2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము

Table of Contents

22 - జమదగ్నితపశ్చరణమ్

వసిష్ఠ ఉవాచ :-

ఇత్యేవముక్తో భృగుణా తథోత్యుక్త్వా ప్రణమ్య తమ్ ।

రామస్తేనాభ్యసుజ్ఞాతః చకార గమనే మనః ॥

భృగుం ఖ్యాతిం చ విధివత్పరిక్రమ్య ప్రణమ్య చ ।

పరిష్వక్తస్తథా తాభ్యామాశీర్భీరభినందితః ॥

మునీంశ్చ తాన్ నమస్కృత్య తైస్సర్వైరనుమోదితః ।

నిశ్చక్రామాశ్రమాత్తస్మాత్తపసే కృతనిశ్చయః॥

తతో గురునియోగేన తదుక్తేనైవ వర్త్మనా ।

హిమవంతం గీరీరం యయౌ రామో మహామనాః ॥

సోఽతీత్య వివిధాస్ దేశాన్ పర్వతాన్ పరితస్తథా ।

వనాని మునిముఖ్యానామావాసాంశ్చాత్యగాచ్ఛనైః ॥

తత్ర తత్ర నివాసేషు మునీనాం నీవసన్పథి ।

తీర్ధేషు క్షేత్రముఖ్యేషు నివసన్వా యయౌ శనైః ॥

అతీత్య సుబహూన్ దేశాన్నపశ్యన్నపి మనోరమాన్ ।

ఆససాదాచలశ్రేష్ఠం హిమవంతమనుత్తమమ్ ॥

స గత్వా పర్వతవరం నానాద్రుమలతాన్వితమ్ ।

దదర్శ విపులైః శృంగైరుల్లిఖంతమివాంబరమ్ ॥

నానాధాతువిచిత్రైశ్చ ప్రదేశైరుపశోభితమ్ ।

రత్నౌషధీభిరభీతః స్ఫురద్భిరభిశోభితమ్ ॥

మరుత్సంఘట్టనాఘృష్టనీరసాంఘ్రిపజన్మనా ।

సానిలేనానతేనోచ్చైర్దహ్యమానం నవం క్వచిత్ ॥

క్వచిద్రవికరామర్శజ్వలదర్కోపలాగ్నిభిః ।

ద్రవద్ధిమశిలాజాలజలశాంతదవానలమ్ ॥

స్ఫటికాంజనదుర్వర్ణస్వర్ణరాశిప్రభాకరైః ।

స్ఫురత్ఫరస్పరచ్ఛాయాశరైర్దీప్తవనం క్వచిత్ ॥

ఉపత్యకశిలాపృష్ఠ బాలాతపనిషేవిభి: ।

తుషారక్లిన్నసిద్ధౌఘైరుద్భాసితవనం క్వచిత్ ॥

క్వచిదర్కాంశుసంభీన్నైశ్చామీకరశిలాశ్రితైః ।

యక్షా ఘైర్భాసితోపాంతం వీశద్భిరిత పావకమ్ ॥

వసిష్ఠుఁడు ఇట్లు పలికెను.

