2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము

Table of Contents

 25 - అర్జునోపాఖ్యానము

వసిష్ఠ ఉవాచ :-

తతస్తద్భక్తియోగేన స ప్రీతాత్మా జగత్పతిః ।

ప్రత్యక్షమగమత్తస్య సర్వై: సహ మరుద్గణేః ॥

తం దృష్ట్వా దేవదేవేశం త్రినేత్రం చంద్రశేఖరమ్ ।

వృషేంద్రవాహనం శంభుం భూతకోటిసమన్వితమ్ ॥

స సంభ్రమం సముత్థాయ హర్షేణాకులలోచనః ।

ప్రణామమకరోద్భక్త్యా శర్వాయ భువి భార్గవః ॥

ఉత్తాయోత్థాయ దేవేశం ప్రణమ్య శిరసా సకృత్ ।

కృతాంజలిపుటో రామస్తుష్టావ చ జగత్పతిమ్ ॥

రామ ఉవాచ :-

నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర ।

నమస్తే జగతోనాథ । నమస్తే త్రిపురాంతక ॥

నమస్తే సకలాధ్యక్ష నమస్తే భక్తవత్సల ।

నమస్తే సర్వభూతేశ నమస్తే వృషభధ్వజ ॥

నమస్తే సకలాధీశ నమస్తే కరుణాకర ।

నమస్తే సకలావాస నమస్తే నీలలోహిత ।

నమః సకలదేవారీగణనాశాయ శూలినే ॥

కపాలినే, నమస్తుభ్యం సర్వలోకైకపాలినే ॥

శ్మశానవాసినే నిత్యం నమః కైలాసవాసినే ।

నమోఽస్తు పాశినే తుభ్యం కాలకూటవిషాటినే ॥

విభవేఽమరవంద్యాయ ప్రభవే తే స్వయంభువే ।

నమోఽఖిలజగత్కర్మసాక్షిభూతాయ శంభవే ॥

నమస్త్రిపథగాఫేనభాసిగాతార్దేందుమౌలినే ।

మహాభోగీంద్రహారాయ శివాయ పరమాత్మనే ॥

భస్మసంఛన్న దేహాయ, సమోఽర్కాగ్నిందుచక్షుషే ।

కపర్దినే నమస్తుభ్యమంధకాసురమర్దినే ॥

త్రిపురధ్వంసినే దక్షయజ్ఞవిధ్వంసినే నమః ।

గిరిజాకుచకాశ్మీరవీరంత మహోరసే ॥

మహాదేవాయ మహతే నమస్తే కృత్తివాససే ।

యోగిధ్యేయస్వరూపాయ శివాయాచింత్యతేజసే ॥

స్వభక్త హృదయాంభోజకర్ణికామధ్యవర్తినే ।

సకలాగమసిద్ధాంతసారరూపాయ తే నమః ॥

వసిష్ఠుడిట్లు చెప్పెను.

అంత, జగత్పతి, రాముని యొక్క భక్తియోగముచే ప్రేతాత్ముఁడయ్యెను. మరుద్గణములందరితో ఆతనికి ప్రత్యక్షమయ్యెను. దేవ దేవేశుఁడు, త్రినేత్రుఁడు, చంద్రశేఖరుఁడు, వృషేంద్ర వాహనుఁడు నయిన శంభునీ భూతకోటి సమన్వితుని రాముఁడు చూచి, సస్థంభ్రమముగ లేచి, సంతోషమున ఆకులమయిన నేత్రములతో, శర్వునికి, భక్తితో, భూమిపైపడి సాష్టాంగ ప్రమాణ మాచరించెను. (3) ఆత్రముతో లేచి, దేవేశుడయిన ఈశ్వరునకు బహు వారము శిరస్సు వంచి నమస్కరీంచి, అంజలీ పుటము సంధించి, జగత్పతిని రాముఁడు స్తోత్రము చేసెను.

రాముఁడిట్లనెను:

దేవదేవేశ నీకు నమస్కారము. పరమేశ్వర నీకు నమస్సు. ఓ జగన్నాథ నమస్కారము. ఓ త్రిపురాంతక ! సకలాధ్యక్ష! భక్తవత్సల ! నీకు నమస్కారము. ఓ సర్వభూతేశ ! వృషభధ్వజ ! సకలాధీశ ! కరుణాకర ! సకలావాస ! ఓ నీలలోహిత ! సకల దేవారీగణనాశక ! ఓ శూలి ! నీకు నమస్కారము. ఓకపాలిన్, సర్వలోకైకపాల ! నిత్యశ్మశానవాసీ ! కైలాసవాసి ! నీకు నమస్కారము. ఓ పాశము కలవాఁడా ! కాలకూట విషము నారగించినవాఁడా ! ఓ సర్వవిభూ ! అమరవంద్య ! స్వయంభూదేవ ! శక్తిమంతుఁడా నీకు నమస్కారము. అఖిల జగత్కర్మ సాక్షిభూతుఁడ వయిన ఓ శంభూ ! నీకు నమస్కారము. (10) శీర్షమున చంద్రుని గలిగి, గంగా ఫేన ధావళ్యమున భాసించు మౌళ్ళీ గలవాఁడా, మహా భోగీంద్రుని కంఠహారముగా దాల్చినవాడ ! ఓ శివ ! ఓ పరమాత్మ, విభూతితో సంఛన్నదేహా ! నీకు నమస్కారము. సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా కలవాఁడా ! కపర్దీ ! అంధకాసురమర్ధనుఁడా నీకు నమస్కారము. త్రిపురధ్వంసీ ! దక్షయజ్ఞవీధ్వంసీ ! శైలజా కుచ మందలి కుంకుమముచే విరంజితమయిన వక్షోభాగము కలవాఁడా ! మహాదేవా ! కృత్తివాసా ! ఓ యోగిజనములచే ధ్యానింపఁబడు స్వరూపా ! శివా! అచింత్య తేజస్వరూపా ! నీ భక్తుల యొక్క హృదయాంభోజకర్ణికామధ్యవర్తీ ! సకలాగమసిద్దాంతసారరూప ! నీకు నమస్కారము. (15)

