2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము

Table of Contents

 15 - శ్రాద్ధకల్పమున బ్రాహ్మణపరీక్ష

ఋషయ ఊచుః :-

అహో ధన్యస్త్వయా సూత శ్రాద్ధకల్పః ప్రకీర్తితః ॥

శ్రుతో నః శ్రాద్ధకల్పాస్తు ఋషిభిర్యే ప్రకీర్తితాః ।

అతీవ విస్తరోహ్యస్య విశేషేణ తు కీర్తితః ॥

వేదాశేషం మహాప్రాజ్ఞ ఋషేస్తస్య మతం యథా ॥

సూత ఉవాచ:-

కీర్తయిష్యామి వో విప్రా ఋషేస్తస్య మతం తు యత్ ।

శ్రాద్ధం ప్రతి మహాభాగా స్తన్మే శృణుత విస్తరాత్ ॥

ఉక్తం శ్రాద్ధం మయా పూర్వం విధిశ్చ శ్రాద్ధకర్మణి ।

పరిశిష్టం ప్రవక్ష్యామి బ్రాహ్మణానాం పరీక్షణమ్ ॥

న మీమాంస్యాః సదా విప్రాః పవిత్రం హ్యేతదుత్తమమ్ ।

దైవే పిత్ర్యే చ నియతం శ్రూయతే వై పరీక్షణమ్ ॥

యస్మిన్ దోషాః ప్రదృశ్యేరన్స హి కార్యేషు వర్జితః ।

జానీయాద్వాపి సంవాసాద్వర్జయేత్తం ప్రయత్నతః ॥

అవిజ్ఞాతం ద్విజం శ్రాద్ధే న పరీక్షేత పండితః ।

సిద్ధా హి విప్రరూపేణ చరంతీ పృథివీమియామ్ ॥

తస్మాదతిథమాయాంతమభిగచ్ఛేత్కృతాంజలీ: ।

పూజయేచ్చార్ఘ్యపాద్యాభ్యాం తథాభ్యంజనభోజనైః ॥

ఉర్వీం సాగరపర్యంతం దేవా యోగేశ్వరాః సదా ।

నానారూపైశ్చరంత్యేతే ప్రజా ధర్మేణ యోజయన్ ॥

తస్మాద్దద్యాత్సదా దాంతః సమభ్యర్చ్యాతిథిం నరః ।

వ్యంజనానీ తు వక్ష్యామి ఫలం తేషాం తథైవ చ ॥

అగ్నిష్టోమం పయసా ప్రాప్నుయాద్వై ఫలం తథోక్థస్యచ పాయసేన ।

స షోడశీ సత్రఫలం ఘృతేన మధ్వాతిరాత్రస్య ఫలం తథైవ ॥

తథాప్నుయాచ్చ్రద్దధానో నరో వై సర్వైః కామైర్యోజయేద్యస్తు భుంక్తే।

సర్వార్ధదం సర్వవిప్రాతిథేయం ఫలం చ భుంక్తే సర్వమేధస్య నిత్యమ్ ॥

ఋషులిట్లనిరి.

ఓ సూత ! శ్రేయోదాయకమయిన శ్రాద్దకల్పము నీచే చెప్పబడినది. ఋషులచే ప్రకీర్తితములయిన శ్రాద్దకల్పములు మేము ఏంటిమీ. తచ్ఛాఛకల్పము అతి విస్తృతమయినది. వివరముగా చెప్పఁబడినది. ఓ మహాప్రాజ్ఞ ! ఆ ఋషి యొక్క మతమును పూర్తిగా చెప్పుము.

సూతుఁడిట్లు పలికెను.