భృగువుచే నీట్లు చెప్పఁబడి అట్లే చేయుదును అని రాముఁడు అతనికి నమస్కరించేను. ఆతనిచే ఆజ్ఞాపింపఁబడి ప్రయాణమునకు నిశ్చయించేను. భృగువునకు తత్పత్ని ఖ్యాతికీ యథావిధి ప్రదక్షిణము చేసి, నమస్కరించెను. వారు కౌగిలించుకొనిరి. ఆశీస్సులచే నభినందించిరి. మునులకు కూడ నమస్కర్తించి, వారిచే గూడ ప్రయాణమున కంగీకరింపఁబడి రాముఁడు ఆ యాశ్రమము నుండి తపస్సునకు కృత నిశ్చయుం జై బయలు దేరెను. మహో మనస్విమయిన రాముఁడు గురుని నీయోగాను సారము ఆతఁడు నిర్దేశించిన మార్గమున నీరివరమయిన హిమవత్పర్వతమునకు వెడలెను. ఆతఁడు వివిధములయిన దేశములను, పర్వతములను, నదులను, వనములను, మునీ ముఖ్యుల ఆశ్రమములను క్రమముగా దాటెను. మార్గములో మునుల యొక్క వసతులలో రాముఁడాగెను. తీర్థములందు, ముఖ్యమయిన క్షేత్రముల యందు నివసించుచు నెమ్మదిగా ప్రయాణము సాగించేను. అనేకములయిన దేశములను దాటిచనెను. మనోహరములయిన దృశ్యములను సందర్శించెను. తుదకు ఉత్తమోత్తమమయినది, పర్వత శ్రేష్టమయినదియునగు హిమాచలమును రాముడు చేరెను. (7) ఆ ప్రదేశమును చేరిన తరువాత, అనేకములయిన లతా ద్రుమములతో సమన్వితమయిన పర్వతమును ఆతఁడు చూచెను. ఆ పర్వతము విపులములయిన శిఖరములతో ఆకాశమును తాకుచున్నదా యన్నట్లుండెను. సర్వత్ర రత్నములచే ఓషధులచే ప్రకాశించుచు నానా ధాతు విచిత్రములచే ఆ ప్రదేశముపశోభితము. కొన్ని ప్రదేశములలో పెనుగాలుల విజృంభణమున శుష్క వృక్షముల సంఘర్షణమున కలిగిన అగ్ని జ్వాలలచే ఆరణ్యములు ఎత్తుగా దహింపబడుచుండెను. గాలుల తోడి ఆగ్నిచే వనములు అధికముగా దహించుకొని పోవుచుండెను. కొన్ని ప్రదేశములలో సూర్య కిరణములచే ప్రకాశించిన సూర్యకాంతమణుల నుండి ప్రసరించు నగ్నులు సూర్యరశ్మిచే ద్రవీంచు శిలాజలముల జలములచే నుపశాంతి పొందుచుండెను. కొన్ని ప్రదేశములలో పర్వతములు స్పటికశిలలు, అంజన శిలలు, రజత రాశులు, స్వర్ణ రాశులు వీని యొక్క కాంతులచే, వెలుంగుచుండెను. ఆ స్వర్ణాది రాశుల నుండి వానిని ప్రకాశించు కీరణ జ్వాలలు పరస్పరము వెలుగొంద జేసికోను ఛాయా శరములచే జాజ్వల్యమాన దీప్తి వ్యాపించి యుండెను. కొన్నిచోట్ల, పర్వతోపత్యములందు, మంచు చేత తడిసిన సిద్ధాఘములు యెండలో చలికాచుచుండుటచే ఆ ప్రదేశములు ప్రకాశించుచుండెను. (13) కొన్ని ప్రదేశములు యక్షులచే ప్రకాశించుచుండెను. వారు బంగారు శిలలపై కూర్చుండి యుండిరి. ఆ సువర్ణ శిలలపై సూర్య కిరణములు పడుచుండెను. అందుచే యక్షులగ్నిలో ప్రవేశించుచున్నట్లగుపించు చుండిరి.