నమో నిఖిలయోగేంద్రబోధనాయామృతాత్మనే ।

శంకరాయా ఖిలవ్యాప్తమహిమ్నే పరమాత్మనే ॥

నమః శర్వాయ శాంతాయ, బ్రహ్మణే విశ్వరూపిణే ।

ఆదిమధ్యాంతహీనాయ, నిత్యాయావ్యక్తమూర్తయే ॥

వ్యక్తావ్యక్తస్వరూపాయ స్థూలసూక్ష్మాత్మనే నమః ।

నమో వేదాంతవేద్యాయ విశ్వవిజ్ఞానరూపిణే ॥

నమః సురాసురశ్రేణిమౌళిపుష్పార్చితాంఘ్రయే ।

శ్రీకంఠాయ జగద్ధాత్రే లోకకర్త్రే నమోనమః ॥

రజోగుణాత్మనే తుభ్యం వీశ్వసృష్టివిధాయినే ।

హిరణ్యగర్భరూపాయ హరాయ జగదాదయే ॥

నమో విశ్వాత్మనే లోకస్థితివ్యాపారకారిణే ।

సత్వవిజ్ఞానరూపాయ పరాయ ప్రత్యగాత్మనే ॥

తమోగుణవికారాయ జగత్సంహారకారిణే ।

కల్పాంతే రుద్రరూపాయ పరపరవిదేనమః ॥

అవికారాయ నీత్యాయ నమః సదసదాత్మనే ।

బుద్ధిబుద్ధిప్రబోధాయ బుద్ధీంద్రియవిహరిణే II

వస్వాదిత్యమరుద్భిశ్చ సాధ్యరుద్రాశ్విభేదతః ।

యన్మాయాభిన్నమతయో దేవాస్తస్మై నమోనమః ॥

అవీకారమజం నిత్యం సూక్ష్మరూపమనౌపమమ్ ।

తవయత్తన్న జానంతి యోగినోఽపి సదాఽమలాః ॥

త్వామవిజ్ఞాయ దుర్ఞేయం సమ్యగ్ర్భహ్మాదయోఽపివా ।

సంసరంతి భవే సూనం న తత్కర్మాత్మకాశ్చిరమ్ ॥

యావన్నోపైతి చరణౌ తవాజ్ఞానవిఘాతీనః ।

తావద్భ్రమతి సంసారే పండితోఽ చేతనోఽపి వా ॥

స ఏవదక్ష స కృతీ సమునిః స చ పండితః ।

భవతశ్చరణాంభోజే యేన బుద్ధిః స్థిరీకృతా ॥

సుసూక్ష్మత్వేన గహనః సద్భావస్తే త్రయీమయః ।

విదుషామపి మూఢన స మయా జ్ఞాయతే కథమ్ ॥

అశబ్దగోచరత్వేన మహిమ్నస్తవ సాంప్రతమ్ ।

స్తోతుమష్యనలం సమ్యక్త్వామహం జడధీర్యతః ॥

తస్మాదజ్ఞానతో వాపి మయా భక్త్యైవ సంస్తుతః ।

ప్రీతశ్చ భవ దేవేశ నను త్వం భక్తవత్సలః ॥

సకల యోగేంద్ర ప్రబోధనునకు, అమృతాత్మునకు, శంకరునకు అఖిలప్యాప్తమహామహిమునకు, పరమాత్మునకు నమస్కారము. శర్వునకు, శాంతునకు, జగద్రహ్మయైన వానికి, విశ్వరూపీకి ఆదిమధ్యాంతములు లేనివానికి, నిత్యునకు, అవ్యక్తమూర్తికి వ్యక్తావ్యక్త స్వరూపునకు, స్థూల సూక్ష్మాత్మునకు, వేదాంతవేద్యునకు, సమస్త విశ్వ విజ్ఞాన స్వరూపునకు నమస్కారము. సమస్త సురాసుర సంఘ శ్రేష్ఠులచే పుష్పములచే పూజింపం బడిన పాదములు కలవానీకీ, శ్రీకంఠునకు, సర్వ ప్రపంచమునకు సృష్టికర్తయైన వానికి, లోకకర్తకు, నమస్కారము. రజోగుణాత్ముఁడైన వానికీ, విశ్వ సృష్టి విధాయియైన వానికి హిరణ్యగర్భ రూపుఁడయిన వానికి నమస్కారము. పరాత్పరునకు, ప్రత్యగాత్మునకు