ఓ బ్రాహ్మణులారా ! శ్రాద్దమును గూర్చి ఆ ఋషి యొక్కయభిప్రాయ మేదియో వివరించెదను. విస్తరించి చెప్పెదను వినుఁడు. ఇంతకు పూర్వమే శ్రాద్దమును గూర్చి చెప్పితిని. మిగిలినది బ్రాహ్మణ నిర్ణయ పరీక్ష, దానిని చెప్పెదను. (4) బ్రాహ్మణులు అన్ని సమయములందును పరీక్షింపఁబడరాదు. కాని పితృదైవకార్యములందు బ్రాహ్మణ పరీక్ష నియతముగా చేయుట పవిత్రమనీ ఉత్తమ కార్యమని తెలియబడుచున్నది. (5) ఎవని యందు దోషములు కనఁబడినవో యతఁడు కార్యముల నుండి వివర్జితుఁడు. ఆతనితో కలిసి వసించుట వలన నేవని దోషములు తెలియునో ఆతనిని తప్పక ప్రయత్న పూర్వకముగా వర్ణింపవలయును. (6) శ్రాద్ధ విషయమున పండితుఁడు పరిపూర్ణముగా అవిజ్ఞాతుఁడు క్రొత్త వాఁడునగు బ్రాహ్మణుని నిశీతముగా పరీక్షింపరాదు. ఏలయన, చాలమంది సిద్ధులు విప్ర రూపమున భువిని సంచరించుచుందురు. అందుచే, వచ్చిన యతిథిని బద్ధాంజలియై గౌరవముతో యజమాని యెదుర్కొనవలయును, ఆతనిని అర్ఘ్యపాద్యాదులతో అట్లే అభ్యంజన స్నాన భోజనములచే పూజింపవలయును. చతుస్సాగర ముద్రితమయిన యీ భూమియందు, యోగేశ్వరులు, దేవతలు, నానారూపములలో సంచరించెదరు. అట్లు చేయుచు సామాన్య ప్రజలను వారు ధర్మమును నిర్వహింప చేయుదురు, (9) అందుచే, ఆత్మనిగ్రహము గలిగిన వాఁడు (యజమాని, దాంతుఁడు) అతిథిని అధికముగా గౌరవించి, వివిధ వ్యంజనములతో గూడిన భోజనము సమకూర్చవలయును. వారిని గూర్చి, వారినట్లు గౌరవించిన గలుగు ఫలమును గూర్చి చెప్పెదను. అతిథిని పాలతో గౌరవించిన 'అగ్నిష్టోమ' యాగములను జేసిన ఫలితమందును. అతిథిని పాయసాన్నముతో గౌరవించిన ఆ కర్త 'ఉక్త మాచరించిన ఫలిత మొందును. అతిథిని నేతితో గౌరవించిన, షోడశీసత్రఫలీతమందును. అతీథినీ మధువుచే (తేనె) పూజించిన 'అతిరాత్ర' యాగమాచరించిన ఫలిత మందును. (11) బ్రాహ్మణులను గౌరవించి శ్రద్ధతో, వారడిగిన దెల్లనోసంగిన అయ్యది కర్తకు ఐశ్వర్య మొసంగును. ఆ బ్రాహ్మణులను ఆదరించిన గృహస్థు అన్ని యాగము లాచరించిన ఫలితము నొందును. (12)

