2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము

Table of Contents

18 - నక్షత్ర శ్రాద్ధము

బృహస్పతి రువాచ :-

యమస్తు యాని శ్రాద్దానీ ప్రోవాచ శశబిందవే ।

తానీ మే శృణు కార్యాణి నక్షత్రేషు పృథక్ పృథక్ ॥

శ్రాద్దం యః కృత్తికాయోగం కురుతే సతతం నరః ।

అగ్నీనాధాయ స స్వర్గే రాజతే సుదృఢవ్రతః ॥

అపత్యకామో రోహిణ్యం సౌమ్యే తేజస్వినా భవేత్ ।

ప్రాయశః క్రూరకర్మాణి ఆర్ద్రాయాం శ్రాద్ధమాచరన్ ॥

క్షేత్రభాగీ భవేత్పుత్రీ శ్రాద్ధం కృత్వా పునర్వసౌ ।

పుష్టికామః పునస్తిష్యే శ్రాద్ధం కుర్వీత మానవః ॥

ఆశ్లేషాసు పితౄనర్చన్వీరాన్పుత్రానవాప్నుయాత్ ।

జాతీనాం భవతి శ్రేష్ఠో మఘాసు శ్రాద్ధమారచన్ ॥

ఫాల్గుణేషు పితృనర్చన్సౌభాగ్యం లభతే నరః ।

ప్రదానశీలః సాపత్య ఉత్తరాసు కరోతి యః ॥

సంపత్సు ముఖ్యో భవతీ హస్తేఽభ్యర్చ్య పితృనపి ।

చిత్రాయాం చైవ యః కుర్యాత్పశ్యేద్రూపవతః సుతామ్ ॥

స్వాతినా చైవ యః కుర్యోద్వాణిజ్యే లాభమాప్నుయాత్ ।

పుత్రార్థీ తు విశాభాసు శ్రాద్ధమీహేత మానవః ॥

అనురాధాసు కుర్వాణో నరశ్చక్రం ప్రవర్తయేత్ ।

ఆధిపత్యం భవేచ్చ్రేష్టం జ్యేష్ఠాయాం సతతం తు యః ॥

మూలేనారోగ్యమిచ్ఛంతి హ్యాషాడాసు మహద్యతః ।

ఉత్తరాసు చ కుర్వాణో వీతశోకో భవేన్నరః ॥

శ్రవణేన తు లోకేషు ప్రాప్నుయాత్పరమాం గతిమ్ ।

రాజ్యభాగీ ధనిష్ఠాసు ప్రాప్నుయాత్ విపులం ధనమ్ ॥

బృహస్పతి చెప్పెను.

వేటు వేలు నక్షత్రముల యందు చేయవలసిన శ్రాద్దముల వివరముల గూర్చి నేను చెప్పగా శ్రద్దగా వినుము. యముఁడు వీనిని శశబిందువునకు చెప్పెను. కృత్తికా నక్షత్ర యోగమున అగ్నుల నాధానము చేసిన తరువాత శ్రాద్దమును చేయునతఁడు. స్వర్గమున పాల్గొందును. ఆతఁడు శ్రాద్ధ క్రియా నిర్వహణము నందు సుదృఢవ్రతుఁడై యాచరించవలెను. (2) రోహిణీ నక్షత్ర యోగమున పుత్రకాముఁడు. శ్రాద్దము సాచరించవలయును. సౌమ్య నక్షత్ర యోగమున (మృగశీర్ష) శ్రాద్దము నోచరించు నతఁడు తేజస్వియగును, ఆర్లా నక్షత్ర యోగమున శ్రాద్దము చేయునతఁడు ప్రాయశః క్రూర కర్మల నాచరించువాఁడగును. (3) పునర్వసు నక్షత్ర యోగమున శ్రాద్దము నాచరించువాఁడు వ్యవసాయిక భూములలో భాగస్వామి యగును. అంతియేకాక పుత్రవంతుఁడగును. (4) పుష్టికాముఁడు తిష్య (పుష్యమి) నక్షత్ర యోగమున శ్రాద్ధమాచరించవలెను. ఆశ్లేష నక్షత్ర యోగమున నెవఁడు ప్రీత్రర్చనము (శ్రద్దము) చేయునో ఆతఁడు వీరులయిన పుత్రుల పొందును. మఘనక్షత్ర యోగమున శ్రాద్ద మాచరించిన యతఁడు అన్ని వర్ణములలో శ్రేష్ఠుఁడగును. (5) పూర్వ ఫల్గుణీ యోగమున పితరుల నర్చించువాఁడు సౌభాగ్యమును పొందును. (6) ఉత్తర ఫల్గుణీ నక్షత్ర యోగమున శ్రాద్దము పెట్టువాఁడు సహజముగా ప్రధాన శీలుఁ డగును. పుత్ర వంతుండునగును. హస్తా నక్షత్ర యోగమున పిత్రర్చనము చేయునతఁడు సభలయందు ముఖ్యుఁడగును, చిత్రా నక్షత్ర యోగమున శ్రాద్దము జరుపువాఁడు, అందమైన పుత్రులను బడయును. (7) స్వాతీయోగమున చేయువాఁడు వాణిజ్యమున లాభమొందును. పుత్రుల పొందగోరు నతఁడు వీశాఖా నక్షత్ర యోగమున శ్రాద్ధము నాచరించవలెను. (8) అనురాధా నక్షత్ర యోగమున శ్రాద్ధ మాచరించునతఁడు తన జాతియందు ప్రభుత్వమును పొందును. జ్యేష్ణా నక్షత్ర యోగమున శ్రాద్ధము నాచరించునతఁడు అత్యుత్కృష్టాధిపత్యము నొందును. (9)