తమోగుణ వీకారునకు, జగత్సంహారకారునకు, కల్పాంతమున రుద్రరూపునకు, పరాపర విదుఁడవయిన నీకు నమస్కారము (22) అవీకారుఁడవయిన నీకు, నిత్యుం డవయిన నీకు, సత్ అసత్ అత్ముఁడవయిన నీకు, బుద్ధి బుద్ధి ప్రబోధుఁడవయిన నీకు, బుద్ధీంద్రీయ వికారుఁడ షయిన నీకు నమస్కారము. ఎవని యొక్క మాయచే వసు, రుద్ర, ఆదిత్య, మరుత్, సాధ్య రుద్ర అశ్వి భేదమున భిన్న మతములుగా దేవతలుండిరో అట్టి నీకు నమస్కారము. నీవు ఆవకారుఁడవు, అజుఁడవు, నీత్యుఁడవు, సూక్ష్మరూపుఁడవు, ఉపమింప శక్యముకొనీవాఁడవు; నిన్ను అమలు లయిన యోగులు కూడ తెలిసికొన లేరు, దుర్జయుఁడవగు నీన్ను బ్రహ్మ మొదలగు వారు కూడ తెలిసికొనలేక ప్రపంచమున జన్మ నొంది సంచరింతురు, వారికా జన్మ కర్మలు చిరకాల ముండవు. (26) అజ్ఞానమును పటాపంచలోనర్చు నీ చరణములను ఎంత కాలము పొందరో, అంతకాలము పండితులు గానీ, అచేతనములుకాని సంసారమున భ్రమింతురు. (27) ఎవనీ యొక్క బుద్ధీ భవచ్చరణాంభోజమున స్థిరీకృతమో, అతఁడే సమర్థుఁడు; ఆతఁడే కృతి; ఆతఁడే మునివర్యుఁడు; ఆతఁడే పండితుఁడు, (28) త్రయీమయమయిన నీ సద్భావము (నీ స్థితి, ఉనికి) మిక్కిలి సూక్ష్మమయినందున గహనము, తెలిసికొనుట కష్టము. విద్వాంసులకే తెలియబడనప్పుడు, మూడుఁడనైన నాచే నేట్లు తెలియబడును? నీ గొప్పతనము పదముల కందనిది. శబ్దములచే నిరూపించుటకు వీలుకానీది. అందుచే భవన్మహిమాతిశయమును సంపూర్ణముగా స్తోత్రము చేయ శక్తుఁడను కాను. జడబుద్దినీ అయినను అజ్ఞానముతో నిన్ను భక్తితో స్తోత్రము చేసితిని. సంప్రీతుఁడవు కమ్ము. నిజముగా నీవు భక్త వత్సలుఁడవు. నీవు భక్తుల యెడ ప్రియతముఁడవు.

 వసిష్ఠ ఉవాచ :-

ఇతీ స్తుతస్తథా తేన భక్త్యా రామేణ శంకరః ।

మేఘగంభీరయా వాచా తమువాచ హసన్నివ ॥

 భగవానువాచ :-

రామాహం సుప్రసన్నోఽస్మి శౌర్యశాలితయా తవ ।

తపసా మయి భక్త్యా చ స్తోత్రేణ చ విశేషతః ॥

వరం వరయ తస్మాత్త్వం యద్యదిచ్ఛసి చేతసా ।

తుభ్యం త త్తదశేషేణ దాస్యామ్యహమశేషతః ॥

వసిష్ఠ ఉవాచ :-

ఇత్యుక్తో దేవదేవేన తం ప్రణమ్య భృగూద్వహః ।

కృతాంజలిపుటో భూత్వా రాజన్నిదమువాచ హ ॥

యదిదేవ ప్రసన్నస్త్వం వరార్హోఽస్మి చ యద్యహమ్ ।

భవతస్తదభీప్సామి హేతుమస్త్రాణ్యశేషతః ॥

అస్త్రే శస్త్రే చ శాస్త్రే చ న మత్తోఽభ్యధికో భవేత్ ।

లోకేషు మాం రణే జేతా న భవేత్త్వత్ప్రసాదతః ॥

 వసిష్ఠ ఉవాచ :

