా పుత్రావయోనిషో ।

ఇత్యేతా వై మహాభాగాః కన్యా హిమవతః శుభాః ॥

రుద్రాణీ సా తు ప్రవరా స్వైరుణ్ణిరతిరోచ్యతే ।

అన్యోన్యప్రీతమనసోరుమాశంకరయోరథ ॥

శ్లేషం సంసక్తయోర్ జ్ఞాత్వా శంకితః కిల వృత్రహా ।

తాభ్యాం మైథునసక్తాభ్యోమపత్యోద్భవభీరుణా ॥

తయోః సకాశమింద్రేణ ప్రేషితో హవ్యవాహనః ।

అనయోరతివిఘ్నం చ త్వమాచర హుతాశన ॥

సర్వత్ర గత ఏవ త్వం న దోషో విద్యతే తవ ।

ఇత్యేవముక్తీ తు తదా వహ్నినా చ తథాకృతమ్ ॥

ఉమాం దేవః సముత్సృజ్య శుక్రం భూమౌ వ్యసర్జయత్ ।

తతో రుషితయా సద్యః శక్తోగ్నీరుమయా తయా ॥

ఇదం చోక్తపతీ వహ్నిం రోషగద్గదయా గిరా ।

యస్మాన్నావవితృష్ఠాభ్యాం రతివిఘ్నం హుతాశన ॥

కృతవానస్య కర్తవ్యం తస్మాత్ త్వమసి దుర్మతిః ।

యదేవం విగతం గర్భం రౌద్రం శుక్రం మహాప్రభమ్ ॥

గరే త్వం ధారయస్వైవమేషా తే దండధారణా ।

స శాపదోషాద్రుద్రాణ్యా అంతర్గర్భో హుతాశనః ॥

బహూన్వరగణాన్దర్భం ధారయామాస వై ద్వీజ ।

స గంగామభిగమ్యాహశ్రూయతాం సరిదుత్తమే ॥

వారందరు మహాభాగలు. వారందరు స్థిరమౌవనలు. వారందరును బ్రహ్మవాధీనులు. వారందరు ఊర్ద్వ రేతసులు. (ఇంద్రీయ విజేతలు). వారిలో ఉమ వరిష్ణురాలు, శ్రేష్ఠురాలు. ఆమె ఉత్తమోత్తమమైన సౌందర్యము కల వరవర్జిని. ఆమె మహాయోగ బలోపేత. ఆమె మహాదేవున కంకితమయినది. (మహాదేవుని చేరినది). భృగు నందనుఁడయిన ఉశనుఁడు ఆమెకు దత్త పుత్రుఁడయ్యెను. (17) సాధ్వియు, పతీవ్రతయునైన ఏకపర్ణ అసితుని యొక్క పత్ని యయ్యెను. ఆతఁడు అసితుడు యోగాచార్యుఁడు. ధీమంతుఁడు యోగాచార్యుడు. జ్ఞాన సంయుతురాలైన యామె దేవలుని ప్రసవించెను. ఆతఁడో బ్రహ్మిష్ణుఁడు. (20) ఆ కుమారీ త్రయములో మూఁడవది యైన ఏకపాటల, శతశలాకుని పుత్రుఁడయిన జైగీషవ్యునకు అంకితయయ్యెను. శంఖ లిఖితులు - ఇరువురామే పుత్రులుగా చెప్పబడుచున్నారు, కాని వారు అయోనిజులయిన పుత్రులు. ఇవ్వీరు మహా భాగ్యవంతురాండ్రయిన హిమవంతుని కుమార్తెలు, (21) జ్యేష్ఠ దుహిత రుద్రాణి రుద్రుని యొక్క భార్య). స్వీయములయిన గుణములచే ఆమె ఇతరులకంటే శ్రేష్ఠతమమైనది. ఉమాశంకరులు అన్యోన్య ప్రీత మనస్కులయిరి. వారీరువురి యొక్క ప్రేమ నెఱిగి, వారీ మైథునమున జనించు పుత్రుని గూర్చి ఇంద్రుఁడు శంకితుఁడయ్యెను. ఇంద్రుఁడు హవ్యవాహనుఁడయిన అగ్నిని వారిరువురి యొద్దకు పంపించుచు “ఓ హుతాశన ! వారిరువురి యొక్క రతికి విఘ్నమును కలిగించుము. నీ వగ్నివి. అంతటనుండువాడవు. అందుచే నీ యందే దోషముండదు”. అని చెప్పెను ఈ విధముగా చెప్పఁబడిన అగ్ని ఆ చెప్పిన విధముగా నాచరించెను. (25) ప్రభువు (ఈశ్వరుఁడు) ఉమను పరిత్యజించి శుక్రమును భూమీపై విడిచెను. అంత ఉమ కుపితురాలయ్యేను. ఆమెచే అగ్ని వెంటనే శపింపఁబడెను. రోష గద్గదీకము చెందిన పలుకులతో ఆమె అగ్నిని గూర్చి ఓ అగ్నీ ! మేము తృప్తి చెందుటకు పూర్వమే నీవు మా రతిక్రియకు విఘ్న మాపాదించితివి. నీవు చేయకూడని యట్టి కార్య మాచరించితివి. అందుచే నీవు దుష్టబుద్ధివి. దుర్మతివి, పైకి వచ్చి మిక్కిలి ప్రభావవంతమయిన రుద్రుని శుక్రము, విగత గర్భయై నదీ ఆ గర్భమును నీవు ధరించుము. నీవు గైకొని వెడలుము. ఇదియే నీకు “దండధారణము” అనెను. రుద్రాణి యొసంగిన శాపము వలన, అగ్ని స్వదోష ఫలితముగా, అంతర్గర్బుఁడయ్యెను. ఈ యంతర్గర్భమును అగ్ని చాల వర్షగణములు భరించెను. ఆ యగ్ని గంగా సరిదుత్తమను చేరెను. నదిని సమీపించి ఇట్లనెను. “ఓ సరిదుత్తమమా ! నా పలుకు లాలకింపుము. (30)

