2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము
26 - కార్తవీర్యుఁడు జమదగ్నిఆశ్రమమును దర్శించుట
వసిష్ఠ ఉవాచ :-
ఇతి పృష్టస్తదా తాభ్యాం రామో రాజన్ కృతాంజలిః ।
తయోరకథయత్సర్వమాత్మనా యదనుష్ఠితమ్ ॥
నిదేశాద్వై కులగురోస్తపశ్చరణమాత్మనః ।
శంభోర్నిదేశాత్తీర్థానామటనం చ యథాక్రమమ్ ॥
తదాజ్ఞయైవ దైత్యానాం వధం చామరకారణాత్ ।
హరప్రసాదాదత్రాపి హ్యకృతవ్రణదర్శనమ్ ॥
ఏతత్సర్వమశేషేణ యదన్యచ్చాత్మనా కృతం ।
కథయామాస తద్రామః పిత్రోః సంప్రియమాణయోః ॥
తేచ తేనోదితం సర్వం శ్రుత్వా తత్కర్మవిస్తరమ్ ।
హృష్టౌ హర్షాంతరం భూయో రాజన్నాప్నువతావుభౌ ॥
ఏవం పిత్రోర్మహారాజ శుశ్రూషాం భృగుపుంగవః ।
ప్రకృర్వంస్తద్వీధేయాత్మా భాతౄణాం చావిశేషతః ॥
ఏతస్మిన్నేవ కాలే తు కదాచిద్ధైహమేశ్వరః ।
ఇయేష మృగయాం గంతుం చతురంగబలాన్వితః ॥
సంరజ్యమానే గగనే బంధూకకుసుమారుణైః ।
తారాజాలద్యుతిహరైః సమంతాదరుణాంశుభిః ॥
మందం వీజతి ప్రోద్భూతకేతకీవసరాజిభిః ।
ప్రాభాతికే గంధవహే కుముదాకరసంస్పృశి ॥
వయాంసి నర్మదాతీరతరునీడాశ్రయేషు చ ।
వ్యాహరన్ స్వాకులా వాచో మనఃశ్రోత్రసుఖావహాః ॥
నర్మదాతీరతీర్థం తదవతీర్యాఘహారిణి ।
తత్రోయే మునివృందేషు గృణత్సు బ్రహ్మ శాశ్వతమ్ ॥
విధివత్కృతమైత్రేషు సన్నివృత్య సరితటార్ ।
ఆశ్రమం ప్రతి గచ్చత్సు మునిముఖ్యేషు కర్మిషు ॥
ప్రత్యేకం వీరపత్నీషు వ్యగ్రాసు గృహకర్మసు ।
హోమార్థం మునికల్పాభిర్దుహ్యమానాసు ధేనుషు ॥
స్థానే ముని కుమారేషు తం దోహం హి నయత్సు చ ।
అగ్నిహోత్రాకులే జాతే సర్వభూతసుఖావహే ॥
వికసత్సు సరోజేషు గాయత్సు భ్రమరేషు చ ।
వాశత్సు నీదాన్నిష్పత్య పతత్రిషు సమంతతః ॥
వసిష్ఠుఁడిట్లు పలికెను :-
మాతా పితలచే నిట్లు అడుగబడి, ఓ రాజా ! రాముడు కృతాంజలియై తానాచరించిన దెల్ల వారలతో చెప్పెను. వారల కాతఁడు క్రమముగా తాను తపమాచరించుట, శంభుని ఆదేశమున తీర్థానము, ఆ శివుని యాజ్ఞ చేతనే దేవల కొఱకు రాక్షసుల వధించుట, హర ప్రసాదమున అకృతవ్రణ దర్శనాదీకమును చెప్పేను, (3) తత్సర్వమును, అంతీయేకాక, వేరుగా తనచే నాచరింపఁబడినదియు, సంతుష్ట మానసులయిన పితరులకు రాముడు వివరించెను. (4) వారు ఆతడు చెప్పిన తతర్మ సవిస్తరము వీనీ, సంహృష్ణులయిరీ, ఓ రాజా ! వారిరువురు హరాంతరంగులయిరి. (5) ఈ విధముగా భృగు పుంగవుఁడయిన రాముఁడు వారలకు విధేయాత్ముఁడయి శుశ్రూష యొనర్చెను. తన సోదరులకు కూడ శుశ్రూష యొనర్చెను. ఆ సమయముననే, హైహయేశ్వరుడొకఁడు చతురంగ బలాన్వితుఁడయి