తథేత్యుక్త్వా తతః శంభురస్త్ర శస్త్రాణ్యశేషతః ।

దదౌ రామాయ సుప్రీతః సమంత్రాణి క్రమాన్నృప ॥

సప్రయోగం ససంహారమస్త్రగ్రామం చతుర్విధమ్ ।

ప్రసాదాభిముఖో రామం గ్రాహయామాస శంకరః ॥

అసంగవేగం శుభ్రాశ్వం సుధ్వజం చ రథోత్తమమ్ ।

ఇషుధీ చాక్షయశరౌ దదౌ రామాయ శంకరః ॥

అభేద్యమజరం దివ్యం దృఢజ్యం విజయం ధనుః ।

సర్వశస్త్రసహం చిత్రం కవచం చ మహాఘనమ్ ॥

అజేయత్వం చ యుద్ధేషు శౌర్యం చాప్రతిమం భువీ ।

స్వేచ్ఛయా ధారణే శక్తిo ప్రాణానాం చ నరాధిప ॥

ఖ్యాతిం చ బీజమంత్రేణ తన్నామ్నా సర్వలౌకికీం ।

తపః ప్రభావం చ మహత్ ప్రదదౌ భార్గవాయ సః ॥

భక్తిం చాత్మని రామాయ దత్త్వా రాజన్ యథోచితమ్ ।

సహితః సకలైర్భూతైశ్చామరైశ్చంద్రశేఖరః ॥

తేనైవ వపుషా శంభుః క్షిప్రమంతరధాద్ధరః ।

కృతకృత్యస్తతో రామో లబ్ధ్వా సర్వమభీప్సితమ్ ।

వసిష్ఠుఁడిట్లు చెప్పెను.

ఈ విధముగా భక్తియుక్తుఁడైన రామునిచే శంకరుఁడు స్తోత్రము చేయబడెను. మేఘ గంభీరమయిన వాక్కుతో నవ్వుచు ఆతని గూర్చి శంకరుఁడనెను.

భగవంతుఁడు :

ఓ రామ ! నేను నీ వలన సుప్రసన్నుఁడను. నీ యొక్క శౌర్య సౌలిత్వముచే, తపస్సుచే, నా యందలి భక్తిచే, స్తోత్రము చేతను విశేషముగా సుప్రసన్నుఁడను. అందుచే, నీవు నీ హృదయ భావముచే నేది కోరెదవో అట్టి వరమును కోరుము. నీకది సంపూర్ణముగా, అశేషముగా నొసంగెదను అనెను.

వసిష్ఠుడు పలికెను :

ఈ విధముగా దేవదేవుఁడు పలుకగా, భృగూద్వహుఁడయిన రాముఁడు అతనికి నమస్కరించి, బిద్దాంజలి పుటుఁడై ఓ రాజా ! ఇట్లు పలికెను. ఓ దేవ ! నీవు ప్రసన్నుఁడవైనచో, నేను వరములకు అరుఁడనైనచో, నీ వలన సర్వాస్త్రములను సంపూర్ణముగా కోరుచున్నాను. అస్త్రముల యందు (మంత్ర ప్రయుక్తములు) శస్త్రముల యందు, శాస్త్రముల యందు నాకంటే అభ్యధికుఁడుండరాదు. లోకముల యందు యుద్దములలో నన్ను జయించువాఁడు, భవదనుగ్రహమున లేకుండుగాక. వసిష్ఠుఁడు చెప్పెను 'అట్లే యగుగాక' అనీ, శంభుఁడు, సుప్రీతుఁడై అశేషముగా అస్త్ర శస్త్రములను, సమంత్రముగా, రామున కొసంగెను. ఆ యస్త్రశస్త్రములను సప్రయోగముగా, ససంహారముగా ప్రసాదాభిముఖుఁడై చతుర్విధమైన అస్త్రముల యొక్క సమస్తమును, రామునిచే శంకరుఁడు గ్రహింపం జేసెను. (39) ఎక్కడను అడ్డులేని వేగము కలిగిన శుభాశ్వమును, సుధ్వజమును నైన రధోత్తమమును, అక్షయతూణీరద్వయమును, శంకరుం డు రామున కొసంగెను. భేదింప శక్యము కానిది, శాశ్వతమైనది, దీవ్యమైనది, దృఢమయిన ఏంటి నారి కలిగినదియునగు విజయధనువును, సర్వశస్త్ర పాతములను సరకుగొనని చిత్రమయినది మహాఘనమైనదియునగు కవచమును, యుద్ధములయందు జయింపఁబడని అసామాన్యమైన శౌర్యమును, ప్రాణములను స్వేచ్ఛగా ధరించుశక్తిని, ఖ్యాతిని, స్వనామము దాల్చిన బీజమంత్రముచే సర్వలౌకికమయిన కీర్తిని, గొప్ప ప్రభావమును, భక్తిని శంకరుఁడు భార్గవునకు యధోచితముగా నొసంగి సకల భూతములతో అమరులతో కూడి చంద్రశేఖరుఁడు, ఆ రూపముతోడనే అంతర్థానుఁడయ్యెను. సర్వాభీప్సితముల నొంది రాముఁడు కృతకృత్యుఁడయ్యెను. (45)