సుమహాన్పరిభేదో మే జాయతే గర్భధారణాత్ ।

మద్ధితార్థమథో గర్భమిమం ధారయ నిమ్నగే ॥

మత్ప్రసాదాచ్చ తనయో వరదస్తే భవిష్యతి ।

తథోత్యుక్త్వా తదా సా తు సంప్రహృష్టా మహానదీ ॥

తం గర్భం ధారయామాస దహ్యమానేన చేతసా ।

సాపి కృచ్ఛేణ మహతా ఖేద్యమానా మహానదీ ॥

ప్రకృష్టం వ్యసృజధర్భం దీప్యమానమీవానలమ్ ।

రుద్రాగ్నిగంగాతనయస్తత్ర జాతో రుణప్రభః ॥

ఆదిత్యశతసంకాశో మహాతేజాః ప్రతాపవాన్ ।

తస్మిన్ జాతే మహాభాగే కుమారే జాహ్నవీసుతే ॥

విమానయానైరాకాశం పతత్రిభిరీవావృతమ్ ।

దేవదుందుభయో నేదురాకాశే మధురస్వనాః ॥

ముముచుః పుష్పవర్షం చ ఖేచరాః సిద్ధచురణాః ।

జగుర్గంధర్వముఖ్యాశ్చ సర్వశస్తత్ర తత్ర హ ॥

యక్షా విద్యాధరాః సిద్ధాః కిన్నరాశ్చైవ సర్వశః ।

మహానాగసహస్రాణి ప్రవరాశ్చ పతత్రిణః ॥

ఉపతస్థుర్మాహాభాగమాగ్నేయం శంకరాత్మజమ్ ।

ప్రభావేన హతాస్తేన దైత్యదానవరాక్షసాః ॥

స హి సప్తర్షిభార్యాభిరారాదేవాగ్నీసంభవః ।

అభిషేకప్రయాతాభిర్ఘృష్ణో వర్ణ్య త్వరుంధతీమ్ ॥

తాభిః స బాలార్కనిభో తాద్రః పరివృతః ప్రభుః ।

స్నిహ్యమానాభిరత్యర్థం స్వకాభిరివ మాతృభిః ॥

యుగపత్సర్వదేవీభిర్దిధితుర్జాహ్నవీసుతః ।

షణ్ముఖాన్యసృజశ్రీమాంస్తేనాయం షణ్ముఖః స్మృతః ॥

తేన జాతేన మహతా దేవానామసహిష్ణవః ।

స్కందితా దానవగణాస్తస్మాత్సందః ప్రతాపవాన్ ॥

కృత్తికాభిస్తు యస్మాత్స వర్థితో హి పురాతనః ।

కార్తికేయ ఇతి ఖ్యాతస్తస్మాదసురసూదనః ॥

జృంభతస్తస్య దైత్యాలేర్జ్వాలామాలాకులా తదా ।

ముఖాద్వినిర్గతా తస్య స్వశక్తిరపరాజితా ॥

క్రీడార్థం చైవ స్కందస్య విష్ణునా ప్రభవిష్ణునా ।

గరుడాదతిసృజే హి పక్షిణా ద్వౌ ప్రభద్రకే ॥

మయూరః కుక్కుటశ్చైవ పతాకా చైవ వాయునా ।

యస్య దత్తా సరస్వత్యా మహావీణా మహాస్వనా ॥

నాకీ గర్భ ధారణము వలన సుమహా పరిభేదము కలిగినది. అందుచే నాహితార్థము ఓ మహానదీ ! ఈ గర్భమును నీవు ధరింపుము. (31) నా ప్రసాదము వలన నీకొక కుమారుండుదయించును. ఆతఁడో వరదుఁడగును”, ప్రహృష్ణురాలయి ఆ మహానది (గంగ) 'అట్లే' చేయుదునని గర్బమును ధరించెను. కాని ఆమె మనస్సు దందహ్యమాన మయ్యెను. ఆమె యందు మంటలు కలిగెను. అత్యంతమయిన. అగ్ని జ్వాలలచే అధికముగా దుఃఖించునట్టిదయిన ఆ మహానది, మహాగ్ని వలె ప్రకాశించు నా గర్భమును విసర్జించెను. అంత రుద్రాగ్నీగంగాతనయుఁడుద్భవించెను. ఆ బాలుడు అరుణ ప్రభావిరాజితుఁడు. శత సూర్యుల కాంతీతో తుల్యుఁడు, మహాతేజుఁడు, ప్రతాప వంతుఁడు. మహాభాగుండయిన జాహ్నవీ సుతుఁడు పుట్టగనే ఆకాశమెల్లెడల దేవవిమానములచే పక్షులచే ఆక్రమించినట్లు ఆవృతమయ్యేను. మధుర స్వనములయిన దేవదుందుభులు ఆకాశమున మ్రోగెను. (36) ఆకాశమున చరించు సిద్ధులు చారణులు పుష్పవర్షమును గురిపించిరి. గంధర్వ ముఖ్యులందరు ఇందు అందు సర్వత్ర గానములు సల్పిరి. యక్షులు, విద్యాధరులు, సిద్ధులు, కిన్నరులు, సర్వత్ర, మహానగ సహస్రములు, శ్రేష్ఠతమములయిన పక్షులు (38) అగ్ని సంబంధముగా నుదయించినవాఁడు, మహాభాగుండునయిన శంకరాత్మజునీ సగౌరవముగా సమీపించిరి. దైత్యులు, దానవులు, వానరులు, రాక్షసులు (ఆ బిడ్డ) మహాప్రభావముచేత ఆహతులయిరి. సప్తర్షుల భార్యలందరు, ఒకర్తె అరుంధతి తక్క అగ్ని కుదయించిన కుమారుని దగ్గరకు పోయి చూచిరి. ఆ ఋషి పత్నులందరు అభిషేకార్థము బయలుదేరి పోవుచు వచ్చి చూచిరి. ప్రేమావృతులయిన ఆ మునిపత్నులచే బాలార్క తేజుఁడయిన రుద్ర కుమారుఁడు తన తల్లులచే పరివృతుఁడయ్యెనా యన్నట్లు పరివృతుఁడయ్యెను. (41) జాహ్నవీ సుతుఁడు ఒకేసారి సర్వముని పత్నుల పాలుగుడువ వాంఛించెను. అందుచే ఆ మహాసుతుఁడు ఆరు ముఖములను సృజించెను. అందుచే నతఁడు షణ్ముఖుఁ డయ్యెను. (42) మహానుభావుండుదయింపగా దేవతల యొక్క మహత్తును సహింప శక్తిజాలని దానవులు ఆతని ప్రతాపమునకు నీరు కార్చిరి. (విరేచనములకు పాలయిరి). అందుచే ఆ మహాప్రభువు స్కందుఁడయ్యెను. (43) పురాతనుఁడయిన జగత్ర్పభువు, రాక్షసాంతకుఁడు, కృత్తికలచే స్తన్యము లీయబడియుండుటచే కార్తికేయుడని ప్రఖ్యాతి గాంచెను. (44) దానవుల శత్రుఁడగు నీ బిడ్డడు ఆవలింపగనే ఆతని ఆయుధమయిన అపరాజితా శక్త్యాయుధము ఆతని ముఖము నుండి ఆవిర్భవించేను. ఆవిర్భవించు నయ్యదీ జ్వాలామాలా పరంపరలచే ఆకుల మయ్యెను. ప్రభవిష్ణువయిన విష్ణువు గరుడునిచే కార్తికేయునికి ఆడుకొనుటకు నెమిలినీ కోడిని పంపించెను. కుక్కుటమును పతాకముగా వాయువొసంగేను. మధురస్వనవంతమయిన వీణను సరస్వతి యొసంగెను.