దరీముఖవినీష్రాంతతరక్షూత్పతనాకులైః ।

మృగయూధార్తసన్నాదేరాపూరితగుహాం క్వచిత్ ॥

యుద్ధ్యద్వరాహశార్దూలయూధ పైరీతరేతరమ్ ।

ప్రసభోన్మృష్టకాంతోరుశీలాతరుతటం క్వచిత్ ॥

కలభోన్మేషణాకృష్ణకారిణీభిరనుద్రుతైః ।

గవయైః ఖురసంక్షుణ్ణశీలాప్రస్థతటం క్వచిత్ ॥

వాసితార్థేఽభిసంవృద్ధమదోన్మత్తమతంగజైః ।

యుద్ధ్యదీశ్చూర్ణీతానేకగండశైలవనం క్వచిత్ ॥

బృంహితశ్రవణామర్షాన్మాతంగానభేధావతార ।

సింహానాం చరణక్షుణ్ణనఖచ్చిన్నోపలం క్వచిత్ ॥

సహసా నీపతత్సింహనఖనిర్భిన్నమస్తకైః।

గజైరాగ్రందనాదేన పూర్యమాణంవసం క్వచిత్ ।

అష్టపాదబలాకృష్టకేసరా దారుణారవైః ॥

భేద్యమానాఖిలశిలాగంభీరకుహరం క్వచిత్ ।

సంరబ్ధానేకశబరప్రసక్తై ఋక్షయూధపై: ।

ఇతరేతరసంమర్థం విప్రభగ్నదృషత్క్వచిత్ ॥

గిరికుంజేషు సంక్రీడల్కరిణీమద్ద్విపం క్వచిత్ ।

కరేణుమాద్రవన్మత్తగజాకలితకాననమ్ ॥

స్వపత్సింహముఖశ్వాసమురుత్పూర్ణదర్శతమ్ ।

గహనేషు గురుత్రాససాశంకవీహారన్కృగమ్ ॥

కొన్నిచోట్ల, గుహాముఖముల నుండి బయటికి దూకిన తరక్షువు చూచీ (ఒక విధమయిన క్రూర మృగము, లేళ్ల కుదుపులు బెదరి, చేయు ఆర్తనాదములచే నీండి ప్రతిధ్వనిల్లు గుహలు. (16) ఒకచో, ఒండొరులతో తీవ్రముగా పొట్లాడుకొను వరాహ శార్దూల సమూహాలచే, రాష్పడు చెందిన సుందరమయిన శీలాతరుతటములు. (16) (గవయ మృగం - ఒక విధమైన అడవి ఎద్దు) కొండొకచో, గవయ మృగపోతములం జూచి (ఆకార సామ్యమున పొరపడి) ఆడయేనుగులు అవీ తమ ఏనుగుగున్నలనీ భాంతీనొంది, వెంటనంట, భయపడి పరువెత్తు గవయ మృగఖురములచే గోతులు పడి, ఒరిసిపోయి, నలిగిన, శీలాతటములు (17) అత్యధికమయిన మదోన్మత్తతచే నొక యాడయేనుగు కొఱకు, పరస్పరము మత్తేభములు యుద్ధము చేయగా, చూర్ణీకృతములయిన గండశిలలు గల ప్రదేశములు. మత్తగజముల ఘీంకార బృంపాతముల సహింపక పోనీ వేంబడి తరుముకొనీ వచ్చు సింహముల చరణముచే పోటీపొడి నఖములచే చిట్లపగిలిన రాళ్లుగల చోటులు (19) ఆకస్మికముగా వచ్చిపడునట్టి సింహముల గోళ్లచే చీల్చబడిన మస్తకములు గలిగిన గజముల ఆక్రందనలచే నిండిన వనములు ఒకచో (20) (ఎనిమిది కాళ్లు జంతువులు శరభమృగములు). ఎన్మీదికోళ్లు గలిగి మిక్కిలి ఐలము కలిగిన శరభమృగములు తమ కేసరములు పట్టుకొని గట్టిగా నాకర్షించుట వలన బాధకలిగిన సింహాములు దారుణమయిన సాదములు చేయ, దాని వలన, భేదింపబడిన శిలగంభీర కుహరములు. (21) ఆగ్రహోదగ్రులైన అనేక శరయూథములు ఋష (ఎలుగుదొడ్లు) యూథ ప్రధానములతో సంభవించిన తీవ్ర కలహములలో పరస్పర సమ్మర్గముచే పొడిపొడియైన రాళ్లు గల ప్రదేశము లొకచో (22) కొన్ని ప్రదేశములలో పర్వత కుంజముల యందు ఆడ ఏనుగులతో క్రీడించు మగ ఏనుగులు, మరికొన్ని ప్రదేశములలో కరేణువును (ఆడ ఏనుగును) వెంటాడు మత్త గజములతో కూడిన కాననములు (23) నిద్రించు సింహము యొక్క ముఖము నుండి వెలువడు నిశ్వాస మరుత్తులతో పూర్ణమయిన వందలాది గుహలు. అరణ్యముల యందు అత్యధికమయిన భయముతో శంకాసహితముగా, విహరించునట్టి మృగములు. (24)