అరణ్యమునకు వేటకుం బోవ నభిలషించెను. గగనము బంధూక కుసుమారుణ వర్ణముతో రాగరంజితమయ్యెను. ఆ అరుణాంశువులు నక్షత్ర గణముల కాంతి నపహరించెను, ప్రాభాతిక వాయువులు మందముగా వీచుచుండెను. ఉదయకాల మారుతములు కేతకీ వన సమూహము నుండి బయలువెడలి కుముదాకరములను సంస్పృశించుచుండెను. నర్మదానదీతీరమునందలి వృక్షముల యందలి గూండ్లలో నివసించు పక్షులు విహరించుచు, మధురముగా కూయుచు, మనస్సునకు శ్రోత్రములకు సుఖావహముగా నుండెను. ముని బృందములు నర్మదా తీర స్ధములయిన తీర్థముల కరిగి, పాపమును తొలగించు జలముల యందు నిలబడి, శాశ్వత బ్రహ్మ సంబంధీ స్తోత్రములను పఠించుచుండిరి. పవిత్ర కార్యనిర్వహణమునకు విధిమంతమయిన స్నేహము గలిగి తత్తత్కార్యము లాచరించి సరిత్తటము నుండి వారి ఆశ్రమములకు ముని ముఖ్యులు తిరిగిపోవుచుండిరి వీర త్నులయిన ముని పత్నులు ప్రత్యేకముగా గృహకృత్యముల యందు నిమగ్నులై యుండిరి.మును ల యొక్క కుమార్తెలు హోమార్గము పాలను ధేనువుల నుండి పిదుకుచుండిరి. ముని కుమారులు పాలను తస్థానములకు తీసికొని పోవుచుండిరి. అగ్నిహోత్రము నాచరించుటకై జనములు తొందరపడుచుండిరి. సరోజములు వికసించినవి. భ్రమరకదంబము గానము చేయుచున్నది. పక్షులు తమగూండ్ల నుండి బయలు వెడలి సర్వత్ర సంచరించు చుండెను.
అసతివ్యగ్రమత్తేభతురంగరథగామీనామ్ ।
గాత్రాహ్లాదవివర్ధన్యాం వేలాయాం మందవాయునా ॥
గచ్చత్సు చాశ్రమోపాంతం ప్రసూనజలహారీషు ।
స్వాధ్యాయదక్షైర్బహుభిరజీనాంబరధారిభిః ॥
సమ్యక్ప్రయోజ్యమానేషు మంత్రేషుచ్చావచేషు చ ।
ప్రైషేసూచ్చార్యమాణీషు హూయమానేషు వహ్నిషు ॥
యథావన్మంత్రతంత్రోక్తక్రియాసు వితతాసు చ ।
జ్వలదగ్నిశీఖఖారే తమస్తపనతేజసి ॥
ప్రతిహత్య దిశః సర్వా వివృణ్వానే చ మేదినీమ్ ।
సవితర్యుదయం యాతి నైశే తమసి నశ్యతి ॥
తారకాసు నిలీనాసు కాష్ఠాసు విమలాసు చ ।
కృతమైత్రాదికో రాజా మృగయాం హైహయేశ్వరః ॥
నిర్యయౌ నగరాత్తస్మాత్పురోహితసమన్వితః ।
బలైః సర్వైః సముదితైః సవాజీరథకుంజరైః ॥
సచివః సహితః శ్రీమాన్ సవయోభిశ్చ రాజభిః ।
మహతా బలభారేణ నవయన్వసుధాతలమ్ ॥
నాదయన్ రథహోషేణ కకుభః సర్వతో నృపః ।
స్వబలౌఘపదక్షేపప్రక్షుణ్ణావనిరేణుభిః ॥
యమౌ సంఛాదయన్వ్యోమ విమానశతసంకులమ్ ।
సంప్రవిశ్య వనం ఘోరం వింధ్యాద్రేర్బలసంచయైః ॥
భృశం విలోలయామాస సముంద్రాజసత్తమః ।
పరివార్య వనం తత్తు స రాజే నిజసైనికైః ॥
మృగాన్నోనావిధాన్హింసాన్నిజఘాన శితైః శరైః ।
ఆకర్ణకృష్టకోదండయోధముక్తైః శీతేషుభిః ॥