అజః స్వయంభువా దతో మేషో దత్తశ్చ శంభునా ।

మాయావిహరణే విప్ర గిరౌ క్రౌంచే నిపాతితే ॥

తారకే చాసురవరే సముదీర్ణే నిపాలితే ।

సేంద్రోపేందైర్మహాభాగైర్దేవైరగ్నిసుతః ప్రభుః ॥

సేనాపత్యేన దైత్యారిరభిషిక్తః ప్రతాపవాన్ ।

దేవసేనాపతిస్వేషపర్యతే సురనాయకః ॥

దేవారిస్కందనః స్కందః సర్వలోకేశ్వరః ప్రభుః ।

ప్రమథై ర్వివిధైర్దేవస్తథా భూతగడైరపి ॥

మాతృభిర్వివిధాభిశ్చ వినాయకగణేస్తతః ।

లోకాః సోమపదా నామ మరీచేర్యత్ర పై సుతాః ॥

తత్ర తే దివి వర్తంతే దేహస్తాన్పూజయంత్యుత ।

శ్రుతో బర్హిషదో నామ పితరః సోమపాస్తు తే ॥

ఏతేషాం మానసీ కన్యా అచ్ఛోదా నామ నీమ్నగా ।

అచ్ఛోదం సోమ తద్దివ్యం సరో యస్మాత్సముద్గీతా ॥

తయా చ దృష్టపూర్వాస్తు పితరస్తే కదాచన ।

సంభూతా మానసీ తేషాం పితృస్పాన్నాభిజానతీ ॥

సా త్వస్యం పితరం వడ్రే తానతిక్రమ్య వై పితృస్ ।

అమావసుమీతి ఖ్యాతమైలపుత్రం నభశ్చరమ్ ॥

ఆదికాప్సరసా యుక్తం విమానాధిష్ఠితం దివి ।

సా తేన వ్యభిచారేణ గగనే నాప్రచారిణీ ॥

పితరం ప్రార్థయిత్వా న్యం యోగభ్రష్టా పపాత హ ।

త్రీణ్యపశ్యద్విమానాని పతంతీ సా దివశ్చ్యుతా ॥

త్రసరేణుప్రమాణాని తేషు చావస్థితాన్ పితన్ ।

సుసూక్ష్మానపరివ్యక్తానగ్నీనగ్నిష్వివాహితామ్ ॥

త్రాయధ్యమిత్యువాచార్తా పతంతీ చాప్యవాక్మిరా ।

తైరుక్తి సాతు మా భైషీరీత్యతోధిష్టితా భవత్ ॥

తతః ప్రాసాదయత్సా వై సీదంతీ తనయా గిరా ।

ఊచుస్తే పితరః కవ్యాం భ్రష్టైశ్వర్యాం వ్యతిక్రమాత్ ॥

భీషైశ్వర్యాం స్వదోషేణ పతసి త్వం శుచిస్మితే ।

మైరాచరంతి కర్మాణి శరీరైరిహ దేవతాః ॥

తైరేవ తత్కర్మఫలం ప్రాప్నువంతి సదా స్మ హ ।

సద్యః ఫలంతి కర్మాణి దేవత్వే ప్రేత్య మానుషే ॥

 స్వయంభువుఁడు అజుఁడు ఒక మేక నొసంగెను. శంభువు ఒక గొఱ్ఱె నొసంగెను. మాయా విహరణమున క్రౌంచ పర్వతము పడగొట్టుబడెను. అసురవరుఁడయిన తారకుఁడు కార్తికేయునిచే పొడువబడి పడగొట్టఁబడెను. అగ్నిసుతుఁడు, ప్రతాపవంతుఁడు, సమర్థుఁడునగు కార్తికేయుండు, ఇంద్రునిచే, ఉపేంద్రునిచే, మహానుభావులయిన దేవతలచే సేనాపతిగా నభిషిక్తుఁడయ్యెను. సుర నాయకుఁడే దేవసేనా పతిగా వ్యవహరింపం బడును. (50) దేవతారిశత్రుఁడయిన స్కందుఁడు దేవతా శత్రుల నెల్లరును నీరుకారించెను. (పేరు వినఁబడిన భయభ్రాంతులై పలాయితులయిరి). ఆతఁడు ప్రమథులచే, వివిధ దేవతలచే, భూత గణములచే, వివిధ మాతృకలచే అట్లే . వినాయక గణములచే పరివృతుఁడయ్యెను. మరీచి సుతులేచ్చట నివసించెదరో ఆ లోకములను సోమపదము లందురు. స్కందుడు ఇతరులు నందు (సోమపదమున) వసింతురు. దేవతలు వారిని పూజింతురు, ఐరిషదులను పితరులు సోమపాయులని చెప్పబడుదురు. (53) పితరుల మానసీకన్య అచ్ఛోదమను పేరు గల నదీ. అచ్ఛోదయను నొక సరస్సు కలదు. అందుండి యీ అచ్చోద నిమ్నగ ప్రవహించును. (54) పీతరు లింతకు బూర్వంబు దావీచే చూడబడలేదు. ఆమె వారికి మానసీదుహితగా బుట్టెను, అయ్యది తన పితరుల నెరుంగదు. (55) సహజ పితరులను విడిచి యా నది యన్యులయిన పితరుల వరించెను. ఆమె 'అమావసు" అను ప్రసిద్ధుని' తండ్రిగా నేన్నుకొనెను. అమావసుఁడు ఐలపుత్రుఁడు. నభశ్చరుఁడు. (56) ఆతఁడు అద్రిక నామధేయురాలయిన అప్సరసచే అనుగమింపఁబడి . ఆకాశమున పోవుచుండెను. ఆకాశమున నతఁడు విమానములో ఆసీనుఁడయి అద్రీకయను అప్పరతో గూడియుండెను, ఆమె యొక్క వ్యభిచారము వలన ఆమె ఆకాశమున స్వేచ్చగా తిరుగ లేకుండెను. ఇతరునీ తండ్రిగా వరించిన కారణమున ఆమె యోగ భ్రష్టయై పడిపోయెను, ఆకోశము నుండి జారి క్రిందకు పడుటవలన ఆమె త్రసరేణు ప్రమాణముగల (సూక్ష్మకణములబోలు) మూఁడు విమానముల జూచెను. తన పితరులందుండుట నామె వీక్షించెను. వారు చాల సూక్ష్మముగా నుండిరి. వారు అగ్నులతో హితములైన (ఉంచిన) అగ్నులవలే నవ్యక్తముగ వెలుగుచుండిరి. (59) బాధో పరీతమైన అచ్ఛోద నది తలక్రిందుగా పడుచు, ఆర్తురాలై రక్షించుడు' అను వాక్కులతో నరచెను, అప్పుడు వారు: “భయపడకుము” అనిరి. అందుచే ఆమె యప్పుడు అధిష్టితురాలయ్యెను. ధైర్యమున కాలు నీలువఁద్రోక్కు కొనెను. (60) అటు తరువాత క్షీణించుచున్న ఆశతో ఇట్లు ఆమె వారీని ప్రసాదోన్ముఖులను జేసెను. అంత పితరులు తన యున్నతి నుండి స్వీయ వ్యభిచరణముచే పతీతురాలయి భ్రష్టిశ్వర్యురాలయిన యామెతో నిట్లనిరి. “ఓ శుచిస్మిత - నీవు స్వదోషము కారణముగా నీ యైశ్వర్యము నుండి పతితు రాలవయితివి. దేవత లెల్లప్పుడు, తమ కర్మ ఫలమును తాము కర్మలనాచరించు తమ భౌతిక శరీరముల వలననే పొందుదురు. దేవతల విషయమున కర్మలు వెంటనే ఫలప్రదము లగును, మటి మానవుల విషయములో వారు మరణించిన వెనుక వారి కర్మ ఫలములు వారికందును. అందుచే ఓ పుత్తి ! నీ తపస్సు యొక్క ఫలితము నీవు నీ మరణా నంతరము పొందుదువు.