యస్తు శ్రాద్ధేఽతీథిం ప్రాప్తం దైవే చాప్యవమన్యతే ।

తం వై దేవా నీరస్యంతీ హతో యద్వత్పరావసుః ॥

దేవాశ్చ పీతరశ్చైవ తమేవాంతర్హితా ద్వీజమ్ ।

ఆవిశ్య విప్రం భోక్ష్యంతి లోకానుగ్రహకారణాత్ ॥

అపూజితో దహత్యేష దిశేత్కామాంశ్చ పూజితః ।

సర్వస్వేనాపి తస్మాద్ధి పూజయేదతిథం సదా ॥

వానప్రస్థో గృహస్థశ్చ సతామభ్యాగతో యథా ।

వాలఖిల్యో యతిశ్చైవ విజ్ఞేయాహ్యతిథః సదా ॥

అభ్యాగత పాకచారోదలిథిః స్యాదపావకః ।

అతిథేరతిథః ప్రోక్తః సోఽతిథర్యోగ ఉచ్యతే ॥

నావ్రతీ న చ సంకీర్ణో నావిద్యో నావిశేషవిత్ ।

న చ సంతానసంబధో న దేవీ, నాగసేఽతిధిః ॥

పిపాసితాయ శ్రాంతాయ భ్రాండాయాబుభుక్షతే ।

తస్మై సత్కృత్య దాతవ్యం యజ్ఞస్య ఫలమిచ్ఛతా ॥

న వక్తవ్యం సదా విప్ర క్షుధితే నాస్తి కించన ।

తస్మై సత్కృత్య దాతవ్యం సదాపచిలిరేవ సః ॥

అక్లిష్టమవ్రణయుతం కృశవృత్తిమయాచకమ్ ।

ఏకాంతశీలం ధీమంతం సదా శ్రాద్ధేషు భోజయేత్ ॥

నో దదామి తమిత్యేవం బ్రూయాద్యే వై దురాత్మవాన్ ।

అపిజాతిశతం గత్వా న సముచ్యేత కిల్బిషాత్ ॥

సమోదం భోజయద్వీప్రానేకపంక్త్యాం తు యో నరః ।

నియుక్తో హ్యనియుక్తో ఏ పంక్త్యా హరతి కిల్బిషమ్ ॥

పాప్మానం గృహ్యతే క్షిప్తమిష్టాపూర్తం చ నశ్యతి ।

యతిస్తు సర్వవిప్రాణాం సర్వేషామగ్రతో భవేత్ ॥

పంచ వేదాన్సేతిహాసాన్యః పఠేద్ద్విజసత్తమః ।

యోగాదనంతరం సోఽథ నియోక్తవ్యో విజ్ఞానతా ॥

శ్రాద్ధ సమయము నందు కాని, దైవ కార్యముందుగాని సంప్రాప్మఁడైన యతిథినీ అవమానించిన వ్యక్తినీ, దేవతలు హతునిగా (శపుండైన యనాథునిగా) నిరసించి అవమానీంతురు. దేవతలు పితృదేవతలు, బ్రాహ్మణులయందతర్షితులై ఆవేశించి లోకానుగ్రహ కారణము వలన భోజన మారగించెదరు. (14) పూజింపఁబడని అతిథి దహించును. పూజింపఁబడినచో సర్వకామముల నొసంగును. అందుచే యజమానీ తనకున్న దెల్ల వ్యయమొనర్చియైన అతిథీనీ సదా పూజింపవలెను. (15) సజ్జనులకు, అభ్యాగతుఁడైన యతిథి, వాన ప్రస్థుఁడగుగాక, గృహస్థుఁడగుగాక - ఆతఁడు 'వాలఖిల్యునితో 'తుల్యుడు' యతి కూడ నట్టివాఁడే. (16) తన కోరిక ననుసరించి సంచరించు వాఁడగుట యతిథి అభ్యాగతి యనంబడును. అతిథి అపావకుఁడు. అతిధి - అతిథిగా పేర్కొనఁబడినవాఁడు ఏలయన నతనికి నిశ్చితమైన తిథి లేదు. ఇది అతిథి శబ్దార్థము. (17) క్రింద పేర్కొనబడినవారు అతిథులుగా హహ్వానింపబడరాదు. 'ప్రతి’ కానివానీనీ (ఆచార ధర్మముల సవలంబింపని వానిని) వర్ణ సంకీర్ణుం డయినవానిని, విద్యా రహితుఁడయిన వానీనీ, ఏ విధమయిన ప్రత్యేక శాస్త్ర జ్ఞానము లేనివానీనీ, సంతాన రహితుఁడయిన పానీని, దేవతల యందు విశ్వాసము లేనివానినీ, పాపరహితుఁడు కానీ వానినీ అతిథిగా గ్రహింపరాదు. (18) దేశములు తిరిగి తిరిగి దాహ పీడితుడయిన వానీని, అలసిపోయిన వానిని, భ్రాంతుఁడయిన వానిని, అధికముగా ఆకలిగొన్న వానినీ సత్కరించి, యజ్ఞ ఫలము కోరునఱఁడు ఆహార మొసం గవలేను. (19) అధికముగా సాకలిఁగొన్న వానితో 'ఏమియులేదు' అనీ యేమాత్రము వచీంపరాదు. అట్టి వానిని సత్కరించి, ఆహార మొసంగవలెను. ఈతఁడు ఎల్లప్పుడును గౌరవింపఁబడనరుఁడు. (20) శ్రాద్ధ క్రియల యందు యజమాని క్రింద నుదహరింపఁబడబోవు నట్టి వారికి ఎల్లవేళల భోజన మీడవలెను. అక్షిష్ణుఁడైన వానికీ (బాధపెట్టఁబడనివానికి) ప్రణ రహితుఁడైన వానికి (పుండ్లు, కురుపులు) లేని వానికీ కృశవృత్తి పరునకు (యోగాభ్యాస శీలికి) యాచింపని వానికి (ఇంతో అంతయో తీనుటకుండి యాచింపని వానికి) ఏకాంత వాస శీలుండయిన వానికి, ధీమంతుం డయిన వానీకి, శ్రాద్దముల యందు భోజనమిడవలయును. (21) “నీకు నేనన్నము పెట్టను - భోజన మీయను” అని చెప్పు దురాత్ముఁడు నూరు జన్మలెత్తినను పాపవిముక్తుఁడు కాజాలఁడు. (22) ఎవ్వఁడు తనతో నేక పంక్తిలో విప్రులకు భోజనమిడునో ఆతఁడు అతిథులాహ్వానింపం బడినను కొకున్నను పాపము నుండి విముక్తుఁడగును. పాపకర్ముని ఆహ్వానించి భోజనం బిడిన ఆతఁడోనర్చిన (యజమాని) ఇష్టాపూర్తి యజ్ఞ ఫలము నశించును. విప్రులందరిలో యతి యగ్రేసరుఁడు. బుద్ధిమంతుఁడు వివేకియు నయిన గృహస్థు (యజమాని) యోగవిద్యా వంతుని తరువాత నాల్గు వేదములను, ఇతి హాసములను జదివిన వాని కాసన మొసంగవలెను. (25)

త్రివేదోఽనంతరం తస్య ద్వివేదస్తదనంతరమ్ ।

ఏకవేదస్తతః పశ్చాదుపాధ్యాయస్తతః పరమ్ ॥

పావనా యేఽత్ర సంఖ్యాతాస్తాన్ ప్రవక్ష్యే నిబోధత ।

య ఏతే పూర్వనిర్దిష్టాః సర్వే తే హ్యనుపూర్వశః ॥

షడంగవిద్ద్యానయోగౌ సర్వతంత్రస్తథైవ చ ।

యాయావరశ్చ పంచైతే విజ్ఞేయాః పంక్తిపావనాః ॥

శ్రాద్ధకల్పే భవేద్యస్తు సన్నిపత్య తు పావన: ।

చతుర్ధశానాం విద్యానా మేకస్యామపి పారగాః ॥

యథావద్వర్తమానాశ్చ సర్వే తే పంక్తిపావనాః ।

అసందేహస్తు సౌపర్ణాః పంచాగ్నేయాశ్చ సామగాః ॥

యశ్చరేద్విధీవద్వీప్ర సమా ద్వాదశ సంతతః ।

త్రినాచికేతస్త్రై విద్యో యశ్చ ధర్మాన్విజః పఠేత్ ॥

బార్హస్పత్యే మహాశాస్త్రై యశ్చ పారంగతో ద్విజః ।

సర్వే తే పావనాః విప్రాః పంక్తీనాం సముదాహృతాః ॥

ఆమంత్రితస్తు యః శ్రాద్ధే యోషితం సేవతే ద్విజః ।

పితరస్తస్య తన్మాసం తస్మిన్రేతసి శరతే ॥

ధ్యాననిష్టాయ దాతవ్యం సానుక్రోశాయ ధీమతే ।

యతీం వా వాలఖిల్యం పొ భోజయేచ్చ్రాద్ధకర్మణి ॥

వానప్రస్థాయ కుర్వాణః పూజామాత్రేణ తుష్యతే ।

గృహస్థం భోజయేద్యస్తు విశ్వేదేవాశ్చ పూజితాః ॥

వానప్రస్థీన ఋషయో వాలఖిల్యై: పురందరః ।

యతీనాం తు కృతా పూజా సాక్ష్యాద్భ్రహ్మాతు పూజితః ॥

ఆశ్రమోఃఽపావనో యస్తు పంచమస్సంకరాత్మకః ।

చత్వార స్త్వాశ్రమాః పూజ్యాః శ్రాద్ధే దేవే తథైవ చ ॥

చాతురాశ్రమబాహ్యాభ్యస్తేభ్యః శ్రాద్ధేన దోపయేల్ ।

యస్తిష్ఠేద్వాయుభక్షశ్చ చాతురాశ్రమబాహ్యతః ॥

అనాశ్రమీ తపస్తేపే న తం తత్ర నియంత్రయేత్ ।

అయతిర్మోక్షవాదీ చ శ్రుతా తౌ పంక్తిదూషకౌ ॥

ఉగ్రేణ తపసా యుక్తా బహుజ్ఞాశ్చిత్రవాదినః ।

నిందంతి చ ద్విజాతిభ్యః సర్వే తే పంక్తి దూషకాః ॥

మూఁడు వేదములు చదివినవాఁడు, ఆతని తరువాత రెండువేదములు చదివినవాఁడు కూర్చుండవలెను; ఆతని తరువాత ఒక వేదము చదివిన వాఁడు, తరువాత ఉపాధ్యాయుడు కూర్చుండఁవలెను. (26) ఈ సందర్భములో పంక్తిని పవిత్రము చేయు.వారల గూర్చి వివరించెదను. పూర్వము చెప్పబడిన వారందరు నిర్దిష్టమయిన క్రమములో చెప్పబడిన వారని యెఱుంగుము. (27) క్రిందం చెప్పఁబోవు ఐదుగురను పంక్తినీ పావనము చేయువారిగా తెలిసికొనవలయును. వేద సంబంధమయిన షడంగములు తెలిసినవాఁడు, ధ్యానము చేయువ్యక్తి, యోగము నభ్యసించు నతఁడు, సర్వ తంత్ర స్వతంత్రుఁడయిన వాఁడు, యాయవరుఁడు (అనికేతనుడయి ఎల్లప్పుడు సంచరించు యతి), ఇంకను శ్రాద్ధ కల్పము నేటింగీనవాఁడు పంక్తిని పవిత్రీకరించును. పదునాలుగు విద్యలలో నొక్కదానీ నయినను పూర్తిగా గ్రహించి పారమెరిగినవాఁడు (29) యథాశాస్త్రము తమ తమ విధులనునెరవేర్చునట్టివాఁడు వీరందరు పంక్తిని పవిత్రీకరింతురు. నిస్సందేహముగా సౌపర్ణులు (పంచాగ్నులను ప్రత్యహము నిర్వహించువారు), సామవేద పారీణులు, విధి ననుసరించి నడకతో పండ్రెండు సంవత్సరములు తీర్థయాత్రలు జరిపినవారు, త్రినాచికేతులు (నాచికేతాగ్ని నెటింగినవారు లేదా మూఁడు సార్లు నాచికేవాగ్నిని సలిపిన వారు లేదా విరాజస్ అను అను వాకమును జదివినవారు) విద్యులు - మూడు విద్యలు నేర్చినవారు, పవిత్రమయిన ధర్మములను, ధర్మ క్రియలను ఆచరించు బ్రాహ్మణుఁడు, బృహస్పతిచే రచింపఁబడిన స్మృతుల పారవ్యమంటీన బ్రాహ్మణుఁడు - వీరందరు పంక్తినీ పావన మొనర్చు వారుగా పేర్కొనంబడిరి. (32) శ్రాద్ధ భోజనమునకు ఆమంత్రింపఁబడి, సీమైథునమున నీమగ్నుడయినచో ఆ బ్రాహ్మణుని రేతస్సు నందు పితరులు ఆమాస మంతయు పడియుందురు. (33) ధ్యాన సిష్ఠుఁడయిన వానికి, దయాభావ పూర్ణునకు, ధీమంతునకు, దానము నొసంగవలయును. శ్రాద్ధకర్మయందు యతికి కాని వాలఖిల్యునకు కాని భోజనము పెట్టవలయును. (34) వాన ప్రస్థునకు శ్రాద్ధభోజనము పెట్టినచో ఆతఁడు పూజామాత్రముచేతనే సంతుష్టుడగును. గృహస్థునకు భోజనమిడినచో విశ్వేదేవతలు పూజితు లగుదురు. వానప్రస్థుని గౌరవించినచో ఋషులు గౌరవింపబడుదురు. వాలఖిల్యుల వలన ఇంద్రుఁడు గౌరవింపం బడును. సన్యాసులకు శ్రాద్ధమున భోజనమిడినచో బ్రహ్మ స్వయముగా పూజిం పఁబడిన వాడగును. (36) నాలుగు ఆశ్రమముల మిశ్రమము పంచమ ఆశ్రమమగును. ఇదీ పవిత్రీకరించునది కాదు. శ్రాద్ధ విధానముననుసరించి చతురాశ్రమముల వారు పూజింపఁబడవలయును. అట్లే దైవక్రీయలయందును జేయవలయును. చతురాశ్రమ పరిధుల దాటి వర్తించు వారికి ఎట్టి దానములను చేయరాదు. చతురాశ్రమములలో జేరినవాఁడును, వాయుభక్షకుఁడై యుండు వాఁడును, తపస్సు నాచరించువాఁడును, చతురాశ్రమములకు చేరని వాఁడగుట శ్రాద్ధమున కాతనిని ఆహ్వానింపరాదు. ఉగ్ర తపస్సాచరించువారు కొందరుందురు. కొందరు డెహు జ్ఞాన వేదుల వలె నుండి, విచిత్ర వాదముల నాచరింతురు. మరికొందరు బ్రాహ్మణులను నిందించెదరు. వీరందరు పంక్తి బాహ్యులు.