నికృత్రగాత్రాః శార్దూల న్యపతన్భువి కేచన ।
ఉదగ్రవేగపాదాతఖడ్గఖండితవిగ్రహాః ॥
వరాహయూధపాః కేచిద్రుధిరార్ద్రా ధరామగుః ।
ప్రచండ శక్తికోన్ముక్తశక్తినిర్భిన్నమస్తకాః ॥
మృగౌఘాః ప్రత్యపద్యంత పర్వతా ఇవ మేదినీమ్ ।
నారాచా విద్దసర్వాంగాః సింహర్క్షశరభాదయః ॥
మత్తేభములపై అనతి వ్యగ్ర మనస్సులతో సావధానముగా పోవు వారికి, రథములపై, తురంగములపై పోవు వారికి మందపవనముల గాత్రానందమును గలిగించు సమయమున, ఆశ్రమోపాంతములకు పుష్పములను జలమును జనముల తీసికొని పోవుచుండ, స్వాధ్యాయము నందు సమర్థులు, అజీనాంబరముల ధరించిన బహు వ్యక్తులచే, నానా విధములయిన మంత్రములు సమ్యక్కుగా ప్రయోగింపఁబడుచుండ, ప్రెష మంత్రములు పఠింపఁబడుచుండెను. హోమముల కొకు అగ్నులు ఆహ్వానింపఁబడుచుండెను. వేదముల యందు చెప్పఁబడిన మంత్రముల ననుసరించి యథావిధి తంత్రోక్తములయిన క్రియలు విపులముగా జరుపబడుచుండెను. జ్వలదగ్నిశీఖాకారమున, తమస్సును తపింపఁజేయు తేజస్సున సూర్యుఁడు చీకటిని తొలగగొట్టెను. మేదినీ యంతయు వెలుతురుచే ఆవరింపఁబడియుండెను. సవిత యుదయించుచుండెను. రాత్రి సంబంధమయిన చీకటి నశించుచుండెను. నక్షత్రములు అంతర్షితములయ్యెను. దిక్కులు ప్రకాశవంతములయ్యెను. హైహయవంశశ్వరుఁడు అయినరాజు, ఉదయకాలమున ఆచరింపవలసిన కార్యముల నిర్వర్తించి, పురోహితులతో, మంత్రులతో, స్వవయస్కులగు శ్రేయోవంతులగు రాజులతో అనంతమయిన సైన్య సమూహము యొక్క భారమున వసుధాతలమును క్రుంగజేయుచు, అశ్వరథకుంజరములతో సర్వదిక్కులను రథఘోషముచే ప్రతిధ్వనిల్లజేయుచు, తన బలముల యొక్క పద విక్షేపమున ప్రక్షుణమైన భూమి రేణువులతో ఆకాశము విమానశతముచే ఆవరింపఁబడియుండెనో యన్నట్లు కప్పుచు, స్వనగరము నుండి బయలువెడలెను. వింధ్యాదీసంబంధియైన ఘోరమయిన వనమును బల సముదాయములతో ప్రవేశించి, మహారాజు మిక్కిలిగా వనమంతటిని సంక్షోభిల్లునట్లు చేసెను. ఆ వనమును తన సైనికులచే చుట్టుముట్టి, వాడియైన శరములచే సానా విధములయిన క్రూర మృగములను చంపెను. లాగి విడిచిన శితబాణములచే కొట్టబడి గాయపడిన శరీరములతో శార్దూలములు నేలకొరిగెను. పదాతులయిన సైనికుల ఖడ్గములచే ఖండింపబడిన శరీరములతో పెద్ద పులులు నేలకు వ్రాలెను. అడవి పందులు కొన్ని రక్త సిక్తమయిన శరీరములతో నేలపై పర్వతములు ఒరిగిపడునట్లు పడెను. లేళ్లు ప్రచండమైన శక్తితో విడువబడిన బాణముల తలలు చీలి నేలకొరిగెను. బాణ సముదాయముచే కొట్టబడి సింహములు, వరాహములు, శరభములు, శర ఖండిత శరీరములై వనమందంతటను రక్తార్ట శరీరాలతో పడిపోయెను.