తస్మాత్వతపసః పుత్రి ప్రేత్య సంప్రాప్స్యసే ఫలమ్ ।

ఇత్యుక్తయా తు పితరః పునస్తే తు ప్రసాదితాః ॥

ధ్యాత్వా ప్రసాదం తే చక్రుస్తస్యాస్తదనుకంపయా ।

అవశ్యం భావనం దృష్ట్వా హ్యర్థమూచుస్తదా తు తాం ॥

సోచుపాః పితర: కన్యాం రాజ్ఞో స్యైవ త్వమావసోః ।

ఉత్పన్నస్య పృథివ్యాం తు మానుషేషు మహాత్మనః ॥

కన్యా భూత్వా త్వియాంల్లోకాన్పునః ప్రాప్స్యసి భామిని ।

అష్టావింశే భవిత్రీ త్వం ద్వాపరే మత్స్యయోనిజా ॥

అస్యైవ రాజో దుహితా హ్యద్రీకాయామమావసోః ।

పరాశరస్య దాయాదమృషీం త్వం జనయిష్యసి ॥

స వేదమేకం బ్రహ్మర్షిశ్చతుర్ధా విభజిష్యతి ।

మహాభిషస్య పుత్రా ద్వౌ శంతనోః కీర్తివర్ధనౌ ॥

విచిత్రవీర్యం ధర్మజ్ఞుం త్వమేవోత్పాదయిష్యసి ।

చిత్రాంగదంచ రాజానం సర్వసత్వబలాన్వితమ్ ॥

ఏతానుత్పాదయిత్వాథ పునర్లోకానవాప్స్యసి ।

వ్యభిచారాల్చితృణాం త్వం ప్రాప్స్యసే జన్మ కుత్సితమ్ ॥

తస్యైవ రాజ్ఞస్వం కన్యా ఉద్రికాయాం భవిష్యసి ।

కన్యా భూత్వా తతశ్చ త్వమీమాంశ్లోకానవాప్స్యసి ॥

ఏవముక్త్వా తు దాశేయీ-జాతా సత్యవతీ తు సా ।

అద్రికాయాః సుతా మత్స్యా సుతా జాతా హ్యమావసోః ॥

ఆద్రికామత్స్యసంభూతా గంగాయమునసంగమే ।

తస్యరాజో హీ సా కన్యా రాజో వీర్యేణ చైవ హి ॥

విరజా నామ తే లోకా దివి రోచంతి తే గణాః ।

అగ్నిష్వాత్రాః స్మృతాస్తత్ర పీతలో భాస్కరప్రభాః ॥

తాన్ దానవగణా యక్షా రక్షగంధర్వకిన్నరాః ।

భూతసర్పపిశాచాశ్చ భావయంతి ఫలార్థినః ॥

ఏతే పుత్రాః సమాఖ్యాతాః పులహస్య ప్రజాపతేః ।

ఏతేషాం మానసీ కన్యా పీవరీ సామ విశ్రుతా ॥

యోగినీ యోగపల్నీ చ యోగమాతా తథైవ చ ।

భవితా ద్వాపరం ప్రాప్య అష్టావింశతిమేవ తు ॥

శ్రీమాన్వ్యాసో మహాయోగీ యోగస్మిన్ ద్విజోత్తమాః ।

వ్యాసాదరణ్యాం సంభూతో వీధూమ ఇవ పావకః ॥

పరాశరకులోద్భూతః శుకో నామ మహాతపాః ।

సతస్యాం పితృకన్యాయాం పీవర్యాం జనయద్విభుః ॥

 ఈ విధముగా జెప్పఁబడి ఆమె మరల పితరులను ప్రసన్నులను జేసెను. కొంత తడవు ధ్యానమాచరించి, పితరులామె యెడ ప్రసన్ను లయిరి. తృప్తి పడిరి. (64) అవశ్యమనుభావ్యమయిన భవిష్యత్తును గ్రహించి, సోమపాయులయిన పితరులు వారి కుమారికతో “ఓ భామీని ! మహాత్ముఁడు భవిష్యత్తులో మానవులలో నుత్పన్నుఁడయిన ఒక మహారాజునకు పుత్రిక వగుదువు. (66) తరువాత నీవు మరల నీ లోకములను పొందెదవు. “28వ ద్వాపర యుగమున నీవు నీ మత్స్యయోనీజవగుదవు. నీ వారాజ్యమున అమావసువు కుమార్తె వగుదువు. ఆతని భార్య అగ్రిక. నీవు పరాశరుని యొక్క దాయాది యైన యొక ఋషిని కందువు. (68) ఆ బ్రహ్మర్షి ఏకముగా నున్న వేదమును నాలుగుగా విభజించును. నీవో మహాతేజస్వి ప్రతాపవంతుఁడు నయిన శంతనునకు కీర్తి వర్థనులగు కుమారులను కందువు. (69) వారు శంతనుని కీర్తిని వృద్ధి చేయుదురు. ఆ కుమారులు ఒకడు విచిత్ర వీర్యుఁడు, ఆతడు ధర్మజుండు, రెండవవాఁడు చిత్రాంగదుఁడు. ఈతఁడు సర్వసత్వ బలాన్వితుండు. (70) వీరికి నీవు జనన మొసంగిన పిదప మరల నీ లోకములను పొందగలవు. నీవు నీ పితరుల వ్యతిక్రమించి వ్యభిచరించుట చేత కుత్సితమయిన జన్న పొందుదువు. (71) ఆ రాజునకే అద్రిక యందు నీవు కన్యవగుదువు. కన్యకవయి మరల నీవీ లోకములను పొందుదువు. (72) ఈ విధముగా చెప్పఁబడి ఆ తరువాత ఒక చేపల వానికి సత్యవతిగా జన్మించెను. ఆమె మత్స్యముగా అద్రికా అమావసుల కుదయించెను. గంగా - యమునా నదీ సంగమమున అద్రికకు ఈమె మత్స్యముగా జన్మించెను. నిజమున కామె రాజు యొక్క కూతురు. ఆ రాజు యొక్క వీర్యమున నామె జన్మించెను. (74) ఆకాశమున 'వీరజము లను లోకములు ప్రకాశించును. అందు ఆ గణములు వసింతురు. అగ్నిష్వాత్తులను పితరులుగా వారిని స్మరింతురు. వారు భాస్కర ప్రభాసదృశులు. (75) దానవగణములు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు భూతసర్ప పిశాచములు - ఫలార్జులయి ఈ పితృగణములను పూజించెదరు. (76) వీరి పుత్రులు పులహుఁడు, ప్రజాపతియు, వారింతకు బూర్వము వర్ణింపఁబడిరి. వారి యొక్క మానసీకన్య పీవరి. ఆమె చాల విశ్రుత. ఆమె యోగీని, యోగపత్ని మరియు యోగమాత, 'ఇరువది యెన్మిదవ ద్వాపర యుగమున మహోజ్వల యోగ సంపన్నుడయిన వ్యాసుఁడు దయించును.. ఓ బ్రాహ్మణోత్తములారా ! ఆతని యందు యోగశక్తి వృద్ధిపొందును. అరణి యందు మహాతపస్వి యగు శుకుఁడు వ్యాసునకు దయించును. ఆతఁడు విధూమపావకసదృశుఁడు. పారాశర కులోద్భూతుఁడు.