కంటకశ్లిష్టలాంగూలలోమత్రుటనకాతరైః ।

క్రీడితం చమరీయూథైర్మందమందవిచారిభిః ॥

గిదికందరసంసక్తకిన్నరీసముదీరితైః ।

సతాలనాదైరుదితైర్భృతాశేషదిశాముఖమ్ ॥

అరణ్యదేవతానాం చ చరంతీనామీతస్తతః ।

అలక్తకరసక్లిన్నచరణాంకితభూతలమ్ ॥

మయూరకేకినీభృందై: సంగీతమధురస్వరైః ।

ప్రవృత్తనృత్తం పరిరో వితతోదగ్రబర్హిభిః ॥

జలస్థలరుహానేకకుసుమోత్కురవర్షిభిః ।

గాత్రాహ్లాదకరైర్మందం వీజ్యమానం వనానిలైః ॥

భూతార్తవరసాస్వాదమాద్యత్పుంస్కోకిలారవై: ।

అకులీకృతపర్యంతసహకారవనాంతరమ్ ॥

నానాపుష్పాసవోన్మాద్యద్భృంగసంగీతసాదితమ్ ।

అనేకవిహగారావబధిరీకృతకాననమ్ ॥

మధుద్రవార్ద్రావిరళప్రత్యగ్రకుసుమోత్కరైః ।

వనాంతమారుతాకీర్ణైరలంకృతమహీతలమ్ ॥

ఉపరిష్టాన్నిపతతాం విషమోపలసంకటే ।

నిర్ఘరాణాం మహారావైః సమంతాద్బధిరీకృతమ్ ॥

వితతానేకసంసక్తశాఖాగ్రావీరళచ్ఛదైః ।

పాటలైర్విటపచ్ఛాయైరుపశల్యసముత్థితైః ॥

కదంబనింబహింతాలసర్జబంధూకతిందుకైః ।

కపిత్థపనసాశోకసహకారేంగుదాశనైః ॥

నాగచంపకపున్నాగకోవిదారప్రియంగుభీ : ।

ప్రియాలనీపబకులబంధూకాక్షతమాలకైః ॥

చమరీమృగములు ముండ్ల యందు తగుల్కొని తమ తోకల యొక్క వెంట్రుకలు తెగిపోవునను భయముచే మంద మందగమనములతో క్రీడించుచుండెను. (25) గిరికందరముల యందు వసించు కిన్నరులచే గానము చేయబడిన తాలలయయుక్త నాద స్వరములచే దిక్కులన్నియును నీండి యుండెను. (26) ఇందునందు (ఇతస్తవః) సంచరించు అరణ్య దేవతల యొక్క లాక్షారసముచే, తడిసిన, చరణములచే పాదాచ్చాయ లేర్పడిన భూతలము ఒప్పుచున్నది. (27) ఆడమగనెమళ్ల బృందము సంగీత మధుర స్వరములచే విస్తరింపఁజేయబడిన బరులతో (పింఛములతో) సర్వత్ర నృత్తమాచరించుచున్నది. (28) నీరు గల ప్రదేశముల మొలచిన అనేక వృక్ష లతా సుమోతర వర్పములచే వనమారుతములు శరీరానందకరముగా మందముగా వీచుచుండెను. (20) వసంతఋతు సంబంధమైన రసమును నాస్వాదముచేసి, మదించిన పుంసోకిలల కుహూరావములు మామిడి వనము నంతటిని ఆకులీకృత మొనర్చుచుండెను. (30) నానా పుష్ప సంబంధ మధువు నాస్వాదనము చేసి మత్తెక్కిన భృంగముల యొక్క సంగీత నాదముచేతను, అనేకములయిన పక్షి సమూహముల యొక్క కూతల వలన గలిగిన రావముల చేతను కానన మంతయును బధిరీకృతము చేయబడుచున్నది. (31) భూతల మంతయు, మధుస్రావముచే తడిసి దట్టముగో రోలిన (వాడని) ప్రత్యగ్రములయిన కుసుమ సముదాయములచే వనమున వీచు మారుతములచ పువ్వులు నలుగడలకు చల్లబడి వనము అలంకృతమై యున్నట్టుండెను. (32) విషమోషలప్రదేశములపై నుండీ గుభాలున పడునట్టి కొండ సెలయేళ్ల మహాధ్వనులచే అరణ్యమంతయు చేవులుగళ్లుపడుచుండెను (బధరీకృతమయ్యెను). (35) పర్వతము నందలి వనములు సర్వవిధ వృక్షములతో సర్వత్ర నిండియుండెను.దంబ వృక్షములు, నింబ (వేప), హింతాలములు, సర్జము, బంధూకము, తీందుకము, కపిత్థము, పనస అశోకము, మామిడి, ఇంగుదము, ఆసనము, నాగ, పున్నాగ, కోవిదారము, ప్రియంగుపు, చంపకము, ప్రీయాలము, నీపము, వకులము, బంధూకము, అక్షము, తమాలము, ద్రాక్ష, మధూకము, ఆమలకము -