వసుధామన్వకీర్యంత శోణితార్ద్రాః సమంతతః ।
ఏవం సవాగురై: కైశ్చిత్పతద్భిః పతితైరపి ॥
శ్వభిశ్చానుద్రుతైః కైశ్చిద్ధావమానైస్తథా మృగైః ।
ఆర్తైర్విక్రోశమానైశ్చ భీతైః ప్రాణభయాతురైః ॥
యుగాపాయే యథాత్యర్థం వసమాకులమాబభౌ ।
వరాహసింహశార్దూలశ్వావచ్ఛశకులాని చ ॥
చమరీరురుగోమాయుగవయర్క్షవృకాన్ బహూన్ ।
కృష్ణసారాన్ధ్వీపిమృగాన్రక్తఖడ్గమృగానవి ॥
వీచిత్రాంగాన్మృగానన్యాన్నంకూనపి చ సర్వశః ।
బాలాన్ స్తనంధయాన్యూనః స్థవిరాన్మిధునాన్గణాన్ ॥
నిజఘ్నుర్నిశితైః శస్త్రైః శస్త్రవధ్యాన్షి సైనికాః ।
ఏవం హత్వా మృగాన్ హోరాన్హింస్రప్రాయానశేషతః ॥
శ్రమేణ మహతా యుక్తా బభూవుర్శృపసైనికాః ।
మధ్యే దినకరే ప్రాప్తే ససైన్యః స తదా నృపః ॥
నర్మదాం ఘర్మసంతప్తః పిపాసురగమచ్ఛనైః ।
అవతీర్య తతస్తస్యాస్తోయే సబలవాహనః ॥
విజగాహ శుభే రాజా క్షతృష్ణాపరిపీడితః ।
స్నాత్వా పీత్వా చ సలీలం స తస్యాః సుఖశీతలమ్ ॥
బిసాంకురాణి శుస్రణి స్వాదూని ప్రతిఘస చ ।
విక్రీడ్య తోయే సుచిరముత్తీర్య సభలో నృపః ॥
విశశ్రామ చ తత్తీరే తరుఖండోపమండితే ।
ఆలంబపానే తీగ్మాంశో ససైన్యః సానుగో నృపః ॥
నిశ్చక్రామ పరం గంతుం వింధ్యాద్రివనగహ్వరార్ ।
స గచ్ఛన్నేవ దదృశే నర్మదాతీరమాశ్రితమ్ ॥
ఆశ్రమం పుణ్యశీలస్య జమదగ్నేర్మహాత్మనః ।
తతో నివృత్య సైన్యావి దూరేఽవస్థాప్యపార్థివః ॥
పరిచారై: కతిపయైః సహితోఽయాత్తదాశ్రమమ్ ।
గత్వాదాశ్రమం రమ్యం పురోహితసమన్వితః ॥
ఉపేత్య మునిశార్దూలం ననామ శిరసా నృపః ।
అభినంద్యాశిషా తం వై జమదగ్నిరృపోత్తమమ్ ॥
పూజయామాస విధివదర్ఘపాద్యాసనాదిభిః ।
సంభావయిత్వా తాం పూజాం విహితాం మునినా తదా ॥
అయ్యది యుగాంత కాలమేమో యన్నట్లు, వనమంతయు అల్లకల్లోలమై ఆకులత్వము చెందెను - కొన్ని హరిణములు వలలో చిక్కుకోవేను. కొన్ని వలలోఁబడ సిద్దముగ నుండెను; కొన్ని లేళ్లను వేట కుక్కలు తజుము చుండెను. కొన్ని లేళ్లు భయాకులమై పరువెత్తుచుండెను. కొన్ని ఆర్తములై భయంకరముగా ఆక్రోశించుచుండెను. ఏలయన ఆ యడవి మృగములన్నియు భయాతురము లై యుండెను. వాడియైన శరములతో కొందరు సైనికులు, సింహములు, పెద్దపులులు, ముండ్లపందులు, కుందేళ్ల గుంపులు, గోమాయువులు; గవయ మృగములు, వృకములు, కృష్ణసారములు, ద్వీపులు, ఖడ్గమృగములు, విచిత్రాంగములు: గల జాన్షి మృగములు, చిరుతపులులు మొదలగు మగవంటి నవేషములను చంపిరి. విధవర్ణములు గలిగిన లేక్షను, న్యంకులను దుప్పులను, సైనికులు చంపిరి. పాలఁడ్రాగు పిల్ల కేసరులను భవనములో నున్న వానిని, ముదునటి వానిని కొన్నింటినీ జంతువుల జంటలను వారు చంపిరి. (35) నిశితములైన శస్త్రములచే శస్త్ర వధ్యారములన ముగములను సైనికులు చంపిరి. హింసాకరములయిన షుగములను విశేషముగా చంపి నృపసైనికులందరు అధికముగా అలిసిపోయిరి. సూర్యుఁడు గగష మధ్యస్థుఁడయ్యెను. నసైన్యముగా రాజు ఘర్మ సంతప్తుఁడయ్యెను. నర్మదా నదిని దాహము తీర్చుకోమటకు చేరేమ. ఆతడు సబల పోహనుఁడై, నీటిలోనికి దిగి వారు స్వేచ్చముగా స్నానమాడిరి. రాజు కూడ ఆకలిచే దాహముచే పరిపీడితుఁడు అందు వారందరు స్నాన మాడిరి. సుఖవంతమణ చల్లనివగు నర్మదా జలములను త్రాగి, స్వచ్చములయినవి స్వాదుపులయినవియును (మర తూండ్లను తినిరి.చిరకాలము.నీటిలో క్రీడించిరి. తరువాత బల పహితముగా రాజు తీరవు నెక్కెను. తరుఃఖండోపమండితమయిన తరమున రాజు విశ్రమించేము సూర్యుడు క్రిందకు దిగెను. వేడి తను పైన్యముతో అనుచరులతో రాజు, వింధ్యాదీవనగహ్వరము నుండి, ఇంక పురమునకు నిర్ణమింపఁదలంచెను. రాజు బయలుదేరి, నర్మదా నదీ తీరము నాశ్రయించియున్న మహాత్ముఁడు పుణ్యశీలుఁడునయిన జమదగ్ని ఆశ్రమమును చూచెను. అంత సైన్యమును మరలించి, వానిని దూరముగా నుంచి, కొలదీమంది పరీచారకులతో, పురోహిత పురస్సరుఁడై ఆయాశ్రమమునకు వచ్చెను. ఆతఁడా రమ్యమైన ఆశ్రమలోనికరిగెను మునిశ్రేష్ఠుఁడయిన మునిని సమీపించి శిరస్సువంచీ రాజు నమస్కరించెను జమదగ్ని నృపోత్తముని విధివదరపాధ్యాసనములచే ఆశిషములచే నభినందించి పూజించేను. వనిచే విహిత విధిని పూంపండి గౌరవింపఁబడెను.