పుత్త్రాన్ పంచ యోగచర్యాపరిపూర్ణాన్ పరిశ్రుతాన్ ।

కృష్ణం గౌరం ప్రభుం శంభుం తథా భూరిశ్రుతం చ వై ॥

కన్యాం కీర్తిమతీం చైవ యోగినీం యోగమాతరం ।

బ్రహ్మదత్తస్య జననీ మహిషీ త్వణుహస్య సా ॥

ఆదిత్యకిరణోపేతమపునర్మార్గమాస్థితః ।

సర్వవ్యాపీ వినిర్ముక్తో భవిష్యతి మహామునిః ॥

త్రయ ఏతే గణాః ప్రోక్తాశ్చతుః శేషాన్నిబోధత ।

తాన్వక్ష్యామి ద్విజశ్రేష్ఠాః ప్రభామూర్తిమతో గణాన్ ॥

ఉత్పన్నాస్తు స్వధాయాం తే కావ్యా హ్యగ్నేః కవేః సుతాః ।

పితరో దేవలోకేషు జ్యోతిర్భాసిషు భాస్వరాః ॥

సర్వకామసమృద్ధేషు ద్వీజాస్తాన్ భావయంత్యుత ।

ఏతేషాం మానసీ కన్యా యోగోత్పత్తిరితి శ్రుతా ॥

దత్తా సనత్కుమారేణ శుక్రస్య మహిషీ తు యా ।

ఏకశృంగేతి విఖ్యాతా భృగూణాం కీర్తివర్ధినీ ॥

మరీచిగర్భాస్తే లోకాః సమావృత్య దివి స్థితాః ।

ఏతే హ్యంగిరసః పుత్రాః సాధ్యైః సంవర్థితాః పురా ॥

ఉపహూతాః స్మృతాస్తే వై.పితరో భాస్వరో దీవి ।

తాన్ క్షత్రియగణాః సప్త భావయంతి ఫలాఠినః ।

ఏతేషాం మాససీ కన్యా యశోదా నామ విశ్రుతా ।

మాతా యా జననీ దేవీ ఖట్వాంగస్య మహాత్మనః

యజే యస్య పురా గీతా గాథా గీతైర్మహర్షిభిః ।

అగ్నేర్జన్మ తదా దృష్ట్వా శాండిల్యస్య మహాత్మనః ॥

యజమానం దిలీపం యే పశ్యంత్యత్ర సమాహితాః ।

సత్యవ్రతం మహాత్మానం తేపి స్వర్గజితో నరాః ॥

ఆజ్యపా నామ పితరః కర్దమస్య ప్రజాపతేః ।

సముత్పన్నస్య పులహాదుత్పన్నాస్తస్య తే సుతాః ॥

లోకేషు తేషు వైవర్తాః కామధేషు విషంగమాః ।

ఏతాన్వైశ్యగణాః శ్రాద్ధే భావయంతీ ఫలాఠినః ॥

ఏతేషాం మానసీ కన్యా విరజా నామ విశ్రుతా ।

యయాతేర్జననీ సాధ్వీ పత్నీ సా నహుషస్య చ ॥

            పితరుల కూతురయిన పీవరి వలన ఆ ప్రభువునకు నైదుగురు పుత్రులు కలుగుదురు. ఆ కుమారులయిదుగురు లోక విఖ్యాతులు, యోగచర్యాపరిపూర్ణులు. ఆ పంచ కుమారులు - కృష్ణుఁడు, గౌరుఁడు, ప్రభువు, శంభువు, భూరిశ్రవుఁడు - అను వారు, ఆతని కోక కూతురు కూడ కలుగును. ఆమె పేరు కీర్తిమతీ. ఆమే యోగిని యగును. బ్రహ్మదత్తుని తల్లి. ఆతఁడొక మహాముని యగును. సర్వబంధ వినిర్ముక్తుఁడు. సర్వవ్యాపీ ఆతఁడు అపునర్మార్గమూనును. (మోక్షమును పొందును) ఆతఁడాదిత్యకిరణే పేతుఁడు. (83) పితృగణత్రయము వర్ణింపఁబడినది. మిగిలిన నాల్గింటిని తెలిసికొనుఁడు. ఓ ద్వీజశ్రేష్ఠులారా! వారిని గూర్చి వివరించెదను. ఆ గణములు నాలుగును ప్రభామూర్తి మంత్రములు, (84) ఆ కొవ్యులు కవియైన అగ్నియొక్క సుతులు - వీరు పీతరులు. స్వధా సంభూతులు. వారు దేవ లోకముల యందు, పితరులు. వారు జ్యోతి స్వరూపములలో ప్రకాశవంతులు. వారి కాంతి యనంతము. (85) బ్రాహ్మణులు పవిత్ర క్రియా కలాపముల యందు సర్వకామ సమృద్దుల యందు వారిని పూజింతురు. వారలకు మానసీకన్య 'యోగోత్పత్తి, యని ప్రసిద్ధము. (86) ఆ మానసీకన్య సనత్కుమారునిచే వివాహమున శుక్రున కొసంగఁబడినది. ఆమె 'ఏక శృంగ' యని విఖ్యాతి గన్నది. ఆమె భృగు వంశీయుల యొక్క కీర్తిని వృద్ధి చేసినది. (87) కాంతి కిరణ గర్భితములయిన యా లోకములు సర్వము సావరించి స్వర్గమున నున్నవి. వారు అవి - ఆ కిరణములు- లోకములో పూర్వము ఆంగీరసునీ పుత్రులు. వారు సాధ్యులచే పూర్వకాలమున సంవర్థితులు. ఆకాశమున ప్రకాశించు నట్టి ఆ పితరులు ఉపహూతులని స్మరింపఁబడుదురు, వారలను ఫలార్డులయిన సప్త క్షత్రియ గణములు పూజింతురు. వారల మానసీకన్య యయిన యశోద మిక్కిలి విశ్రుతరాలు. ఆమె మహాత్ముం డయిన మహారాజు ఖట్వాంగుని యొక్క మహిషిగా భావింపఁబడుచున్నది. (90) మహాత్ముఁడయిన శాండిల్యుని యొక్క యజ్ఞమున అగ్ని వలన జన్మను చూచి పూర్వము మహర్షులచే ఒక గాథ గానము చేయంబడినది. 'ఆ యజ్ఞము నందు సమాహితులయిన వారెవ్వరు, యజమాని, సత్యవ్రతుఁడు, మహాత్ముఁడు అయిన దిలీపుని చూచెదరో వారు స్వర్గమును జయించిన మానవులు. ఆజ్యపులను పీతరులు పులహునికి జన్మించిన పుత్రులు. పులహుఁడు కర్దమ ప్రజాపతికీ జన్మించెను. వారు కోరిన చోటునకు పోవు కామగమనము గల వైవర్త లోకముల నివసింతురు. వారిని ఫలార్డులయిన వైశ్యగణములు ఆరాధించెదరు. (94) వారియొక్క మానసీకన్య ‘విరజ' గాసుప్రసిద్ద. ఆమె నహుషుని యొక్క ధర్మపత్ని,సాధ్వీ యయాతి యొక్క తల్లి.