అదృశ్యతాం గతే శర్వే మహోదరమువాచ హ ।

మహోదర మదర్థే త్వమిదం సర్వమశేషతః ॥

రథచాపాదీకం తావత్పరిరక్షితుమర్హసి ।

యదా కృత్యం మమైతేన తదానీం త్వం మయా స్స్మృతః ॥

రథచాపాదికం సర్వం ప్రహిణు త్వం మదంతికమ్ ।

 వసిష్ఠ ఉవాచ :-

తథేత్యుక్త్వా గతే తస్మిన్భృ గువర్యో మహోదరే ।

కృతకృత్యో గురుజనం ద్రష్టుం గంతుమియేష సః ॥

గచ్ఛన్నథ తదాసౌ తు హిమాద్రీవనగహ్వరే ।

వివేశ కందరం రామే భావికర్మప్రచోదితః ॥

స తత్ర దదృశే బాలం ధృతప్రాణమనుద్రుతమ్ ।

వ్యాఘ్రేణ విప్రతనయం రుదంతం భీతభీతవత్ ॥

దృష్ట్వానుకంపహృదయస్తత్పరిత్రాణకాతరః ।

తిష్ఠతిష్ఠేతి తద్వ్యాఘ్రం వదన్నుచ్చైరథాన్వయాత్ ॥

తమనుద్రుత్య వేగేన చిరాదివ భృగూద్వహః ।

అససాద వనే ఘోరం శార్దూలమతిభీషణమ్ ॥

వ్యాఘ్రేణద్రుతః సోఽపి పలాయన్ వనగహ్వరే ।

నిపపాత ద్విజసుతస్రస్తః ప్రాణభయాతురః ॥

రామోఽపి క్రోధరక్తాక్షో విప్రపుత్త్రపరీప్సయా ।

తృణమూలం సమాదాయ కుశాస్త్రేణాభ్యమంత్రయత్ ॥

తావత్తరక్షుర్బలవానాద్రవత్పతితo ద్విజమ్ ।

దృష్ట్వా ననాద సుభృశం రోదసీ కంపయన్నీవ ॥

దగ్ధ్వా త్వస్త్రాగ్నినా వ్యాఘ్రం ప్రహరంతం నఖాంకురైః ।

అకృతవ్రణమేవాశు మోక్షయామాస తం ద్విజమ్ ॥

సోఽపి బ్రహాగ్నినిర్దగ్ధదేహః పాప్మా నభస్తలే ।

గంధర్వం వపురాస్థాయ రామమాహేతి సాదరమ్ ॥

విప్రశాపేన భోః పూర్వమహంప్రాప్తస్తరక్షతామ్ ।

గచ్ఛామి మోచితః శాపాత్త్వయాఽహ మధునా దీపమ్ ॥

ఇత్యుక్త్వా తు గతే తస్మిన్ రామో వేగేన విస్మితః ।

పతితం ద్విజపుత్రం తం కృపయా వ్యవపద్యత ॥

మాభైరేవం వదన్వాణీమారాదేవ ద్వీజాత్మజమ్ ।

పరామృశత్తదంగానీ శనైరుజ్జీవయస్ నృప ॥

మహేశ్వరుఁడదృశ్యుఁడయ్యెను. రాముఁడు మహోదరునితో నిట్లనెను. 'మహోదర ! ఈ సర్వస్వము రథ చోదకమును నా కొఱకు నీవు రక్షింప నరుండవు. నాకు వీనితో పనిగలిగిన యప్పుడు నిన్ను స్మరింతును. రథ చాపాదికము సర్వస్వము నాకడకు పంపుము”,

వసిష్ఠుఁడిట్లు చెప్పెను :

మహోదరుఁడు “అట్లే ! యని చెప్పి వెడలిపోయెను. అంత భృగువర్యుడు కృతకృత్యుఁడై గరుజనమును చూడబోవ సభిలషించెను. ప్రయాణీంచుచు, హిమాద్రి వసగహ్వరము నందు, భావీకర్మ ప్రచోదితుఁడై రాముఁడు ఒక కందరమును (గుహను) ప్రవేశించెను. అచ్చట నతం డొక బ్రాహ్మణ బాలుని చూచెను, ఆ బాలుఁడు ధృత ప్రాణుఁడు, వ్యాఘమాతని వెంటాడుచుండెను, ఆతఁడు ఏడ్చుచుండెను, మిక్కిలి భ్రయత్రస్తుం డై యుండెను, ఆ బాలుని చూచి దయా హృదయుఁడు, రాముడు, ఆతనిని రక్షింప సంభ్రమముతో తిష్ణ ! తిష్ఠ (ఆగు ! ఆగు.) మని ఆ వ్యాఘమును గూర్చి బిగ్గరగా అరచి దాని ననుసరించి పరుగిడెను. (51) పరువెత్తే ఆ ఘోరమయిన వనము నందు భయంకరమైన వ్యాసమును నాతఁడు చేరెను. ఆ వ్యాఘముచే వెంటాఁడబడి పరువెత్తి తన గహ్వరము నందు, ప్రాణ భయాతురుఁడై ఆ విప్రసుతుఁడు అత్యంత భీతుఁడై నేల పడిపోయేను. రాముఁడు క్రోధరూక్షుఁడయ్యెను. ఆ విప్రబాలుని పరిరక్షించుటకు ఒక దర్భమూలమును తీసికొని, తత్తణాగ్రమును కుశాస్త్రముచే అభిమంత్రించెను. మిక్కిలి ఐలిష్టమయిన యా వ్యాఘము, పరువెత్తి పరువెత్తి నేలపడిన బాలునిచూచి ఆకోశము కంపించునట్లు బిగ్గరగా గాండ్రించెను. ఇక రామ ప్రయుక్త కుశా స్త్రము, తన గోళ్ల చివరలచే బాలకుని ప్రహరించు నా వ్యాఘమును, దహించి ఎట్టి గాయములు లేకుండా ఆ బ్రాహ్మణ బాలుని రక్షించెను. (56) ఆ పాపాత్ముఁడయిన వ్యాఘము, బ్రహ్మాసముచే దగ్గభూతమయిన దేహుఁడై ఆకాశమున కెగిరి గంధర్వ రూపము నొంది రామునితో అత్యధిక గౌరవముతో నిట్లనెను. (57) భో ! మహాశయ ! విప్రశాపముచే నేను వ్యాఘ్రత మొందితిని. శాపము నుండి నీచే మోక్షమిప్పుడొసంగంబడితిని.” అని పలికి యాతఁడరిగెను. రాముఁడాశ్చర్యమొందెను.. వెంటనే పడియున్న బ్రాహ్మణపుత్రుని దయతో నేల నుండి లేవ నెత్తెను. “భయపడకు”! అని పలుకుచు రాముఁడు వెంటనే, ఆ బాలుని యవయవములను నెమ్మదిగా ఒత్తి ఆతనిని పునరుజ్జీవితుని చేసెను.