నిషసాదాసనే శుభ్రే పరస్తస్య మహామునేః ।
తమాసీనం సృషవరం కుశాసనగతో మునిః ॥
పప్రచ్ఛ కుశలప్రశ్నం పుత్త్రపౌత్రాదీబంధువు ।
సహనం కథయంసేన రాజ్ఞా మునివరోత్తమః ॥
స్థిత్వా నాతిచిరం కాలమాలిక్వార్థం న్యమంత్రయత్ ।
తతః స రాగ సం ప్రీతో జమదగ్నిముఖాషత ॥
మహర్షే। దేహి మేఽనుజ్ఞాం గమిష్యామి: స్వకం పురమ్ ।
సమగ్రవాహవబలో హ్యహం తప్మాన్మహామునే ॥
కర్తుం నశక్యమాలిథ్యం త్వయా వవ్యావా వనే ।
అథవా త్వం తపఃశక్త్యా కర్తుమాధ్యమద్య మే ॥
శక్నోష్యపి పురీం గంతుం మామనుజ్ఞాతుమర్హసి ।
అష్యధా చే త్ఖలైః సై న్యైరత్యర్థం మునిసత్తమ ॥
తపస్వినాం భవేత్వీడా నియమక్షయకారికా ।
వసిష్ఠ ఉవాచ :-
ఇత్యేవ ముక్తః స మునీ: తం ప్రాహ స్థీయతాం క్షణమ్ ॥
సర్వం సంపాడయిష్యేఽహమాతిథ్యం సానుగస్య తే ।
ఇత్యుక్త్వాహూయ తాం దోగ్ధ్రీమువాదాయం మూతిథిః ॥
ఉషాగతస్త్వయా తస్మాత్కియతామద్య సత్కృతి: ।
ఇత్యుక్తా మునినా దోగ్ధ్రీ సాతిథేయమశేషతః ।
దుదోహ సృపతేరాశు యద్యోగ్యం మునిగౌరవాత్ ॥
అథాశ్రమం తత్సురరాజపద్మనికాశమాసీద్భృగుపుంగవస్య । విభూతిభేదైరవిచింత్యరూవమనన్యసాధ్యం సురభిప్రభావాత్ ॥
అనేకరత్నోజ్జ్వలచిత్రహ్మప్రకాశమాలాపరివీతముచ్చైః ।
పూర్ణేందుశుభ్రాభ్రవిషక్తశృంగైః ప్రాసాదసంఘైః పరివీతమంతః ॥
కాంస్యారకూటారసతామ్రహేమదుర్వర్ణసౌధోపలదారుమద్భిః ।
పృథగ్విమి శ్రైర్భవనైరనేకైః సద్భాసితం నేత్రమనోభిరామైః ॥ మహార్హరత్నోజ్వలహేమవేదికానిష్కూటసోపానకుటీవిటంకకైః । తులాకపాటార్గలకుద్యదేహలీనిశాంతశాలాజీరశోభితైర్భృశమ్ ॥
ఆ యాశ్రమమును ప్రవేశించి ఆ మహాముని పురః ప్రదేశమున పరిశుభ్రమయిన ఆసనమున రాజు కూర్చుండెను. కుశాసనమున ఆసీనుఁడయిన ముని ఆసీనుఁడయిన రాజును, పుత్త్ర మిత్రాది బంధువుల గూర్చి కుశలప్రశ్న చేసెను. ఆ మునిశ్రేష్ఠుఁడు రాజుతో కొలది కాలము మాటాడి, ఆ రాజును ఆతిథ్యము కొఱకు ఆ మంత్రించెను (పిలిచెను). ఆ రాజు సంతోషించి జమదగ్నితో సీట్లు సంభాషించెను. “ఓ మహర్షీ ! నాకనుజ్ఞ నీప్పింపుము. సా పట్టణమునకు పోయెదను. నేను సమగ్ర వాహన బలములతో నుంటిని. ఆ కారణమున, ఓ మహామునీ! వనములందు లభించు వానిని తినెడు నీచే మాకాతిథ్యము నొసంగుట అశక్యము. అదీకాక, ఇప్పుడు మాకు నీవు నీ తపసామర్థ్యముచే ఆతిధ్య మొసంగుటకు శక్తిమంతుఁడవయినను, పట్టణమునకై పోవుటకు అనుజ్ఞ నీయగోరుచున్నాను. కాని పక్షమున, ఓ మునిసత్తమ! ఖలులయిన సైనికులచే, అత్యంతము, నియమమునకు క్షయమును గలిగించు పీడ తపస్వులకు కలుగును.
వసిష్ఠుడిట్లు చెప్పెను.