సుకాలా నామ పితరో వశిష్ఠస్య మహాత్మనః ।

హైరణ్యగర్భస్య సుతాః శూద్రాస్తాం భావయంత్యుత ॥

మానసా నామ తే లోకా వర్తంతే యత్ర తే దివి ।

ఏతేషాం మానసీ కన్యా నర్మదా సరితాం వరా ॥

సా భావయతి భూతాని దక్షిణాపథగామినీ ।

జననీ సా త్రసద్దస్యోః పురుకుత్సపరిగ్రహః ॥

ఏతేషామభ్యుపగమాన్మనుర్మన్వంతరేశ్వరః ।

మన్వంతరాదౌ శ్రాద్ధాని ప్రవర్తయతి సర్వశః ॥

పితృణామానుపూర్వేణ సర్వేషాం ద్విజసత్తమాః ।

తస్మాదేతత్స్వధర్మేణ దేయం శ్రాద్ధం చ శ్రద్ధయా ॥

సర్వేషాం రాజతైః పాతైరపి వా రజతాన్వీతైః ।

దత్తం స్వధాం పురోధాయ శ్రాద్ధం ప్రీణాతి వై పితృన్ ॥

సౌమ్యాయనే వాగ్రయణే హ్యశ్వమేధం తదాప్నుయాత్ ।

సోమస్యాప్యాయనం కృత్వా హ్యగ్నేర్వైవస్వతస్య చ ॥

పితృన్ ప్రీణాతి యో వంశ్యః పితరః ప్రీణయంతి తమ్ ।

పితరః పుష్టికామస్య ప్రజాకామస్య వా పునః ॥

పుష్టిం ప్రజాస్తథా స్వర్గం ప్రయచ్ఛంతి న సంశయః ।

దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే ॥

దేవతాభ్యః పితృణాం హి పూర్వమాప్యాయనం స్మృతమ్ ।

నహి యోగగతి: సూక్ష్మ పితృణాం చ పితృక్షయః ॥

తపసా ప్రసిద్ధేన దృశ్యతే మాస చక్షుషా ।

ఇత్యేతే పితరశ్చైవ లోకా దుహితరశ్చ వై ॥

దౌహిత్రా యజమానాశ్చ ప్రోక్తా యే భావయంతి యాన్ ।

చత్వారో మూర్తిమంతస్తు త్రయస్తేషామమూర్తయః ॥

తేభ్యః శ్రాద్ధాని సత్కృత్య దేవాః కుర్వంతీ యత్నతః ।

భక్త్యా ప్రాంజలయః సర్వే సేంద్రాస్తర్గతమానసాః ॥

విశ్వే చ సికతాశ్చైవ పృశ్నిజాః శృంగిణస్తథా ।

కృష్ణాః శ్వేతాంబుజాశ్చైవ విధివత్పూజయంత్యుత ॥

ప్రశస్తా వాతరసనా దివాకృత్యాస్తథైవ చ ।

మేఘాశ్చ మరుతశ్చైవ బ్రహ్మాద్యాశ్చ దీవొకసః ॥

అత్రిభృగ్వంగిరాద్యాశ్చ ఋషయః సర్వ ఏవ తే।

యక్షా నాగాః సుపర్ణశ్చ కిన్నరా రాక్షసైఃసహ ॥

పితృంస్తే పూజయన్సర్వే నిత్యమేవ ఫలార్థినః ।

ఏవమేతే మహాత్మనః శ్రాద్ధే సత్కృత్య పూజితాః ॥

 'సుకాలులు' అను పితరులు మహాత్ముఁడు, హిరణ్యగరుని యొక్క కుమారుఁడు (బ్రహ్మ) అయిన వశిష్టుని యొక్క కుమారులు. శూద్రులు వారిని పూజింతురు. (96) స్వర్గము నందు (దీవి) వారు నివసించు లోకములకు 'మానస' లోకములని పేరు. వారి మానసీ కన్య (పుత్రికా) 'నర్మద'! అయ్యది సర్వనదులలో శ్రేష్ఠమయినది. (97) ఆమె దక్షిణాపథ గామినియై, ప్రవహించుచు, సర్వభూత జలములను పవిత్రీకరించును. ఆమె పురుకుత్సుని యొక్క