శ్రాద్ధనిర్జితలోకశ్చ వేదాన్ సాంగానవాప్నుయాత్ ।

నక్షత్రైర్వారుణైః కుర్వన్భిషక్సిద్ధిమవాప్నుయాత్ ॥

పూర్వప్రౌష్ఠపదే కుర్వన్వీందేతాజీవికాన్ బహూన్ ।

ఉత్తరాస్వనతిక్రమ్య విందేద్గా వై సహస్రశః ॥

బహుకుప్యకృతం ద్రవ్యం విందేత్కుర్వన్సురేవతీమ్ ।

అశ్వానాశ్వయుజాభక్తో భరణ్యాం సాధుసత్తమః ॥

ఇమం శ్రాద్ధవిధిం కుర్వఞ్చశబిందుర్మహీమిమామ్ ।

కృత్స్నాం బలేన సోఽక్లిష్టో లబ్ద్వా చ ప్రశశాస హ ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయోపోద్ఘాతపాదే

శ్రాద్ధకల్పే నక్షత్ర శ్రాద్ధం నామ అష్టాదశోఽధ్యాయః ॥

రోగ విముక్తిని పొందగోరు నతఁడు మూలా నక్షత్ర యోగమున శ్రాద్ధము నాచరించవలయును. పూర్వాషాఢ నక్షత్ర యోగమున శ్రాద్ధము నాచరించువాడు అత్యంత యశస్సు నందును. ఉత్తరాషాఢ నక్షత్ర యోగమున శ్రాద్దము నాచరించునతఁడు వీతశోకుఁడగును. (10) శ్రవణ నక్షత్ర యోగమున శ్రాద్దము నాచరించువాఁడు పరమగతిని పొందును. ధనిషా నక్షత్ర యోగమున శ్రాద్దము నాచరించు నతఁడు రాజ్యములో భాగస్వామి యగును. విపుల ధనమును పొందును. (11) వరుణ నక్షత్ర యోగమున (శతభిషము) శ్రాద్ద మాచరించు నతఁడు సాంగముగ వేదముల నభ్యసించును; మరియు భిషక్సిద్దిని గూడ పొందును. (12) పూర్వ భ్రాష్ట్రపద (భాద్రపద) నక్షత్ర యోగమున పితృకార్యము చేయునతఁడు బ్రతుకు జీవికలను {బ్రతుకు తెరువుల) అనేకము పొందును. ఉత్తర పౌష్ట పద (ఉత్తర భాద్రపద) నక్షత్రము నతిక్రమింపకయే - ఆ నక్షత్ర యోగమున పితృకర్మ నాచరించునతఁడు వేలకొలదీ గోవులను పొందును. (13) రేవతీ నక్షత్ర యోగమున శ్రాద్దము నాచరించు నతం డు అధికమయిన ద్రవ్యమును, వెండి బంగార లోహముల వలనఁగాక, ఇతర లోహముల వలన పొందును. అశ్వనీ నక్షత్ర యోగమున శ్రాద్ధ మాచరించు నతఁడు అశ్వములను (గుఱ్ఱములను) పొందును. భరణీ నక్షత్ర యోగమున శ్రాద్ధ మాచరించునతఁడు ఉత్తములలో సాధు సత్తముఁ డగును. (14) ఈ శ్రాద్ధ నియమానుసరణమున శ్రాద్దము లాచరించిన శశిబిందువు' యావదూమిని బలముచే సులభముగా సంపాదించెను. దానిని ప్రశాసించెను. (ఏలేను).

ఇది వాయుప్రోక్త మహాపురాణమయిన బ్రహ్మాండమహా పురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాత పాదమున శ్రాద్ధకల్పమున 'నక్షత్ర శ్రాద్ధ'మను పదునెన్మిదవ యధ్యాయము.