ద్రాక్షామధూకామలకజంబూకంకోలజాతిభిః ।

బిల్వార్జనకరంజామ్రబీజపూరాంఘ్రిపైరపి ॥

పిచులాంబష్ఠకనకవైకంకతశమీధవైః ।

పుత్త్రజీవాభయారిష్టలోహోదుంబరపిప్పలైః ॥

అన్యైశ్చ వివిధై ర్వృక్షై సమంతాదుపశోభితమ్ ।

నిరంతరతరుచ్చాయాసుదూరవినివారితైః ॥

సముంతాదర్కకిరణైరనాసాదీతభూతలమ్ ।

నానాపక్వపలాస్వాద బలపుష్పైః ప్లవంగమైః ॥

అక్రాంతచకితానేకవనపంక్తిశతాకులమ్ ।

తత్ర తత్రాతీరమ్యైశ్చ శీలాకుహరనిర్గతైః ॥

ప్రతాపవిషమై రాజన్ హ్రాస్యమానం సరిచ్ఛతైః ।

సరోవరైశ్చ విపులైః కుముదోత్పలమండితైః ॥

నానావిహగసంఘష్టైః సమంతాదుపశోభితమ్ ।

సమాసాద్యాథ శైలేంద్రం తుషారశిశిరం గిరిమ్ ॥

ఆరురోహ భృగుశ్రేష్ఠః తరసా తం ముదాన్వితః ।

తస్య ప్రవిశ్య గహనం వనం రామో మహామనాః ॥

విచచార శనైరాజన్నుపశల్యమవీరుహమ్ ।

స తత్ర విచరన్ దీక్ష హారిణీభిః సమంతతః ॥

వీక్ష్యమాణో ముదం లేభే సాశంకం ముగ్ధదృష్టిభిః ।

సతత్ర కుసుమామోదగంధిభిర్వనవాయుభిః ॥

వీజ్యమానో జహర్షే స వీక్ష్యదారాం వనశ్రియమ్ ।

వివిధాశ్చ స్థలీ: సూక్ష్మముపరిక్రమ్య భార్గవః ॥

ద్వంద్వాంశ్చ ధాతూన్వివిధాన్పాశ్యన్నేవమతర్కయత్ ।

అహోఽయం సర్వశైలాసమాధిపత్యేఽభిషేచితః ॥

            జంబు (నేరేడు) కంకోల, జాతులు, బిల్వము (మారేడు) అర్జునము, ఆమ్ర బీజపూరవృక్షములు, పీచులము, అంబద్ధము, కనకము, ప్రేకంకత, శమి, ధవ, పుత్త్రబీజ, అభయ, అరిష్టము (కుంకుడు)లు లోహ, ఉదుంబర, పిప్పల మొదలగు ఇతరములయిన వృక్షములచే సమంతాత్ పరీశోభితము. నిరంతరము వృక్షముల నీడలచే సుదూరము వినివారీతమయిన సూర్య కిరణములు గలిగిన భూతలము, వివిధ నానా పక్వ ఫలముల నాస్వాదించుటచే, బిలము గలిగి పుష్టి మంతములయిన కోతులచే ఆక్రమింపఁబడి, చకితమయిన వనముల పంక్తి శతములచే ఆకులమయినది, అక్కడక్కడ అతి రమ్యములయిన శిలా కుహరముల నుండి బహిర్గమించు ననేక కొండ పెలయేళ్లు; విషమములైన రాళ్ల నుండి పడుటచే కలుగు భయంకర సరిస్నాదములు. విపులములయిన కుషుదోత్పలములచే నలంకృతములయిన విపుల సరోవరములు; నానా విధములయిన పక్షి సంఘముల రోదలచే సంఘుష్టమై సర్వత్రోపశోభితమయి మంచుచే చల్లనయిన శైలరాజముచేరి (43) భృగు శ్రేష్ఠుఁడయిన రాముఁడు ముదాన్వితుఁడై వెంటనే ఆగిరి నారోహించెను. (44) గహనమయిన ఆ వనమును మహాబుద్ధిమంతుఁడయిన రాముఁడు ప్రవేశీంచెను. పర్వత సమీపమున వృక్షములచే నిండియున్న ఆ యరణ్యము నందు నెమ్మదిగా సంచరించెను. ఆ ప్రదేశమున సంచరించుచు రాముఁడు అనుమానముతో, శంకతో, ముగ్గములయిన అమాయకములయిన చూపులతో దీక్కుల వెంబడి సంచరించు లేళ్లగములను జూచి, ఆనందము నొందెను. పూవుల మనోహరములయిన పరీమళలములతో నిండి వీచు వాయువులచే నిండిన ఉదారమయిన వన సంపదను చూచి రాముఁడు హరపులకితుం డయ్యెను. (46) వివిధములయిన స్థలములను భార్గవుఁడు సూక్ష్మముగా పరిశీలించుచు సంచరించెను. పరస్పరము భిన్నములయిన శీతోష్ణ ద్వంద్వములను, అట్లే విభిన్నములయిన లోహధాతువులను చూచు భార్గవుఁడిట్లు భావించేను. “అహో ! ఈ పర్వతము బ్రహ్మచే సర్వశైలాధిపత్యమున నభి షేకింపఁబడెను. అంతీయకాక బ్రహ్మచే యజ్ఞ భాగము ప్రతిపాదింపబడుటయు ఉచితముగానే యున్నది.

బ్రహ్మణా యజ్ఞభాక్చైవ స్థానే సంప్రతిపాదితః ।

అస్య శైలాధిరాజత్వం సువ్యక్తమభిలక్ష్యతే ॥

రవైః కీచకవేణూనాం మధురీకృతకాననః ।

నీతంబస్థలసంసక్తతుషారనీచయైరయమ్ ॥

విభాతీవాహితస్వచ్ఛపరీతధవళాంశుకః ।

నిబిడిశ్రితనీహారనికరేణ తథోపరి ॥

నానావర్ణోత్తరాసంగావృత్తాంగ ఇవ లక్ష్యతే ।

చందనాగరుకర్పూరకస్తూరీకుంకుమాదిభిః ॥

అలంకృతాంగః సువ్యక్తం దృశ్యతేఽహో విలాసివత్ । మృగేంద్రాహతదంతీంద్రకుంభస్థలపరిచ్యుతైః ॥