భార్య. “త్రసద్ధస్యునీ” యొక్క తల్లి. వీని నంగీకరించిన పిమ్మట మన్వంతరేశ్వరుఁడయిన మనువు శ్రాద్ధములను సర్వత్ర ప్రవర్తిల జేసెను. (9) ఓ ద్వీజ సత్తములారా ! పితరుల యొక్క ఆనుపూర్వి ననుసరించి ఎల్లరకు శ్రాద్ధకలాపములు నియమింపబడును. అందుచే తమ తమ ధర్మము ననుసరించి శ్రద్దగా శ్రాద్దము లాచరింపఁబడవలెను. (100) (అన్ని వర్ణముల వారు, మతముల వారు). సర్వ శ్రాద్ద । క్రియలలో పితరులకు రజత పాత్రలలో (వెండితో కూడిన వానిలోగాని స్వధాపురోధాయిగా) శ్రాద్ధమాచరించిన అయ్యవి పితరులకు తృప్తి కలిగించును. 'సౌమ్యాయన, 'ఆగ్రయణ' విధులలో శ్రాద్ద మాచరించినవారు అశ్వమేధ ఫలితము నొందుదురు. (102, 104) ఏ వంశీయులు ‘ఆప్యాయన' సంబంధ క్రియలతో పితరులను ప్రీతులు చేయుదురో, సోముఁడు, అగ్ని, వైవస్వతుఁడు (యముఁడు), పితరులు వారిని ఆనంద పరచెదరు. పితరులు పుష్టి కామునకు, ప్రజా (సంతాన) కామునకు పుష్టిని సంతానము నొసంగెదరనుటలో సంశయము లేదు, దేవ కార్యముల కంటే పితృకార్యాచణము ముఖ్యము. పితృకార్యము విశిష్టమయినది. దేవతల కంటే ముందుగా పితృ ప్రీణనాదికము స్మరింపఁబడుచున్నదీ, దేవతా ప్రీణనాదీకముల కంటే ముందుగా పితృప్రీణానాదికముల ఆచరించవలయునని స్మృతులు వక్కాణించును. సూక్ష్మమయిన పితరుల యోగ గతి పితరుల యొక్క (పితృక్షయః - ఉనికి) స్థానము భౌతీక చక్షువులతో దర్శింప లేము. తపస్సు యొక్క శక్తిచేతనే బ్రాహ్మణులు చూడగలుగుదురు. పితరులు, వారి లోకములు, వారి కుమార్తెలు, వారి మనుమలు, యజ్ఞ మాచరించు యజమానులు, వారిని పూజించువారు, ఎవరెవరు పూజింపఁబడు చుండిరో వారు - చూడగలుగుదురు. వారలలో నాలుగు గణముల వారికే మూర్తులు కలవు, మిగిలిన వారికి మూర్తులు (రూపములు) లేవు. వారమూర్తిమంతులు. (107) దేవతలు పితరుల గౌరవింతురు. శ్రద్దగా యత్న పూర్వకముగా, తద్ధత మానసులయి, ప్రాంజలి బదులై దేవతలు శ్రాద్ధముల గౌరవింతురు. వారందరు ఇంద్రునితో కూడ, తద్దత మానసులయి చేతులు జోడింతురు. (108) విశ్వే దేవతలు, సికతులు, పృశ్నిజులు, లింగీణులు (శృంగీణులు). కృష్ణులు, శ్వేతాంబుజులు, విధవంతముగా పితరుల పూజింతురు. (109) ప్రశస్తులయిన వాతరసనులు, దివాకృత్యులు, మేఘులు, మరుత్తులు, బ్రహ్మ మొదలయినవారు, దీనౌకసులు, అత్రి, భృగు, అంగిరసుఁడు మొదలగు ఋషులు, యక్షులు, నాగులు, సుపర్ణులు, కిన్నరులు, రాక్షసులతోసహా, పితరుల పూజించరు.