ఔపవస్తాస్తథా సాంఖ్యా నాస్తికా వేదనిందకాః ।

ధ్యానం నీందంతి యే కేచిత్సర్వే తే పంక్తి దూషకాః ॥

వృధా ముండాశ్చ జటిలాః సర్వే కార్పటికాస్తథా ।

నిర్ఘృణాన్భీన్నవృత్తాంశ్చ సర్వభక్షాంశ్చ వర్జయేత్ ॥

కారుకాదీననాచారాంల్లోకవేదబహిష్కృతాన్ ।

గాయనాన్ వేదవృత్తాంశ్చ హవ్యకవ్య న భోజయేత్ ॥

ఏతైస్తు వర్తయేద్యస్తు కృష్ణవర్ణం స గచ్ఛతి ।

యోఽశ్నోతి సహ శూద్రేణ సర్వే తే పంక్తిదూషణాః ॥

వ్యాకర్షణం సత్వనిబర్హణం చ కృషిర్వణిజ్యా పశుపాలనం చ।

శుశ్రూషణం చాప్యగురోరరేర్వాష్యకార్యమేతద్ధి సదా ద్విజానామ్ ॥

మిథ్యాసంకల్పినః సర్వాను ద్వృంత్తాంశ్చ వివర్జయేత్ ॥

మిథ్యాప్రవాదీ నిందాకృత్తథా సూచకదాంభి కౌ ।

ఉపపాతకసంయుక్తా: పాతకైశ్చ విశేషతః ।

వేదే నియోగదాతారో లోభమోహఫలార్థినః ॥

బ్రహ్మవిక్రయిణస్తా న్వై శ్రాద్ధకర్మణి వర్జయేత్ ।

న వియోగాస్తు వేదానాం యో నియుంక్తే స పాపకృత్ ॥

వక్తా వేదఫలాద్భ్రశ్యేద్దాతా దానఫలాత్తథా ।

భృతకోఽ ద్ద్యాపయేద్యస్తు భృతకాధ్యాసితస్తు యః ॥

నార్హతస్తావపి శ్రాధ్ధ బ్రాహ్మణః క్రయవిక్రయీ ।

క్రయశ్చ విక్రయశ్చైవ జీవితార్థే విగర్హితౌ ॥

వృత్తి రేషా తు వైశ్యస్య బ్రాహ్మణస్య తు పాతకమ్ ।

ఆహారేద్కృతితో వేదాన్ వేదేభ్యశ్చోపజీవతి ॥

ఉభౌ తౌ నార్హతః శ్రాద్ధం పుత్రికాపతిదేవ చ ।

వృథా దారాంశ్చ యో గచ్ఛేద్యో యజేత వృథాఽధ్వరైః ॥

నార్హతస్తావపి శ్రాద్ధం ద్విజో యశ్చైవ వార్డుషీ ।

స్త్రీయో. రక్తాంతరా యేషాం పరదారపరాశ్చ యే ॥

అర్థకామరతా శ్చైవ నతాఞ్చ్రర్ధధేషు భోజయేత్ ।

వర్ణాశ్రమాణాం ధర్మేషు విరుద్ధాః సర్వకర్మణి ॥

 ఔపవస్తులు (ఉపవాసములచే నధికముగా కృశించినవారు) సాంఖ్యులు, నాస్తికులు, వేద నిందకులు, ధ్యాన క్రియను నిందించువారు - వీరందరు పంక్తి దూరులు. (41) ప్రయోజన రహితముగా తలనుగొరిగించుకోనువారు, కారణము లేకయే యూరకే జడలు పెంచుకొనువారు, కార్పటికులు (తీర్ధ సంవాసులు, ఒక తీర్థము నుండి వేటిక తీర్థమునకు పవిత్రోదకములను తీసికొని వెళ్లుటయే వృత్తిగా గలవారు) పంక్తిదూరులు. దయాహీనులయి క్రూరులయిన వారిని, విధులను ధర్మములను విభేదించిన వారిని, విచక్షణ లేక సర్వ పదార్థ భక్షకులయిన వారిని వర్జింపవలెను. (42) హవ్యకవ్యములు దేవతలకు పితరులకు వినియోగించు పదార్థములు. అట్టి పదార్థములతో కొరుకులకు (ఒక విధమయిన శైవులు) ఆచార విధులను బహిష్కరించి వర్తించు వారికి, సంఘ బహిష్కృతులకు, వేద బహిష్కృతులకు, సంగీత