రామేణోత్థాపితశ్చైవం స తదోన్మీల్య లోచనే ।

విలోకయన్ దదర్షాగ్రే భృగుశ్రేష్ఠమవస్థితమ్ ॥

భస్మీకృతం చ శార్దూలం దృష్ట్వా విస్మయమాగతః ।

గతభీరాహ కస్త్వం భోః కథం వేహ సమాగతః ॥

కేన వాయం నిహంతుం మాముద్యతో భస్మసాత్కృతః ।

తరక్షుర్భీషణకారః సాక్షాత్కృత్యురివాపరః ॥

భయసంమూడమనసో మమాద్యాపి మహామతే ।

హతేఽపి తస్మిన్నఖిలా భాంతి వై తన్మయా దీశః ॥

త్వమేవ మన్యే సకలం పితా మాతా సుహృద్గురూ ।

పరమపదమాపన్నం త్వం మాం సముపజీవయన్ ॥

ఆసీన్మునివరః కశ్చిచ్ఛాంతో నామ మహాతపాః ।

పుత్త్రస్తస్యాస్మి తీర్థాఠీ శాలగ్రామమయాసిషమ్ ॥

తస్మాత్సంప్రస్థితశ్శైలం దీద్భక్షుర్గంధమాదనమ్ ।

నానామునిగణైర్జుష్టం పుణ్యం బదరికాశ్రమమ్ ॥

గంతుకామోపహాయాహం పంథానం తు హిమాచలే ।

ప్రవిశన్దహనం రమ్యం ప్రదేశాలోకనాకులమ్ ॥

దేశం ప్రాచీం సముద్దిశ్య కోశమాత్రమయాసిషమ్ ।

తతో దిష్టవశేనాహం ప్రాద్రవం భయపీడితః ॥

పతితశ్చ త్వయా భూయో భూమేరుత్థాపితోఽధునా ।

ఇత్యేష మమవృత్తాంతః సాకల్యేనోదితస్తవ ॥

వసిష్ఠ ఉవాచ :-

ఇతి పృష్ఠస్తదా తేన స్వవృత్తాంతమశేషతః ।

కథయామాస రాజేంద్ర రామస్తస్మై యథాక్రమమ్ ॥

తతస్తౌ ప్రీతిసంయుక్తౌ కథయంతౌ పరస్పరమ్ ।

స్థిత్వా నాతిచిరం కాలమథ గంతుమియేష సః ॥

అన్వీయమానస్తేనాథ రామస్తస్మాద్గుహాముఖాత్ ।

నిష్క్రమ్యావసథం పిత్రోః సంప్రతస్థే ముదాన్వితః ॥

అకృతవ్రణ ఏవాసౌ వ్యాఘ్రేణ భువి పాతితః ।

రామేణ రక్షితశ్చాళూద్యస్మాద్వ్యాస్తం వినిఘ్నతా ॥

తస్మాత్తదేవ నామస్య బభూవ ప్రథితం భువి ।

విప్రపుత్త్రస్యరాజేంద్ర తదేతత్సోఽకృతప్రణః ॥

రాముఁడాతనిని లేవనెత్తేను. ఆతఁడు కన్నులు తెరచెను. వెంటనే తన ముందవస్థితుఁడయిన భృగుశ్రేష్ఠుఁడగు రామునబాలుఁడు చూచెను. శార్దూలము భస్మీకృతమగుట చూచి ఆతఁడాశ్చర్యచకితుఁడయ్యెను. అతని భయము తగ్గినది. “భో ! మీరెవరు? ఇచ్చటకెట్లు వచ్చితిరి. భీషణాకారము దాల్చి, సాక్షాత్తుగా రెండవ మృత్యువు వలె నుండి నన్ను చంపుటకు ద్యమించియున్న శార్దూలమును ఎట్లు భస్మ సాత్కృతము గావించితిరి. ఓ మహామతీ ! ఇప్పటికి కూడ భయసమ్మూకమయిన మనస్కుండను. అదీ చంపఁబడినను, నాకు సర్వదిక్కులు తద్ర్భాంతీతో నిండియున్నవి. నిన్నే, సర్వము తండ్రిగా తల్లీగా, స్నేహితునిగా, గురువుగా, భావించుచున్నాను. పరమమయిన ఆపద నొందిన నన్ను నీవు బ్రతికించితివి. శాంతుఁడను ఒక మునివరుఁడుండేను. ఆతడు మహాతపస్వి. ఆతని పుత్రుఁడను నేను. తీర్దార్ధినై నేను శాలిగ్రామమున కరిగితిని. అచ్చటి నుండి గంధమాదనశైలమును దర్శింప బయలుదేరితిని. నానా మునిగణములతో గూడియున్నది, పుణ్యప్రదమయినదియునగు బదరికాశ్రమమునకుఁబోవలవలయునని యెంచి, సహాయరహితుఁడనైన నేను, హిమాలయమున నొక మార్గమును ప్రవేశించితిని. అది గహనము. రమ్యము. తత్రదేశావలోక నాభిలాష చేతిరుగుచు, త్రోవతప్పితిని. తూర్పు దిక్కుగా ఒక క్రోశ దూరమరిగితిని, దురదృష్టవశమున వ్యాఘభయపీడితుం డనై పరువెత్తితిని. నేలపై పడిపోయితిని, ఆ భూ ప్రదేశమునుండి, తండ్రివలె, అత్యంత పుత్త్ర ప్రేమతో దయాళుత్వముచే నీచే ఇప్పుడు లేవనెత్తంబడితిని" ఇది నా వృత్తాంతము. సర్వమును నీకు చెప్పితిని నేను.

వసిష్ఠుఁడు చెప్పెను :

ఆతఁడట్లు స్వవృత్తాంతమును సర్వమును చెప్పగా రాముఁడాతనికి యథాక్రమముగా సర్వమును వివరించెను. (71) అంత వారిరువురు ప్రీతిమంతులయిరి. వారొకరొకరితో ప్రసంగించుకొనిరి. కొంతకాలము పోరందుండిరి. ఆతఁడు (ఆ బాలుఁడు) బయలుదేరి వెడల నభిలషించెను. ఆ బాలుఁడు తోడ రాగా రాముఁడు ఆ గుహాముఖము నుండి ఈవలకు వచ్చి, సంతోషాన్వితుఁడై తండ్రియున్న ఆశ్రమమునకు బయలుదేరెను. వ్యాఘము వలన నేలపడినను, ఆ బోలుఁడు అకృతవ్రణుఁడైన కారణమునను, వ్యాఘమును చంపిన రామునిచే నతఁడు రక్షింపఁబడుటచేతను ఆ బ్రాహ్మణ బాలునకు 'అకృతప్రణుఁడను నామ మెల్లెడలను విఖ్యాతమయ్యెను.