ఈ విధముగా రాజు పలుక ముని పుంగవుఁడాతనితో నీట్లనెను. 'దయ దలంచి క్షణముండుము. నీ సపరివారమున కంతటకిని క్షణములో ఆతిథ్యమును సంపాదించెదను. ఇట్లని ఆ ముని, కామగవిని (కామధేనువును) ఆహ్వానించెను. దానితో 'ఈతఁడు నా అతిథి. ఆతఁడు ఉపాగతుఁడు (వచ్చియుండెను). ఇప్పుడు నీపొతనికి సత్కృతి ఆచరించుము” అని. ఆ కామధేనువిట్లు చెప్పఁబడి, ముని యందలి గౌరవముచే నృపతీ వర్యునకెట్టి ఆతిథ్యము యోగ్యమో దానిని సంపూర్ణముగా సమకూర్చెను. అంత భృగుపుంగవుని యొక్క ఆశ్రమము దేవతారాజయిన ఇంద్రుని నగరమగు అమరావతితో తుల్యమైనదయ్యెను. మహాశక్తి మంతమయిన సురభి ప్రభావముచే ఊహింపనలవికాని వీభూతి విషయమయిన రూపము అనన్యసాధ్యమైన దాశ్రమమయ్యెను. అంతీయేకాక, అనేకములయిన రతోజ్వల చిత్రహేమ ప్రకాశమాలలచే ఉన్నతమై, పరిపూర్ణమై, యుండెను. లోపల ఆశ్రమము పూర్ణచంద్రుని శుభ్రద్యుతితో నిండి ఆకాశమంటు శృంగములు (శిఖరములు) గల ప్రాసాద సమూహముచే సంతటను నీండి ప్రకాశించెను. ఆ భవనములు కంచు, ఇత్తడి, రాగి, బంగారు లోహముల వర్ణములతో సౌధోపల దారు మృత్తులతో అంతియేకాక వేరువేరుగా కలిసియున్న అనేక భవనములతో నేత్ర మనోహరమై వెలుగొందెను. అందు మహార్హమైన రత్నోజ్జల హేమవేదికలు, కలవు.
వలభ్యలిందాంగణచారుతోరణైరదభ్రపర్యంతచతు ష్క్రియాదిభిః ।
స్తంభేషు కుడ్యేషు చ దివ్యరత్నవిచిత్రచిత్రైఃపరిశోభమానైః ॥
ఉచ్చావచైరత్నవరైర్విచిత్రసువర్ణసింహాసనపీఠికాద్యైః ।
స భక్ష్యభోజ్యాదిభిరన్నపానైరుపేతభాండోపగవైకదేశైః ॥
గృహైరమర్త్యోచితసర్వసంపత్సమన్వితైర్నేత్రమనోఽభిరామైః ।
తస్యాశ్రమం తన్నగరోపమానం బభౌ వధూభిశ్చ మనోహరాభిః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురా వాయుప్రో క్తేమధ్యభాగే
తృతీయఉపోద్ఘాతపాదేఽర్జునోపాఖ్యానే షడ్వింశతతమోఽధ్యాయః॥
విహారోద్యానములందు కలవు. మధ్య విశ్రాంతి భవనములు గలిగిన పర్వతములకు పోవుటకు సోపానములు కలవు. అయ్యప్ స్తంభములతో, వాసములతో, ద్వారములతో, గొళ్లెములతో, గోడలతో, గడపలతో, డాబాలతో, ముంగీకులతో కూడి యుండెను. ఆయశ్రమము వలఖీ సమూహముతో, అలిందములతో, చతురస్ర ప్రదేశములతో, సుందర పుష్పలతా గోపురములతో, ఒక మహానగరమువలె ప్రకాశించేను. స్తంభములపై గోడలపై నానావిధ విచిత్రములయిన చిత్రములు, వర్ణలేఖలు కలవు. అవి యన్నీయు రత్నములచే స్థగితములు. అయ్యవి వివిధములయిన ఎత్తులు గలిగిన బంగారు సింహాసనములతో నొప్పి యుండెను. వానియందు విశిష్టములయిన రత్నములు కలవు. భక్ష్య భోజ్యాదులు గలిగిన అన్నపానములతో గూడిన భాండములు గలిగిన కొన్ని ప్రదేశములు కలవు. దేవతల కుచితమయిన సర్వ సంపత్సమన్విత ములయిన గృహములు నేత్ర మనోభిరామములు గలవు.. నగరోపమానమయిన ఆయాశ్రమము మనోహరాకారములు గలిగిన వధువులతో ప్రకాశించుచుండెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందలి మధ్యభాగము నందలీ, తృతీయోపోదాతపాదమునందు అర్జునోపాఖ్యానమందు ఇరువది యారవ అధ్యాయము.