స్థూలము క్తోత్కరైరేష విభాతి పరితో గీరీః ।

నానావృక్షలతావల్లీపుష్పాలంకృతమూర్ధజః ॥

నీరంధ్రాంచితమేఘౌఘవితానసమలంకృతః ।

నానాధాతువిచిత్రాంగః సర్వరత్నవిభూషితః ॥

కైలాసవ్యాజవిలసత్సీతచ్ఛత్రవిరాజితః ।

గజాశ్వముఖయూథైశ్చ సమంతాత్పరివారితః ॥

రత్నద్వీపమహాద్వారశీలకందరమందిరః ।

వివిక్తగహ్వరాస్థానమధ్యసింహాసనాశ్రయః ॥

సమంతాత్ప్రతిసంసక్తతరువేత్రవతాం శనైః ।

దృష్ట్వా జనైరనాసాద్యో మహారాజాధిరాజవత్ ॥

ధోధూయమానో విచరచ్చమరీచారుచామరైః ।

మయూరైరుపనృత్యద్భిర్గాయద్భిశ్చైవ కిన్నరైః ॥

సత్త్వజాతైరనేకైశ్చ సేవ్యమానో విరాజతే ।

వ్యక్తమేవాచలేంద్రాణామధిరాజ్యపదే స్థితః ॥

ఈ పర్వతము యొక్క శైలాధిరాజత్వము సువ్యక్తముగా అభివ్యక్తమగుచున్నది. (49) ఈ పర్వతమును వెదుళ్ల యొక్క సాళముల నుండి వచ్చు రవములచే మధురీకృత కాననముగా శైల రాజానర్చెను. కొండకోనల యందు తగులుకొని యున్న తుషార చయముచే ఈ పర్వతము స్వచ్ఛమయిన ధవళ వస్త్రముచే కప్పఁబడియున్నదేమో యన్నట్లు ప్రకాశించుచున్నది. శిఖరముల తగులుకొనీ ప్రకాశించుచున్నదట్టమయిన నీహారనికరములచే నానా వర్ణములచే శోభితమయిన ఉత్తరీయముచే ఆవృతమయిన (కప్పఁబడిన) శరీరాంగము కలిగిన దానివలె ఈ గీరివరము కానవచ్చుచున్నది. చందనాగురు కర్పూర కస్తూరీ కుంకుమాది పరీమళ వస్తువులచే ఈ పర్వతరాజు అలంకృతాంగుఁడై విలాసివలె స్పష్టముగా నగుపించుచున్నాఁడు. సింహములచే చీల్చబడిన దంతీంద్ర కుంభ స్థలముల నుండి జారీక్రింద పడిన పెద్ద పెద్ద ముత్యముల సమూహములచే నగేంద్ర పరితః ప్రదేశము ప్రకాశీంచుచున్నట్లున్నది. ఈ గిరిరాజు నానా వృక్షలతావల్లీనీకర పుష్పములచే నలంకృత మూర్ధజుఁడు. ఆతనీ శిరోజములు పువ్వులచే నలంకరింపఁబడినవేమో యన్నట్లున్నవి. (54) దట్టముగా వ్యాప్తములయిన మేఘ పంక్తులనెడి వితానములచే (ఛాందినీచే) నీగిరిరాజు సమలంకృతుఁడు. ఈ గీరీంద్రుఁడు సాసాధాతు విచిత్రాంగుఁడు; సర్వరత్న విభూషితుఁడు; కైలాస వ్యాజమున ప్రకాశించు తెల్లని ఛత్రముచే విరాజితుఁడు; ఆ హీమవర్రాజ గజముఖము గల అశ్వముఖముగల దేవతా సమూహములచే పరివృతుఁడై యుండెను. ఆతఁడో రత్నద్వీపము మహా ద్వారముగా గల శిలాకందర మందీరుఁడు; వివిక్తమయిన గహ్వరమను ఆస్థాన మధ్య సింహము ఆసనముగా గలిగిన వాఁడు : సర్వత్ర వృక్షములను వేత్రహస్తులతో సంసక్తుఁడై నెమ్మదిగా చూడబడి మహారాజాధి రాజువలె జనులు వచ్చి చేరుటకు సాధ్యము కానివాఁడు.