తదా ప్రభృతి రామస్య ఛాయేతపగా భువి ।

బభూవ మిత్రమత్యర్థం సర్వావస్థాసుపార్థివ ॥

స తేనానుగతో రాజన్ భృగోరాసాద్య సన్నిధిమ్ ।

దృష్ట్వా ఖ్యాతిం చ సోఽభ్యేత్య వినయేనాభ్యవాదయత్ ॥

స తాభ్యాం ప్రియమాణాభ్యామాశీర్భిరభినందితః ।

దినాని కతిచిత్తత్ర వ్యవసత్తత్ప్రీయేప్సయా ॥

తతస్తయోరనుమతే చ్యవనస్య మహామునేః ।

ఆశ్రమం ప్రతిచక్రామ శిష్యసంఘైః సమావృతమ్ ॥

నియంత్రింతాంతఃకరణం తం న సంశాంశమానసమ్ ।

సుకన్యా చాపి తద్భార్యాపునంది త మహామహా ॥

తాభ్యాం చ ప్రీతియుక్తాభ్యోం రామః సమభినందితః ।

ఓర్వాశ్రమం సమాపేదే ద్రష్టుకామస్తపోనిధిమ్ ॥

తం చాభివాద్య మేధావీ తేన చ ప్రతీనందితః ।

ఉవాస తత్ర తత్ప్రీత్యా దినానీ కచిన్నృప ॥

విపృష్టస్తేన శనకై రృచీక భవనం ముదా ।

ప్రతస్థే భార్గవః శ్రీమానకృతప్రణసంయుతః ॥

అవందత పితుః పిత్త్రోర్నతా పాదౌ పృథక్ పృథక్ ।

తౌ చ తం సృప సంహర్షాచ్చాశిషా ప్రత్యనందసామ్॥

పృష్ఠశ్చ తాభ్యామఖిలం నిజవృత్తముదారధీః ।

కథయామాస రాజేంద్ర యథావృత్తమనుక్రమేత్॥

స్థిత్వా దినాని కతిచిత్రత్రాపి తదనుజ్ఞయా ।

జగామావసధం పిత్రోః ముదా పరమయాయుతః ॥

అభ్యేత్య పితరౌ రాజన్నాసీనావాశ్రమోత్తమే ।

అవందత శయోః పాదౌ యథావద్భృగువందన ॥

పాదప్రమాణావనతం సముత్థాప్య చ సాదరమ్ ।

ఆశ్లిష్య నేత్రపరిటైర్నందంతౌ వర్యషించతామ్ ॥

ఆశీర్ఫిరభినంద్యాంకే సమారోష్య ముహుర్ముఖమ్ ।

వీక్షంతౌ తస్య చాంగాని పరిస్పృశ్యాపతుర్ముదమ్ ॥

ఆపృచ్ఛతాం చతా రామం కాలేనైతావతా త్వయా।

కికృతం పుత్త్ర కో వాయం కుత్ర వాత్వముపస్థితః॥

కథం సహ సకాశే త్వమాస్థితో వాత్ర వాగతః।

త్వయైతదఖిలం వత్స కథ్యతాం తథ్యమావయోః ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాజే వాయుప్రోక్తే మధ్యభాగే శృతీయ ఉపోద్ఘాతపాదేఽర్జనోపాఖ్యానే భార్గవచరితే పంచవింశవతమోఽధ్యాయః॥