వృత్తిచే జీవించు వారికి, జీవికకునై వేదములను విక్రయించి బ్రతుకువారీకి - భోజనము పెట్టరాదు. (దేవ పితృ హవ్య కవ్యములను ఇట్టి వారితో సాంఘికముగా గానీ ఇతరమైనం విధముగగాని సంబంధమును గలిగి యుండువారు కృష్ణవర్లులు (నల్లని శరీరులు) అగుదురు. శూద్రునితో కలిసి యెవ్వఁరు భుజింతురో వారందరు పంక్తి దూరులగుదురు. (44) వ్యవసాయము, జంతువులను వధించుట, భూమిదున్నుట, వాణిజ్య మాచరించుట, పశువులను పెంచుట, శత్రువును సేవించుట, లేక గురువును గాక వేటికని నెవ్వనినైన సేవించుట - ఇట్టి కార్యకలాపాచరణములు బ్రాహ్మణులకు నిషేధింపఁబడినవి. (45) మీధ్యా సంకల్పములు గలిగి, దుర్వృత్తాంతులయిన వారిని విసర్జించవలెను. అసత్య ప్రమాదముల కల్పించు వానిని, ఇతరులనకారణముగా దూషించు వారిని, ఒకరిపై చాడీలు చెప్పు వారిని, పాపాచరణముచే దోషులయిన వారినీ, తమకై యితరులను వేదాధ్యయనమునకు నియోగించువారినీ, లోభులను మోహ పరవశులయిన పోరీని, ఫలములనే కాంక్షించు వారిని, వేదముల విక్రయించు వారిని, వేదములను బ్రాహ్మణుఁడయిన ప్రతివ్యక్తి అధ్యయనము చేయవలయునే కాని తమ స్థానమున నింకొకనిని నియోగించి తాను వేదాధ్యయనమును మానరాదు. అట్టి ప్రతినిధిని నియోగించువాఁడు పాపి (46, 48) వక్త వేద ఫలము నుండి భ్రష్ఠుఁడగును. ఇతరుల ప్రేరణచే భృతకాధ్యాపకులయిన వారు (అద్దెకు వేదములు చెప్పువారు) అట్టి వారిచే వేదములు చెప్పఁబడినవారు, శ్రాద్ధమున కొహ్వానింపఁబడ నర్హులు కారు. వస్తువుల క్రయ విక్రయ వృత్తిచే జీవించు బ్రాహ్మణుఁడు శ్రాద్దమున కాహ్వానీంపబడనర్పండు కాఁడు. బ్రతుకు జీవిక కోట్లకు కొనుట అమ్ముట యను క్రియలు బ్రాహ్మణునకు నింద్యములు. (49, 50) ఇది 'వైశ్యుని యొక్క వృత్తి. బ్రాహ్మణుల విషయములో పాతక క్రియ. వేదములను రుసుమిచ్చి చదువుకొనువాఁడు, వేదముల వలన ఏకవిధ వృత్తిచే జీవించువాఁడు - వీరిరువురు శ్రాద్దమునకు భోజనమునకై పిల్వబడనర్తులు గారు. భార్యను వ్యర్థముగా సమీపించువాఁడు, వ్యర్థముగా యాగములు చేయువాఁడు శ్రాద్దమున కాహ్వానింపఁబడరాదు. (నపుంసకుని) వడ్డీ వ్యాపారి బ్రాహ్మణుని తద్దినపు భోజనమునకు పిలువరాదు. (వార్డుషీ - వడ్డీవ్యాపారి) ఇతరులను ప్రేమించు భార్యలఁగల బ్రాహ్మణులను, ఇతరుల భార్యల ప్రేమించు వారలను, అధిక ధనాశకలవారిని, స్త్రీ వ్యసనాభిలాషులను శ్రాద్ధమునకు ఆహ్వానింపరాదు. స్వకర్మలకు వర్ణాశ్రమ ధర్మములకు విరుద్ధులగు వారిని శ్రాద్ధ భోజనమునకుఁ బిలువరాదు. (54)