భునక్త్యాక్రమ్య వసుధాం సమగ్రాం శ్రీయమోజసా ।

ఏవం సంచింతయానః స హిమాద్రీవనగహ్వరే ॥

విచచార చీరం రామో ముదా పరమయా యుతః ।

ఆససాద వనే తస్మిన్వీపులే భృగుపుంగవః ॥

సరోవరం మహారాజ విపులం విమలోదకమ్ ।

కుముదోత్పలకల్హారనికరైరుపశోభితమ్ ॥

పంకజైరుత్పలైశ్చైవ రక్తపీతైః సితాసితైః ।

అన్యైశ్చ జలతైర్వృక్షై సర్వతః సమలంకృతమ్ ॥

హంససారసదాత్యూహకారండవశతైరపి ।

జీవజీవకచక్రాహ్వకురరభ్రమరోత్కరైః ॥

సంఘుష్యమాణం పరితః సేవితం మందవాయునా।

శఫరీమత్స్యసంఘైశ్చ వీచరద్భీతస్తతః ॥

అంతర్జనితకల్లోలైర్నృత్యమానమీవాభీతః ।

అససాద భృగుశ్రేష్ఠస్తత్సరోవరముత్తమమ్ ॥

నానాపతత్త్రివిరుతైర్మధురీకృతదిక్తటమ్ ।

స తస్య తీరే విపులం కృత్వాశ్రమపదం శుభమ్ ॥

రామో మతిమతాం శ్రేష్ఠస్తపసే చ మనో దధే ।

శాకమూలఫలాహారో నియతం నియతేంద్రీయః ॥

ఇందు నందు తిరుగాఁడు చమరీ మృగముల తోకలతో చారు (చామర) వింజామర సేవను, నృత్యము చేయు నెమిళ్లతో, సంగీతము పాడుకిన్నరులతో నొప్పి, అనేకములయిన సత్వములచే సేవింపఁబడుచు హిమవర్ణిగిరాజు ప్రకాశించుచున్నాడు. పర్వతముల కధిరాజ పదత్వము ఈ గిరీంద్రమునకు వ్యక్తమగుచున్నది. (60) సమగ్రమయిన భూమిని ఆక్రమించిన తరువాత తన శక్తిచే సమస్త శ్రీనీ సతఁడను భవించును”. ఈ విధముగా ఆత్మలో ఆలోచించుకొనుచు, రాముఁడు చిరకాలము హిమాలయాద్రి వన గహ్వరవమున అత్యంతానందముతో సంచరించెను. తిరిగి తిరిగి భృగుపుంగవుఁడయిన రాముఁడు ఓ సగరమహారాజా ! ఆ వనమున ఒక వీపుల సరోవరమును చేరెను. ఆ సరోవరము విమలోదకముతోం గూడినది. కుముదములు, ఉత్పలములు, కల్హారములతో కూడి చక్కగా ప్రకాశీంచుచుండెను. (63) రక్తవర్ణములు, పీతవర్ణములు, తెలుపు, నలుపు రంగులు కలిగిన పంకజోత్పలముల చేతను, అనేకములయిన ఇతర జలవృక్షములచే సర్వత్ర ఆ సరస్సు సమలంకృతము. హంసలు, సారసపక్షులు, జలవాయసములు, కొరండవములు (నీటి జాతులు) చక్ర వాకములు, భ్రమర సముదాయములు మొదలగు వానిచే సంఘుష్యమాణమగుచు మందపాయువుచే ఆ ప్రాంతమంతయు సేవింపఁబడుచుండెను. లోస సంచరించుచు, చెంగు చెంగున గెంతుచు, శఫరీ మత్స్య సంఘములచే కూడి ఆ సరస్సు అంతర్జనితములయిన తరంగములచే సర్వత్ర నృత్యము చేయుచున్నట్లుండెను. అట్టి ఉత్తమమయిన సరోవరమును భృగుశ్రేష్ఠుఁడయిన రాముఁడు చేరెను. (67) నానావిధ పక్షుల యొక్క కూజితములచే మధురీకృతమయిన దీక్తటములుగల ఆ సరోవర తీరమందు శుభంకరమైన ఆశ్రమపదము నేర్పరచుకొని ఆతడు శాకమూల ఫలాహార నియతుఁడునై నియతేంద్రియుడై మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు తపస్సాచరించుట కభిలషించెను. (69)