అదీ మొదలు సూర్యుని ననుసరించియుండు ఛాయవలె, ఆ బాలుఁడు రామున కత్యంత మిత్రుఁడయ్యెను. సర్వావస్థలయందాతని ననుసరించెను. ఆతనితో ననుసరింపఁబడి రాముడు భృగు మహర్షి సన్నిధి చేరెను, రాముడు ఖ్యాతిని (భృగుపత్నిని) చూచి, ఆమెను సమీపించి వినయముతో నమస్కరించేను. ఆ భృగదంపతీ ద్వయముచే రాముఁడా శీస్సులతో నభినందితుఁడై వారలను సంతోష పరచుటకు కొన్ని దినములు రాముఁడందుండేను. అంత, వారిరువురి యొక్క అనుమతితో, శిష్య సంఘములతో సమావృతమైన చ్యవన మహర్షి ఆశ్రమమున కతఁడరిగెను. నియంత్రితమున ఇంతఃకరణము కలవాడు, అంతయుత.మనసుడైన చ్యవనునకు తద్భార్యమయిన సుకన్యకు మహా మనస్వియైన రాముఁడు నమసురీంచెను. (80) పోరిద్దరు ప్రీతిమంతులు, వారిచే వభినందింపఁబడి ఔర్వాశ్రమముపకు తత్తపోవీధివి దర్శించుకోర్కెతో రాముఁ డు చేరెను. మేధావి యయిన రాముడు వారలకు నమస్కరించేను. వారలచే ప్రత్యభినందితుఁడయ్యెను. వెరీ సంతోషము కొఱకు అయాశ్రమమున కొన్ని దినములు రాముఁ డుండెను. పొరలచే అనుమతింపఁబడి, ఆమౌర్వాశ్రమమును వీడి, నెమ్మదిగా, భార్గవుఁడు, అకృతవణునితో సహా సంతోషముగా ఋచీక భవనమునకు బయలుదేరెను. తల్లిదండ్రుల పాదములకు మాటిమాటికీ నమస్కరించి, వారిచే సంతోషమున ప్రత్యాడిషములచే నభినందింపఁబడెను. (34) వారాకవి వృత్తాంతము నడిగిరి. ఉదారధీయుతుండు రాముడు, జరిగినదంతయు యథాక్రమముగా వారికి వివరించేను. అందుకొన్ని దినములు వసించి, వారి యనుచుటచే, పితృదేవుల నివాసమునకు, అత్యంత ముదాన్వితం:డై రాముఁడరిగేమ. ఉత్తమమైన ఆశ్రమమున ఆసీనులైయుప్పు పితరులనుచేరి, వారి పాదములంటి యధాశాస్త్రముగా రాముఁడు నమస్కరించెను. పాదప్రణామానంతరము రాముని లేవనెత్తి సాదరముగా కౌగిలించుకొని ఆనందాశ్రువులచే వారితనివి పర్యభిషేకించిరి. ఆశీస్సులచే అభినందించి, అంకముందు కూర్చుండపెట్టుకొని, మాటిమాటికి కుమారుని ముఖమును వీక్షించుచు, శరీరాంగములమ తాకుచు, వారానందపడిరి. అంతవారు 'నాయనా ! ఇంతకాలమేమి చేసితివి. బిడ్డా ! ఈతఁడెవడు? ఎచ్చట నీకు లభించెను? ఆతనితో ఎట్లు వసించితివి. అతఁడెట్లు వచ్చెను. వాయవా ! తథ్యమంతయు మీ యిరువురినీ గూర్చి చెప్పుము” అని అడిగిరి.

ఇది వాయుప్రోక్తము, మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమువ మధ్యభాగమందు, తృతీయోపాదాతపాదమున అర్జునోపఖ్యానమున భార్గవచరితము ఇరువదియైదవ అధ్యాయము.