స్తేనశ్చ సర్వయాజీ చ సర్వే తే పంక్తిదూషకః ।

యశ్చ సూకరవద్భుంక్తే యశ్చ పాణితలే ద్విజః ॥

న తదశ్నంత పితరో యశ్చ వాచ్యం సమశ్నుతే ।

స్త్రీశూద్రాయాన్నమేతద్వై శ్రాద్ధోచ్ఛిష్టం వ దాపయేత్ ॥

యో దద్యాచ్చానుసంమ్మోహాన్న తద్గచ్ఛతి వై పితృన్ ।

తస్మాన్న దేయమన్నాధ్యముచ్ఛిష్టం శ్రాద్ధకర్మణి ।

అన్యచ్చ దధిసర్పిర్భ్యాం శిష్టం పుత్రాయ నాన్యథా ।

అవశేషం తు దాతవ్యం అన్నాద్యం తు విశేషతః ॥

పుష్పమూలఫలైర్వాపి తుష్టా గచ్చేయురంతతః ।

యావన్న శ్రపితం చాన్నం యావదౌష్ణ్యం వ ముంచతి ॥

తావదశ్నంతి పితరో యావదశ్నంత వాగ్యతాః ।

దత్తం ప్రతిగ్రహో హోమో భోజనం బలిగేవ చ ॥

సాంగుష్టేన తథా పాద్యం నాసరేభ్యో యథా భవేత్ ।

ఏతాన్యేవ చ సర్వాణి దానాని చ విశేషతః ॥

అంతర్జానూపవిష్టేన తద్వదాచమనం భవేత్ ।

ముండాన్ జటిలకాషాయాన్ శ్రాద్ధకర్మణి వర్జయేత్ ॥

మే తు వృత్తే స్థితా నిత్యం జ్ఞానినో ధ్యానినస్తథా ।

దేవ భక్తా మహాత్మానః పునీయుర్దర్శనాదపి ॥

శిఖిభ్యో ధాతురక్తేభ్యస్త్రిదండేభ్యః ప్రదాపయేత్ ।

సర్వం యోగీశ్వరై ర్వ్యాప్తం త్రైలోక్యం హి నిరంతరమ్

తస్మాత్పశ్యంతి తే సర్వం యత్కించిజ్జగతీగతమ్ ।

వ్యక్తావ్యక్తం వశే కృత్వా సర్వస్వాపి చ యత్పరమ్

సత్యాసత్యం చ యద్దృష్టం సదసచ్చ మహాత్మభిః ।

సర్వజ్ఞానాని సృష్టానీ మోక్షాదీని మహాత్మభిః ।

తస్మాత్తేషాం సదా భక్తః ఫలం ప్రాప్నోతి చోత్తమమ్ ।

ఋచశ్చ యో వేద స వేద వేదాన్యజూంషి యో వేద స వేద యజ్ఞమ్ ।

సామాని యోవేద స వేద బ్రహ్మ యో మానసం వేద స వేద సర్వమ్ ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