తపశ్చచార దేవేశం వినివేశ్యాత్మమానసే ।

భృగూపదిష్టమార్గేణ భక్త్యా పరమయా యుతః ॥

పూజయామాస దేవేశమేకాగ్రమనసా నృప ।

అనికేతః స వర్షాసు శశిరే జలసంశ్రయః ॥

గ్రీష్మే పంచాగ్నిమధ్యస్థశ్చకారైవం తపశ్చిరమ్ ।

రిపూన్ నిర్జిత్య కామాదీనూర్మిషట్కం విధూయ చ ॥

ద్వంద్వైరనుద్వేజితధీస్తాపదో షైరనాకులః ।

యమైః సనీయమైశ్చైవ శుద్ధదేహః సమాహితః ॥

వశీచకార పవనం ప్రాణాయామేన దేహగమ్ ।

జితపద్మాసనో మౌని స్థిరచిత్తో మహామునిః ॥

వశీచకార చాక్షాణి ప్రత్యాహారపరాయణః ।

ధారణాభిః స్థిరీచక్రే మనశ్చంచలమాత్మవాన్ ॥

ధ్యానేన దేవదేవేశం దదర్శ పరమేశ్వరమ్ ।

స్వస్థాంతఃకరణో మైత్రః సర్వబాధావివర్జితః ॥

చింతయామాస దేవేశం ధ్యానే దృష్ట్వా జగద్గురుమ్ ।

ధ్యేయావస్థితచిత్తాత్మా నిశ్చలేంద్రియదేహవాన్ ॥

ఆకాలావధి సోఽతిష్ఠన్నిహితస్థప్రదీపవన్ ।

జపంశ్చ దేవదేవేశం ధ్యాయంశ్చ స్వమనీషయా ॥

ఆరాధయదమేయాత్మా సర్వభావస్థమీశ్వరమ్ ।

తతః స నిష్ఫలం రూపమైశ్వరం యన్నిరంజనమ్ ॥

పరంజ్యోతిరచింత్యం యద్యోగిధ్యేయమనుత్తమమ్ ।

నిత్యం శుద్ధం సదా శాంతమతీంద్రియమనౌపమమ్ ॥

ఆనందమాత్రమచలం వ్యాప్తాశేషచరాచరమ్ ।

చింతయామాస తద్రూపం దేవదేవస్య భార్గవః ॥

సుచిరం రాజశార్దూల సోఽహంభావసమన్వితః ।

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయే ఉపోద్ఘాతపాటే వసిష్ఠసగరసంవాదే అర్జునోపాఖ్యానే జామదగ్న్యతపశ్చరణం నామ ద్వావింశతితమోఽధ్యాయః॥

 రాముఁడు తన హృదయమున దేవేశుఁడయిన ఈశ్వరుని అధిష్ఠింపఁజేసి భృగూపదిష్ట మార్గమున, పరమభక్తితో కూడినవాడై తపస్సాచరించెను. (70) ఓ రాజు ! ఏకాగ్రమయిన మనస్సుతో దేవేశుని రాముఁడు పూజింపఁ దొడగెను. ఆతఁడో అనికేతనుఁడు. పర్ణశాలయనెడిది లేనివాఁడు. వర్షాకాలము నందు శీతకాలమున జలముల సంశ్రయించి, జల ప్రవాహముల మధ్య యందు నిల్చి తపస్సాచరించెను. గ్రీష్మఋతువున పంచాగ్ని మధ్యమున, నాలుగు ప్రక్కల అగ్ని జ్వాలలుంచుకొని, పైనీ సూర్యుండు చండ, కిరణుఁడై ప్రకాశింప చిరకాలము రాముఁడు తపస్సాచరించెను. కామక్రోధాదులగు షడ్రిపుల జయించెను. ఊర్మిషట్కమును విదిలించీ వైచెను. సుఖదుఃఖములు, శీతోషములు, కష్టసుఖములను ద్వంద్వములచే ననుద్వేజిత ధీరుఁడు. తాపదోషములచే అనకులుడు. యమము చేతను, నీయమముల చేతను శుద్ధమయిన దేహముతో కూడినవాఁడు, (73) శరీరమందు సంచరించు పవనమును ప్రాణాయామముచే రాముఁడు వశీకరించుకొనెను. పద్మాసన స్థితుఁడు. మౌనము పాటించేను. స్థిరచిత్తు డు, మహాముని. ఇంద్రియములను వశీకరించుకొనెను. ప్రత్యాహార పరాయణుఁడు. ధారణములను స్థిరీకరించెను. ధ్యానముచే పరమేశ్వరుం డయిన దేవదేవునితఁడు దర్శించెను. స్వాధీనాంతఃకరణుఁడు. కరుణామైత్రీ భావములతో సర్వబాధా వివర్జితుఁడు. ఈ విధమైన దృఢ సమాధిపొంది రాముఁడు దేవదేవుని చింతించెను. ధ్యానమున జగద్గురువును దర్శించి, ధ్యేయమయిన దేవదేవుని యందు సంస్థీత చిత్తము, ఆత్మయును గలిగి, నిశ్చలేంద్రియ దేహవంతుఁడై నియమిత కాలాంత పర్యంతము గాలి లేనిచోట పెట్టిన జ్వలించు దీపమువలె, స్వమనీషచే, దేవదేవేశుని గూర్చి జపించెను, ధ్యానించెను. సర్వభావస్తుఁడైన ఈశ్వరుని రాముఁడు ఆరాధన మొనర్చెను. అంత, నీష్కలము (అవయవ రహితము) నిరంజనము, పరంజ్యోతి, అచింత్యము, యోగులు కానివారిచే ధ్యానింపఁబడరానిది, అత్యుత్తమము, నిత్యము, శుద్ధము, సదాశాంతము, అతీంద్రియము, ఉపమానరహితము, ఆనందమాత్రము, అచలము, సర్వచరాచర ప్రపంచ వ్యాప్తము, అయిన దేవదేవుని యొక్క రూపమును సోహం భావ సమన్వితుఁడయి భార్గవరాముఁడు చిరకాలము చింతించును.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున వసిష్టసగర సంవాదమున, అర్జునోపాఖ్యానమున జమదగ్నికుమారుఁడయిన రాముని తపశ్చరణమను ఇరువది రెండవ అధ్యాయము.