సర్వాన్ కామాన్ ప్రయచ్ఛంతి శతశోథ సహస్రశః ।

హిత్వా త్రైలోక్యసంసారం జరామృత్యుమయం తథా ॥

మోక్షం యోగమథైశ్వర్యం సూక్ష్మదేహమదేహినామ్ ।

కృత్స్నం వైరాగ్యమానంత్యం ప్రయచ్చంతి పీతామహాః ॥

ఐశ్వర్యం విహితం యోగమైశ్వర్యం యోగ ఉచ్యతే ।

యోగైశ్వర్యమృతే మోక్షః కథం చిన్నోపపశ్యతే ॥

అపక్షస్యేవ గమనే గగనం పక్షిణో యథా ।

వరిష్ఠః సర్వధర్మాణాం మోక్షధర్మః సనాతనః ॥

పితృణాం హి ప్రసాదేన ప్రాప్యతే స మహాత్మనామ్ ।

ముక్తావైడూర్యవాసాంసి వాజినాగయుతాని చ ॥

కోటీశశ్చాపి రత్నాని ప్రయచ్ఛంతి పీతామహా ।

హంసబర్హిణయుక్తానీ ముక్తావైడూర్యవంతి చ ॥

కింకిణీజాలనదానీ సదా పుష్పఫలాని చ ।

విమానానాం సహస్రాణి యుక్తాన్యప్సరసాం గణైః ॥

సర్వకామసమృద్ధిని ప్రయచ్ఛంతి పితామహా ।

ప్రజాం పుష్టిం స్మృతిం మేధాం రాజ్యమారోగ్యమేవ చ ।

ప్రీతా నిత్యం ప్రయచ్ఛంతి మానుషాణాం పితామహాః ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయే ఉపోద్ఘాతపాదే

పితృరాజ్యకల్పో నామ దశమో ధ్యాయః ॥

            మహాత్ములయిన పితరులు శ్రాద్దముల గౌరవింపఁబడి పూజింపఁబడినచో, కర్తల యొక్క కోరికలను శతశోథ సహస్రశః వారు తీర్చెదరు. (113) పితరులు పూజింపఁబడి సంసారము నుండి విముక్తి నొసంగెదరు. జరామృత్యువు నుత్తరింపఁజేయుదురు. పితరులు యోగశక్తిని, ఐశ్వర్యమును, భౌతిక శరీరము లేని వానికి సూక్ష్మ దేహమును, సంపూర్ణ వైరాగ్యమును, ఇచ్చెదరు. (114) ఐశ్వర్యము, సర్వవస్తువుల యందు స్వాధికారము కలిగి యుండుట అనునవి యోగము నందున్నవి. ఐశ్వరమే యోగమందురు. యోగైశ్వర్యము లేక మోక్షమును (జన్మ రాహిత్యమును) సంపాదించుట ఉపవన్నము కాదు. (115) పక్షములు (రెక్కలు) లేక గగనతల గమనము పక్షికెట్లు సాధ్యము కాదో, మోక్షము యోగసాధనము లేక సాధ్యము కాదు. సర్వ ధర్మములలో మోక్ష ధర్మము సనాతనమయినది. శ్రేష్టమయనదియును. (116) అయ్యది పితరుల యొక్క ప్రసాదము వలననే మహాత్ములు పొందుదురు. పితరులు (పితామహులు) ముత్యములను, వైడూర్యములను, రత్నములను, మువ్వలచే నద్దములు (చెక్కబడిన) పుష్పఫలములను, అప్సర సాంగనలతో కూడిన విమాన సహస్రములను, సర్వకామ సమృద్దులను, సంతానమును, పుష్టినీ, స్కృతిని, మేధను, రాజ్యమును, ఆరోగ్యమును, పితామహులు (పితరులు) మనుష్యుల వలన సంతృప్తులయినచో నిత్య మొసంగుదురు.

ఇదీ వాయు ప్రోక్తము మహాపురాణము అయిన బ్రహ్మాండ మహాపురాణము నందు, మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున పితృరాజ్యకల్పమను దశమాధ్యాయము (సమాప్తము).