బ్రాహ్మణపరీక్షా నామ పంచదశోఽధ్యాయః॥

                        తస్కరుఁడు, ఇతరుల కొంకు యజ్ఞముల నాచరించువాడు. పంక్తి దూష్యులు, పందుల వలె తిను బ్రాహ్మణులను, చేతిలో అన్నము నుంచుకొనీ భుజించువారినీ, దూషింపఁబడి (నిందింపఁబడికూడ) భుజించువారీని భోజనమునకు పితరులు గ్రహింపరు. శ్రాద్ధము నందు మిగిలిన పదార్థములను (ఉచ్ఛిష్టములను) స్త్రీలకు శూద్రులకును పెట్టరాదు. (56) ఎవరయిన అజ్ఞానముచే స్త్రీ శూద్రులకు శ్రాదోచ్చిష్టమును పెట్టిన ఆ యన్నాదులు పితరులకు ముట్టవు. అందుచే అన్నాదులనుగాని, మిగిలిన పదార్థములను గానీ శ్రాద్ధ కర్మలయందితరుల కీయరాదు, (57) అంతియేకాక, మిగిలిన పెరుగు, నేయి కాక ఇతరములయిన వానిని కుమారునికి దక్క యితరుల కీయరాదు. మిగిలినట్టివి ప్రత్యేకముగా అన్నాదుల నీయవలయును. (58) తుదిని (పితరులు) పుష్పములఫలములచే తృప్తినొందీ వెడలిపోవుదురు. ఆహార పదార్థములు వండబడినంతసేపు ఆ' పదార్థములు ఉష్ణముగా నున్నంత సేపు ఎంతవరకు బ్రాహ్మణులు నిశ్శబ్దముగా భుజింతురో అంతసేపు ఫితరులు ఆహార పదార్ధముల స్వీకరింతురు. (59) దత్తము, ప్రతి గ్రహము, హోమము, భోజనము, బలి సాంగుష్ఠము తోడి పాద్యము, అసురలకు (రాక్షసులకు) ముట్టకుండునట్లు చేయవలయును. దానము లన్నియును నివ్వి వీని నిట్టోసంగవలెను. (61) యజమాని (దాత) తన చేతులను మోకాళ్ల నడుమ నుంచుకొని నేలపై ఆసీనుఁడు కావలయును. ఇట్లే ఆచమనము చేయునపుడు కూర్చుండవలెను), తల గొరిగించుకొని మొండి తలతో నుండు ముండులను, జటలు కట్టిన శిరోజములఁగల వారిని, కాషాయ వస్త్రములఁ దాల్చిన వారినీ, శ్రాద్ధ కర్మయందు పరివర్జనము చేయవలయును. (62) ఎవ్వరు నిత్యము సత్ర్పవర్తన వృత్తిలో నుందురో వారిని, జ్ఞానులకు, ధ్యానులకు, దేవభక్తులకు, మహాత్ములకు, దర్శన మాత్రముచే పవిత్రులనుగా జేయు వారికి, శీర్షమున శిఖలను గలవారికీ, ధాతురక్తులగు వారికి, దండములు గలవారికీ, పెట్టవలయును. ఈ లోకత్రయమంతయును నిరంతరము యోగేశ్వరులచే వ్యాప్తమయి యున్నది. (62) అందుచే వారు ప్రపంచమందున్నట్టి దానినెల్లను చూచెదరు. వ్యక్తమయిన దానిని అవ్యక్తమయినట్టి దానిని వారు వారి స్వాధీనములో నుంచుకొందురు. అన్నిటికంటే పరమయిన దానిని వారు గ్రహించెదరు, సత్యము అసత్యము ఆ మహాత్ములచే చూడబడినదెల్ల గ్రహింపఁబడును. వారు సత్ అసత్తుల దర్శించిరి. సర్వజ్ఞాన సముచ్చయము, మోక్షము మొదలయినవి మహాత్ములయిన వారిచే సృజింపఁబడినవి, అందుచే వారియెడ నిరంతరము భక్తియుక్తుఁడైనవాఁడు ఉత్తమమయిన ఫలము నొందును. (67) ఋక్కులను (వేద మంత్ర సూక్తములను) ఎఱింగినవాఁడు అన్ని వేదముల సెలుంగును; యజుర్వేద మంత్రముల నెఱింగిన యతఁడు యజ్ఞముల గూర్చి యెఱుంగును. సామవేద మంత్రముల నెఱింగినయతఁడు బ్రహ్మ' నెఱుంగును, మానసము (మనస్సు) నెటింగిన యతఁడు సర్వము నెఱుంగును.

ఇది వాయుప్రోక్తము, మహాపురాణము, అయిన బ్రహ్మాండపురాణమున, మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున బ్రాహ్మణ పరీక్ష యను పదియైదవ అధ్యాయము.